అమ్మ జోలపాట వింటూ హాయిగా నిద్రపోతాడు బిడ్డ. ఆదిమసమాజాల్లో మొదలుకొని అన్ని సమాజాల్లో. అదే సంగతానికున్న శక్తి. భాష సంగీత శైలి ఏదైనా.
మనసుకు హత్తుకొనే శ్రావ్యమైయిన గీతాలు వింటే మానసిక ప్రశాంతత .. గాఢ నిద్ర వస్తుంది.
టూర్స్ తో అలసిన నేను నిద్రకు ముందు మా ఇంట్లో ఇప్పుడు ..
వచ్చిన మార్పు కరోనా వల్ల కాదు. లాక్ డౌన్ ల వల్ల ; ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల. ఇక రుతుక్రమం పెరిగింది ఒక రోజు కాదు. కొంతమందిలో హెవీ bleeding ! కొంతమందికి మూడు నెలలకు కూడా కాకపోవడం. ఇంకా సానా వున్నాయి. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నిజాలు బయటకు వొప్పుకొంటున్నారు.


సెక్స్ పట్ల ఇరవై ఏళ్ళ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు ? అదే వ్యక్తికి నలబై వచ్చినప్పుడు ? అదే వ్యక్త అరవై లో పడినప్పుడు?
కేవలం వయసే కాదు .. పుట్టిన స్థలం , కులం, మతం , జాతి, కుటుంబ నేపధ్యం , ఇరుగుపొరుగు , చదివిన పాఠశాల -కళాశాల -విశ్వవిద్యాలయం , స్నేహితులు, ఆరోగ్యం , ఆర్థిక స్థితి .. ఇవన్నీ వ్యక్తి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తాయి .
ప్రతి మనిషికీ బేసిక్ పర్సనాలిటీ స్ట్రక్చర్ అంటూ ఉంటుంది . అలాగే ప్రతి సమాజానికి కూడా .
సమాజము, సంస్కృతి వ్యక్తికి తెలియకుండానే ఆ వ్యక్తిని ప్రభావితం చేస్తాయి .
ఎక్కువ తక్కువ .. అంతే తేడా !
"ఈ ఆటో వాళ్ళు దోచుకొంటారండీ ! దీనికి తోడు చిరాకు ఎక్కువ " అంటాడు ఒక మధ్య తరగతి వ్యక్తి .
"ట్రాఫిక్ లో, కాలుష్యం లో పొద్దునుంచి రాత్రి దాక డ్యూటీ చేసినా కుటుంబ పోషణ కష్టం" అంటాడు ఆటో ఆయన .
ఎవరిది సరైన అభిప్రాయం ?
సాగినోడిది ఒక అలోచన. .... సాగనోడిది మరో తీరు .
బెంజ్ కార్ లో వెళ్లే వ్యక్తికీ కాలినడక పై రోడ్డు దాటే వ్యక్తి న్యూ సెన్స్ గా కన్పిస్తాడు . ఈయనకు అయన దోపిడీ దారుడిగా కనిపిస్తాడు .
"ఈ ఆడోళ్లున్నారే .. గంట అయినా మేక్ అప్ కు సరిపోదు . షాపింగ్ మొదలెట్టారంటే అన్నీ మరిచి పోతారు - పతి దేవుడు .
" జీవితం లో ఈ మనిషి అర్థం చేసుకొన్నదెప్పుడు ? అన్నీ తాను అనుకున్నట్టే జరిగి పోవాలి . చివరకు లేడీస్ రెడీ కావడానికి టైం ఎందుకు పడుతుందో కూడా అర్థం చేసుకోలేడు"- గృహ లక్ష్మి .
ఒకటో టైపు :
"ఈ ప్రపంచం లో అన్ని దేశాలు వేస్ట్ . మా దేశమే గొప్పది . దేశం లో కూడా నార్త్ వేస్ట్ . సౌత్ బెస్ట్ . అబ్బే సౌత్ లో మిగతా రాష్ట్రాలు లాభం లేదు . మా రాష్టం గొప్పది . మా రాష్ట్రం లో మిగతా జిల్లాలు వేస్ట్ . మా జిల్లానే గొప్పది . మా జిలాల్లో మా మండలము గొప్పది . అందులో మా మావూరే గొప్ప . మా వూళ్ళో మిగతా అందరూ వేస్ట్ ఫెలోస్ . మా ఇల్లే గొప్ప . అబ్బే మా ఇంట్లో నా భార్య వేస్ట్ . కొడుకు వేస్ట్ . నేనొక్కడే గొప్ప " .. ఇదో అలోచన విధానం .
