ఉదయం 7 -15

జిం కు వెళ్ళడానికి నేను రెడీ.
ఈ రోజు మార్నింగ్ స్నాక్స్ నాలుగు నువ్వుల లడ్లు ( చిన్నవి )
కాల్షియమ్ ( ఎముకల దృఢత్వానికి ) అంటి ఆక్సిడెంట్స్ ప్రోటీన్ .. విటమిన్స్ .. అబ్బో నలభై రకాల మేలు.
Morning 7:25am Im ready to hit the gym. Today's morning snacks are four sesame laddas (small ones) Calcium (for bone strength) anti oxidants protein .. Vitamins .. Wow forty kinds of goodness.
Morning 7:25am Im ready to hit the gym. Today's morning snacks are four sesame laddas (small ones) Calcium (for bone strength) anti oxidants protein .. Vitamins .. Wow forty kinds of goodness.
ఒక వ్యక్తికి ఒక కిలో శరీర బరువుకు … తక్కువంటే ఒక గ్రాము ప్రోటీన్ కావాలి! - daily
ఎదిగే పిల్లల్లో … గర్భిణీ స్త్రీలలో … ఇంకా ఎక్కువ !
వ్యాయామం ( రెసిస్టన్స్ ట్రైనింగ్ ) చేసే వారికి ఒక్కో కిలో బరువు కు రెండు గ్రాముల ప్రోటీన్ కావాలి.
ఇది నా అభిప్రాయం కాదు.
పోషకాహార శాస్త్రవేత్తల ఏకాభిప్రాయం.
60 kg అంటే 60 grams ప్రోటీన్.
అంటే 15 కోడిగుడ్లు
లేదా 240 గ్రాముల చికెన్
లేదా 275 grams కందిపప్పు.
మనిషన్నోడు ఇంతతింటాడా?
దేశం లో నూటికి ఎనభై అయిదు మంది ప్రోటీన్ లోపం తో సతమతమవుతుంటే అధిక ప్రోటీన్ సమస్యల గురుంచి మాట్లాడేవాడే ఫార్మసురుడు.
��డయాబెటిస్ ఒక సారి వస్తే పోదని.. మందులు వేసుకొంటూ బతకాల్సిందే అని
��వయసు పెరిగే కొద్దీ బిపి పెరగడం సహజమని .. బిపి ఎక్కువయితే మాత్రలు వేసుకోవాల్సిందే అని …
��ఊబకాయం వస్తే తగ్గదని ..
��ప్రోటీన్ ఆహరం తీసుకొంటే కిడ్నీ సమస్యలొస్తాని ..
��45 దాటితే చర్మం లూస్ అయిపోయి కాంతివిహీనంగా మారి మెడ కింద కళ్ళ కింద క్యారీ బాగ్ లొస్తాయని ..
��క్రమబద్ధంగా వ్యాయామం చేయడం సాధ్యం కాదని , జిం కెళితే గుండెపోటొస్తుందని ..
��ఒక వయసు ( 45 ప్లస్ ) తరువాత మెదడు చురుకుదనం తగ్గి మతిమరుపొస్తుందని …
��నమ్మే వారికి ..
��ప్రచారం చేసేవారికి ..
అంకితం.
మీకు తెలుసా ?
చెత్త తిండి ( అధిక కెలొరీ ఆహారం , జంక్ ఫుడ్ , ట్రాన్స్ఫాట్స్ కలిగిన ఆహారం , బాగా ప్రాసెస్ అయిన ఆహారం ) కింది సమస్యలకు కారణమవుతోంది.
1 . డయాబెటిస్
2 . అధిక బిపి
3 . థైరాయిడ్
4 . పీసీఓఎస్
5 . ఊబకాయం
6 . గుండెపోటు
7 . మెదడు పోటు.
8 . వెరికోస్ వీన్స్
9 . మైగ్రైన్ ( నమ్మరు. నాకు తెలుసు )
10 . కీళ్ల నొప్పులు.
11 . స్పాండిలైటీస్
12 . ఆటో ఇమ్యూన్ సమస్యలు.
ఒక నాలుక !
పన్నెండు సమస్యలు.
పెద్దలకు ( వారి బరువు ఆరోగ్య స్థితి ఆధారంగా ఎంపిక చేసి ) క్షయ వ్యాధి నివారణ కోసం బి సి జి టీకా వేయించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది.
ఈ టీకా ఎప్పటినుంచో వున్నదే. అన్ని రకాలుగా టెస్ట్ చేయబడింది.
వేయించవచ్చు.
వేయించండి.
( వ్యంగ్యం లాంటిది ఏమీ లేదు.)
1 అభిమతానికి 2 పరిశీలన కు చాలా మందికి తేడా తెలియదు.
అదే అసలు సమస్య.
ఒక వ్యక్తి సోడియం ముక్కను గ్లాస్ నీళ్లలో వేయనున్నాడు.
“ ఇప్పుడు మంటలు ఏర్పడతాయి .. ఇది ప్రమాదానికి దారి తీస్తుంది “ అంటే ..
“ ప్రమాదం సంభవించాలని నువ్వు కోరుకొంటున్నావా ? “ అని అడిగేవారు ఎక్కువ.
అందుకే ఎన్నికల విశ్లేషణ జోలికి పోవడం లేదు.
“ ఆ నాయకుడు ఇలా చేసాడు. దాని వల్ల ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయి “ అంటే అదేదో మన అభిమతం అని అనుకొనే వారు ఎక్కువ.
నేను ఆంధ్ర ప్రదేశ్ గురుంచి మాట్లాడడం లేదండీ.
ఇది వరకే పోస్ట్ చేసిన పశ్చిమ బెంగాల్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నా.
“ లేదు .. అలా జరగదు .. ఇది అతి కాదు .. సరైనదే “ అని చెప్పడం వేరు.
అది భిన్నాభిప్రాయం ..
దాన్ని నేను గౌరవిస్తాను.
అదే నా అభిమతం అనుకొనే వారితోనే సమస్య

https://bathakani.in/yela-kudado-cheppedi-naati...

If the Japan of the past taught us what *not* to do, the Japan of today teaches us how to grow!

ఎలా కూడదో చెప్పేది నాటి జపానైతే.. ఎలా ఎదగాలో నేర్చుకునేది నేటి జపాన్! - BATHAKANI

చరిత్ర పుస్తకాలు రాసిన వారికి ఒక దండం.

జరిగిన ఘటనల్ని తేదీ లు సంవత్సరాలు గా వర్ణిస్తారు.
అందులో జీవం చచ్చి చదవడానికి అనాసక్తికరంగా మారిపోతాయి.
కథా రూపం లో రాస్తే ఒక్కో దేశం , ఒక్కో మహనీయుని చరిత్ర ఒక లైఫ్ స్కిల్స్ పాఠం.
టీవీ ల లో వచ్చే సీరియళ్ళకంటే అనేక టెట్లు థ్రిల్లింగ్ గా ఉంటాయి.

దేవతలా ? రాక్షసులా ?

సమయ పాలన, క్రమశిక్షణ , ఆత్మ విశ్వాసం , పాజిటివ్ { సకారాత్మక } దృక్పధం , దృఢ చిత్తం , స్థితిస్థాపకత { పడి పోయినా లేచే గుణం , ఓటమినుంచి గుణపాఠాలు గ్రహించి ప్రగతి మార్గాన నడిచే లక్షణం } ... జపనీయులు లక్షణాలు .
ఎవుళ్ళురా మీరు ?
ఎవుడ్రా వీడు?? .. ఈ సినీ డైలాగ్ ఇప్పుడు బాగా పాపులర్ అయ్యింది.
ఇది సరిగ్గా జపనీయులకు సూట్ అవుతుంది .
భూభాగం లో డెబ్భై మూడు శాతం పర్వతాలు , కేవలం 12 % శాతం వ్యవసాయానికి అనుకూలం , భూకంపాలు అగ్ని పర్వతాలు సునామి ల దేశం .. అనేక ఆఫ్రికా దేశాలకన్నా వెనుక ఉండాల్సిన దేశం !
ఇదేందీ సామి ?
ఆ రోజుల్లో యూరోపియన్లు అజేయులు అనే భావన సర్వత్రా వ్యాపించి ఉండేది . తొలి సారి యురోపియన్ దేశాన్ని జయించిన ఆసియా దేశం జపాన్ .
రెండవ ప్రపంచ యుద్ధం నాటికే ఒక సూపర్ పవర్ .
అణుబాంబు లు దాడితో సర్వ నాశనం అయి పోయినా నేలకు కొట్టిన బంతిలా... ఉవ్వెత్తున ఎగిసి ... బులెట్ ట్రైన్ లు కార్లు ఇంకా అనేకానేక అధునాతన పరిజ్ఞానం తో అమెరికా తో పోటీ పడుతున్న ఆసియ సూపర్ స్టార్ జపాన్ .
ఏంటీ జపాన్ కథ ?
ఇదో పెద్ద లైఫ్ స్కిల్స్ పాఠం . చదవకపోతే నష్టం మీదే. ప్రతి విద్యార్ధి చేత చదివించాలి . జీవితం లో ఏమి చేయకూడదో ఏమి చెయ్యాలో తెలుసుకొనేలా చెయ్యాలి .
సమురాయ్ .. సుమో .. ఫ్యూడలిజం , జామోన్, యయోయి, కొఫున్ ,అసుక , నారా, హేయన్ , కాముకురా , మురామచి, సెంగోకు , తోకుగావా ...
... 13 పదాల్లో జపాన్ చరిత్ర .
ఒక్క ముక్కలో చెప్పాలంటే .. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ?
జస్ట్ ఆర్డినరీ చరిత్ర .
చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు .
జపాన్ ఉన్నతి 1868 మెయిజి పునరుద్హరణ తో ప్రారంభం అయ్యింది.
. కసితో .. ఒక పద్ధతిగా తమ దేశాన్ని ఆధునీకరించుకొన్నారు . ఫ్యూడల్ వ్యవస్థ రద్దు .. భూసంస్కరణలు , అధిక పరిశ్రమల స్థాపన , మౌలిక సదుపాయాల కల్పన, ఆధునిక విద్య ..
అబ్బో .. ఒకటా ? .. రెండా?
.. పాశ్చాత్య దేశాలకు ఏమీ తీసి పోకూడదు అనే కసితో కొత్త ప్రభుత్వం వ్యవహరించింది .
యురోపియన్ రక్తం లో ఏదో మహిమ ఉంది అని చాల మంది ఆ రక్తాన్ని ఎక్కించుకున్నారు . ప్రభుత్వం తన ఖర్చుతో చాల మంది విద్యార్థులను జర్మనీ లాంటి దేశాలకు పంపి చదివించింది .
ఫలితం .. 1905 నాటికే" బస్తీ మీ సవాల్" అంటూ జపాన్ రష్యా ని ఓడించి".." ఔరా .." అనిపించింది .
అతి సర్వత్రా వర్జయేత్ .
ఏదైనా అతి అయితే అనర్థమే . జపనీయులు కొంప ముంచింది .. పశ్చిమ బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్ ను ముంచింది .. అంచనా ప్రకారం .. 2024 ఎన్నికల్లో జరగపోతున్నది ఇదే.
వందేళ్ల క్రితం కరోనా వచ్చింది { స్పానిష్ ఫ్లూ .. కరోనా లాంటిదే } . దానికి తోడు మొదటి ప్రపంచ యుద్ధం . వెరసి ... కలసి... ముందుగా అమెరికా లో అటు పై న ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం .. పెరిగిన ధరలు .. బతుకు కష్టమయి పోయిన వైనం .
కష్టాల్లో ఉన్నప్పుడు ఆలోచనలు అతిగా మారే అవకాశముంది . "మన దేశం లో ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉంటేనే మనకు బతుకు" అని జర్మన్ ఇటలీ జపాన్ లాంటి దేశాల ప్రజలు ఆలోచించారు . హిట్లర్ ముస్సోలిని... జోసెఫ్ స్టాలిన్ ... జపాన్ లో మిలిటరీ ప్రభుత్వం .
ఇవి కాకుండా వలస వాద దేశాలు { ఇంగ్లాండ్ , ఫ్రాన్స్ లాంటివి } వాటి వలస రాజ్యాలు .. ఇదే క్లుప్తంగా రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం .
నర రూప రాక్షసులు
చేబితే ఎవరూ నమ్మరు .. " అయ్యో .. ఎప్పుడూ చిరునవ్వుతో తమ పని తాము చేసుకొని బతికే జపనీయులా ఈ పని చేసింది?" అనుకొంటారు .
ఒకటా? రెండా ?
దారుణాతి దారుణాలు . చరిత్ర దాచేసిన సత్యం .
1937 లో జపాన్, చైనా కు చెందిన నాన్ కింగ్ భూభాగాన్ని ఆక్రమించింది . సుమారుగా మూడు లక్షల మంది సాధారణ పౌరులను.. జపాన్ ఆర్మీ చంపేసింది .
కొరియా చైనా ఆగ్నేయ ఆసియ లాంటి చోట్ల దాడులు చేసి ప్రజలను వెట్టి చాకిరీ లోకి నెట్టింది .
వారి చేత రైల్వే లైన్స్ లాంటివి వేయించింది .
తిండి కూడా పెట్టకుండా మాడి మసైపోయ్యేలా చేసింది .
స్త్రీలను పడుపు వృత్తిలోకి దింపింది .
యూనిట్ 731 పేరుతొ వర్ణించలేని దారుణాలు చేసింది .
యుద్ధ ఖైదీల కు మత్తు ఇవ్వకుండా శస్త్ర చికిత్స .. ప్రాణాంతక మయిన సూక్ష్మ జీవులను వారి పై ప్రయోగించడం , వారి వృషణాలను కోసేయ్యడం , తిండి పెట్టకుండా చంపడం .. బటన్ డెత్ మార్చ్ .. బర్మా రైల్వే మనీలా మాసకర్.. రాస్తూ పొతే .. వెయ్యి పేజీల గ్రంధం అవుతుంది .
శాడిజం .. నూటికి కోటి పాళ్ళ శాడిజం .. ఇది జపాన్ ఆర్మీ ప్రభుత్వం తీరు .
వీరు చేసిన పాపానికి పాపం.. హిరోషిమా ప్రజలు .. అన్నెం పున్నెం ఎరుగని బాలబాలికలు బలై పోయారు .
నిజమే .. హిరోషిమా నాగసాకి అణుబాంబు దాడులు జరగకపోయుంటే .. ఈ ముష్కరులు ప్రపంచాన్ని ఏమేమి చేసుండేవారో.
మన పొరుగు దేశం ఇండోనేషియా ను డచ్ వారు పాలించారు .
జపాన్ సింగపూర్ మలేసియా ఇండోనేషియా ను ఆక్రమించుకొంది. అమ్మయ్య .. వలస పాలన పోయింది అని ప్రజలు సంతోషపడ్డారు . వామ్మో .. జపాన్ పాలన .. వారి అరాచకాలు చూసి చలించిపోయారు . . డచ్ వలస పాలన కోటి రెట్లు మెరుగు అనుకొన్నారు .
జపాన్ రెండో ప్రపంచ యుద్ధం లో ఓడినా సుకర్నో నాయకత్వం లో ఇండోనేషియా ప్రజలు ఇంకో స్వాతంత్య్ర యుద్ధం చెయ్యాల్సి వచ్చింది .
భారతజాతి ముద్దు బిడ్డ నేతాజీ .. శత్రువుకు శత్రువు మిత్రుడు అనుకొన్నాడు .
ముందుగా స్టాలిన్ .. అటు పై హిట్లర్ ను కలిసాడు . లాభం లేదు . వేళ మైళ్ళు జలాంతర్గామి లో పయనించి జపాన్ చేరుకొన్నాడు . వారి సాయం తో దేశాన్ని బ్రిటిష్ చెరనుంచి విడిపించాలి అనేది అయన ఆలోచన .
అల్ మోస్ట్ అయిపొయింది .
అండమాన్ ను ఆక్రమించుకున్నారు . బర్మా దాక వచ్చేసారు .
అదిగో అప్పుడే జపాన్ పరిస్థితి బలహీన పడింది .
లేకుంటే .. మన నాయకుడు నేతాజీ కి కూడా సుకర్నో పరిస్థితి ఎదురయ్యి ఉండేదేమో ..
జపాన్ మిలిటరీ కర్కశుల పాపానికి .. మన నేతాజీ కూడా చివరి రోజులు అజ్ఞాతం లో గడపాల్సి వచ్చింది . ఢిల్లీ లో రాజపీఠం పై ఉండాల్సిన మహా వ్యక్తి ఎక్కడో .. మంచుకొండల్లో అజ్ఞాతం లో గడపాల్సి వచ్చింది .
నిన్న అన్న ఎన్టీఆర్ జనం దినం . దాన వీరసూరకర్ణ చూడని తెలుగు వాడుండడు .
కర్ణుడు సుగుణాల పుట్ట . అయన చేసిన ఒకే తప్పు... దుష్టులతో సావాసం .
నా ఉద్దేశం లో మన నేతాజీ ..అభినవ కర్ణుడు .
హిరోషిమా అణుబాంబు కు కూడా మిలిటరీ పాలకులు చలించలేదు .
" ఇంకో బాంబు వేస్తె కానీ వీరు తగ్గరు" అనుకొన్నఅమెరికా ప్రభుత్వం మూడు రోజులకు అంటే 9 ఆగష్టు 1945 నాగసాకి పై ఫాట్మాన్ అనే ప్లుటోనియం రకం అణుబాంబు వేసింది .
అప్పుడు ఆ మిలిటరీ ప్రభుత్వం దిగొచ్చింది .
సరెండర్ అయ్యింది.
అక్కడ జర్మనీ లో హిట్లర్ ఆత్మహత్య చేసుకొన్నాడు .
నియంతృత్వ ప్రభుత్వాలు అంతమయ్యాయి .
జపాన్ ప్రభుత్వం .. తిరిగీ అభివృద్ధి పై ద్రుష్టి పెట్టింది .
యుద్ధాలు వద్దనుకుని ఆర్థిక ప్రగతి సాధించింది .
హిరోషిమా నాగసాకి గాయాలను అధిగమించి అద్భుత ప్రగతి సాధించింది .
మనిషన్నోడు.. ఎలా బతకాలో చూడాలంటే.. నేటి జపాన్ ను చూడాలి .
మనిషన్నోడు ఎలా వుండకూడదో తెలుసుకోవాలంటే 1930 - 1945 జపాన్ మిలిటరీ పాలకుల అకృత్యాలను చదవాలి ..
సయొనారా .. సయొనారా ..

తెల్లనివన్నీ పాలు కావు ...

