August 31th, 2025
"ది ఆంక్సియస్ జనరేషన్" … ఇప్పుడు బాగా అమ్ముడు పోతున్న పుస్తకం .
దీని రచయిత అమెరికా కు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ జోనాథన్ డేవిడ్ హడిత్ .
ఈ పుస్తకాన్ని 2024 లో ప్రచురించారు .
ఈ పుస్తకాన్ని కొని చదివిన వ్యక్తులు... లేదా కనీసం గూగుల్ ద్వారా లేదా గ్రోక్ లాంటి కృతిమ మేధ సాధనాల ద్వారా పుస్తక సారాంశాన్ని గ్రహించిన ఈ ప్రశ్నలకు దయ చేసి సమాధానాలు ఇవ్వగలరు .
1. ఈ పుస్తకం లోని ప్రతి పాయింట్ ను .. పుస్తక ప్రచురణ కు ఆరేళ్ళ ముందు నుంచి అంటే 2018 నుంచి చెబుతున్న వ్యక్తి ఎవరు ?
2. ఆ వ్యక్తి ఈ పుస్తకం లోని ఒక్కటంటే ఒక్క పాయింట్ మిస్ అయ్యారా ?
3. కాలేదంటే పుస్తక ప్రచురణ కంటే ఎన్నో ఏళ్ళ ముందు నుంచి ఆ వ్యక్తికి ఈ పాయింట్లన్నీ ఎలా తెలిసి పోయాయి ?
4. ఈ పుస్తకం లో చివరి చాఫ్టర్లలో ఇప్పుడు తల్లితండ్రులు బడులు ఏమి చెయ్యాలో ఈ సైకాలజిస్ట్ సూచిస్తారు . ఈయన సూచనలు నూటికి నూరు శాతం ఏదో బడిలో అమలు అవుతున్నాయి . బడి వారు పేరెంట్స్ ను కూడా ఎడ్యుకేట్ చేసి దారిలోకి తెచ్చుకొంటున్నారు . ఇది ఎలా సాధ్యం ?
చివరిగా ఇంకో ప్రశ్న .
5. శంఖం లో పోస్తేనే తీర్థం అనే సామెతకు అర్థమేమిటి ?
శుభోదయం !
August 29th, 2025
August 29th, 2025
August 28th, 2025
కామారెడ్డి జిల్లాలో ప్రకృతి బీభత్సం.. డ్రోన్ విజువల్స్
August 28th, 2025
" భారతీయులు ఇక్కడికి వచ్చి మన జాబ్స్ కొట్టేస్తున్నారు .
వీరు తమ సంపాదనను ఇంటికి { ఇండియా కు } పంపుతున్నారు .
ఈ సంపదతో { పన్నుల ద్వారా వచ్చింది } భారత ప్రభుత్వం రష్యా నుంచి ఆయిల్ కొంటోంది . ఈ డబ్బు తో రష్యా యుక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది "
బోడిగుండుకు మోకాటికి ముడిపెట్టడం అంటే ఇదే .
ఇదే నేడు అమెరికా లో మాక్ అమెరికా గ్రేట్ అగైన్ అనుచరులు చేస్తోన్న ప్రచారం .
ఎలాగైనా వీలైనంత మంది భారతీయుల్ని ఇంటికి పంపేయాలి అని ఆలోచిస్తున్నారు .
H . 1B వీసా లను రద్దు చేయడం ...
ఒక కంపెనీ ఉద్యోగుల్ని తొలగించాల్సి వస్తే ముందుగా భారతీయ ఉద్యోగుల్ని తొలగించడం ,....
అక్కడ స్థిరపడి గ్రీన్ కార్డు కు అప్లై చేసుకొన్న భారతీయులకు అది రాకుండా చూడడం లేదా కనీసం ఆలస్యం చేయడం ..
ముఖ్యంగా 21 ఏళ్ళు నిండిన వారి పిల్లలకు రాకుండా చూడడం ..
... ఇలా రకరకాల ఆలోచనలు నడుస్తున్నాయి .
మరో పక్క రిపబ్లికన్ పార్టీ చోట నాయకురాలు మొన్న ఒక మత గ్రంధాన్ని తగలబెట్టింది .
"అమెరికా మాది .. మీరందరూ వెళ్ళిపోవాలి" అని రీతిలో ప్రచారాన్ని ఒక పార్టీ ఎత్తుకొంటే దాని పరిణామాలు ఎలా వుంటాయో తలచుకొంటే భయం వేస్తుంది .
రాన్నున్న రోజుల్లో కృతిమ మేధ వల్ల నిరుద్యోగిత పెరిగే కొద్దీ ఈ జాత్యహంకార ధోరణి మరింత బలపడే ప్రమాదం .
ఇక్కడికి వచ్చి మన ఉద్యోగాలను కొట్టేసి మనకంటే వీరు బాగా బతుకుతున్నారు అనే భావన సగటు మాగా కార్యకర్తలో ఉంది.
ఇప్పటికి నలబై సార్లు ట్రంప్ తన ఆదేశం వల్లే ఇండియా పాకిస్థాన్ యుద్ధం ఆగింది ని చెప్పాడు .
ట్రంప్ ఫోన్ నాలుగు సార్లు ఫోన్ చేసినా మోడీ తీయలేదు అని ఒక వార్త కథనం .. నిజానిజాలు జన సామాన్యానికి తెలిసే అవకాశం లేదు .
యాభై శాతం టారిఫ్ ను తట్టుకొని మన దేశం నిలబడ గలిగితే .. డాలర్ కు ప్రత్యామ్నాయ మారక వ్యవస్థకు అడుగులు పడితే అది అమెరికా కు మరిన్ని కష్టాలు తెచ్చి పెడుతుంది .
అప్పుడు అక్కడి మాగా వారి భారతీయ వ్యతిరేకత ఎక్కువవుతుంది .
చర్చలు ఉద్రిక్తతలను తగ్గిస్తాయని ఆశిద్దాము .
శుభోదయం
August 27th, 2025
August 27th, 2025
నేరం నాగరీకులది ! శిక్ష మూగ జీవాలకు.
August 27th, 2025
కూకట్పల్లి బాలిక హత్య: 14 ఏళ్ల బాలుడు నిందితుడిగా మారడానికి కారణమేంటి? తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? - BBC News తెలుగు
August 27th, 2025
మెదక్ సంగారెడ్డి రామయం పేట లో కూడా వరదలు.
భూతాపం - వాతావరణం వేడెక్కుతుంది.
వేడి గాలి ఎక్కువ తడిని పీల్చుకుంటుంది.
పైకి వెళ్ళాక ఈ నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది.
అంటే పదేళ్ల క్రితం తో పోలిస్తే ఇప్పుడు మేఘాల్లో రెట్టింపు నీరు.
ఫలితం భారీ .. అతి భారీ వర్షాలు.
విధ్వంసం. ఆస్తి ప్రాణ నష్టం.
పదేళ్లలో భూతాపం ఇంతగా ఎందుకు పెరిగిందో ఆలోచించండి.
అడవులు నరకడం ఒకటో కారణం.
వాహనాల సంఖ్య పెరగడం రెండోది.
మొబైల్స్ , డేటా సెంటర్స్ కొత్త కారకాలు.
( డేటా సెంటర్ వున్నచోట వేడి. కానీ ఆ మేఘాలు అక్కడే కురవవు కదా )
డిజిటల్ వ్యర్థాలు ( పడేసిన పాత మొబైల్స్ కూడా ఒక కారణం.
ఇప్పుడే ఇలా ఉంటే మరో అయిదు పదేళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో !
August 27th, 2025
August 27th, 2025
పొగాకు కాన్సర్ కారకం.. సందేహం లేదు .
కాన్సర్ కేసులు ఇలా ఎందుకు పెరిగిపోతున్నాయి ?
పొగాకు ఒకప్పుడు కూడా వాడేవారు .
మరి పెరిగింది ఏంటి ?
జంక్ ఫుడ్ వాడకం .
ఇంకా ?
ఇంకా ?
పొగాకు, జంక్ ఫుడ్ వాడకం వల్లే ఇంత పెరిగిందా ?
ఇంకా ఏమైనా ఉందా ?
ఇదీ అడగాల్సిన ప్రశ్న .
సమాధానం రాబట్టాల్సిన అంశం .
"మొబైల్ రేడియేషన్ వల్ల, సెల్ టవర్స్ వల్ల నష్టం లేదు.. రుజువులు లేవు .. అని చెప్పి ఉన్న సైంటిఫిక్ స్టడీస్ ను పట్టించుకోకుండా కూర్చుంటే ఎవడికి నష్టం ? అందుకే నిన్నటి పోస్టులో చివరి వాక్యం .. వారు పోతారు .. చివరి రోజులు భయంకరం అని చెప్పా !
August 27th, 2025
నిరంతర అధ్యయనం !
తెలిసింది గోరంత ..
తెలియాల్సింది కొండంత !
"డి విటమిన్ లోపిస్తే రికెట్స్ వ్యాధి వస్తుంది " ..
... ఇదీ చిన్నప్పుడు పుస్తకాల్లో చదివింది .
డి విటమిన్ లోపం ఎవడిలో ఉంటుంది? అనుకునేవాడిని .
కరోనా కాలం లో లోతుగా అధ్యయనం చేస్తే విస్తుపోయే నిజాలు తెలిసాయి .
మనది ఉష్ణ మండల దేశం అయినప్పటికీ ఇక్కడ అధిక సంఖ్యాకులకు డి విటమిన్ లోపం .
దీని వల్ల కేవలం రికెట్స్ వ్యాధి కాదు . మూడ్ స్వింగ్స్ .. జుట్టు రాలిపోవడం .. ఇలా సవా లక్ష సమస్యలు .
బి కాంప్లెక్స్ .. అని చదివాము .
సివిల్స్ కు బోధిస్తున్నప్పుడు బి కాంప్లెక్స్ కిందకు వచ్చే వివిధ విటమిన్ ల గురించి అయిదు ముక్కలు చెప్పేవారం .
కరోనా కాలం లో b12 గురించి తెలుసుకోవాల్సి వచ్చింది .
మెడికల్ న్యూస్ టుడే అని పత్రికలో వచ్చిన ఒక అంశం పట్టుకొని నేను లోతుగా అధ్యయనం చేస్తే విస్తు పోయే నిజాలు తెలిసాయి .
మన దేశం లో శాఖాహారులు .. వారిలో ఈ విటమిన్ లోపం .. ఇది కరోనా తీవ్రత ను ఎలా పెంచుతుంది అనేది అర్థమయ్యింది .
పోయిన సంవత్సరం దసరా సెలవుల్లో రాజస్థాన్- ఆగ్రా టూర్ వెళ్ళాము .
మూడో రోజు నుంచే నాకు కండరాలు లాగడం మొదలయ్యింది .
పట్టుదలతో మరింత ఎక్కువ సేపు జిమ్ చేశా .
చేసినంత సేపు బాగానే ఉండేది ..
అయిపోయాక మజిల్ క్రామ్ప్ మొదలయ్యేవి .
జైపూర్ హోటల్ లో రాజస్థానీ సంగీతం ఏర్పాటు చేసారు .
ఆ రోజు డిన్నర్ అయ్యాక నొప్పికి తట్టుకోలేక నేను రూమ్ కెళ్ళి నిద్ర పోయాను .
ప్రోగ్రాం చాలా బాగున్నా మిస్ కావాల్సి వచ్చింది .
హైదరాబాద్ కొచ్చాక "అసలు ఏంటి?" అని చిన్న సైజు పరిశోధన .
తేలింది ఏమిటంటే నాకు పొటాషియం లోపం ఉంది అని .
వారం లో సమస్య నుంచి బయట పడ్డాను .
అటు పై ఎప్పుడూ మజిల్ క్రామ్ప్ రాలేదు .
పొటాషియం లోపం గురించి ఎవరూ మాట్లాడుకోరు .
రాయరు .
చాలా మందికి తెలియదు.
మన దేశం గ్రామీణ ప్రాంతాల్లో అయితే కేవలం 3 శాతం పట్టణ ప్రాంతాల్లో అయితే కేవలం 7 శాతం జనాభా తగినంత పొటాషియం కలిగి ఉన్నారు. { ఖచ్చితంగా చెప్పాలి అంటే సోడియం పొటాషియం నిష్పత్తి . మనాళ్ళు ఉప్పు ఎక్కువ తింటారు . అంటే బాడీ కి ఎక్కువ సోడియం వెళుతుంది . తగినంత పొటాషియం వెళ్ళదు}.
మన శరీరానికి రోజుకి సుమారుగా 4700 మిల్లి గ్రాముల పొటాషియం కావాలి .
పొటాషియం నందించే ఆహారాలు .
1 . అరటి పండు . 2 . పనస తొనలు . ౩ పాల కూర 4 . బీన్స్ , చిక్కుడు . 5 సముద్రపు చేపలు 6 . చిలగడ దుంప 7 . పాలు పాల ఉత్పత్తులు 8 . గుమ్మడి గింజెలు పొద్దు తిరుగుడు విత్తనాలు బాదాం .
ఇదివరకే కిడ్నీ వ్యాధితో బాధపడే వారు ఎక్కువ పొటాషియం ఉన్న పై ఆహారం తీసుకోకూడదు.
ఆపిల్ బెర్రీస్ లాంటి తక్కువ పొటాషియం ఆహారాన్ని తీసుకొనే అవకాశముంది. ( వీరు పొటాషియం లెవెల్స్ క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.
నాకు ఉన్నట్టుండి టూర్ లో పొటాషియం లోపం ఎందుకు వచ్చింది ?
మామూలు వారి సంగతి వేరు . రోజూ జిమ్ లో వ్యాయామం చేస్తే శరీరం విటమిన్స్ ఇతర పోషకాలను వేగం గా ఉపయోగించుకుంటుంది . కాబట్టి వాటిని తగినంతగా శరీరానికి అందించకపోతే వెంటనే ప్రభావం కనిపిస్తుంది .
నేను ఇంట్లో వున్నప్పుడు రోజూ బ్రేక్‌ఫాస్ట్ లో బాదాం, వాల్ నాట్స్ తింటాను . దీనితో శరీరానికి తగినంత పొటాషియం అందేది . టూర్ లో వున్నప్పుడు బాదాం తినలేక పోయాను . అప్పుడు అరటి పండు కూడా తినేవాణ్ణి కాను . పాల ఉత్పత్తులు పెద్దగా వాడలేదు . దీనితో లోపం వచ్చింది . టూర్ నుంచి వచ్చాక ప్రతి రోజు ఒక అరటి పండు తింటున్నా .
అరటి పండు డయాబెటిస్ వారు తినొచ్చా ?
డయాబెటిస్ కి ఇది మందు .
కాకపోతే అన్నం బాగా తగ్గించి తినే వారే అరటి తినాలి .
కడుపు నిండా అన్నం తిని దాని పై అరటి పండు తింటే మెట్ఫార్మిన్ వెయ్యి mg వేసుకున్నా రీడింగ్ పెరిగి పోతుంది . అన్నట్టు మెట్ఫార్మిన్ మాత్రలు వాడుతూ పొతే బి 12 లోపం వస్తుంది .
ఇలా జరిగితే అనీమియా... నెర్వ్ డామేజ్... జ్ఞాపక శక్తి బలహీనం కావడం, మెదడు చురుకుదనం తగ్గిపోవడం జరుగుతుంది .
పొటాషియం లోపం వల్ల కేవలం మజిల్ క్రామ్ప్స్ కాదు . హృద్రోగాలకూ అవకాశం .
దసరా టూర్ నుంచి వచ్చాక పొటాషియం లోపముంది అని తెలుసుకొన్నాక నాకు ఒక విషయం గుర్తొచ్చింది .
మా నాన్నకు 2010 లో వెల్లూర్ సీఎంసీ లో గుండెకు స్టంట్ వేశారు . రెండు రోజుల్లో డిశ్చార్జ్ అని ముందు చెప్పారు . అటు పై పొటాషియం లోపం ముంది కండీషన్ సీరియస్ అన్నారు . వారం రోజులో స్పృహ లో లేరు . కోలుకున్నాక కూడా అయన ఆరోగ్యం పూర్తి స్థాయిలో బాగుపడలేదు . మూడేళ్ళలో చనిపోయారు . సర్జరీ జరిగినప్పుడు పొటాషియం లోపం వస్తుందట . అంత గొప్ప ఆసుపత్రి . అక్కడ కూడా ఇలాంటి లోపాలు . ఏమి చేద్దాము .. మన ఖర్మ అని సరి పెట్టుకోవడమే .
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు .
అన్నట్టు వినాయకుడికి పళ్ళు అంటే ఇష్టం .
మారేడు/ వెలగ పండు ఇమ్మ్యూనిటి ని బూస్ట్ చేస్తుంది . అంటి ఆక్సిడెంట్ లను ఇచ్చి కాన్సర్ నుంచి రక్షణ .
రోజూ ఏదో ఒక పండు తింటే చాలా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు .
శుభోదయం
August 26th, 2025
ఎవిడెన్స్ కావాలా నాయనా ?
August 26th, 2025
August 26th, 2025
EMF భూతం !
August 26th, 2025
1 . సిగ్నల్స్ బలహీనంగా ఉంటే సెల్ ఫోన్ ఆఫ్ చేసేయండి . లేదా ఏరోప్లేన్ మోడ్ లో పెట్టండి .
