అత్యుత్తమ విమానయాన సంస్థలు

https://www.dishadaily.com/.../students-obscene-videos...

క్లాస్ రూంలో అమ్మాయిలతో కలిసి స్టూడెంట్స్ బూతు వీడియోలు.. ప్రిన్సిపాల్ చూశాడని..

Students beat a lecturer for warning on watching prohibited content

కార్గిల్ టోర్నమెంట్ కబడ్డీ 17 సంవత్సరాల లోపు బాలికల విభాగం

వివిధ పాఠశాలలపై విజయం సాధించిన తర్వాత,

స్లేట్ హిమాయత్‌నగర్ మరియు స్లేట్ కర్మాన్‌ఘాట్ సెమీఫైనల్స్‌లో తలపడ్డాయి.

ఈ సెమీఫైనల్స్‌లో స్లేట్ హిమాయత్‌నగర్, స్లేట్ కర్మాన్‌ఘాట్‌పై 5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

Kargil tournament kabaddi under 17years girls After winning against
Kargil tournament kabaddi under 17years girls After winning against

హైదరాబాద్, నారాయణగూడ వైఎంసిఏ ఆధ్వర్యంలో ఈరోజు కార్గిల్ టోర్నమెంట్ నిర్వహించబడింది!

బాక్స్ క్రికెట్ లీగ్: సంగమిత్ర హైస్కూల్‌ను ఓడించిన తర్వాత, బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ హైస్కూల్, స్లేట్ ది స్కూల్ అబిడ్స్ మరియు స్లేట్ ది స్కూల్ కర్మన్‌ఘాట్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి.

స్లేట్ కర్మన్‌ఘాట్ మరియు స్లేట్ అబిడ్స్ మధ్య జరిగిన ఫైనల్‌లో, స్లేట్ కర్మన్‌ఘాట్ మొదటి స్థానంలో నిలవగా, స్లేట్ అబిడ్స్ రెండవ స్థానంలో నిలిచింది.

Kargil tournament kabaddi under 17years girls After winning against
Kargil tournament kabaddi under 17years girls After winning against
Kargil tournament kabaddi under 17years girls After winning against
Kargil tournament kabaddi under 17years girls After winning against

గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన వారికి ఐఏఎస్ ఒక స్వప్నం .

అదే నగరాల్లో పుట్టి పెరిగిన వారికి ఐఏఎస్ పై పెద్దగా ఆసక్తి లేదు . తల్లితండ్రి ఐఏఎస్ ఐపీఎస్ అయితే తప్పించి మిగతా కుటుంబాల నగర విద్యార్థులు.. దక్షిణాదిన .. ఐఏఎస్ వైపు అంతగా ఆకర్షితులు కావడం లేదు .
కోచింగ్ కు వచ్చేవారిలో స్టాండర్డ్ ఉన్నవారి సంఖ్య తగ్గిపోతోంది . ఫలితాలు నిరాశాజనకంగా ఉండడానికి ఇదొక కారణం . ఇందాక చెప్పినట్టు సివిల్స్ పరీక్ష గత కొన్ని ఏళ్లుగా జూదంగా మారడం .. మూడేళ్లు కష్టపడినా ప్రిలిమ్స్ పాస్ కాకపోవడం .. ఇంకో కారణం . ఒకప్పుడు హైదరాబాద్ ఢిల్లీ తరువాత రెండో స్థానంలో ఉండేది . ఇప్పుడు సివిల్స్ కోచింగ్ విషయం లో వెనుకబడడానికి కారణం ఇదే .
కోనేళ్ళ క్రితం మాట . చెన్నై ఐఐటీలో చదివిన ఒక ఒక అబ్బాయి కోచింగ్ కొచ్చాడు . సీన్ కట్ చేస్తే అతను ఇప్పుడు ఒక నగర పోలీస్ కమిషనర్ .
కృష్ణ దేవరాయ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ మరో అబ్బాయి .
ఇప్పుడు జైళ్ల శాఖ ఐజీ. ప్రతిభ కలిగిన వారు కష్టపడే తత్త్వం కలిగిన వారు ఐఏఎస్ వైపు చూడడం తగ్గి పోయింది .
మిత్రుడు బ్రెయిన్ ట్రీ గోపాల కృష్ణ మాటల్లో చెప్పాలంటే జరగబోయే దాన్ని ముందుగానే పసిగట్టి అందుకు అనుగుణంగా మారే విజన్ నాది . అందుకే ఇరవై ఏళ్ళ క్రితమే ఐఏఎస్ కోచింగ్ నుంచి జంప్ .
అందుకే ఇప్పుడు పాఠశాల దశలోనే డేటా సైన్స్ , ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ , అర్బన్ అగ్రికల్చర్, ఎకనామిక్స్ , సైకాలజీ నేర్పించే స్మార్ట్ కార్యక్రమాన్ని రూపొందించాను .
మార్పు నిరంతరాయం .
అనుసరణ తప్పని సరి .
లేకపోతే విలుప్తం ఖాయం .
సివిల్స్ కోచింగ్ కోసం ట్రంక్ పెట్టె తో రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు దిగిన వి ఎస్ అమర్నాథ్ ముందుగా .. సివిల్స్ అభ్యర్థి .. అటు పై వాసిరెడ్డి అమర్నాథ్ గా ఆంత్రోపాలజి .. హిస్టరీ .. జనరల్ స్టడీస్ .. అటు పై గ్రూప్ - 1 , 2 , ఎంపిడిఓ . ఎస్సై , బీఈడీ , డీఎస్సీ కోచింగ్ .. ముందుగా ఒక సంస్థలో లెక్చరర్ అటు పై అపెక్స్ డైరెక్టర్ .. ఈనాడు ప్రతిభ వ్యాసకర్త .. అటు పై టీవీ చానెల్స్ లో విశ్లేషకుడు .. మారుతున్నా ట్రెండ్ ను అర్థం చేసుకొని అబిడ్స్ లో స్లేట్ .. అటు పై అమీర్పేట్ ఖర్మన్ఘాట్ .. అటు పై సిబిఎస్సీ పాఠశాలలు .. తిరుపతి , గన్నవరం .. బౌరంపేట్ { ఐసిఎస్సీ } .. ఇప్పుడు కేంబ్రడ్జి కరికులం .. స్మార్ట్ .. ఇక రానున్న రోజుల్లో సరి కొత్త పేరుతొ పటాన్చెరు లో .. ఇంకా .. ఇంకా ..
మార్పు తప్పని సరి గురూ..
అయినా మనిషి మారలేదు .. ఆతని మమత తీరలేదు .

ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లు - రాజు గారి దేవత వస్త్రాలు !

ఒక్కో క్లాసులో 750 మంది .
చిన్న సైజు పబ్లిక్ మీటింగులా ఉంటుంది .
ప్రశ్నలడిగే అవకాశమే లేదు .
లెక్చరర్ ను కలవలేరు .
గుంపులో కూర్చొని వినబడింది రాసుకోవడమే .
లక్షల్లో ఫీజు .
పోనీ ఉపయోగపడుతుందా? అంటే లేదు .
గత కొన్ని ఏళ్లుగా సివిల్స్ పరీక్ష జూదంలా మారింది .
ఎక్కడ నుంచి ప్రశ్నలడుగుతారో తెలియదు .
చాలా సార్లు క్లాసులో చెప్పింది ఒక ముక్క కూడా రాదు .
కోచింగ్ కు, పరీక్షకు సంబంధమే ఉండదు .
"అందరూ తీసుకొంటున్నారు .. మనం తీసుకోకపోతే ఎక్కడ వెనుకబడి పోతామేమో" అనే భయం కొద్దీ కోచింగ్ కు పోతారు .
కొన్ని వేలమంది కోచింగ్ తీసుకొంటున్నప్పుడు కొందరికి రాంకులు వస్తాయి .
ఇంటర్వ్యూ కోసం కోచింగ్ సెంటర్ లు ఉచిత కోచింగ్ ఇస్తాయి ఇంటర్వ్యూ కు ఎంపికయిన ఇద్దరిలో ఒకరికి రాంక్ ఎలాగూ వస్తుంది .
ఆ రాంక్ లతో కోచింగ్ సంస్థల ప్రచారం .
ఒకటి నిజం .
కోచింగ్ కు వెళ్లడం వల్ల ఒకరితో ఒకరికి పరిచయం . పోటీ వాతావరణం . అవతలి వారు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనే అవగాహన . అంటే అకాడమిక్ అంబియెన్స్ .
ఇదొక్కటే కోచింగ్ వల్ల లాభం .
ఢిల్లీ రాజేందర్ నగర్ అద్వానంగా ఉంటుంది .
భారీ అద్దెలు .
ఒక వీధి వీధి కోచింగ్ సంస్థలు .. మెటీరియల్ అమ్మే షాప్స్ .
దక్షిణాదిన ఐఏఎస్ మోజు తగ్గింది .
మొన్నటి దాక ఇంజినీరింగ్ చేసిన వారికి వెంటనే ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం . సివిల్స్ అంటే మూడు నాలుగేళ్లు కష్టపడాలి .
కానీ బీహార్ లో వాతావరణం వేరు . అక్కడి విద్యార్థుల మొదటి ఛాయస్ సెంట్రల్ అండ్ స్టేట్ సివిల్స్ . వీళ్ళందరూ ఢిల్లీ లోనే కోచింగ్ తీసుకొంటారు .
హైదరాబాద్ లో సివిల్స్ కోచింగ్ జోరు ఎప్పుడో తగ్గిపోయింది . నాతొ కోచింగ్ ఇచ్చిన అనేక మంది మిత్రులు ఢిల్లీ కి ఎప్పుడో వెళ్ళిపోయి అక్కడ కోచింగ్ ఇస్తున్నారు .
స్లేట్ ప్రారంభించక పోయి ఉంటే .. ఇప్పుడు నేను కూడా ఢిల్లీ రాజేందర్ నగర్ లో ఉండేవాడిని .
రావూస్ కోచింగ్ సెంటర్ స్థాపకుడు మా గురువు డాక్టర్ రావు గారు . అప్పట్లో అయన వారం ఢిల్లీ లో వారం హైదరాబాద్ లో ఉండి కోచింగ్ ఇచ్చేవారు .
కోచింగ్ అంటే అది .
క్లాసులంటే ఆయనవి .
సమాచారం పెద్దగా ఇవ్వరు .
ఆలోచింపచేస్తారు .
రాజభవన్ రోడ్డు లో కొండ పైన ఆయన కోచింగ్ సెంటర్ ఉండేది.
బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ గోపాల కృష్ణ నేను అక్కడే కోచింగ్ తీసుకొన్నాము .
రావు గారి క్లాసులు విన్నాక నాలో పెద్దపెట్టున మార్పు వచ్చింది .
ఇప్పుడు నాలో మీరు చూసే లక్షణాలకు అక్కడే బీజం పడింది .
నా జీవితం లో అదొక మైలురాయి .
ఒక దశలో దేశం లోని అన్ని రాష్ట్రాల్లో రావు గారి శిష్యులే చీఫ్ సెక్రటరీ లు .
ఒక్క ముక్క లో చెప్పాలి అంటే ఐఏఎస్ కోచింగ్ అంటే రావు గారు . రావు గారంటే ఐఏఎస్ కోచింగ్ .
ఆయన మరణం తరువాత ఆ కోచింగ్ సెంటర్ ను ఎవరో నడుపుతున్నారు . ఇప్పుడు ఉన్నదానికి అప్పటి సంస్థకు కేవలం పేరు మాత్రమే కామన్ .
గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన వారికి ఐఏఎస్ ఒక స్వప్నం . అదే నగరాల్లో పుట్టి పెరిగిన వారికి ఐఏఎస్ పై పెద్దగా ఆసక్తి లేదు . తల్లితండ్రి ఐఏఎస్ ఐపీఎస్ అయితే తప్పించి మిగతా కుటుంబాల నగర విద్యార్థులు.. దక్షిణాదిన .. ఐఏఎస్ వైపు అంతగా ఆకర్షితులు కావడం లేదు .
కోచింగ్ కు వచ్చేవారిలో స్టాండర్డ్ ఉన్నవారి సంఖ్య తగ్గిపోతోంది . ఫలితాలు నిరాశాజనకంగా ఉండడానికి ఇదొక కారణం . ఇందాక చెప్పినట్టు సివిల్స్ పరీక్ష గత కొన్ని ఏళ్లుగా జూదంగా మారడం .. మూడేళ్లు కష్టపడినా ప్రిలిమ్స్ పాస్ కాకపోవడం .. ఇంకో కారణం . ఒకప్పుడు హైదరాబాద్ ఢిల్లీ తరువాత రెండో స్థానంలో ఉండేది . ఇప్పుడు సివిల్స్ కోచింగ్ విషయం లో వెనుకబడడానికి కారణం ఇదే .
కోనేళ్ళ క్రితం మాట . చెన్నై ఐఐటీలో చదివిన ఒక ఒక అబ్బాయి కోచింగ్ కొచ్చాడు . సీన్ కట్ చేస్తే అతను ఇప్పుడు ఒక నగర పోలీస్ కమిషనర్ .
కృష్ణ దేవరాయ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ మరో అబ్బాయి .
ఇప్పుడు జైళ్ల శాఖ ఐజీ. ప్రతిభ కలిగిన వారు కష్టపడే తత్త్వం కలిగిన వారు ఐఏఎస్ వైపు చూడడం తగ్గి పోయింది .
మిత్రుడు బ్రెయిన్ ట్రీ గోపాల కృష్ణ మాటల్లో చెప్పాలంటే జరగబోయే దాన్ని ముందుగానే పసిగట్టి అందుకు అనుగుణంగా మారే విజన్ నాది . అందుకే ఇరవై ఏళ్ళ క్రితమే ఐఏఎస్ కోచింగ్ నుంచి జంప్ .
అందుకే ఇప్పుడు పాటశాల దశలోనే డేటా సైన్స్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అర్బన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ సైకాలజీ నేర్పించే స్మార్ట్ కార్యక్రమాన్ని రూపొందించాను .
మార్పు నిరంతరాయం .
అనుసరణ తప్పని సరి .
లేకపోతే విలుప్తం ఖాయం .
సివిల్స్ కోచింగ్ కోసం ట్రంక్ పెట్టె తో రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు దిగిన వి ఎస్ అమర్నాథ్ ముందుగా .. సివిల్స్ అభ్యర్థి .. అటు పై వాసిరెడ్డి అమర్నాథ్ గా ఆంత్రోపాలజి .. హిస్టరీ .. జనరల్ స్టడీస్ .. అటు పై గ్రూప్ - 1 , 2 , ఎంపిడిఓ . ఎస్సై , బీఈడీ , డీఎస్సీ కోచింగ్ .. ముందుగా ఒక సంస్థలో లెక్చరర్ అటు పై అపెక్స్ డైరెక్టర్ .. ఈనాడు ప్రతిభ వ్యాసకర్త .. అటు పై టీవీ చానెల్స్ లో విశ్లేషకుడు .. మారుతున్నా ట్రెండ్ ను అర్థం చేసుకొని అబిడ్స్ లో స్లేట్ .. అటు పై అమీర్పేట్ ఖర్మన్ఘాట్ .. అటు పై సిబిఎస్సీ పాఠశాలలు .. తిరుపతి , గన్నవరం .. బౌరంపేట్ { ఐసిఎస్సీ } .. ఇప్పుడు కేంబ్రడ్జి కరికులం .. స్మార్ట్ .. ఇక రానున్న రోజుల్లో సరి కొత్త పేరుతొ పటాన్చెరు లో .. ఇంకా .. ఇంకా ..
మార్పు తప్పని సరి గురూ..
అయినా మనిషి మారలేదు .. ఆతని మమత తీరలేదు .

https://m.rediff.com/.../mp-horror-boy-rapes.../20240727.htm

మధ్యప్రదేశ్‌లో దారుణం: పోర్న్ చూసిన తర్వాత సోదరిపై అత్యాచారం చేసి హత్య చేసిన బాలుడు

MP horror: Boy rapes sister after watching porn, murders her

డాక్యూమెంటెడ్ డ్రీమర్స్ భవిష్యత్తు ?