పాపం హేట్ ఫిలాసఫీ ని నెత్తిన ఎత్తుకొని రోజా తిరుగుతారు . బరువెత్తలేక గుండె ఇతర అవయవాలు దెబ్బ తింటాయి . అసంతృప్తి అసంతృప్తి .. జీవితమంతా అసంతృప్తి .They are never in peace with themselves .
రెండో టైపు :
తానేంటో అర్థం చేసుకొంటాడు . సహానుభూతి కలిగి ఉంటాడు . భర్త , భార్య, బాస్ .. ఏ పాత్రలో నైనా రాణిస్తాడు .mostly సక్సెసఫుల్ .. ఆల్వేస్ హ్యాపీ .
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ లో చూసేది ఇదే . వ్యక్తి తనకంటూ ఒక అభిప్రాయాన్ని కలిగివుండడం తప్పుకాదు { ఆ అభిప్రాయం సంఘ వ్యతిరేకం కానంతవరకు } కానీ అవతలి వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాడా ? తన అభిప్రాయాన్ని సున్నిత వాదనతో సమర్థించుకోగలడా ? ఒక వేళా తాను తప్పని తేలితే ఒప్పుకొంటాడా ? భిన్న అభిప్రాయాన్ని కలిగిన వారిని ఒప్పించి , మెప్పించగలడా? అని
ఒక్కసారి నా ఫేస్బుక్ పోస్ట్ లు సింహావలోకనం చేసుకోండి .
వామ్మో కరోనా అంటూ ప్రపంచం భయపడుతున్న వేళ భయం వద్దని.... ఏమి చెయ్యాలో చెప్పాను. ముందుగా నన్ను పిచ్చోడిని చూసినట్టు చూసారు . అయినా తగ్గలేదు . ఎందుకంటే సత్యం నా వెంట ఉంది.
స్కూల్ మూసేస్తే పిల్లలకు జరిగే నష్టమేంటి చెప్పాను . ఒక గ్రూప్ అయితే పని గట్టుకొని నా పై బురద చల్లింది . అయినా తగ్గలేదు . ఎందుకంటే సత్యం నా వెంట .
వాక్ సీన్ లు వద్దు బాబోయ్ అన్నాను . అప్పుడు అందరూ .. ఆ మాటకు వస్తే ఇప్పటికీ ఎంతో మంది అనుమానిస్తున్నారు . నా మిగతా పోస్ట్ లకు వచ్చే దానిలో సగం లైక్స్ షేర్స్ కూడా నా వాక్సిన్ పోస్ట్ లకు రావు . అయినా తగ్గను . ఎందుకంటే సత్యం నా వెంట .
ఈ హీరో .. ఆ హీరో .. ఈ పార్టీ .. ఆ పార్టీ.... ఆ నాయకుడు ఈ నాయకుడు .. ఇవన్నీ సామాజిక అభిప్రాయాలు. ఇందులో విశ్వజనీన సత్యాలు అంటూ మీ ఉండవు. కేవలం అభిప్రాయాలు . ఎవరి అభిప్రాయం వారివి .అభిరుచులు -ఇష్టాయిష్టాలు వారివి .
చదువుతూ ఉంటా . సైకాలజీ అర్థం చేసుకొంటూ ఉంటా . ఎప్పుడూ పోస్ట్ పెట్టను. వాదనకు దిగను.
మనం చేసే పనికి అర్థం పరమార్థం ఉండాలి . సమయం విలువైనది .
అన్నట్టు గాంధీ బోస్ అంబేద్కర్ ..... అతివాదులు , ఉగ్రవాదులు మితవాదులు .. ఇలాంటి అనేక అంశాలపై సివిల్స్ గ్రూప్ 1 ఇంటర్వూస్ లో ప్రశ్నలు అడుగుతారు . ఇంటర్వ్యూ గైడెన్స్ లో టీచ్ చేస్తాను . ప్రశ్నకు ఇంటర్వ్యూ బోర్డు మెచ్చేలా ఎలా సమాధానము చెప్పాలో బోధిస్తాను . ఒక సారి కాదు . ఎన్నో సార్లు ." సర్ .. సూపర్బ్" అని మెచ్చుకొన్నారు సర్.. అంటూ అటుపై స్టూడెంట్స్ చెప్పిన సందర్భాలు ఎన్నో . ఇంటర్వ్యూ లో గరిష్ట మార్కులు పొందిన నా విద్యార్థులెందరో .