బలహీనమయిన సిగ్నల్స్ వల్ల మైక్రోవేవ్ రేడియేషన్ ముప్పు పదివేల రెట్లు ఎక్కువవుతుంది .
2 . రోజుకు గంట రెండు గంటలకు మించి స్మార్ట్ ఫోన్ వాడొద్దు . ఉపయోగం లో లేనప్పుడు దాన్ని ఏరోప్లేన్ మోడ్ లో ఉంచండి .
౩. వైఫై రౌటర్ ను ఆఫ్ చేసి ఉంచండి .
కేవలం ఎక్కువ మొత్తం లో డేటా వినియోగం అవసరం అయినప్పుడే రౌటర్ ను ఆన్ చేయండి .
4 . పడుకునేటప్పుడు సెల్ ఫోన్ ఆఫ్ చేసేయండి .
౩. మైక్రోవేవ్ టవర్ లకు దగ్గర ఇళ్ళు తీసుకోవద్దు .
కనీసం 300 మీటర్ల దూరం లో ఇల్లు ఉండేలా చూసుకోండి .
4 . emf షీల్డింగ్ దుస్తులు కర్టైన్ లు బె షీట్ లు వాడండి .
అలాగే ఇంటికి emf షీల్డింగ్ పెయింట్లు.. వాడండి .
5 . వైఫై కావాలంటే వైర్ ద్వారా పొందడం మంచిది .
6 వాయిస్ కాల్స్ వద్దు .
తప్పదు అనుకుంటే స్పీకర్ ఫోన్ వాడండి .
మొబైల్ దూరంగా ఉంచి మాట్లాడండి .
వాట్సాప్ లో టెక్స్ట్ మెసేజ్ వాయిస్ మెసేజ్ పంపడం ద్వారా కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది .
మీకు అవతలి వారికి డిస్టర్బ్ ఉండదు .
తిరిగీ వాయిస్ మెసేజ్ వినే అవకాశం .. అదీ తీరుబడిగా వున్నప్పుడు . అన్నిటికి మించి రేడియేషన్ తక్కువ .
ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ ... ఆధునిక జీవన విలన్ .
1 . కాన్సర్ ముప్పు .
2 . అలీజీమెర్ వ్యాధి .
౩ . నిద్ర పట్టకపోవడం .కలత నిద్ర .
4 . ఫెర్టిలిటీ దెబ్బ తినడం .. అంటే వ్యంధత్వం ..
5 . తలనొప్పి , మైగ్రైన్ .. నీరసం , చర్మం పై పొక్కులు ,
EMF మూలాలు .
1 . సెల్ ఫోన్ .
2 . లాప్ టాప్
౩ . వైఫై రౌటర్
4 . స్మార్ట్ మీటర్ .
5 . మైక్రో వేవ్ ఓవెన్స్ .
6 . మైక్రో వేవ్ టవర్స్ .
7 . ఎలక్ట్రిక్ లైన్స్ .
8 . అన్ని రకాల స్మార్ట్ డివైజ్‌లు .. స్మార్ట్ స్పీకర్స్.. స్మార్ట్ HOME సెక్యూరిటీ... స్మార్ట్ లైటింగ్... స్మార్ట్ డోర్ లాక్ ... బ్లూ టూత్ .
" అబ్బే.. ఇవన్నీ ఆధునిక జీవనంలో అంతర్భాగం . వాటిని తగ్గిస్తే ఎలా ?" అనేవారిని వారి మానానికి వదిలేయండి .
వారు ఎలాగూ ఎక్కువ రోజులు బతకరు .
వారి చివరి రోజులు కూడా దారుణంగా ఉంటాయి.
శుభోదయం .
August 25th, 2025
*భారత్ గౌరవ్* స్పెషల్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బైద్యనాథ్ ధామ్ (SCZBG46) (9 రాత్రులు / 10 రోజులు)తో అయోధ్య-కాశీ పుణ్య క్షేత్ర యాత్ర కోసం బయలుదేరుతుంది.
*కవర్ చేయనున్న గమ్యస్థానాలు మరియు స్థలాలు*
పూరి- జగన్నాథ టెంపుల్ & కోణార్క్ సన్ టెంపుల్
డియోఘర్- బాబా బైద్యనాథ్ ఆలయం
వారణాసి- కాశీ విశ్వనాథ ఆలయం & కారిడార్, కాశీ విశాలాక్షి మరియు అన్నపూర్ణ దేవి ఆలయం. సాయంత్రం గంగా హారతి
అయోధ్య- రామజన్మ భూమి, హనుమాన్‌గర్హి.
ప్రయాగ్‌రాజ్- త్రివేణి సంగమం
రైలు సికింద్రాబాద్ నుండి ఉదయం 11 గంటలకు బయలుదేరి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్, తణుకు నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజియనగరం మీదుగా ప్రయాణిస్తుంది.
ఛార్జీ (ప్రతి వ్యక్తికి)...
స్లీపర్ --రూ.17,000/-
*3AC-- రూ.26,700/-
2AC-- రూ.35,000/-
ప్యాకేజీలో రోజుకు 3 సార్లు భోజనం వసతి, రవాణా సౌకర్యాలు మరియు ప్రతి కోచ్‌లో IRCTC సిబ్బంది అందుబాటులో ఉంటారు. IRCTC ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
మరింత సమాచారం కోసం: సందర్శించండి: www.irctctourism.com.
కాల్:-
9701360701
9701360701
9281030714
9281495848
9281030750.
Indian Railways program.
Shared here just for information.
Interest people can contact the numbers given.
August 25th, 2025
నవంబర్ డిసెంబర్ నెలలు .. ఇదిగో ఇలా బిజీ.
బాలమిత్ర కార్యక్రమాన్ని తమ పాఠశాలలో ఏర్పాటు చేయాలి అనుకుంటున్న వారికి - జనవరి నుంచి మార్చ్ ( 2026 ) వరకు మాత్రమే అవకాశం.
August 25th, 2025
August 25th, 2025
August 25th, 2025
August 24th, 2025
ఒక క్రైమ్ జరిగితే మీడియా లో దాని వివరాలు పూస గుచ్చినట్టు దృశ్య రూపంలో చూపుతారు.
ప్రజలు అయ్యో కుయ్యో అని పోస్ట్ లు పెడుతారు.
అంతే దాన్ని మరిచిపోతారు.
మరుసటి రోజు ఇంకో ఫ్రెష్ క్రైమ్.
ప్రభుత్వం మీడియా పోలీస్ లు మేధావులు భలేభలే నిద్ర నటిస్తున్నారు.
1 . 18 లోపు పిల్లలకు మొబైల్ ఇవ్వకూడదు.
2 . ఓటిటి ఫిలిమ్స్ రీల్స్ సినిమాల్లో హింసాత్మక దృశ్యాలపై సెన్సార్ ఉండాలి.
3 . క్రైమ్ పోర్న్ లాంటివాటి డేటా వినియోగానికి డేటా ఛార్జ్ లు వందరెట్లు పెంచాలి.
4 క్రైమ్ చేసిన వారిని బహిరంగం గా ఉరి తీయాలి.
5 . జువైనైల్ చట్టాన్ని సవరించి హత్య చేసిన మైనర్ లకు కూడా పెద్దవారి లాగే శిక్ష విధించాలి.
August 24th, 2025
మనకు మనమే రక్ష!
August 24th, 2025
ఇండియన్ క్రికెట్ టీం స్పాన్సర్స్ !
సహారా - పోయింది.
మైక్రో మాక్స్ - దాదాపు పోయింది.
బైజూస్ - అంతే సంగతులు.
డ్రీం -11 - బెట్టింగ్ అప్ నిషేధం తో ఇంతే సంగతులు.
2019 దాకా సంగతి వేరు.
తరువాత ఎలాంటి కంపెనీ లు వస్తున్నాయో చూడండి.
August 23rd, 2025
August 23rd, 2025
పుట్టి సంవత్సరం కూడా దాటని బుడ్డోడు మొదలు డెబ్భై ఎనబై- ఏళ్ళ వృద్ధుడు దాక ప్రతి ఒక్కరు .. ప్రతి రోజు .. అనేక గంటల పాటు మొబైల్ తో కాలక్షేపం చేస్తున్నారు .
ఎక్కువ మంది క్రైమ్ సినిమాలు , నీలి చిత్రాలు చూస్తున్నారు .
క్రైమ్ పెరిగిపోతోంది .
గంజాయి , బెట్టింగ్ వివాహ పూర్వ వివాహేతర సంబంధాలు .. ఒక్క మాట లో చెప్పాలి అంటే సమాజం పతన దిశగా సాగుతోంది .
డేటా వినియోగం పెరిగే కొద్దీ పర్యావరణం నాశనం ఇండియా లో ఎక్కువ డేటా సెంటర్ లు ఉన్నది ముంబై లో . మిగతావి బెంగుళూరు చెన్నై ఢిల్లీ . డేటా సెంటర్స్ లేని కాలంలోనే ఈ నగరాలు నీట మునిగాయి . రాబొయ్యే రోజుల్లో మేఘ విస్ఫోటనలు , మెరుపు వరదలు , భూగర్భ జలాలు అడుగంటి పోతాయి .
బ్లేడ్ తో షేవింగ్ చేసుకోవచ్చు .
అవతలి వారిని గాయపరచవచ్చు .
టెక్నాలజీ ని మనం ఎలా వాడుతున్నాము అనేది ముఖ్యం .
టెక్నాలజీ మంచి పనోడు .
మనం దాన్ని ఉపయోగించుకోవాలి .
అది మనల్ని ఉపయోగించడం మొదలెడితే ఉపద్రవాలే.
ఈ రోజు జనాలు మొబైల్ ను వాడడం లేదు .
మొబైల్ జనాల్ని వాడేస్తోంది.
అధిక శాతం జనాభా మొబైల్ బానిసలు.
వీరిలో ఇంగిత జ్ఞానం చచ్చింది .
ఈ పరిస్థితి మారాలి . రట విచ్చల విడి వినియోగానికి అడ్డుకట్ట వెయ్యాలి
డేటా వినియోగాన్ని మూడు రకాలుగా విభజించాలి .
ఒకటోది విద్య వైద్యం పరిశోధన .. దీనికి డేటా ను ఫ్రీ గా లేదా తక్కువ ధరకు ఇవ్వాలి .
రెండోది సాధారణ వినోదం .. దీనికి ధర ఇప్పటికన్నా ఎక్కువ ఉండాలి .
మూడోది .. పోర్న్ .. హింస . వీడియో గేమ్స్ , రీల్స్ లాంటివి .
వీటిని నిషేధించాలి . లేదా కనీసం వీటి డేటా చార్జీలు వంద రెట్లు పెంచాలి .
కృతిమ మేధ సాయం తో ఇలాంటి వారి ని ట్రేస్ చేసి వీరి పై పోలీస్ లు డేటా రోగ్ షీట్ లు { రౌడీ షీట్ ల తరహాలో } తెరవాలి .
నేటి న్యాయ వ్యవస్థ లో సంస్కరణలు తేవాలి . విచ్చల విడిగా తీర్పులు ఇవ్వడం కాదు . జవాబు దారీ తనం తీసుకొని రావాలి.
August 23rd, 2025
నిన్న ఒక పని చేశాను !
స్కూల్ పని కాదు .
బాల మిత్ర కాదు .
ఇప్పటిదాకా అలాంటి పని జీవితంలో ఎప్పుడూ చేయలేదు .
పొద్దున్న 7 . 30 కి మొదలెడితే రాత్రి ఏడయ్యింది .
చివరకు జిమ్ కు పోలేకపోయాను .
ఏంటా పని ?
ప్రస్తుతానికి సస్పెన్సు.
ఈ రోజు బాలమిత్ర - 53 - నంద్యాల లో .
పొద్దున్న ఏండింటికి బయలుదేరి వెళుతున్నాను .
శుభోదయం
August 21st, 2025
సుమారుగా పది రోజుల తరువాత హైదరాబాద్ లో సూర్య దర్శనం.
( ఎండ వచ్చింది )
ఎక్కువ రోజులు ఎండ లేకుండా ముసుగేసి ఉంటే హానికారక సూక్ష్మ జీవులు బాగా పెరిగిపోతాయి.
అందుకే ఇంటి లోకి ( కొంత భాగం అయినా ) ఎండ రావాలి అంటారు.
August 20th, 2025
కరీంనగర్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ప్రత్యేక మార్గదర్శక సదస్సు కృత్రిమ మేధస్సు (AI) యుగంలో, విద్యార్థులు జీవితంలో విజయం సాధించడానికి మరియు నిలదొక్కుకోవడానికి కేవలం మార్కులు మాత్రమే సరిపోవు.
రాబోయే దశాబ్దంలో వేగవంతమైన సాంకేతిక మార్పులు చోటుచేసుకోనున్నాయి, ఇవి సమాజాన్ని - ముఖ్యంగా భవిష్యత్ తరాలను - పునర్నిర్మిస్తాయి.
విద్యార్థులకు ఎదురయ్యే సవాళ్లు, వాటి పర్యవసానాలు, మరియు నిజంగా విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలపై అవగాహన కల్పించడానికి, ప్రఖ్యాత విద్యావేత్త మరియు సాంఘిక ఆలోచనాపరులైన శ్రీ అమర్నాథ్ వాసిరెడ్డి గారిని మా పాఠశాలకు ఆహ్వానించడం మాకు గౌరవంగా ఉంది.
మన పిల్లలను ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించే ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం!
20/08/2025
(మధ్యాహ్నం 1.40 గంటలకు)
ధన్యవాదాలు,
*ప్రిన్సిపాల్*
*SSM KNR*
August 20th, 2025
పిచ్చోడు కాదు !
పక్కా వ్యాపారి !
పాకిస్థాన్ తో.. అమెరికా !
ఇండియా తో... రష్యా !
---- ఇదీ పదేళ్ల దాక పరిస్థితి .
సోవియెట్ పతనం తరువాత రష్యా ప్రాధాన్యత తగ్గడం ..
మరో పక్క... అమెరికా లో భారతీయుల సంఖ్య పెరగడం ..
దీనికి తోడు ... అమెరికన్ కంపెనీ లకు ఇండియా అపార వ్యాపార అవకాశాలు ..
ఈ నేపథ్యంలో... అమెరికా ఇండియా కు బాగా దగ్గరయింది .
మొన్న జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని ఎంతో మంది భారతీయులు కోరుకున్నారు .
ట్రంప్ - మోడీ మధ్య మైత్రి స్పష్టంగా కనిపించింది .
ఉన్నట్టుండి... గత మూడు నాలుగు నెలలుగా ట్రంప్... ఇండియా కు దూరంగా... పాకిస్థాన్ కు దగ్గరగా జరిగిపోతున్నాడు .
మన దేశానిది మృత ఆర్థిక వ్యవస్థ అని దారుణ వ్యాఖ్యలు చేసాడు .
ఉన్నట్టుండి ఏమైంది ?
మన మీడియా ట్రంప్ ను... పిచ్చోడు గా... తింగరోడుగా చిత్రీకరిస్తుంది .
నిజమే ట్రంప్ లో కాస్త ఆవేశం ఎక్కువ .
ఏదీ దాచుకోడు.
టక్కున చెప్పేస్తాడు .
కానీ ట్రంప్ వ్యక్తి కాడు.
దేశానికి అధక్షుడు .
ట్రంప్ కరుడు కట్టిన వ్యాపారి .
వ్యాపారం అనేది ... అమెరికన్ ల బ్లడ్ లో ఉంది.
శ్వేత జాతీయుల నరనరాల్లో... జాత్యహంకారం .
కానీ వ్యాపారం కోసం దాన్ని వారు కప్పి ఉంచుకొన్నారు .
ఎంతలా అంటే "అబ్బే అది ఎప్పుడో జరిగింది .. ఇప్పుడు వారిలో రేసిజం లేదు" అని మనాళ్ళు నమ్మేటంతగా !
మీకు గుర్తుందా?
ఆమధ్య ట్రంప్ జిలెన్స్కీ దాదాపు కొట్టుకొనే దాక వెళ్లారు .
ట్రంప్ మొన్న పుతిన్ తో బేటీ అయ్యాడు.
ఇప్పుడు జిలెన్స్కీ ని పిలిపించుకున్నాడు .
రష్యా యుక్రెయిన్ యుద్ధం మానిపించే ప్రయత్నం చేస్తున్నాడు .
నోబెల్ బహుమతి కి కాదు!
అమెరికన్ ఆయుధాలు యుక్రెయిన్ కు అమ్మడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నాడు.
... అదీ అసలు పాయింట్ .
వ్యాపారం ..
ఆయుధాల వ్యాపారం ..
లాభాలు తెచ్చి పెట్టే ఏ వ్యాపారం అయినా ఓకే .
.. స్నేహితుడు .. సెంటిమెంట్ ఏదీ ఉండదు .
అమెరికన్స్ కావాల్సింది వ్యాపారం .
డబ్బు .
పాకిస్థాన్ కు ట్రంప్ ఇప్పుడు దగ్గర కావడానికి కారణం ..
... పాకిస్థాన్ లో అపార ఖనిజ సంపద బయట పడడం.
అరుదయిన ఖనిజాలు .... విలువ వేల కోట్లు .
ఇండియా ను విమర్శించడం ద్వారా పాకిస్థాన్ కు దగ్గరయ్యి వారి ఖనిజ సంపద ను కొట్టేస్తాడు .