కొంత కాలం క్రితం మాట !
ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించి వినూత్న పోకడతో మార్కెటింగ్ చేసుకొన్నాడు .
తన వెంచర్ కేవలం ఒక కులస్తులకే అని చెప్పాడు . సహజంగానే ఆ కులానికి చెందిన వ్యక్తులు ఆ ప్రకటనలకు ఆకర్షితులయ్యి అక్కడ ప్లాట్ లు కొన్నారు .
కొన్నాళ్లకు అది బోగస్ వెంచర్ అని తేలింది .
తనని నమ్మిన వారిని. తన తోటి కులస్తులను పూర్తిగా ముంచేశాడు .
"ఇంత నమ్మక ద్రోహమా?" .. అనేది అమాయక మాట .
"నమ్మితేనే మోసం సాధ్యం " అనేది తెలివయిన క్రిమినల్స్ మాట .
మోసంచేయ్యడానికి ఇప్పుడు సోషల్ మీడియా వేదిక అవుతోంది .
ఒకాయన ఒక పార్టీ ని.. దాని నాయకుడ్ని... విమర్శిస్తూ ... మరో పార్టీ ని సమర్తిసూ పోస్ట్ లు పెడుతుంటారు . సహజంగానే ఆ పార్టీ వారు , ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఒక కులంవారు ఆయనకు ఫాలోయర్స్ అయ్యారు . అవుతున్నారు ..
ఇదే ఆయన పెట్టుబడి .
తెలివిగా ఈ నమ్మకాన్ని తన దోపిడీకి వాడుకొంటున్నాడు .
బిజినెస్ అనేది బూతు కాదు .
మోసం చేస్తే అది నిజానికి బిజినెస్ కాదు
ఎవరూ అని అడగకండి . కనీసం హింట్స్ ఇవ్వలేను . ఫేస్బుక్ పై వ్యక్తిగత శత్రుత్వాలు ఏర్పరుచుకోవడం నాకు ఇష్టం లేదు .
ఒకటి నిజం .. నమ్మితేనే మోసం ..
నమ్మకం లేక పొతే మోసానికి అవకాశం లేదు .
మరి ఇదే లాజిక్ వాసిరెడ్డి అమర్నాథ్ కు కూడా వర్తిస్తుందా ?
ఖచ్చితంగా ..
అసలు ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు .
వినదగు ఎవ్వరు చెప్పిన .. వినినంతనే వేగపడక .. వివరింప తగున్.
వాసిరెడ్డి అమర్నాథ్ ఈ సాయం చేయండి .. ఆ సాయం చేయండి .. అని మిమ్మల్ని ప్రత్యక్షంగా కానీ .. పరోక్షంగా కానీ ఎప్పుడైనా అడిగాడా ?
మీనుంచి ఏ దశలోనైనా ఎలాంటి సాయం అయినా తీసుకున్నాడా ?
మిర్యాలగూడా లో ఇంటికి ఆహ్వానించి ఫ్రూట్స్ ను పెట్టిన జానపాటి శ్రీనివాస్ .. కరీంనగర్ లో నా క్లాసుకు హాజరయ్యి .. అటు పై నాకు రేండు పెద్ద కీరా కాయల్ని ఇచ్చిన { అదే ఆ పూటకు లంచ్ అయ్యింది } గోపి గారు .. ఈ ఇద్దరూ మన్నించాలి .
ఇదిగో ఈ వస్తువు కొనండి అని ఎప్పుడైనా చెప్పాడా ?
ఇదిగో ఈ బ్రాండ్ మంచిది అని ఎప్పుడైనా ఏదైనా బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి ప్రయత్నించాడా?
ఏదైనా రాజకీయ పార్టీ కి అనుకూలంగా , ప్రత్యక్షంగా కానీ .. పరోక్షంగా కానీ ప్రచారం చేశాడా ?
ఏదైనా రాజకీయ భావజాలాన్ని ప్రమోట్ చేశాడా ?
అభిమానాన్ని సొమ్ము చేసుకోవడానికి అందరినీ ఒక చోట సమావేశ పరిచి .. ఇదిగో చూడండి .. నాకు ఇంత పలుకుబడి వుంది అని మీడియా ద్వారా చెప్పించుకొని ఏదైనా బిరుదులూ పదవులు తెచ్చుకొనే ప్రయత్నం చేశాడా ?
పై ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం "అవును" అని వచ్చినా ఏదో మోసం జరిగే అవకాశం ఉన్నటు.. ఏదో మతలబు జరుగుతున్నట్టు .. నమ్మొద్దు .. అసలు నమ్మొద్దు ..
ఒక వ్యక్తి ఉన్నాడు.
ముప్పై ఏళ్ళ నుంచి బాగా పరిచయం .
తెలివైన వాడు . తెలివే పెట్టుబడిగా రాజకీయాల్లోకి వెళ్లి విజయాలు సాధించాడు . ఆ వ్యక్తి వ్యకిత్వం నాకు బాగా తెలుసు . డబ్బంటే ప్రాణం . డబ్బు కోసం మోసం చేస్తాడు అని చెప్పను కానీ .. తెలివిగా.. చాలా తెలివిగా వ్యవహరిస్తాడు .
సొంత ప్రయోజనం చూసుకొంటాడు { ఈ మాటలు మా బట్టి మామ గురించి కాదు అని గమనించగలరు } .
ఇంతటి స్వార్థపరుడు అయినా .. రాజకీయాల్లో అః ఓహో అనిపించుకొంటుంటే బాగానే మైంటైన్ చేస్తున్నాడు అనుకొన్నానే కానీ ఏనాడూ అతని గురించి ఎవరికీ చెప్పలేదు . ఇప్పుడు మెల్లమెల్లగా అతని నిజ స్వరూపం జనాలు గ్రహిస్తున్నారు .
కామెంట్స్ లో ఎలాంటి హింట్స్ ఇవ్వొద్దు . ఫేస్బుక్ ద్వారా నలుగురికీ సాయం చెయ్యాలి అనుకొనేవాణ్ణి . అంతే కానీ ఎవరితోనూ విరోధం పెట్టుకోను.
నిజానికి బద్దకమెక్కువ .
అబద్దం మహా ఆక్టివ్ .
నిజం నిద్ర లేచే లోగా అబద్దం అరవై దేశాలు చుట్టి వస్తుంది .
కానీ నిజం చిరంజీవి .
అబద్దానికి అల్పాయుష్షు .
సత్యమేవ జయతే !
ఏది నిజమో ఏది అబద్దమో గ్రహించేది ఎలా ?
మనకు ఒక బుర్ర ఉంది. దాన్ని సరిగా ఉపయోగిస్తే సరి .
నిన్న సాయంకాలం పేస్ బుక్ వరుసగా మూడు సార్లు మోగింది . పనిలో ఉన్నా. అది అయ్యాక తీసి చూస్తే ఒకాయన .. నిజ జీవితం లో పరిచయం లేని ఆయన .. ఫేస్బుక్ లో కూడా ఆయన కామెంట్స్ లాంటివి చూసినట్టు లేదు .
ఎక్కడో మధ్య భారత దేశంలో తాను దొంగతనానికి గురైనట్టు .. డబ్బులు అత్యవసరం .. వెంటనే పంపితే తిరిగి ఇచ్చేస్తానని మెసేజ్ ల పై మెసేజ్ లు ఉన్నాయి.
" ఏమయ్యా నీ కంటికి మరీ అంత జఫ్ఫా లాగా కన్పిస్తున్నానా?
నాకు ఫేస్బుక్ లో ఫ్రిండ్స్.. ఫాలోయర్స్ కలిపి నలబై వేలు . నిజ జీవితం లో అసలు పరిచయం లేని వ్యక్తి డబులు కావాలి అని అడగగానే ఎగేసుకొని డబ్బులు పంపించడానికి నేనేమైనా చెవిలో పువ్వులు పెట్టుకొన్నానా?
నువ్వు చెప్పిన స్టోరీ నిజం అని అనుకొందాము . నిజ జీవితం లో నీకు తెలిసిన వారు ఎవరూ లేరా? వారికి కదా ఫోన్ చెయ్యాల్సింది ? మధ్యలో వాసిరెడ్డి అమర్నాథ్ ఎక్కడినుంచి వచ్చాడు ?
రాబరీ అయ్యింది అన్నావు కదా ? ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు ? FIR కాపీ ఏది? అని నిన్ను అడగొచ్చు . నాకున్న కాంటాక్ట్స్ ను ఉపయోగించుకొని నువ్వు ఉన్న చోట లోకల్ పోలీస్ నిన్న కలిసేలా చెయ్యొచ్చు . అప్పుడు నువ్వు ఫ్రాడ్ అవునా? కాదా? అని బయటపడి పోతుంది . నిజమయితే లోకల్ పోలీస్ ద్వారా నీకు సాయం చేయించవచ్చు . కానీ ఎవడో ముక్కు మొఖం తెలియని వ్యక్తి మెసెంజర్ లో ఏదో స్టోరీ చెప్పగానే .. నాకున్న కాంటాక్ట్స్ ను వుపయోగించి .. ఇంత టైం స్పెండ్ చెయ్యడానికి నేనేమీ అమాయకుడు కాదు. ఎవడో ఏదో స్టోరీ చెప్పగానే కళ్ళలో నీళ్లు పెట్టుకొని డబ్బులు ఇవ్వడానికి నేనేమైనా పాత సినిమాలో గుమ్మడి లాంటోడినా ? ప్రాక్టికల్ మనిషిని!"
అని వాయిస్ మెసేజ్ ద్వారా రిప్లై ఇచ్చాను .
దీన్నే క్రిటికల్ థింకింగ్ అంటారు .
వాసిరెడ్డి అమర్నాథ్ మిమ్మల్ని ముంచేసే లేదా కనీసం ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నాడా? ..
అతని పోస్ట్ ల వెనుక ఏదైనా మతలబు వుందా ?
మీ మీ క్రిటికల్ థింకింగ్ వుపయోగించి తెలుసుకోండి .
ఈ పోస్ట్ లో చివరిగా రెండు మాటలు .
నేను ఎవరినైనా సున్నితంగా విమర్శిస్తున్నాను అంటే దాని వెనుక సామజిక ప్రయోజనం ఉంటుంది . దానికి రాజకీయాలకు సంభంధం లేదు . కొన్ని విషయాలు నెమ్మదిగా బయటపడుతాయి . వ్యవస్థలు దాని పని అవి చేస్తాయి . అర్థం చేసుకొన్న వారికి కృతఙ్ఞతలు . అర్థం కానివారు.. కాలం చెప్పే సమాధానాల కోసం వేచి ఉండండి.
ఇక ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి .
నాలుగు రోజుల క్రితం అడిగాను .
కామెంట్స్ చూసారా ?
చాలా మంది" వద్దు సార్ .. మిమ్మల్ని అపార్థం చేసుకొంటారు" అని చెప్పారు .
నా జీవితం లో ఎప్పుడూ చూడని స్థాయిలో భావోద్వేగాలు ఉన్నాయి . రెండు వైపులా .. పెద్ద యుద్ధం .. కాదు.. కాదు .. అంతకన్నా ఎక్కువ స్థాయిలో నడుస్తోంది .
ఈ పరిస్థితుల్లో ఇదిగో ఇలా జరగబోతోంది అని రాస్తే .. అది ఎవరికి అనుకూలమో వారు సంతోషపడుతారు . మరో వర్గం వారు .. బాధ పడుతారు. నా పై కోపం పెంచుకొంటారు .
నిజాలు వినడానికి జనాలు సన్నద్ధంగా లేరు .. మానసికోద్వేగ భావాలు.. అదీ తీవ్ర స్థాయిలో .. ఆందోళన కలిగించే స్థాయిలో ..
జనాల్లో భావోద్వేగాలు ఏ స్థాయిలో వున్నాయి ఆంటే.. పది రోజుల క్రితం పెట్టిన పోస్ట్ లో ఆంధ్ర ప్రదేశ్ ఫలితాలు ఎలా వుంటాయో చెప్పా .. డైరెక్ట్ గా కాకుండా పరోక్షంగా చెప్పా ..
కేంద్ర రాజకీయాలు గురించి రాసింది జనాలకు అర్థం అయ్యింది . విమర్శలు { హుందా విమర్శలు } వచ్చాయి .
తెలంగాణ గురించి రాసింది అర్థం అయ్యింది .
కానీ నేను ఆంధ్ర ప్రదేశ్ గురించి రాసింది... ఎవరికీ అర్థం అయినట్టు లేదు .
రక్షించావురా భగవంతుడా అనుకొన్నా!
వాసిరెడ్డి అమర్నాథ్ అందరి వాడుగా ఉన్నాడు .
అర్ధ రాత్రి అయినా అప రాత్రి అయినా కరోనా కాలం అయినా... అది ముగిసాక కూడా మీకు సూచనలు సలహాలు ఇస్తూ మీ ఇంటి వాడుగా ఉన్నాడు .
అలాగే ఉండి పోనివ్వండి .
ఇంత భావోద్వేగాలు వున్నప్పుడు .. నిజాలు వినడానికి రెండు వైపుల వారు సిద్ధంగా లేనప్పుడు .. నిజాలు చెప్పి ఓగు పడడం ఎందుకు? { ఓగు అనేది .. మా అమ్మమ్మ ఒకనాడు ఉపయోగించిన మాట . ఓగు ..ఈ నాటి భాషలో దానికి అర్థం ట్రోలింగ్ }
నా బాధ ఒక్కటే .. రేపు ఫలితాలు వెలువడినప్పుడు చాల మంది తీవ్ర మానసిక కుంగుబాటుకు గురవుతారు . జనాలు కష్టాల్లో ఉన్న కరోనా కాలంలో మీరడగకపోయినా మాట సాయం చేశాను . ేపు నాలుగవ తేదీ మీకు తీవ్ర భావద్వేగం ఏర్పడినప్పుడు దాన్ని మీరు అధిగమించలేనప్పుడు .. మెసెంజర్ ద్వారా నన్ను సంప్రదించడం మరచి పోవద్దు .

https://www.youtube.com/watch?v=JTUxlf-JB1g

టీనేజర్లను అర్ధం చేసుకోవడం ఎలా ? | How Parents Should Deal with Their Teenage Kids ? || Pratidhwani

సన్ రైజర్స్ అంటే ఏంటి ?

సూర్యోదయపు ఆటగాళ్లు.
అంటే సూర్యుని వెలుతురు వున్నప్పుడు చెలరేగి పోయేవారు.
రాత్రి పూట వీరి పవర్ తగ్గిపోతుంది.
Knight అంటే రాత్రి అని ��
నైట్ రైడర్స్ అంటే రాత్రి సవారీ గాళ్ళు.
అంటే రాత్రి పూట వారికి ఫుల్ పవర్.
రాత్రి పూట ఆడడం వల్లే సూర్య కాంతి బ్యాచ్ ఓడి నిశీధి బ్యాచ్ గెలిచింది.
పేను స్వామి లా మారిన నేను.
������������

పాపం టీచర్లను ఇల్లిల్లు తిప్పించి దిష్ప్రచారం చేయడం కాదు.

బహిరంగ ఛాలెంజ్. ఇంటర్నేషనల్ .. కార్పొరేట్ .. ఒక్కొక్కరు వస్తారో .. వెయ్యి మంది వస్తారో రండి. జడ్జి లను కూడా మీరే తీసుకొని రండి. ఫేస్బుక్ లో లైవ్ పెడుదాము. ఒక్కడైనా మీ టీచింగ్ స్టాండర్డ్స్ బాగున్నాయంటే బహిరంగ శిక్ష కు సిద్ధం.
సోది ప్రచారం కాదురా. దమ్ముంటే ఛాలెంజ్ కి నిలబడు.

చదివి అర్థం చేసుకొనే ఓపిక లేక పొతే ఎలా ?

సింగల్ కాలమ్ వార్త.
దాన్ని చదివి అర్థం చేసుకోలేక పోస్ట్ చేస్తున్న ప్రశ్నలు చూస్తే నాకు ఆశ్చర్యమేస్తోంది
అమ్మాయి ని బలాత్కారం చేసింది తన క్లాస్ మేట్. వాడు పదో తరగతి. అంటే 15 ఏళ్ళు. అంటే మైనర్. కాబట్టే వాడిని జువెనైల్ హోమ్ కు తరలించారు.
దాన్ని ఫిలిం చేసి , ఆ వీడియో చూపి డబ్బులు డిమాండ్ చేసింది నలుగురు యువకులు. వారి వయసు ఇరవై దాటింది. వారిని రిమాండ్ కు పంపారు.
సంఘటన జరిగింది మే 24 అని వార్తలో లేదు.
సంఘటన జరగడం .. ఆ వీడియో చూపి వారు డబ్బు డిమాండ్ చేయడం .. తల్లి తండ్రులు పోలీస్ కు రిపోర్ట్ చేయడం .. జడ్జి రిమాండ్ కు పంపడం .. అన్నీ ఒక్క రోజులో జరగవు
మే 24 స్కూల్ ఎలా పనిచేసింది అంటే ఎలా ?
పోస్ట్ సరిగా చదివి అర్థం చేసుకోండి.
నిజమయిన అనుమానాలు వచ్చి ఉంటే సంతోషించే వాడిని !
నా అంచనా ప్రకారం ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమ లో వుంటారు.
వాడు దాన్ని ఫిలిం చేసి ఫ్రెండ్స్ కు ఇచ్చి ఉంటాడు.
దాన్ని వాళ్ళు వైరల్ చేసారు.
సహజంగానే పోలీస్ లు ఇలా కేసు పెట్టండని తల్లితండ్రులకు చెప్పి వుంటారు.
మైనర్ అమ్మాయిని అనుభవించడం అంటే రేప్. అది ఆ అమ్మాయి ఇష్టం తో జరిగినా. వాడు మైనర్ అయినా
మైనర్ సెక్స్ వీడియో ను సర్క్యూలేట్ చేయడం నేరం.
రామాయణం లో పిడకల వేట వద్దండి.
పోస్ట్ సారం ఏమిటంటే పదో క్లాస్ లోనే ప్రేమ లు లేదా రేప్. దాన్ని ఫిల్మింగ్. పోస్టింగ్.
లాఠీ ఒకటి తీసుకొని కాగే నూనెలో ముంచి .. ఎర్రకారం లో ముంచి .. అటుపై సెన్సార్ కట్.
ఇదీ ఆ నలుగురికీ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్.

రాకాసి గడుసు పిల్ల !

ఆమె బుడిబుడి నడకలు నేర్చేనాటికే ఆ ఊరు శవాల దిబ్బ అయ్యింది .
హిరోషిమా లో బాంబు విస్ఫోటనం తో తొలి రోజే 80 వేలమంది మరణించారు .
డిసెంబర్- 1945 నాటికి మరణాల సంఖ్య లక్ష నలబై వేలు చేరింది
అప్పటికి ఆమె వయసు రెండేళ్లు .
శివకాశి సరుకులాంటి ఆ పాప ... ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఇంతటి ప్రమాదంనుండి బయట పడింది .
ఆ చిన్నారి చంద్రికను .. తలితండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు .
షియగు ససాకి .. ఫుజికో ససాకి వాళ్ళ ఇంటి మందార పూలత .. అల్లిబిల్లి జాబిలి లాగా పెరిగింది ..
ఆటల్లో మేటి.
పరుగు పందెం లో ఆమెకు తిరుగే వుండేది కాదు .
అల్లరి చేష్టల అమ్మాయి ..
ఆటల్లో గెలిచే చిన్నారి ..
జింకలా చెంగున చిన్నారి ..
జోరుగా వచ్చేస్తుంది ..
ఎవరిదీ ...?
ఆమే సడకో ససాకి .
హిరోషిమా బాల నాయకి .
జానపద గాథల్లో మాత్రమే ఇలాంటివి మనం వింటాము .
కానీ ఇది నిజ జీవిత గాథ!
అణుబాంబు విస్ఫోటనం దాని రేడియో ధార్మికత ఎంతో మందిని పొట్టన పెట్టుకొంది. ఎంతో మంది రేడియో ధార్మికత వల్ల అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చుకొన్నారు .
వాంతులు , వికారం , జ్వరం , రక్త స్రావం , వెంట్రుకలు ఊడి పోవడం ఇలాంటి రేడియో ధార్మిక అనారోగ్య సమస్యలు హిరోషిమా లో సాధారణం అయిపోయాయి .
1945 డిసెంబర్ కు లక్ష నలబై వేల మంది మరణిస్తే అటు పై రేడియోధార్మికత వల్ల మానసిక సమ్యల వల్ల మరణించినవారు ఎందరో .
అయినవారందరూ పొతే .. మానసిక స్థితి ఎలా ఉంటుంది ?
బాంబు విస్ఫోటానంతో... ఆసుపత్రులు... మంచి నీటి సరఫరా.. మరుగునీటి పారుదల లాంటి మౌలిక సదుపాయాలు ధ్వంసం .
బతకడానికి డబ్బులు లేవు . తిండి లేదు . నిన్నటిదాకా హాయిగా బతికినవారు కటిక దరిద్రం లో కూరుకొని పోయారు .
కలుషిత వాతావరణం .
అంటురోగాలు .
" చచ్చినవారే అదృష్టవంతులు . ఎందుకు బతికామురా దేవుడా??" అంటూ లక్షలాది మంది. ఇదీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసాక హిరోషిమా నగరవాసుల బతుకు చిత్రం .
కానీ ...
అందాల పసిపాప ... సడకో ససాకి అదృష్టవంతురాలు .
తల్లితండ్రులిద్దరూ బతికారు . అల్లారు ముద్దుగా పెరిగింది . అందరినీ ఆశ్చర్య పరిచింది .
కాలం కాటెయ్యడమంటే ?
1954 .
... సడకో వయసు పదకొండేళ్లు .
నాన్న కన్న కల నిజమయ్యేలా .. తనకున్న ఇష్టమే తీరేలా .. పరుగు పందెం లో గెలవడానికి సమాయత్తమవుతోంది .
ఉన్నటుండి
నీరసం తో... కళ్ళుతిరిగి... పడిపోయింది .
వెంటనే ఆ పాపను తల్లితండ్రులు ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు .
బ్లడ్ కాన్సర్ .
డాక్టర్ లు చెప్పలేక చెప్పలేక విషయాన్ని చెప్పారు .
.. ఆసుపత్రిలో చేర్పించారు .
పాప మొండిది .
అత్త విశ్వాసం మెండు .
చికిత్స పొందుతూనే తన చలాకీతనంతో ... ఆత్మవిశ్వాసం తో అక్కడి డాక్టర్ ల.. నర్స్ ల ... రోగుల... హృదయాలను దోచేసింది .
అందరికీ చిన్నారి దేవత అయ్యింది .
తాను చావకూడదు .
ఎంతో కాలం బతకాలి .
ఇదీ చిన్నారి సడకో సంకల్పం .
కాగితాన్ని కొంగలా చేసి విసిరడం జపనీయులు సంప్రదాయం . దాన్ని ఒరిగామి అంటారు .
వెయ్యి ఓరగామి క్రేన్స్ చేస్తే దేవుడు కరుణిస్తాడని ఎవరో ఆమెకు ఆసుపత్రిలో ఎవరో చెప్పారు .
అప్పటి నుంచి ఆమె ఆసుపత్రిలో కన్పించిన ప్రతి పేపర్ ను ఒరిగామి క్రేన్ గా చేసింది .
చిన్నారి ఓడింది .
వెయ్యి కొంగలు చేయకముందే కాన్సర్ చిన్నారి ని కబళించింది .
దేవతలు అప్పుడప్పుడూ భూమిపైకి వస్తారు .
ఏదో మరచిపోయినట్టు .. దారి తప్పి ఇక్కడికి వచ్చినట్టు .. వెంటనే వెళ్లి పోతారు .
చిన్నారి సడకో అలాగే అందరినీ విషాద సముద్రం లో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయింది
అటుపై ఆమె తల్లితండ్రులు ఆమె వదిలి పెట్టిన origami కార్యాన్ని కొనసాగించారు .
చిన్నారి జ్ఞాపకార్థం ఇప్పుడు హిరోషిమా లో స్మారక చిహ్నం .
ప్రతి సంవత్సరం ప్రపంచ బాలబాలికలు " అంకుల్స్ .. మీ కక్షాలు కార్పణ్యాలు .. మా బతుకులు చిదిమేయకుండా చూడండి . అణ్వాయుధాలు వద్దు" అంటూ అక్కడికి చేరి ఒరిగామి చేస్తారు .
బతికినన్నాళ్లు హిరోషిమా వాసులకు నరకం . ఎలాంటి అనారోగ్యం లేకుండా బయట పడ్డాము అనుకొన్నవారికి ఉన్నట్టుండి ఐదేళ్లకు... పదేళ్లకు కాన్సర్ .. దీనితో తమకు ఎప్పుడో ఏమవుతుందో అని భయం .. చస్తూ బతికారు .. బతికి చచ్చారు .
ద్వేషించాడనికి లక్ష కారణాలు .
ప్రేమించాడనికి ఒక్కటే కారణం .
నీవు మనిషివి .
ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి ..,
కానీ ... కన్నులు మూచ్చిన మందభాగ్యులు ఒక్కడు .. ఒక్కడు లేచి రాడు..
ఒకే జీవితం ..
ప్రేమిస్తే జీవితం నందన వనం .
ద్వేషిస్తే బతుకు హిరోషిమా .
ఈ పోస్ట్ మా ఇంటి గడుసు పిల్ల... కీర్తి శేషురాలు వాసిరెడ్డి రితిక కు అంకితం .

The Mischievous Little Girl
The Mischievous Little Girl
The Mischievous Little Girl
The Mischievous Little Girl
The Mischievous Little Girl
Amarnath Vasireddy
Amarnath Vasireddy
Amarnath Vasireddy
Amarnath Vasireddy
Amarnath Vasireddy
టీనేజ్‌.... స్వేచ్ఛగా ఉండాలని, తనకంటూ వ్యక్తిగత సమయం కావాలని, తనను తాను నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరే దశ. ఈ క్రమంలో కుటుంబం నుంచి...సమాజం నుంచి కొన్ని ఒత్తిళ్లు ఎదురవుతూంటాయి... అయితే వారిలో సవాళ్లను తట్టుకునే సామర్థ్యం లేకపోవడంతో...చాలామంది యుక్త వయసులోకి ప్రవేశించిన తర్వాత తీవ్ర మానసిక ఆందోళనలతో సతమతం అవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. టీచర్లు, తలిదండ్రులు దానిని అర్థం చేసుకోవటం ఎలా? వారిలో కుంగుబాటును సరిదిద్ది....వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా..వారిని ప్రోత్సహించటం ఎలా? టీనేజ్‌ వయసులో ఎదురయ్యే సమస్యలేంటి? వాటికి కారణాలేంటి? పరిష్కార మార్గాలేంటి? ఇదీ ఇవాళ్టి ప్రతిధ్వని.

టీనేజర్లను అర్ధం చేసుకోవడం ఎలా ? | How Parents Should Deal with Their Teenage Kids ? || Pratidhwani

Watch ETV Prathidhwani tonight at 7:30.

Watch ETV Prathidhwani tonight at 7:30.

ఎవడో సైబర్ దొంగ. నా పేరు తో డబ్బులు అడుక్కొంటున్నాడు.

Jebu donga, manchi donga, kondaveeti donga, andaru aipoi... updated version Cyber donga sir

ఊహకందని దారుణం !