ఒక ఘటన :
ఇది జరిగి దాదాపు పదహైదేళ్లయ్యింది. కృతిక వాసిరెడ్డి . నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎక్సమినేషన్ ఇంటర్వ్యూ కు హాజరవుతోంది . వారు అడిగిన ప్రశ్న .. " అయ్యప్ప దేవుడంటారు . అయ్యా అప్ప అంటే మగాడు మగాడు కలిస్తే మనిషి ఎలా పుట్టాడు ?
సర్ .. మతం అనేది నమ్మకం . అన్ని సార్లు దానికి తర్కాన్ని వర్తించలేము . శాస్త్రీయం గా నిరూపించలేము . నమ్మడం నమ్మకపోవడం వ్యక్తి ఇష్టం . పురుషుడు పురుషుడు కలిస్తే అది శిశు జనానికి దారి తీయదు. కానీ రేపు సైన్స్ డెవెలప్ అయితే ఇది కూడా సాధ్యపడుతుందేమో . సైన్స్ అనేది కార్యాకారణ సంబంధాలకు సంబందించిన అంశం . మిణుగురు పురుగు బతికేది ఒక రోజే . దానికి వారం మాసం ఋతువు అనే ఆలోచనే రాదు . దాని భాష లో చెప్పినా అర్థం కాదు . మనిషి జీవిత కాలం వందేళ్లు . అయిదు వందల కాంతి సంవత్సరాల ఆవల కూడా ప్రపంచం ఉంది . కాంతిపుంజం బయటకు రాని కృష్ణ బిలాలు ఉంటాయి . మన ఇంద్రియ జ్ఞానానికి తట్టనిది జరగేలేదు అనలేము . అలాగని ఊహలు .. కల్పితాలు కూడదు .. శాస్త్ర ప్రగతి ఆగరాదు . "
వామ్మో ఏదో ప్రశ్న అడిగాము . ఎనిమిదో తరగతి అమ్మాయి ఎంత సమాధానం చెప్పింది అని వారు లేచి నిలబడి చప్పట్లు కొట్టారట .
విత్తు బట్టే చెట్టు !
మన అలోచన విధానమే మన జీవితం , మన భవిత
నేను పొద్దున్న పెట్టిన పోస్ట్..
పిల్లలకు ఎలా భోదించాలి ? వారిని ఎలా ఆలోచింప చేయాలి ? టూర్ సమయాల్లో ఎలా ఎడ్యుకేట్ చెయ్యాలి ? అని.
పిల్లలకు సంబంధించి చరిత్ర ను పుస్తకాల ద్వారా చదవాలి. ఇప్పుడున్న పుస్తకాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు రాయించినవే.
అభిప్రాయ బేధాలు తప్పు కాదు. నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే వైఖరి మంచిది కాదు. సమగ్ర సమాచారం తో ఒక అభిప్రాయానికి రావాలి .. ఇది పోస్ట్ సారం.
గాంధీ నెహ్రు మనుషులే కదా ! తప్పులుండవా ? తప్పులెన్నే ముందు అర్థం చేసుకోండి .. ఇదీ నేను పిల్లలకు చెప్పింది.
నేనేదో గాంధీ నెహ్రు పార్టీ పెట్టినట్టు వారికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్టు కొంతమంది ఆవేశ పడుతున్నారు.
కనీసం పోస్ట్ సమగ్రంగా చదవరా??
దేవుడా !
ఫాలోవరా ? లీడరా ?
మొదటి వాడు : బుర్రను ఎవడికో తాకట్టు పెట్టేస్తాడు . మూక మనస్తత్వం . జెండా మోస్తాడు . జై కొడుతాడు . జీవితాంతం వెనుక వరుసలోనే ఉండి పోతాడు . ఇది కేవలం రాజకీయాలకే పరిమితం కాదు . ఏ ఫీల్డ్ అయినా !
నాయకుడు : సొంత ఆలోచన . వివేచన. సహానుభూతి . సామజిక విషయాల్లో భిన్నాభిప్రాయాలు సహజం అని అర్థం చేసుకొంటాడు . అవతలి వారి పాయింట్ అఫ్ వ్యూ ను అర్థం చేసుకొంటాడు . తన అభిప్రాయం తప్పైతే మార్చుకొంటాడు . లేదా అవతలి వారిని ఒప్పిస్తాడు . మెడిసిన్ ఇంజనీరింగ్ ఐఏఎస్ ఏ ఫీల్డ్ అయినా లీడర్ గా రాణిస్తాడు .