ఇది ఖాయం .
అసలే ఆ దేశం లో ప్రజాస్వామ్యం లేదు .
మిలిటరీ చేతిలో తొత్తు ప్రభుత్వం .
వాళ్ళ మిలిటరీ నాయకుడు వీరి చేతిలో కీలు బొమ్మ .
ఇక ఏమి జరగనుంది ?
పాకిస్థాన్ ఇప్పుడు దివాళా దేశం .
కానీ రానున్న కొనేళ్లలో పరిస్థితి మారుతుంది .
తన ప్రయోజనాల కోసం అమెరికా పాకిస్థాన్ లో టెర్రరిస్ట్ గ్రూప్స్ ను అదుపులో పెడుతుంది .
అదే విధంగా అణుయుద్ధం వచ్చే అవకాశం లేదు .
ఆర్థికంగా పరిపుష్టం ఆయన దేశాలు యుద్ధానికి పోవాలి అనుకోవు.
ఉదాహరణకు గల్ఫ్ దేశాలు .
కనీసం కొన్నేళ్ల పాటు పాకిస్థాన్ డబ్బులు బాగా రొటేట్ అయ్యే దేశంగా మారుతుంది .
ఇప్పటికయినా గిల్లి కజ్జాలు మాని ... శాంతి- సామరస్యం -అభివృద్ధి బాటలో నడుస్తుందా ?
లేదా వెనకటి బుద్ధి మానదా?
శుభోదయం
August 19th, 2025
August 19th, 2025
డిజిటల్ స్మార్ట్‌నెస్
బూతులున్నాయి. సున్నిత మనస్కులు వినొద్దు ప్లీజ్
August 19th, 2025
ప్రశ్న బట్టే సమాధానం.
August 19th, 2025
August 19th, 2025
డేటా చిల్లి !
August 19th, 2025
మీ చేతిలో మొబైల్ .
అరగంటగా దాన్ని వాడుతున్నారు .
వేడెక్కి పోయింది .
ఎందుకు ?
అది డేటా ను పొందుతోంది .. ప్రాసెస్ చేస్తోంది .
ప్రపంచ వ్యాపితంగా నేడు 800 కోట్ల స్మార్ట్ ఫోన్ లు వాడకంలో ఉన్నాయి.
ఒక్కొక్కరు రోజుకు అయిదు నుంచి ఏడు గంటలు ఫోన్లు వాడుతున్నారు .
ఇవి కాకుండా లాప్ టాప్ లు ట్యాబు లు స్మార్ట్ టీవీ లు .
ఇవన్నీ కూడా ఇంటర్నెట్ తో అనుసంధానం .
వీటన్నిటికీ డేటా ఎక్కడినుండి వస్తుంది ?
డేటా సెంటర్ .
ఒక్క ఫోన్ అంత హీట్ ఎక్కితే లక్షలాది మొబైల్ పరికరాలతో అనుసంధానమయ్యి నిరంతరం డేటా ను ప్రాసెస్ చేస్తూ వేలాది సర్వర్ లతో పని చేసే డేటా సెంటర్ లో ఎంత వేడి పుడుతుంది ?
ఒక్క సారి ఆలోచించండి .
"నరికి చంపుతా" అనే మూడు గంటల ఒక ఆన్లైన్ సినిమా .
ఓటిటి పై రిలీజ్ అయ్యింది .
లక్ష కొంపల్లో దీన్ని చూసి తరించారు .
ఇప్పుడు డేటా సెంటర్ నుంచి ఎంత డేటా ట్రాన్స్ఫర్ అయ్యిందో తెలుసా ?
ఒక కోటి జిబి లు .
ప్రతి గంట కొన్ని కోట్ల జిబి ల డేటా ప్రతి డేటా సెంటర్ నుంచి ఇలాగే వెళుతుంటుంది .
అక్కడ వందల ... వేల సంఖ్యలో సర్వర్ లు పని చేస్తాయి .
దీని వల్ల అపారమయిన వేడి ఉత్పత్తి అవుతుంది .
డేటా సెంటర్ ని చల్లబరచడానికి నీరు... అలాగే విద్యుత్ కావాలి .
ఇందాకా మనం చెప్పుకున్న సాధు సినిమా డేటా ట్రాన్స్ఫర్ వల్ల వేడెక్కిన డేటా సెంటర్ ను చల్ల బరచాడనికి అలాగే డేటా ప్రాసెస్ చేయడానికి డేటా సెంటర్ కయ్యే విద్యుత్ ఎంతో తెలుసా ?
16 లక్షల కిలోవాట్ అవర్స్ .
ఒక్క సినేమా కే ఇంత .
మరి మిగతా వాటికో ?
ఒక్కో డేటా సెంటర్ కు లక్ష కుటుంబాలు వాడే విద్యుత్ కావాలి ..
ఇది రెండు లక్షల దాక కూడా ఉండవచ్చు
ఒక పెద్ద డేటా సెంటర్ కు రోజుకు ఇరవై లక్షల లీటర్ ల నీరు కావాలి . చిన్న డేటా సెంటర్ కు అయినా డెబ్భై వేల లీటర్ ల నీరు కావాలి .
ఈ నీటి తో డేటా సెంటర్ లు వేడి ని చల్లారుస్తారు .
ఏసీ వాడినా నీరు కావాలి .
నీటిని తిరిగీ వాడుకున్నా సరే... డేటా సెంటర్ లు నీటి బకాసురులు .
అలాగే కరెంటు బకాసురులు .
కొంప లాస్స్ ఏంజెల్స్ అయిపోతుంది !
అమెరికా లో సంపన్న నగరం .
ఈ సంవత్సరం అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది .
పది వేల ఇల్లు తగలబడి పోయాయి .
ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయిల ఆస్తి నష్టం జరిగింది .
ఎందుకు ? అని మీరు కృతిమ మేధ ను అడగండి ?
గాలులు .. గాలిలో తక్కువ తేమ .. కరువు అని సోదిలో లేని సమాధానాలు ఇస్తుంది .
వాటికి ఆలా ట్రైనింగ్ ఇచ్చారు .
వాటి యజమానులకు నష్టం కలిగించేలా అవి సమాధానాలు ఇవ్వవు .
చరిత్ర లో ఎప్పుడూ జరగని విధంగా అక్కడ చెట్లు ఎండి పోయి ... అంత డ్రై క్లైమేట్ ఎందుకు ఏర్పడిందో తెలుసా ?
కారణం ఆ ఏరియా లు ఉన్న డెబ్భై కి పైగా డేటా సెంటర్స్ .
ఈ నీటి బకాసురులు భూగర్భ నీటి ని తాగేసాయి .
దానితో చెట్లు ఎండి పోయాయి .
చెట్లు ఎండిపోతే .. చచ్చి పొతే గాలులు వేగంగా వీస్తాయి .
వాటికి అడ్డు ఉండదు కదా .
అలాగే వర్షాలు సకాలంలో పడవు .
కరువు . ఎండిన చెట్లు .
చిన్న నిప్పు రవ్వ మొత్తం కాల్చేసింది .
ఎంత దాచినా ఆ అగ్ని ప్రమాదానికి మొదటి కారణం అక్కడి డేటా సెంటర్ లు .
డేటా సెంటర్ కయ్యే విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది ?
చెట్లను నరికి .. అడవుల్ని ధ్వంసం చేసి జల విద్యుత్ .. బొగ్గు విద్యుత్ ప్రోజెక్ట్ లు కడితినే కదా ?
డేటా సెంటర్ అంటేనే ప్రకృతి విధ్వంసం ..
సర్వ నాశనం .
ఇప్పుడు కృతిమ మేధ..
వాసిరెడ్డి అమర్నాథ్ ఒక పోస్ట్ పెడితే దాన్ని పోస్ట్ చేసి చాట్ జిపిటి నో గ్రోక్ నో ఇది నిజామా? అని మీరు అడుగుతున్నారు .
మీరు ఈ కృతిమ మేధ యంత్రాలకు ఒక ప్రశ్న వేస్తే ఏమి జరుగుతుందో తెలుసా ?
అది వేలాది లక్షలాది సర్వర్ ల ను సెర్చ్ చేస్తుంది . అంటే కృతిమ మేధ తో ఇప్పుడు కోటి రెట్ల ఎక్కువ హీట్ .
అంటే రానున్న రోజుల్లో డేటా సెంటర్స్ మరింత నీరు తాగేస్తాయి .
మరింత కరెంటు .
మరిన్ని చోట్ల డేటా సెంటర్స్ వస్తున్నాయి .
ఇరవై ఏళ్లుగా భూతాపం అని ప్రపంచ వ్యాపితంగా ప్రభుత్వాలు చిలక పలుకులు పలుకుతున్నాయి .
ఈ ఐదేళ్లలో మొబైల్స్ వల్ల డేటా సెంటర్స్ వల్ల... కృతిమ మేధ వల్ల... పుట్టిన సెగలు ఎంత ?
తెగి పడిన చెట్లు ఎన్ని ?
వాడిన కరెంటు ఎంత ?
ఎవడూ మాట్లాడాడేమి ?
కొన్నేళ్ల క్రితం సివిలా క్లాస్ లో మేఘ విస్ఫోటనం .. మెరుపు వరదలు అని పాఠాలు చెప్పేటప్పుడు అవి ఎలా వుంటాయో ఊహించుకొనే వారం.
గత ఆరేడేళ్లుగా ఇవి ప్రతి వర్షా కాలంలో నిత్య కృత్యం .
ఎందుకో అర్థం అయ్యిందా ?
ఇక రాబొయ్యే కాలంలో ఎన్ని ఫ్లాష్ ఫుడ్స్ క్లౌడ్ బరస్ట్ లు వస్తాయో జస్ట్ ఒక సారి ఆలోచించండి .
నీటి కొరత ఎలా ఉంటుందో ఆలోచించండి .
విద్యుత్ డిమాండ్ ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు .
మనకు అపిరిమిత డేటా కావాలి .
రీల్స్ .. యూట్యూబ్ లో వీడియోస్ .. ఓటిటి పై హింసాత్మక సినిమాలు .. నెట్ పై పోర్న్ .. వీడియో గేమ్స్ .. మన నిత్యావసర వస్తువులు .
తాగు నీరు దొరక్క పోయినా కరెంటు కోతలు వచ్చినా.. బతికేస్తాము .
ఫ్లాష్ ఫ్లడ్ వచ్చి రోడ్లు కొంపలు మునిగితే వాటి వీడియో లు తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ... చచ్చే దాక బతికేస్తాము . డేటా సెంటర్ అంటే విలయం .
"మా ప్రాంతం లో వద్దురా బాబూ" అని విదేశాల్లో ఉద్యమాలు . డేటా సెంటర్ పక్కనే ప్లాట్స్ కొనే మేధో స్థాయి మనది .
అపరిమిత డేటా ..
అపరిమిత విధ్వంసం ..
ఇదే భవిషత్తు చిత్రం !
August 18th, 2025
మొబైల్స్ , కృత్రిమ మేధ వినియోగం పెరిగే కొద్దీ డేటా సెంటర్స్ ఎక్కువ అవసరం అవుతాయి.
డేటా సెంటర్స్ ఉంటే నీరు ఎక్కువ అవసరం.
“ నీటి వినియోగం తగ్గించండి” అని ఇంగ్లాండ్ ప్రభుత్వం చెబుతోంది.
అంటే ఏంటి ?
మొబైల్ చాట్ జిపిటి లాంటివి రోజంతా వాడండి.
నీటి వినియోగం మాత్రం తగ్గించండి అని.
ప్రాధాన్యత క్రమాలు ఎలా మారుతున్నాయో గమనించండి.
August 18th, 2025
ఒక ప్రాంతం లో డేటా సెంటర్ పెడితే ..
ఆ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది.
డేటా సెంటర్ కు విపరీతమయిన నీరు అవసరం.
గూగుల్ డేటా సెంటర్ కు ఇరవై బిలియన్ లీటర్లు , మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కు ఆరు బిలియన్ లీటర్ లు !
భూగర్భ నీరు అడుగంటి పోతుంది.
చెట్లు ఎండి పోతాయి.
పశుపక్షాదులు అంతరించి పోతాయి.
లోసంజెల్స్ లో అగ్ని ప్రమాదానికి కారణం డేటా సెంటర్స్.
నిప్పు పడితే అంతే సంగతులు.
ఇప్పటికే భూతాపం.
ఇది మరింత పెరుగుతుంది.
కరెంటు కోతలు దారుణంగా ఉంటాయి.
కారణం డేటా సెంటర్ బకాసురిడిలా కరెంటు తినేస్తుంది.
ఒక్క డేటా సెంటర్ లక్ష కుటుంబాల విద్యుత్ ను లాగేస్తుంది.
బెంగళూరు హైదరాబాద్ ల లో డేటా సెంటర్స్ వెలుస్తున్నాయి.
డేటా సెంటర్ కు ఇరవై కిలోమీటర్స్ దూరం లో ఫ్లాట్ కొనొద్దు.
అమ్ముడు పోవు.
అక్కడ ఉండలేరు.
August 17th, 2025
మీరు ఎంతటి ప్రత్యర్థులయినా , మీ మధ్య ఎన్ని విబేధాలున్నా , కూర్చుని మాట్లాడుకొంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి .
ఇదే అగ్ర రాజ్య అధినేతలు ట్రంప్ , పుతిన్ భేటీ నుంచి అందరూ గ్రహించాల్సిన అంశం
August 17th, 2025
August 16th, 2025
ఫ్లాట్ గా వుండే ఒక పౌచ్
దానిపై భాగం సిక్స్ ప్యాక్ లాగా ఉంటుంది.
దాన్ని పొట్టపై పై కట్టుకోవాలి.
దాని పై భాగం లో షర్ట్.
అప్పుడు సిక్స్ పాక్ లాగా అనిపిస్తుంది.
పౌచ్ లో ఒక లీటర్ దాకా ద్రవం పడుతుంది.
మెడ కింది భాగం లో అన్నవాహిక నుంచి ఒక ట్యూబ్ !
దీన్ని పౌచ్ కు కనెక్ట్ చేస్తాం.
పైన టై కట్టడం వల్ల ట్యూబ్ కనబడదు.
చాలా మంది తిండి తెగ తింటారు.
వ్యాయామం చేయరు.
కానీ స్లిమ్ గా ఉండాలి అనుకొంటారు.
ఇలాంటి వారి కోసమే ఇది.
రుచి కోసం తింటారు.
తిన్న ఫుడ్ లో అయిదు శాతం మాత్రమే ఉదరం లోకి.
మిగతా 95 % పైన ఉన్న సిక్స్ ప్యాక్ పౌచ్ లోకి.
తిండి తిన్న తరువాత పౌచ్ ని తీసేసి వేరే పౌచ్ కట్టుకోవాలి.
ఆ పౌచ్ లోని నమిలిన ఫుడ్ ను క్లీన్ చేసి ఫ్రెష్ గా స్టెరిలైజ్ చేసే వక్క్యూమ్ క్లీనర్.
ఎంత తిండయినా తినొచ్చు.
లావు అయ్యే సమస్య లేదు.
ఎప్పుడూ సిక్స్ ప్యాక్ దేహం.
ఒక్కో ఇన్స్ట్రుమెంట్ ఖరీదు కేవలం 20 లక్షలు.
దీన్ని మల్టీ కేవెల్ మార్కెటింగ్ చేయడానికి వ్యక్తులు కావలెను.
ఫేస్బుక్ మిత్రులకు ప్రిఫెరెన్సు.
వెంటనే సంప్రదించండి.
ఆలసించిన ఆశా భంగం.
August 16th, 2025
August 16th, 2025
భక్తి ఉప్పొంగింది !
ఆ... మతం , ఈ... మతం అని లేదు .
అన్ని మతాల్లో..
భక్తి .. డివోషన్ .. ఏ పేరుతొ చెప్పుకొన్నా.. గుడులు , ప్రార్థన స్థలాలకు పోవడం , మతాచారాలను పాటించడం గత ఇరవై ఏళ్లలో విపరీతంగా పెరిగింది .
పాప భీతి చచ్చింది !
దేవుడంటే నమ్మకం ఉన్నప్పుడు పాప భీతి కలగాలి .
కాస్త అటుఇటుగా ప్రతి మతం సామజిక నియంత్రణా సాధనం.
ఈ తప్పులు చేస్తే ... మరణాంతరం శిక్ష... అని చెబుతుంది .
మత విశ్వాసాలు బలపడే వేళ పాప భీతి కలగాలి .
ప్రజలు మంచి దారిలో వెళ్ళాలి .
కానీ జరుగుతోంది బిన్నం .
ఒక పక్క మతవిశ్వాసాలు బాగా పెరుగుతుంటే మరో పక్క పాపభీతి చచ్చింది .
ఒక్క క్షణమయినా ఆలోచించకుండా ... ఎంతటి నేరం ... ఘోరం చేయడానికయినా జనం వెనుకాడడం లేదు . మినహాయింపులు ఉన్నాయి.
నేను చెబుతున్నది మెజారిటీ గురించి . ట్రెండ్ గురించి .
జాలి , కరుణ లాంటివి అడుగంటి పోతున్నాయి .
సైన్స్ మతం !
మధ్య యుగం లో మతం వెర్రి తలలు వేసింది .
మతాచారాల పేరుతొ ఎన్నో అఘాయిత్యాలు .