సున్నిత మనస్కులు ఈ పోస్ట్ చదవొద్దు ప్లీజ్ !
హిరోషిమా !
అందమయిన నగరం !
చుట్టూరా ఎత్తైన కొండలు .
పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది .
జపాన్ మిలటరీ స్థావరం కూడా !
ఆ .. సోమవారం … కొన్ని నిముషాలు... నగరాన్ని... నగర జీవులను నాశనం చేసింది .
6 ఆగష్టు , 1945 . సమయం ఉదయం 8 . 15 నిముషాలు .
"చిన్ని బాలుడు" అనే పేరు పెట్టిన అణుబాంబును అమెరికా యద్ద విమానం హిరోషిమా పై జారవిడిచింది .
భూమికి 1900 అడుగులు... లేదా 600 మీటర్ల ఎత్తు లో ... అణుబాంబు పేలేలా దాన్ని రూపొందించారు .
గాలిలోనే పేలేలా ఎందుకు డిజైన్ చేసారు ?
మనం చూసింది దీపావళి బాంబులు . లేదా నాటు బాంబులు .
ఇది అణుబాంబు .
ఇదే కీలక మయిన తేడా !
గాలిలో పేలితే దాని ప్రభావం ఎక్కువ దూరం వ్యాపిస్తుంది .
అందుకే దాన్ని ఆలా డిజైన్ చేసారు .
విమానం నుంచి జారవిడిచిన 43 సెకండ్స్ లో అది పేలింది .
యురేనియం అనేది రేడియో ధార్మిక పదార్థం . దానిలో కేంద్రక విచ్చితి ప్రక్రియ మొదలయ్యింది .
వంద డిగ్రీ ల ఉష్ణోగ్రత... అంటే నీరు ఆవిరి కావడం మొదలవుతుంది .
1538 డిగ్రీ ల దగ్గర ఇనుము కరిగి పోతుంది .
వెయ్యి డిగ్రీ లలోపే బర్మా టేకు లాంటి గట్టి చెక్క మండిపోతుంది .
అగ్నిపర్వతాలు బద్దలై బయటకు వచ్చే లావా ఉషోగ్రత 1200 డిగ్రీ లు .
సూర్యుడి ఉపరితలం లో ఉష్ణోగ్రత 5500 .
మీరు నమ్మక పోవచ్చు .
హిరోషిమా గగనతలం లో అణుబాంబు గాలిలో భూమికి అర కిలోమిటర్ కు కాస్త ఎత్తు లో పేలినప్పుడు అక్కడి ఉషోగ్రత పది .. ఇరవై లక్షల డిగ్రీ లను దాటేసింది .
భూమి పై అంటే హిరోషిమా ఇండస్ట్రియల్ ప్రమోషన్ హాల్ ప్రాంతం లో ఉష్ణోగ్రత 4000 డిగ్రీ ల అయ్యింది . అంటే సూర్యుడి ఉపరితలం పై ఉన్నంత వేడి .
ఆ ప్రాంతం అప్పటికి రద్దీ గా ఉంది.
ముందుగా పెద్ద ఎత్తున శబ్దం .
ఏదైనా శబ్దం వస్తే మనం బయపడి దూరం జరిగే ప్రయత్నం చేస్తాము .
ఇది అసంకల్పితంగా జరిగి పోతుంది .
అక్కడి ప్రజలు అదే చేసారు .
పైనుంచి ఆకాశం విరిగినట్టు శబ్దం రావడం తో ఒక్క క్షణం వంగారు.
మరో క్షణం లో వింతైన కాంతి. మరి కొద్ది క్షణాల్లో అప్పటిదాకా ఎవరూ కనీవినీ ఎరుగని పుట్ట గొడుగు ఆకారం లో పొగ కొండ.
ఆ వేడికి చర్మాలు కాలిపోయి ఊడి వేలాడడం మొదలయ్యాయి . చాల మంది క్షణాల్లో చనిపోయారు . వారు ఎంతో అదృష్టవంతులు .
అప్పటికి బతికిన వారు నరకాన్ని అనుభవించి ... ఒక రోజులో .. కొంత మంది... వారం ... పది రోజుల్లో చనిపోయారు .
వేడికి చర్మం కాలి ఊడి పోతుంటే చల్లదనం కోసం పక్కనే వున్న నదిలో చాలా మంది దూకారు . ముఖ్యంగా ఆ ప్రాంతం లో పని చేస్తున్న విద్యార్థులు కుప్ప తెప్పలుగా నదిలోకి దూకారు .
దేవుడు లేదా ప్రకృతి వారి పై పగబట్టింది . అది మంచి నీటి నది అయుంటే కాస్తో కూస్తో ఉపయోగం ఉండేదేమో !
కానీ అది ఉప్పు నీరు కావడం తో కండలు కాలడం మొదలయ్యింది{
ఇలా రాస్తున్నందుకు నాపై నాకే అసహ్యం వేస్తుంది .
క్షమించగలరు .
కోడి ని కోసి ఉప్పులో కారం లో ఊర బెట్టి నిప్పు పై కాలిస్తే ఎలా ఉంటుంది ?
తందూరీ కదా .
పాపం ఆ అభాగ్య జీవుల పరిస్థితి అదే .
"పగవాడికి కూడా ఇలాంటి చావొద్దు రా దేవుడా" అనే రీతిలో వారు ఆ ఉప్పు నీటి బ్యాక్ వాటర్ నీటిలో కాలిపోయారు .
అన్నెం పున్నెం ఎరుగని పిల్లలు తమ దేశ మిలిటరీ పాలకులు చేసిన పాపానికి మాడి మసైపోయారు .
బాంబు విస్ఫోటనం వల్ల షాక్ వేవ్ ఏర్పడి సూపర్ సోనిన్ స్పీడ్ అంటే శబ్దాన్ని కంటే వేగంగా తో నాలుగు వైపులకు వ్యాపించింది .
అప్పుడు అక్కడ విపరీతమయిన ఒత్తిడి ఏర్పడింది . ఇది ఎంత స్థాయి ఒత్తిడి అంటే పెద్ద నిర్మాణాలను కూల్చి వేయగలదు . ఇదే విస్ఫోటనం .
కాసేపట్లో మొత్తం రివర్స్ .
అధిక పీడనం స్థానం లో అల్ప పీడనం ఏర్పడింది
అధిక పీడనం వున్నప్పుడు బాహ్య దిశగా.. అల్పపీడనం ఏరపడినప్పుడు అంతరదిశగా వస్తువులు చెల్లా చెదురయ్యాయి . రాళ్లు పగిలిన ఇనుప వస్తువులు మిస్సైల్స్ లాగా తయారయ్యి పెద్ద పెద్ద నిర్మాణాలను ధ్వంసం చేసేశాయి .
దీనికి తోడు అణుధార్మికత .
దీని ప్రభావం గురించి తరువాతి పోస్ట్ లో రాస్తాను .
ఉష్ణానికి.. సౌండ్ కు ... వేల మంది అయిదు పది క్షణాల్లో చనిపోయారు .
నదిలో దూకిన వారు మరి కొన్ని క్షణాల్లో .
కొంతమందికి కనుగుడ్లు బయటకు వచ్చాయి .
అధిక పీడనం అధిక ఉష్ణోగ్రత దీని కారణం .
కనుగుడ్లు లోపలి తోసుకొంటూ పరుగులు తీసిన వారు , నదిలో దూకిన వారు .. అందరూ మరణించారు .
బాంబు పేలిన రోజే సుమారుగా ఎనబై వేల మంది మరణించారు .
అదృషమంటే వారిదే !
ఈ మాట ఎందుకంటున్నానో మీకు తరువాయి పోస్ట్ చదివితే అర్థం అవుతుంది . బతికిన వారు నరక కష్టాలు అనుభవించి చనిపోయారు . ఈ వివరాలు మరో పోస్ట్ లో .
ఇవి చదివితే మీకు రకరకాల అనుమానాలు రావొచ్చు . రావొచ్చు కాదు. రావాలి.
ఎంత లోతుగా ఆలోచిస్తే అన్ని అనుమానాలు వస్తాయి .
మీ అనుమాన నివృత్తికి నేను రెడీ .
పోస్ట్ చెయ్యండి .
ఈ సిరీస్ లో ఇది రెండో పోస్ట్ .
మొదటి దాన్ని చదవండి .
అలాగే రాబొయ్యే మరి కొన్ని పోస్ట్లు .
An unimaginable atrocity!
An unimaginable atrocity!
An unimaginable atrocity!
An unimaginable atrocity!
An unimaginable atrocity!

ఊహకందని దారుణం !

సున్నిత మనస్కులు ఈ పోస్ట్ చదవొద్దు ప్లీజ్ !
హిరోషిమా !
అందమయిన నగరం !
చుట్టూరా ఎత్తైన కొండలు .
పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది .
జపాన్ మిలటరీ స్థావరం కూడా !
ఆ .. సోమవారం … కొన్ని నిముషాలు... నగరాన్ని... నగర జీవులను నాశనం చేసింది .
6 ఆగష్టు , 1945 . సమయం ఉదయం 8 . 15 నిముషాలు .
"చిన్ని బాలుడు" అనే పేరు పెట్టిన అణుబాంబును అమెరికా యద్ద విమానం హిరోషిమా పై జారవిడిచింది .
భూమికి 1900 అడుగులు... లేదా 600 మీటర్ల ఎత్తు లో ... అణుబాంబు పేలేలా దాన్ని రూపొందించారు .
గాలిలోనే పేలేలా ఎందుకు డిజైన్ చేసారు ?
మనం చూసింది దీపావళి బాంబులు . లేదా నాటు బాంబులు .
ఇది అణుబాంబు .
ఇదే కీలక మయిన తేడా !
గాలిలో పేలితే దాని ప్రభావం ఎక్కువ దూరం వ్యాపిస్తుంది .
అందుకే దాన్ని ఆలా డిజైన్ చేసారు .
విమానం నుంచి జారవిడిచిన 43 సెకండ్స్ లో అది పేలింది .
యురేనియం అనేది రేడియో ధార్మిక పదార్థం . దానిలో కేంద్రక విచ్చితి ప్రక్రియ మొదలయ్యింది .
వంద డిగ్రీ ల ఉష్ణోగ్రత... అంటే నీరు ఆవిరి కావడం మొదలవుతుంది .
1538 డిగ్రీ ల దగ్గర ఇనుము కరిగి పోతుంది .
వెయ్యి డిగ్రీ లలోపే బర్మా టేకు లాంటి గట్టి చెక్క మండిపోతుంది .
అగ్నిపర్వతాలు బద్దలై బయటకు వచ్చే లావా ఉషోగ్రత 1200 డిగ్రీ లు .
సూర్యుడి ఉపరితలం లో ఉష్ణోగ్రత 5500 .
మీరు నమ్మక పోవచ్చు .
హిరోషిమా గగనతలం లో అణుబాంబు గాలిలో భూమికి అర కిలోమిటర్ కు కాస్త ఎత్తు లో పేలినప్పుడు అక్కడి ఉషోగ్రత పది .. ఇరవై లక్షల డిగ్రీ లను దాటేసింది .
భూమి పై అంటే హిరోషిమా ఇండస్ట్రియల్ ప్రమోషన్ హాల్ ప్రాంతం లో ఉష్ణోగ్రత 4000 డిగ్రీ ల అయ్యింది . అంటే సూర్యుడి ఉపరితలం పై ఉన్నంత వేడి .
ఆ ప్రాంతం అప్పటికి రద్దీ గా ఉంది.
ముందుగా పెద్ద ఎత్తున శబ్దం .
ఏదైనా శబ్దం వస్తే మనం బయపడి దూరం జరిగే ప్రయత్నం చేస్తాము .
ఇది అసంకల్పితంగా జరిగి పోతుంది .
అక్కడి ప్రజలు అదే చేసారు .
పైనుంచి ఆకాశం విరిగినట్టు శబ్దం రావడం తో ఒక్క క్షణం వంగారు.
మరో క్షణం లో వింతైన కాంతి. మరి కొద్ది క్షణాల్లో అప్పటిదాకా ఎవరూ కనీవినీ ఎరుగని పుట్ట గొడుగు ఆకారం లో పొగ కొండ.
ఆ వేడికి చర్మాలు కాలిపోయి ఊడి వేలాడడం మొదలయ్యాయి . చాల మంది క్షణాల్లో చనిపోయారు . వారు ఎంతో అదృష్టవంతులు .
అప్పటికి బతికిన వారు నరకాన్ని అనుభవించి ... ఒక రోజులో .. కొంత మంది... వారం ... పది రోజుల్లో చనిపోయారు .
వేడికి చర్మం కాలి ఊడి పోతుంటే చల్లదనం కోసం పక్కనే వున్న నదిలో చాలా మంది దూకారు . ముఖ్యంగా ఆ ప్రాంతం లో పని చేస్తున్న విద్యార్థులు కుప్ప తెప్పలుగా నదిలోకి దూకారు .
దేవుడు లేదా ప్రకృతి వారి పై పగబట్టింది . అది మంచి నీటి నది అయుంటే కాస్తో కూస్తో ఉపయోగం ఉండేదేమో !
కానీ అది ఉప్పు నీరు కావడం తో కండలు కాలడం మొదలయ్యింది{
ఇలా రాస్తున్నందుకు నాపై నాకే అసహ్యం వేస్తుంది .
క్షమించగలరు .
కోడి ని కోసి ఉప్పులో కారం లో ఊర బెట్టి నిప్పు పై కాలిస్తే ఎలా ఉంటుంది ?
తందూరీ కదా .
పాపం ఆ అభాగ్య జీవుల పరిస్థితి అదే .
"పగవాడికి కూడా ఇలాంటి చావొద్దు రా దేవుడా" అనే రీతిలో వారు ఆ ఉప్పు నీటి బ్యాక్ వాటర్ నీటిలో కాలిపోయారు .
అన్నెం పున్నెం ఎరుగని పిల్లలు తమ దేశ మిలిటరీ పాలకులు చేసిన పాపానికి మాడి మసైపోయారు .
బాంబు విస్ఫోటనం వల్ల షాక్ వేవ్ ఏర్పడి సూపర్ సోనిన్ స్పీడ్ అంటే శబ్దాన్ని కంటే వేగంగా తో నాలుగు వైపులకు వ్యాపించింది .
అప్పుడు అక్కడ విపరీతమయిన ఒత్తిడి ఏర్పడింది . ఇది ఎంత స్థాయి ఒత్తిడి అంటే పెద్ద నిర్మాణాలను కూల్చి వేయగలదు . ఇదే విస్ఫోటనం .
కాసేపట్లో మొత్తం రివర్స్ .
అధిక పీడనం స్థానం లో అల్ప పీడనం ఏర్పడింది
అధిక పీడనం వున్నప్పుడు బాహ్య దిశగా.. అల్పపీడనం ఏరపడినప్పుడు అంతరదిశగా వస్తువులు చెల్లా చెదురయ్యాయి . రాళ్లు పగిలిన ఇనుప వస్తువులు మిస్సైల్స్ లాగా తయారయ్యి పెద్ద పెద్ద నిర్మాణాలను ధ్వంసం చేసేశాయి .
దీనికి తోడు అణుధార్మికత .
దీని ప్రభావం గురించి తరువాతి పోస్ట్ లో రాస్తాను .
ఉష్ణానికి.. సౌండ్ కు ... వేల మంది అయిదు పది క్షణాల్లో చనిపోయారు .
నదిలో దూకిన వారు మరి కొన్ని క్షణాల్లో .
కొంతమందికి కనుగుడ్లు బయటకు వచ్చాయి .
అధిక పీడనం అధిక ఉష్ణోగ్రత దీని కారణం .
కనుగుడ్లు లోపలి తోసుకొంటూ పరుగులు తీసిన వారు , నదిలో దూకిన వారు .. అందరూ మరణించారు .
బాంబు పేలిన రోజే సుమారుగా ఎనబై వేల మంది మరణించారు .
అదృషమంటే వారిదే !
ఈ మాట ఎందుకంటున్నానో మీకు తరువాయి పోస్ట్ చదివితే అర్థం అవుతుంది . బతికిన వారు నరక కష్టాలు అనుభవించి చనిపోయారు . ఈ వివరాలు మరో పోస్ట్ లో .
ఇవి చదివితే మీకు రకరకాల అనుమానాలు రావొచ్చు . రావొచ్చు కాదు. రావాలి.
ఎంత లోతుగా ఆలోచిస్తే అన్ని అనుమానాలు వస్తాయి .
మీ అనుమాన నివృత్తికి నేను రెడీ .
పోస్ట్ చెయ్యండి .
ఈ సిరీస్ లో ఇది రెండో పోస్ట్ .
మొదటి దాన్ని చదవండి .
అలాగే రాబొయ్యే మరి కొన్ని పోస్ట్లు .
Morning... Does anyone drink beer early in the morning? Do you have guts ?

క్రిమినల్ కు తన తేలితేటల పై అపార నమ్మకం .

అవతలివారి తెలివిని తక్కువ అంచనా .
అంటే ఓవర్ స్మార్ట్ .
అతి తెలివి .
అదే కొంపలు ముంచుతుంది
ఎవరైనా వ్యక్తి ఏదైనా ఈవెంట్ కు వెళ్లారో లేదా నిర్ధారించుకోవాలంటే .. వారి గూగుల్ లొకేషన్ .. విమాన / రైల్ టికెట్ లు .. కాల్ డేటా .. ఇలా బోలెడు సాక్ష్యాలు .
ఏదో కిమ్మనకుండా ఉండిపోయుంటే అక్కడితో పోయుండేది . "
లేదు నేను పోలేదు . ఇదిగో నేను ఇక్కడ ఉన్నా అని ఫేక్ ఆధారాలు సృష్టించి మీడియా ద్వారా పోలీస్ ల కు సవాలు విసిరితే .. మరింత లోతుగా విచారణ జరుగుతుంది .
పోయావా? లేదా ? అని సోది చర్చలకు దిగడానికి వారేమీ యూట్యూబ్ చానెళ్లు కాదు .
పోలీస్ .
అక్కడి నీకేమి పని ?
ఎంత మందిని తీసుకెళ్ళావు .
ఎంత రేట్ ఛార్జ్ చేస్తున్నావు .
ఎప్పటినుంచి ఈ దందా చేస్తున్నావు ..
హోల్ మొత్తం సమాచారం బయటకు లాగేస్తారు .
అతి తెలివి కొంప ముంచేస్తుంది .
" మన ప్రత్యర్థి మహా మొండి . దారుణంగా నష్టపోతున్నా, యుద్ధం కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నాడు . విమానాలనుంచి బాంబులు వేస్తె వ్యాపించే మంటల ను అదుపు చేయడానికి హిరోషిమా నగరంలో కొన్ని ఎత్తైన భవనాలను కూలగొట్టి ఆ శిధిలాలను ఫైర్ బ్రేక్స్ గా వాడేందుకు సమాయత్తం అవుతున్నాడు . దీని కోసం ఐదో తరగతి దాకా పాఠశాల ల కు సెలవులిచ్చి , ఆరు ఆ పై తరగతి పిల్లల ను "మొబిలైజషన్ పని" అనే పేరుతొ రంగంలోకి దించాడు . మనం , సాంప్రదాయక యుద్ధం చేస్తే అది నెలల తరబడి కొనసాగే అవకాశముంది . మన వైపు భారీ ఎత్తున సైనికులు చనిపోతారు . లక్షల మంది జపానీయులు చని పోయే ప్రమాదముంది . దీనికి తోడు మరో పక్క సోవియెట్ రష్యా రంగంలోకి దిగుతోంది . ఆలా వదిలిస్తే సోవియెట్ జపాన్ పై ఆధిపత్యం సాధించి ఆసియా లో తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకొంటుంది . మన శక్తి సామర్థ్యాలను చూపి ఒక్క పెట్టున యుద్ధం లో విజయం సాదించాలి... అలాగే యుద్ధాన్ని అంతం చెయ్యాలి ... అంటే అణుబాంబు వినియోగం ఒక్కటే మార్గం "
ఇదీ అమెరికా అధ్యక్షుడు ట్రూమాన్ కు ఆ దేశపు ఇంటెరిమ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ సారాంశం .
ఈ రిపోర్ట్ ఆధారంగా జపాన్ పై అణుబాంబు వినియోగించాలి అనే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు హరీ ఎస్ ట్రూమాన్ 25 జులై 1945 లో తీసుకొన్నాడు .
దీని కోసం అమెరికా వాయుదళం పకడ్బందీగా సమాయత్తమయ్యింది .
పసిఫిక్ మహాసముద్రం . అందులో తినియన్ దీవి . అక్కడ అమెరికా వాయు దళ కేంద్రముంది.
బి- 29 అనే యుద్ధ విమానానికి పైలట్ గా పాల్ తిబ్బట్స్ ను ఎంపిక చేసి బాంబు ఎలా డ్రాప్ చెయ్యాలో , బాంబు వేసాక అతి వేగంగా విమానాన్ని ఎలా తీసుకొని రావాలో ప్రాక్టీస్ చేయించారు .
ఆ యుద్ధ విమానానికి తిబ్బట్స్ తన తల్లి పేరు పెట్టాడు . ఆ విధంగా బి 29 బాంబర్ "ఎనోల గే "అయ్యింది .
యురేనియం 235 కేంద్రక విచ్చిన ప్రక్రియ తో ఆధారపడిన అణుబాంబు కు లిటిల్ బాయ్ { చిన్ని బాలుడు } అని పేరు పెట్టారు . దాన్ని ఎనోల గ్రే యుద్ధ విమానం పైకి ఎక్కించారు .
ఆగష్టు 6 .. తెల్లవారు జామున 2 . 45 కు తినియన్ దీవి నుండి తిబ్బట్స్ తన తల్లి పేరు పెట్టిన బాంబర్ విమానం తో బయలుదేరాడు . 2400 కిలోమిటర్ ల దూరం పయనించాక హిరోషిమా గగనతలం పైకి వచ్చాడు .
అప్పుడు సమయం ఉదయం 8 . 15 .
జపనీయులు తమ పనిని పెందలకడే మొదలెడతారు . వందల సంఖ్యలో.. మిడిల్ స్కూల్... హై స్కూల్ పిల్లలు తమకు అప్పగించిన మొబిలైజషన్ పనిలో పడ్డారు . వారికి సాయంగా టీచర్స్ ఉన్నారు. రోడ్ ల పై ట్రాఫిక్ బాగుంది .
గగనతలంలో 31 వేల అడుగులు ... అంటే సుమారుగా పది కిలోమిటర్ ల ఎత్తులో తిబ్బట్స్ తన విమానంలో .
బాంబు ను నగరం మధ్యలో వెయ్యాలి . అప్పుడే గరిష్ట స్థాయిలో ప్రభావముంటుంది .
కింద నేల పై హిరోషిమా నగరం నడిబొడ్డున ఉన్న ఇండస్ట్రియల్ ప్రమోషన్ హాల్ఎత్తయిన గుమ్మటం { డోమ్ } కనిపిస్తోంది . పక్కనే టి ఆకారంలో ఉన్న బ్రిడ్జి . ఈ వంతెనను టార్గెట్ గా చేసుకొని బాంబు ను వదిలారు . అది భూమిని తాకక ముందే అంటే భూమికి 1900 అడుగుల ఎత్తులో వున్నపుడే పేలే విధంగా తయారు అయ్యింది .
బాంబు వేసాక అది 43 సెకండ్స్ లో ... గాలిలో అంటే... భూమికి 1900 అడుగుల ఎత్తులో పేలిపోతుంది .
ఈ లోగా విమానం తీసుకొని దూరంగా వెళ్లి పోవాలి . దాని కోసం ఎన్నో రోజులు శిక్షణ తీసుకొన్నాడు తిబ్బట్స్ . బాంబ్ విడిచాక 155 డిగ్రీ ల కోణం లో 560 కిలోమీటర్ ల వేగంతో విమానాన్ని వెనక్కు పోనించాడు . బాంబు పేలేటప్పటికీ సుమారుగా 12 కిలోమీటర్ ల దూరం లో ఆ విమానముంది . కానీ బాంబు విస్ఫోటనా ప్రభావానికి పెద్ద ఎత్తున కుదుపులకు గురయ్యింది . బాగా శిక్షణ తీసుకోవడం తో ప్రమాదాన్ని అధిగమించాడు .
తాను వదిలిన బాంబు హిరోషిమా లో ఎన్ని వేల పసి మొగ్గలను చిదిమేసిందో .. ఎంత నరమేధానికి కారణమయ్యిందో తిబ్బట్స్ తరువాత తెలుసుకొన్నాడు .
" నేను నా డ్యూటీ చేశాను. బాంబు వేసాను కాబట్టే యుద్ధం ముగిసింది . లేకుంటే ఇంతకు పది రెట్లు ఎక్కువ నష్టం జరిగేది " అని తన చర్య ను సమర్థించుకొన్నాడు .
అమెరికా వాయుదళం లో బ్రిగేడియర్ జనరల్... మేజర్ జనరల్ గా పదోన్నతులు పొందాడు .
2007 లో 92 ఏళ్ళ వయసులో మరణించాడు .
కొందరి దృష్టిలో తిబ్బట్స్ నరరూప రాక్షసుడు .
కొందరి దృష్టిలో హీరో .
తన సమాధి పై తన పేరు రాయవద్దు అని మరణానికి ముందు చెప్పాడు .
ఆదివారం .. పొద్దున్న 8 . 15 .
ఆకాశం లో కనీ వినీ ఎరుగని విస్ఫోటనం .
అసంకల్పిత చర్య గా ఇండస్ట్రియల్ హాల్ ఏరియా లోని వ్యక్తులు ముందుకు వంగారు. పెద్ద ఎత్తున వింత కాంతి.
ఆ కాంతి తమ జీవితాలను అంధకారం చేస్తుందని .. ఆ అభాగ్య జీవులు ఆ క్షణం లో ఊహించి వుండరు .
వివరాలు రాబొయ్యే పోస్ట్ ల లో
Our adversary is extremely stubborn. Despite suffering devastating losses, he remains intent on continuing the war.
Our adversary is extremely stubborn. Despite suffering devastating losses, he remains intent on continuing the war.
Our adversary is extremely stubborn. Despite suffering devastating losses, he remains intent on continuing the war.
Our adversary is extremely stubborn. Despite suffering devastating losses, he remains intent on continuing the war.
Our adversary is extremely stubborn. Despite suffering devastating losses, he remains intent on continuing the war.

ప్రశ్నించాల్సిన విషయం.