అమెరికాలో పుట్టిన పిల్లలకు జన్మతః ఆ దేశ పౌరసత్వమొస్తుంది .
ఇండియా లో పుట్టి, తల్లితండ్రితో పాటుఅమెరికా కు వెళ్లిన పిల్లలు ?
వీరు డిపెండెంట్ వీసాతో వెళ్ళివుంటారు .
వీరిని డాక్యూమెంటెడ్ డ్రీమర్స్ అంటారు .
21 ఏళ్ళు దాటితే డిపెండెంట్ స్టేటస్ పోతుంది .
ఇప్పుడు అలాంటి వారు రెండు లక్షల యాభై వేలమంది ఉన్నారు.
వీరందరిని తిరిగి పంపించేస్తారా ?
అమెరికా కు వెళ్ళినాటికి వీరిలో ఎక్కువమంది చిన్న పిల్లలు . అక్కడే చదివి పెరిగి పెద్దవారయ్యారు . ఇండియాకొచ్చి స్థిరపడలేరు .
ఇక్కడికి రావాలని వారికి ఉండదు కూడా .
మరి వారి భవిషత్తు ?
తిరిగి గ్రీన్ కార్డు కు అప్లై చేసుకోవడం లేదా డిపోర్టేషన్ .
గతంలో రిపబ్లికన్ పార్టీ ఈ సమస్యకు చెందిన బిల్లులను వ్యతిరేకించింది .
ఇప్పుడు ట్రంప్ గెలిస్తే పరిస్థితి ఏంటి ?
కమలమ్మ గెలిస్తే వీరందరికీ గ్రీన్ కార్డు ఇస్తుందా ?
వీరి సంగతి ఆలా ఉంచితే .. నేడు అమెరికా లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల పరిస్థితి గందరగోళంగా ఉంది
అమెరికా కు వెళ్ళిపోతే ఎలాగో ఒకలా హ్యాపీగా బతికేయొచ్చు . ఇదీ మనవారి ఆలోచన .
నిన్నటిదాకా ఇది నిజం కూడా .
కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులయ్యింది .
ఉద్యోగాలు లేవు .
ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి.
ఇండియా కు వచ్చేసేవారు కొందరు . "పరిస్థితి మారుతుంది . కొంత కాలం వేచి చూద్దాము" అని మరికొందరు .. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని కొత్త ఉద్యోగాలు పొందుతూ మరి కొందరు.
చాలా కాలం క్రితం వెళ్లి స్థిరపడి ఆస్తులు సంపాదించుకొన్నవారు హ్యాపీ .
గత పది పదహైదు ఏళ్ళ క్రితం వెళ్లిన వారు పైన చెప్పిన పరిస్థితుల్లో .
గత రెండేళ్లగా ఉన్నత చదువు కోసం వెళ్లిన వారి పరిస్థితి దయనీయం . ఇంట్లో నానీ { చిన్న పిల్లల సంరక్షణ చేసే ఆయా ఉద్యోగాలు కూడా దొరకని స్థితిలో } .
సరైన సమాచారం ఉంటే వారిలో నూటికి డెబ్భై మంది వెళ్ళివుండేవారు కాదు .
" అమెరికా అద్భుత ప్రపంచం అక్కడికి వెళ్ళితే లైఫ్ సెటిల్ అయినట్టే .. రెండిళ్లల్లో ఒక కారు .. ఇల్లు కొనుకోవచ్చు" అనే భ్రమల్లోనే అందరూ ఉన్నారు.
వీరికి వాస్తవ పరిస్థితులు తెలిసే అవకాశం లేదు . అమెరికా ఉన్నత చదువులు వీసాలు .. అక్కడ ఉద్యోగాలు ఇప్పించడం .. ఇది వందల కోట్ల బిజినెస్ . ఈ లాబీ చాలా పవర్ఫుల్.

స్మార్ట్ ప్రోగ్రామ్ – పట్టణ వ్యవసాయం & క్లౌడ్ కంప్యూటింగ్

7వ, 8వ, 9వ తరగతుల కోసం భవిష్యత్ నైపుణ్యాల పాఠ్య ప్రణాళిక
7వ తరగతి – పట్టణ వ్యవసాయం (Urban Agriculture)
1. పట్టణ వ్యవసాయం – నిర్వచనం మరియు ప్రాముఖ్యత
  • పట్టణ వ్యవసాయం అంటే ఏమిటి?
  • పట్టణాల్లో ఆహార భద్రతలో దాని పాత్ర
  • పర్యావరణ పరిరక్షణ మరియు ఆరోగ్యకర జీవనశైలి
  • ఇంటి వద్ద కూరగాయల సాగు వల్ల కలిగే ప్రయోజనాలు
2. పట్టణ వ్యవసాయం రకాలు
  • డాబా తోటలు (Terrace Gardens)
  • సామూహిక తోటలు (Community Gardens)
  • నిలువు తోటలు (Vertical Gardens)
3. కంపోస్టింగ్ – ప్రాథమిక అంశాలు
  • కంపోస్టింగ్ అంటే ఏమిటి?
  • వంటింటి వ్యర్థాలను ఎరువుగా మార్చే విధానం
  • కంపోస్టింగ్ వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలు
  • సేంద్రియ వ్యవసాయంలో కంపోస్ట్ పాత్ర
4. కంపోస్ట్ బిన్ తయారీ మరియు నిర్వహణ
  • ఇంట్లో కంపోస్ట్ బిన్ తయారు చేసే విధానం
  • తడి మరియు పొడి వ్యర్థాల వేరు చేయడం
  • కంపోస్ట్‌ను సరైన విధంగా నిర్వహించడం
  • నాణ్యమైన సేంద్రియ ఎరువును తయారు చేయడం

8వ తరగతి – ఆధునిక పట్టణ వ్యవసాయం

1. ఆధునిక సాగు పద్ధతులు
  • హైడ్రోపోనిక్స్ (Hydroponics)
  • ఆక్వాఫోనిక్స్ (Aquaponics)
  • కంటైనర్ గార్డెనింగ్
  • నిలువు తోటల ఏర్పాటు మరియు నిర్వహణ
2. తెగుళ్లు మరియు వ్యాధుల నిర్వహణ
  • పట్టణ వ్యవసాయంలో సాధారణ తెగుళ్లు
  • మొక్కల వ్యాధులను గుర్తించడం
  • సేంద్రియ తెగుళ్ల నివారణ పద్ధతులు
  • సమగ్ర తెగుళ్ల నిర్వహణ (Integrated Pest Management – IPM)
3. నీటి నిర్వహణ
  • సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులు
  • బిందు సేద్యం (Drip Irrigation)
  • వర్షపు నీటి సంరక్షణ
  • నీటి వినియోగంలో మితవ్యయం
  • నీటి సంరక్షణకు ఆధునిక పద్ధతులు

9వ తరగతి – పట్టణ వ్యవసాయం & క్లౌడ్ కంప్యూటింగ్

భాగం – 1 : పట్టణ వ్యవసాయ నిర్వహణ

1. పట్టణ వ్యవసాయ క్షేత్ర నిర్వహణ

  • వ్యవసాయ క్షేత్ర ప్రణాళిక
  • పంటల ఎంపిక
  • ఉత్పత్తి నిర్వహణ
  • వనరుల సమర్థ వినియోగం
2. బడ్జెట్ మరియు వనరుల నిర్వహణ
  • ఖర్చు అంచనా
  • ఆదాయం – వ్యయం విశ్లేషణ
  • చిన్న స్థాయి వ్యవసాయ వ్యాపార నిర్వహణ
3. ఉత్పత్తుల మార్కెటింగ్
  • స్థానిక మార్కెట్లు
  • ప్రత్యక్ష విక్రయాలు
  • ఆన్‌లైన్ మార్కెటింగ్
  • విలువ ఆధారిత ఉత్పత్తులు
4. ఆధునిక సాంకేతికతలు
  • అధునాతన హైడ్రోపోనిక్స్
  • అధునాతన ఆక్వాఫోనిక్స్
  • సెన్సార్ల వినియోగం
  • ఆటోమేషన్ వ్యవస్థలు
  • స్మార్ట్ వ్యవసాయ సాంకేతికతలు

భాగం – 2 : క్లౌడ్ కంప్యూటింగ్
1. క్లౌడ్ కంప్యూటింగ్ – నిర్వచనం మరియు భావన
  • క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి?
  • దాని అవసరం మరియు ఉపయోగాలు

2. క్లౌడ్ సేవల రకాలు

  • IaaS – Infrastructure as a Service
  • PaaS – Platform as a Service
  • SaaS – Software as a Service
3. క్లౌడ్ డిప్లాయ్‌మెంట్ మోడల్స్
  • పబ్లిక్ క్లౌడ్
  • ప్రైవేట్ క్లౌడ్
  • హైబ్రిడ్ క్లౌడ్
4. క్లౌడ్ కంప్యూటింగ్ ముఖ్య భాగాలు
  • డేటా సెంటర్లు
  • సర్వర్లు
  • స్టోరేజ్ సిస్టమ్‌లు
  • వర్చువలైజేషన్
  • క్లౌడ్ నెట్‌వర్కింగ్ ప్రాథమికాలు

భవిష్యత్తు ఇక్కడే ఉంది

నేటి విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తక జ్ఞానంతోనే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, సుస్థిర వ్యవసాయం, డిజిటల్ నైపుణ్యాలు, మరియు భవిష్యత్ వృత్తి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలు కూడా నేర్చుకోవాలి.

స్మార్ట్ ప్రోగ్రామ్ విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, పర్యావరణ అవగాహన, సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించి, భవిష్యత్తు ప్రపంచానికి సిద్ధం చేస్తుంది.

స్మార్ట్ ప్రోగ్రామ్
భవిష్యత్తు ఇక్కడే ప్రారంభమవుతుంది.

25 సంవత్సరాల క్రితం.

వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నత పోలీస్ ఆఫీసర్స్ గా !
Twenty-five years ago.
They are all high-ranking police officers now!

FWB అంటే ?

ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్.
అంటే పరస్పర ప్రయోజనం పొందే స్నేహితులు.
వినడానికి బాగుంది. కానీ అసలు మతలబు ఏంటంటే ..?
స్త్రీ.. పురుషుడు.
పెళ్లి ప్రేమ దోమ లాంటివి ఏమీ ఉండదు.
లివ్ ఇన్ రిలేషన్షిప్ కాదు. అంతకంటే మరో అడుగు ముందుకు ( ముందుకు కాదు లోతుకు .. పాతాళానికి ) !
అవసరం అయినప్పుడు ( అదే .. సెక్స్ అవసరం అయినప్పుడు ) కలుసుకొంటారు. ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు. జస్ట్ డ్రింక్స్ .. సెక్స్ .. మళ్ళీ ఎవరి దారి ఎవరి లైఫ్ వారిది . ఎప్పుడైనా టూర్ వెళ్ళాలి అనుకొంటే ఇద్దరికీ కుదిరితే .. ఓకే.
ప్రేమ .. పెళ్లి .. లివ్ ఇన్ లేకుండా అవసరమయినప్పుడు సెక్స్ అవసరాన్ని తీర్చుకోవడం అంతే!
మరో కోణం లో చెప్పాలి అంటే స్త్రీ పురుషులు సెక్స్ వర్కర్స్ గా .. అదీ డబ్బు లేకుండా ..
ఇదే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ట్రెండ్.

స్లేట్ విజయవాడ.

✅✅ కేంబ్రిడ్జి సిలబస్ కు మార్పు.
అందుకు తగ్గట్టు తరగతి గదులు ఇంకా వసతుల సమకూర్పు.
✅✅✅✅. ఆరో తరగతి నుంచి రాబొయ్యే కాలం అవసరాలను దృష్టిలో పెట్టుకొని
1 . డేటా సైన్స్
2 . ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్
౩. మెషిన్ లెర్నింగ్.
4 . రోబోటిక్స్
5 . సైబర్ సెక్యూరిటీ. AI ఎథిక్స్
6 . స్పేస్ సైన్స్
7 . ఆస్ట్రో బయాలజీ
8 . నానో టెక్నాలజీ
9 . న్యూరో సైన్స్
10 . సైకాలజీ ( రాబొయ్యే రోజుల్లో ఫుల్ డిమాండ్ )
11 . ఎకనామిక్స్
12 . స్మార్ట్ మాథ్స్, స్మార్ట్ బయాలజీ , స్మార్ట్ ఫిజిక్స్
సబ్జెక్టు ల బోధన.
( ఇన్నేసి సబ్జెక్టు లను పిల్లలు గ్రహించగలరా ?
గత నలభై రోజులుగా రోజుకు పది గంటలు దీని పై వర్క్ చేశా. పూర్తి స్థాయి నమ్మకం వచ్చాకా ఒక్కో క్లాసు కు సబ్జెక్టు వారీగా సిలబస్ తయారీ లాబ్స్ ప్రాక్టీకల్స్ ప్లాన్ చేసాక - ఇదిగో ఇప్పుడు న్యూస్ తొలిసారిగా బ్రేక్ చేస్తున్నా!
ఎవరూ అందుకోలేని స్థాయిలో !
గత కొన్ని రోజులుగా ఫేస్బుక్ పై పోస్ట్ లు తగ్గడానికి మెసెంజర్ సమాధానాలు ఇవ్వడానికి టైం తీసుకోవడానికి ఇదిగో ఈ ప్లానింగ్ కారణం.
డెబ్భై శాతం గెలిచాను. త్వరలో వివరాలు అని కొన్ని రోజుల క్రితం పోస్ట్ పెట్టాను.
ఇదిగో బ్రేకింగ్ న్యూస్.
పెనుసంచలనం.
Slate Vijayawada. Changes to Cambridge syllabus.
Slate Vijayawada. Changes to Cambridge syllabus.
Slate Vijayawada. Changes to Cambridge syllabus.
Slate Vijayawada. Changes to Cambridge syllabus.
Slate Vijayawada. Changes to Cambridge syllabus.
Slate Vijayawada. Changes to Cambridge syllabus.
Slate Vijayawada. Changes to Cambridge syllabus.
Slate Vijayawada. Changes to Cambridge syllabus.

భవిష్యత్తును

ఆవిష్కరించండి: అధిక ఉపాధి అవకాశాలున్న అభివృద్ధి చెందుతున్న రంగాలు* _రాబోయే దశాబ్దంలో ఐదు కీలక సబ్జెక్టులు 30% అద్భుతమైన రేటుతో ఉద్యోగ వృద్ధిని సాధిస్తాయని అంచనా:_

*1. డేటా సైన్స్*

*2. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్*

*3.రోబోటిక్స్*

*4.కోడింగ్*

*5.సైబర్ సెక్యూరిటీ*

*ప్రస్తుతం, భారతదేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో కేవలం 50% మాత్రమే ఈ కోర్సులను అందిస్తున్నాయి, అవి కూడా చాలావరకు ఒకటి లేదా రెండు రంగాలలోనే.* _

సంవత్సరానికి ₹4-10 లక్షల భారీ రుసుము వసూలు చేసే కొన్ని అంతర్జాతీయ పాఠశాలలు ఈ కోర్సులను అందిస్తున్నాయి, కానీ అది కేవలం ఒక నామమాత్రం మాత్రమే._

*అయితే, మేము ఒక ముఖ్యమైన మార్పును ఊహిస్తున్నాము:* - *ఈ సబ్జెక్టులు త్వరలో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో, బహుశా ప్లస్-2 స్థాయిలో కూడా ప్రవేశపెట్టబడతాయి.* - *

హైస్కూల్‌లో ఈ సబ్జెక్టులను చదివే విద్యార్థులు మార్గదర్శకులు అవుతారు, ఎందుకంటే వైద్యం, ఫార్మసీ, పరిశ్రమ, హాస్పిటాలిటీ, వినోదం, ఇంకా మరెన్నో రంగాలలో ఈ నైపుణ్యం ఉన్న నిపుణులు అవసరం అవుతారు.*

- *ఈ రంగాలలో మధ్య-స్థాయి ఉద్యోగాలు వేగంగా పెరుగుతాయని అంచనా.*

- విద్యార్థులను ఈ భవిష్యత్తుకు సిద్ధం చేయడానికి, ఈ క్రిందివి చేయాలి:

- *విద్యార్థుల స్థాయిని పరిగణనలోకి తీసుకుని, పాఠ్యప్రణాళిక మరియు కార్యకలాపాలను జాగ్రత్తగా ప్రణాళిక చేయాలి.*

- *తగిన అధ్యాపకులను ఎంపిక చేసి, వారిని పరీక్షించాలి.*

- *అధునాతన ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలి.*

ప్రియమైన తల్లిదండ్రులారా, మేము ఎందుకు పంచుకుంటున్నామో అని ఆశ్చర్యపోతున్నారా?

ఇప్పుడు మీకు ఇది అర్థమైందా?

మేము అందించే తాజా వార్త కోసం వేచి ఉండండి!

Wharhoude, but be delivered due to incomplete address information.

ఏనుగా? పీనుగా ?

మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఊబకాయం .
ఊబకాయం వల్ల సవా లక్ష సమస్యలు .
పస్తులుంటే ?
అప్పుడప్పుడు ఒక పూట తిండి మానెయ్యడం { ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ } మంచిదే .
దీని వల్ల ప్రయోజనాలున్నాయి .
వ్యాయామం చేయడం { కనీసం నడక / ఇంటి పని } అవసరం .
కానీ కేవలం వ్యాయామంతో ... ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ తో ... బరువు తగ్గరు.
మహా అంటే ఇంకా బరువు పెరగకుండా చూసుకోవచ్చు .
ఒక వేళా తగ్గినా ఆ తగ్గుదల ఆశించిన స్థాయిలో ఉండదు .
క్యాలోరీ అకౌంట్ !
బ్యాంకు అకౌంట్ లోకి డబ్బులు డిపాజిట్ చేస్తాము ... విత్ డ్రా చేస్తాము . ఎక్కువ డిపాజిట్ చేసి తక్కువ డ్రా చేస్తే ? బ్యాంకు అకౌంట్ పెరుగుతుంది
మన శరీరానికి కూడా ఒక అకౌంట్ ఉంటుంది . అదే క్యాలోరీ అకౌంట్ .
ఒకాయన పొద్దున్న మూడు దోశలు, ఒక వడ తిన్నాడు .
"నేను ఎప్పుడూ బ్రేక్ ఫాస్ట్ లైట్ గా చేస్తానండీ . నేను చాలా హెల్త్ కాన్షియస్" అని చెప్పుకొంటాడు .
ఒక్కో దోస 170 కెలోరీలు . ఒక వడ 200 . ఇక కొబ్బరి చట్నీ సాంబార్ చివరిగా కాఫీ అన్ని కలిసి అతని శరీరం లోకి పొద్దునే 800 క్యాలోరీ లు వెళ్లాయి .
ఆఫీస్ కెళ్ళాక ఒక్కటంటే ఒక్క చీస్ పఫ్ తిన్నాడు . అసలే మనాడు హెల్త్ కాన్షియస్ . అప్పుడు అకౌంట్ లో 560 క్యాలరీ లు పడ్డాయి .
ఒంటి గంటకు ఆఫీస్ కాంటీన్ లో భోజనం . ఒక గార్లిక్ నాన్ . ఒక కప్పు అన్నం కూసిన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాడు . నాన్ ద్వారా 350 , అన్నం ద్వారా 150 , ఫెంచ్ ఫ్రైస్ ద్వారా 550 . మొత్తం కలిపి 1250 { సాస్ , సాంబార్ పనీర్ కర్రీ లాంటివి వున్నాయి కదా } .
సాయంకాలం ఒక్కటంటే ఒక చాకొలేట్ - 600 .
రాత్రికి రెండంటే రెండు ఉత్తప్పాలు జస్ట్ ఒక చిన్న బాటిల్ బీర్ .- 750 .
నేను చాలా లిమిట్ గా తింటాను అని చెప్పుకొనే ఇతగాడు ఒక రోజులో శరీరం లోకి 3160 క్యాలోరీ లు తోసేసాడు . అంటే కావలసినదానికన్నా 1000 క్యాలోరీలు ఎక్కువ .
అధిక క్యాలరీ లను శరీరం ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తుంది .
అదే కొవ్వు .
మనాడు తీసుకొన్న అదనపు 1000 కెలొరీ ల వల్ల ఒక రోజులో 130 గ్రాముల కొవ్వు , వారం లో తొమ్మిది కిలోలు.. సంవత్సరం లో 52 కిలోల కొవ్వు చేరింది . మనిషి ఏనుగంత అయ్యాడు .
ఇదేంటి సామి ? నేను ఇంత మితంగా ఆచి తూచి తిన్నా సంవత్సరం లో యాభై కిలోల బరువు పెరిగాను అని కుంగిపోయాడు .
ఒక హెల్త్ ఎక్స్పర్ట్ దగ్గరికి పోయాడు .
" జిం లో చేరు . వ్యాయామం చెయ్యి.. బరువు తగ్గుతావు" అన్నాడు ఎగ్ స్పెర్ట్ { స్పెలింగ్ మిస్కెట్ కాదు లెండి }
జిం లో చేరాడు . ఒక గంట సేపు చెమటలు కార్చి రెసిస్టన్స్ ట్రైనింగ్ చేసాడు .
400 కెలొరీస్ ఖర్చయింది . బాగా వ్యాయామం చెయ్యడం తో ఆకలి బాగా వేసింది .
యాభై గ్రాముల డ్రై ఫ్రూప్ట్స్ నట్స్ తీసుకొన్నాడు. చేరింది 600 .
అంటే అదనంగాజిమ్ముడు వల్ల దాని తరువాత ఫుడ్ కుమ్ముడు వల్ల 200 క్యాలోరీలు అదనంగా వెళ్లాయి .
ఒక సంవత్సరం జిం లో ఇరగదీస్తే తగ్గక పోగా గత సంవత్సరానికంటే ఎక్కువ పెరిగాడు .
కింకర్తవ్యం ?
బరువు తగ్గాలి అంటే .. బియ్యం తో గోధుమలతో చేసిన తిండి బాగా .. తగ్గించాలి . తక్కువ కెలొరీ ల ఆహారం తినాలి .
వంద గ్రాములకు ఎన్ని కెలొరీ లు ?
ఖీర - 16 . తోటకూర - 16 , పాల కూర - 16 . కొత్తిమిరి - 16 , టమాటో - 18 , వంకాయ -25 , ముల్లంగి - 17 . పుట్టగొడుగులు - 22 , కాలిఫ్లవర్ - 25 , సొరకాయ - 15 , కాకరకాయ - 17 , బెండకాయ - 33 .
సగం పొట్టను వీటి తో నింపాలి .
అప్పుడే కడుపు నిండుతుంది . తక్కువ క్యాలోరీలు వెళ్ళుతాయి .
అదే సమయం లో పీచు విటమిన్స్ మినిరల్స్ అందుతాయి .
పిజ్జా, బర్గెర్ , స్వీట్స్ . పొటాటో చిప్స్, చాకోలెట్స్, ఐస్ క్రీమ్స్ కుక్కీస్ లాంటివి జంక్ ఫుడ్ . వీటి ద్వారా అధిక కాలరీస్ వెళుతాయి. అంతే కాకుండా బాడ్ ఫ్యాట్స్ { ట్రాన్స్ ఫ్యాట్స్ } . పోనీ ఏదయినా ప్రయోజనం ఉందా { పోషకాలు } అంతే గుండు సున్నా ! వీటిని అసలు ముట్టుకోకూడదు
కొబ్బరి , మునగ , నెయ్యి , డ్రై ఫ్రూప్ట్స్ , నట్స్ . ఇవి కూడా ఎక్కువ కెలొరీస్ ఆహారం . కానీ వీటి ద్వారా గుడ్ ఫ్యాట్స్ .. ఇంకా అనేక పోషకాలు అందుతాయి . వీటిని అప్పుడప్పుడు పరిమితంగా తీసుకోవాలి .
ప్రోటీన్స్ ఎక్కవున్న ఆహారం తీసుకోవాలి .
డైట్ కంట్రోల్ అంటే కెలొరీ ప్లానింగ్ .
కడుపు మాడ్చుకోవడం కాదు .
కెలొరీ ప్లాల్లింగ్ తో బాటు వ్యాయామం ఉన్నపుడే బరువు తగ్గడం సాధ్యమవుతుంది .
బరువు తగ్గడం అంటే పీనుగ లాగా... బోలు ఎముకలు దాని పై పాలిపోయిన చర్మం ఉండడం కాదు .
ఆరోగ్యం అంటే బరువు తగ్గడం... అంటే ఒంట్లో ని అదనపు కొవ్వు ను తగ్గించడం. ఒంట్లో కొవ్వు 25 శాతం దాటితే రోగం కింద లెక్క. 15 శాతం ఉంటే ఫిట్నెస్.
10 -12 అయితే ఒలింపిక్ క్రీడాకారుల ఫిట్నెస్ .
నా ఒంట్లో కొవ్వు 12 శాతం .
మరి మీది ?
ఫోటో పెడితే ఉజ్జాయింపుగా చెబుతాను .
ఆరోగ్యం అంటే .. దృఢమయిన ఎముకలు.
బోన్ డెన్సిటీ మైనస్ ఒకటి నుంచి ప్లస్ ఒకటి దాకా ఉండాలి .
మైనస్ ఒకటి కంటే తగ్గితే బోలు ఎముకలు.
కింద పడితే ఫ్రాక్చర్.
కూర్చుంటే లేవలేరు .
కిర్రు కిర్రు అంటే బాడీ బోరింగ్ కు వచ్చినట్టు లెక్క.
నా బోన్ డెన్సిటీ ప్లస్ రెండు.
దీన్ని ఇంట్లో లెక్కించలేము.
దీని కోసం డయాగ్నొస్టిక్ సెంటర్ కు వెళ్ళకండి.
పైన చెప్పిన రీతిలో ఆహారం , వ్యాయామం , ఇంకా డి విటమిన్ ఉంటే బోన్ డెన్సిటీ చక్కగా ఉంటుంది.
బుసబుస పొంగే డ్రింక్స్.. సోడా... బీర్... పెప్సీ.. బోన్ డెన్సిటీ ని నాశనం చేసేస్తాయి. అసలు ముట్టుకోవద్దు.
ఆహారమే ఆరోగ్యం .
ఆహారమే రోగం .
నిర్ణయం మీ చేతిలో !

చదవేస్తే ఉన్న మతి పొయ్యింది !

1929 లో బ్రిటిష్ ప్రభుత్వం రాయల్ కమిషన్ ను నియమించింది .
దీని అధ్యక్షుడు జాన్ హెన్రీ విట్లే .
దీనికి విట్లే కమిషన్ అని పేరు .
1931 లో ఈ కమిషన్ నివేదికను సమర్పించింది .
రోజుకు ఎనిమిది గంటలు పని .
వారానికి ఒక సెలవు దినం ఉండాలి...
అని కమీషన్ చెప్పింది .
రోజుకు మనిషి ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్ర పోవాలి .
ఇది అభిప్రాయం కాదు .
సైన్స్ .
ఎనిమిది గంటలకంటే తక్కువ నిద్ర పొతే కుంగుబాటు , వ్యాకులత లాంటి మానసిక సమస్యలొస్తాయి .
తక్కువ నిద్ర పోయిన ఒక్కో గంటకు ఇంత... అని జీవిత కాలం తగ్గిపోతుంది .
అంటే తన తలకు తానే కొరివి పెట్టుకున్నట్టు లెక్క .
ఇది కాకుండా అల్జ్హీమేర్ లాంటి తీవ్ర వ్యాధుల బారిన పడే ప్రమాదం . { ఏమీ గుర్తుండదు . ఇంటినుంచి బయటకు పొతే తన పేరే గుర్తుండక దారి తప్పి ఎక్కడో ఫుట్ పాత్ ల పై బతుకుతూ చనిపోయే స్థాయి విషాదం } .
పళ్ళు తోముకోవడం , స్నానం చేయడం , టాయిలెట్ అవసరాలు , తినడం .. ఇవి రోజూ జరగాలి . దీనికి మొత్తం మూడు గంటలు .
తల్లి తండ్రి భార్య భర్త... కుటుంబం ఉంటుంది కదా .
కుటుంబాలే లేక పొతే మనిషి కి గొరిల్లాలకు తేడా ఉండదు . { ఆ మాటకొస్తే గొరిల్లాలకు కూడా కుటుంబాలుంటాయి }.
కుటుంబ సభ్యులతో రోజుకు కనీసం అయిదు గంటలు గడపాలి .
కదా ?
నిద్ర దిన చర్యలు , కుటుంబ సమయం .. మొత్తం కలిపితే 16 గంటలు .
మిగిలింది 8 .
అది పని గంటల లెక్క .
సరే ఒక గంట ఆటో ఇటో అంటే ఓకే .
ఒకప్పుడు ఆఫీస్ అంటే సాయంకాలం అయిదింటికి అయిపోయేది . { ఏవో కొన్ని తప్పించి } . అదే సమయానికి పిల్లలు బడినుంచి ఇంటికొచ్చేవారు .
వారితో మాటలు... ఆటలు ... హోమ్ వర్క్... ఇలా అన్నింటికీ తల్లితండ్రులకు సమయం చిక్కేది .
1991 సంవత్సరం లో ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు- గ్లోబలైజేషన్ మొదలైందో .. ఆఫీస్ నుండి ఇంటికి రావడం అంటే రాత్రి ఎనిమిది- తొమ్మిది తరువాతే అన్నట్టు తయారయ్యింది . చివరాఖరికి ప్రభుత్వ బ్యాంకు లో పని చేసే వారు కూడా ఎనిమిది దాక పని చెయ్యాల్సిన పరిస్థితి .
ఇది బాలల హక్కులను తుంగలో తొక్కడం కాదా ?
నేటి బాలలే రేపటి పౌరుల లాంటి కబుర్లు మస్తు వినుంటాము .
స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు ఏమి చెయ్యాలి ?
ఒకప్పుడైతే కనీసం అమ్మ అయినా ఇంటి పట్టున ఉండేది .
ఇప్పుడు దంపతులిద్దరూ వర్కింగ్ .
పిల్లల సామాజీకరణ ఎట్లా?
ఇది కేవలం వ్యక్తిగత సమస్యా ?
దేశ భవిష్యత్తు కాదా ?
వందేళ్ల నాడు బ్రిటిష్ వాడు చేసిన చట్టం , వాడి తెలివి గాలిలో పోయింది .
1991 తరువాత పని గంటల నియంత్రణ అనే మాట ను ఒక్క పార్టీ గానీ .. ఒక్కడంటే ఒక్క రాజకీయ నాయకుడు చేయలేదు . మల్టీనేషనల్ కంపెనీ లకు ఆ స్థాయిలో బానిసలయిపోయారు పాలకులు .
ఎన్నో రాజకీయ పార్టీలకు కార్మిక సంఘాలున్నాయి . నాకు తెలిసినంత వరకు ఒక్క సంఘం కూడా దీని గురించి మాట్లాడలేదు .
లాభం అనే రక్తం మరిగిన మల్టీ నేషనల్ కంపెనీస్- సాఫ్ట్ వెర్ కంపెనీస్ ఇప్పుడు 14 గంటల పని గురించి మాట్లాడుతున్నాయి .
కొన్ని నెలల క్రితం ఒకాయన వారానికి డెబ్భై పని గంటలుండాలి అని మాట్లాడాడు . అయన సతీమణి మొన్న పార్లమెంట్ లో ఒక వాక్ సీన్ గురించి మాట్లాడింది . తెలిసే మాట్లాడుతున్నారో లేక ఏదైనా మతలబు ఉందొ తెలియదు .
వారి పైన ఇన్నాళ్లు ఉన్న గౌరవం పోయింది .
ఇప్పుడు బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీస్ 14 గంటల పని దినాన్ని దాదాపుగా తెచ్చేసాయి . అవినీతి కంపు భరించలేక కర్ణాటక ప్రజలు గత ప్రభుత్వాన్ని దించేసి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకొన్నారు .
ఇప్పుడు వారి పని పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయ్యింది .
14 వర్కింగ్ అవర్స్ ఏంట్రా ?
సంసారం కూడా చేసుకోనివ్వరా ?
కనీసం 45 వయసు వచ్చే దాక దంపతులు బెడ్ రూమ్ లోరోజూ గంట గడపాలి .
మీ పిండం అమెరికా గద్దలకు పెట్టా!
అర్ధ రాత్రి అపరాత్రి దాక పని చేసి ఇంటికొచ్చి గుర్రు పెట్టి నిద్దరోతున్నారు కాబట్టే విడాకుల జాతర జరుగుతోంది .
విషయం అర్థం కాకపోతే ఫామిలీ కోర్ట్ దాక వెళ్లి కనుక్కొని చావండి .
పిల్లలతో తల్లితండ్రులు రోజుకు కనీసం నాలుగైదు గంటలు గడపకపోతే జాతి నాశనం అయిపోతుందిరా సన్నాసుల్లారా . ఇప్పటికే మొబైల్ ఫోన్ వ్యసనం .. దానికి తోడు మద్యం .. గంజాయి . డ్రగ్స్ .. బాల రాక్షసులు బాల రేపిస్ట్ లు తయారవుతున్నారు . సమాజం రేపటితో అంతమయిపోతుంది అనుకొంటున్నారా ?
లేక మీ లాభాలు తప్పించి ఇంకేమీ పట్టదా ?
ఒక పని చెయ్యండి .
రోజుకు 24 గంటలు ఆఫీస్ లో ఉండాల్సిందే అని రూల్ పెట్టండి . నోటికి ... ఇంకా కొన్ని చోట్ల ట్యూబులు పెట్టండి .
సీట్ నుంచి లేవాల్సిన అవసరం లేకుండా అప్లోడింగ్ .. డౌన్ లోడింగ్ అయిపోతాయి .
నాలుగు గంటలు సీట్ రిక్లైన్ అయ్యేలా చూడండి .
అప్పుడు నిద్ర .
నిద్ర లేచిన వెంటనే టిష్యూ పేపర్ ఇచ్చి ఒళ్ళు తుడుచుకోమనండి .
ఒకప్పుడు
బతకడం కోసం పని .
నీతి తప్పిన పాలకుల కాలం లో ..
పని కోసమే బతుకు !

లెక్క తప్పింది!

స్టెమ్ ( STEM ) అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ Maths )
గ్రాడ్యుయేట్స్ అంటే పట్టభద్రులు.
స్టెమ్ గ్రాడ్యుయేట్స్ అంటే ప్రధానంగా ఇంజనీరింగ్ మెడిసిన్ లో డిగ్రీ లు పొందిన వారు.
డిమాండ్ సప్లై సూత్రం!
చదివేది ఎందుకు ?
Job చేయడానికి ! కదా?
మన దేశం లోని స్టెమ్ గ్రాడ్యుయేట్ ల సంఖ్య ఎంత అంటే అమెరికా యూరోపు లలో మొత్తం ఉద్యోగాల సంఖ్య తో సమానం.
అంటే ప్రతి ఉద్యోగానికి ఇద్దరు ముగ్గురు.
ఒకరికి జాబ్ వస్తే మిగతా ఇద్దరు జీవిత కాల నిరుద్యోగులుగా ఉండి పోయే స్థితి.

కొత్త సాధారణం.