మత గురువులు చెబితే జనాలు గుడ్డిగా నమ్మేసేవారు .
ఎంత పని అయినా చేసేవారు .
ఇప్పుడు సరిగ్గా అదే స్థానాన్ని సైన్స్ ఆక్రమిస్తోంది .
హైదరాబాద్ లో ఇప్పుడు జనాలు వేలం వెర్రిగా మౌంజారో ఇంజక్షన్ వేసుకొంటున్నారు .
ఎలి లిల్లి అనే కంపెనీ దీని తయారు చేసింది .
డయాబెటిస్ మందుగా మార్కెట్ లోకి తెచ్చింది .
కమీషన్ కు ఆశ పడి చాలా మంది డాక్టర్లు దీన్ని బరువు తగ్గడానికి సూచిస్తున్నారు .
హైదరాబాద్ లో ఉత్తర భారత మూలాలున్న కమ్యూనిటీస్ లో ఇప్పుడు ఇదో వేలం వెర్రి .
వేలల్లో ఈ ఇంజెక్షన్ ఓవర్ ది కౌంటర్ కొనుగోలు చేసి గుచ్చేసుకొంటున్నారు .
ఇది ఎక్కడిదాకా పోయిందంటే... సాక్షాతూ ఎలి లిల్లి కంపెనీ నే .." ఒరేయ్ నాయన .. ఇది స్లిమ్ కావడం కోసం వాడే మందు కాదురా బాబూ .. ఇది డయాబెటిస్ కంట్రోల్ కోసం... అదీ డాక్టర్ సూచన మేరకు వాడాలి . దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి . క్లోమ కాన్సర్ రావొచ్చు" అని చెప్పింది .
అయినా ఆగదు .
" లావు తగ్గాలంటే ఇది వాడాల్సిందే .. ఇది సైంటిఫిక్" అని జనాలు... గొర్రె దాటులో ..
మొన్నటికి మొన్న కరోనా వాక్ సీన్ గుచ్చుడు చూసారు .
ఒక ప్రళయం . లక్షలాది మందికి అనారోగ్యం .
అయినా అదేదీ పట్టన్నటు ఇప్పుడు కొత్తగా ఈ సన్నారి మందు .
రేపు కాన్సర్ వాక్ సీన్ .
ఒకప్పటి సంగతి వేరు .
క్లినికల్ ట్రైల్స్ నిజాయతీగా జరిగేవి .
ఇప్పుడు కాలకూట విషాన్ని కూడా మందుగా అప్రూవల్ ఇచ్చేస్తే అవినీతి .
ఇటు వంటి పరిస్థితుల్లో జనాలు ఏమి చెయ్యాలి ?
" అరేయ్ బాబు .. మన చుట్టూ పక్కల చాలా మంది జనాలు .. గినీ పందులుగా మారుతున్నారు . " ఏమమ్మా ! మీ అమ్మాయికి సెర్వికల్ కాన్సర్ పేరుతొ వాక్ సీన్ వేయించారు . ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? పీరియడ్స్ సరిగ్గా వస్తున్నాయా ? పీరియడ్స్ సమయం లో ఆమె కు పెయిన్ ఎలా ఉంది " అని అడిగి .. ఒకరిని కాదు .. కనీసం పది... ఇరవై మందిని అడిగి ఏమీ సమస్య లేదంటే ముందుకు సాగొచ్చు .
ఆగి చావొచ్చుగా .. పందుల్లారా !
అలాగే ఇప్పటికిప్పుడు స్లిమ్ అయిపోయి వీళ్ళు ఏమన్నా సినిమాలో హీరో లు గా నటించాలా ?
ఒక పది పదహైదు నెలలు ఆగితే... ఇప్పుడు మౌంజారో వేసుకొన్న గిని పందులు ఏమవుతారో చూడొచ్చుగా !
చూసి సమస్య లేకుంటే వేసుకోవచ్చుగా !
లేదు . సైన్స్ మతం .. దాని గురువులు చెప్పారు .. ఇప్పుడు అగ్గిలోకి వేలమంది .
వేలం వెర్రి :
నిన్న ఒక టీవీ ఛానల్ నుంచి ఫోన్ .
"ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో పిల్లల్ని చావ బాదుతున్నారు. ఫీజుల మోత. ఈ సమస్య పై మీ ఇంటర్వ్యూ కావాలి "అని.
ఈ రోజు వస్తాను అని చెప్పా . ఇంకో స్కూల్ కరెస్పాండంట్ కు ఫోన్ చేస్తే .. " అన్నా.. ఆ సమస్య నీకెందుకన్నా .. జనాలకు బాగా... కావాలి . అక్కడ రెండేళ్లలో మూడు వేల అడ్మిషన్స్ .
లక్షన్నర ఫీజు .
జనాలు వేలం వెర్రిగా ..
ఆడు స్కూల్ ఓనర్ రియల్ ఎస్టేట్ ..
పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు .
వరల్డ్ స్కూల్ పేరుతొ ఫ్రాంచైజ్.
పెద్ద బిల్డింగ్ . ఇక చూస్కో జనాలు .
ఇంటర్ కూడా పాస్ కాని టీచర్ లు .
ఇంగ్లీష్ మాత్రం స్టైల్ గా మాట్లాడుతారు .
వాడు మనీ మింట్ చేసుకొంటుండు. జనాలకు ఇలాంటి వాడే కావాలి .
మీరెందుకన్నా దాన్ని గురించి మాట్లాడుతారు " .
ప్యాంటు జోబులో చెయ్యి వేసుకొని ఎటో పోను .. జనాలకు చెబుతూనే ఉంటా!
గంగిగోవు పాలు గరిటెడు అయినా చాలు !
శుభోదయం!
August 15th, 2025
మౌంజారో అనేది డయాబెటిస్ కోసం వచ్చిన మందు. కేవలం డాక్టర్ సూచన మేరకు దీన్ని వాడాలి.
చాలామంది బరువు తగ్గడానికి దీన్ని వాడుతున్నారు.
కొంతమంది డాక్టర్ లు కమీషన్ కోసం దీన్ని అందం కోసం బరువు తగ్గాలి అనే వారికి సూచిస్తున్నారు.
ఇది ప్రమాద కరం.
మందులు తిని బరువు తగ్గాలి అనుకోవడమే ప్రమాదకర ఆలోచన.
చెప్పలేదు అనొద్దు.
August 15th, 2025
వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది .
ఇటీవల కాలంలో వీధి కుక్కల వల్ల మరణించినవారెందరో !
కారు లలో పయనించేవారికి పెద్దగా సమస్య ఉండదు .
కానీ కాలి నడక పోయే వారికి, ద్వి చక్ర వాహనదారులకు ఇవి ప్రాణాంతకంగా పరిణమించాయి .
చిన్న పిల్లల సంగతి అయితే చెప్పనక్కరలేదు .
ఈ పరిస్థితుల్లో వీధి కుక్కల పట్ల జన సామాన్యంలో విపరీతమయిన వ్యతిరేకత వచ్చింది .
కొంతమంది జంతు ప్రేమికులు తప్పించి జనసామాన్యం వీధి కుక్కలను తీసుకెళ్లి షెల్టర్ జోన్ లు ఏర్పాటు చెయ్యాలని సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ను స్వాగతించారు .
ఢిల్లీ లో మొత్తం పది లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అంచనా . ఒక్కో షెల్టర్ కు 5000 కుక్కలు తరలిస్తే మొత్తం 200 షెల్టర్ లు కావాలి .
తక్కువంటే ఒక్కో షెల్టర్ కు రెండు మూడు ఎకరాల స్థలం కావాలి . అంటే మొత్తం అయిదు వందల ఎకరాల స్థలం కావాలి !
ఢిల్లీ లో ఇంత ఖాళీ స్థలం ఉందా ?
ఒక్కో కుక్కకు తిండికి నీళ్లకు ఆ షెల్టర్ మైంటెనెన్సు కు కలిపి సగటున యాభై రూపాయిలు .
అంటే పది లక్షల కుక్కలకు రోజుకు యాభై కోట్లు .
నెలకు 1500 కోట్లు .
సంవత్సరానికి 18000 కోట్లు .
కుక్కలు... ఎలుకలు పంది కుక్కల్ని చంపి తినేస్తాయి .
మొత్తం కుక్కలను వీధుల్ని నుంచి నిర్మూలిస్తే ఎలుకలు పంది కొక్కుల సంఖ్య భారీగా పెరుగుతుంది.
ఇప్పటికే కోతులు ఇళ్లపై దాడి చేస్తున్నాయి .
అవి ఇప్పుడు చెట్లపైనే వస్తున్నాయి .
కుక్కలు లేకపోతే కోతులు అన్ని వీధుల్లో నిండి పోతాయి .
కర్ర చేతిలో ఉంటే కుక్కలు దరిచేరవు .
కోతులు ఆలా కాదు .
చేతిలోని బ్యాగులను లాగుకొని పారిపోతాయి .
వీధి కుక్కలు పారిశుధ్య కార్మికుల్లా పని చేస్తాయి .
అవి లేక పొతే వీధుల్లో మలినాలు బాగా పెరిగి పోతాయి .
కలరా లాంటి అంటూ వ్యాధులు వ్యాపించే ప్రమాదం .
వీధి కుక్కలకు లోకల్ ఫీలింగ్ ఎక్కువ .
వివిధ ప్రాంతాలనుంచి కుక్కల్ని తీసుకొని ఒకే షెల్టర్ లో పెడితే భీకర యుద్ధం ప్రారంభం అవుతుంది .
రాత్రి పగలు అరుపులు .
ఒకటి పై ఒకటి దాడి . చుట్టూ పక్కల రెండు కిలోమీటర్ ల వరకు మనుషులు నిద్ర పోలేరు .
కుక్కలకు అంటువ్యాదులు బాగా సోకుతాయి .
అన్ని కుక్కల్ని ఒకే చోట పోగేస్తే అంటు వ్యాధులు వస్తాయి .
వాటిలో కొన్ని మనుషులకు సోకే ప్రమాదం .
ఏమి చెయ్యాలి ?
1 . వీధి కుక్కల్ని ఇంట్లో వుంచుకోవడానికి సిద్ధంగా ఉన్నవారిని ప్రోత్సహించాలి . వారికి ఇంటి పన్నులో రాయితీ లాంటివి ఇవ్వొచ్చు .
2 . యుద్ధ ప్రాతిపదికన కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్ నిర్వహించాలి .
ఇది లేకపోవడం వల్లే కుక్కల సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది.
అల్ట్రా సోనిక్ డివైస్ లు పని చేయవు . అంతా డూపు .
సినిమాల్లో అయినట్టు సమస్యలు చిట్కాలతో పరిష్కారం కావు .
ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ సమస్య మరింత జటిలం .
చాలా మందికి అర్థం కాని ఒక సమస్య ఉంది.
వీధి కుక్కలు రాత్రిళ్ళు బాగా మొరుగుతాయి .
ఒక కుక్కతో మొదలయ్యి పదహైదు కుక్కలు అర్ధ రాత్రి అప రాత్రి ... ఒక్కో సారి గంటల తరబడి మొరుగుతాయి .
దీని వల్ల నిద్ర బాగా డిస్టర్బ్ అవుతుంది .
నిద్రలో ఉలిక్కి పడి లేచే వారెందరో .
ఇలా తరచూ నిద్ర డిస్టర్బ్ కావడం ఆరోగ్యానికి ప్రమాదకరం . మానసిక ఒత్తిడి.. వ్యాకులత... గుండె జబ్బులు... ఇమ్మ్యూనిటి బలహీన పడడం లాంటి సమస్యలొస్తాయి .
ముందు గొయ్యి .. వెనుక నుయ్యి .
మరేంటి పరిష్కారం అంటారా ?
చెప్పాను కదా . సమస్య జటిలం .
తిరుపతిలో మా బంధువుల కుటుంబం .
ఆ వీధిలో ఒక కుక్క ఆరు పిల్లలకు జన్మ నిచ్చింది . వారంలో తల్లి చనిపోయింది .
తల్లి లేని చిన్న కుక్క పిల్లలు .
అమ్మాయి {మా చెల్లి {కజిన్} కూతురు } జాలిపడి ఇంటి వాకిటి లోకి తెచ్చి వాటికి పాలు పోసి రక్షించింది .
ఇప్పుడు ఆ ఆరు కుక్కలు పెరిగి పెద్దయ్యాయి .
గేట్ దాటి బయటకు పోవు .
పొతే బతకలేవు . అవి రాత్రిళ్ళు వరస బెట్టి వంతులు వేసుకొని అరుస్తాయి .
దీని వల్ల మా చెల్లి { కజిన్ ఆరోగ్యం} బాగా దెబ్బ తింటోంది .
రాత్రిళ్ళు నిద్ర ఉండదు .
పగలు డ్యూటీ . ఎక్కడైనా తీసుకొని వదిలితే వారు .. కుక్కలు కాదు మా చెల్లి బావమరిది బతకలేరు .
ఆ మాట చెబితే ఏడుస్తారు .
పక్కింటి వారితో గొడవ .
పోలీస్ కేసులు దాక వెళ్ళింది .
వదల లేరు .
ఇంట్లో ఉంటే నిద్ర పట్టదు .
మనఃశాంతి లేదు .
సమస్యకు పరిష్కారం చెప్పలేక చేతులెత్తేసాను .
అతి సర్వత్రా వర్జయేత్ అంటారు .
చెన్నై లో ఫ్రెండ్ .
వాళ్ళమ్మాయి కి నాలుగేళ్ళ క్రితం పెళ్లయింది .
అల్లారు ముద్దుగా పెంచారు .
ఆమె చాలా సెన్సిటివ్ .
బాగా తెలివైంది .
భర్త అలాంటివాడే దొరికాడు .
వీధుల్లో గాయపడిన పిల్లుల్ని తీసుకొని వెళ్లి పెంచుకొంటున్నారు . ఇంట్లో ఇప్పుడు మొత్తం 18 పిల్లులు .
ఒక పిల్లికి కాన్సర్ .
అది చచ్చిపోతుందని మూడు రోజులుగా ఈ యువ జంట నిద్రాహారాలు మానేశారు .
వారికి ఇల్లు ఎవరూ ఇవ్వరు .
చెన్నై శివారులో ఎక్కడో ఒక అపార్ట్మెంట్ ఉందట .
అక్కడ ఇలాంటి వారికే ఇస్తారట .
పిల్లుల కోసం అక్కడ ఇల్లు తీసుకొన్నారు .
పిల్లుల కోసం పిల్లలని కనకూడదు అని దంపతులు ఇద్దరు నిర్ణయించుకొన్నారు .
ఇది చెబుతూ మా ఫ్రెండ్ మొన్న చెన్నై పోయినప్పుడు బాధ పడ్డాడు . నా కౌన్సిలింగ్ పనికి రాదని నాకు తెలుసు .
జీవితం లో బాలన్స్ ముఖ్యం .
శుభోదయం.
August 14th, 2025
August 13th, 2025
August 13th, 2025
ముందుగా నవ్వొస్తుంది.
నవ్వేయండి.
నిజం ఏమిటంటే కొవ్వు తగ్గడానికి శారీరిక శ్రమ ఒక్కటే మార్గం. స్రీ అయినా పురుషుడయినా !
August 13th, 2025
చదువుకున్న వారి గతి.. ఇక అంతేనా ?
"ఉన్నత విద్యా సంస్థల్లో టాప్ గ్రేడ్ లో పాస్ అయిన వారు రెస్టారెంట్ ల లో... గ్యాస్ స్టేషన్ ల లో పని చేస్తుంటే... చదువును పెద్దగా పట్టించుకోకుండా బలాదూర్ గా తిరిగిన వారు కోట్ల లో సంపాదిస్తున్నారు . ఇక చదువెందుకు ? కృతిమ మేధ అన్నీ తలకిందులు చేసింది . ఇక ఉన్నత చదువులు వేస్ట్ "
నెట్ పై ఒక వ్యక్తి ప్రశ్న .
ఇటీవల బాగా డిబేట్ అవుతున్న అంశం .
"లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్లు లక్కు తోటి లచ్చలల్లో మునిగిపోతారు . పుస్తకాలతో కుస్తీలు పట్టేటోళ్లు సర్కారీ క్లర్కులై మురిగిపోతారు " 36 ఏళ్ళ నాటి శివ సినిమా లో పాట !
చదువంటే పుస్తకాల్లో ఉన్నదాన్ని బట్టీ కొట్టి పరీక్ష లో రాసి మార్కులు సాదించడమేనా ?
అవును అనుకొంటే ఇక అలాంటి చదువు చదివిన వారికి చిప్పే గతి .
కృతిమ మేధ చేయలేని పని చేసే వారికే ఇక ఉద్యోగాలు .
సామాజిక తేలితేటలు, భావోద్వేగ టెలివితేటలు, సృజనాత్మకత , నలుగురితో కలిసి పని చేసే సామర్త్యం , కుశాగ్ర బుద్ధి లాంటివి ఉన్నవారికే జాబ్స్ .
నిజానికి ఒకప్పుడు ఇవన్నీ చదువులో భాగం .
గత నలబై ఏళ్లగా కేవలం సబ్జెక్టు పై అంతకు మించి మార్కుల పై ఫోకస్ రావడంతో లైఫ్ స్కిల్స్ విద్య చచ్చింది .
ఎంత డబ్బున్నా ఏమి లాభం ?
అయన గురించి తెలియని తెలుగు వారుండరు .