1. డ్రగ్స్ ఎలా వస్తున్నాయి?
2 ప్రభుత్వాలు వీటిని అరికట్టడానికి ఏమి చేస్తున్నాయి.
మాట్లాడుకొంటున్న విషయాలు.
1. రేవ్ పార్టీ అంటే ఏంటి ?
2. యాభై లక్షలు.
3 నగ్న నృత్యాలు.
4 పాము విషం.
5. హేమ ఎక్కడుంది ?
మనం ఏమి కావాలనుకొంటే అదే మనకు దక్కుతుంది.

On A Ventilator Two Weeks Before Exams | Kirpan Kaur Khanuja Passed Out SSC || Yuva

పరీక్షలకు రెండు వారాల ముందు వెంటిలేటర్‌పై ఉన్నా... SSCలో ఉత్తీర్ణత సాధించిన కిర్పਾਨ కౌర్ ఖనుజా || యువ

*తరగతి గది నుండి కార్పొరేట్ ప్రపంచం వరకు*

చిన్నతనంలోనే, నేను అభ్యసన మరియు అన్వేషణలతో నిండిన ఒక సుసంపన్నమైన ప్రపంచంలోకి అడుగుపెట్టాను. అక్కడ ఆట మరియు జ్ఞానం కలిసి నా బాల్య అనుభవాలను తీర్చిదిద్దాయి.

నేను మొదట స్లేట్‌లో ఒక అంతర్ముఖుడైన ఆరవ తరగతి విద్యార్థిగా అడుగుపెట్టాను. కానీ, పాఠశాల అందించిన ప్రోత్సాహకరమైన వాతావరణం మరియు సమగ్ర విద్యకు ధన్యవాదాలు, నేను ఆత్మవిశ్వాసం గల, అన్ని రంగాలలో రాణించే వ్యక్తిగా పట్టభద్రుడయ్యాను. ఒక పిరికి పిల్లవాడి నుండి ఆత్మవిశ్వాసం గల వయోజనుడిగా నేను మారడానికి ప్రధాన కారణం స్లేట్‌లోని అంకితభావం గల ఉపాధ్యాయులే. వారి దృష్టి కేవలం సిలబస్ పూర్తి చేయడం వరకే పరిమితం కాలేదు, ప్రతి విద్యార్థిలో సంపూర్ణ అభివృద్ధిని వారు నిర్ధారించారు.

దీపావళి, ఈద్ మరియు క్రిస్మస్ వంటి పండుగ వేడుకలు ఆనందాన్ని తీసుకురావడమే కాకుండా, అందరినీ కలుపుకొనిపోయే భావనను పెంపొందించి, మన చుట్టూ ఉన్న వైవిధ్యాన్ని అభినందించేలా చేశాయి.

వక్తృత్వ మరియు ఆశు ప్రసంగ పోటీలలో పాల్గొనడం నా ప్రసంగ నైపుణ్యాలను మెరుగుపరిచి, భవిష్యత్ విద్యా మరియు వృత్తిపరమైన బాధ్యతలకు నన్ను సిద్ధం చేసింది. అదనంగా, సామాజిక-ఆర్థిక పర్యటనలు, ప్రచార కార్యక్రమాలు మరియు క్షేత్ర పర్యటనలు జీవితంపై విస్తృత దృక్పథాన్ని అందించి, నా అవగాహనకు లోతును చేకూర్చాయి.

ఫైనాన్స్‌లో కెరీర్‌ను ఎంచుకోవాలనే నా నిర్ణయం పట్ల మా తల్లిదండ్రులకు ఉన్న ఆందోళనలను తగ్గించిన రామ్ బాబు సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు సవాలుతో కూడుకున్నదని వారు భయపడినప్పటికీ, నా సామర్థ్యాలపై ఆయనకున్న నమ్మకం నా విశ్వాసాన్ని మరింత పెంచింది.

స్లేట్ తర్వాత, నేను సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో నా విద్యను కొనసాగించాను. అక్కడ విద్యాభ్యాసంతో పాటు పాఠ్యేతర కార్యకలాపాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సమతుల్య విధానం నా అభివృద్ధిని మరింత బలపరిచింది. నేను 2018లో చార్టర్డ్ అకౌంటెంట్‌గా విజయవంతంగా అర్హత సాధించి, నా వృత్తి ప్రయాణాన్ని ప్రారంభించాను.

నేను 2018లో బహుళజాతి పెట్టుబడి బ్యాంకు అయిన గోల్డ్‌మన్ సాక్స్‌లో చేరాను. అప్పటి నుండి దాదాపు ఆరేళ్ల విలువైన అనుభవాన్ని సంపాదించి, ప్రస్తుతం అసోసియేట్‌గా పనిచేస్తున్నాను.

నా ప్రయాణాన్ని తిరిగి చూసుకుంటే, స్లేట్ - ది స్కూల్ పూర్వ విద్యార్థిని అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. అక్కడ నేను పొందిన విద్య, మార్గదర్శకత్వం మరియు మద్దతు నా విద్యా మరియు వృత్తిపరమైన విజయానికి పునాదిగా నిలిచాయి. స్లేట్‌లో వేసిన పునాది నా విజయాలలో కీలక పాత్ర పోషించింది మరియు నా భవిష్యత్ మార్గానికి మార్గదర్శకంగా ఉంటుంది.

*పి. గీతాంజలి*
ఎస్‌ఎస్‌సి 2012 బ్యాచ్

దార్శనికతను రూపొందించడం:

నా పేరు మానస్. నేను ప్రస్తుతం 'ది ఫార్మిస్ట్ గ్రూప్'లో సీనియర్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కొనసాగుతున్న 20 కస్టమైజ్డ్ విల్లా ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నాను. నేను స్లేట్ ది స్కూల్, 2012 బ్యాచ్ పూర్వ విద్యార్థిని అయినందుకు గర్వపడుతున్నాను.

స్లేట్ నాకు పటిష్టమైన విద్యా పునాదిని అందించింది మరియు భారీ ప్రాజెక్టులను నిర్వహించడానికి కీలకమైన నా నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించింది. స్లేట్‌లోని సహాయక వాతావరణం మరియు స్ఫూర్తిదాయకమైన ఉపాధ్యాయులు నా సృజనాత్మక మరియు విశ్లేషణాత్మక సామర్థ్యాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.

విమర్శనాత్మకంగా ఆలోచించడం, వేగంగా పరిస్థితులకు అనుగుణంగా మారడం, మరియు నిరంతరం నూతన ఆవిష్కరణలు చేయడం వంటివి స్లేట్ నాకు నేర్పింది—ఆర్కిటెక్చర్‌లో ఇవి అత్యవసరమైన నైపుణ్యాలు. కఠినమైన విద్యావిధానం మరియు విభిన్నమైన పాఠ్యేతర కార్యకలాపాలు నా డిజైన్ మరియు ప్రాజెక్ట్ నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరిచాయి. తద్వారా సంక్లిష్టమైన ఆర్కిటెక్చరల్ సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలుగుతున్నాను.

నా రంగంలో రాణించడానికి అవసరమైన నాయకత్వ లక్షణాలను మరియు దార్శనికతను పెంపొందించడంలో స్లేట్‌లోని పాఠాలు మరియు అనుభవాలు కీలక పాత్ర పోషించాయి. అవే నన్ను ఈనాటి వృత్తి నిపుణుడిగా తీర్చిదిద్దాయి. నన్ను మరియు రాబోయే తరాలను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న అధ్యాపక బృందానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.

ఎండలో నడవమన్నాను కానీ .. మరీ ఇలా కాదండీ! ������

I told you to walk in the sun, but... not *quite* like this!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి రాయమంటారా ?

ఒక నాయకుడంటే బాగా అభిమానం ..
... మరో నాయకుని పట్ల తీవ్ర వ్యతిరేకత ..
ఇదీ ఆంధ్ర ప్రదేశ్ లో సింహ భాగం ప్రజల పరిస్థితి .
ఇలాంటప్పుడు సహజంగానే తమ నాయకుడు / పార్టీ కి అనుకూలంగా , అవతలి నాయకుడికి ఆయన పార్టీ కి వ్యతిరేకంగా ఈ ఉత్తర దక్షిణ ధృవ ప్రజల ఆలోచనలు ఉంటాయి .
తమిళ్ తంబీ వాసనై .. { వాసన}
పొరుగున ఉన్న తమిళనాడు రాష్టం లో ఇరవై ఏళ్ళ క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో .
కరుణానిధి ఆయన పార్టీ డీఎంకే ; జయలలిత ఆమె పార్టీ ఎఐఎడిఎంకె .. మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి .
రాజులు పోయారు .. రాజ్యాలు... సామ్రాజ్యాలు పోయాయి .ఒకరికి ఇష్టమున్నాలేకున్నా .. ఇప్పుడు మన దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం .
దాని ప్రమాణాలు నిర్దేశించే రాజ్యాంగం .
దాని బట్టే పరిపాలన సాగాలి .
ఒక రాజు ..
ఆయన పొరుగున ఇంకో రాజు ..
ఇద్దరి మధ్య వైరం .
అప్ప్పుడేమి జరిగేది ?
అవతలి రాజును మట్టు పెట్టాలి ..
లేదా పాదాక్రాంతుడ్ని చేసుకోవాలి .
.. అదీ రాజరిక న్యాయం .
ఈ నీతికి కాలం చెల్లింది .
కాలం మారినా ఇంకా అక్కడే ఉండి పోతాను అంటే ఎలా ?
ప్రజాస్వామ్యం లో ... అధికార పక్షం .. ప్రతి పక్షం ..
ఇలా ఉంటుంది .
ఉండాలి .
నూటికి నూరు శాతం ప్రజల మన్నన పొంది అందరి ఓట్లు పొందే నాయకుడి అవతరించేవరకు .. ఇది ఇలాగే ఉంటుంది .
ఇలాంటి నాయకుడు ఎవరైనా ఉంటారా ?
పోనీ ఇక పై పుడతారా ?
సాధ్యం కాదు .
కదా ?
ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు సాధించడం ద్వారా ఎక్కువ సీట్లు సాధించవచ్చు .
తక్కువ ఓట్లు వస్తే సీట్స్ తగ్గొచ్చు .
ఇది వేరు .
మీడియా , మేధావులు.. కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు .
అదే సమస్యకు మూలం .
అందుకే ఆంధ్ర ప్రదేశ్ లో యుద్ధ వాతావరణం నెలకొంది . బొబ్బిలి యుద్హం .. పల్నాటి యుద్ధం లాంటి ఎన్నో యుద్ధాలను చూసిన తెలుగు నెలలో .. ఒక సరి కొత్త యుద్ధం .
అసెంబ్లీ లో పార్లమెంట్ లో వచ్చిన సీట్స్ ఆధారంగా.. కేవలం .. ఈ ఒక్క అంశం ఆధారంగా ఒక పార్టీ గొప్పతనాన్ని అంచనా వెయ్యడం సరి కాదు .
ఒక ఎన్నికల్లో తక్కువ సీట్స్ వచ్చినంత మాత్రాన పార్టీ పని అయిపొయింది అని అంచనా వెయ్యడం సరి కాదు .
ఆలా చూస్తే ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ లోక్ సభలో కేవలం రెండు సీట్స్ సాధించింది .
అప్పట్లో ఆ పార్టీ ఇక అయిపొయింది అనుకున్నవారు ఉన్నారు..
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారం లో ఉంది.
అంటే ఎన్నికల్లో మిగతా పార్టీ ల తో పోలిస్తే ఎక్కువ ఓట్లు సాధించి ఎక్కువ సీట్స్ గెలుపొందింది .
అదే సమయం లో ఇక మొత్తం బీజేపీ దే అనుకొంటే అదీ సరైన భావన కాదు .
నలభై శాతం ఓట్లు .. అంటే మిగతా పార్టీ ల కంటే ఎక్కువ ఓట్లు సాధించి బీజేపీ అధికారం లో ఉంది .
మోడీ ఇంకా ఇతర బీజేపీ నాయకులు “ కాంగ్రెస్ లేని భారత దేశం “ రావాలని ప్రయత్నించినా .. ఇంకా కాంగ్రెస్ ఉంది .
గతం తో పోలిస్తే బలహీన పడి వుండవచ్చు .
అదే సమయం లో ఇటీవలే రెండు రాష్ట్రాల్లో గెలిచింది . అంటే ఎంతో కొంత శాతం ప్రజలు కాంగ్రెస్ ను అభిమానిస్తున్నారు .
కాబట్టి ఓట్లు తక్కువ వస్తే పార్టీ ఫినిష్ అయిపోయినట్టు కాదు . గెలిచినంత మాత్రాన ఇక అదే పార్టీ సర్వం కాదు .
ఇదీ ప్రజాస్వామ్యంలో మౌలిక సూత్రం .
ప్రజల్లో కొన్ని వర్గాల అభిమానం ఉన్నంత వరకు పార్టీ లు మనుగడ సాగిస్తాయి .
ఒక పార్టీ మనుగడ కోల్పోయింది అంటే .. ప్రజల్లో ఆ పార్టీ ని అభిమానించే వర్గం ఏదీ లేదు అని .
ఆలా జరగాలంటే అదీ ఆ పార్టీ , నాయకుడి స్వయంకృతాపరాధం కావాలి .
దానా .. దీనా .. చెప్పొచ్చేది ఏంటంటే .. అవతలి పార్టీ అంటే విపక్షం .. అంతే కానీ వైరి పక్షం కాదు .
వైరి పక్షం... అంటే రాజుల కాలం నాటి వైరి పక్షం .
ఆంటే అవతలి వారిని ఫినిష్ చేసేయాలి అనే ఆలోచన .
ఇది తమిళనాడు రాజకీయాల్లో ఫెయిల్ అయ్యింది . కరుణానిధి జయలలిత ను ఆమె పార్టీ ని , అలాగే జయలలిత కరుణానిధి ని ఆయన పార్టీ ని ఫినిష్ చేయాలనీ ఎన్నో ఏళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవేవీ సఫలం కాలేదు .
కరుణానిధి జయలలిత పట్ల అనుసరించిన వైఖరి వల్ల ఆమె అభిమానుల్లో ఆమె పట్ల అభిమానం మరింత పెరిగింది .
అలాగే ఆమె కరుణానిధి పట్ల జయ చేసిన పనులు కూడా ఆయన్ని అయన అభిమానులకుమరింత దగ్గర చేసింది .
ప్రజాస్వామ్యం లో వైరి పక్షం అంటే ఫినిష్ చేసేసే పార్టీ కాదు ..
విపక్షం పై రాజకీయ పోరాటం సాగాలి .
విపక్షం అభిమానులను కూడా తన దగ్గర చేసుకోవాలి .. అదే అసలైన రాజనీతి .
తమిళనాడు రాజకీయాలు నేర్పిన ప్రాధమిక సూత్రాలను ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులూ .. పార్టీ లు .. అన్నిటికంటే మించి ప్రజలు నేర్చుకోలేదు .
ఇరవై ఏళ్ళ నాటి తమిళనాడు ఫెయిల్యూర్" రాజకీయ కక్ష స్టోరీ "ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో నడుస్తోంది .
మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది .
ప్రతి మీడియా కు ఇప్పుడు .. ఇప్పుడు కాదులెండి .. ఎప్పటినుంచో... రంగుపడింది .
కనీసం న్యూట్రల్ గా ఉన్న మేధావులయినా విశ్లేషిస్తారు అనుకొన్నాను . కానీ గత కొన్ని వారాలుగా వస్తున్న వారి విశ్లేషణలు చిత్రంగా... విచిత్రంగా ఉన్నాయి. సీక్రెట్ గా అమ్ముడు పోయారో .. భయపడుతున్నారో.. లేక వ్యూస్ కోసం ఏదో చెబుతున్నారో .. తెలియదు కానీ .. నేను చూసినంత వరకు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల పై ఒక్కటంటే ఒక్కటి సరైన విశ్లేషణ లేదు .
ప్రజల ముందు వాస్తవాలను నిలిపే ప్రయత్నం లేదు .
రాబొయ్యే మూడు నాలుగు రోజులు నన్ను విశ్లేషించమంటారా ?
"వద్దు సార్ "అంటారా ?.
మీరే చెప్పండి .
ఎక్కువమంది కావాలి అంటే రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను .
జపాన్ గురించి రాయాల్సింది బోలెడంత ఉంది.
జపాన్ ప్రజల జీవన నైపుణ్యాలు .. కావాలి అందరికీ పాఠాలు.
దీనికి తోడు హిరోషిమా అణు విధ్వంసం గురించి .. మీరందరూ నిర్గాంత పోయే అనేక విషయాలు .. నేర్చుకోవలసిన ఎన్నో పాఠాలు .
కనీసం ఆరేడు పోస్ట్స్ కావాలి .
ఆంధ్ర ప్రదేశ్ గురించి రాస్తే .. జపాన్ పాఠాలకు ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని నా భయం .
హైదరాబాద్ లో... ఇంటి నుంచి... నా డెస్క్ టాప్ కంప్యూటర్ పై నుంచి .. మీకందరికీ ..
శుభోదయం .
గుడ్ మార్నింగ్ .

ఇప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది.

మొత్తం నాలుగు గంటల ప్రయాణం లో మొదటి మూడు గంటలు .. అంటే విమానం ఇండియా భూభాగం పైకి ఎంటర్ అయ్యేవరకు కుదుపులు.
సీట్ బెల్ట్ సైన్ ఆన్ లో వుంది.
జపాన్ నుంచి చెన్నై వరకు సముద్రం పై బలమయిన గాలులు.
అదీ పదకొండు కిలోమీటర్ ల ఎత్తులో గాలులు. విమానం కుదుపులు.
ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పయనం రిస్కీ.
వంకర టింకర తిరిగి కాసేపటి కింద కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది. కాసేపటికి హైదరాబాద్ ఫ్లైట్. ఇప్పుడు కాసేపు రెస్ట్ !
The story is good. The ending is not good.
The story is good. The ending is not good.

విమానం మలేషియా కు దగ్గర్లో వుంది .

మరో 75 నిముషాల్లో ల్యాండ్ కావలి
టుర్బులెన్సు ( కుదుపులు ) మళ్ళీ మొదలు.
టుర్బులెన్సు వుండే ప్రాంతాలను గుర్తించి వాటికి వీలైనంత దూరంగా విమానాన్ని పైలట్ నడుపుతున్నారు అనుకొంటా ! అందుకే తిన్నగా కాకుండా వంకర టింకర దారి
The story is good. The ending is not good.
The story is good. The ending is not good.
The story is good. The ending is not good.

ఒసాకా ( జపాన్ ) నుంచి ఉదయం 9 .50 ( ఇండియా సమయం 6 .20 ) బయలుదేరిన విమానం.

ఇప్పుడు మేము పయనిస్తున్న ఫ్లైట్ .. ఇంత లేదు కానీ బాగా కుదుపులు ; గంట కు పైగా .
దీనితో ఫుడ్ సర్వ్ చేయడం ఆలస్యం అయ్యింది.
ఇప్పుడు కుదుపులు కాస్త తగ్గాయి. ( విమానం లో వైఫై వుంది. దానితో ఈ పోస్ట్ ; ఫిలిప్పీన్స్ దగ్గర గా నలభై వేల అడుగుల ఎత్తులో గంటకు వెయ్యి కిలోమీటర్ ల వేగం తో విమానం పయనిస్తోంది!
దూర ప్రాచ్యం నుంచి పసిఫిక్ వైపు వీస్తున్న బలమయిన గాలులు ( మా విమానం కుదుపుకు , నిన్నటి సింగపూర్ విమాన ఘటనకు ఇదే కారణం ! ( అలోక్ , పైలట్ వృత్తిలో లో ఉన్న స్లేట్ పూర్వ విద్యార్ధి ఇచ్చిన సమాచారం
The story is good. The ending is not good.
The story is good. The ending is not good.

ప్రధాన కారణం మాస్కులు !

The story is good. The ending is not good.

హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

( ఒసాకా నుండి మలేషియా - ఉదయం 9:50 మలేషియా (KL) - ఉదయం 9:30 ) అర్ధరాత్రికి హైదరాబాద్ చేరుకుంటాను. సయోనారా జపాన్.
Starting back to Hyderabad
Starting back to Hyderabad
Starting back to Hyderabad
Starting back to Hyderabad
Starting back to Hyderabad
Starting back to Hyderabad
Starting back to Hyderabad
Starting back to Hyderabad

శుభ సాయంత్రం మేడమ్. ఇటీవల నాకు ఎదురైన ఒక అద్భుతమైన అనుభవాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. నేను నిత్యను తీసుకుని బ్యాంకుకు వెళ్లాను. అక్కడ ఒక పని నిమిత్తం వేచి ఉన్నప్పుడు, మూడేళ్ల వయసున్న ఒక చిన్న పాప అటు ఇటు పరిగెడుతూ ఆడుకోవడం చూశాను. ఆ పాప తల్లి క్యూలో నిలబడి అది గమనిస్తూ ఉంది. కాసేపటి తర్వాత, ఆ తల్లి పాప దగ్గరకు వచ్చి, పరిగెత్తడం ఆపేయమని చెప్పి ఆమె చేతికి మొబైల్ ఇచ్చింది. ఆ పాప వెంటనే మొబైల్ తీసుకుని అందులో వీడియోలు చూడటం మొదలుపెట్టింది.

నిత్య కూడా ఇది గమనించింది, ఆమెకు అది నచ్చలేదు. నెమ్మదిగా ఆ పాప పక్కన వెళ్లి కూర్చుని, ఆమె పేరు అడిగింది. కానీ ఆ పాప మొబైల్‌లో వీడియోలు చూడటంలో ఎంత నిమగ్నమై ఉందంటే, నిత్య అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ఇవ్వలేదు. అప్పుడు నిత్య ఆ పాప తల్లి వైపు తిరిగి, "ఆంటీ, దయచేసి ఆమె చేతిలోంచి మొబైల్ తీసేయండి. అది ఆమెకు మంచిది కాదు" అని చెప్పింది. దానికి ఆ తల్లి, మొబైల్ తీసేస్తే పాప మళ్లీ అటు ఇటు పరిగెత్తడం మొదలుపెడుతుందని చెప్పింది. నిత్య ఆ చిన్నారి వైపు తిరిగి, మొబైల్‌ను తన తల్లికి ఇచ్చేయమని అడిగింది. ఆశ్చర్యకరంగా, ఆ పాప మొబైల్ తిరిగి ఇచ్చేసి నిత్య వైపు చూసి నవ్వింది.

ఆ తర్వాత, వాళ్లిద్దరూ కలిసి నేల మీద గీసిన వృత్తాలు, అంకెలతో ఆడుకోవడం మొదలుపెట్టారు. అలా కొంతసేపు ఆడుకున్నాక, మేము బ్యాంకు నుండి బయలుదేరేటప్పుడు ఆ పాప నిత్యను కౌగిలించుకుని, ఆమెను వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఆ దృశ్యాన్ని చూస్తుంటే నా కళ్లు తిప్పుకోలేకపోయాను. అది నాకు ఎంతో అద్భుతమైన క్షణం.

తిరిగి వస్తున్నప్పుడు, నిత్య ఆ పాప తల్లితో మళ్లీ ఇలా చెప్పింది: "ఆమెకు మొబైల్ ఇవ్వకండి, ఆమెను ఆడుకోనివ్వండి; ఆమె పరిగెత్తడాన్ని ఎవరూ ఆపడం లేదు కదా."

ఇలాంటి క్షణాలు నా కూతురి గురించి నాకు ఎప్పుడూ గర్వించేలా చేస్తాయి.

అమర్‌నాథ్ సార్ కృషి ఎప్పుడూ వృథా పోదు. దీనికి ఇదే గొప్ప ఉదాహరణ. మన పిల్లల్లోని నిజమైన ప్రతిభను వెలికితీసే ఈ ప్రయత్నంలో మనమందరం సార్‌కు మద్దతు ఇద్దాం.

చాలా ధన్యవాదాలు సార్!

సాయి నిత్య తల్లి. 4వ తరగతి, స్లేట్ ది స్కూల్, అమీర్‌పేట్.

బుల్లెట్ రైలు - జపాన్

బుల్లెట్ రైలు - పరిశుభ్రత.

బుల్లెట్ ట్రైన్‌లో.ఒసాకా నుండి హిరోషిమాకు.జపాన్.

లిటిల్ బాయ్ అంటే చిన్న పిల్లాడు !