మీ పిల్లల్ని ఏమి చేయదలిచారు ?
ఎవడికో ఫాల్లోవెర్ గా మార్చాలంటే .. 1 . ఒక అభిప్రాయాన్ని చెప్పి అదే నిజం .. అదే ఫైనల్ .. దాన్ని నమ్మాల్సిందే .. దానికి జై కొట్టాల్సిందే అని చెప్పండి .
లీడర్ కావాలంటే : వినదగు నెవ్వరు చెప్పిన .. వినంతనే వేగపడక వివరింప తగున్.. అన్ని కోణాల్లో ఆలోచించాలి . సమాధానం కన్నా ప్రశ్న మిన్న . సమాచారం వరకు ఓకే. కానీ అభిప్రాయం కూడా మీదే అయితే ఎలా ? ఇక వారు ఆలోచించేది ఎలా ? ప్రశ్నించండి . సమాధానాలు ఆలోచించమనండి . ఆలోచించేలా చేయండి !
ఉదారణకు { ఈ రోజు నేను పొద్దున్న పెట్టిన పోస్ట్ కు కొనసాగింపుగా } .. ఇలాంటి ప్రశ్నలు అడగండి .
1 . త్రిపురి కాంగ్రెస్ సమావేశం లో నేతాజీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనా, ఆయన రాజీనామా ఎందుకు చెయ్యాల్సి వచ్చింది ? ఇందులో గాంధీ పాత్ర ఏమిటి ? గాంధీ, నేతాజీ ని ఎదగనీయకుండా చేసారు అంటారు కదా ? మరి అటుపై సింగపూర్ లో నేతాజీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు గాంధీజీ తన నాయకుడు అని ఎందుకు చెప్పుకొన్నారు ? గాంధీ ని జాతిపిత అని నేతాజీ ఎందుకు పిలిచారు ?
2 . గాంధీ అహింసా వాదం వల్ల దేశం నష్టపోయిందా ? జపాన్ సాయం తో ఇండోనేషియా సుకర్నో దేశాన్ని విడుదల చేసాడు . అటు పై ఏమి జరిగింది ? తిరిగి వారు రెండో స్వతంత్ర పోరాటం ఎందుకు చెయ్యాల్సి వచ్చింది ? ప్రపంచం లో ఎక్కడైనా హింసాతక్మ ఉద్యమం విజయం సాధించిందా ? LTTE ఎక్కడ వైఫల్యం చెందింది ? మన దేశం లో నక్సల్ ఉద్యమం మాటేమిటి ?
ప్రశ్నించాలి .. భిన్న కోణాల్లో ఆలోచించాలి . చివరకు ఒక అభిప్రాయానికి రావాలి. సామాజిక విషయాల్లో భిన్నాభిప్రాయాలు సహజం అని పిల్లలకు అర్థం కావాలి . అవతలి వారి అభిప్రాయాన్ని గౌరవించాలి . అవసరం అయితే వారిని మార్చగలగాలి .
గాంధీ , నెహ్రు , బోస్ .. వారు స్వర్గం లో వుంటారు . పోనీ సైన్స్ కోణంనుంచి చూస్తే వారి లైఫ్ ఎప్పుడో అంతం . మనం వారిని మెచ్చుకొని / పొగిడి/ తెగిడి... ఒపీనియన్ పోల్ పెట్టి వారిని ఓడించి / గెలిపించి .. ఇలా చేయనక్కరలేదు . చేస్తే వారికేమి లాభం ? మన టైం వేస్ట్ తప్ప .
చరిత్ర ను మనం ఎలా అర్థం చేసుకొంటాము అనేది మన పరిణతి కి , ఆలోచన విధానానికి నిదర్సనం . ఇది ముఖ్యంగా పిల్లల విషయం లో వర్తిస్తుంది .
పరిణతి చెందిన అభిప్రాయం కావాలి .. అంటే ఒక విషయానికి సంబంధించి సమగ్ర సమాచారం . ఆలా ఒక నిర్ణయానికి వస్తే అభిప్రాయం సరైనదా కాదా అనే ప్రశ్న తలెత్తదు . పైన చెప్పిన ఉదాహరణలో ఇండోనేషియా జపాన్ హిట్లర్ ముస్సోలిని గురించి అర్థం చేసుకొన్నాక గాంధీ కరెక్ట్ అనో సుభాష్ కరెక్ట్ అనో అనొచ్చు . రెండూ సరైనవే . నా అభిప్రాయమే కరెక్ట్ అని ఏమీ ఉండదు . మన పిల్లలని అలాగే పెంచాలి .
