ఈ చిత్రం 9వ తరగతికి చెందిన ప్రతిభావంతుడైన విద్యార్థి సాయి శ్రీకుమార్ ద్వారా రూపొందించబడింది.

This sketch is created by Sai Sreekumar, a talented 9th-grade Slater.
హిట్లర్ పేరెంట్ జయప్రకాశ్
ఫ్రీ హాండ్స్ పేరెంట్ ప్రకాష్ రాజ్
హెలికాప్టర్ పేరెంట్ సూర్యకాంతం
ఒబామా పేరెంట్ మహేష్
యశోద పేరెంట్ సురేఖ
అయిదు రకాల పేరెంటింగ్.
మంచి - చెడు
పిల్లల్ని పెంచే విధానం లో చేయాల్సినవి - చేయకూడనివి
ఒక్కో పేరెంటింగ్ పిల్లల పై ఎలాంటి ప్రభావం చూపింది ?
విహారిక డ్రగ్స్ కేసులో ఎలా దొరికి పోయింది ?
సుమన్ ఎన్కౌంటర్ లో మరణించాడా ? ఎందుకు ? ఏంటి ?
సూర్యకాంతమ్మ కొడుక్కి పెళ్ళెందుకు కాలేదు ? కస్టపడి పెళ్లి చేసినా ఆ అమ్మాయి ఎందుకు ఎక్కడికో వెళ్ళిపోయింది ?
రొబోటిస్ట్ కావాలనుకున్న సితార ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకయ్యింది ?
ఆకాష్ గురుగ్రహం పైకి వెళ్లి తిరిగీ భూమిని చేరుకున్నప్పుడు ఎవరెవరు స్వగతం పలికారు ?
తూనీగా - తూనీగా - ఆస్ యు సో ! సో యు రీప్ — సినిమా కాని సినిమా !
స్లేట్ ది స్కూల్ ఈ సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమంగా !
పిల్లల్ని సరైన దారిలో పెంచాలనుకుంటున్న ప్రతి తల్లితండ్రి తప్పక చూడాల్సిన కార్యక్రమం.
కథ - మాటలు - స్టేజి ప్లే - వాసిరెడ్డి అమర్నాథ్
కోరియోగ్రఫీ - స్లేట్ డాన్స్ టీచర్ లు.
డిసెంబర్ జనవరి నెలల్లో ఆడిటోరియం ల లో విడుదల.

బరాక్ ఒబామా 44 ఏళ్లకే అమెరికా అధ్యక్షుడయ్యాడు . 55 ఏళ్లకు రిటైర్ అయ్యాడు .