వాడి నిర్వాకాన్ని చూడడానికి ఒసాకా నుంచి బయలుదేరి బులెట్ ట్రైన్ లో వెళుతున్నాము.
ఈ “ చిన్న పిల్లాడు “ ఎవరో వాడికి తోడు “ దొబ్బోడు “ ఎవరో బులెట్ ట్రైన్ లో వెళుతూ పోస్ట్ చేస్తాను.
Little boy is a little boy ! Leaving Osaka on the bullet train to see his performance.
Little boy is a little boy ! Leaving Osaka on the bullet train to see his performance.
Little boy is a little boy ! Leaving Osaka on the bullet train to see his performance.
Little boy is a little boy ! Leaving Osaka on the bullet train to see his performance.
Little boy is a little boy ! Leaving Osaka on the bullet train to see his performance.
Little boy is a little boy ! Leaving Osaka on the bullet train to see his performance.

“ బెట్టింగ్ చేత ! బెట్టింగ్ కొరకు ! బెట్టింగ్ వలన ! “

కొంతమంది మేధావుల ఎన్నికల ఫలితాల విశ్లేషణ !
రేపనేది ఉండదా ? అప్పుడు పరువు పోతుంది అనే భయం లేదా ?
Little boy is a little boy !
Little boy is a little boy !
Little boy is a little boy !
Little boy is a little boy !
Little boy is a little boy !
Little boy is a little boy !
Little boy is a little boy !
Little boy is a little boy !
విజయవాడలోని SLATE - The School లో మీ ఇంటికి దూరంగా మరో ఇంటి వాతావరణాన్ని అనుభవించండి! మా హాస్టల్ ఏసీ గదులు, పౌష్టికరమైన భోజనం మరియు గాడ్జెట్ రహిత వాతావరణాన్ని అందిస్తూ, విద్యాపరమైన శ్రేష్ఠతను మరియు సంపూర్ణ అభివృద్ధిని నిర్ధారిస్తుంది.. ✨

హైదరాబాద్ నుంచి మలేషియా కు విమాన ప్రయాణానికి పట్టే సమయం 4 గంటలు.

మలేషియా లోకల్ టైం మనకంటే రెండున్నర గంటల ముందు.
మలేషియా నుంచి జపాన్ ( టోక్యో ) కు ప్రయాణ సమయం ఆరున్నర గంటలు.
అంటే జపాన్ సమయం మలేషియా కంటే ఎంత ముందుండాలి ?
మూడున్నర గంటలు కదా ?
కానీ జపాన్ సమయం మలేషియా కన్నా కేవలం ఒక గంట ముందు. ( three and half hours ahead of IST )
అలా సెట్ చేసుకొన్నాడు జపాన్ వాడు.
తెల్లవారు జామున నాలుగింటికే భళ్ళున తెల్లవారుతుంది. ఆరింటికల్లా దిన చర్య ఆరంభం. రాత్రి ఎనిమిదింటికల్లా క్లోజ్.
కరెంటు ఆదా ! పాజిటివ్ ఎనర్జీ.
అదీ జపాన్ వాడి తెలివితేటలు.
( అక్షంశాల లెక్క తీసుకొన్నానుఅర్ధరాత్రి సూర్యుని దేశం గురించి నాకు తెలుసు. టోక్యో కేవలం 36 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉంది. ఇంకా ఇక్కడ వేసవి ప్రారంభం కాలేదు. కాబట్టి దయచేసి యూరప్ / USA / కెనడాలోని అధిక అక్షాంశ ప్రాంతాల వేసవి పగటి సమయాలతో గందరగోళపడకండి. అక్కడ శీతాకాలంలో పగటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ జపాన్‌లో అంత తీవ్రంగా ఉండదు.
ఉదయం అయిదింటికి హోటల్ రూమ్ నుంచి దృశ్యం.

తన కోపమే తన శత్రువు .. తన శాంతమే తనకు రక్ష !

ఈ నీతి పద్యాన్ని పల్నాడు పల్లె ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే వ్యక్తి లేడా ?
తెలుగు జాతి గొడ్డువోయిందా ?

 

నల్లని గుడ్డు

లోయ నుండి సల్ఫర్ ఆవిర్లు

టోక్యో, జపాన్

బుద్ధ విగ్రహం, టోక్యో

షిబుయా మరియు శూన్యం

టోక్యో షిబుయా క్రాసింగ్

షిబుయా క్రాస్ టోక్యో జపాన్

హైదరాబాద్ నుంచి బయలుదేరక ముందే నెట్ లో చెక్ చేశా. హోటల్ నిక్కో నరితో.

నరిట ఎయిర్పోర్ట్ దగ్గరి హోటల్.
జిం వుంది. పొద్దునే అయిదింటికి జిం డ్రెస్ తో రెడీ అయిపోయా.
జిం లేదని చావు కబురు చల్లగా చెప్పాడు.
పోనీ దగ్గర్లో ఏదైనా జిం కు పోదామంటే టాక్సీ దొరకలేదు.
జిం పరికరాలు లేకుంటే ఏంటట ?
నా దగ్గర సంకల్పం వుంది కదా.
1. ఇంక్లైన్ 2. డిక్లైన్ 3 ఫ్లాట్ chest ప్రెస్ , 4 హోటల్ టేబుల్ తో బిసిప్స్ 5 దానిపైనుంచి బాడీ వెయిట్ వెయిట్ ట్రీస్ప్స్ .. మొత్తం అయిదు వేరియేషన్స్ - ఒక్కోటి నాలుగు x 12 అంటే మొత్తం 240 వర్కౌట్స్ .. రూమ్ లోనే.
ప్రోటీన్ డ్రింక్ కలపడానికి స్పూన్ కనబడలేదంటే వేలి తోనే.
ఒక్క సారి కమిట్ అయితే తగ్గేదెలా.

తెల్లవారు జాము మూడింటికి నా మెదడుకు అవినాభావ సంభంధం.

ఇప్పుడు జపాన్ లో సమయం మూడు.
ఇదిగో మెలకువ వచ్చేసింది.
( రాత్రి 9 . 30 కి అంటే ఇండియా టైం సాయంకాలం ఆరింటికి పడుకున్నా! ).
శుభోదయం.
మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో - KL నుండి నరిటా (జపాన్)కు ప్రయాణం. సముద్ర మట్టానికి 38,000 అడుగుల ఎత్తులో ప్రయాణం - బయటి ఉష్ణోగ్రత - మైనస్ 48 డిగ్రీల సెల్సియస్ - అయినప్పటికీ విమానంలోని వైఫై ద్వారా ప్రపంచంతో అనుసంధానమై ఉన్నాము.
On Board Malaysian Airlines - KL to Narrita ( Japan ). Flying at a height of 38,000 feet above MSL - outside temp - Minus 48 C - but still connected to world through Aircraft WiFi
On Board Malaysian Airlines - KL to Narrita ( Japan ). Flying at a height of 38,000 feet above MSL - outside temp - Minus 48 C - but still connected to world through Aircraft WiFi
On Board Malaysian Airlines - KL to Narrita ( Japan ). Flying at a height of 38,000 feet above MSL - outside temp - Minus 48 C - but still connected to world through Aircraft WiFi
On Board Malaysian Airlines - KL to Narrita ( Japan ). Flying at a height of 38,000 feet above MSL - outside temp - Minus 48 C - but still connected to world through Aircraft WiFi

అభిమతం... అంటే ... మనం ఏది జరగాలి అని కోరుకొంటున్నామో అది .

ఇప్పుడు ప్రపంచం నాలుగు రోడ్ల కూడలి లో ఉంది.
ఒక పక్క కృత్రిమ మేధ సృష్టిస్తోన్న సునామి ....
మరో పక్క మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు .
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలి .. ఇది నా అభిమతం .
గతం లో నేను పోస్ట్ చేశాను .. మీకు గుర్తుండే ఉంటుంది . మన దేశంలో విద్యా సంస్థలు రెండేళ్ల పాటు మూసి ఉంచడానికి ప్రధాన కారణం.. ఒక ఏడూ టెక్ సంస్థ . ఢిల్లీ సీఎం... అని నా దృఢ అభిప్రాయం .
దీన్ని నిరూపించాడనికి నా దగ్గర ఋజువులు లేవు . ఇది నా మనసులోని మాట
ఈ నేపథ్యం లో ఆ ఏడూ టెక్ సంస్థ ఇబందుల్లో ఇరుకొన్నప్పుడు ... అవినీతి ఆరోపణలతో ఆ నాయకుడు జైల్లో కి వెళ్ళినపుడు " పాపం పండింది .. బాగా అయ్యింది" అని అనుకొన్నాను . ఇది నా వ్యక్తి గత అభిప్రాయం .
రకరకాల సోర్సెస్ ద్వారా సమాచారం సేకరించినప్పుడు .. అయన అరెస్ట్ ఢిల్లీ ప్రజల్లో సానుభూతికి దారి తీసిందని . మామూలుగా అయితే ఢిల్లీ లో మొత్తం సీట్స్ బీజేపీ కి వచ్చివుండేవని .. ఇప్పుడు ఇండియా కూటమి పరం కాబోతున్నాయని సమాచారం వచ్చింది .
నా కొచ్చిన సమాచారం తప్పు కావొచ్చు . అప్పటికీ రకరకాల సోర్సెస్ ద్వారా సేకరించాను . న్యూట్రల్ గా ఉండేవారి దగ్గర నుంచి సమాచారం తీసుకొన్నాను .
నేనేమీ రాజకీయ పండితుడిని కాను .
సర్వే చేయలేదు .
ఏదో గుడ్డివాటంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పెట్టిన విశ్లేష నిజం అయ్యింది .
ఈ సారి పరిస్థితి వేరు . కేంద్రం లో తమ పార్టీ గెలవాలని మోడీ అభిమానులు ఉక్కు సంకల్పం తో వున్నారు .
అదే సమయం లో మోడీ ని వ్యతిరేకించే వారు కూడా బీజేపీ గెలవకూడదని ఆశిస్తున్నారు .
ఇక ఆంధ్ర ప్రదేశ్ గురించి అయితే చెప్పనక్కర లేదు . ఎన్నికల ఫలితాల పై తీవ్ర ఉత్కంఠ .. టెన్షన్ .. నిన్న ఒక్క రోజే .. పాపం ఎంత మందిలో ఎన్ని లీటర్ ల కార్టిజాల్ పొంగిందో .
ఎన్నో రోజులుగా ఎంతో మంది మిత్రులు .. ముఖ్యంగా మెసెంజర్ లో... ఎన్నికల పై విశ్లేషణ చేయమని అడుగుతున్నారు .
నా టూర్ నేపథ్యం లో నేను రేపటి నుంచి పది రోజులు పెద్దగా మెసేజ్ లు టైపు చేయలేను ..
సంవత్సరం అంతా కస్టపడి .. ఏదో సమ్మర్ లో పది రోజులు రిలాక్స్ .. మానసిక విశ్రాంతి కావాలి .
పోతూ పోతూ .. ఫలానా పార్టీ గెలుస్తుంది .. ఫలానా పార్టీ ఓడిపోతుంది అని నేను పోస్ట్ పెట్టి పొతే... అభిమానులు బాధ పడుతారు.. నన్ను అపార్టం చేసుకొంటారు .. కాబట్టి నన్ను ఒగ్గేయండి అని నాలుగు రోజుల క్రితమే పోస్ట్ చేశాను .
అప్పటి నుంచి .." సార్... ప్లీజ్ .. మమ్మల్ని నిరుత్సాహ పరచొద్దు" అని అభ్యర్థనలు .
పుర జనుల కోరిక మేరకు .. విశ్లేషణ పెట్టాను .
దీనితో మీరు విభేదిస్తే మీ అభిప్రాయాన్ని పోస్ట్ చెయ్యండి అన్నాను .
ఒకరిద్దరు తప్పించి అందరూ హుందాగా కామెంట్ చేసారు .
ధన్యవాదాలు .
నా విశ్లేషణ మీ అభిప్రాయానికి బిన్నంగా ఉందా ?
చాలా సింపుల్ అండీ ..
ఇందాకే చెప్పినట్టు నేనేమీ సర్వే చేయలేదు .
రాజకీయ విశ్లేషకుడు కాదు .
నా ఎనాలిసిస్ తప్పు అనుకోండి ..
మనసుకు హాయిగా ఉంటుంది .
సమ్మర్ ను ఫామిలీ తో హ్యాపీగా ఎంజాయ్ చెయ్యండి . పిల్లల్ని మీ మీ గ్రామాలకు తీసుకొని వెళ్ళండి . పెద్ద తరం వారితో ఇంటర్ ఆక్ట్ అయ్యేలా చెయ్యండి . కథల పుస్తకాలూ చదివించండి . గ్రామీణ క్రీడలు నేర్పండి . సెల్ ఫోన్ కు దూరం చెయ్యండి .
హ్యాపీ సమ్మర్ హాలిడేస్ !!
ఇంకో ఇరవై రోజులు .. నా విశ్లేషణ తప్పయితే.. క్షమాపణకు నేను రెడీ . ఇగో లేదు .
కరెక్ట్ అయితే ?
గత నాలుగేళ్లుగా నేను ముందే కూయడం .. అది జనాల్లో అపార్థాలకు దారి తీయడం .. నా పై నిందలు .. వ్యక్తిగత దోషణలు ..
... " ఎండ లో నిల్చుంటే కరోనా చస్తుందా? వీడు వాక్ సీన్ ల కు వ్యతిరేకం .. వాక్ సీన్ వేసుకొంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంట.. మెట్ఫార్మిన్ వేసుకొంటే సమస్యలొస్తాయట .. వీడు వీడి పబ్లిసిటీ పిచ్చి" ...... ఎన్ని.... ఎన్నెన్ని నిందలు .. దూషణలు ..
నా పేరు బికారీ .. నా దారి ఎడారి ..
.... విసుగు రాదు .. ఖుషీ పోదు .. అలసట లేనే లేదు ..
.... అసలు నా పేరు ఆనంద విహారి .
ఎప్పుడూ మీ ముందుకు రాను .. మీ ఇంటికి రాను .. ఈ సాయం చేయండి అని అడగను .
నేను.. నా శ్రమ .. అంతే !
ఉంటాను మాస్టారు !
పిల్లాపాపలతో అందరూ చల్లగా ఉండాలి .
సర్వే జానా సుఖినోభవంతు !

ఆ అబ్బాయి 20 % కు మించి మార్కులు సాధించేవాడు కాదు .

పది లో ఫెయిల్ అయ్యే అవకాశం మెండుగా ఉండేది .
ప్రత్యేక ఫోకస్ పెట్టాము .
అబ్బాయి కూడా కష్టపడి చదివాడు .
చివరకు 40 % తో పాస్ అయ్యాడు .
పిల్లల్ని అర్థం చేసుకోని తల్లితండ్రులు ఎంతో మంది .
ఆ అబ్బాయి తండ్రి కూడా కొంత వరకు అదే టైపు .
పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు .
ఇది గత సంవత్సరం జరిగిన ఘటన .
స్లేట్ తిరుపతి సిబిఎస్సీ స్కూల్ .
గత సంవత్సరం పదో తరగతి ఫలితాలు వచ్చినపుడు ఆ అబ్బాయి పాస్ కావడాన్ని చూసి అధ్యాపకులుగా మేమందరం సంతోషపడ్డాము .
తండ్రి మాత్రం "కేవలం నలబై శాతం మార్కులా ?" .. మీరు సరిగా చదువు చెప్పలేదని స్కూల్ మోసం చేసిందని మా ప్రిన్సిపాల్ కు ఫోన్ చేసి నిందించాడు . అయన తరపున అతని బంధువు నా ఫేస్బుక్ పై ఇదే రకమయిన వ్యాఖ్య చేసాడు .
తండ్రిని పిలిపించి అయన పదో క్లాస్ లో కట్టిన ఫీజు మొత్తం వాపసు ఇచ్చేసాము .
ఆ అబ్బాయిని ఇరవై శాతం మార్కుల నుంచి నలభై శాతానికి తీసుకొనిరావడానికి మేము పడిన శ్రమ గురుదక్షిణగా ఉంచుకోమని చెప్పి ఆ అబ్బాయి ఇంటర్లో అటుపైన బాగా చదివి మంచి స్థానం లో స్థిరపడాలని ఆశీర్వదించి పంపాము .
ఉన్నది ఒక్కటే జీవితం .
కష్టాన్ని నమ్ముకొని బతికే వాడిని .
ఒక మాటంటే పడను.. పడలేను ..
అదే వాసిరెడ్డి అమర్నాథ్ .
నిన్న ఈ సంవత్సరం సిబిఎస్సీ పది ఫలితాలు వెలువడ్డాయి . గత సంవత్సరం చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కాస్త టెన్షన్ గా ఉండింది. నేను హైదరాబాద్ లో ఉన్నా ధ్యాసంతా తిరుపతి పైనే .
నిజాయితీతో ఎంతో కస్టపడి పాఠాలు చెప్పినా .. శంఖం లో పోస్తేనే తీర్థం అయినట్టు .. తమ పిల్లల మార్కులు చూసుకొంటేనే పేరెంట్స్ సంతోషపడుతారు . ఫలితాలు కాస్త అటు ఇటుగా వచ్చినా .. అబ్బే లాభం లేదని నీరు చప్పరించేస్తారు . తప్పు పేరెంట్స్ ది కాదు . మీడియా లో ఫలితాలకు కార్పొరేట్ పాఠశాలలు ఇచ్చే పిచ్చ పబ్లిసిటీ.
ఎంత చెత్త చదువు చెప్పినా ఎంత మంది పిల్లల జీవితాలు నాశనం అయ్యినా ... ఒకటి ... ఒకటి రెండు ... అంటూ నాలుగు దొంగ ర్యాంకుల తో పేజీ నిండా ప్రకటనలు ఇచ్చేస్తే .. టీవీ చానెల్స్ తో బఱ్ఱె గొంతుతో అరిచేస్తే.. పాపం మొత్తం పరిహారం . కొత్త అకడెమిక్ ఇయర్ లో మళ్ళీ కొత్తగా పాపాలు చేయడానికి పర్మిషన్ వచ్చేస్తుంది . అటువంటి దౌర్భాగ్యపు పబ్లిసిటీ లోకంలో ఉన్నాం మనం .
నిన్న తేదీ పదమూడు .
సరిగ్గా 23 సంవత్సరాల క్రితం ఇదే నాడు అంటే 13 మే 2001 స్లేట్ స్థాపించాను . అంటే నిన్న నిన్న స్లేట్ ఫౌండర్స్ రోజు .
మా ఎగ్జిక్యూటివ్స్ నుంచి వస్తున్న గ్రీటింగ్స్ కూడా ఎంజాయ్ చేయలేని టెన్షన్ లో సాయంకాలం దాకా నేను ..
సాయంకాలానికి ఈ సవత్సరం సిబిఎస్సీ పది ఫలితాలు వెలువడ్డాయి .
స్లేట్ తిరుపతి లో వంద శాతం ఫలితాలు .
ఎవరూ వేలెత్తి చూపకుండా 70 శాతం విద్యార్థులు డిస్టింక్షన్ సాధించారు .
ప్రతి ముగ్గురిలో ఒక్కరు 85 % సాధించారు .
వీళ్ళందరూ మెరిట్ టెస్ట్ లో వడపోసి ఎంపిక చేసిన విద్యార్థులు కారు , స్కూల్ లో చేరే నాటికి సాధారణ ప్రతిభ కనబరిచేవారే .
రెండోది అన్నిటికన్నా ముఖ్యమయినది .. మార్కుల కోసం బట్టీ విధానాన్ని మేము ఎప్పుడూ అనుసరించలేదు . సంపూరణాత్మక విద్యనందిస్తూనే ఇలాంటి ఫలితాలను సాధించాము .
ఏ ఘనత మా టీచర్స్ బృందానికి , కష్టపడి కాదు ఇష్టపడి చదివిన మా విద్యార్థులకు , వారి వెన్నంటి ఉన్న తల్లితండ్రులకు దక్కుతుంది .
మా విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు . జీవితం లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు .
నేనేమో ఫలితాలను పెద్దగా ప్రకటించుకోను. దీన్ని అవకాశంగా తీసుకొని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు స్లేట్ లో చేర్పిస్తే మీ పిల్లలకు ఐఐటీ మెడిసిన్ సీట్స్ రావు అని ప్రచారం మొదలెట్టాయి . ఈ నేపథ్యం లో మా గత విద్యార్థుల తో టచ్ లోకి వెళ్లి వారి ప్రగతి గురించి సమాచారం సేకరించాము . ప్రతి ముగ్గురిలో ఒక్కరు .. అయితే ఐఐటీ లేదా మెడిసిన్ అదీ ప్రభుత్వ కళాశాలల్లో మెడిసిన్ .. ఇదే స్లేట్ సత్తా . కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్ కాదు . లా మొదలు .. అనేక కోర్సుల్లో మా విద్యార్థులున్నారు .ఒకటి రెండు ర్యాంకులు కాదు . స్లేట్ లో చదివిన ప్రతి విద్యార్థి లీడర్ గా జీవితం లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు .
చెబితే కానీ విషయం పబ్లిక్ కు అర్థం కాని సమాజం లో ఉన్నాము.
అందుకే పదో తరగతి లో మా విద్యార్థుల అద్భుత ప్రతిభ ను అభినందిస్తూ కర్మన్ ఘాట్ , బౌరంపేట్ , విజవాడలో గత వారం సెలిబ్రేషన్స్ నిర్వహించాము .
అన్ని క్లాసుల తల్లితండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు . కృతిమ మేధ యుగం లో రాణించాలంటే విద్యార్థుల చదువు ఎలా సాగాలి? అనే అంశం పై నేను ప్రతి చోట గంటకు పైగా ప్రసగించాను .
తల్లితండ్రులు స్లేట్ తో వారి అనుభవాలను పంచుకొంటూ ఎమోషనల్ అయ్యారు .
ఒక్క స్లేట్ తిరుపతి ఫలితాలు ఎలా వుంటాయో అని నిన్నటి దాక టెన్షన్ . అక్కడ కూడా మా పిల్లలు దుమ్ము దులిపేసారు . సిక్సర్ .తగ్గేదే లే !
న్యాయంగా అయితే ఈ ఆదివారం స్లేట్ తిరుపతిలో సెలెబ్రేషన్స్ నిర్వహించాలి . కానీ నేను ఈ రోజు రాత్రికి బయలుదేరి విదేశీ టూర్ కు వెళుతున్నాను .
ఈ నేపథ్యం లో స్లేట్ తిరుపతి విజయోత్సవం 26 మే ఆదివారం సాయంకాలం 5 . 55 నుండి ప్రారంభం .
నిజాయతీ కున్న దమ్ము.. ధైర్యం వేరు !

అలెగ్జాండర్ ది గ్రేట్ - గ్రీకు వీరుడు . పోరాట యోధుడు . ప్రపంచ సామ్రాజ్యాన్ని ఏర్పరచాలి అనేది ఆయన కోరిక .