సామజిక విషయాలు వదిలెయ్యండి . చివరకు సైన్స్ విషయాల్లో కూడా వివేచన అవసరం అయిన కాలం లో మనం బతుకుతున్నాము .
గత సంవత్సరం జూన్ నుంచి నేను పాడిందే పాడరా అంటూ ప్రతి వారానికి రెండు సార్లు ఒకే పాట పాట పాడుతున్నా . " అయ్యా.. ఎమర్జెన్సీ అప్రూవల్ పొందిన వాక్ సీన్ ల కు వాటిని తయారు చేసిన కంపెనీ లే గ్యారెంటీ ఇవ్వడం లేదు . ముఖ్యంగా ఎం ఆర్ ఎన్ ఏ కోవకు చెందినవి . ఇవి విషం లాంటివి . అందరికీ ఏదో అయిపోతుందని కాదు. కొంత మందిలో వారి శరీర తత్వాన్ని బట్టి .. వాక్ సీన్ ల వల్ల విడుదల అయిన అంటి బాడీ లు వారి శరీరం పైనే దాడి చేస్తాయి . జుట్టు రాలడం . మతి మరుపు.. షుగర్ పెరిగి పోవడం .. కార్డియాక్ అరెస్ట్ .. మెదడుపోటు.. ఇలా అనేక సమస్యలు వస్తున్నాయి . డెల్టా అంటే రెండో వేవ్ నాటికే కరోనా అందరికీ సోకింది . దీని వల్ల అందరికీ టి సెల్స్ రక్షణ వచ్చింది . ఇప్పుడు సమస్య కరోనా తో కాదు . సమస్య వాక్ సీన్ తో . అయిందేదో అయ్యింది . ఇక వేసుకోకండి " ఇదీ నేను చెప్పింది .
ఆయన భారత సంతతికి చెందిన కార్డియాలజిస్ట్ . పేరు డాక్టర్ మల్హోత్రా . అయన రీసెర్చ్ చేసి ఒక నిర్ణయాకి వచ్చారు . ఆ రీసెర్చ్ పేపర్ పీర్ రివ్యూ కూడా అయ్యింది . తమ తండ్రి తో సహా ఎంతో మంది కార్డియాక్ అరెస్ట్ తో మరణించడానికి కారణంవాక్ సీన్ లే అని ఆధారాలతో నిరూపించారు .మన కాలం లో జరిగిన పెద్ద మోసం ఈ వాక్ సీన్ లు" అని ఆయన చెప్పారు . ఈ వార్త క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది .
ఆగ్రా లో మొఘలుల చరిత్ర , జైపూర్ లో రాజపుత్రుల చరిత్ర , ఢిల్లీ లో ఢిల్లీ సుల్తానుల చరిత్ర , స్వాతంత్రోద్యమం , ముఖ్యంగా మహాత్మా గాంధీ , పండిట్ నెహ్రు , సుభాష్ బోస్ .... ఇలా వెయ్యేళ్ళ చరిత్ర ను మా విద్యార్థులకు సాక్షాత్కరింప చేశాను .
చరిత్ర అంటే జరిగిన సంఘటనలను వల్లె వేయడం కాదు . వాటినుంచి పాఠాలను గ్రహించడం . విశ్లేషణ .. అనువర్తన
గాంధీ ఏ సంవత్సరం పుట్టాడు ? అయన తల్లితండ్రుల పేర్లేమిటి? ఇలా బిట్లు బిట్లు గా బిట్ల భోజనం నేను వడ్డించను.
చరిత్ర కు మించిన లైఫ్ స్కిల్స్ పాఠం లేదు . దాన్నుంచి సరైన పాఠాలు గ్రహిస్తే మన జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు ..
"పోరుబందరు లో ఎప్పుడో నూటయాభై ఏళ్ళ కింద పుట్టాడు . వయా లండన్ , దక్షిణాఫ్రికా ఢిల్లీ లో నేటి తీస్ జనవరి మార్గ్ లోని బిర్లా హౌస్ లు బులెట్ లకు బలయిపోయాడు .
నాన్న దివాను { అంటే ఒక సంస్థానానికి ప్రధాని } హ్యాపీ గా లైఫ్ గడపకుండా ఈ పోరు బందరు కుర్రాడు పోరు బాట ఎందుకు పట్టాడు?