ది న్యూ నార్మల్ అనెడి ఎర్రి.
కరోనా కాలం ప్రతి మేధావి పలికిన మాట.
ఇక పై ఇలాగే వుంటుంది అని చెప్పేవారు.
వెర్రి వెయ్యి రకాలు కదా.
అందులో ఒకటి శాంపిల్ కు.
“ ఇక పై పిల్లలు పాఠశాలలకు పోనవసరం లేదు.
ఇంట్లో కూర్చుని సెల్ ఫోన్ ముందు పెట్టుకొని చదివేయొచ్చు. “
ఇదీ అపర మేధావుల ఆలోచన.
బయ్యా జ్యూస్ రవీంద్రన్ ఒకడికి అంటే ఏదోలే అనుకోవచ్చు.
విద్య ఇలాగే కొనసాగుతుందని కోట్ల మంది నమ్మారు.
బయ్యా జ్యూస్ కంపెనీ కి పెట్టుబడులు వరదలా వచ్చింది. కంపెనీ విలువ కోటి తరువాత ఎన్ని సున్నాలు పెట్టాలో పేపర్ పెన్ ముందు పెట్టుకొని లెక్క వేయాల్సిన స్థాయికి పెరిగి పోయింది. ఏకంగా జ్యూస్ రవీంద్రన్ క్రికెట్ మ్యాచ్ కి స్పాన్సర్ చేసేసాడు.
సెల్ ఫోన్ ముందు పెడితే చదవడం సంగతి పక్కన పెట్టండి. సర్వనాశనం అయిపోతారు.
స్కూల్ కు పొతే టీచర్స్ నుంచి నేర్చుకునేది సగం అయితే మిగతా సగం తోటి పిల్లల నుంచి — దాన్నే సోషల్ ఇంటలిజెన్స్ అంటారు అనే కనీస ఇంగిత జ్ఞానం ఈ శుంఠలకు లేక పోయింది.
ఇప్పుడేమయ్యింది?
జ్యూస్ అయిపొయింది.
పండు ఎండి పోయింది.
దివాలా.
పూర్తిగా కంపెనీ మూతబడే అవకాశం.
కామన్ సెన్స్ లేక పొతే ఏమి జరుగుతుంది అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ.
ఐఐఎం అయినా ఐఐటీ అయినా కామన్ సెన్స్ లేక పొతే జ్యూస్ లు ఎండి పోతాయి.
SthiraChitta Painting Competition

నా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలి అనుకుంటున్నాను,

పిల్లలు చదవటానికి పాఠశాలలు చాల ఉన్నాయి,చదువు చెప్పటానికి ఉపాధ్యాయులు చాలానే ఉన్నారు,కానీ పిల్లల గురించి ఆలోచించే పద్ధతి, వాళ్ళ భవిషత్తు ప్రణాళికలు తల్లి తండ్రుల కంటే ఒక అడుగు ముందే అవలంబించే తీరు,అహర్నిశలు పిల్లలకి ఇలా మంచి పద్ధతిలో వెళ్ళాలి,ఇలా చదివితే నీ భవిషత్తు నీ చేతిలోనే ఉంది ఉంటుంది అని ఆలోచింపజేసే యాజమాన్యం,ముఖ్యంగా మొబైల్ మహమ్మారి గురించి SLATE పాఠశాల తీసుకున్న నిర్ణయాన్ని నేనే కాదు ప్రతి ఒక్క విద్యార్థి తల్లితండ్రులు మీ యాజమాన్యాన్ని అభినందించాలి.
����������
మీ
సన్నపనేని పెంచలయ్య.
జయ ప్రజ్ఞేష్ తండ్రి హనీష్.

యాభై ఏళ్లలో బెంగళూరు నగరం ఎవరి ఊహకు అందని స్థాయిలో అభివృద్ధి అయ్యింది.

దీని వల్ల ఎవరికి లబ్ది కలిగింది ?
ముందుగా లబ్ది పొందింది బెంగళూరు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు.
వారి సంపద అనేక రెట్లు పెరిగింది.
యాభై ఏళ్ళ క్రితం అర్ధ ఎకరా భూమి కలిగిన వారు ఇప్పుడు కోటీశ్వరులు .
వారి సంపద , హోదా , జీవన స్థాయి .. అన్నీ పెరిగాయి. భూమిని అమ్మి వచ్చిన డబ్బు తో జల్సా చేసి పాడై పోయిన వారూ వుంటారు.
అభివృద్ధి దుష్ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి.
కేవలం బెంగళూరు నగరం లోని స్థానికులే కాదు. మొత్తం కర్ణాటక రాష్ట్ర ప్రజలు లబ్ది పొందారు.. పొందుతున్నారు.
చెన్నై , ముంబై , బెంగళూరు లాంటి నగరాల వల్ల ఆయా రాష్ట్రాల రెవెన్యూ ఆదాయం భారీగా వుంది. అందుకే ఆ ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలుగుతున్నాయి .
బెంగళూరు కు ఈ యాభై ఏళ్లలో వలస వెళ్లిన వారు స్థానికులకంటే ఎక్కువ అభివృద్ధి చెందారు అనేది వాస్తవం. ఇదే రాజకీయ పార్టీలకు అగ్గి రాజేయడానికి ఇంధనం గా పనికి వస్తుంది.
గెలవడానికి రాజకీయ పార్టీలు ఏమైనా చేస్తాయి.
ఎంతో మందికి నీడను , పళ్ళను ఇస్తున్న మహా వృక్షాన్ని నరికి కలప కింద అమ్మి రాత్రికి క్వార్టర్ కొనుక్కొని తాగేవాడికి భారత దేశ రాజకీయులకు తేడా ఏమీ లేదు.

భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదవడం వల్ల ఏర్పడ్డ మన దేశ ద్రవ్య లోటు 6300 కోట్లు.

గత పదేళ్లలో ఈ లోటు రెట్టింపయ్యింది. ఇదే సమయం లో మన దేశం లో చదివే విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది.
శుభోదయం.

మీరు నమ్ముతారా ?

రతి ప్రక్రియ .. అదీ కేవలం నీలి చిత్రాలు చూసే వారి కి మాత్రం పరిచయం అయిన , మిగతా వారి ఊహకు సైతం అందని .. అనేక విషయాలను బొమ్మలతో , కార్టూన్స్ తో వివరిస్తూ ప్రతి దాన్ని వర్ణిస్తూ పుస్తకాలు.
ఇలాంటి పుస్తకాలను అమెరికా లోని కొన్ని పాఠశాలలు లైబ్రరీ లో ప్రవేశ పెట్టాయి.
హై స్కూల్ విద్యార్థులు వాటిని చూస్తున్నారు. చదువుతున్నారు.
ఇదేదో సెక్స్ విజ్ఞానం అనుకునేరు.
పూర్తి స్థాయి జగుప్సా కరమయిన పోర్న్.

చైనా లో ఒక మార్కెట్ ఉంది.

ప్రపంచం లో ఖరీదైన బ్రాండ్ వస్తువుల ( చేతి గడియారాలు , దుస్తులు , హ్యాండ్ బాగ్ లు మొదలయినవి ) డూప్లికెట్స్ అక్కడ దొరుకుతాయి.
25 లక్షల స్విస్ వాచ్ నకిలీ అక్కడ అయిదు వేలకే దొరుకుతుంది.
పది లక్షల హ్యాండ్ బాగ్ నకిలీ అయిదు వందలకే.
ఏది అసలో ఏది నకిలీనో ఎవడూ చెప్పలేడు.

బాగా గుర్తు చేసుకొని చెప్పండి.

టైం తెలుసుకోవడం కోసం మీరు చేతి గడియారాన్ని ఇటీవల ఎప్పుడు చూసారు?
నాకు తెలిసినంత వరకు అందరూ , మొబైల్ లో టైం చూసుకొంటున్నారు.
ఇప్పుడు చేతి గడియారం ఆరో వేలు.
వృధా.
ఒక్కో వాచ్ రెండు కోట్లు .. పది కోట్లు అని వార్తలు.
బహుశా ఆ వాచ్ లు కట్టుకొన్నొళ్లకు ఇరవై నాలుగు గంటలకు బదులు 36 గంటలు వస్తాయేమో రోజుకు.
అంత ఖరీదు ఎందుకంటే దాన్ని చేతితో చేసారంట.
మరి కాలితో చేస్తే వెయ్యి కోట్లు అవుతుందేమో.
మెషిన్ తో చేస్తే ఏంటి చేతితో చేస్తే ఏంటి ?
డబ్బున్న వారిని స్విస్ గడియారాల కంపెనీ లు ఎంతగా బకరాలు చేస్తాయో.
సోకులు. పెగ్గేలు. పోజులు. గొప్పలు.

ఎవరి సినిమాకు వారే ....

అనగనగా .. ఒక అడవిలో.. కాకి పిల్ల !
చేతిలో సెల్ ఫోన్ .
వాట్సాప్, యూట్యూబ్ వీడియో లు తెగ చూస్తుంది .
" తూ... నాది ఒక బతుకేనా ? మా అమ్మకు ముద్దు కావచ్చేమో.. కానీ .. ఏందిదీ ...? ఒళ్ళంతా కారు నలుపు ! అందమంటే చిలకమ్మది. చక్కగా ఒళ్ళంతా ఆకుపచ్చ . ముక్కేమో ఎరుపు ! ఒక్క రోజైనా చిలకమ్మలా బతకాలి" ఫేస్బుక్ లో చిలకమ్మ ఫోటోలు, తన సెల్ఫీ లను పోల్చుకొంటూ తెగ ఫీల్ అయిపోయి ..
" చిలకలా అందంగా మారాలి . అవసరం అయితే అప్పులో ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొంటా" అనుకొంటూ" చిలకమ్మ దగ్గరకు పోయి ...
" రామ్మా చిలకమ్మా.. పాలే తెలుపు .. నేనే నలుపు .. నన్ను నీలా అందంగా చూడాలని ఉంది " అంది.
చిలకమ్మ.. తన డాడీ కొనిచ్చిన అయ్య ఫోన్ లో తన సెల్ఫీ తీసుకొని.. గూగుల్ లో ఉన్న నెమలి ఫొటోస్ తో కంపేర్ చేసుకొని ఫీల్ అయిపోతోంది ..
" అయ్యో .. నా అందానికేమొచ్చిందమ్మా! జస్ట్ రెండంటే.. రెండు రంగులు . అందమంటే ఆ నెమలిది ... .వరేలి డిజైనర్ చీరలా ఒళ్ళంతా రంగులే రంగులు .... నేను కూడా ఆన్లైన్ లోన్ అప్ ద్వారా లోన్ తీసుకొని బేర్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొంటా.. పోదాం పదా " అంటూ నెమలి దగ్గరకు తీసుకొని వెళ్ళింది .
" అయ్యో నాది ఒక బతుకేనా ?...తల్లుల్లారా ! చేతిలో సొల్లు ఫోన్ ఉన్నంత కాలం మాయాలోకం లో పడిపోయి.. మస్తు సొల్లు కబుర్లు చెప్పేదాన్ని .. సోది కబుర్లకు లైక్లు కొట్టేదాన్ని... షేర్ చేసేదాన్ని. నా అందమే నాకు శాపం అయ్యింది అందంగా ఉన్నానని ఇదిగో ఈ జూ లో.. తీసుకొని వచ్చి పడేసారు . ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ లేదు . తీరుబడిగా ఆలోచించే టైం దొరికింది . తత్త్వం బోధపడింది . ఎగర లేను . బయటకు పోలేను . జీవితమంతా బందీ . పట్టుకొచ్చి ఇక్కడ ఉంచిన పక్షులన్నీ అందమయినమే . లేని పక్షి ఒక్కటే అది.. కాకి . నా అందం నాకు శాపం . కాకి నలుపు దానికి వరం . నలుపు నారాయణుడు మెచ్చు అన్నారు . నారాయణుడి సంగతేమో కానీ... కాకి.. హాయిగా ఎగరొచ్చు . అనుకొన్న చోటుకు పోవచ్చు . లైఫ్ అంటే అలావుండాలి . దానంత అదృష్టవంతురాలు ఎవరూ వుండరు " అంది .
అడవి నుంచి ఇప్పుడు జనారణ్యంలోకి పోదాము!
చేతిలో సెల్ ఫోన్ .
ప్రపంచం గుప్పిట్లో !
అందులోని చెత్తంతా మెదడ్లో!
" ఇంత గ్రాండ్ గా... వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకొన్నాడు . నాకు ఒక సంభంధం కూడా కుదరడం లేదు. పుడితే సంభాని .. పదాని లాంటి వాడికి కొడుకుగా పుట్టాలి " వాట్సాప్ లో ఫోటో లు వీడియోలు చూస్తూ ఒక యువకుడు.
" అదృష్టం అంటే ఆమెది . అపర కుబేరుడు మొగుడయ్యాడు . నాకు వస్తున్నాయి.. లింగు లిటుకు సంబంధాలు . ఎందుకు? గట్టిగా పది కోట్ల ఆస్తి కూడా లేదు !! " ఇంస్టాగ్రామ్ లో వీడియోలు చూస్తూ ఒక యువతి!
" పెళ్ళై పదేళ్ళయింది . దీపావళి కైనా నెక్లస్ కొందామంటే ఈ చచ్చినోడి సంపాదన ఏ మూలకు రాదు ." ఫేస్బుక్ లో వైరల్ ఫోటోలు చూస్తూ ఒక ఆంటీ .
" పిల్లలకు పెళ్లి చెయ్యాలంటే చేతిలో గట్టిగా ఒక కోటి లేదు . ఇంత వైభవంగా పెళ్లి చేసే సీన్ నా బతుక్కి ఉందా ?" పేస్ బుక్ లో ఫోటోలు చూస్తూ ఒక అంకుల్
" యాభైకే నా బతుకు ఎడారయ్యింది. ఈడు డెబ్భై లో పూలు పూయిస్తున్నాడు. ". సోషల్ మీడియా లో బ్రేకింగ్ వార్తలు చూస్తూ ఈర్షతో ఒక పెద్దాయన .
ఈనో .. ఆంట్ ఆసిడ్ .. .. తెలుగు నాట కార్టిజాల్ ఏరులై పారుతోంది .
అడవిలోకి పారిపోదాం రండి !
అడవిలో .. ఇంకో కాకి !
అక్కడ నెట్ వర్క్ లేదు .
దాంతో ఈ కాకికి సెల్ ఫోన్ అలవాటు కాలేదు .
చెట్టు పై పుల్లలతో గూడు కట్టుకొంది.
చెట్టుకింద ఒక తాబేలు .
" కాకీ! ఛీ .. నువ్వు నీ.. పిచ్చి ఇల్లు . పుల్లలు .. గడ్డి .. జంతువుల వెంట్రుకలు . గట్టిగా గాలి వీస్తే కూలిపోతుంది . వర్షం వస్తే తడుస్తావు . నా డిజైనర్ ఇల్లు చూడు .. నా ఒంటిని బాగా కప్పి ఉంచుతోంది . ధృడంగా ఉంది. శత్రువులనుంచి నా శరీరానికి రక్షణ ఇస్తుంది . " అంది .
అందుకు చెట్టు పై నున్న కాకి ..
" నా ఇంట్లో నేను.. నా పిల్లలు ఉంటాము . చక్కగా ఆడుకొంటాము."చందమామ రావే... జాబిల్లి రావే.." అని పాడుతూ నా పిలల్లకు నేను ముక్కు- ముద్దలు తినిపిస్తాను .కాకి - కడవలో నీళ్లు " కథను బెడ్ టైం స్టోరీ గా వినిపిస్తాను .. " జో అచ్యుతానంద జో జో ముకుందా" అంటూ బజ్జో పెడతాను . మా ఇంటికి అప్పుడప్పుడు బంధువులు వస్తారు .అందరం కలిసి " కలిసుంటే కలదు సుఖం .. చక్కని సంసారం" అని పాడుకుంటాము . మాది బొమ్మరిల్లు .. నందనవనం . నీ ఇంట్లో నువ్వొక్క దానివే . జీవితాంతం ఏకాంత వాసం .. అది ఇల్లు కాదు .. జైలు . నీది ఒక బతుకేనా ! మా వాడు .. డల్లాస్ లో.. మా అమ్మాయి సాన్ జోస్ లో... అని గొప్పలు చెప్పుకొంటూ మలి వయసులో లంకంత కొంపలో బిక్కుబిక్కుమంటూ ఒంటిగా గడిపే మనుషులకు మల్లె నా తో కబుర్లు చెప్పకు " అంది .
కథాన్నాక ఒక నీతి ఉండాలి .
రెండు కథలు చదివారు .
వీటిలో నీతి ?
లక్షాధి కారయిన సాల్ట్ ఫుడ్డే కానీ .. గోల్డ్ బిస్కెట్ లు మింగబోడు.
గోల్డ్ తో డ్రెస్ చేసుకోవచ్చు కానీ.. సంసారం చేయలేడు.
అడ్డదారిలో సుఖాలు అనుభవించినోడు.. ఇప్పుడు నలుగురి నోళ్ళలో .
సీత కష్టాలు సీతవి .
పీత కష్టాలు పీతవి .
సోషల్ మీడియా ఉంది కదా అని అడ్డమయిన చెత్త చూస్తే ఒళ్ళు కార్టిజాల్ ప్రవాహం అయిపోతుంది .
ఎవరి సినిమా వారిదే !
ఎవడి బతుక్కి ఆడే హీరో !
పక్కాడితో పోల్చుకొంటే జీవితమంతా అసంతృప్తే .
లైఫ్ అంటే క్వాలిటీ .
సంతోషాన్ని.. ఆనందాన్ని.. కిలోల్లో.. టన్నుల్లో.. కొలవలేము .
జస్ట్ ఎంజాయ్..
సోషల్ మీడియా కాకి !
హ్యాపీ కాకి .
మీ దారేది ?
{ అందరితో ఈ మెసేజ్ ని పంచుకోండి . షేర్ చెయ్యండి }
మీ .. వాసిరెడ్డి అమర్నాథ్ .