డోనాల్డ్ ట్రంప్ 70 ఏళ్లకు అమెరికా అధ్యక్షుడయ్యాడు .
జగపతి బాబు వయస్సు 61 . గత ఐదారేళ్ళనుంచి హీరో పాత్రలకు స్వస్తి చెప్పి విలన్ పాత్రలను పోషిస్తున్నాడు .
హీరోగా చిరంజీవికే పోటీనిచ్చిన , రాజశేఖర్ 61 ఏళ్లకు అనారోగ్య సమస్యల తో బాధ పడుతున్నాడు .
సినిమా ఫీల్డ్ లో ఉండే కులవివక్షతను ఛేదించి రచ్చ గెలిచి ఇంట గెలిచిన హీరో సుధాకర్ . ఇప్పుడు వయస్సు 64 . అనేక ఏళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు .
మహేష్ బాబు వయస్సు 48 . ఇరవై అయిదేళ్ల హీరో లాగా కనిపిస్తున్నాడు .
బాలకృష్ణ వయస్సు 63 . తన నట జీవితం లో ఎప్పుడూ లేనంత పీక్ లో ఉన్నాడు.హాట్రిక్ విజయాల్ని సాధించాడు .
చిరంజీవి వయస్సు 68 . కసితో మరో హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు .
రజనీకాంత్ వయస్సు 74 . ఈ వయస్సులో చాలా మంది అన్ని వ్యాపకాలను మానుకొని ఇంటిపట్టున ఉండిపోతారు . ఈయన 600 కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టి అభిమానుల గుండెల్లో మరో సారి జైలర్ అయ్యాడు .
తాత సూపర్ స్టార్ . తండ్రి సూపర్ స్టార్ . తనకు 29 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా హిట్ కోసం చూస్తున్నాడు అఖిల్ .
రవి తేజ 1992 సంవత్సరంలోనే నటించడం మొదలెట్టాడు . పదేళ్ల తరువాత, 35 ఏళ్ళ వయస్సు లో మొదటి హిట్ కొట్టాడు .
జీవితం ఒక సూదూర పరుగుపందెం .
అంటే మారథాన్ రేస్ .
పదవ తరగతి , ఇంటర్ , ఎంసెట్ , క్లాట్, నీట్ , ఐఐటీ జేఈఈ, సివిల్స్, గ్రూప్ 1 , 2 , పెళ్లి , వ్యాపారం , జాబ్ .. లాంటివి వంద మీటర్ ల పరుగుపందేలు .
గెలిస్తే బాగుటుంది .
గెలవడం కోసం ఇష్టపడి కష్టపడాలి .
కానీ .. వాటిలో గెలిస్తే జీవితం సెటిల్ అయిపోయినట్టు కాదు .
ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత సర్వీస్ లు సాధించి అరవై ఏళ్ళ వయసులో ట్రోలింగ్ కు గురవుతున్న వారిని చూస్తున్నాము . { వారు మాట్లాడింది సరైందా? కాదా? వారిని ట్రోలింగ్ చేయడం న్యాయమా ? అనే చర్చ లోకి ఇక్కడ వెళ్లడం లేదు . గమనించగలరు }.
పాట ఆగకూడదు .. ఆట ఆగకూడదు
బహుదూరపు బాటసారి !
పేరుగెత్తాలి . ప్రతి రోజు .. ప్రతి గంట .. పరుగెత్తాలి .
మారథాన్ రేస్ లో గెలుపొందాలి అంటే వంద మీటర్ ల పరుగుపందెం లో పరుగెత్తినట్టు ఊపిరి బిగబట్టి పరుగెత్తడం కాదు . ఆలా పరుగెడితే అలసిపోతావు .
నింపాదిగా ప్రతి నిముషాన్ని... గంటని... ఎంజాయ్ చేసూ పరుగెత్తాలి .
రేస్ లో ఉన్నామని గుర్తుంచుకోవాలి .
చాలా మంది ఒక సక్సస్ సాధించిన వెంటనే" ఇంకేంటి లైఫ్ లో గెలుపొందాము" అనుకొని పరుగును ఆపేస్తారు .
ఆత్మ హత్య చేసుకొన్న ఐఏఎస్ ల ను చూసాము . ఐఐటీ విద్యార్థుల ఆత్మ హత్యలు చూస్తున్నాము .
జీవితం అనే సినిమా కు ఒక స్ప్రింట్ రేస్ అంటే వంద మీటర్ ల పరుగుపందెం లాంటి ఐఏఎస్ ఐఐటీ లాంటివి సాధించడం తోటే శుభం కార్డు పడదు .
ఊహ తెలిసినప్పటినుంచి తుది శ్వాస దాక మారథాన్ ను సాగించాలి ." రిటైర్ అయ్యాను! నాకేంటి పెన్షన్ వస్తుంది "అని ఇంటిపట్టునే కూర్చుంటే మానసిక రొగ్య సమస్యలు వచ్చే అవకాశం .