దక్షిణాఫ్రికా పోయినాయిన ఇండియా కు అదీ నడివయస్సులో ఎందుకు తిరిగొచ్చాడు ?
అప్పటికి కాంగ్రెస్ లో సిగపట్లు . నాయకత్వ పోరు . అలాంటిది నాలుగేళ్లల్లో కాగ్రెస్ పై, జాతీయోద్యమం పై తిరుగులేని పట్టు ఎలా సాధించాడు ?
మహాత్ముడు ఎలా అయ్యాడు ?
జాతి పిత.. ఆమ్మో ఎంత పెద్ద మాట . అశోకుడినుంచి ఎంతో మంది మహానీయలు.. అలాంటిది ఈ బక్క పలచనాయన జాతి కే తండ్రి ఎలా అయ్యాడు ? ఏంటా రహస్యం ?
వాట్సాప్ లో చరిత్ర ప్రొఫసర్ లుంటారు . నెహ్రు బీడీలు తాగాడు. గాంధీ కి అమ్మాయిల పిచ్చి అని తమ పైత్యాన్ని బయటకు వదులుతుంటారు . "అరేయ్ నెహ్రూలాంటోడే ... గాంధీ లాంటోడే ఇలాంటి పనులు చేసాడంటే మనం హాయిగా సెల్ ఫోన్ పై పోర్న్ చూడొచ్చు .. గంజాయి కొట్టొచ్చు .. రేపులు చేయొచ్చు అని నేటి యువత అనుకునేలా చేస్తారు .
చందమామ కైనా మచ్చ ఉంటుంది . గాంధీ నెహ్రు మనుషులు . లోపాలుండవా? ఉంటాయి . కచ్చితంగా ఉంటాయి .
పొట్ట బొడిస్తే చరిత్ర ముక్క రాల్చలేనోడు కూడా గాంధీ పైన, నెహ్రు పైన కామెంట్ లు చేసేయడమే ?? ముందుగా వారి గురించి వారి ఔన్నత్యాన్ని గురించి సమగ్రంగా తెలుసుకొంటే తరువాత చర్చ .
గాంధీ సుభాష్ బోస్ తో వ్యవహరించిన విధానం గురించి రెండు గంటలు విమర్శించేంత సబ్జెక్టు ఉంది. కానీ ముందుగా ఫాసిజం, నాజిజం గురించి నీకు తెలుసా ? వాట్సాప్ పైత్య ప్రొఫసర్ ! తెలియక పొతే మాట్లాడే అర్హత నీకు లేదు .
అలాగే అంబేద్కర్ గాంధీ ల మధ్య అణగారిన కులాల సమస్య పట్ల వారి వైఖరి గురించి చర్చించ వచ్చు . కానీ ముందుగా బౌద్ధ మతం , జైన మతం , భక్తి ఉద్యమ కారుల గురించి నీవు తెలుసుకోవాలి .
ఏమీ తెలియకుండా ఏదో రెండు పడికట్టు పదాలు ఎవరో చెబితే వల్లె వేయడం కాదు . కాబట్టి నేటి వాట్సాప్ చరిత్ర ప్రొఫసర్ ల బుట్టలో పడకండి . వారిది అజ్ఞానం లో అధమ స్థాయి .
ఇది చెప్పండి . గాంధీ ని బుద్ధుడు ఏసు క్రీస్తు తో సమానంగా ఒక ఆంగ్లేయుడు వర్ణించాడు . గాంధీ అంత గొప్ప వాడెలాయ్యాడు ?
అయన జీవితాన్నుంచి మనం నేర్చుకోదగ్గ పాఠం ఏది ? "
త్యాగం .. అహింస .. ఇలా సమాధానాలు వచ్చాయి .
"నిజమే అవన్నీ నిజమే . కానీ అన్నిటికి మించి ఒకటుంది .
మనం మనాలి కి వెళ్లి వచ్చాము . భయంకరమైన లోయలు . చెత్త రోడ్డు . తెల్లవారు జామునుంచి అర్ధ రాత్రి దాకా బస్సు పయనం . బస్సులో మనం హాయిగా నిద్ర పోయాము . డ్రైవర్ .. బస్సు బాయ్ .. ఎంత అప్రమత్తంగా నడిపారు ?. వారు నిద్రలోకి జారుకుని ఉంటే ? మలుపుల్లో చిన్న తప్పు చేసుంటే ? భయం వేస్తోంది కదా ?