నాగార్జున సాగర్ డాం కాంట్రాక్టర్ , రాజ్య సభ సభ్యుడు , కేంద్ర మంత్రి , సినిమా నిర్మాత , పెద్ద హోటల్.. సినిమా థియేటర్ .. మాల్స్ కు అధినేత .. కళల బంధువు .
ఇదీ అయన గతం .
పాపం... ఈ రోజు అయిదు లక్షల అప్పు కోసం తెలిసిన వారికి ఫోన్ చేస్తే ... మొఖం చాటేస్తున్నారట .
ఎక్కడో ఫైనాన్సియల్ మానేజ్మెంటు లో తీవ్ర తప్పిదం జరిగింది .
మరో ప్రముఖుడు .
ఆయన ప్రవర్తన గురించి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు .
కానీ ఆయన నటన ను మెచ్చుకోనివారుండరు .
ప్రైవేట్ పాఠశాలలో స్పోర్ట్స్ టీచర్ తో కెరీర్ ప్రారంభించి నటుడు నిర్మాత రాజ్య సభ్యుడు గా ఎదిగాడు .
ఇప్పుడు కొడుకుల మధ్య పోరు .
గోరు చుట్టూ పై రోకలి పోటు అన్నట్టు ఇప్పుడు కొత్తగా తీసిన సినిమాలో కోట్ల కొద్దీ నష్టాలట .
వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూడడం మంచిది కాదు .
పైగా వారు కష్టాల్లో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడడం .
చేబుతున్న విషయం అందరికీ బాగా అర్థం కావడనికే వీరి గురించి ప్రస్తావించాను
చదువంటే సరి పోదు ..
డబ్బుంటే సరి పోదు ..
జీవితం లో ఒక దశలో విజయాలు సాధిస్తే సరిపోదు .
రాజనాల
కత్తి కాంతారావు
మహానటి సావిత్రి
శ్రీదేవి
సిల్క్ స్మిత
పుఱచి తలైవి జయలలిత ..
వీరు జీవితం లో సాధించని విజయలా?
కానీ వారి చివరి రోజులు దయనీయం .
పగవాడికి కూడా వద్దు బాబు అనుకునేంత కష్టాలు .
బతికితే చంద్ర మోహన్ లా బతకాలి ..
అక్కినేని నాగేశ్వర రావు లా బతకాలి .
బతుకంటే భయం ..
ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో అలోచించి ముందడుగు వేశారు .
బతకడం ఒక కళ .
దీన్నే లైఫ్ స్కిల్స్ అంటారు .
ఇన్నాళ్లు వేరు .
ఇక వేరు
కృతిమ మీద యుగం లో ఉత్తుత్తి చదువులకు కాలం చెల్లింది .
బట్టీ పట్టి డేటా తో బుర్ర ను నింపేవారు రోబో ల ముందు ఎందుకు కొరగాకుండా పోతారు .
లైఫ్ స్కిల్స్ వున్నవారిదే ఇక రాజ్యం .
అందుకే కేవలం పలక కే పరిమితం కాకుండా కాలికి బలపం కట్టుకొని ఊర తిరిగి తల్లితండ్రుల్ని విద్యార్థులని ఎడ్యుకేట్ చేస్తున్నా.
బాలమిత్ర రెండవ దశ ఈ రోజు ప్రారంభం .
ఈ రోజు ఉప్పల్ లో బాలమిత్ర 51 వ క్లాస్ .
రెజిస్ట్రేషన్స్ ముగిసాయి .
కొత్తగా ఎవరికీ ప్రవేశం లేదు .
శుభోదయం
August 12th, 2025
August 12th, 2025
చందమామ
శుక్ల పక్షం చంద్రుళ్లు
ఇదీ మా high school విభాగపు annual డే ప్రోగ్రాం.
ఈ రోజే స్క్రిప్ట్ పూర్తి చేశా !
శుక్ల పక్షం అయితే పున్నమి.
సంతోషం వెల్లివిరిసే సమయం.
కృష్ణ పక్షాన్ని తన జీవితం లో వీలైనంత ఆలస్యం చేయాలి. ఇదే ప్రతి మనిషి లక్ష్యం కావాలి.
August 12th, 2025
August 12th, 2025
August 12th, 2025
August 11th, 2025
గోల్డెన్ బీచ్ లో మామ తో కాదు కానీ
గేయ రచయిత బాలాజీ , గాయకుడు సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ తో మూడు గంటల సిట్టింగ్.
ఇంకో పది రోజులకు మార్పులు చేర్పులతో బెట్టింగ్ పై రామబాణం సిద్ధమవుతుంది !
August 11th, 2025
మేఘ విస్ఫోటనం
August 11th, 2025
డిజిటల్ యుగ జ్ఞానం !
మనం డిజిటల్ యుగంలో ఉన్నాము.
రూల్స్ మారాయి .
డిజిటల్ పూర్వ యుగం తేలితేటలు ఇక పనికిరావు .
మన చర్యల పర్యవసానాలేంటో ఏమి చెయ్యాలో , ఏమి చేయకూడదో తెలుసుకోవడం ఎంతో అవసరం .
కొన్ని నిజజీవిత ఉదారణలతో వివరిస్తాను .
ఆమె వెండి తెర నటి .
హుందా పాత్రలను పోషించింది .
ఇప్పుడు వయసు యాభై కి సమీపించింది .
నిన్నటి కి బిన్నంగా ఆమె కురస దుస్తులతో తన ఫోటోలను పదేపదే పోస్ట్ చేస్తోంది .
అవి స్పాన్సేర్డ్ పోస్ట్ లు కావడంతో మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఆమె లేకపోయినా అవి మీ కు కనిపిస్తాయి .
ఇలాంటి వారి గురించి అంతర్జాలంలో చర్చలు
" ఎవరిష్టం వారిది . ఆమె దుస్తులను ప్రశ్నించడానికి మీరెవ్వరు? ఇది పురుషాహంకారం " ... కొందరు .
"లేదు ఇది సభ్యత .. సంస్కారం... కాదు " కొందరు .
రెండు రకాల చర్చలను యూట్యూబ్ లో చూసి బుర్ర గోక్కుంటూ గంటల కొద్దీ సమయాన్ని వృధా చేసుకొని గొట్టంగాళ్లకు .. రెవిన్యూ అందించేవారు కోకొల్లలు .
అభిప్రాయం .. కౌంటర్ పాయింట్ .. ఖండనలు .. వాటిపై తిరిగీ ఖండనలు ..
జనాల దగ్గర ఎంత టైం ఉందొ .
వీటిని దాటి.. కాస్త ముందుకు వెళుదాము .
ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటో .. దాని పై కొన్ని వందల కామెంట్స్ ..
కుతూహలం కొద్దీ చూసే వారు కొందరు . జనాల ఆలోచన తీరు అర్థం చేసుకొనేందుకు చూసే వారు కొందరు .
అందులో ప్రతి ఒక్కటి ఆమెను తిడుతూ .. పచ్చి బూతులతో తిడుతూ కామెంట్స్..
జనాల దగ్గర ఇన్ని బూతులు తిట్టించుకొంటూ ఈమె ఎందుకు ఇలా ఫోటో లు పెడుతోంది ?
ఆలోచన .
వెదకబోయిన తీగె కాలికి తగిలినట్టుగా వారం రోజుల్లునే సమాధానం .
ఒక స్టార్ హోటల్ .
అందులో ఒక దృశ్యం .
దాన్ని చూడడంతో .. ఆమె సంపాదనకు ఇవన్నీ చేస్తోంది . ఫోటో లు పోస్ట్ చెయ్యడం మార్కెటింగ్ ప్రక్రియ అని అర్థం అయ్యింది .
ఆమె తెలుగు నటి అని నేను చెప్పలేదు .
ఈ పోస్ట్ లో ఆమె ఐడెంటిటీ చెప్పడం ముఖ్యం కాదు .
ఎందుకంటే ఆమెలా వందల మంది . కేవలం ఉదారణకోసం చెప్పాను.
ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో తెలుసుకోవడం ముఖ్యం . రెండో ఉదాహరణ తరువాత చెబుతాను .
ఇంకో నటి . తన మైనారిటీ తీరని కూతురికి కోరిక తీర్చుకోవడానికి టాయ్స్{ పిల్లల ఆట బొమ్మలు కాదు . } కొనిస్తానని అందులో ఆమె చెప్పినట్టు ఉంది. ఆమె తన కూతురు తో దిగిన ఫోటో పై ఆమె మాటలు ఉన్నాయి.
దాని కింద జనాలు బూతులు పోస్ట్ చేసారు .
ఇక్కడా అంతే .. కామెంట్స్ వల్ల పోస్ట్ మరింతమందికి వెళుతుంది . ఆమె పోస్ట్ చేసింది కంపెనీ ల కోసం .
OTT యుగం లో ఈ కంపెనీ ల సేల్స్ బాగా పెరిగింది .
కోట్ల లో టర్న్ ఓవర్ .
వీటి సేల్స్ మరింత పెంచుకోవడానికి ఉద్దేశించిన పోస్ట్ అది .
పోస్ట్ రూపంలో వుండే ప్రకటన .
డిజిటల్ తెలివితేటలు.
చేయకూడనివి :
1 . డిజిటల్ పోస్ట్ లు మైరావణుడు .
ఒక తల నరికితే ఇంకోటి వస్తుంది .
మీరు తిడుతూ కామెంట్స్ పెడితే .ఆ మాటకొస్తే ఎలాంటి కామెంట్స్ పెట్టినా ఆ పోస్ట్ మరింత మందికి చేరుతుంది . పోస్ట్ పెట్టేవారికి.. సోషల్ మీడియా కు ఇదే కావాలి .
పోస్ట్ ఎంగేజ్మెంట్ అంటారు . ఎంత వివాదాస్పదం అయితే అంత రీచ్ . అంత రెవిన్యూ . కాబట్టి ఇలాంటి వాటి పై కామెంట్స్ పోస్ట్ చెయ్యొద్దు .
2 . 16 ఏళ్ళ అమ్మాయి పై... తల్లే ఆలా పోస్ట్ చెయ్యడం నేరం . ఈ విషయాన్ని సోషల్ మీడియా కు చెబితే .. సిగ్గు ఎగ్గూ లేకుండా ఇది మా కమ్యూనిటీ స్టాండర్డ్స్ . కాబట్టి ఈ id ని పోనీ కనీసం ఈ పోస్ట్ ను బ్లాక్ చెయ్యము అని రిప్లై వచ్చింది .
వారికి కావాల్సింది డబ్బు.
జనాల బలహీనతలతో ఆడుకోవడం వారికి తెలుసు .
కాబట్టి రిపోర్ట్ చేసి మీ సమయం వృధా చేసుకోవద్దు .
౩. ఎవరైనా బతక లేక ఒళ్ళమ్ముకొనేవారి పై పోలీస్ లు చర్యలు తీసుకొంటారు .
బహిరంగంగా .. అఫ్ కోర్స్ .. చాలా సోఫిస్టికేటెడ్ గా సోషల్ మీడియా వేదికగా బిజినెస్ చేసుకొంటున్న ఆమె పై పోలీస్ లు దృష్టి సారించే అవకాశం లేదు .
ఇక కోర్టులంటారా .. ?
చెప్పుకొంటే సిగ్గు చేటు ..
ఇప్పటికి ఓయో కు.. స్టార్ హోటల్స్ కు పరిమితం చేసారు . బహిరంగంగా రోడ్డు పై కుక్కల్లా చేసుకోవచ్చు అని తీర్పు లు వచ్చే రోజులు వస్తాయేమో !
కాబట్టి పోలీస్ ల పై... కోర్ట్స్ పై ఆశలు వద్దు . పొద్దునే లేచినప్పటి నుంచి బూతులు పోస్ట్ చేసేవారి పై కూడా పోలీస్ లు చర్యలు తీసుకోలేరు .
తీసుకొంటే కోర్ట్స్ ఒప్పుకోవు .
అలాగే ఆన్లైన్ లో టాయ్స్ అమ్ముకోవచ్చు .
అడిగే వారుండరు .
అడిగినా లాభం లేదు .
చేయాల్సినవి :
ఒక చెత్త పోస్ట్ కనిపిస్తే వెంటనే దాని పోస్ట్ చేసిన id ని బ్లాక్ చెయ్యండి .
ఇలా లక్షల మంది బ్లాక్ చేస్తే వాడి రీచ్ తగ్గిపోతుంది . కుక్క కాటుకు చెప్పుదెబ్బ .
శుభోదయం !
August 11th, 2025
బ్రహ్మానందం స్టైల్ లో..." తప్పేముంది ? అదొక ఆర్టు ... "
జంకు తినడం ఒక ఆర్టు ..
చక్కెర బిపి మాత్రలు మింగడం ఒక ఆర్టు ..
బరువు తగ్గడానికి కొత్తగా వచ్చిన ఇంజక్షన్ వేసుకోవడం ఆర్టు ..
ఫార్మసురులకు ఎటిఎం గా మారడం ఒక ఆర్టు ...
ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేవారంటే .. సాధారణంగా కాయకష్టం చేసుకొనేవారే. భౌతిక శ్రమ చేసేవారిలోనే ఇలాంటి స్థితి ఉంటే ఇక డెస్క్ జాబ్స్ చేసేవారి .. కాలిపై కాలు వేసుకొని జీవించేవారు ... సంగతి ఎలా ఉంటుందో ఊహించండి .
August 10th, 2025
పరుగు ఆగితే అంతే సంగతులు !
ట్రంప్ మా జోరుగా ఉన్నాడు.
మాగా... మాగా .. తగ్గేదెలా ... అంటూ అనేక చర్యలు చేపడుతున్నాడు .
ట్రంప్ చర్యలతో మాంగా పండుతుందా ?
లేక కుళ్ళి పోతుందా ?
ఇటుకలు అడ్డొస్తున్నాయి .
అయిదంటే అయిదు దేశాలు .
చైనా, ఇండియా , రష్యా , బ్రెజిల్ , దక్షిణాఫ్రికా !
195 దేశాల్లో అయిదు దేశాలు ఏ మూలకు అనుకోకండి .
ఈ అయిదు దేశాల జనాభా ... ప్రపంచ జనాభాలో 55 శాతం .
మాయల ఫకీరు ప్రాణం రామ చిలుకలో ఉన్నట్టు అమెరికా ఆయువుపట్టు డాలర్ .
ప్రపంచంలో ఏ రెండు దేశాలు వ్యాపారం చేసుకొన్నా... డాలర్ లోనే చేసుకోవాలి .
... స్థూలంగా ఇది ఇప్పటి దాక స్థితి .
డాలర్ తో సంభంధం లేకుండా మనం ఒక ప్రత్యేక కరెన్సీ తయారు చేసుకొందాము అని ఇటుక దేశాల ఆలోచన .
ఇది జరిగితే అమెరికా కొంప కూలడం ఖాయం .
అందుకే ట్రంపయ్య కోపం .. అసహనం .. టారిఫ్ లు .
"మీ ఇంటికొస్తే మా కేమి ఇస్తారు ? మా ఇంటికొస్తే మా కేమి తెస్తారు?" అనేది ఎప్పటి నుంచో అమెరికా విధానం .
అసలు ఫ్రీ ట్రేడ్ అంటూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజషన్ తెచ్చిందే అమెరికా .
అప్పుడు వారికి సాగింది . "నేను బలవంతుడు .. ఫ్రీ ట్రేడ్ వస్తే మరిన్ని లాభాలు వచ్చి మరింత బలపడిపోతాము అనేది" అప్పట్లో అమెరికా ఆలోచన .
ఫ్రీ ట్రేడ్ వల్ల.. వలస విధానాల వల్ల అమెరికా కు లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగింది అనేది నేడు వారి అవగహన .
అందుకే తిరిగీ పాత రోజుల్లోకి వెళ్లిపోవాలని వారి ఆలోచన .
అంటే సరిగ్గా గ్లోబలైజెషన్ కు వ్యతిరేకంగా వారి చర్యలు .
బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా?
మేలా?
కీడా?
అని అడిగితే ఎలా ?
అమెరికా కు దిక్కు లేదు .
మరో మార్గం లేదు !
ఇప్పుడు ఇలాగే వదిలేస్తే పేక మేడ కూలడం ఖాయం .
అప్పుల అప్పారావు .. రొటేషన్ చక్రవర్తి .. కొన్నేళ్ళకు ఒపి పెట్టేయాల్సి వస్తుంది .
అందుకే చర్యలు .
ఇవన్నీ ఫలిస్తే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కల సాఫల్యం .
ఇటుక దేశాలు డాలర్ కు గోడ కట్టేస్తే అమెరికా ను ఎవరూ రక్షించలేరు .
క్లుప్తంగా ఇదీ జరుగుతున్న వ్యవహారం .
ఒకటి వాస్తవం ..
అమెరికా నిన్నటిలా ఉండదు .
మాంగా పండితే అమెరికా సూపర్ పవర్ గా కొనసాగుతుంది .
కానీ ఇన్నాళ్లు జరిగినట్టు ఉన్నత విద్య కోసం అమెరికా కు పోయి అక్కడే స్థిర పడడం బాగా తగ్గిపోతుంది .
మాంగా కుళ్ళినా జరిగేది అదే .
మాంగా పండితే ఇప్పటికే అక్కడ గ్రీన్ కార్డు దాటేసిన మనాళ్ళు సేఫ్ .. హ్యాపీ .