తన కలను చాలా మటుకు నిజం చేసుకొన్నాడు .
అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు .
ఎక్కడ నెగ్గాలో... ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నాయకుడు .
ఈ వాస్తవికత దృక్పథాన్ని చివరి దశలో కోల్పోయాడు అలెగ్జాండర్ .
సైన్యం అలసి పోయింది అని తెలిసి కూడా ఇంకా ముందుకు సాగాలి అని నిర్ణయించాడు . ఫలితం సైన్యం లో తిరుగుబాటు .
హిట్లర్, స్టాలిన్ .. నియంతలుగా మనకు పరిచయం .
వారిని ఒక దశలో ఆ దేశాల ప్రజలు అమితంగా అభిమానించారు .
వారి పతనానికి కారణం అతి .
ఔరంగజేబు .
దక్కను షియా రాజ్యాలను జయించాలి అనేది అతని కోరిక .
అక్కడి దాక ఓకే.
కానీ దాని కోసం రాజధాని వదిలి అనేక సంవత్సరాలు దక్కను ప్రాంతం లో ఉండి పోయాడు .
దక్కను నయితే జయించాడు కానీ ఉత్తరాదిన తిరుగుబాట్లు . ఫలితం తన సామ్రాజ్యం బలహీనం అయ్యింది .
ఇక్కడ కూడా పాయింట్ అతి .
సరే పైవన్నీ రాజరికం కథలు . ఆ నాటి యుద్ధ నియమాలు వేరు .
సోవియెట్ యూనియన్ జర్మనీ ల కథ కూడా వేరు .
ప్రజాస్వామ్య యుగం నీతి వేరు .
అందునా భారత దేశం లో లాంటి భిన్నత్వం ఉన్న దేశం సంగతి వేరు .
నూటికి నూరు శాతం ప్రజల ఓట్లు పొంది నాయకులయిన వారు ఎవరైనా ఉన్నారా?
పోనీ డెబ్భై శాతం ?
లేదు .
డెబ్భై ఏళ్ళ చరిత్ర ఇది . నలబై శాతం ఓట్లు వస్తే పార్టీ గెలిచినట్టే .
అంటే గెలిచిన పార్టీ ని వ్యతిరేకించిన వారు యాభై - అరవై శాతం వుంటారు .
తమ పార్టీ గెలవాలి అని ప్రతి రాజకీయ పార్టీ నాయకుడికి ఉంటుంది . గెలవాలంటే మరింత మంది ఓటర్లను ఆకట్టు కోవాలి .
అది అంత సులభంగా అయ్యే విషయం కాదు .
రూలింగ్ లో ఉన్న పార్టీ కి కొన్ని అనుకూలతలు ఉంటాయి . అదే సమయం లో ప్రభుత్వ వ్యతిరేకత అనే ప్రతికూలత కూడా వుంటుంది .
అంటే గతం లో తమ పార్టీ గెలిచిన ఓట్ల శాతం కంటే కాస్తో కూస్తో తక్కువ ఓట్లు వస్తాయి .
ఇలాంటప్పడు రాజనీతి ఏమి చెబుతుంది ? తన ప్రత్యర్థి పార్టీ లు కలవకుండా చేయాలి.. కానీ ..
ఇందిరా గాంధీ . తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిపక్ష నాయకులను రాచి రంపాన పెట్టింది . ఫలితం మొరార్జీ దేశాయ్ .. చరణ్ సింగ్ ప్రధానులు అయ్యారు . ఎమర్జెన్సీ సమయం లో ఆమె ప్రభుత్వం చేసిన అతి... జన్మ లో కలవరు అనుకొన్న నాయకులను ఒక్క తాటి పైకి తెచ్చింది .
అంటే ఆ రోజుల్లో ఎజెండా ఒకటే .. ఇందిర కు అనుకూలురు . ఇందిర కు ప్రతికూలురు. ప్రతికూలురందరినీ ఏకం చేసిన ఘనత ఆమెదే .
రాజకీయ నాయకులు చరిత్ర నుంచి పాఠాలను గ్రహించరు. పశ్చిమ బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్ కూడా ఇదే దారి పట్టింది . కచ్చితంగా రెండు .. మూడు సార్లు ప్రజా అభిమానం తో లెఫ్ట్ ఫ్రంట్ గెలిచింది . అధికారం తమ చే జారి పోకుండా వారు చేపట్టిన విధానాలే నాయకురాలిగా మమతా బెనర్జీ అవతరణకు దారి తీసింది . నాలుగో లేదా ఐదో ఎలక్షన్స్ లో ప్రజాభీష్టం అమలయ్యి ఉంటే లెఫ్ట్ ఫ్రంట్ ఓడి పొయ్యేది . కాంగ్రెస్ కు చెందిన ఎవరో నాయకుడు సీఎం అయివుండేవాడు . మరో సారి.. అంటే ఇప్పుడు కేరళలో జరుగుతున్నట్టు గా లెఫ్ట్ ఫ్రంట్ అధికారం లోకి వచ్చివుండేది . కానీ అతి ..లెఫ్ట్ ఫ్రంట్ అతి... కారణంగా గానే మమత ... అంటే తాము అనుసరిస్తున్న విధానాలనే అనుసరించే లీడర్ పుట్టుకొచ్చింది . ఇప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ మూడో స్థానానికి పడిపోయింది .స్వయంకృతాపరాధం !
తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలు ముగిసాయి .
పోటీ కాంగ్రెస్ కు బీజేపీ కి మద్యే నడిచింది.
తెలంగాణ ను ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించాము .. ఇప్పుడు మోడీ కి వోట్ వెయ్యాలి అనే మూడ్ లో ఎక్కువ మంది ప్రజలు కనిపించారు.
తన బలమే .. తన బలహీనత .. అదే బీజేపీ .
బీజేపీ గెలవాలి అనుకొనే వారు వున్నట్టే... బీజేపీ ని ఓడించాలి అనే ఓటర్లు వున్నారు . చాలా నియోగక వర్గాల్లో భారత రాష్ట్ర సమితి మూడో స్థానానికి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది . బీజేపీ ని ఓడించాలి అంటే కాంగ్రెస్ కె వోట్ వెయ్యాలి అనే నిర్ణయానికి ఎక్కువ మంది మైనారిటీ ఓటర్లు వచ్చారు .
దీన్ని గమనించే రేవంత్ రెడ్డి బీజేపీ నే విమర్శించారు . తెలంగాణ సాధించిన పార్టీ ఒక్క సీట్ అయినా గెలుస్తుందా? అనే స్థాయికి వచ్చింది అంటే .. కారణాల్ని .. ఆ పార్టీ నాయకత్వం ఆత్మవలోకనం చేసుకోవాలి .
ఇక్కడ అదే అతి .
ప్రతి పక్షం వుండకూడదు .. అని నాయకుల్ని టార్గెట్ చేసుకొన్న ఫలితమే .. రేవంత్ రెడ్డి .. పశ్చిమ బెంగాల్ లో మమతా లాగా ఇక్కడ రేవంత్ . లేకుంటే భట్టి { మా మిత్రుడు బట్టి మామ } లాంటి వారు సీఎం అయ్యేవారు .
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ రెండూ డీ అంటే డీ అనే స్థితిలో వున్నాయి . చెరి ఎనిమిది అంటున్నారు . బీజేపీ కి ఒకటి ఎక్కువ వచ్చినా ఆశ్చర్య పోనక్కర లేదు .
ఇదే జరిగితే ఆగష్టు నెలలో తెలంగాణాలో మహారాష్ట్ర తరహా మార్పు అని ఊహా గానం వినిపిస్తోంది . ఖమ్మం కు చెందిన నాయకుడు ముప్పై మంది తో బీజేపీ, భారత రాష్ట్ర సమితి సాయం తో ముఖ్య మంత్రి అవుతారు అనేది ఊహాగానం .
ఇలా జరగాలంటే బీజేపీ 350 సెట్ల తో కేంద్రం లో అధికారం లోకి రావాలి. ఇప్పుడున్న అంచనా బట్టి బీజేపీ 250 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం . ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి అంటే చిన్న చితక పార్టీ ల సాయం తీసుకోవాల్సి రావొచ్చు . ఎన్నో ఏళ్లుగా తనకు మిత్ర పక్షాలుగా ఉన్న శివ సేన .. అకాళీ దళ్ లాంటి పార్టీ ల లను దూరం చేసుకోవడం వల్లే ఇది జరిగింది అని అప్పటికి ఆ నాయకత్వం ఆత్మావలోకనంలో పడి పొయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు గతం లో తాను పాటించిన స్పీడ్ విధానాలను బీజేపీ పాటించక పోవచ్చు . ప్రతి పక్ష పార్టీ ల పట్ల తాను పాటిస్తున్న విధానాల వల్లే అవి ఏకమయ్యాయి అని అవగాహహన వారికి వచ్చే అవకాశం ఉంది .
ఒక వేళా రేవంత్ ప్రభుత్వాన్ని నెలలలు నిండకుండా కూలదోస్తే .. అతని నోట్లో పాలు పోసినట్టు అవుతుంది . ఎంతో మంది నాయకుల ఉన్న తెలంగాణ లో రేవంత్ కి అవకాశం వచ్చింది అంటే అది చర్లపల్లి ఘటన మహత్యం . ఇప్పుడు అయిదారు నెలలకే కూల దోస్తే .. ఆయన మరింత బలపడే అవకాశముంది .రాజకీయాల్లో నేడు ముఖ్యమే .. కానీ రేపు కూడా ఉంటుంది ఉంటుంది అని మరిస్తే ఎలా ?
ఇక ఆంధ్ర ప్రదేశ్ సంగతి .
గిరి గీసి నట్టు విభజన . ప్రతి ఒక్కరికి వారి నాయకుడు హీరో . అవతలి నాయకుడు విలన్ . తమ పార్టీ గెలుస్తుందని ఇరు పక్షాలు బలంగా నమ్ముతున్నాయి .
ఆంధ్ర ప్రదేశ్ లో కులం .. మతం బలమయిన పాత్ర పోషిస్తాయి .
అధికారం లో ఉన్న పార్టీ సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కొంత శాతం ఓట్లను కోల్పోతుంది . ఉద్యోగులు .. నిరుద్యోగులు .
అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు అదనపు ఓట్లు తెస్తుందని పాలక పార్టీ నమ్మకం
గత ఎన్నికల్లో బలమయిన విజయం సాధించిన పార్టీ కి వచ్చింది ఎంత శాతం ఓట్లు ?
ప్రధాన ప్రతిపక్ష పార్టీ కి ఎన్ని శాతం ఓట్లు ?
సంక్షేమ కార్యక్రమాల మూలంగా పెరిగిన ఓట్లు ఎన్ని ?
ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా పోయిన ఓట్లెన్ని ?
లెక్క వేసుకొంటే కాస్త అటుఇటుగా అదే వస్తుంది .
మరి తేడా ?
అప్పుడు వైరి శిభిరం చెల్లాచెదురు .
ఇప్పుడు?
ఏకం!
పవన్ కళ్యాణ్ .. ఎప్పటికైనా సీఎం కావాలి అని ఆలోచన వున్న నాయకుడు .
మామూలుగా ఉంటే .. ఒక వేళా టీడీపీ తో పొత్తు పెట్టుకున్నా అరవై డెబ్భై సీట్స్ అడిగివుండేవాడు . పొత్తు కుదిరుండేది కాదు .
ఏది ఏమైనా ప్రభుత్వాన్ని ఓడించాలి అనే స్థాయికి పవన్ ను నెట్టింది ఎవరు ? ఆయన లో అంత కసి పెరగడానికి కారణం ఎవరు ??
ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెడితే .. న్యూట్రల్ ఓటర్లలో సింపతీ పెరగదా ?
మొదటి దశ లో మోడీ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించలేదు . రెండో దశ ప్రచారం లో తీవ్ర విమర్శ లు చేసాడు . ఇంతలా బంధాన్ని కుదిర్చింది ఎవరు ? పవన్ కాదా ?
బీజేపీ కి టౌన్స్ లో స్థిరపడిన నార్త్ ఇండియన్ ఓటర్ ల వోట్ బ్యాంకు ఉంది . ఇంకా సాంప్రదాయక ఓటు బ్యాంకు .
ఏడు . ప్లస్ మూడు .. మొత్తం పది శాతం ఓట్లు కలిస్తే ఎన్ని సీట్ల ఫలితాలు తారుమారవుతాయి ?
పవన్ కళ్యాణ్ లో కసి రగిలించింది .. ప్రతిపక్ష కూటమి మధ్య ఐక్యత సాధించింది ఎవరు ? దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ? వేచి చూడండి .
ఇక్కడ పోస్ట్ చేసింది .. నా అభిమతం కాదు . కేవలం విశ్లేషణ . దీని తో మీరు విభేదించవచ్చు . ఇక్కడ మీ మీ కామెంట్స్ ను పోస్ట్ చెయ్యండి . ప్రజాస్వామ్యం అంటే భిన్న అభిప్రాయాలు. మన అభిప్రాయం తో విభేదించేవాడు మన శత్రు కాదు .
మన అభిప్రాయం తో విభేదించేవాడు మన శత్రువు అనుకొని... వ్యక్తిగత విమర్శలు చేస్తే ? ఇదే ఈ ఎన్నికలు నేర్పబోతున్న పెద్ద గుణ పాఠం .

ు !

మహా నటులు !

మనసులోని భావాలు, మొఖంపై కనిపిస్తాయి .
బాడీ లంగ్యేజ్ అంటే శరీర భాష !
మొఖమే కాకుండా చేతులు, కాళ్ళు లాంటి శరీర భాగాల కదలిక కూడా మనోభావాలను ప్రతిబింబిస్తాయి
ముఖాన్ని... శరీర భాషను.. చూసి వ్యక్తి ఆలోచనల్ని చెప్పెయ్యొచ్చు .
ఇంటర్వ్యూ లో నేను ప్రధానంగా ఈ టెక్నిక్ వాడుతాను. అలాగే సమస్యాత్మక విద్యార్థుల్ని కౌన్సిలింగ్ కోసం తల్లితండ్రులు తీసుకొని వచ్చినప్పుడు కూడా వారి మనోగతాన్ని ఇదే పద్ధతిలో అంచనా వేస్తాను .{ ఇంతకంటే కచ్చితంగా అంచనా వేయడానికి కొన్ని టెస్ట్స్ వున్నాయి . సమయం పడుతుంది }
ఎన్నికలు జరుగుతున్నాయి . నాయకులకు తమ పార్టీ , ప్రత్యర్థి పార్టీ ల గెలుపు అవకాశాల గురించి అంచనా వుంటుంది . తమ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుంది.. లేదా పోటీ తీవ్రంగా ఉంటుంది అని తెలిసినప్పుడు ఆ నాయకుడి బాడీ లాంగ్యేజ్ లో అది కనబడుతుందా ?
గత కొన్ని వారాలుగా ఒక సవాలుగా తీసుకొని నాయకుల సైకాలజీ స్టడీ చేశాను .
మన దేశంలో.. కులం .. మతం ఎన్నికల్ని ప్రధానంగా ప్రభావితం చేస్తాయి .
ఒక్కో పార్టీ కి ఓటు బ్యాంకు ఉంటుంది . ఆరు.. అరవై వేలయినా వీరు తమ అభిమాన పార్టీ కే ఓటు వేస్తారు .
నిజానికి ఫలితాన్ని నిర్ణయించేది న్యూట్రల్ ఓటర్లు. వీరు ఎటు వైపు మొగ్గితే ఫలితం అటు వైపు ఉంటుంది .
ఉదాహరణకు 2014 లో చంద్ర బాబు .. 2019 లో జగన్ గెలవడానికి ఈ న్యూట్రల్ ఓటర్ల మొగ్గే కారణం .
ఏ ఎన్నికయినా జరిగేది ఇదే .
ఈ న్యూట్రల్ ఓటర్లు చాల మంది సైలెంట్ గా వుంటారు .
అభిమాన ఓటర్లు { అంటే ఓటు బ్యాంకు వారు } సోషల్ మీడియా పై తమ పార్టీ తప్పక గెలుస్తుంది .. అవతల పార్టీ ఓడిపోతుంది అని పోస్ట్స్ పెడుతుంటారు. అలాగే మీడియా మైకుల పై మాట్లాడుతారు .
వీరికి బిన్నంగా న్యూట్రల్ ఓటర్ ల మనోగతం అంత సులభంగా బయటపడదు.
కొన్ని నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన విజయం ఖాయమని అప్పటి రూలింగ్ పార్టీ అంచనాకొచ్చింది . అసలు ఫలితం బిన్నంగా వచ్చిందని అందరికీ తెలుసు . న్యూట్రల్ ఓటర్ ల మనోగతం పట్టుకోలేక పోవడమే దీనికి కారణం .
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో .. అలాగే దేశ పార్లమెంట్ కు జరుగుతున్న ఎన్నికల్లో న్యూట్రల్ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారు ?
ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని అనేక అనేక మంది తో మాట్లాడి.. ఒక అంచనాకొచ్చాను .
అంటే ఎన్నికల ఫలితాలను రెండు రకాలుగా అంచనా వేసాను . ఒకటి నాయకుల సైకలాజికల్ స్టడీ .
రెండోది ఒపీనియన్ పోల్ లాంటిది .
సర్వే{లాంటిది } చేసి వచ్చిన అంచనా కు .. నాయకుల బాడీ లంగ్యేజ్.. మాటలు ఆధారంగా చేసిన సైకలాజికల్ స్టడీ ద్వారా వచ్చిన అంచనాకు మధ్య కొట్టొచ్చిన సంభంధం కనిపించింది .
అమ్మ ! మహా నటులూ !
మన నాయకులు మహా నటులు . మనసులోని భావాలను బయటకు కనబడనివ్వరు . సాధారణ వ్యక్తిని అంచనా వేసినట్టు వీరిని అంత సులభంగా అంచనా వేయలేము . అందుకే సవాలుగా తీసుకొని అధ్యయనం చేశాను . వీరు తమ మనసులోని భావాలూ బయటపడకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా నిశితంగా అధ్యయనం చేస్తే బయటపడిపోతోంది . ఎన్నికల్లో న్యూట్రల్ ఓటర్ల మొగ్గు అనే కోణం లో చూస్తే .. నాయకుల మాటలు నటన ఆంతర్యం క్రిస్టల్ క్లియర్ !
ఇంతకీ గెలుపు ఎవరిదీ అనేగా మీ ప్రశ్న ?
రెండు రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని నా అంచనా రాయడం ఎంతో కొంత { కనీసం పది ఇరవై ఓట్లు } ప్రభావితం చేసినట్టు అవుతుంది . అది నాకు నేను విధించుకున్న నైతిక నియమావళికి విరుద్ధం .
పోలింగ్ ముగిసాక అంటే సోమవారం సాయంకాలం పోస్ట్ చేద్దాము అనుకొన్నాను .
తెలంగాణ ఎన్నికల అంచనాలైతే ఓకే .
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనా నాలుగు నెలల క్రితం పోస్ట్ చెయ్యడం . అది వాస్తవానికి ఎంత దగ్గరగా ఉందొ మీకందరికీ తెలిసిందే .
మీరు పెద్దగా దృష్టి పెట్టని అంశం ఒకటుంది . పోలింగ్ ముగిసాక నేను పెట్టిన విశ్లేషణలో ఒక పార్టీ ఓడిపోతుంది .. అని మొదలెట్టి .. రే.. వంతు .. అని ముగించాను . అంటే తెలంగాణకు ఎవరు ముఖ్య మంత్రి కాబోతారో పోలింగ్ ముగిసిన అయిదు నిముషాల్లో చెప్పేసాను .
రాజకీయాల్లో పలు పార్టీల అభిమానులు ఉంటారు. తమ పార్టీ ఓడిపోతుంది అంటే ఎవరికైనా మనసు చివుక్కు మంటుంది . ఆలా చెప్పిన వ్యక్తి పై కోపం వస్తుంది .
తెలంగాణ ఎన్నికల విశ్లేషణ... నేను పోస్ట్ చేసినప్పుడు... ఒక్కరంటే ఒక్కరు .. నా పై పరుషంగా మాట్లాడలేదు . అది తెలంగాణ ప్రజల పరిణతి .. సంస్కారం .
నేను ఈ పోస్ట్ లో గానీ .. పోనీ పోలింగ్ ముగిసాక అంటే సోమవారం .. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఇదిగో నా విశ్లేషణ ప్రకారం ఫలానా పార్టీ గెలుస్తుంది అని పెట్టానే అనుకోండి .. నా బతుకు బస్సు స్టాండ్ కావడం ఖాయం !
రెండు పార్టీ లకు చెందిన వీరాభిమానులు ఉన్నారు .
ఫలానా పార్టీ గెలుస్తుంది అని పోస్ట్ చేసిన మరు క్షణం నన్ను ట్రోలింగ్ చేసేస్తారు .
కరోనా వాక్ సీన్ లు.. మొన్నటికి మొన్న ఇంకో వాక్ సీన్ .. అలాగే అమెరికా చదువులు విషయం లో"ఏదైతే అయ్యింది .. నిజం చెప్పాలి .. నష్టాన్ని నివారించాలి " అని తెగించి పోస్ట్స్ చేశాను .
దాని వల్ల ఎంతో మందికి మేలు జరిగింది .
సోమవారం రోజు నేను ఫలానా పార్టీ గెలుస్తుంది .. అందరూ అనుకున్నట్టు టైట్ ఫైట్ ఏమీ లేదు అని పోస్ట్ చేస్తే ఎవరికైనా మేలు జరుగుతుందా ?
లేదు కదా ?
మరెందుకండీ ?
దీనికి తోడు మంగళవారం బయలుదేరి ఒక దేశానికి వెళుతున్నాను . పది రోజుల ట్రిప్ . ట్రిప్ లో వుండగా నా ఫేస్బుక్ పై పిచ్చి కామెంట్స్ వస్తే కనీసం రిప్లై ఇవ్వడానికి సమయం ఉండదు . కాబట్టి ..
మీకో దండం స్వాములూ .. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల విశ్లేషణ ఇవ్వను .. ఇవ్వలేను .. నా అశక్తత ను మన్నించండి ..
తెలంగాణ లో... ఆంధ్ర ప్రదేశ్ లో... అలాగే దేశ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు విశ్లేషిస్తే నాకు ఒక సింగల్ లైన్ కాప్షన్ తోచింది .
పశ్చిమ బెంగాల్ మళ్ళీ పుట్టింది .
పశ్చిమ బెంగాల్ ఏంటి ? మళ్ళీ పుట్టడం ఏంటి ? అనుకొంటున్నారా ?
మీరు మెసెంజర్ లో అడిగినా ముక్క క్లూ కూడా ఇవ్వను . ఇవ్వలేను .
జూన్ నాలుగు ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు పై కాప్షన్ తో రాస్తాను . ఒక వేళా నా అంచనా తప్పినా సిగ్గు పడకుండా .. అదే సిగ్గు లేకుండా... నా అంచనా తప్పింది అని రాస్తాను .
ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు క్లైమాక్స్ కాదు .. క్లైమాక్స్ కు ముందు భాగం .. ఎన్నికల ఫలితాలు వచ్చాక నెమ్మదిగా అనేక పరిణామాలు జరుగుతాయి . అవి అనేకానేక మార్పులకు దారి తీస్తాయి . అంటే మీడియా కు హాట్ హాట్ రాజాకీయ మసాలా చర్చలకు మరి కొన్ని నెలలకు సరిపడా సరుకు ..
ఇప్పటికి ఈ పోస్ట్ ను అన్ని పార్టీ ల వారు తమకు అనుకూలంగా అన్వయించుకోవచ్చు . ఒక ముక్క క్లూ లేకుండా అంత నిగూఢంగా రాసాను . ఆయా పార్టీ ల అభిమానులు కింద కామెంట్స్ కాలం లో ఇది తమ పార్టీ కే అనుకూలం అని పెట్టె కామెంట్స్ కు నాకు సంభందం లేదు . కామెంట్ అసభ్యంగా లేకపోతే లైక్ చేస్తాను . ఆలా చెయ్యడమంటే సమర్థించడం కాదు . కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పడం .
మీరైతే ఎన్నికల్లో తప్పక ఓటు వెయ్యండి . అందరికీ చెప్పి వేయించండి . ఓటు వెయ్యని వారిని మీ ఫ్రెండ్షిప్ సర్కిల్ నుంచి బహిష్కరించండి . వారికి ఎటువంటి మాటసాయం కూడా చెయ్యొద్దు .
శుభోదయం .

రాకోయి ... అనుకోని అథితి!