అవును .. వారి డ్యూటీ వారు చేస్తున్నారు . దానికి వారికి జీతం వస్తుంది . మనం టూర్ కు డబ్బు కట్టాము . కానీ ఈక్వేషన్ అంతేనా ?
అవతలి వారిని అర్థం చేసుకోవాలి . వారి స్థానం లో మనల్ని ఉంచుకొని వారిని అర్థం చేసుకోవాలి . దీన్నే సహానుభూతి అంటారు . సాను భూతి కాదు . సహానుభూతి . దివాన్ కొడుకు అర్ధ నగ్న ఫకీరు గా మారింది సహానుభూతి వల్లే . ఈ గుణమే ఆయన్ని కోట్లాది మంది ప్రజల గుండెల్లో నిలిపింది . జీవితం లో ఏ రంగంలోకి వెళ్ళినా మీరు నాయకులు కావాలి .
సహానుభూతి పెంపొందించుకోవాలి . అదుంటే భార్య- భర్త తల్లితండ్రులు - పిల్లలు , బాస్ - ఉద్యోగి .. ఇలా అన్ని సంభందాలు సజావుగా సాగిపోతాయి . జీవితం ఆనంద మయం..."
ఇలా సాగిపోయింది నా క్లాస్ ..
వానలో తాజ్ ముందు .. అగ్ర కోట లో దివాన్ ఏ ఖాస్ లో దివాన్ ఏ అం లో.... జైపూర్ పాలస్ లో ... అంబర్ పాలస్ లో.. రోహ్తాంగ పాస్ లో { ఇక్కడ జియోగ్రఫీ పాఠాలు } కిసాన్ ఘాట్ లో శక్తి స్థలం లో శాంతివనం లో బిర్లా హౌస్ లో తీన్ మూర్త్తి భవన్ లో .. ప్రతి చోట అరగంట .. మొత్తం టూర్ లో అనేక గంటలు
పిల్లలకు బోర్ కొట్టిందనుకొంటున్నారా ?
సాయంకాలం ఆరు గంటలకు శాంతివనం లో.. దాదాపు నలబై నిముషాలు క్లాస్ .. పొద్దుగూకు తోంది . సెక్యూరిటీ పర్సన్ వచ్చి ఇక బయటకు వెళ్ళండి అని చెప్పాడు . మరో పది నిముషాల్లో క్లాస్ ముగించా. అక్కడినుంచి బయట ఉన్న బస్సు దాక మరో ఇరవై నిముషాలు నడక . దారిపొడుగునా వంతులు వేసుకొని ప్రశ్నలు అడిగారు .. సార్... కోపాన్ని ఎలా ఎలా అదుపులో ఉంచుకోవాలి ? ఒక విషయం గురించి అతిగా ఆలోచించడం ఎలా మానుకోవాలి ? రాబొయ్యే రోజుల్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది ? ఇలా ప్రశ్నల వర్షం . అన్నిటికి సమాధానాలు చెప్పా .
లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ .
టూర్ కు ఒక పేరు పెట్టాలంటే ఇదే పెట్టాలి .
పాఠం చెప్పి పిల్లలకు ఫోటో లు తీసుకోవడానికి ఇచ్చిన టైం లో నేను జంపుడు .. అటు పై పేస్ బుక్ లో జంపుడు ఫోటో లో పోష్టుడు ..
అదీ క్లుప్తంగా మా టూర్ .. మరిన్ని వివరాలు పోస్ట్ చేస్తాను
టూర్ ముగిసింది. పిల్లలందరూ తిరుగు ప్రయాణం లో .. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో.
సాహసాలు .. ఆనందాలు .. అన్నింటికీ మించి అధ్యయనం .. నేర్చుకోవడం .. జీవిత కాలపు అనుభూతులు మూట కట్టుకొని వదలలేక పిల్లలు ఇంటిముఖం ..






























క్కుతుబ్ మీనార్ ముందు కుప్పిగెంతులు !



పేస్ బుక్ వెయ్యి రెట్లు నయం.
ట్విట్టర్ ఇండియా లో ….
1 రాజకీయ పైడ్ ఏజెంట్ లకు
( వీరిది దొంగ పేర్లు దొంగ అకౌంట్ లు. పోస్ట్ చేసేది బూతులు ! చీప్ .. మహా చీప్ )
2 సెక్స్ వర్కర్ ల కు వేదికయ్యింది.