మే పదకొండు నాడు నేను ఇలా పోస్టితిని!

ఎన్నికల ఫలితాలు క్లైమాక్స్ కాదు. ఎన్నికల ఫలితాల తరువాతే అసలు క్లైమాక్స్ మొదలయ్యి కొన్ని నెలలు సాగి మీడియా లో హాట్ హాట్ మసాలా చర్చలకు దారి తీయును.
పది లైన్స్ చదివితే ఒక్క లైన్ సారం - ఇది మాములుగా మీడియా వార్తల్లో.
ఒక్క లైన్ లో నిగూఢంగా పది లైన్స్ సరుకు.
ఇది వాసిరెడ్డి అమర్నాథ్ పోస్టులలో.
అందుకే జాగ్రత్తగా లోతుగా చదవాలి.
I posted like this on May eleventh!
I posted like this on May eleventh!

మంరాజ్ కుమ్మెహర్ అంట.

నా ఫోటో లు డౌన్ లోడ్ చేసుకొని ఫేక్ id తో డబ్బులు ఆడుకొంటున్నాడు.
వీడి దెబ్బకు రాత్రి నా మెసెంజర్ లో వందలాది మెసేజ్ లు. ఇది మీరేనా ? అని. ��������������
ఏ మాట కా మాటే చెప్పుకోవాలి. వాడు నా ఏజ్ ని ఎంత కరెక్ట్ గా గెస్ చేసాడో. మీరు వున్నారు ఎందుకండీ.
��������������

 

Apparently, it's Manraj Kummehar.
Apparently, it's Manraj Kummehar.
Apparently, it's Manraj Kummehar.
Apparently, it's Manraj Kummehar.

నకిలీది. దయచేసి రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి.

Apparently, it's Manraj Kummehar.

నమస్కారం మేడమ్.

నేను సయ్యదా బిల్కీస్ జెహ్రా తల్లిని. ఆమె చదువుకు సంబంధించిన అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాను.

నా కుమార్తె బిల్కీస్‌పై పాఠశాల మరియు ఉపాధ్యాయులు చూపిన అద్భుతమైన ప్రభావానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను.

అలాగే, ఈ సంవత్సరం స్లేట్ ది స్కూల్‌లో చేరినప్పటి నుండి ఆమె సాధించిన అద్భుతమైన పురోగతిని కూడా పంచుకోవాలనుకుంటున్నాను.

ఆమె విద్యాపరంగా, ముఖ్యంగా చదవడం మరియు రాయడంలో గణనీయంగా మెరుగుపడింది.

అంతేకాకుండా, ఆమె వ్యక్తిత్వంలో ఒక అద్భుతమైన మార్పును నేను గమనించాను—ఒకప్పుడు నిశ్శబ్దంగా, అంతగా కలవని విద్యార్థిని నుండి, ఇప్పుడు ఆమె నిర్భయంగా మాట్లాడే, ఆత్మవిశ్వాసం గల వ్యక్తిగా మారింది.

ఈ సానుకూల మార్పు, స్లేట్ ది స్కూల్‌లోని ప్రోత్సాహకరమైన వాతావరణానికి మరియు అసాధారణమైన బోధనకు నిదర్శనం.

ఇక్కడి సానుకూల వాతావరణం మరియు మీ అసాధారణమైన బోధన, ఆమె విద్యాపరమైన మరియు వ్యక్తిగత ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాయి.

నలుగురు పిల్లల తల్లిగా, పాఠశాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం యొక్క ప్రాముఖ్యతను నేను ఎంతగానో అర్థం చేసుకోగలను.

మీ మార్గదర్శకత్వంలో బిల్కీస్ సాధించిన పురోగతికి నేను చాలా సంతోషిస్తున్నాను మరియు ఆమె అభివృద్ధిపై ఇది చూపిన ప్రగాఢమైన ప్రభావాన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నాను.

మీ అంకితభావానికి మరియు మద్దతుకు ధన్యవాదాలు.

(మెంటర్‌కు అందిన సందేశం)

ప్రకృతి- వికృతి !

12 - 14 ఏళ్లకు రజస్వల కావడం ప్రకృతి !
ఇది గతం !
8 - 9 ఏళ్లకే రజస్వల కావడం వికృతి !
ఇది వర్తమానం !
ఫాస్ట్ యుగం కదా ! ఇది కూడా ఫాస్ట్ .. తప్పేముంది అని అమాయక జనాలు !
అకాల యుక్త వయసు వల్ల...
రొమ్ము కాన్సర్ , అండాశయ కాన్సర్ , బిపి , చక్కర వ్యాధి , ఊబ కాయం, గుండెజబ్బులు మానసిక సమస్యలు .. వీటిలో రెండో మూడో బోనస్ గా వచ్చే ప్రమాదం !
అకాల యుక్త వయసు కు కారణం తెలియదు.. కారణం వాతావరణం అనేది దొంగ సైన్స్ !
కళ్లుండి చూసే వారికి ఆహ్వానం !
ఒక స్కూల్ తల్లితండ్రులను పిల్లలను ఎడ్యుకేట్ చేసి పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా చేస్తోంది . ఆ స్కూల్ లో అకాల యుక్త వయసు సమస్య లేదు .
వాతావరణమే కారణమయితే ఆ స్కూల్ పిలల్లు గురు గ్రహం లో లేరు కదా ?
కారణం తెలియ లేదా ! లేక జంక్ ఫుడ్ ఇండస్ట్రీ వాడు ఇచ్చే డబ్బు జబ్బు పట్టిందా ?

కొంప త్రిపుర కావాలా నాయినా?

బాల్య దశలోనే సెల్ ఫోన్
⬇️
స్కూల్ లో అందరు పిల్లలు అదే స్థితిలో... ఇది సహజం అనుకొనే స్థితిలో విద్యార్థులు .
⬇️
వీడియో గేమ్స్ .
⬇️
పోర్న్ చిత్రాలు .
⬇️
హుక్కా .
⬇️
మద్యం .
⬇️
డ్రగ్స్ ☠️☠️☠️☠️
ప్రకృతి మనిషికి ఎన్నో అవకాశాలిస్తుంది . తల్లితండ్రులు , విద్య సంస్థలు, మీడియా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు .. ఎవరూ పట్టించుకోని , కొంతమంది రాజకీయనాయకులైతే దీన్ని వ్యాపారంగా మార్చుకున్న స్థితి .
సమస్య ముదిరితే సంక్షోభం .
సంక్షోభమే పరిష్కారం .
దాన్నే ముసలం పుట్టడం అంటారు .
అది ప్రకృతి చూపిన పరిష్కారం .
అదే త్రిపుర మోడల్ .
220 స్కూళ్లు, 24 కాలేజీ లలో ఎయిడ్స్ రోగుల { హెచ్ ఐ వి పాజిటివ్ } గుర్తింపు .
వేగంగా విస్తరిస్తున్న వైనం
డ్రగ్స్ తీసుకొనే వారికి ఇప్పుడు ఎయిడ్స్ .
సిరంజి ల ద్వారా విస్తరిస్తోంది అని మీడియా కథనం .
అది ఒక కోణం మాత్రమే .
ఇప్పుడు అబ్బాయిల మధ్య మలద్వార సెక్స్ ఒక ట్రెండ్ .
నూటికి నూరు శాతం సోకుతుంది .
తప్పించుకొనే సమస్యే లేదు .
పోలే.. అయిపోలే .. సమస్య పరిష్కారం అయిపోలే .
చెప్పే నాకు , వినే మీకు విసుగొచ్చినా ఫరవాలేదు అనుకొని నేను పదేపదే పిల్లలకు సెల్ ఫోన్స్ ఇస్తే వారు రాక్షసులు అవుతారు , అప్పుడు ఎవరూ సేఫ్ కాదు అని చెబుతున్నాను.
తొమ్మిదో క్లాస్ పిల్లలు మూడో తరగతి అమ్మాయి ని రేప్ చేసి చంపేశారు అంటే మనం ఎంతటి ఊబిలో పడిపోయామో !!
If I repeatedly give cell phones to children thinking it's okay to get bored of me who tell, and you who listen, they'll become monsters, then I'm telling them that no one is safe.

ఉన్నతాధికారిగా ఉంటూ ప్రభుత్వ టీచర్స్ చేత .. చక్కగా పని చేయించాలి అనుకోవడం తప్పా ?

కాదు. కాదు. కాదు.
ఏసీ ఛాంబర్ లో కూర్చోకుండా ఊరూరా తిరిగి చెక్ చేయడం తప్పా ?
కాదు. కాదు. కాదు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమయిన విద్య అందివ్వాలి అనుకోవడం తప్పా ?
కాదు. కాదు కాదు.
మరెందుకు అర్ధంతరంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది ?
అతి!
అతి!!
అతి !!!
అతి .. బాబోయ్ అతి!
దేనికైనా ఒక పధ్ధతి పాడు వుంటుంది.
అతి కే అతి అనిపించేలా అతి చేస్తే ?
క్లీన్ బౌల్డ్.
ఈ పార్టీ ప్రభుతం .. ఆ మాటకొస్తే ఏ పార్టీ ప్రభుత్వమయినా ప్పోస్టింగ్ ఇవ్వదు.
ఇచ్చి వేలాది టీచర్ కుటుంబాల ఓట్లు దూరం చేసుకోదు.
పెద్దాళ్ళు ..” అతి సర్వత్రా వర్జయేత్ !” .. అని వూరికే అన్నారా ?
సికింద్రాబాద్‌ : బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. కాలేజీ ఫీజు డబ్బులను బెట్టింగ్‌లో పోగొట్టడంతో తల్లిదండ్రుల మందలించారని బీటెక్‌ విద్యార్థి గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ కథనం ప్రకారం.. నల్గొండలోని రవీంద్రనగర్‌కు చెందిన కొండూరు శ్రీనివాస్, నాగలక్ష్మి దంపతులకు నితిన్‌(21), ఇద్దరు కుమార్తెలు సంతానం. ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి కళాశాలలో బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న నితిన్‌.. స్నేహితులతో కలిసి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తల్లిదండ్రులిద్దరూ కూలి పనులు చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు.
నితిన్‌ చదివే కళాశాలలో ఫీజు చెల్లించాల్సి ఉండగా 10 రోజులు క్రితం తల్లిదండ్రులు రూ.1.03 లక్షలు నగదును కుమారుడుకి ఇచ్చారు. కళాశాలలో ఫీజు చెల్లించకుండా ఆ డబ్బులు బెట్టింగ్‌లో పోగొట్టాడు. ఈ విషయం తెలుసుకొని... కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇలా ఎందుకు చేశావని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన నితిన్‌.. మంగళవారం సాయంత్రం ఘట్‌కేసర్‌- చర్లపల్లి మధ్య గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకోపైలెట్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లిన జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీమార్చురీకి తరలించారు. మృతుడి వద్ద లభ్యమైన సెల్‌ఫోన్‌ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

“ అమెరికా లో నలుగురి తెలుగు వాళ్ళ అరెస్ట్. వారు అనేక మందిని అక్రమంగా నిర్బంధించి పని చేయించుకొంటున్నారు “ అని వార్తలు వస్తాయి ! చదవండి.

అర్థం కాదు.
వార్త మీకు అర్థం కాకూడదు.
అది అంతే.
అక్రమంగా నిర్భదించి పని చేయించుకోవడం ఏంటి ?
షెల్ కంపెనీ లంటే చమురు కంపెనీ నా ?
అపార్ట్మెంట్ లో అక్రమంగా నిర్భదించడం ఏంటి ?
వాళ్ళు కేకలు వెయ్యరా ?
పని దొరక్క ఎంతో మంది బాధ పడుతుంటే పని చేయడానికి నిర్భదించడం ఏంటి ?
.. లాంటి ప్రశ్నలు మీ మదిలో మెదులుతాయి.
అదేదో నేరాలు ఘోరాలు క్రైమ్ వార్త లాగ వుంటుంది. ఉండాలి. ఇదేదో కిడ్నాపింగ్ కథ అని మీరు అనుకోవాలి.
ఈ లోగా ఇంకో న్యూస్.
దీన్ని మరచి పోతారు.
అది అంతే !
అది అంతే !
మీ పిల్లోడు ( అమ్మాయి కూడా ) ఆరో తరగతి లోకి వచ్చాడా ? వామ్మో ! ఇంకా ఆలస్యం దేనికి సామీ ! ఇలా అయితే ఎలా బతుకుతారు?
ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ లో చేర్పించండి.
అటుపై ఏదో టమాటో పొటాటో ఇంజనీరింగ్ కాలేజీ లో సీట్. అటుపై అమెరికా!
అమెరికా విమానం ఎక్కాడా?
ఇగ పో. …
లైఫ్ ఫుల్ సెటిల్.
అటుపై అంతా స్వర్గమే.
స్వర్గమంటే అమెరికా !
రాజు గారి దేవతా వస్త్రాలు.
అమెరికా లో సమస్యలు వున్నాయి అంటే పిచ్చాడి కింద లెక్క.
జై అమెరికా. జై జై అమెరికా !
నిన్న నేను పెట్టిన పోస్ట్ కు స్పందనగా ఫేస్బుక్ మిత్రుడు ఒకరు మెసెంజర్ లో .. “ సార్ ! విజయవాడ కు ఒక వైపునున్న ఒక రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ అద్వానంగా వుంది .. అయినా ఒక గదిలో యాభై మంది.
విజయవాడ కు మరో వైపు ఒక కార్పొరేట్ పాఠశాల లో అడ్మిషన్స్ పూర్తయ్యాయి. ఇది ఎలా సాధ్యం ? “
నేను లోతుల్లోకి వెళ్లి కనుక్కుంటే ఇవి .. పి ఆర్ ఓ ల ద్వారా జరుగుతోంది అని అర్థమయ్యింది.
క్వాలిటీ తో సంభంధం లేకుండా ఈ వ్యవస్థ ద్వారా అడ్మిషన్స్ తెచ్చుకొంటున్నారు.
మాకు హైదరాబాద్ సిటీ లో , అడ్మిషన్స్ సమస్య ఎప్పుడూ లేదు.
Satisfy అయిన పేరెంట్స్ ద్వారా నలుగురికి తెలుస్తోంది.
విజయవాడ తిరుపతి లో కూడా సమస్య లేదు. హైదరాబాద్ లాగే వర్డ్ అఫ్ మౌత్ పబ్లిసిటీ.
సమస్య తిరుపతి .. గన్నవరం హాస్టల్ తో.
హాస్టల్ లో చేరేవారు ఎక్కువగా దూర ప్రాంతాల వారు. .. గ్రామీణ ప్రాంతాల వారు.
మొన్న గన్నవరం కు వచ్చిన ఒక వ్యక్తి “ వాసిరెడ్డి అమర్నాథ్ స్కూల్ ఇక్కడ ఉందని మాకు తెలియదు. తెలుసుంటే సీట్స్ దొరికే పరిస్థితి ఉండదు “ అన్నారట.
పుబ్లిసిటి ఇవ్వాలంటే సమస్య.
కొత్త తరం తల్లితండ్రులు పత్రిక లు పెద్దగా చదవరు. డబ్బు ఖర్చు పెట్టి పత్రికా ప్రకటనలు ఇస్తే బూడిదలో పోసిన పన్నీరు. టీవీ లు అంతే.
నెట్ రీచ్ .. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ.
పిఆరోఓ వ్యవస్థ అంటే సమస్యలు. ( నయా పైసా నాణ్యత లేని స్కూల్స్ , స్లేట్ .. రెండూ ఒకటే దారేనా ?) !
ఆలోచనలో నేను.

ఇంకేమి మిగిలింది ?