ముక్కు మొఖం తెలియని వ్యక్తి ఇంటి తలుపు తట్టారు .
తలుపు తీయగానే " మొన్న ఫోన్ చేసింది నేనే" అని మాటల్లో పెట్టి ఇంటి లోపలి కొచ్చారు .
" మీ పిల్లలు చదివే పాఠశాల చెత్త .. మా పాఠశాల గొప్పతనం .. ఇదిగో.." అని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం మొదలు పెడుతారు .
గత అనేక ఏళ్లుగా తెలుగు వారికిది ... వేసవి కాల అనుభవం !
వేసవి సెలవులు .. కేవలం పిల్లలకే కాదు .. పాటశాల లో పని చేసే సిబ్బందికి .. ముఖ్యంగా అధ్యాపక బృందానికి కూడా .
వేతనం తో కూడిన వేసవి సెలవులు ... టీచర్ ఉద్యోగానికున్న ప్రత్యేకత .
ఇది ప్రైవేట్ మేనేజ్మెంట్ పెట్టే బిక్ష కాదు . దీనికి సంభందించి నిర్దిష్ట ప్రభుత్వ నియమాలున్నాయి .
చాలా ప్రైవేట్ పాఠశాలల్లో మిగతా నియమాలకు మల్లే ... ఇది కూడా సక్రమంగా అమలు కాదు .
వేసవి సెలవుల్లో టీచర్స్ ఇల్లిల్లూ తిరిగి అడ్మిషన్స్ తేవాలి . ఎన్ని అడ్మిషన్స్ అనేది ఆయా స్కూల్ బట్టి ఉంటుంది . ఒక్కో టీచర్ పది నుంచి పదహైదు కొత్త అడ్మషన్స్ తీసుకొని రావాలి. అప్పుడే వారికి వేసవి వేతనం . లేకుంటే ఉద్యోగం ఊడి పోతుంది .
సంవత్సరమంతా పిల్లలకు పాఠాలు చెప్పిన టీచర్స్.. వేసవి సెలవుల్లో సేద తీరాలి . రిఫ్రెష్ కావాలి .
తమ సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి .
అప్డేట్ కావాలి .
బోధనా వృత్తి కి మిగతా వాటికి ప్రాధమిక వ్యత్యాసముంటుంది .
రోజులో ఎనిమిది పీరియడ్స్ ఉందనుకొందాము . ఒక్క పీరియడ్ కూడా రెస్ట్ లేకుండా వరుసగా పాఠాలు చెబుతూ పొతే ?
టీచర్ చెప్పే పాఠం లో జీవం లోపిస్తుంది . పాఠం యాంత్రికంగా మారిపోతుంది . అప్పుడు నష్టపొయ్యేది విద్యార్థులే .
అదే విధంగా దసరా... సంక్రాంతి... వేసవి ... సెలవులు కూడా టీచర్స్ కు దొరికే బ్రేక్ . టీచింగ్ అంటే సృజన తో కూడిన వ్యవహారం . క్లాసులో ప్రతి విద్యార్థిని గమనిస్తూ అందరికీ అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలి .దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఎప్పటినుంచో వేసవి ఇంకా ఇతరత్రా సెలవులు .. ప్రతి రోజు .. ఒకటి రెండు పీరియడ్స్ బ్రేక్... అనే విధానాన్ని అమలు చేస్తున్నారు .
కార్పొరేట్ స్కూల్స్ అంటేనే దోపిడీ .. పెట్టిందే లాభాల కోసం . కావలసినంత రక్తం తాగక జలగ వదిలేస్తుంది . కానీ కార్పొరేట్ యాజమాన్యాల ధన దాహం తీరనిది .
తల్లి తండ్రుల .. పిల్లల .. అలాగే తమ ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టయినా లాభాలు సంపాదించాలి . అందుకే టీచర్స్ కు రోజులో పెద్దగా బ్రేక్స్ ఇవ్వరు . ఎనిమిదికి ఎనిమిది పీరియడ్స్ పాఠాలు చెప్పాల్సిందే . తక్కువ టీచర్స్ తో లాగించేసి శాలరీ బిల్లు తగ్గించుకోవచ్చు .
ప్రతి సంవత్సరం మార్చ్ నుండి మే .. జూన్ దాక టీవీ చానెల్స్ లో .. పత్రికల్లో "ఒకటి... ఒకటి... ఒకటి .. రెండు" అంటూ ప్రకటనలు హోరెత్తిస్తుంటారు .
కాసేపు ప్రకటనల్లో వారు చెప్పే ఫలితాలు బోగస్ కాదు .. నిజం అనుకొందాము . ఇంత గొప్ప ఫలితాలు వారి సంస్థలకు నిజంగానే వస్తుంటే .. వారి పాటశాలలో సీట్స్ కు విపరీతమయిన డిమాండ్ వుండాలి . తమ పాఠశాల వద్దకు అడ్మిషన్స్ కోసం వచ్చిన వారిని కంట్రోల్ చేయలేక వారు తంటాలు పడాలి .. కదా ?
ఆలా కాకుండా ప్రతి టీచర్ కు ఇన్ని అడ్మిషన్స్ అని .. చివరికి .. పాపం .. స్కూల్ వాన్ డ్రైవర్స్ .. లాంటి స్టాఫ్ కు కూడా అడ్మిషన్స్ టార్గెట్స్ ఇచ్చి వేసవి సెలవుల్లో సేల్స్ బాయ్స్ గా... సేల్స్ గర్ల్స్ గా మార్చి... ఇల్లిల్లు ఎందుకు తిప్పుతున్నారు ? ఆలోచించండి .
వారిది బతుకు ఆరాటం .
అడ్మిషన్స్ పూర్తి చేయకపోతే వేసవి నెలల జీతం రాదు . అంతేనా ? జూన్ నెల లో ఉద్యోగం ఊడిపోతుంది . అందుకే పాపం .. కార్పొరేట్ పాఠశాలల అధ్యాపకులు .. బిక్కు బిక్కుమంటూ వేసవి ఎండల్లో ఎక్కు గడప... దిగు గడప ... అని గడుపుతారు .
వారు మీ ఇంటి తలుపు తట్టే ముందే .. అంటే ఒకటి రెండు రోజులు ముందు మీకు ఫోన్ చేస్తారు . మేము ఫలానా కార్పొరేట్ పాఠశాల నుంచి మాట్లాడుతున్నాము . మీ పిల్లల చదువు గురించి మీతో మాట్లాడాలి . మీరు అనుమతిస్తే మీ ఇంటికి వస్తాము అంటారు .
మనకేమో .. అసలే మొగమాటం . వారు బతిమాలాడుతుంటే .. కాదన లేము .
మీ నెంబర్ .. ఇంటి అడ్రెస్స్ లాంటి వివరాలు వారికి ఎలా వెళ్ళింది ?
ఇదే మాట వారిని అడగండి . మీ పిల్లలు చదువుతున్న పాఠశాల వారే ఇచ్చారు అంటారు .
ఏమండీ .. అబద్దం చెప్పినా అతికినట్టుండాలి . అంత అబద్దాన్ని నమ్మడానికి మనకైనా బుద్ధి వుండాలిగా ?
అంటే ఏంటట ? ప్రైవేట్ స్కూల్స్ వారు .." అయ్యా .. ఇదిగో మా పిల్లల ఇంటి అడ్రెస్స్ లు.. వారి తల్లితండ్రుల ఫోన్ నంబర్స్ .. మీరు మీ టీచర్స్ ను పంపి మా పాఠశాల చెత్త .. మీ పాటశాల గొప్ప అని కబుర్లు చెప్పి .. వారిని మా స్కూల్ నుండి టీసీ తీసుకొని వెళ్లిపోయేలా చెయ్యండి " .. అని కార్పొరేట్ పాటశాలలకు మొత్తం డేటా ఇచ్చేస్తారన్న మాట !
చెప్పెడి వారు చెప్పినన్ వినెడువారికి కుసింతయినా దిమాక్ ఉండొద్దరా భాయ్ ?
ఇంత వెర్రి బాగులోళ్ళు కాబట్టే .." లావు తగ్గాలంటే ఈ డబ్బా లో వాటిని తినండి... అంటే నమ్మి .. కొని... తిని కిడ్నీ లు పాడుచేసుకొని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు .. లక్షలాది మంది మొగమాటస్తులు .
జరిగేది ఏమిటంటే .. ఆధార్ .. అమ్మ ఒడి లాంటి వివిధ పథకాలకు సంభందించి, ప్రైవేట్ పాఠశాలలు డేటా ను అప్లోడ్ చెయ్యాలి . ప్రభుత్వ శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులకు లంచాలిచ్చి కార్పొరేట్ యాజమాన్యాలు ఈ డేటా కొట్టేస్తాయి .
ఎన్నో ఏళ్లుగా బహిరంగంగా జరుగుతున్న డేటా చౌర్యం .
అడిగేవాడు లేడు.
ఈ డేటా ను తమ ఉద్యోగులకిచ్చి టార్గెట్స్ ఫిక్స్ చేస్తారు .
ఫోన్ చేసినప్పుడే .. కాల్ కట్ చేసి... నెంబర్ బ్లాక్ చేస్తే .. పీడా వదిలి పోతుంది . కానీ మనకు మొగమాటం . సరే చివరకు ఇంటి దాక తెచ్చుకొన్నాము.
ఏదో చిన్నా చితక జీవితాలు . వారి పై చిరాకు పడకండి .
ఎండలో పడి వచ్చిన వారికి మజ్జిగ / ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి . వాళ్ళు టీచర్స్ . గౌరవించండి .
కానీ ..
ఇంటి కొచ్చిన వ్యక్తికి మర్యాద చెయ్యడం ఓకే .
మొగమాట పడితే ?
ముందుగా వారు తమ పాటశాలలో ఇంతేసి ఫలితాలు వచ్చాయి . అదే మీ పిల్లలు చదువుతున్న పాటశాల లో ఐఐటీ మెడిసిన్ లాంటి పరీక్షల్లో ఫలితాలు బాగుండవు . మీ పిల్లల్ని అక్కడే ఉంచేస్తే .. లైఫ్ పాడై పోతుంది అని మీ బ్రెయిన్ వాష్ చెయ్యడం మొదలు పెడుతారు . మీ ఇంటికి వచ్చే ముందే .. ఎలా బ్రెయిన్ వాష్ చెయ్యాలో వారికి కార్పొరేట్ యాజమాన్యం ట్రైనింగ్ ఇచ్చింది అని గ్రహించండి .
"మీ స్కూల్ లో అన్నేసి ఫలితాలు వస్తే .. మీరు ఇలా... ఇల్లిల్లు తిరిగి అడ్మిషన్స్ ఎందుకు అడుక్కొంటున్నారు ? ?" ఇదీ మీరు అడగాల్సిన మొదటి ప్రశ్న .
" టీచర్ అంటే గౌరవ ప్రధమయిన వృత్తి . ఇలా సేల్స్ పర్సన్ గా మిమ్మల్ని మీ యజమాన్యం మార్చేసింది. గుండె పై చెయ్యి వేసుకొని చెప్పండి . ఇలా ఇల్లిల్లు తిరగడం .. అడ్మిషన్స్ కోసం పదేపదే ఫోన్ చెయ్యడం... అవమాన కరంగా లేదా ? టీచర్స్... పాఠాలు చెప్పాలి . ఆలా జరిగితే... పాఠశాల ముందు అడ్మిషన్స్ కోసం పెద్ద క్యూ ఉంటుంది ..... సీట్స్ దొరకవు . మరి ఇలా మార్కెటింగ్ ఏంటి ?" అని అడగండి .
"ప్రభుత్వ నియమాల ప్రకారం .. విద్య సంస్థల్ని నో లాస్ .. నో ప్రాఫిట్ బేసిస్ లో నడపాలి . అంటే ... సంవత్సరానికి జీతాలు .. అద్దెలు లాంటి వాటి కోసం ఎంత ఖర్చు అవుతుందో .. అంతే వసూలు చెయ్యాలి . మీరు యాభై శాతం... డెబ్భై శాతం... ఫీజు రాయితీ అంటున్నారు . అంటే ఎవరిని కొట్టి ఎవరికి పెడుతున్నారు . డెబ్భై వేలు ఉండాల్సిన ఫీజు ను రెండు లక్షలు చేసి అందులో ముప్పై లేదా యాభై శాతం తగ్గించడం గొప్పా? ఇది అడ్మిషన్స్ కోసం వేసే గాలం కాదా??" అని అడగండి .
మీ ఇంటికి వచ్చిన టీచర్స్ ఏ క్లాసుకు . ఏ సబ్జెక్టు... పాఠం చెబుతారో అడగండి . వారిని ఇంగ్లీష్ లో మాట్లాడమనండి . ఇంగ్లీష్ మీడియం పాఠశాల అంటే ఇంగ్లీష్ లో తప్పులు లేకుండా మాటాడాలి గా ? మీకు ఆంగ్లం సరిగా రాకపోతే... మీ స్నేహితుల సాయం తీసుకోండి . నూటికి తొంబై శాతం కార్పొరేట్ టీచర్స్ .. ఒక్క వాక్యం కూడా తప్పులు లేకుండా ఆంగ్లలో మాట్లాడలేరు... అని మీకు అర్థమయిపోతుంది .
మీ ఇంట్లో పిల్లలకు పది నిముషాలు పాఠం చెప్పమనండి . పాఠం అర్థమయ్యిందా? అని అడగండి . ఆగండాగండి . టాపిక్ మీరు ఎంచుకోవాలి . లేకపోతే ఒక టాపిక్ పై వారు ముందుగానే బట్టీ కొట్టి వచ్చేసివుంటారు .
మీకు అకాడెమిక్స్ తో పరిచయం ఉంటే .. వారి సబ్జెక్టు కు సంభందించిన విషయాలను అడగండి . బట్టీ పద్దతిలో సమాధానం వస్తుంది . ప్రశ్న ను కాస్త తిప్పి... విశ్లేషణాత్మకంగా అడగండి ." బెబ్బెబే" అంటారు .
ఇదండీ సంగతి . ఇంతన్నాడు ..అంతన్నాడు.. గంగరాజు .. తమ స్కూల్ గొప్పది .. మీ పిల్లలు చదివే స్కూల్ దిబ్బ అన్నాడు కదా ? ఇప్పుడు ఆ టీచర్... కమ్యూనికేషన్ స్కిల్స్ ... సబ్జెక్టు డెప్త్ .. టీచింగ్ మెథడాలజీ.. మీరే చూసారు .
ఇలాంటి టీచర్స్ తో కార్పొరేట్ పాటశాల ఏమి చదువులు చెబుతుంది ? బట్టీ చదువులతో మీ పిల్లలు సాధించేది ఏందీ ? పేరెంట్స్ ను సంతృప్తి పరచేందుకు కార్పొరేట్ పాఠశాల చూచి రాతలు .. అతి ఉదారంగా మార్కులు ఇచ్చేస్తే .. మోస పొయ్యేది ఎవరు ? ఇలాంటి పాఠశాల లో మీ పిల్లల్ని చేర్చుతారా ? మొగమాటానికి పోయి మీ పిల్లల భవిషత్తు తో ఆడుకొంటారా?
ఆలోచించండి .
స్పాం కాల్ వచ్చినప్పుడే బ్లాక్ చేస్తే పొయ్యేదానికి ఇంటి దాక తెచ్చుకొన్నారు .
పాపం .. ప్రైవేట్ బడి పంతులు . ఏదైనా స్నాక్ ఇచ్చి .." అయ్యా .. పాఠం నేర్చుకోండి . కమ్యూనికేషన్స్ స్కిల్స్ మెరుగుపరుచుకోండి . టీచర్ ని.. టీచర్ గా గౌరవించే పాఠశాలలో చేరండి . ఇలా ఇల్లిల్లు తిరిగి గురువుల గౌరవాన్ని .. మీ ఆత్మభిమాన్నాన్ని పణంగా పెట్టకండి .." అని చెప్పి గౌరవ ప్రదంగా సాగనంపండి .
అందరిలో .. అవగాహన పెంచడానికి ఈ మెసేజ్ ని బంధువులతో మిత్రులతో షేర్ చేసుకోండి . ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చెయ్యండి .
కాలక్షేపపు కబుర్లు కాదు . పిల్లల జీవితాల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి .
Most of the private schools force the teachers/employees to get admissions, targets are fixed, this is more prevalent during the summer months of April and May.
Failing to bring admissions results in the teachers not being paid their summer salaries.
We can't blame these poor souls because it is their bread and butter!
Most of the private schools force the teachers/employees to get admissions, targets are fixed, this is more prevalent during the summer months of April and May.

అభినందనలు దీపిక (మా పాఠశాల విద్యార్థిని కాకపోయినా...)

Congratulations Deepika ( Not our school student but .. )
Congratulations Deepika ( Not our school student but .. )
1. దశావతారాలు లేదంటే నవగ్రహాలు.
2. సప్తపది లేదంటే షడ్రుచులు.
నేను వచ్చే సోమవారం లోపు రాసే కథల పేర్లు.
1. తెలియక ఒక కోయిల ముందే కూసింది .. చిందులు వేసింది ..
2 . ఉన్నది కాస్తా ఊడింది .. సర్వ మంగళం అయ్యింది .
౩. కలిసివుంటే కలదు సుఖము .. కలిసి వచ్చిన అదృష్టము
యూట్యూబ్ పై ఇప్పుడు నేను వింటున్న పాటలు
IIT

అర్థమయ్యేలా టీచర్స్ పాఠం చెప్పేవారు .

కష్టపడి కాకుండా పిల్లలు ఇష్టపడి చెదివే వారు .
ఆ అమ్మాయికి ఏడో తరగతి లో కూడా మంచి మార్కులొచ్చాయి .
" ఇంత తేలితేటలున్న అమ్మాయి ని ఈ స్కూల్ చదివిస్తున్నావేంటి ? ఇక్కడ చదివితే ఐఐటీ వస్తుందా ? కనీసం ఎనిమిదో తరగతి నుంచి ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ అందేలా చూడు " తల్లికి పక్కింటి వారి హిత బోధ.
స్కాలర్షిప్ టెస్ట్ లంటూ పత్రికా ప్రకటనల్లో హోరెత్తించే ఉత్తర భారత దేశానికి చెందిన ఐఐటీ కోచింగ్ షాపు.. దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లో .. కూతుర్ని ఎనిమిదిలో చేర్పించింది .
" ఏడు దాకా బాగా చదివేది . ఇప్పుడు ఇంటికి రావడం తోటే సెల్ ఫోన్ . ఎంత చెప్పినా వినదు. మా బంధువు మీ గురించి ఫేస్బుక్ ద్వారా తెలుసుకొన్నారు . దయ చేసి మా అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వండి సార్ " . నాతో ఆ తల్లి ..
ఇంటికొచ్చాక రోజుకు మూడు నాలుగు గంటలు ఇంస్టాగ్రామ్ ద్వారా తన స్కూల్ స్నేహితులతో చాట్ చేస్తోంది . తన క్లాసులో అందరూ ఇదే చేస్తారు . ఐఐటీ ఫౌండేషన్ పేరుతొ పెద్ద తరగతుల పాఠాలను టీచర్స్ చెప్పిపోతుంటారు . అవి అర్థం కావు . బట్టీ కొట్టాలి . మార్కులు తక్కువొస్తే సెక్షన్స్ మార్చేస్తారు . అక్కడ పరిస్థితి మరింత దారుణం క్రీడలు .. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాంటి క్లాసులు పేరుకే ఉంటాయి . చదువంటే విరక్తి పుడుతోంది . ఇంటికొచ్చాక స్నేహితులతో చాట్ చేస్తే కాస్త రిలీఫ్ . .. ఇవీ ఎనిమిదో తరగతి అమ్మాయి నుండి నేను గ్రహించిన విషయాలు .
తల్లి కూతురు తో స్నేహితురాలిగా వ్యవహరిస్తోంది .
కూతురు ఇంస్టాగ్రామ్ అకౌంట్ పాస్ వర్డ్ తెలుసు .
అమ్మాయి ఇంకా పూర్తిగా గతి తప్ప లేదు . చెడు సావాసాలు ఇంకా మొదలెట్టలేదు . మొబైల్ అడిక్షన్ మొదటి దశలో వుంది .
సుమారుగా అరగంట కౌన్సిలింగ్ చేసి యెన్ ఎల్ పీ ఇచ్చాను .
తండ్రి అమీర్పేట్ లో ఒక కోచింగ్ సెంటర్ నడుపుతాడు . పెద్దబ్బాయి పదో తరగతి . రెండో వాడు ఎనిమిది . ఇద్దరూ ఎస్ ఆర్ నగర్ లోని తెలుగు ఐఐటీ కోచింగ్ షాప్ లో చదువుతారు .
మొబైల్ కి పూర్తి స్థాయి బానిసలు. వద్దంటే తిరగబడుతారు . కోపం.. అసహనం .. చిరాకు . తండ్రి అని కూడా చూడకుండా నోటికేది వస్తే అది మాటలాడుతారు .
"స్కూల్ వారిని కలవలేదా?" అడిగాను .
" అయ్యో .. ఎన్నో సార్లు సార్ .. "అది మీ ఇంట్లో జరిగే వ్యవహారం . మాకేంటి సంబంధం? మీరు చూసుకోవాలి" అని ఛీత్కారంగా మాట్లాడారు సార్ ..నేను విద్య రంగంలో ఉన్నాను. కానీ పిల్లల విషయం లో దారుణమయిన తప్పు చేశాను . ఎలాగైనా సాయం చేయండి సార్ "
"ఆ స్కూల్ చదివే మిగతా పిల్లల సంగతేంటి? " .
" అమ్మాయిల సంగతి నాకు తెలియదు సార్ . వీళ్ళ క్లాసులో అబ్బాయిలందరికీ అకౌంట్స్ వున్నాయి . స్కూల్ నుండి రాగానే వాట్సాప్ గ్రూప్స్ ద్వారా గేమ్స్ ఆడుతారు . ఎంత సేపు ఫోన్ వదలరు "
"మీ పిల్లలిద్దరూ మొబైల్ అడిక్షన్ రెండో దశలో వున్నారు . వారిపై ఇప్పుడు కౌన్సిలింగ్ పనిచేసే అవకాశం తక్కువ . మానసిక వైద్యుడి ద్వారా మందులు ఇవ్వాలి . వాటికి సవాలక్ష సైడ్ ఎఫెక్ట్స్ . ఈ పద్దతి వద్దనుకొంటే సెల్ ఫోన్ అనుమతించని రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్పించండి . లేకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. మూడో దశకు వెళ్ళితే .. హింస కు దిగుతారు . అప్పుడు ఘోరాలు జరిగిపోతాయి " చెప్పాను.
చిన్న బాల శిక్ష .. పెద్ద బాల శిక్ష !
ఒక పక్క ఐఐటీ కోచింగ్ షాపులు .
బట్టీ చదువులు .
ఎనిమిదో తరగతి లో ఇంటర్ పాఠాలు .
పాఠాలు చెప్పేవారికి... చెప్పించే వారికి సంవత్సరం తిండి ఒకే రోజు తినిపించాలి . అప్పుడు తెలిసొస్తుంది . అది చేసేవాడు లేదు కనుకే .. విచ్చలవిడి తనం .
చెప్పేవారికే పాఠాలు అర్థం కావు .క్లాసులో పాఠం వల్లే వేస్తారు . అర్థం కానీ పాఠాన్ని పదేపదే చదవాలి . పరీక్షలో రాయాలి . మార్కులు తేవాలి . ఇది పెద్ద బాలలకు నేడు ఐఐటీ షాప్స్ విధిస్తున్న శిక్ష .
పిల్లలకు చదువంటే ఆసక్తి చచ్చింది .
ఎక్కడో రాజస్థాన్ కోట లో ఫ్యాన్ కు వేలాడకుండా మిగిలిన కొంత మంది ర్యాంకర్ లను కొనుగోలు చేసి... కోట్లు వెచ్చించి ... ప్రకటనలతో తల్లితండ్రుల బ్రెయిన్ వాష్ చేసే ఐఐటీ ఫౌండేషన్ దుకాణ యజమానులు... తమ ఆటలు ఎక్కువ కాలం సాగవని గ్రహించారు . తమ దుకాణాలను విదేశీ వెంచర్ కాపిటలిస్ట్ లకు అమ్మి... వేల కోట్లు కొట్టేసారు.
వంతెన పైనుంచి కింద నీటిలోని తన ప్రతిబింబాన్ని చూసి మరో కుక్క అనుకొని అత్యాశకు పోయి... మొరిగి... నోటిలో ఉన్న మాంసం ముక్క ను... నది పాలు చేసిన శునకం కథను... చదవని నేటి తెలుగు తల్లితండ్రులు మాత్రం ఇంకా ఐఐటీ ఆశల ఊయలలో ..
ఇద్దరిలో ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ కు ఉద్యోగం రాకపోయినా... వచ్చిన వారి జీతం నెలకు యాభై వేలు దాటాక పోయినా... తెలుగు వారికి పట్టిన ఐఐటీ పిచ్చి ఇప్పట్లో వదలదు . అది తెలుగు పేరెంట్స్ కంజెనిటల్ డిసార్డర్ .
ఐఐటీ ఫౌండేషన్ అంటే కాన్సెప్ట్ ను అర్థం చేసుకొని విశ్లేషణ... అనుప్రయుక్తం అనే పద్దతిలో చదవాలి అని వీరికి అర్థం కావడానికి జీవిత కాలం సరిపోదు .
చిన్న బాల శిక్ష :
ఇంటర్నేషనల్ స్కూల్స్ .
ఇవి ఇప్పుడు విదేశీ వెంచర్ క్యాపిటలిస్టుల చేతిలో .
అవును మరి .. లాభాలు ఎక్కడుంటే ఈ విదేశీ గద్దలు అక్కడ వాలిపోతాయి .
యునెస్కో వద్దంది.
ఇంగ్లాండ్ నెథర్లాండ్స్ ఫ్రాన్స్ లాంటి అనేక దేశాలు నిద్దుర లేచాయి .
చేతులు కాల్చుకొని .. బుద్ధి వచ్చింది దేవుడా అంటూ వారు నిషేదిస్తున్న విధానాలనే ఈ విదేశీ వెంచర్ క్యాపిటలిస్టులు ఇప్పుడుఇక్కడ మోడరన్ ట్రెండ్ పేరుతొ ఇక్కడ ప్రవేశ పెడుతున్నారు
స్కూల్ లో ఉండే ఆరేడు గంటల్లో అయిదారు గంటలు పిల్లలు డిజిటల్ బోర్డు పై వీడియో చూస్తూ గడపాల్సిందే .
పాఠం సరిగా రాని వారినైనా టీచర్స్ గా నియమించి శాలరీ బిల్లు తగ్గించుకొనే ప్లాన్ వారిది . ఆహా.. ఓహో .. మా వాడి స్కూల్ లో మొత్తం డిజిటల్ పాఠాలు .
ఇదే లేటెస్ట్... అనుకొనే బకరా మనస్తత్వం డబ్బున్న తల్లితండ్రులది .
ఐ స్ట్రైన్ .. మక్యూలర్ డీజెనెరేషన్ .. టెక్స్ట్ నెక్ .. రిపిటీటివ్ స్ట్రైన్ ఇంజురీ .. ఈ మాటల్ని పాపం ఈ కొత్త తరం తల్లితండ్రులు ఇంకా వినలేదు .
కనీసం తమ పిల్లల తో మాట్లాడాడనికి సమయం దొరకని బిజీ లైఫ్ వారిది .
ఎంత ఫీజు కడితే అంత గొప్ప స్కూల్ అని భావించే ఈ నయా తరం తల్లితండ్రులు... ఇంట్లో పిలల్లు హోమ్ వర్క్ పేరుతొ టాబ్స్ మొబైల్స్ పైన చేస్తున్న దేంటో చూడలేరు . చూసినా ఇక ఇప్పుడు పెద్దగా చేసేదేమి లేదు .
చేతులు కాల్చుకొన్నాక ఇప్పుడు పాశ్చత్య దేశాలు మేలుకొన్నాయి .
"డిజిటలిజెషన్ .. పిల్లల కోసం కాకుండా విద్యా వ్యాపారుల కోసం జరుగుతోంది" అని సాక్షాత్తూ యునెస్కో చెప్పింది .
ఇంటర్నేషనల్ స్కూల్ చదివిస్తేనే తమ స్టేటస్ నలుగురికీ తెలుస్తుందని భావించే తల్లితండ్రులు కళ్ళు తెరవడానికి ఇంకా చాలా కాలం పడుతుంది .
అప్పటికి ఈ పిల్లలు ఇన్సొమ్నియా .. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్... నోమోఫోబియా... సోషల్ ఐసోలేషన్.. హైపర్ ఆక్టివిటీ డిసార్డర్... లాంటి నోరు తిరగని రోగాల బారిన పడుంటారు .
కార్పొరేట్ వైద్య శాలలకు పండగే పండగ . అన్నట్టు ఇప్పుడు అవి కూడా విదేశీ కంపెనీ ల చేతిలో ..
తల్లితండ్రుల అతి ప్రేమ .. అజ్ఞానం .. వేల/లక్షల పసిమొగ్గల జీవితాలను తుంచేస్తోంది .
వీరిని రక్షించడానికి ఏ దేవుడైనా కొండదిగి వస్తాడా ?
విదేశీ కంపెనీ ల ధనదాహానికి మన పిల్లల జీవితాలు బలైపోకుండా వుండాలంటే .. ప్రతి తల్లి తండ్రిలో సరైన అవగాహన అవసరం .
ఈ మెసేజ్ని... మీ బంధువులతో ... మిత్రులతో షేర్ చేసుకోండి . వెయ్యి మందిలో ఒక్కరు కళ్ళు తెరిచినా ఆ పిల్లల బతుకులు భాగుపడ్డట్టే..
ఆ పుణ్యం మీకు దక్కుతుంది .
వాసిరెడ్డి అమర్నాథ్ . విద్యావేత్త .