ఇటుకల గోడ కట్టేస్తే వారిలో చాలామంది ఇక్కడికి వచ్చేసే స్థితి .
ఈ ప్రపంచం లో శాశ్వతమైనది ఒక్కటే ..
అదే మార్పు .
నిన్నటిలా నేడుండదు.
నేటిలా రేపుండదు .
అందరికీ అర్థం కావడానికి సరళంగా... కాస్త వ్యంగ్యంగా చెప్పాను.
కాస్త స్వీపింగ్ గా కూడా చెప్పాను
మీ అభిప్రాయాలను పోస్ట్ చేయవచ్చు .
నిర్మాణాత్మక విమర్శకు ఆహ్వానం.
శుభోదయం !
August 9th, 2025
ఇంటర్నెట్ మన వ్యక్తిత్వాలను చెడుగా మారుస్తోందా?
వివేకం, బహిర్ముఖత్వం తగ్గుముఖం పట్టగా, నాడీ బలహీనత పెరుగుతోంది. దీనికి యువత నాయకత్వం వహిస్తోంది. ఇది నిజంగా ఒక ముఖ్యమైన మార్పు. వివేకం అనేది ఒక వ్యక్తిత్వ లక్షణం. దీనిలో ఒకరి పనులు మరియు నిర్ణయాలలో జాగ్రత్తగా, క్షుణ్ణంగా, మరియు శ్రద్ధగా ఉంటారు. అంటే బాధ్యతగా, క్రమబద్ధంగా, మరియు నమ్మదగినవారిగా ఉండటంతో పాటు, బలమైన కర్తవ్య భావన మరియు పనులు చేయాలనే కోరిక కలిగి ఉండటం. నాడీ బలహీనత అనేది ఒక వ్యక్తిత్వ లక్షణం. ఒత్తిడి లేదా ప్రతికూల పరిస్థితులకు ప్రతిస్పందనగా ఆందోళన, కోపం, లేదా విచారం వంటి ప్రతికూల భావోద్వేగాలను అనుభవించే ధోరణి దీనిలో ఉంటుంది. అధిక నాడీ బలహీనత ఉన్న వ్యక్తులు ఒత్తిడికి మరింత సున్నితంగా ఉండవచ్చు మరియు పదేపదే ఆలోచించడం, ఆందోళన, లేదా భావోద్వేగ అస్థిరతకు గురయ్యే అవకాశం ఉంది.
August 9th, 2025
పిల్ల బిత్తిరి గాళ్ళకు వార్నింగ్ !
August 9th, 2025
అయ్యగారికి దండం పెట్టు.
ఇంత మేధావి కదా ! కనిపించింగానే సెప్టిక్ ట్యాంక్ లో దూకాడేందుకో!
August 9th, 2025
August 9th, 2025
ఇది నెక్స్ట్ లెవెల్ !
సైబర్ క్రిమినల్స్ ఇప్పటిదాకా... వ్యక్తులను మోసం చేసి దోచేస్తున్నారు .
ఇప్పుడు చాట్ జిపిటి - 5 వచ్చేస్తోంది .
దీన్ని ఓపెన్ AI సీఈఓ "మన్‌హట్టన్ ప్రాజెక్ట్" తో పోలుస్తున్నారు .
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా రహస్యంగా మన్‌హట్టన్ ప్రాజెక్ట్ మొదలెట్టింది .
ఇదే అణుబాంబు తయారీ .
దాని పర్యవసానాలు తెలిసిందే .
సాంకేతిక పరిజ్ఞానం మంచి పనోడు .
దాన్ని యజమానిగా చేసుకొంటే సమస్యలు ఖాయం .
చాట్ జిపిటి- అయిదు సృష్టి కర్త "తప్పు చేశాను....
ఇది మానవుల చేయి దాటి పోతుంది "అంటున్నాడు .
దేశాలను పాలిస్తున్న నాయకులకు వీటి గురించి అవగాహన లేదు .
చాట్ జిపిటి 5 ను... సైబర్ క్రమినల్స్ ... టెర్రరిస్ట్ లు వాడితే ?
బ్యాంకుల నుండి డబ్బు కొట్టేసే అవకాశం .
మీ బ్యాంకు లో మొత్తం డబ్బు మాయమయింది .
మీ అకౌంట్ వివరాలు మొత్తం డిలీట్ అయ్యింది .
బ్యాంకు దివాళా ..
ఇప్పుడు ఊహించండి .
ప్రభుత్వ వ్యవస్థల్లో చొరబడి వాటిని అస్తవ్యస్తం చేయగలరు .
డేటా మొత్తం మార్చేయగలరు .
విమానాలు ఎగరకుండా చేయడం , విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడం ..
ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎక్కడెక్కడైతే కంప్యూటర్ లు... నెట్ వాడుతున్నారో అక్కడ మొత్తం గందరగోళం సృష్టించడం .
మీరు ట్రైన్ రేజర్వేషన్ చేసుకొన్నారు .
తీరా రైల్వే స్టేషన్ కు వెళ్ళాక మొత్తం లిస్ట్ మారిపోయి ఉంటుంది . జనన మరణాల లిస్ట్ మారిపోతుంది .
ఆధార్ కార్డు వివరాలు మారి పోతాయి ..
ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రళయం సృష్టించగలరు .
తప్పుడు సమాచారం తో సమాజం లో ... ఘర్షణలు... అంతర్ యుద్ధాలు తీసుకొని రాగలరు
ఏది నిజమో ఏది అబద్దమో జనాలకు తెలిసే అవకాశం లేకుండా చేయడం.
ఒక మహిళను కృత్రిమంగా సృష్టించి స్టాండ్ అప్ కామెడీ టైపు లో పచ్చి బూతులు మాట్లాడిస్తున్నారు .
" ఈ కాలం లేడీస్ బోల్డ్" అని దాన్ని జనాలు తెగ చూసి వైరల్ చేస్తున్నారు .
తెలుగు రాష్టాల పోలీస్ లు చోద్యం చూస్తున్నారు .
ఇక చాట్ జీపీటీ అయిదు వస్తే పరిస్థితి ఊహించండి .
నేరస్తులకు అమాయకులకు తేడా తెలియనంతగా గందరగోళం ఖాయం .
క్రిటికల్ థింకింగ్ ఒకటే దారి .
శుభోదయం
Added information at 8 am
“ వ్యక్తిగత డేటా దొంగిలించలేరు .. మీకు కృత్రిమ మేధ గురుంచి తెలియదు “ అని కింద ఒక కామెంట్ వుంది.
ఇప్పుడు నాకు రెండు ఆప్షన్స్.
1 అవును నాకు తెలియదు అని ఒప్పేసుకోవడం.
2 రెండోది. కృత్రిమ మేధ చాట్ బాట్ ల తో ఈ డేటా ను ఎలా కొట్టేయొచ్చో వివరించడం.
రెండోది జరగకూడదు.
అందుకు దారి నేను చూపినట్టు వుండకూడదు.
కాబట్టి మీదటిదే కరెక్ట్.
నాకు కృత్రిమ మేధ గురించి తెలియదు. హ్యాపీ కదా.
అన్నట్టు ChatGPT -5 లాంచ్ అయ్యి రెండు రోజులు అయ్యింది. పోస్ట్ లో వచ్చేస్తుంది అని ఎందుకు రాసానంటే ఇది అందరికీ వెళ్ళాలి కదా !
August 8th, 2025
నాలుగు నెలలు.
చేయి తిరిగిన డాక్టర్స్.
ప్రయోజనం లేదు.
పొడి దగ్గు వేధించింది.
సమస్య నా దగ్గరకు వచ్చింది.
ఒక్క రోజులో పరిష్కారం.
పొడి దగ్గుకు ఎన్నో కారణాలు. డాక్టర్స్ ఆస్తమా అని మందులిచ్చారు. నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఆయనకు ఆసిడ్ reflux అని అర్థం అయ్యింది. జెర్డ్ కు ఏమి చెయ్యాలో చెప్పాను.
August 8th, 2025
SLATE మరియు COGNIBOT విద్యార్థుల తల్లిదండ్రులకు వాయిస్ సందేశం.
August 8th, 2025
ఒక పేపర్ పెన్ను తీసుకోండి .
2010 - 2020 .. ఈ పదేళ్ల కాలంలో మీకు తెలిసి ఎంతమంది గుండెపోటు తో పోయారో రాయండి .
2022 అంటే కరోనా వాక్ సీన్ లు బలవంతంగా గుచ్చాక .. ఈ మూడేళ్ళ కాలం ఎంత మంది పోయారో రాయండి .
ఈ మూడేళ్ళ కాలం లో గుండెపోటు తో పోయినవారి సంఖ్య కనీసం అయిదు రెట్లు ఉంటుంది .
" ఆబ్బె గుండెపోట్లు గతంలో కూడా జరిగేవి . ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల దీనికి విపరీత ప్రచారం వస్తోంది "అనే మాటలు ఎంత మోసపూరితమో గ్రహించండి .
అలాగే ఒక పని చెయ్యండి .
మీరు మీ కుటుంబ సభ్యులు ఆసుపత్రులపై పెట్టిన ఖర్చు లెక్కలు తీయండి .
మీ వయసు నలబై అనుకొందాము .
మొదటి 37 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టి వుంటారో .. ఈ మూడేళ్ళలో అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టివుంటారు .
వెయ్యి మందిలో కనీసం అయిదు వందల మందికి ఇది వర్తిస్తుంది .
వాక్ సీన్ లు గుచ్చేటప్పుడు .... " అది సంజీవిని" అని బొంకిన నోళ్లే ఇప్పుడు .."ఆబ్బె గుండెపోట్లు సోషల్ మీడియా మాయ" అని వాగుతున్నాయి .
ఇప్పుడు ఇది ఎందుకు" .. వాక్ సీన్ లు అయిపోయాయి కదా? ..అని ఎవరైనా అడగొచ్చు .
అంతం కాదు .. ఇది ఆరంభం ..
సెర్వికల్ కాన్సర్ అని ఫ్లూ అని ఇంకోటని వరుస బెట్టి వస్తున్నాయి . కరోనా కు కొమ్ములు అమర్చి కొత్త దాన్ని చేయడం దానికోసం కొత్త వాక్ సీన్ చేయడం.. ఇలా అనేక కుట్రలు .
రక్తం మరిగిన పులి .
1 . ఆకుకూరలు బాగా తినండి . . కాయగూరలు పళ్ళు , నట్స్ ..
తినే ఫుడ్ లో ఇవి యాభై శాతం ఉండాలి . మరో 30 శాతం దాక ప్రోటీన్ .
సింపుల్ కార్బ్స్ తినొద్దు .
అంటే మైదా వద్దు . బ్రెడ్స్, నాన్ పుల్కా వద్దు .
తెల్లన్నం తగ్గించండి . రాగులు జొన్నలు మంచిది .
అలాగే సిరి ధాన్యాలు .
2 . స్రీలు మూడు పురుషులు నాలుగు లీటర్లు నీరు తాగాలి .
3 . ఒమేగా త్రి ఫాటీ ఆసిడ్స్ బాడీ కి ఇవ్వండి . సముద్రపు చేపలు వాల్ నట్స్.
అలాగే అంటి ఆక్సిడెంట్స్ కూడా . బెర్రీస్ ఆకుకూరల్లో ఇవి సమృద్ధి .
4 . ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర .
5 . వంటకాల్లో పసుపు అల్లం బాగా వాడండి .
6 . డి వింటమిన్ కోసం ఎండ .
7 వ్యాయామం.. నడక యోగ జిమ్
ఇవి పాటిస్తే మీ శరీరం లో ని అంటి బాడీ ల ఓవర్ లోడ్ తగ్గిపోతుంది .
చక్కర వ్యాధి కి అధిక బిపి కి బరువు తగ్గడానికి .. ఇవే సూత్రాలు .
August 8th, 2025
పోలీస్ లకు చిక్కిన 32 మంది గంజాయి బానిసలయిన మెడికో లు !
వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తారట .
వాళ్ళ చదివేది డాక్టర్ కోర్స్ ..
వాళ్లకు గంజాయి వల్ల కలిగే నష్టం తెలియదనా?
నిద్ర పోతున్న వారిని లేపొచ్చు .
నిద్ర నటిస్తున్న వారిని లేపలేము .
తెలియని వాళ్లకు చెప్పొచ్చు .
తెలిసీ చేసేవారిని ఏమనాలి ?
ప్రైవేట్ మెడికల్ కాలేజీ ..
వానా కాలం చదువులు .
వీళ్లకు రేపు పొద్దున్న ఎలాగూ ఉద్యోగం రాదు .
గంజాయికి బానిసలయిన వీరు ఆదాయం కోసం క్రిమినల్ డాక్టర్స్ గా తయారు కారా?
డాక్టర్లలో దేవుళ్లున్నారు .
నిజమే .
కానీ క్రమినల్స్ కూడా ఉన్నారు.
క్రిమినల్స్ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది .
నీ డాక్తర్నుంచి నిన్ను దేవుడు కూడా కాపాడలేని రోజులు దగ్గర్లో ఉన్నాయి.
తస్మాత్ జాగ్రత్త !
August 7th, 2025
ఇప్పుడు సమయం గురువారం రాత్రి 8 -15
హైదరాబాద్ లో గత సోమవారం తో పోలిస్తే ఇప్పటి దాకా పడిన వర్షం సగం కూడా లేదు.
పాపం టీవీ వాళ్లకు ఈ రోజు బ్రేకింగ్ రాజకీయ వార్తలు లేవు.
దీని పై పడ్డారు. టీవీ ఆఫ్ చేసి పడుకోండి. హైదరాబాద్ లో వున్నవారికి ఫోన్ చేసి ఏమైంది అని గాబరాగా విచారించకండి.
Added at 2 Am
నేను ఈ పోస్ట్ రాత్రి 820 కి పెట్టాను. మా టీచర్స్ ఇంకా సిబ్బంది సిటీ లో పలు ప్రాంతాల్లో నివసిస్తారు. వాట్సాప్ లో అడిగాను. సమాధానాలు వచ్చాయి. చిన్న పోస్ట్ అయినా తగినంత సమాచారం తో పెడతాను. ఇంకో విషయం .. నేను పోస్ట్ పెట్టాక వర్షం భారీగా పడింది. అర్ధరాత్రి దాకా పడిన వర్షం చూసి ఇక్కడ కొంత మంది కామెంట్స్ చేశారు. పోస్ట్ లో నేను క్లియర్ గా టైం చెప్పాను. చూసుకోక పొతే ఎలా ?
వినేవారికి గుండెపోటు వచ్చేలా రాత్రి కొన్ని టీవీ చానెల్స్ లో హడావుడి రిపోర్టింగ్. ఈ పోస్ట్ దాని పై పెట్టా.
August 7th, 2025
అక్కడ ట్రంప్ లేడు.
కానీ జాతి వివక్షత విస్తరిస్తోంది.
ట్రంప్ ఒక symptom మాత్రమే.
మూలాలు వేరు.
కృత్రిమ మేధ వల్ల నిరుద్యోగిత పెరిగే కొద్దీ ఇది వెర్రి తలలు వేస్తుంది.
కొత్త తరం ఆంటి globalisation దారిలో. చాప కింద నీరులా విస్తరిస్తోంది.
August 7th, 2025
August 6th, 2025
August 5th, 2025
August 5th, 2025
ఈ సారి మా వార్షికోత్సవ కార్యక్రమాల పేర్లు
1 . బాలమిత్ర ( నర్సరీ నుంచి ఐదో తరగతి )
2 . చందమామ ( హై స్కూల్ )
గత వారం మూడు రోజులు కేటాయించి బాలమిత్ర స్క్రిప్ట్ చెప్పాను. దాన్ని రాసి టైపు చేసి ఇదిగో ఇప్పుడే ఇచ్చారు. మొత్తం ఇరవై పేజీలు.
ప్రూఫ్ రీడింగ్ చేయాలి. తుది మెరుగులు దిద్దాలి. ఇంటికి తీసుకొని వెళుతున్నాను.
చందమామ డ్రామా రూపం లో వుంటుంది.
పొద్దున్న మూడు గంటల పాటు ఈ నాటకం పాత్రలు కవర్ చేసే అంశాలు చెప్పాను. అంటే కథ సిద్ధం. రేపటినుంచి డైలాగ్ రాయాలి.
అన్నట్టు బాలమిత్ర కోసం కృత్రిమ మేధతో కొన్ని సన్నివేశాలు రూపొందిస్తున్నాము. శాంపిల్ కోసం ఇదిగో.
August 4th, 2025
ఆంగ్ల చిత్రాల సంగీత్ థియేటర్ పోయింది.
దాని స్థానం లో ఆసుపత్రి వచ్చింది.
సరోవర్ హోటల్ పోయింది.
అక్కడ ఆసుపత్రి వచ్చింది.
హైదరాబాద్ లో ఇప్పుడు మొత్తం 177 ప్రైవేట్ ఆసుపత్రులు
వీటిలో తొంబై శాతం గత నలభై ఏళ్ళ లో ఏర్పరచినవే.
దీన్ని బట్టి మీకు అర్థం అయ్యింది ఏంటి ?
1 . ఆరోగ్యం విషయం లో జనాలు అప్రమత్తం అవుతున్నారు.
2 . రోగుల సంఖ్య పెరుగుతోంది.
3 . పై రెండూ.