సైన్స్ ప్రకారం , మనిషి నలభై లక్షల సంవత్సరాల క్రితం పరిణామ క్రమంలో పుట్టాడు .
ప్రారంభలో మొత్తం జంతు ప్రవర్తనే !
వావి వరుసలు లేకుండా సంభోగించడం , సామూహిక సెక్స్ , అవతలి వ్యక్తి అనుమతిలేకుండా అనుభవించడం ఇలా ...
దీని వల్ల ఎన్నో సమస్యలొచ్చాయి .
క్రమంగా సామజిక నియమాలు వచ్చాయి .
వివాహ.. కుటుంబ.. బంధుత్వ.. రాజకీయ.. ఆర్థిక.. వ్యవస్థలొచ్చాయి .
దీన్నే సంస్కృతి అంటారు .
ఇది ఒక తరంనుండి మరో దానికి వారసత్వంగా సంక్రమించింది .
కాలానుగుణంగా మార్పులు కూడా వచ్చాయి .. అది వేరే టాపిక్ .
ముందుగా సినిమా ల వల్ల , టీవీల వల్ల .. క్రమంగా నెట్ అందుబాటు లోకి రావడం తో ఈ నియమాలు చెరిపేయడం మొదలయ్యింది .
సినిమాల కైతే ప్రభుత్వం సెన్సార్ ఏర్పాటు చేసింది .
ఆ సెన్సార్ ఎంత చెత్తగా ... అవినీతి మయంగా ఉన్నా ... ఎప్పుడో తప్ప అర్జున్ రెడ్డి లాంటి మలం .. ప్రేక్షకుల ముందుకు రాకుండా నివారించగలిగింది .
ఇంటర్నెట్ బిజినెస్ .. అంటే కంప్యూటర్ లు .. మొబైల్ ఫోన్స్ , యూట్యూబ్ , ఇంకా రకరకాల సోషల్ మీడియా .. డేటా బిజినెస్ .. ఇవన్నీ లాభసాటిగా జరగాలంటే నియంత్రణ ఉండకూడదు.
చాలా ప్లాన్డ్ గా.. పకడ్బందీ ప్రణాళికతో.. ఈ మాఫియా ముందుకు వచ్చింది .
పైత్యానికి వ్యక్తి స్వేచ్ఛ అని ముసుగు వేసింది .
ఊరవతల ఉన్న థియేటర్ లో రెండున్నర గంటల మలయాళ సినిమా గోల భరించయినా మూడు నిముషాల బిట్స్ చూసే స్థాయినుంచి యూట్యూబ్ ఫేస్బుక్ పై అర్ధ నగ్న , బూతు మాటల వీడియోలు.. నెట్ పై పూర్తి స్థాయి పోర్న్ చూసే స్థాయికి ఇరవై ఏళ్లలోనే జాతి ఎదిగింది .
తొలి రోజుల్లో ఒక పెగ్గు తాగితే కిక్కు .
అటు పై అదే కిక్కు రావాలంటే డోసు పెంచాలి
90 మిల్లి .. 2పెగ్స్.. క్వార్టర్.. హాఫ్ బాటిల్.. ఫుల్ బాటిల్ ..
రాత్రి పూట ఒక పెగ్గుతో మొదలయ్యింది .. పరగడుపునే రా తాగడం .. రోజంతా తాగడం దాక సాగుతుంది .
అదే డోపమైన్- హై .
పోర్న్ పైత్యనికయినా ఇదే వర్తిస్తుంది . యువతీ యువకుడి మధ్య అంటే సింగల్ .. తో మొదలయ్యి . గ్రూప్ .. మహిళ- మహిళ, పురుష- పురుష .. మిక్స్డ్ ఇలా సాగింది సెక్సపోతుల డోపమైన్ హై పయనం .
ఇప్పుడు ఇదీ కిక్ ఇవ్వడం లేదు
దీన్ని అర్థం చేసుకొన్న పోర్న్ వ్యాపారి కిక్ కోసం మరింత రా కంటెంట్ తీస్తున్నాడు .
తల్లి- కొడుకు.. తండ్రి - కూతురు... టీచర్- స్టూడెంట్ .. మైనర్ ల తో .. ఇప్పుడే ఇదే ట్రెండ్ .
యూట్యూబ్ అంటే పోర్న్ కు కూసింత గ్లామర్ .
అంతే .
ఉద్యోగాలు.. సద్యోగాలు లేవు .
ప్రతి వెధవ చేతిలో ఫోన్ . కాలక్షేపం కావాలి .
ఎంత పైత్యముంటే అంత కిక్కు .
చేసేవారికి అన్ని డబ్బులు .
డార్క్ కామెడీ అంట . దీనికొక స్కూల్ .. ఒక ఫిలాస పీ ..
హద్దులున్నది చెరిపేయడానికే అనేది బర్మా స్కూల్ . ఇప్పుడు పాపం రామ్ పాగల్ భర్మ వెనకబడ్డాడు . తన ఏకలవ్య శిష్యుల ప్రగతి చూసి ఏడో పెగ్గు వోడ్కా తరువాత సంతోషపడుతాడేమో
తండ్రి అయిదేళ్ల కూతురు మధ్య ఉన్న ఒక వీడియో పై .. ఊహకు కూడా అందని కామెంట్స్ చేస్తూ అని ఒక వెదవ వీడియో చేసాడు .
ఇదే అధఃపాతాళం . ఇంకా దిగజారడానికి మెట్లు లేవు
కొన్ని నెలల క్రితం బంజారా హిల్స్ లోని ఒక స్కూల్ లో ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ ఎల్కేజీ పాప పై అత్యాచారం చేసాడు .
వాడు అరెస్ట్ అయ్యాక బాగా ట్రీట్మెంట్ ఇచ్చి " అరేయ్ .. నా .. అంత చిన్న పాపపై ఆలా చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందిరా?" అని ఒక వ్యక్తి అడిగాడు ." యూట్యూబ్ లో ఒకటి పొతే ఇంకొకటి వీడియోలు వస్తున్నాయి సార్ .. వాటిని చూసి తమాయించుకోలేక ఆలా చేశాను అన్నాడు .. వాడు దెబ్బలకు మూలుగుతూ ..
ఇప్పుడు అదే యూట్యూబ్ లో తండ్రి కూతురు మధ్య ఆ లింక్ పెడుతూ వీడియో లు .
అంటే ఏంటి ?
రెండు రోజులకు ఇది ట్రెండ్ అవుతుంది .
ఇలాంటివి చూసిన సైకో తన బిడ్డపైనే .. బంజారా హిల్స్ స్కూల్ కారు డ్రైవర్ లా ప్రవర్తిస్తాడు .
కంచె చేను మేస్తే ఇక అడ్డుకోనేది ఎవరు ? తిరిగి మానవ సమాజం ఆదిమ దశలోకి వెళ్లి పోతుంది .
ఇలాంటి కంటెంట్ తయారు చేసిన మృగాలను కని .. సమాజం పైకి వదిలేసిన మృగాలను ఏమి చెయ్యాలి ?
నలుగురు పసికందులపై నీచపు కామెంట్స్ .. వారు మైనర్లు కదా ? అంటే అందరి వయసు కలిపితే 18 కదా అని కామెంట్ .
ఇదండీ సంగతి !
పాయింట్ చాల సింపుల్ .
ఎవరో నటుడు టాగ్ చేస్తే పోలీస్ లు చర్యలకు దిగారు . ఇది రెండు రోజులు . తరువాత మామూలే . ఈ చెత్తతో అయిపోయిందా ? ఇలాంటి చెత్త నెట్ పై టన్నుల కొద్దీ .
ప్రభుత్వాలు వీటి పై అడహాక్ గా స్పందించడం నేరం .
ఒక పాలసీ లేకపోవడం ఘోరం .
ఇలాగైతే ఎవరి బతుకులకూ భద్రత ఉండదు . ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగం , పార్లమెంట్ , అసెంబ్లీ , పోలీస్ .. కోర్ట్స్ అనే వ్యవస్థలకు అర్థం లేకుండా పోతోంది .
అసలు మన బతుకుల గురించి పట్టని ప్రభుత్వాలకు .. మనం ఎందుకు టాక్స్ లు కట్టాలి ?
చావో రేవో తేలిపోవాలి !

కథ బాగుంది. ముగింపు బాగా లేదు.

The story is good. The ending is not good.
The story is good. The ending is not good.

ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ ❓❓‼️‼️⁉️

హైదరాబాద్ నడి బొడ్డులో, నలబై సంవత్సరాల చరిత్ర గలిగిన స్కూల్ అది .
ఒక మాదిరి పేరుంది .
పదో తరగతి పరీక్ష రాసి స్కూల్ వదిలి వెళ్లిన వారు 250 .
ఎల్కేజీ , ఒకటో తరగతి లో కొత్తగా అడ్మిషన్స్ తీసుకున్నవారు కేవలం యాభై . ఇది కాకుండా కొన్ని టీసీ లు .
అంటే స్కూల్ స్ట్రెంగ్త్ 250 తగ్గి పోయింది .
ఇది కాకుండా మరో 200 మంది విద్యార్థులు స్కూల్ కు రావడం లేదు . ఫోన్ చేస్తే తల్లితండ్రులు ఫోన్ తీయడం లేదు . వారిక స్కూల్ కు రానట్టే .
అంటే మొత్తంగా చూస్తే స్కూల్ స్ట్రెంగ్త్ 450 తగ్గిపోయింది .
ఎందుకు ?
స్కూల్ ఫీజు ఏమైనా పెంచారా? అంటే పెద్దగా లేదు . ఆ స్కూల్ లో ఒకటో తరగతి నుంచి పదో వరకు ఒకటే ఫీజు . అది సంవత్సరానికి 33 వేలు .
స్కూల్ భవనం సొంతది . అద్దె లేదు .
నిజం చెప్పాలంటే ఈ ఫీజు తో మంచి టీచర్స్ ను నియమించడం .. నాణ్యమయిన చదువు అందించడం కష్టం .
ఫీజు అంత తక్కువగా ఉన్నా ... స్కూల్ స్ట్రెంగ్త్ ఎందుకు తగ్గింది ?
అర్థం కాకుండా తలలు పెట్టుకొంటున్న యాజమాన్యం .
స్ట్రెంగ్త్ తగ్గడం .. కేవలం ఆ ఒక్క స్కూల్ విషయం లోనే జరిగిందా ?
లేదు .
ఇంచు మించు అన్ని తక్కువ - బడ్జెట్ పాఠశాలల్లో ఇదే పరిస్థితి . కేవలం హైదరాబాద్ లోనే కాదు . తెలంగాణ.. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే స్థితి .
టీచర్స్ ను ఇంటింటా తిప్పినా... ఫీజు లో భారీ డిస్కౌంట్స్ ఇచ్చినా అడ్మిషన్స్ నిరుత్సాహ కరంగా ఉన్నాయి.
పరీక్షలు రాసి పాటశాల లు వదిలి వెళ్లిన వారి సంఖ్యలో కనీసం నాలుగో వంతు ఎల్కేజీ ఒకటో తరగతి లాంటి కింది తరగతుల్లో చేరడం లేదు . పై తరగతుల్లో నాలుగు అయిదు సెక్షన్స్ ఉంటే కింది తరగతుల్లో ఒక్కటే .
దీనికి కారణాలు ఏమై వుంటాయో ఎవరికీ అర్థం కావడం లేదు .
⁉️⁉️జనాభా హీనత ?
ఇటీవల కాలం లో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిర పడిన వారి సంఖ్య పెరుగుతోంది . నవ తరం వారిలో నలుగురిలో ఒక్కరే ఇక్కడ . మిగతా వారు అమెరికా.. ఆస్ట్రేలియా... కెనడాలాంటి దేశాల్లో .
దీనికి తోడు పెళ్లి వద్దు అంటున్న యువతులు ... కొంత శాతం .
దీనితో బ్రహ్మచారులుగా యువకులు .
పెళ్లి చేసుకొన్నా... పిల్లలు వద్దనుకున్న వారు కొంతమంది .
కన్నా... ఒకే బిడ్డ .
కావాలనుకున్నా... పిల్లలు పుట్టక సంతన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ దేవుడు కరుణిస్తాడని ఆశ గా ఎదురు చూస్తున్న ... వాక్ సీన్ గుచ్చుకొన్న పాపానికి అల్లాడిపోతున్న.. నిర్భాగ్యులు కోకొల్లలు .
జనాభా క్షీణత . అయిదు - ఆరేళ్ళ పిల్లల సంఖ్య భారీగా తగ్గిపోవడం .
ఈ విధంగా బడిలో చేర్పించే పిల్లల సంఖ్య... పదేళ్ల నాటి సంఖ్య తో పోలిస్తే భారీగా తగ్గిపోయింది అనుకోవాలా ?
అందుకే పది లో అయిదు వందల మంది ఉంటే కొత్తగా స్కూల్ లో చేరే మూడేళ్ళ పిల్లల సంఖ్య కేవలం యాభై వందగా ఉంటోందా ?
⁉️⁉️డిమాండ్ తక్కువ - సప్లై ఎక్కువ .
స్కూల్ బిజినెస్ అంటే బంగారు బాతు అని ప్రచారం . దీనితో లెక్కకు మించి కొత్త పాఠశాలలు .
హైదరాబాద్ వరంగల్ వైజాగ్ విజయవాడ లాంటి నగరాల్లో సందుగొందు లో ప్లే స్కూల్స్ వెలిసాయి . ఇంటికి దగ్గరగా ఉంటుందని ఇలాంటి పాటశాలల్లో పిల్లల్ని చేర్పించడం వల్ల ప్రధాన పాఠశాలల్లో అడ్మిషన్స్ తగ్గుతోందా ?
⁉️⁉️పాటశాల తమ స్టేటస్ సింబల్ అని భావించే తల్లితండ్రుల సంఖ్య పెరుగుతోంది . ముఖ్యంగా సిబిఎస్సీ, కేంబ్రిడ్జి , ఐబి పాటశాలల్లో తమ పిల్లలు చదవడం తమ స్టేటస్ కు కు సూచిక అని భావించే ఉన్నత మధ్య తరగతి తల్లితండ్రులు ఎక్కువ .
దీన్ని అవకాశంగా తీసుకొని విదేశీ ఇన్వెస్టర్ ల సాయం తో... ఇంకా ఫార్మా స్టార్ ఆసుపత్రుల మారాజులు కరోనా సొమ్ముతో తమ ఇంటి కోడళ్ళు మనువరాళ్ల ఆధ్వర్యం లో ఇంటర్నేషనల్ పాటశాలలు ప్రారంభించారు .
ఒక్క హైదరాబాద్ లోనే కనీసం యాభై కి పైగా ఇంటర్నేషనల్ పాఠశాలలు వెలిసాయి .
కొత్త తరం తల్లితండ్రులు ఇలాంటి పాటశాలల్లోనే చేర్పించడానికి ఇష్ట పడుతున్నారా ?
కొంత వరకు అవును అని సమాధానం .
అలాగని వీటి పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు . హైదరాబాద్ తార్నాక లో ఫ్రాంచైజ్ సిబిఎస్సీ పాటశాల కోనేళ్ళ క్రితం వెలిసింది . వేలం వెర్రిగా అందులో అడ్మిషన్స్ జరిగాయి . పాటశాల స్ట్రెంగ్ ఆరువేల కు పైనే . సిబిఎస్సీ పాఠశాలకు క్రేజ్ పెంచిన స్కూల్స్ ఇదొకటి . ఇప్పుడు ఆ పాటశాల లో కూడా ప్రీ ప్రైమరీ అంటే ఎల్కేజీ యూకేజీ లలో అడ్మిషన్ తగ్గిపోతున్నాయి .
సుమారుగా వంద కోట్లతో రెండేళ్ల క్రితం ఒక సిబిఎస్సీ పాఠశాల వెలిసింది . అనుకొన్న స్థాయిలో అడ్మిషన్ జరగలేదన్న నిరాశలో ఇప్పుడు యాజమాన్యం ..
ఏమి జరుగుతోంది ?
1. చిన్న పిల్లల జనాభా తగ్గిపోతుందా ?
{ కుటుంబ నియంత్రణ ను వద్దనుకునే ఒక కమ్యూనిటీ విషయం లో ఇది జరగడం లేదు . ఆ కమ్యూనిటీ ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఆ పిల్లల శాతం అన్ని స్కూల్ లో పెరుగుతోంది . మిగతా కమ్యూనిటీ ల సంఖ్య తగ్గిపోతోంది . పదేళ్ల క్రితం ౩౦: 70 గా ఉన్నా నిష్పత్తి ఇప్పుడు 70 : 30 అయ్యింది .
2 అడ్మిషన్స్ తగ్గిపోవడానికి కారణం డిమాండ్ డిమాండ్ తగ్గి సప్లై పెరిగిపోవడమా?
.. ప్రతి సందులో నిబంధనల్ని తుంగలో తొక్కి వెలసిన ప్లే స్కూల్స్ ఇంకా కొన్ని కార్పొరేట్ స్కూల్స్ !
3. లేక ఇంటర్నేషనల్ స్కూల్స్ పట్ల పెరిగిన మోజా ?
4. అన్ని రకాల స్కూల్ పెరిగిపోవడం వల్ల .. అన్ని స్కూల్స్ లో కొత్త అడ్మిషన్ తగ్గిపోయాయి అనుకోవాలా ?
ఏమి జరుగుతోంది ?
కారణాలు ఏంటి ?
జనాభా క్షీణతే కారణమా అయితే దేశానికి .. ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ .
" జనాభా తగ్గితే రోడ్డు ల పై ట్రాఫిక్ తగ్గుతుంది .. మంచిదే కదా?" అనుకొనే అమాయకులకు ముందు ముందు తత్త్వం బోధపడుతుంది .
తొలిగా పాఠశాలలు... టీచర్స్ పై ఎఫెక్ట్ .
అటుపై మొత్తం సమాజం పై .
స్కూల్స్ సంఖ్య భారీగా పెరిగితే మాత్రం .. అది మంచికే . మార్కెట్ కరెక్షన్ అంటారు . కరోనా పాపపు సొమ్ము విదేశీ విన్వెస్టర్ సొమ్ము లాంటి వాటితో వెలసిన పాటశాలలకు వాటి యజమానులకు ముందు ముందు బయ్యా జ్యూస్ కు పట్టిన గతే. సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్ . నిజమయిన నాణ్యత నిలిచి వెలుస్తుంది . ఏదో మంచి స్కూలో... ఏది సోకుల స్కూలో కాలమే నిర్ణయిస్తుంది .