పాఠాలు చెప్పామా ! పిల్లల్ని సరిగ్గా తయారు చేశామా ?

సమ్మర్ హాలిడేస్ లో కాస్త రెస్ట్. తిరిగి కొత్త విద్యా సంవత్సరం.
… ఇది మా షెడ్యూల్.
మా గత విద్యార్థులు అద్భుత విజయాలు సాధిస్తున్నారని తెలుసు.
దాన్ని ప్రకటించుకోవాలా ? అనుకొనే వాడిని.
అడ్మిషన్స్ రాక .. టీచర్స్ ని వేసవి సెలవుల్లో అడ్మిషన్స్ కోసం ఇంటింటా తిప్పుతున్న కార్పొరేట్ సంస్థలు “ అమర్నాథ్ సర్ మంచోడే స్లేట్ ఐదో తరగతి వరకు బాగుటుంది. కానీ పిల్లలు ఐఐటీ లో చేరాలన్నా డాక్టర్స్ కావాలన్నా మా ఫిట్టింగ్ స్కూల్ లో చేరాల్సిందే “ అని దుష్ప్రచారం మొదలెట్టారు.
దొంగ ర్యాంక్స్ ప్రకటించుకునే మీకే అంతుంటే .. ప్రతి విద్యార్ధి ఆణిముత్యం అవుతున్న మాకెంత వుండాలిరా ?
మా విద్యార్థుల అద్భుత వెలుగు చూడండి.
అన్నట్టు మీ దుకాణాల్లో పిల్లలు మొబైల్ అడిక్ట్స్ అయిపోయి ఇంటికొచ్చాక ఏమి చేస్తున్నారో .. వాళ్ళ చదువులు ఎలా చట్టబండలు అవుతున్నాయో చూడండి.
లేకపోతే రెండు మూడేళ్లకు చెప్పుకోవడానికి ఒక రాంక్ కూడా ఉండదు.
ఒక డయాగ్నొస్టిక్ సెంటర్ లో టెస్టులు చేసుకొని ఇంకో ఆసుపత్రికి పొతే ..” ఆ టెస్ట్ లు చెల్లవు “ .. తమ ఆసుపత్రిలో “ ఇంకో సారి టెస్ట్స్ చేయించుకో “ మంటారు.
మొదటి డయాగ్నొస్టిక్ సెంటర్ లో సైంటిఫిక్ గా టెస్ట్స్ చేయడం లేదా ?
లేదా ఆసుపత్రి వాడి .. డాక్టర్ .. కాసుల కక్కుర్తా?
ఎవడో ఒకడు దొంగే కదా ?
ఎవరు ?
ప్రభుత్వాలు నియంత్రణ సంస్థలు చచ్చయా ?

ఎండలు .. మండి పోతున్నాయి .. కాలి పోతున్నాయి .

తెలుగు భాషలో పదాలు చాలవు .
కనీ... వినీ... ఎరుగని స్థాయిలో ఎండలు.
మరో పక్క ఎన్నికలు .
ధర్మం నాలుగు పాదాల నడిస్తే... నెలకు మూడు వానలు .. పాడి పంటలు ! ఆయురారోగ్య ఐశ్వర్యాలు.. భోగ భాగ్యాలు !
రామ రాజ్యం!
ధర్మో రక్షతి రక్షితః
కృత యుగం లో ధర్మం నాలుగు పాదాల నడిచింది .
కలియుగం లో ఒంటి కాలు పై కుంటుతోంది అనేవారు .
ఇది పాతపడిన మాట !
ఇప్పుడు తెలుగు నాట.. ధర్మం ... వీల్ చైర్ పై నుంచి వెంటిలేటర్ మీదకు చేరుకొంది.
ఎక్కడ చూసినా అధర్మం .
ఇదే ప్రకృతి వైపరీత్యాలకు కారణం .
" దేవుడెక్కడండీ? .. దేవుడే ఉంటే ఇన్నిన్ని మోసాలు జరిగేవా ? " అని నిట్టూర్పుల్లో ఎంతో మంది.
దేవుడ్ని నమ్మని వారిని నాస్తికులు అంటారు .
అసలైన నాస్తికులు ... రాజకీయ నాయకులు.. చాల మంది మత గురువులు .. వారి అనుచరులు.
పాప భీతి చచ్చిపోయింది . ఈ రోజు బతికితే చాలు .. పేరు .. డబ్బు .. వస్తే చాలు అనుకొనే స్థితికి మత బోధకులు కూడా చేరుకొన్నారు. రాజకీయనాయలైతే పాపపు శిశువులు .
{ అన్ని మతాలూ.. అన్ని రాజకీయ పార్టీలు .. నాయకులు .. ఎన్నికల వేళ ఇదేదో రాజకీయ పోస్ట్ అనుకోని ఎవరూ భుజాలు తడుముకోవద్దు.. }
అందుకే ప్రకృతి కన్నెర్ర చేసింది . ఎండలు మండిపోతున్నాయి .
సెంటి మంటలు కాదు బ్రో .. . లాజిక్ ... . సైన్స్ ..
అడవిలో ఎర్ర చందనం చెట్లు వేలాదిగా నరికి కూడేసిన పాపము సొమ్ముతో ఒకడు ఇప్పుడు హీరో . పచ్చటి చెట్లు సైతం కాలిపోయే ఎండలో వాడికి జై కొట్టి , వాడు పొసే బీర్ తాగి .. కుళ్ళిన చికెన్ తో చేసిన బిర్యానీ తిని .. సొమ్మసిల్లి నిద్రపోయి కిడ్నీ లు పాడు చేసుకొంటున్న వారు ఎందరో .
జనాల పాపాలు... వాటితో పాటే రోగాలు... విపరీతంగా పెరిగితే వాటికి దొంగ చికిస్థలు చేసి అడ్డగోలుగా దోచేసి ... రక్తపు సొమ్ముతో మెడికల్ మాఫియా గాళ్ళు హీరోలుగా .. కరోనా పాపపు సొమ్మును వారు పంచితే దాన్ని కళ్ళకద్దుకొని తరిస్తున్న వారు ఎందరో
ఇసుక, మట్టి , రాయి { గ్రానైట్ } నీరు { బోరెవెల్ } ... భూమాత పేగులు తెంచేసి .. కూడ పెట్టిన సొమ్ముతో ఎన్నికల బరిలో నిలిచిన నిజ జీవిత విలన్ లు ఎంతో మంది .
కుల గజ్జితో... మతగజ్జితో... అన్నిటికీ మించి మితిమీరిన డబ్బు ఆశతో... వారు ఐదేళ్లకు ఒకసారి విసిరే చిల్లికాసుల కోసం .. జేజేలు కొడుతూ ... పోసింది తాగి.. ఇచ్చింది తిని... "రేపు లేదు .. నేడే జీవితానికి చివరి రోజు" అనే టైపు ఆలోచనల్లో చిద్విలాసంగా కోట్లాది మంది .
బెంగళూరు లో.. హైదరాబాద్ లో... హైప్ సృష్టించి పచ్చటి పొలాలలను ... చిట్టడవుల్ని తెగ నరికి రియల్ ఎస్టేట్ గా మార్చి చేతిలో అయిదు వందల కోట్లతో మరి కొన్ని చోట్ల మరి కొంతమంది .
స్కూల్ పిల్లలను సైతం వదిలి పెట్టక, గంజాయి ... సాగు ... పంపిణీ తో కోట్లు గడిస్తున్న పిశాచాలు రెండు రాష్టాల్లో ఎంతో మంది .
దొంగ ప్రాజెక్టులు కట్టి ఒక రూపాయకు పది రూపాయిలు దోచేసి... డబ్బు సంచులతో కొంతమంది .
భూకబ్జాలు చేసి రౌడీయిజం చేసి గడించిన పాపాలు సొమ్ముతో ఎంతో మంది
మెడికల్ మాఫియా .. ఇసుక మాఫియా .. ఎర్ర చందనం మాఫియా .. రియల్ ఎస్టేట్ మాఫియా .. కాంట్రాక్టు మాఫియా..గంజాయి మాఫియా.. సెటిల్మెంట్ మాఫియా .. వీరే కదా నేటి హీరో లు ?
తెలుగు జాతి ! గుండెపై చెయ్యి వేసుకొని సమాధానం చెప్పుకో .. కనీసం నీ అంతరాత్మ నైనా సమాధాన పరుచుకో ..
పిల్లలకు పెద్దలకు బుద్ధులు చెప్పాల్సిన గురువులే .. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు అయిదు వేలు తీసుకొన్న దౌర్భాగ్యపు తెలుగు గడ్డా!
రేపు లేదా ?
ఇప్పుడే ఇట్లుంటే ... రేపు .. నీ కొడుకు { ఈ మాట చదవగానే బూతు అనుకొనే స్థాయికి దిగజారిపోయిన జాతి } .. కూతురు .. మనవడు .. మనవరాలు .. ఇక్కడే .. ఈ భూమిపై బతకాలా? లేక కరోనా లాంటిది వచ్చి అందరూ పోతారు అని డిసైడ్ అయిపొయావా?
. అడవుల్ని కొట్టేస్తే .. వాగులు వంకలు కొండలు గుట్టలు నాశనం చేస్తే ఎండలు మండవా? కరువు రాదా ?
ఎవడ్రా నీకు చదువు చెప్పింది ?
పారాయణ ... ఫ్రీ చెత్తన చదువులా నీది ?
డబ్బుకోసం ఏమైనా చేయొచ్చు అని సాధారణ ప్రజానీకం తెగించేసినప్పుడు... మెడికల్ మాఫియా గాళ్ళు ల్యాబ్ లో బరోనా ను సృష్టించి... మీడియాని కొనేసి.. నిన్ను అడ్డగోలుగా భయపెట్టి పనికి రాని రెండిసివెర్ మందులు లక్షల్లో అమ్మి శవాల పై కాసులు ఏరుకోరా ?
కనీస ఇంగిత జ్ఞానం చచ్చిందా ?
నీ భవితను తగలేసిన వాడే నీకు ఇప్పుడు హీరో నా ?
సిగ్గు లేకపోతె పాయ!
మానవత్వమా ? మట్టి గడ్డలా ?
బతకడం కూడా చేతకాదా ?
పాప భీతి అంటే అదేదో దేవుడికి మతానికి సంభందించింది అనుకొంటున్నావా ?
ఆ రోజుల్లో ఎక్కువ మందికి చదువు రాదు కనుక .. అందరికీ అర్థం కావడానికి ఆలా చెప్పారు .
అడవులు అడ్డగోలు గా నరికేస్తే .. ఇసుక కోసం గ్రానైట్ కోసం భూముల్ని నాశనం చేస్తే .. రియల్ ఎస్టేట్ బూమ్ సృష్టించి లక్షలాది ఎకరాలు బీడుగా మార్చి ప్రాజెక్టుల పేర అడ్డగోలు పనులు చేస్తే .. కాల్చేసే... సన్ కాకుండా ... సన్నీ లియోన్ వస్తుందనుకొన్నావా ?
వానలు కురవక ... కరువు దరువు మోగించక ... అప్పులు చేసి పరువు పోగొట్టుకొని బజారులో నిలవక... ఎలోన్ మాస్క్ అయిపోతాననుకొన్నావా ?
వాడెవడో ఇచ్చే అయిదు వందల పాపపు సొమ్ముకు ... నీవు ఎగిరెగిరి గంతులు వేసి జిందాబాద్ లు కొడితే .. ఆ సొమ్ము తిరిగి రాబట్టుకోవడానికి .. పాలను... తిండిని... నీటిని ... గాలిని కల్తీ చేసి కాలుష్యంతో తో నింపేస్తే రోగాలు రాక భోగాలు వస్తాయా?
అధర్మో రక్షతి .. బక్షితః .
నువ్వు అధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను తినేస్తుంది .
నేడు తెలుగు నాట జరుగుతోంది ఇదే .
ఇందులో దేవుడెక్కడున్నాడయ్యా నాస్తికా?
ఇది దేవుని సిలబస్ కాక మరేంటి ఆస్తికా ?
��1. చిటికలో ఒంట్లో కొవ్వు కరిగించే మార్గం !
��2. దీన్ని రోజుకు ఒక స్పూన్ తింటే డయాబెటిస్ మాయం !
��3. ఇలా చేస్తే పిల్లలు బుద్ధిలో బృహస్పతులు అవుతారు.
��4. ఇంట్లోనుంచే కోటీశ్వరుడు కావాలా ?
��5. ఇలా చేస్తే హీరో మహేష్ బాబు అందం మీ సొంతం.
��6. కిడ్నీ ల ఆరోగ్యం చిటికలో మెరుగు పడాలంటే ?
��7. అయిదు రోజుల్లో ఆంగ్లేయుల వలె ఇంగ్లీష్ మాట్లాడాలంటే !
��8. ఆమెకు అదంటే ఎంతో ఇష్టం ! అదేంటో తెలుసుకోవాలంటే.
ఏమీ లేదండి. నేను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా! దానికోసం టైటిల్స్ సిద్ధం చేసుకొంటున్నా! ������������
India is below replacement rate too? I hadn't realized that.

https://www.eenadu.net/telug.../world/general/0800/124083483

China harasses scientist who decoded the coronavirus genome.

కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు

మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి | సాధారణ - విద్యార్థి

Triumphed over death... Shined in the 10th grade | General

“ సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉంటే మొదటి డోస్ కే తెలుస్తుంది. రెండో డోసు తరువాత ఇది చాలా అరుదు “ …

నిన్నటి దాకా అసలు” మా వాక్ సీన్ బంగారం “ అంటూ మార్కెటింగ్ చేసిన వారు ఇప్పుడు పలుకుతున్న చిలుక పలుకులు.
వాస్తవం. ������
డోసు పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది.
మొదటి డోసుకే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వారు బహుతక్కువ.
రెండో డోసు తో చాలా మందికి
బూస్టర్ డోసు తో ఇంకా ఎక్కువ.
అయిపొయింది ! వదిలేయండి.
ఇప్పటిదాకా సైడ్ ఎఫెక్ట్స్ రాకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చే అవకాశం తక్కువ. నిన్న పోస్ట్ చేసినట్టు చేయండి.
గుర్తు పెట్టుకోండి.
రాబొయ్యే రోజుల్లో దురద కు , తామరకు , బద్ధకానికి నిద్ర పట్టడానికి కూడా వాక్ సీన్ లు తెస్తారు.
మార్కెటింగ్ చేస్తారు.
అనవసరమయిన వాక్ సీన్ లు వేసుకోవడం అంటే మన ఇమ్మ్యూనిటి ని కుళ్ళబొడుచుకోవడమే.
ఎలర్జీ లు ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ల గురుంచి ఎన్నో పోస్ట్ లు వీడియో లు పెట్టాను. గుర్తు చేసుకోండి.

ప్రజలకు ఎన్నికల్లో రెండు రకాల లక్ష్యాలుంటాయి.

1. తమ అభిమాన పార్టీ ని గెలిపించడం
2. తాము వ్యతిరేకించే పార్టీ ని ఓడించడం.
ఎన్నికల్లో విజయావకాశాలు కేవలం రెండు పార్టీ ల కున్నప్పుడు ఇది తేడా చూపదు.
తెలంగాణ లో ముక్కోణపు పోటీ వుంది.
రకరకాల కారణాలతో వృత్తికి కొనేళ్లు దూరమయిన ఒక సీనియర్ పాత్రికేయుడు ఇందాకే ఒక డిజిటల్ ఛానల్ లో ఎన్నికల ఫలితాల విశ్లేషణ ఇస్తూ కేవలం రెండు పార్టీ ల మధ్యే పోటీ ఉంటుందని చెప్పాడు.
నిజానిజాలు ఎలా వున్నా .. ఈ న్యూస్ బాగా ప్రచారం అయితే ఒక పార్టీ ని ఓడించాలి అనుకొన్న కొన్ని వర్గాల ఓటర్లు తాము వోట్ వేయాలనుకొన్న పార్టీ ఎలాగూ గెలిచే అవకాశం లేదు అని గెలిచే అవకాశమున్న మరో పార్టీ కి ఓటేస్తారు.
దీని వల్ల ఒక పార్టీ తీవ్రంగా నష్ట పోతుంది ; వచ్చే ఓట్లు మరింత తగ్గి పోతాయి.
( వారు నష్ట నివారణ చర్యలు చేపడితే తప్పించి )
మరో పార్టీ కూడా కొంత నష్ట పోతుంది .. కారణం తమకు పోటీ వుండే పార్టీ కి ఓట్లు పెరగడం.
ఈ మొత్తం విశ్లేషణ ఒక పార్టీ కి లాభదాయకం.
ఆ పాత్రికేయుడు తన పగ ను బాగానే తీర్చుకొన్నాడా ? చూద్దాము.
ఒకటి నిజం. రాజకీయాల్లో నెగటివ్ వోట్ బ్యాంకు కూడా ఒక్కో సారి నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.
అలాగే ఎప్పుడో సంపాదించుకొన్న శతృవులు కూడా !

ఇప్పటిదాకా ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటే కొత్తగా వచ్చే అవకాశం బాగా తక్కువ.

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి.
1. తమలపాకు
2 తోట కూర
3. అల్లం
4. వెల్లుల్లి
5 పసుపు
6 వాల్నట్
……. సమృద్ధిగా తీసుకోవడం
7 షుగర్ లేని వారు పళ్ళు
8. అందరూ అన్నం తగ్గించి
9 కాయగూరలు
10 ప్రోటీన్
… ఎక్కువగా తీసుకోవడం
11 నీరు బాగా తాగడం
12 నడక
- ఇవన్నీ చేస్తే మంచిది.
తమలపాకు .. వాల్నుట్స్ .. వెల్లుల్లి .. తోటకూర .. పసుపు .. అల్లం .. తక్కువ కార్బోహైడ్రేట్స్ .. అందునా కాంప్లెక్స్ కార్బ్స్.. ఎక్కువ ప్రోటీన్ .. మూడు / నాలుగు లీటర్ ల మంచి నీరు .. 45 minutes నడక.
మందుల షాప్ అక్కరలేదు.
పెద్దగా ఖర్చు కాదు.
సైడ్ ఎఫెక్ట్స్ లేవు.
“ అయ్యా ! ఆ షీల్డ్ వాక్ సీన్ విషం తో సమానం. ఇక కొత్తగా డోసు లు వద్దు. వేసుకొని ఉంటే ఇవి చేయండి” అని పదేపదే పోస్ట్ చేసాను.
ఎన్నో ఇంటర్నేషనల్ స్థాయి మెడికల్ మ్యాగజైన్స్ చదివి .. నా తెలివి ని రంగరించి .. సమయాన్ని వెచ్చించి జనాల కోసం పోస్ట్స్ పెట్టాను.
నమ్మిన వారు ఫాలో అయ్యారు. ����
సున్నా పక్కన ఎన్ని సున్నాలు పెట్టిన అది సున్నా మాత్రమే. విలువ పెరగదు. లాభం లేదు.
నమ్మని వారి కోసం పెట్టిన పోస్ట్స్ మళ్ళీ పెట్టె ఓపిక సమయం లేదు. అది కాదు కానీ మోటివేషన్ లేదు.

అప్పట్లో నా పై కారు కూతలు కూసిన వారు.

Those who badmouthed me back then.
Those who badmouthed me back then.
Those who badmouthed me back then.
Those who badmouthed me back then.
Those who badmouthed me back then.

Amarnath Vasireddy - Facebook Posts

Explore years of consistent wisdom, organized by journey milestones from 2010 to 2026