4 . ఏదీ కాదు.
సివిల్స్ ప్రిలిమినరీ స్థాయి ప్రశ్న.
August 4th, 2025
నంద్యాల. కారంచేడు కావలి.
August 4th, 2025
ఊబిలో చిక్కుకోవద్దు !
అనేక కారణాల వల్ల మానసిక ఋగ్మతలున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది .
వీటిపై జనాలకు అవగాహన లేదు .
వీటిలో చాలా వాటికి పూర్తి స్థాయి చికిత్స లేదు .
మందులు వేసుకొంటూ ... మేనేజ్ చేసుకొంటూ ముందుకు సాగడమే .
"పూర్తిగా నయం కాదు" అని డాక్టర్లు చెప్పరు.
చెబితే తమపై నమ్మకం కోల్పోయి వేరే చోటుకు చికిత్సకు వెళుతారని వారి భయం .
పేషంట్లను పోగొట్టుకోరు కదా !
ఇంట్లో ఒక మానసిక రోగి ఉంటే ఆ ఇంటి వారి బతుకు నిత్య నరకం .
1. 15 ఏళ్ళ అమ్మాయి ఏడుస్తూ .. "మా అమ్మ దారుణంగా ప్రవర్తిస్తోంది సార్ . వస్తువులను పగలకొడుతుంది . దాడి చేస్తుంది . బాగా ఆనందంగా ఉంటుంది . ఉన్నట్టుండి హింసాత్మకంగా ప్రవర్తిస్తుంది . అనుమానిస్తుంది. మీరెవరూ నన్ను పటించుకోవడం లేదు.. నేను చచ్చి పోతాను అని మొన్న కత్తి తీసుకొంది." వద్దమ్మా "అని అడ్డుపడిన మా తాత { ఆమె తండ్రి } ని అయిదారు సార్లు పొడిచేసింది . చచ్చి పోతాను అంటుంది . ఏమి చెయ్యాలో చెప్పండి సార్ "
" నువ్వు చెప్పిన దాని బట్టి మీ అమ్మకు బై పోలార్ డిసార్డర్ ఉంది. మందులు వేసుకొంటూ మేనేజ్ చేసుకొంటూ ఉండాలి . కాసేపు వెన్నెలంత చల్లని ఆనందం.. వెంటనే అనుమానం .. అగ్రేషన్ . అది అంతే . చికిత్స లేదు . ఆమె మనసు నొప్పించకుండా పొగుడుతూ సాగాలి . నువ్వు భరించలేవు . అసలు పదో తరగతి . ఎక్కడైనా హాస్టల్ లో చేరు . మీ నాన్న తెలివిగా తప్పించుకున్నాడు . కన్న పాపానికి మీఅవ్వ తాత భరించక తప్పదు . మనసు దిట్టం చేసుకో .. ఎప్పుడో ఒక రోజు మీ అమ్మ ఆత్మ హత్య చేసుకొనే అవకాశం ఎక్కువ . ఇప్పుడు నేను నీ కంటికి రాక్షసుడిలా అనిపించవచ్చు . నిజం మహా చేదుగా ఉంటుంది . చెప్పక తప్పదు ".
ఈ సంభాషణ జరిగి నలబై రోజులు .
నిన్న ఇంకోటి .
2. వివాహిత . మేన మామ నన్ను కలిసాడు . ఇక్కడా సేమ్ టు సేమ్ . "ఆమె కు ఇస్తున్న మందుల ప్రిస్క్రిప్షన్ జాగ్రత్తగా ఫైల్ చెయ్యండి . వీలైతే పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ . మా ఇంట్లో ఇలాంటి ఒక పేషంట్ ఉంది . అమ్మ ను గత ఆరునెలల్లో కనీసం పది సార్లు మెడపట్టుకొని చంపబోయింది . కన్న పాపానికి తల్లి జీవ చ్ఛవంలా మారింది . మెడ చుటూ నల్లటి గాయపు మరకలు . అయినా ఓపికగా మేము చూసుకొంటున్నాము . అని కంప్లెయింట్ లో రాయండి . ఆమె ఆత్మ హత్య చేసుకొంటే ఇది మీకు రక్షణగా ఉంటుంది . లేదంటే మీరు చంపేశారు అని బెదిరించి మీ దగ్గర లక్షలు లాగేస్తారు . బ్లాక్ మెయిల్ ను బతుకుగా చేసుకొన్న కొందరు మీడియా వారు .. పోలీస్ లు .. . బతికి మిమ్మల్ని చంపుతోంది . చచ్చి ఇంకా చంపే అవకాశం " అని చెప్పాను.
బైపోలార్ డిజార్డర్ . స్కిజోపేర్నియా .. లాంటి వ్యాధులు ఉన్నవారు అందరూ ఆత్మ హత్య చేసుకొంటారు అని కాదు .
ఆత్మ హత్య చేసుకొన్న వారందరూ ఇలాంటి వారే అని కాదు .
ఇంకో కేసు .
పైన చెప్పిన రెండు కేసుల్లో భర్తలు దూరం జరిగిపోయారు .
ఈ కేసులో భర్త బలై పోయాడు .
బై పోలార్ డిజార్డర్ స్త్రీ. మామూలు సమయాల్లో చక్కగా చలాకీగా ఉండేది . ఎవరికీ అనుమానం రాదు . ఒక్కో సారి ఎక్స్ట్రీమ్ రియాక్షన్ . ఆరు నెలల్లో నాలుగు సార్లు ఆత్మ హత్య కు పాల్పడింది . భర్త తప్పు లేదని కాదు . ఉండొచ్చు . అంత లోతైన వివరాలు మనకు తెలిసే అవకాశం లేదు . చివరకు ఆమె ఆత్మ హత్యా ప్రయత్నం ఫలించింది. ఆమెకు మానసిక రుగ్మత ఉందనే విషయం ఎవరికీ తెలియకుండా పోయింది . భర్త బలై పోయాడు . బహుశా ఇప్పట్లో జైలు నుంచి బయటకు రాలేడు.
పైన చెప్పిన మూడు కేసుల్లో ముగ్గురు స్రీలు . ముగ్గురికీ బైపోలార్ . దీని అర్థం కేవలం మహిళలే దీని బారిన పడుతారు అని కాదు . మహిళల్లో కాస్త అధికం .
అంతే.
భార్య భర్తల్లో ఒకరికి ఇలాంటి సమస్య ఉంటే వారిని వదిలెయ్యమని నేను చెప్పడం లేదు .
తగిన జాగ్రత్తలు తీసుకొండి అని మాత్రమే చెబుతున్నా.
నా ఫేస్బుక్ ఫోలోవెర్స్ లో ఆక్టివ్ గా వుండే ఒకాయన . ఈ పోస్ట్ ఖచ్చితంగా చూస్తారు కూడా . ఆయన భార్యకు స్కిజోపేర్నియా . రెండేళ్ల క్రితం మెసేజ్ చేసారు . "సార్ వదిలెయ్యాలి అనుకొంటున్నా అని" .
" అయ్యో .. పాపం అలాంటి వారు పసి పిల్లలతో సమానం . ఇలా చెయ్యండి అని చెప్పా . ఇప్పుడు వారి దాంపత్యం హ్యాపీ గా సాగిపోతోంది .
అన్ని కేసుల్లో పరిష్కారం ఇంత సులభం కాదనుకోండి .
బైపోలార్ వాళ్ళు టెన్త్ ఇంటర్ దాక చురుకైన వారుగా చదువుల్లో మంచి రాంక్ తెచ్చుకొంటూ వుంటారు .
ఇక అప్పుడు మొదలవుతుంది .
అప్పటినుంచి ఇక ఇంట్లో నరకం మొదలు .
పైన చెప్పినట్టు ఆత్మ హత్య చేసుకొనే అవకాశం . లేదా గుండెపోటు .. వీరు తీసుకొనే మందుల సైడ్ రియాక్షన్ .
మిగతా వారికంటే 20 - 25 ఏళ్ళు ముందుగా పోతారు .
అప్పటి దాక వారికి అంత కంటే వారి ఇంటి వారికి వెయ్యి రెట్లు నిత్య నరకం .
పగవాడికి కూడా ఇలాంటి బాధలు వద్దు .
1. మేనరికం వివాహాలు వద్దే వద్దు .
2. బైపోలార్ వ్యాధి వున్నవారికి పెళ్లి చెయ్యొద్దు . పెళ్లి చేస్తే పిచ్చి కుదరడం కాదు . పుట్టే పిల్లలకు మరింత ఎక్కువ స్థాయిలో ఉండే అవకాశం .
3. మెడికల్ ట్రామా కేసులు . ఏదో ఒక వ్యాధితో ఐసీయూ లో . అక్కడ వారు ఇచ్చే మందులు .. ఇది వరకే జన్యు పరంగా ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి .
అప్పుడే పొయ్యుంటే బాగుండు అనుకొంటూ ఇంట్లో వారు మింగ లేక కక్క లేక .
అన్నిటికి హ్యాపీ ఎండింగ్ ఉండదు .
అదే జీవితం .
ఒకటి నిజం .
ఆటిజం .. ఏడీహెచ్ది .. ఇది ఒక రకం సమస్యలు
బైపోలార్ .. లాంటి మెంటల్ డిసార్డర్స్ .
వీటి పై జనాల్లో కనీస స్థాయి అవగాహహన లేదు .
దీనితో ఒక పక్క దోపీడీ ... మరో పక్క నరకప్రాయపు జీవితాలు .
August 3th, 2025
మీరు మీ పిల్లలు కుటుంబం హ్యాపీ గా ఉండాలంటే ?
.. భర్తను చంపిన భార్య .
.. భార్యను చంపిన భర్త .
... ఎనిమిదేళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు అబ్బాయిలు. అందరూ పదేళ్ల లోపు వారే .
... బెట్టింగ్ లు లోన్ అప్ మాఫియా లు .
.. అయిదు సంవత్సరాల్లో సమాజం ఎందుకు తలకిందులు అయ్యింది ?
మొబైల్ .. లాప్ టాప్ .. టాబ్ .. డెస్క్ టాప్ .. స్మార్ట్ టీవీ !
ఇంటర్నెట్ లోకి ఎలా వెళ్లినా ..
చాలామందికి ... అది క్రమేపీ అడిక్షన్ అయిపోతుంది .
అదః పాతాళానికి ఎనిమిది మెట్లు !
1. ఒకటో మెట్టు :
ఇంటర్నెట్ లో ... మీ మనసుకు నచ్చిన విషయాలు చూస్తారు .
రీల్స్ .. సోషల్ మీడియా పోస్టింగ్స్ .
ఫిలిమ్స్ .. వీడియో గేమ్స్ .. ఇలా ... .
వీటిని చూడడం వల్ల డోపామైన్ ఉత్పత్తి అవుతుంది .
డోపామైన్ కిక్కు... మద్యం లాంటిది .
అంత కంటే ఎక్కువ .
తొలి రోజుల్లో ఒక పెగ్గు .
అటు పై... డోసు పెంచితే కానీ ... కిక్కు రాదు .
2. రెండో మెట్టు :
మొదట్లో వచ్చిన కిక్కు ... రావాలంటే మరింత సేపు .. మరింత లోతుగా నెట్ లోకి వెళుతారు .
అంటే ఎక్కువ గంటల పాటు ... మొబైల్ పరికరాలనుండి వచ్చే నీలి కాంతి కళ్ళను తాకుతుంది .
దీని వల్ల ... శరీరం లో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది .
దీనితో నిద్ర పట్టదు .
నిద్ర పట్టకపోవడం తో ... అలసట , చిరాకు వస్తుంది .
ఇమ్మ్యూనిటి చస్తుంది .
జలుబు.. దగ్గు నిత్య కృత్యం అయిపోతుంది . దీనితో మరింత చిరాకు .. అలసట .
మెదడు చురుకుతనం కోల్పోతుంది .
అంటే ఇంగిత జ్ఞానం సగం చస్తుంది .
3. మూడో మెట్టు :
ఈ దశలో ఇంటర్నెట్ కు మరింత అతుక్కుని పోతారు .
ప్రయత్నం లేకుండానే చేయి మొబైల్ పైకి పోతుంది .
రీల్స్ .. వెబ్ వార్తలు .. వాట్సాప్ పోస్ట్‌లు ..
.అదే పని .
. రోజంతా ..
యధాలాపంగా చేయి మొబైల్ పైకి .
టెక్విలా ...
బీరు... విస్కీ .. బ్రాందీ దశను దాటేస్తే .. టెక్విలా ..
నెట్ పై కూడా అంతే
కిక్కు కావాలంటే చిత్ర విచిత్ర వార్తలు చూడాలి .
"షాక్ తింటారు .."
" పిచ్చెక్కి పోతుంది .."
" తగల పెట్టేసారు .. "
... లాంటి థంబ్ నెయిల్స్ తో తో... యూట్యూబ్ వీడియో లు ఇలాంటి వారి కోసమే వస్తాయి .
సోషల్ మీడియా అలాగరిథమ్ తో పని చేస్తుంది .
ఎలాంటి పోస్ట్‌లు చూస్తారో అలాంటివే ... పదేపదే కనిపిస్తాయి .
క్రమేపీ సాధారణ విషయాలు ఆసక్తి కలిగించడం మానేస్తాయి .
అద్భుత వార్తలకు అలవాటు పడిపోతారు .
"ప్రపంచం లో ఖరీదయిన హోటల్ ఏదో తెలుసా ?"
"అక్కడ ఒక రోజు రూమ్ ఛార్జ్ ఎంతో తెలుసా ?"
"లంచ్ కి అయిదు లక్షలు ఛార్జ్ చేసే హోటల్స్ పేర్లు తెలుసా ?"
"ఆమె కట్టుకొన్న చీర ఖరీదు కేవలం అయిదు కోట్లు .."
"ఆయన జీతం జస్ట్ వెయ్యి కోట్లు ".
ఇలాంటి వార్తలకు మీరు అలవాటు పడిపోతారు .
4. నాలుగో మెట్టు :
ఇలాంటి వార్తలు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి .
ఆత్మ న్యూనత..
లో సెల్ఫ్ ఎస్టీమ్ ..
ఐడెంటిటీ క్రైసిస్ దశ .
" తూ.. దీని ... నాదీ .. ఒక బతుకేనా ?
"నా కారు ఖరీదు జస్ట్ పది లక్షలు . అయన కారేమో అయిదు కోట్లు ."
"నాది అమీర్‌పేట్ లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు.
కోకాపేట లో ఎనిమిది బెడ్ రూమ్ స్కై విల్లా అంట . ఏడు కోట్లు .... బతికితే ఆలా బతకాలి ."
"ఉన్నది ఒక లైఫ్ . ఇప్పుడు కాకపోతే ఎపుడు ఎంజాయ్ చేస్తాము?"
...ఇవీ ఆలోచనలు .
అనుకరణ ..
కసితో అనుకరణ
4. ఐదో మెట్టు :
"లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి .. చేస్తే తప్పు లేదు .. చేయక పొతే తప్పు" అని నిర్దారణకు వచ్చేసారు .
దీనితో విలాసాలకు బానిసయిపోతారు
ఆదాయానికి మించి ఖర్చు పెడుతారు .
అమెరికా కు పోయిన నా కజిన్ ఇలాంటి కారు కొన్నాడు ..ఫేస్బుక్ లో ఇంస్టాగ్రామ్ లో ఫొటోలే ... ఫోటో లు . .... అప్పు చేసో ... దొమ్మీ చేసో.. నేనూ కొనాలి . అంతకు పది రేట్ల పోజుతో... ఫోటో లు పెట్టాలి "
మగాళ్లు మందు పార్టీలలో... ఆడాళ్ళు కిట్టి పార్టీ లలో గొప్పలు చెప్పుకోవడం మొదలెడతారు .
షో ఆఫ్ ఎక్కువయి పోతుంది .
6. ఆరో మెట్టు :
ఆదాయానికంటే ఖర్చులు ఎక్కువయిపోతాయి . క్రెడిట్ కార్డు అప్పులు ..
తెలిసినవారి దగ్గర చేబదులు .
7. ఏడో మెట్టు
నూటికి డెబ్భై మంది ఈ దశలో ఉన్నారు.
ఒక్క మాటలో చెప్పాలి అంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి .
పాత అప్పులు కట్టడానికి కొత్త అప్పులు చెయ్యాలి .
అప్పుల ఊబి .
ఇప్పుడు తెలిసిన వారు అప్పు ఇవ్వడం మానేస్తారు .
దీనితో ఆన్లైన్ క్రెడిట్ బాట పడుతారు.
అప్పులు ఎలా తీర్చాలి ?
"ఫలానావాడికి బెట్టింగ్ లో పది కోట్లు వచ్చాయంట" అనే వార్తలు అప్పుడు వినిపిస్తాయి .
వినిపించేలా చేస్తారు .
అదే మేజిక్ .
పేకాట మనవాళ్లకు ఎప్పటి నుంచో అలవాటే .
అక్కడ కనీసం సాటి మనుషులు .". ఇక చాల్లేరా" .. అని లేపుతారు .
ఇప్పుడేమో చైనా వాడి ఆన్లైన్ బెట్టింగ్ ..
లేదా ఇంకో మాఫియా గాడు.
మనిషి చచ్చి పొతే కిడ్నీ లు అమ్ము కోవచ్చులే అనికొనే మాఫియా .