బకాసురుడు , కీచకుడు , జరాసంధుడు , దుర్యోధనుడు - హీరోలు

బీముడు - విలన్
మరో పదేళ్లలో నేటి తరం పిల్లల అవగాహన !
ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఎక్కడా రామాయణ మహాభారత గాథలు పాఠ్య పుస్తకాల్లో లేవు { దేవుడు , మతం అనే కోణం కాసేపు పక్కన పెట్టండి . ఇతిహాసాలను లైఫ్ స్కిల్స్ పాఠాలుగా చెప్పాలి అనే ఆలోచన కూడా లేదు } .
ఒకప్పుడు పౌరాణిక సినిమాలు దండిగా వచ్చేవి . ఇప్పుడు పురాణాల్ని తిరగేసి ఫాంటసీ సినిమాలు తీస్తున్నారు.
ముప్పై లోపు వయసు ఉన్నవారికి ఇతిహాసాల గురించి తెలియదు . ఇతిహాసాల సంగతి పక్కన పెట్టండి . కనీసం నాలుగు నీతి కథలు రావు . పిల్లలకు బెడ్ టైం స్టోరీస్ చెప్పడం అనే సంప్రదాయం పోయింది .
మంచి చెడు అనేది పెద్దలు పిల్లలకు చెప్పకపోతే , సమాజం గతి తప్పదా ?
పెద్దలు పిల్లలకు నీతి కథలు చెబితే ..
1 . తల్లితండ్రుల - పిల్లల మధ్య బంధం మరింత దృఢమవుతుంది . మా అమ్మ నాన్న కు ఎన్నో తెలుసు . వారిని అడిగి తెలుసుకోవాలి అని ఆలోచన పిల్లల్లో బలపడుతుంది . పెద్దయ్యాక కూడా తల్లితండ్రులు గైడెన్స్ కోసం చూస్తారు . పెద్దల మాట వింటారు .
2 . దృశ్య రూపం లో చూడడం కన్నా శ్రవణ రూపం లో కథ సృజనాత్మకత , కల్పన శక్తి , ఊహా శక్తి , అవగాహన లాంటి నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది.
౩. టీవీ , సెల్ ఫోన్స్ వ్యసనం .. పిల్లల్లో పెద్దల్లో తగ్గిపోతుంది .
4 . తెనాలి రామ , బీర్బల్ , నీతి చంద్రిక లాంటి కథలు వింటే క్రిటికల్ థింకింగ్ , లాటరల్ థింకింగ్ లాంటి స్కిల్స్ అలవడతాయి . ఈ స్కిల్స్ అన్నీ రోబో యుగంలో ఎంతో కీలకం అవుతాయి .
మనిషి సంఘ జీవి . సరైన రీతిలో సామాజీకరణ జరగపోతే ఎన్నో అనర్థాలు . బతుకు బస్టాండ్ అయిపోతుంది .
ఎన్నో తరాల సంచిత విజ్ఞానమే కథలు .
మనిషి బతకడానికి ఆక్సిజన్ , నీరు , ఆహారం ఎంత అవసరమో మంచి చెడు గురించి తెలుసుకోవడం అంతే అవసరం .
కథల రూపంలో నీతి నియమాల బోధన వ్యక్తి ప్రవర్తన నియంత్రిస్తుంది !
ఇదే సమాజ పోకడ !!
దేశ భవిత !!!
వినోదం పేరుతొ మెదళ్లలో విషాన్ని ఎక్కిస్తున్న సమాజం ఇప్పటికే భారీ మూల్యాన్ని చెల్లించుకొంటోంది .
మీ పిల్లలకు నీతి కథలు చెప్పడం ప్రారంభించండి .
అప్పుడు మీ ఇల్లు నందనవనం అవుతుంది .
శుభోదయం .

నల్లన్నం - ముద్ద పప్పు. నెయ్యి

బ్లాక్ రైస్.
మిగతా రకాల బియ్యం తో పోలిస్తే ప్రోటీన్ లు పీచు ఇనుము అధికం.
యాంటీఆక్సిడాంట్లు అధికం. గుండెకు మేలు.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. అంటే షుగర్ వ్యాధి గ్రస్తులకు ఉపయుక్తం. ( నాకు షుగర్ లు బిపి లు ఏమీ లేవు. ఆసుపత్రి మొఖం చూసి మూడేళ్లయింది. )
ఇందులోని కొన్ని పోషకాలు కంటికి మేలు కలిగిస్తాయి.
బ్లాక్ రైస్. ఒకనాటి చైనా రాజుల ఆహారం. ధర అధికం.
పప్పులో ప్రోటీన్లు. నెయ్యి లో మంచి ఫాట్.
అన్నట్టు ఈ రోజు నా డైట్ బ్రేక్.
Nallanam - Mudda Pappu ghee
NRSC
NRSC
NRSC
NRSC
NRSC
NRSC
NRSC
NRSC

మన దేశపు ఆత్మ హత్యల రాజధాని , రాజస్థాన్ లోని కోట !

ఇక్కడ ప్రతి ఫ్యాన్ కు ఒక స్ప్రింగ్ ఉంటుంది . ఇరవై కిలోల బరువుకంటే ఎక్కువ భారం ఈ స్ప్రింగ్ పై పడితే అది సైరెన్ మోగిస్తుంది .
అమెరికా లాంటి దేశాల్లో పొగ వస్తే సైరెన్ మోగుతుంది . అగ్నిప్రమాదమని ఫైర్ ఇంజిన్ వస్తుంది .
కోట లో ఆత్మ హత్యల సైరెన్ మోగితే పక్క పై వారు వచ్చి ఉరి తాడు తొలగించి ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ టార్చర్ భరించలేక మెడకు వురి తాడును బిగించుకొన్న నూనూగు మీసాల యువకుడ్ని రక్షిస్తారు .
ఆత్మ హత్యల నివారణకు ఇంత అద్భుతమయిన ఐడియా ఇచ్చిన వారిని నో బుల్ పీస్ ప్రైజ్ ఇచ్చి సన్మానించాలి .
అన్నట్టు నిన్న బీహార్ కు చెందిన 16 ఏళ్ళ విద్యార్ధి ఉరివేసుకొన్నాడు . ఆ ఫ్యాన్ కు సైరెన్ బిగించలేదు అని పోలీస్ లు చెప్పారు . ఈ అయిదు నెలల్లో ఇది 13 వ తమ హత్య!
చదువులు - చావులు !

మన దేశం లో ముగ్గురిలో ఒక్కరు రక్తహీనత తో బాధపడుతున్నారు .

హీమోగ్లోబిన్ మన శరీర కణాలకు ఆక్సిజన్ ను అందించే కొరియర్ . అలాగే తిరుగు ప్రయాణంలో అది కార్బన్ డయాక్సైడ్ ను కణాల నుండి ఊపిరి తిత్తులకు చేరవేస్తుంది .
రక్త పరీక్ష చేయించినప్పుడు 11 - 16 మధ్యలో రీడింగ్ ఉంటే అది నార్మల్ . 11 కంటే తగ్గితే హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నట్టు లెక్క .
❌పల్స్ ఆక్సీమీటర్ తో హీమోగ్లోబిన్ శాతాన్ని లెక్క కట్టవచ్చా?
ఇందులో అనేక సమస్యలున్నాయి . ఈ పధ్ధతి పాటించకపోవడమే మంచిది .
హీమోగ్లోబిన్ తక్కువుంటే ?
��నీరసం , బలహీనత , చర్మం పాలి పోవడం , ఊపిరి ఆడకపోవడం , కళ్ళుతిరినట్టు అనిపించడం , చేతులు కాళ్ళు చల్ల బడిపోవడం , గుండె పై అధిక ఒత్తిడి , తలనొప్పి లాంటి సమస్యలొస్తాయి .
హీమోగ్లోబిన్ లోపానికి ప్రధాన కారణం తీసుకొనే ఆహారం లో పోషక విలువలు లోపించడం .
ప్రధానంగా ఇనుము బి 9 , బి 12 లోపాలు రక్తహీనతకు దారి తీస్తాయి .
1 . మాంసాహారుల్లో బి 12 లోపముండదు . మన దేశంలో గుజరాత్ , రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో బి 12 లోపం చాలా తీవ్రంగా వుంది . పాల ద్వారా శరీరానికి బి 12 అందుతుంది . ఇది ఒకప్పటి మాట . ఇప్పుడు గడ్డి మేసే ఆవులు తక్కువ . ఇలాంటి స్థితి లో పాల ద్వారా శరీరానికి తగినంత బి 12 అందడం లేదు . ఆధునిక మానవుడి గట్ హెల్త్ పాడైపోయింది . లాజిక్కులు మాట్లాడుతూ ఎంత సేపయినా వాదించవచ్చు . కానీ నిజం... నిజం కాకపోదు . ఒక్క ముక్క లో చెప్పాలంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ద్వారా శరీరానికి తగినంత బి 12 అందదు . 45 ఏళ్ళు వచ్చేదాకా ఈ సమస్య కనిపించక పోవచ్చు. శాఖాహారులు ముఖ్యంగా 45 దాటిన వారు టాబ్లెట్స్ రూపంలో లేదా ఫోర్టిఫైడ్ ఫుడ్ రూపం లో బి 12 తీసుకోవాల్సిందే .
2. రక్త హీనత రాకుండా ఉండాలంటే శరీరానికి తగినంత ఇనుమును అందించాలి . ఇనుప బాండలిలో వేపుళ్ళు , సాంబార్ లాంటి వంటలు చేస్తే సరి . బీన్స్ , కొత్తిమిరి , మినుప పప్పు పెసర పప్పు , చికెన్ , ఫిష్ మటన్ .. ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహారాలు .
3. హీమోగ్లోబిన్ తగ్గకుండా ఉండాలంటే శరీరానికి తగినంత సి విటమిన్ కూడా అందించాలి . టమాటో ఆరంజ్ , నిమ్మ లాంటి పుల్లటి పళ్లలో తగినంత సి విటమిన్ ఉంటుంది .
4. బి 9 విటమిన్ అంటే ఫోలేట్ కోసం ఆకుకూరలు బీన్స్ , పచ్చి బటానీలు తీసుకోవాలి .
5. మన శరీరానికి కాల్షియమ్ అవసరం . ఇది ఉంటేనే ఎముకలు దృఢం . కానీ ఇక్కడో సమస్య వుంది . ఒకే సారి కాల్షియమ్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకొంటే మన శరీరం ఇనుమును గ్రహించలేదు . కాబట్టి ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు కొన్ని గంటల పాటు కాల్షియమ్ రిచ్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఆకుకూరల్లో రెండూ ఉంటుంది . తీసుకోవడం తప్పు కాదు కానీ ... .
అలాగే కాఫీ టీ కూడా మన శరీరానికి ఇనుము అందకుండా చేస్తాయి .
6. రక్త హీనత రాకుండా ఉండాలంటే ఆగినంత నీరు తాగాలి .
7. కాపర్ కూడా తగినంత ఉండాలి . లివర్ , బాదాం , జీడీ పప్పు ద్వారా కాపర్ అందించవచ్చు .

కుప్ప కూలనున్న నెంబర్ -2 ?

నెంబర్ -1 పని ఎప్పుడో ముగిసింది.
ఇప్పుడు లైన్ లో నెంబర్ -2
భారతదేశ ఏడూ టెక్ కంపెనీ లు.
అమ్మేస్తాము లేదా విలీనం చేసుకోండి అంటూ నెంబర్ -2 !
అయినా ఎవరూ ముందుకు రాని స్థితి.
కరోనా కాలం లో ఆన్లైన్ కే పరితమయిన ఈ అకాడమీ ఇటీవల అనేక చోట్ల కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఇప్పుడు అమ్మకానికి పెట్టి బేలగా ఎదురు చూస్తున్న స్థాపకుడు.
ఎవరూ కొనక కంపెనీ దివాళా తీస్తే , ఇందులో చేరిన విద్యార్థుల గతి ఏంటో !!

తరచూ ఉపవాసాలు చేస్తే రక్తహీనత ఏర్పడి , తీవ్ర అనారోగ్యం వస్తుందా ?

ఈ అంశం పై పోస్ట్ పెడదామని కంప్యూటర్ ఆన్ చేస్తే వైఫై పని చేయడం లేదని అర్థమయ్యింది.
మొబైల్ పై అంత పొడవాటి మెసేజ్ టైపు చేయడం ఇష్టం లేదు.
బహుశా రేపు పోస్ట్ చేస్తాను.
ఐరన్ , బి 9 , బి 12 కాపర్ ✅
కాఫీ , టీ , కాల్షియమ్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు ❌
నీరసం , తలనొప్పి , మెదడు చురుకుదనం లోపించడం
ఇంకా చాలా అంశాలు.
శుభోదయం !
Telugu in 'Sandi' gadhavastha...

విద్యా ఉచ్చు !

చదువు వల- ఎడ్యుకేషన్ ట్రాప్ !
ఇదేంటి చదువు వల ఎలా అవుతుంది ? అనుకొంటున్నారా ?
అయితే చదవండి !
ఇంటర్నేషనల్ స్కూల్స్ ! ప్రైవేట్ యూనివర్సిటీ లు / ఇంజనీరింగ్ / మెడికల్ / మానేజ్మెంట్ కళాశాలలు !
డబ్బున్న తల్లితండ్రులు !
అత్యుత్తమయినదానినే తమ బిడ్డ కు అందించాలని సీట్లు కొనేసి పిల్లల్ని చదివిస్తున్నారు .
డిగ్రీ .. అటు పై పిజి .. అటు పై ఎంబీఏ లాంటి రెండో పిజి ..
చదువు పూర్తయ్యేటప్పటికీ మొత్తం పెట్టుబడి అయిదు కోట్లు పై మాటే .
ఫైవ్ స్టార్ హోటల్స్ కు మించిన సదుపాయాల్లో చదువు "కొన్న " విద్యార్థులు .
సహానుభూతి , సామజిక టెలివితేటలు... లాంటి నాయకత్వ లక్షణాలు హుళక్కి .
చదువు నాణ్యత అంతంత మాత్రం .
బయటకు వస్తే తగిన ఉద్యోగాలు రావు .
వచ్చినా జీతం తాను కాలేజీ వాష్రూమ్ లో వాడి పడేసిన టిష్యూ పేపర్స్ విలువ కూడా చెయ్యదు !
కష్టపడే తత్త్వం .. ప్రతికూలతలను అనుకూలతకుగా మలుచుకునే నేర్పు ఉండదు .
జీవితం లో ఫెయిల్ . నిరాశ .. నిస్పృహ !
పోనీ .. ఫామిలీ బిజినెస్ లోకి వెళితే ?
అప్పటికీ తండ్రి/ తాత... బిజినెస్ నడపగలగే స్థితిలో ఉంటే ... కంపెనీ లో ఏదో పదవి .. జీతం వస్తుంది .
ఆలా కాకుండా వెంటనే పగ్గాలు చేతికి వచ్చేస్తే .. తాతగారు .. తండ్రిగారు .. ఏళ్ళ శ్రమ తో నిల్చోపెట్టిన కొండంత కంపెనీ ని మూడు నాలుగేళ్ళలో ముంచేస్తారు .
ఒక వ్యక్తి చదువు .. ఆ వ్యక్తికి సంపద / పెట్టుబడి / అండ కావాలి .
అండ కాదు గుదిబండ !
చదువే వలాగా మారితే ?
అదే విద్యా ఉచ్చు ..
గొప్పింటి కుర్రోళ్ళు / అమ్మాయిలు వేలమంది ఇప్పటికే ఈ వలలో చిక్కారు .
ఉద్యోగాలు ఉన్నాయి. కానీ అవి తాను చదివిన చదువుకు సూట్ కావు .
తన చదువుకు తగ్గ ఉద్యోగాలు లేవు ..
ఉన్నా తక్కువ సంఖ్యలో .. తనకు డిగ్రీలయితే ఉన్నాయి .. కానీ జాబ్ కు సరిపడా నైపుణ్యాలు లేవు .
ఇదే వల . ఎడ్యుకేషన్ ట్రాప్ .
చిక్కినవారు బయటకు రాలేరు .
రంగుల కల లాంటి యవ్వనం ముగియకముందే జీవితం ఎండమావి రూపం లో .
డ్రగ్స్ .. సెక్స్ .. లాంటి వాటితో మానసిక కుంగుబాటు నుంచి తప్పించుకొనే ప్రయత్నం .
ఆ విధంగా మరింత ఊబిలోకి ..
అనగనగా ఒకడవిలో జాలిగుండె కోతి . తుఫాను నీటిలో చిక్కుకుంది . కష్టపడి అపాయం నుండి తప్పించుకొని చెట్టిక్కి కూర్చుంది .కింద నీటిలో చూస్తే చేప ." అయ్యో! నాలా చేప ఎంత కష్టపడుతుందో" అని, వంగి ... దాన్ని తీసి చెట్టుకొమ్మ పై పెట్టింది .
మనం పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదనే ఆలోచనతో తో పిల్లల్ని ఎడ్యుకేషన్ ట్రాప్ లో ఇరికిస్తున్న బొమ్మరిల్లు తల్లితండ్రులకు / హెలికాప్టర్ పేరెంట్స్ కు ఈ పోస్ట్ అంకితం !
" నాన్నా! నువ్వు సంపాదించిందానితో ఊళ్ళో పొలం కొనే బదులు బెంగళూరు లో ప్లాట్స్ కొనచ్చు కదా?" అంటే ..
" నా సంపాదన నా ఇష్టం . నువ్వు సంపాదించుకొని నీ జీవితం ప్లాన్ చేసుకో .. పీజీ చదువు వరకే నా బాధ్యత .. ఇప్పుడు సివిల్స్ కోచింగ్ .. యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో ఎం ఫిల్ అంటున్నావు . ఫెలోషిప్ సంపాదించుకొంటావో .. అడుక్కొంటావో .. నీ ఇష్టం.. నన్ను డబ్బు అడక్కు " అని ఆ రోజు నా ఆగ్రహానికి గురయిన కీర్తి శేషులు వాసిరెడ్డి శ్రీరాములు గారికి - నాన్నకు ప్రేమతో !
Telugu in 'Sandi' gadhavastha...
Amarnath Vasireddy
Amarnath Vasireddy
Amarnath Vasireddy
Amarnath Vasireddy
Amarnath Vasireddy

స్టేటస్ .. హంగు .. ఆర్బాటం !