( అర్ధ నగ్న పూర్తి నగ్న డీపీ లు. ఆంటీ కావాలా ? నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ పోస్టింగ్స్ ).
అన్నిటికంటే చెత్తేంటంటే ఫేస్బుక్ లో మన ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వారి పోస్ట్ లే మనకు కనిపిస్తాయి. ఈ చెత్త ట్విట్టర్ లో పైన చెప్పిన చెత్త పోస్ట్ లు నోటిఫికేషన్ గా మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తాయి.
అన్నట్టు ఢిల్లీ రూపురేఖలు స్వరూప స్వభావాలు మారిపోయినట్టున్నాయి. రాత్రి డిన్నర్ అయ్యాక ఒక పది నిముషాలు ఒంటరిగా రోడ్ పైకి వచ్చాను. ఎయిర్పోర్ట్ దగ్గర స్థలం. బహిరంగంగా రోడ్ పైనే బ్రోకర్ లు “ రష్యన్ గర్ల్ కావాలా ? ఇండియన్ గర్ల్ కావాలా ? మసాజ్ ! డ్రింక్స్ బి మిలేగా అంటూ కనీసం పది మంది .. అడుగడుగుకు.
బ్రహ్మ్మనందం డైలాగ్ “ నీ కంటికి మరీ అంత ఎదవలా కన్పిస్తున్నానా? ఓ మాదిరి గా కూడా కన్పించడం లేదా ?” అని అడుగుదామనుకొన్న!
వాళ్లకు తెలుగు రాదు. మనం ఏ మాత్రం రెస్పాండ్ అయినా ఇంకా సెంటపడుతారని వేగంగా వెళ్ళిపోయా !



















































ఆగ్రా అయినా .. జైపూర్ అయినా .. మనాలి అయినా … ఢిల్లీ అయినా జిమ్మడి పోవాల్సిందే ..

ఈ రోజు పొద్దున్న తీన్ మూర్తి భవన్ బిర్లా హౌస్ లంచ్ తరువాత ఇండియా గేట్ పార్లమెంట్ అటుపై సాయంకాలం అయిదింటికి రాజఘాట్ శాంతి వన్ మొదలైన స్థలాలు.
ఢిల్లీ లోని మిత్రులు కలవాలనుకొంటే సాయంకాలం అయిదింటికి రాజఘాట్ కు ఆహ్వానం. 

నేను జులై లోనే పోస్ట్ పెట్టాను “ .. సెప్టెంబర్ , అక్టోబర్ నవంబర్ నెలల్లో గరిష్టంగా ఉంటాయి . బూస్ట్ వేసుకొని అప్పటికి 3 - 5 నెలలు అయివుంటాయి. ఒక సారి వేసుకొంటే ౩- 5 నెలల్లో దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. “ అని. గుర్తుందా !
ఇప్పుడు రోజుకు నా మెసెంజర్ కె కనీసం ఇరవై మరణాల వార్తలు.
అయినా ఇంకా నటిస్తూనే వున్నారు. అసలు కారణం బయటకు రాకుండా ఉండేందుకు ఏదో దొంగ కారణాన్ని చెబుతూ జనాలకు విషయం తెలియకుండా మానేజ్ చేస్తున్నారు.
లక్షలాది తల్లితండ్రులకు గుండెకోత !

మనాలి లో తెల్లవారుజామున మొదలెట్టిన పయనం ! ఢిల్లీ కి రాత్రి చేరిక. మధ్యలో కర్నేలి హవేలీ లో డిన్నర్ కోసం దిగినప్పుడు








కర్నాల్ హవేలీ (మనాలి నుండి ఢిల్లీకి వెళ్లే దారిలో). రాత్రి భోజన సమయం.



మనాలి !
అందాలను ఏమనాలి !
ఒక్కసారైనా కనాలి !
అప్పుడనాలి ..
జై మనాలి !
కరోనా అంటే భయపడడం ..
మూతి గోచి .. చేతి సారా !
తాజ్ మహల్ ముందు నిలబడి ఫోటో తీసుకోవడం ..
కొండల ప్రాంతాల్లో చలి నుంచి రక్షించే దుస్తులు వేసుకోవడం ..
ఇది నలుగురి దారి ..
కానీ …