బెట్టింగ్ లో ఓడుతున్నా.. అప్పు పక్కనే పుడుతుంది .
8. ఎనిమిదో దశ :
ఇదే అష్టమ శని దశ .
ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా... క్రెడిట్ మాఫియా ..
ఇంటి కొస్తారు .
భార్యని చెల్లిని .
లాక్కుని . వెళ్ళిపోతారు .
తెలిసిన వారి కి ఫోన్ లు చేసి బూతులు తిడుతారు .
ఈ స్థాయి చేరుకొన్న వ్యకి ..
క్రమేపీ బంధువులకు మిత్రులకు దూరమయ్యి ఉంటాడు . .
ఒంటరి తనం .
ఆదరించేవాడుండడు .
కనీసం ఓదార్పు దక్కదు .
జీవితం సూన్యం
అప్పుడు ఒకటే మార్గం ..
డెడ్ ఎండ్ !
చచ్చిపోవాలి .
లేదా నమ్మిన వాళ్ళను చంపి ఆస్తి లాక్కొని అప్పు తీర్చాలి .
పరిష్కారం :
ఇంటర్నెట్ బానిసత్వం నుండి బయటకు రండి .
1. ఆఫీస్ కు సంభందించిన పనులకోసమే వైఫై ఉపయోగించండి . మిగతా సమయాల్లో రౌటర్ ఆఫ్ చేయండి .
2 . లాప్ టాప్ ను టేబుల్ పై పెట్టి వాడండి . ఎటువంటి పరిస్థితుల్లో మీ ఒడిలో పెట్టుకోవద్దు .
౩. రీల్స్ చూడొద్దు . యూట్యూబ్ వీడియోస్.. మీ నిజజీవితానికి అంటే పిల్ల చదువు , ఆరోగ్యం , ఉపాధి లాంటి అంశాలకు ఉపయోగపడే వాటినే చూడండి . అది కూడా నిజాయతీ తో కూడిన వీడియో లు మాత్రమే .
4 . మీడియా పోస్ట్ లు కూడా ఇదే పద్ధతిలో . నిజజీవితం లో ఉపసోషల్ యోగపడేది , నిజాయతీ తో కూడినవి .
5 . కూర్చున్నప్పుడు మొబైల్ దగ్గర పెట్టుకోవద్దు .
రోజుకు మొత్తం రెండు గంటలు .. గరిష్టంగా మొబైల్ చూడండి . రింగ్ అయితే వెళ్లి కాల్ అటెండ్ చెయ్యండి .
6 . మీలో విల్ పవర్ రావడానికి న్యూరో లింగ్విస్టిక్ పద్ధతిలో అఫర్మేషన్స్ తీసుకోండి .
August 3th, 2025
August 3th, 2025
August 2nd, 2025
August 2nd, 2025
August 2nd, 2025
August 1st, 2025
August 1st, 2025
August 1st, 2025
అష్టమశని పీడిస్తోందా ?...
ఇదిగో విరుగుడు !!
ఇంటర్నెట్ !
దాన్ని... మీరు వాడుతున్నారా ?
లేదా ???
అది... మిమ్మల్ని వాడేస్తోందా ??
నేటి సమాజంలో ... నూటికి తొంబై అయిదు మంది ఇంటర్నెట్ కు బానిసలు.
... ఇంటర్నెట్ వారిని వాడేస్తోంది.
ఇది మీ కథే కావొచ్చు .
ఓపిగ్గా చదవండి ...
"కాకి ఎగిరిందంటే వార్త కాదు !
కుక్క ఎగిరిందంటే వార్త !"
ఇది ఇంటర్నెట్ పూర్వ యుగ సామెత !
మొబైల్ .. లాప్ టాప్ .. టాబ్ .. డెస్క్ టాప్ .. స్మార్ట్ టీవీ !
ఇంటర్నెట్ లోకి ఎలా వెళ్లినా ..
చాలామందికి ... అది క్రమేపీ అడిక్షన్ అయిపోతుంది .
అదః పాతాళానికి ఎనిమిది మెట్లు !
1. ఒకటో మెట్టు :
ఇంటర్నెట్ లో ... మీ మనసుకు నచ్చిన విషయాలు చూస్తారు .
రీల్స్ .. సోషల్ మీడియా పోస్టింగ్స్ .
ఫిలిమ్స్ .. వీడియో గేమ్స్ .. ఇలా ... .
వీటిని చూడడం వల్ల డోపామైన్ ఉత్పత్తి అవుతుంది .
డోపామైన్ కిక్కు... మద్యం లాంటిది .
అంత కంటే ఎక్కువ .
తొలి రోజుల్లో ఒక పెగ్గు .
అటు పై... డోసు పెంచితే కానీ ... కిక్కు రాదు .
2. రెండో మెట్టు :
మొదట్లో వచ్చిన కిక్కు ... రావాలంటే మరింత సేపు .. మరింత లోతుగా నెట్ లోకి వెళుతారు .
అంటే ఎక్కువ గంటల పాటు ... మొబైల్ పరికరాలనుండి వచ్చే నీలి కాంతి కళ్ళను తాకుతుంది .
దీని వల్ల ... శరీరం లో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది .
దీనితో నిద్ర పట్టదు .
నిద్ర పట్టకపోవడం తో ... అలసట , చిరాకు వస్తుంది .
ఇమ్మ్యూనిటి చస్తుంది .
జలుబు.. దగ్గు నిత్య కృత్యం అయిపోతుంది . దీనితో మరింత చిరాకు .. అలసట .
మెదడు చురుకుతనం కోల్పోతుంది .
అంటే ఇంగిత జ్ఞానం సగం చస్తుంది .
3. మూడో మెట్టు :
ఈ దశలో ఇంటర్నెట్ కు మరింత అతుక్కుని పోతారు .
ప్రయత్నం లేకుండానే చేయి మొబైల్ పైకి పోతుంది .
రీల్స్ .. వెబ్ వార్తలు .. వాట్సాప్ పోస్ట్‌లు ..
.అదే పని .
. రోజంతా ..
యధాలాపంగా చేయి మొబైల్ పైకి .
టెక్విలా ...
బీరు... విస్కీ .. బ్రాందీ దశను దాటేస్తే .. టెక్విలా ..
నెట్ పై కూడా అంతే
కిక్కు కావాలంటే చిత్ర విచిత్ర వార్తలు చూడాలి .
"షాక్ తింటారు .."
" పిచ్చెక్కి పోతుంది .."
" తగల పెట్టేసారు .. "
... లాంటి టాగ్ లైన్స్ తో... యూట్యూబ్ వీడియో లు ఇలాంటి వారి కోసమే వస్తాయి .
సోషల్ మీడియా అలాగరిథమ్ తో పని చేస్తుంది .
ఎలాంటి పోస్ట్‌లు చూస్తారో అలాంటివే ... పదేపదే కనిపిస్తాయి .
క్రమేపీ సాధారణ విషయాలు ఆసక్తి కలిగించడం మానేస్తాయి .
అద్భుత వార్తలకు అలవాటు పడిపోతారు .
"ప్రపంచం లో ఖరీదయిన హోటల్ ఏదో తెలుసా ?"
"అక్కడ ఒక రోజు రూమ్ ఛార్జ్ ఎంతో తెలుసా ?"
"లంచ్ కి అయిదు లక్షలు ఛార్జ్ చేసే హోటల్స్ పేర్లు తెలుసా ?"
"ఆమె కట్టుకొన్న చీర ఖరీదు కేవలం అయిదు కోట్లు .."
"ఆయన జీతం జస్ట్ వెయ్యి కోట్లు ".
ఇలాంటి వార్తలకు మీరు అలవాటు పడిపోతారు .
4. నాలుగో మెట్టు !
ఇలాంటి వార్తలు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి .
ఆత్మ న్యూనత..
లో సెల్ఫ్ ఎస్టీమ్ ..
ఐడెంటిటీ క్రైసిస్ దశ .
" తూ.. దీని ... నాదీ .. ఒక బతుకేనా ?
"నా కారు ఖరీదు జస్ట్ పది లక్షలు . అయన కారేమో అయిదు కోట్లు ."
"నాది అమీర్‌పేట్ లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు.
కోకాపేట లో ఎనిమిది బెడ్ రూమ్ స్కై విల్లా అంట . ఏడు కోట్లు .... బతికితే ఆలా బతకాలి ."
"ఉన్నది ఒక లైఫ్ . ఇప్పుడు కాకపోతే ఎపుడు ఎంజాయ్ చేస్తాము?"
...ఇవీ ఆలోచనలు .
అనుకరణ ..
కసితో అనుకరణ
4. ఐదో మెట్టు :
"లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి .. చేస్తే తప్పు లేదు .. చేయక పొతే తప్పు" అని నిర్దారణకు వచ్చేసారు .
దీనితో విలాసాలకు బానిసయిపోతారు
ఆదాయానికి మించి ఖర్చు పెడుతారు .
అమెరికా కు పోయిన నా కజిన్ ఇలాంటి కారు కొన్నాడు ..ఫేస్బుక్ లో ఇంస్టాగ్రామ్ లో ఫొటోలే ... ఫోటో లు . .... అప్పు చేసో ... దొమ్మీ చేసో.. నేనూ కొనాలి . అంతకు పది రేట్ల పోజుతో... ఫోటో లు పెట్టాలి "
మగాళ్లు మందు పార్టీలలో... ఆడాళ్ళు కిట్టి పార్టీ లలో గొప్పలు చెప్పుకోవడం మొదలెడతారు .
షో ఆఫ్ ఎక్కువయి పోతుంది .
6. ఆరో మెట్టు :
ఆదాయానికంటే ఖర్చులు ఎక్కువయిపోతాయి . క్రెడిట్ కార్డు అప్పులు ..
తెలిసినవారి దగ్గర చేబదులు .
7. ఏడో మెట్టు
నూటికి డెబ్భై మంది ఈ దశలో ఉన్నారు.
ఒక్క మాటలో చెప్పాలి అంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి .
పాత అప్పులు కట్టడానికి కొత్త అప్పులు చెయ్యాలి .
అప్పుల ఊబి .
ఇప్పుడు తెలిసిన వారు అప్పు ఇవ్వడం మానేస్తారు .
దీనితో ఆన్లైన్ క్రెడిట్ బాట పడుతారు.
అప్పులు ఎలా తీర్చాలి ?
"ఫలానావాడికి బెట్టింగ్ లో పది కోట్లు వచ్చాయంట" అనే వార్తలు అప్పుడు వినిపిస్తాయి .
వినిపించేలా చేస్తారు .
అదే మేజిక్ .
పేకాట మనవాళ్లకు ఎప్పటి నుంచో అలవాటే .
అక్కడ కనీసం సాటి మనుషులు .". ఇక చాల్లేరా" .. అని లేపుతారు .
ఇప్పుడేమో చైనా వాడి ఆన్లైన్ బెట్టింగ్ ..
లేదా ఇంకో మాఫియా గాడు.
మనిషి చచ్చి పొతే కిడ్నీ లు అమ్ము కోవచ్చులే అనికొనే మాఫియా .
బెట్టింగ్ లో ఓడుతున్నా.. అప్పు పక్కనే పుడుతుంది .
8. ఎనిమిదో దశ :
ఇదే అష్టమ శని దశ .
ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా... క్రెడిట్ మాఫియా ..
ఇంటి కొస్తారు .
భార్యని చెల్లిని .
లాక్కుని . వెళ్ళిపోతారు .
తెలిసిన వారి కి ఫోన్ లు చేసి బూతులు తిడుతారు .
ఈ స్థాయి చేరుకొన్న వ్యకి ..
క్రమేపీ బంధువులకు మిత్రులకు దూరమయ్యి ఉంటాడు . .
ఒంటరి తనం .
ఆదరించేవాడుండడు .
కనీసం ఓదార్పు దక్కదు .
జీవితం సూన్యం
అప్పుడు ఒకటే మార్గం ..
డెడ్ ఎండ్ !
చచ్చిపోవాలి .
లేదా నమ్మిన వాళ్ళను చంపి ఆస్తి లాక్కొని అప్పు తీర్చాలి .
ఇది కథ కాదు .
నేటి వ్యధ !
ఇంటింటా ... ఊరూరా జరుగుతున్నదే .
ఒక్కసారి చెక్ చేసుకోండి .
బెట్టింగ్ కు ... ఆన్లైన్ అప్పులకు గత సంవత్సర కాలం లో ఎన్ని కుటుంబాలు బలై పోయాయో ..
పరిష్కారం :
ఇంటర్నెట్ బానిసత్వం నుండి బయటకు రండి .
నా పేరు వాసిరెడ్డి అమర్నాథ్ .
నేను ఇంటర్ నెట్ వాడుతున్నాను .
ఇంటర్నెట్ ద్వారానే సమాజానికి ఎంతో కొంత మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాను .
కానీ మీలో చాలా మందితో సమస్య ఏమిటంటే ... మీరు ఇంటర్ నెట్ ను వాడడం లేదు .
మొబైల్.. లాప్ టాప్... స్మార్ట్ టీవీ.. ఇంటర్నెట్ మిమ్మల్ని వాడేస్తోంది.
నాకు .. ఇంటర్నెట్ వెలుగులు ప్రసరింప చేసే సాధనం!
చాలామందికి అది ఒక చీకటి ప్రపంచం !
తెలుగు రాష్ట్రాల్లో అధిక జనాభా పైన చెప్పిన ... నాలుగు... ఐదో దశను దాటేసారు .
నేను గుర్తున్నానా ?
కరోనా కాలం లో అంబులెన్సు సైరెన్ లు... అర్ధ రాత్రి అపరాత్రి అని తేడా లేకుండా విన్పిస్తున్న వేళ.. ఏదో వాట్సాప్ గ్రూప్ లో భరోసా ఇస్తూ నా పోస్ట్‌లు .. ఒకటో రెండో చూసి ఉంటారు.
బాగా గుర్తుకు తెచ్చుకోండి .
మీరు నాకేమీ కారు .
అయినా మీకు నేనున్నాను
మీ నుంచి నేను ఎమీ ఆశించను.
కరోనా కాలం లో నా ప్రతి పోస్ట్ ఒక వాక్యం తో ముగించేవాడిని .
సర్వే జనా సుఖినోభవంతు .
"అందరూ బాగుండాలి. అప్పుడే మనం ఉంటాము "అని నమ్మినవాడిని .
నాదో పెద్ద కుటుంబం .
వేలాది పిల్లలు .
వారు బాగుండాలంటే సమాజం ఎంతో కొంత బాగుపడాలి .
అదే నా ప్రయత్నం .
మీరు విలాసాల బానిసయితే అది వారికి బిజినెస్ .. ఊరూరా మద్యం దుకాణాలు .. పబ్బులు .. గంజాయి .. గుట్కా .
మీ ఆరోగ్యం పాడయితే అదీ బిజినెస్ .. ఐదేళ్లలో వందల రెట్లు పెరిగిన ఫార్మసురుల ఆస్తులు .. సందుసందునా సంతాన సాఫల్య కేంద్రాలు .. డయాగ్నొస్టిక్ సెంటర్లు .
స్ట్రెస్ . డిప్రెషన్ .. మెంటల్ డిజార్డర్ వస్తే .. అదీ పండగే .. పుట్టగొడుగుల్లా మానసిక చికిత్సలయాలు .
మెడికల్ ఇన్సూరెన్సు..
ఇమ్మ్యూనిటి తగ్గి రోగం వస్తే .. వైబ్రేషన్ డివైస్ బిజినెస్ .
తిని లావెక్కితే .. డబ్బాల్లో హెర్బల్ మందులు .
అది తిని కిడ్నీ లు పొతే... అదీ బిజినెస్ .
ఆన్లైన్ బెట్టింగ్ పెద్ద మాఫియా బిజినెస్ .
ఆన్లైన్ క్రెడిట్ ఇంకా పెద్ద బిజినెస్ .
పుట్టుక బిజినెస్ .. { అవసరం లేకున్నా కేసి కుట్టేయడం}
చావు ఒక బిజినెస్ { లైఫ్ ఇన్సూరెన్సు }
బిజినెస్ అంటే నాణ్యమయిన సర్వీస్ అందించడం కాదు .
తీసుకొన్న రూపాయికి న్యాయం చేసే బిజినెస్ కాదు .
నిలువు దోపిడీ !
ముందు దగా .. వెనుక దగా .. కుడి ఎడమల దగా దగా !
టెక్నాలజీ ని... మీ బానిస చేసుకోవాలన్నా...
.అడిక్షన్ నుంచి బయటపడాలన్నా..
కృత్రిమ మేధ యుగం లో మీ బిడ్డ కు ఉద్యోగం రావాలన్నా..
క్రిటికల్ థింకింగ్ అవసరం .
ఉడతా భక్తిగా నేను తోడుంటా !
మీరు చేయవలసిందల్లా నా ఫేస్బుక్ పోస్ట్ లను ఫాలో కావడం .
మరో మాట !
నా పోస్ట్ లు ఇష్టం లేని వారు జస్ట్ బ్లాక్ చేసేయండి .
ఈర్ష.. అసూయ... ఒంటికి... ఇంటికి... మంచిది కాదు .
లైఫ్ చాలా సింపుల్ .
ఈ పోస్ట్ ను మీరు ఇష్టపడే వారితో షేర్ చేసుకోండి .
మంచిని నిలపెడితే అది మనల్ని నిలపెడుతుంది .
శుభోదయం .