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక జిల్లా విద్య శాఖాధికారి, నిన్న మండల విద్య శాఖాధికారుల సమావేశం లో మాట్లాడుతూ... " ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా అడ్మిషన్స్ తీసుకొనే విద్యార్థుల సంఖ్య... గత ఏడాదితో పోలిస్తే... సగానికి పడిపోయింది ... అడ్మిషన్స్ కోసం నేనే ఇల్లిల్లూ తిరుగుతాను "
- పత్రికల్లో వార్త !
అయ్యా ! డీఈఓ గారు !
మీ చిత్తశుద్ధి బాగుంది . కానీ ఇల్లిల్లూ తిరిగితే ... అడ్మిషన్స్ రావు మాస్టారూ !
మీరేమి చేసినా ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతూనే ఉంటుంది . సమాజాన్ని అర్థం చేసుకోలేక పొతే ఎలా ?
ఇప్పుడు దేశమంతా , ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ నడుస్తోంది .
కరోనా తరువాత ఇది బాగా ఉదృతమయ్యింది .
ఊర్ధ్వ ముఖపు వలసలు !
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.... ప్రైవేట్ బడ్జెట్ { అంటే నెలకు వెయ్యి.. రెండు వేలు ఫీజు ఉన్న} పాఠశాలలకు వలస పోతున్నారు .
బడ్జెట్ పాటశాలల విద్యార్థులు... కార్పొరేట్ మిడ్ బడ్జెట్ ... అంటే నెలకు మూడు నాలుగు వేల ఫీజు ఉన్నవాటికి ...
మిడ్ బడ్జెట్ పాఠశాలల వారు... హై బడ్జెట్ సిబిఎస్సీ పాటశాలలకు ...
సిబిఎస్సీ వారు... కేంబ్రిడ్ కరికులం పాఠశాలలకు ...
కేంబ్రిడ్ పాఠశాల వారు ఐబీ కి ..
ఐబీ వారు హై ఎండ్ సెవెన్ స్టార్ పాఠశాలలకు వలస పోతున్నారు .
తమ పిలల్లు చదివే పాటశాలల ఫీజు , అక్కడ ఉన్న హంగు ఆర్భాటాలు తమ స్టేటస్ కు సూచిక అని... ఆధునిక తల్లితండ్రులు ... అంటే కరోనా వాక్ సీన్ వేసుకొన్న ప్రతోడు భావిస్తున్నాడు .
దీన్ని ఎవడూ ఆపలేడు.
దౌర్బాగ్యమిటంటే ఈ ట్రెండ్ గురించి మేధావుల్లో కనీస అవగాహన లేదు . అందుకే పాపం డీఈఓ గారు ఇల్లిల్లూ తిరుగుతాను అని చెబుతున్నారు .
ప్రభుత్వ పాఠశాలలు చేసిన పాపమేమి ?
విద్య బాగోదా?
నిజమే... ఇక్కడా.. అక్కడా ఇంకా బడి ఎగొట్టి సొంత బిజినెస్ చేసుకొనే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు.అలాంటి వారి సంఖ్య తక్కువ .
నూటికి తొంబై శాతం ప్రైవేట్ పాటశాలలకంటే నాణ్యమయిన విద్య ప్రభుత్వ పాటశాలల్లో అందుతోంది .
మరి సమస్య ఏమిటి ?
చదువు నాణ్యత ఎవడికి కావాలిరా ?
ప్రభుత్వ పాటశాలల్లో విద్య ఉచితంగా వస్తుంది ... అదే సమస్య .
ఫ్రీ గా వచ్చే చదువు చెప్పించడమంటే నామోషీ .. తల కొట్టేసినంత పని .
ఎంత ఫీజు అయితే అంత గొప్ప !
హంగు ఆర్భాటాలే ముఖ్యం !
హైదరాబాద్ లో ఒక ఇంటర్నేషనల్ పాటశాలలో ఒకటో తరగతి ఫీజు నాలుగు లక్షలు . " వామ్మో .. నాలుగు లక్షలే!... ఏదో లెండి .. బాగా డబ్బున్న మా రాజులు చేర్పిస్తారు... అనుకొంటున్నారా ? ఆ పాటశాలకు రెండు బ్రాంచెస్ వున్నాయి . రెంటిలో కలిపి మొత్తం ఆరు వేల మంది విద్యార్థులు !
ఒకటో తరగతికి నాలుగు లక్షల ఫీజు కట్టే పేరెంట్స్ ఇంతమందా ?
ఆ ఒక్క పాఠశాల్లో ఆరువేలు . అలాంటి అన్ని పాఠశాలల్లో మొత్తం లక్ష మంది కి పైగా .
అప్పుడే కళ్ళు బైర్లు కమ్మితే ఎలా .. పోస్ట్ లో ఇంకా చదవాల్సింది చాలా వుంది .
హైదరాబాద్ లో అదొక గేటెడ్ కమ్యూనిటీ . ఇద్దరు మహిళల సంభాషణ .
" మా వాడిని ఫలానా స్కూల్ లో చేర్పించాము . ఫీజు రెండు లక్షలు ".... గొప్పలు పోతూ ఒకావిడ !
చాల్లే సంబడం... నీ ముఖం చూడు అన్నట్టు ముఖం పెట్టి మరో ఆవిడ " జస్ట్ టు లాక్స్? అదేంటి బాబీ? . మరీ ఇంత కక్కుర్తి ? మా వాడి ఫీజు నాలుగు లక్షలు . ఒకటో తరగతిలోనే గుర్రపు స్వారీ నేర్పుతారు తెలుసా ?"
ఒకటో తరగతి పిల్లాడు గుర్రపు స్వారీ ఏమి చేస్తాడు ? అని ఆలోచించే తత్త్వం ... కోవై షీల్డ్ పుణ్యమా అంటూ చచ్చింది .
ఇప్పుడిక ... తన బిడ్డను కూడా నాలుగు లక్షల ఫీజు పాఠశాలలో చేర్పించేవరకు... ఆమె తన హస్బెండ్ గారిని రాత్రిళ్ళు పస్తులు పడుకోబెట్టేస్తుంది . కాదు... కూడదంటే... విడాకులు .
నలుగురితో గొప్పలు చెప్పు కోవాలి అంతే.. అంతకు మించి ఆలోచించే తెలివి , సహనం ఎవరికీ లేదు .
హైదరాబాద్ గల్లీ నుంచి పల్లె దాక ఇప్పుడిదే !
ఇరవై ఎకరాల పాఠశాల ! గుర్రపు స్వారీ .. పోలో .. రగ్బీ .. ఐస్ హాకీ .. ఫెన్సింగ్ ..
ఫార్మా కింగ్ గారి కోడలు .. నిన్నటి హీరో గారి కొడుకు .. స్టార్ ఆసుపత్రి బారన్ గారి మనవరాలు / మనవడు .. డబ్బున్న ప్రతోడు .. ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించడం .. పదెకరాల .. యాభై ఎకరాలు .. వంద ఎకరాలు .. రెండేళ్లలో ఫుల్ .. ఓపికుంటే కాలక్షేపానికి ఇంకేదీ పని లీకుంటే నడుపుతారు . లేకుంటే వెయ్యో.. రెండు వేల కోట్లకు ఫారీన్ కంపెనీకి అమ్మేస్తారు .
హైదరాబాద్ లో కొత్తగా ప్రారంభించిన స్కూల్ లో అడ్మషన్ ఫీజు యాభై లక్షలు .
అవునండీ అక్షరాలా అరకోటి .
దీని తలదన్నేలా ఇప్పుడు మరో రెండు మూడు పాఠశాలలు రానున్నాయి .
క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందా ?
ఎవడ్రా వీడు ?
మళ్ళీ అదే సుత్తి ప్రశ్న . ఇందాకే చెప్పగా .. క్వాలిటీ ఎవడికి కావాలి ?
"బాబీ నీకు తెలుసా ?మా వాడి స్కూల్ లో స్మార్ట్ బోర్డు . టీచర్ పాఠం చెబుతుందా లేదా అనేది... ప్రిన్సిపాల్ తన సీట్ నుంచి లేవకుండా మానిటర్ ద్వారా తన రూమ్ నుంచే చూస్తుంది "
ఒక హై రైస్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ హాల్ లో ఉబుసు పోక గొప్పలు .
పాఠం ఎప్పటికప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కావాలంటే ప్రతి తరగతి గదిలో పవర్ఫుల్ వైఫై ఉండాలి . రేడియేషన్ .
స్కూల్ లో ఉన్నంత సేపు ప్రతి బిడ్డ మెదడు రోస్ట్ అయిపోతుంది .
చిన్న పిల్లల స్టార్ ఆసుపత్రికి పోయి .. ఇటీవలి కాలం లో బ్రెయిన్ కాన్సర్ తో ఆసుపత్రిలో చేరిన పిల్లల సంఖ్య ఎన్ని రెట్లు పెరిగింది? అని ఒక్కడంటే ఒక్కడూ అడగరెందుకో ???
మోడరన్ ట్రెండా? నీ పిండాకూడా ? ఫ్రాన్స్... రష్యా .. పాటశాలల్లో వైఫై ని దాదాపు బాన్ చేసాయి . అమెరికా ఇంకా నిద్దుర లేవలేదు . వాడు లేసేటప్పటికి ... నీ వాక్ సీన్ బుర్రకు అర్థం అయ్యే టప్పటికి జరగరాని ఘోరం జరిగిపోతుంది .
సెట్ నుంచి లేవకుండా ప్రిన్సిపాల్ తన సీట్ లోనే కూర్చుంటే ఆమెకు త్వరలో వెరికోస్ వీన్స్ ఖాయం .
" మీ స్కూల్ లో ఇంకా టీచర్స్ నోటి తో పాటలు చెబుతారా? బ్రో . మా స్కూల్ లో అయితే మొత్తం వీడియో పాఠాలు" హైదరాబాద్ లో ఒక పోష్ క్లబ్ లో మందు పార్టీ లో నవ యుగపు తండ్రి స్టేటస్ డిక్లరేషన్ .
వీడియో పాఠాలు అవసరమే . కంప్యూటర్ ల్యాబ్ లో వైఫై కూడా అవసరం . కానీ ప్రతి పాఠాన్ని వీడియో ద్వారా చూపితే పిల్లల సృజనాత్మక శక్తి చస్తుంది . ఆలోచనల్లో వైవిధ్యత లోపిస్తుంది .. కాల్పనికత బలహీన పడుతుంది .
ఈ న్యూరో సైన్స్ సత్యాలు .. సింగల్ మాల్ట్ డాడీ కి తెలియదు . ఎవడైనా చెప్పినా .. వినడు . పైగా నిజం చేప్పిన వాడినే అనుమానిస్తాడు .
" నూటికి తొంబై అయిదు మందికి కరోనా సోకింది . ఒక సారి సోకితే టి సెల్స్ రక్షణ వచ్చినట్టే . అంతకు మించిన వాక్సిన్ ఏదీ లేదువాక్ సీన్ వద్దు అని నెత్తి నోరు కొట్టుకొని చెబితే విన్నారా ??
" వీడు .. వీడి మొఖం" .. అనుకొని లగెత్తుకొని వేసుకొన్నారు .
వాక్ సీన్ కు సంభందించిన సింపుల్ సైన్స్ అర్థం కాని ముఖాలకు న్యూరో సైన్స్ అర్థం అవుతుందా ?
చెప్పేవాడు సన్నాసి అయినా అయివుండాలి ! లేదా పనీ పాటలేకుండాలి !
" బ్లాక్ బోర్డు .. చాక్ పీస్ .. నోటు పుస్తకం .. పెన్ను పెన్సిల్ .. బ్రో ! ఇంకా ఏ కాలం లో వున్నావు ? ఇది నయా తరం .. కాలం మారింది . నువ్వు ఇంకా రాతి యుగంలో ఉంటే ఎలా ?
ఇప్పుడు స్మార్ట్ బోర్డు . లాప్ టాప్"..
.. అని గొప్పలు పొయ్యే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నయా డాడీ కి " అరేయ్! వాక్ సీన్ వెర్రి పుల్కా ! టీచర్ చాక్ పీస్ { అది డస్ట్ లెస్ అయితే మంచిది } తో రాస్తే చేతి రాత చక్క గా... అందంగా వస్తుంది . దాన్ని చూసి పిలల్లు నేర్చుకొంటారు . వారి చేతిరాత అందంగా తయారవుతుంది . స్మార్ట్ బోర్డు అవసరం అయిన చోట వాడాలి . నిజమే .. కానీ అది ఫాషన్ స్టేటమెంట్ కాదురా .. చేతితో రాస్తే .. ఐ - హ్యాండ్ కోఆర్డినేషన్ ... న్యూరో మాస్కులర్ అభివృద్ధి , లోతైన అవగాహన , సృజనాత్మకత... ఇలా ఎన్నో ఎన్నెన్నో లాభాలు .. ఇది న్యూరో సైన్స్ అని చెప్పేది ఎవరు ?
ఎవడ్రా అలాగా జనం ?
పిల్లల్ని ప్రభుత్వ బడ్జెట్ పాటశాలల్లో చేర్పిస్తే అలాగా జనాలు .. వీరి కంపెనీ తో మన పిల్లాడు పాడై పోతాడు" ఇదీ అధిక శాతం తల్లితండ్రుల ఆలోచనలు .
సంవత్సరానికి నాలుగు నుంచి ఇరవై లక్షల ఫీజు ఉన్న పాఠశాలలోకి ఎవరు వస్తున్నారు ?
అమ్మ నాన్న ఇద్దరు .. పని నుండి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి పదకొండు . ఈ లోగా పిల్లోడు స్నాప్ చాట్ ఇంస్టాగ్రామ్ వాట్సాప్ .. రెండో తరగతిలోనే మిడిల్ ఫింగర్ ని చూపడం ప్రతి మాటను ఎఫ్ అనే పదంతో ప్రారంభించడం నేర్చుకొంటాడు . స్కూల్ కొచ్చి నీ బిడ్డ కు నేర్పుతాడు .
హవాలా వ్యాపారి .. కేసినో కింగ్ .. రాజకీయ నాయకులకు బ్యూరాక్రాట్స్ కు రాత్రి ఏర్పాట్లు చేసి.. డీల్స్ కుదిర్చి కోట్లు గడించిన బ్రోకర్ .. చదువు సంద లేకున్నా రియల్ ఎస్టేట్ లో కోట్లు గడించి రెండు మూడు ఫామిలీ లు సెట్ అప్ చేసిన మహారాజు . ఇంట్లో పిల్లల కెదురుగా మందు... దమ్ము కొట్టే తల్లి ..
ఆగండాగండి . అందరూ ఇలాంటోళ్లే అనడం లేదు . పాపం కష్టపడి పిల్లలకు మంచి విద్య నందించాలి అనుకొంటున్న తల్లితండ్రులు వున్నారు .
కానీ క్లాసుకు ఇద్దరు ముగ్గురు పిల్లలు పైన చెప్పిన పోరంబోకు .. పాపిష్టి సొమ్ము కుటుంబాల నుండి ఉంటే చాలు .. మొత్తం క్లాసును ను చెడగొట్టేస్తారు .
పిల్లలు తమ స్నేహితుల వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతారు .
అదొక ఇంటర్నేషనల్ స్కూల్ . అక్కడ ప్రతి క్లాస్ కు స్మార్ట్ బోర్డు .
పిలల్లు టీచర్స్ ను రిక్వెస్ట్ చేసి .. రిక్వెస్ట్ కాదు .. అదొక రకం బ్లాక్ మెయిల్ .
తాము చెప్పింది చేయక పొతే టీచర్ బాగా పాఠం చెప్పలేదనో... తిట్టాడనో ఇంట్లో చెబుతారు . పాపం టీచర్ కు ఉద్యోగం ఊడుతుంది . కాబట్టి వారు చెప్పింది వినాల్సిందే....
" సార్ ఎంత సేపు పాఠం చెబుతారు సార్ ! ఈ ట్రేడింగ్ పాట వెయ్యండి సార్ " అని... క్లాస్ రూమ్ లో ట్రేండింగ్ పాట చూస్త్తూ డాన్స్ చేస్తారు . వాటర్ బాటిల్ లో తెచ్చుకొన్న వోడ్కా తాగేవారు .. బాత్ రూమ్ కు వెళ్లి హుక్కా కొట్టే వారు .. జ్వరం పేరుతొ తెచ్చుకొన్న టాబ్లెట్స్ మాటున ఉన్న డ్రగ్ తీసుకొనే వాడు .. ఇంకా చాలా చాలా నేరాలు ఘోరాలు !
సో బ్యూటిఫుల్ .. సో ఎలిగంట్.. జస్ట్ లైక్ ఏ వావ్!
ఇదే నేటి కరోనా అనంతర మానవ జాతి !

Amarnath Vasireddy - Facebook Posts

Explore years of consistent wisdom, organized by journey milestones from 2010 to 2026