చేస్తున్న పని ని ఎంజాయ్ చేస్తూ జీవనం సాగించాలి .
ఒక పరీక్షలో లేదా వరుసగా పది పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసినట్టు కాదు . బాలకృష్ణ కు ఒక దశలో ఎన్ని ప్లాప్ లో వచ్చాయి ?
ఎవరూ విజేతలు కారు .. పరాజితులూ కారు .
ఎన్నో సాధించి అరవై- డెబ్భై ఏళ్ళ వయసులో అనారోగ్యం లేదా పిల్లల ప్రవర్తన వల్ల బాధల్ని అవమానాల్ని భరించేవారు ఎంత మందో ! ఎన్నో ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొన్నా తట్టుకొని నిలబడి జీవితం లో విజయాన్ని చవిచూచి ఆనందించేవారు ఎందరో !
చదువు .. కెరీర్ .. కుటుంబం .. భార్య / భర్త , పిల్లలు , తల్లితండ్రులు , ఆరోగ్యం . ఇవన్నీ మైలు రాళ్లు. ఒకటి రెండింటి లో ఎంత విజయం సాధించినా మరొక దానిలో ఫెయిల్ అయితే జీవితం నరకం .
జీవితం ఒక విస్తరి . రుచి బాగుంటుందని కేవలం లడ్డునే విస్తర్లో పెట్టుకొని తింటారా ?
అన్నిటిలో.. అన్ని దశల్లో.. పోరాటం ద్వారా ప్లానింగ్ ద్వారా విజయం సాదించాలి . కష్టాల్ని గ్లూకోస్ గా గా తీసుకొంటూ ... అవమానాల్ని షూస్ గా వేసుకొని పరుగు సాగించాలి .
పజయానికి మించిన గురువు లేదని గ్రహించాలి
నిన్నటి కంటే నేడు బాగుండాలి . రేపటి కంటే ఎల్లుండి బాగుండాలి . ఇరవై ఏళ్ళ వయసులో విశ్వసుందరి లాంటి పోటీల్లో గెలుపొంది ఉన్నత శిఖరాల్ని చేరుకొని అటుపై జీవితాన్ని సరిగా ప్లాన్ చేసుకోలేక కుంగుబాటుకు గురయ్యే వారెందరో !
నీ జీవితానికి నువ్వే హీరో / హీరోయిన్ . వేరొకరితో పోలికెందుకు?
ఇహలోక కుబేరుడు అంబానీ నేడు బ్లాక్ మైలర్స్ థ్రెట్ ను ఎదురుకొంటున్నాడు .
మంత్రులు తుపాకి నీడలో బతుకుతున్నారు .
హీరో లు హీరోయిన్ లు సెలబ్రిటీ లు .. నీలా రైల్వే స్టేషన్ కు బస్టాండ్ కు పార్క్ కు .. టూర్ కు పోగలరా ? వారు పంజరం లో పక్షులు . అదృష్టం నీదా? వారిదా ?
మన ఆలోచనే మన జీవితం .
ఎందుకు పుట్టావో ఎందుకు మరణిస్తావో తెలియదు . అది నీ చేతిలో లేదు.
జనన మరణాల మధ్య వున్న సుదూర పయనం నీ చేతిలో .
ప్రతి రోజు .. బలే మంచి రోజు .. పసందైన రోజు .. వసంతాలు పూచే రోజు కావాలి .
అది నీ చేతిలోనే ఉంది.
ఈ లోకం నీ ముందు నిలిచిన అద్దం.
ఓ బాటసారి !
ఈ మాటల్ని మరువకోయి !

మనం ఒక గింజ నిస్తే ..

మనకు ఒక చెట్టు వస్తుంది.
సమాజము ! ప్రకృతి ! ����
If we give a seed... We get a tree. Society! Nature!
If we give a seed... We get a tree. Society! Nature!
If we give a seed... We get a tree. Society! Nature!
If we give a seed... We get a tree. Society! Nature!

పొట్ట తగ్గాలంటే !

ఇందాక రెడ్డమ్మ గురుంచి పోస్ట్ షేర్ చేయగానే నా మనసులో మెదిలిన అంశం ……..
… “ అరేయ్ ! దశరథ గాడు! ఏమయ్యాడు ? ఈ మధ్యలో ఎప్పుడూ కనబడలేదు ( మేము పీజీ చేస్తున్నప్పుడు వాడు ఇంటర్మీడియట్. అందరికీ సన్నిహితుడు ).
కోట పురుషోత్తం కు ఇప్పుడే ఫోన్ చేసి “ దశరధుడు ఎక్కడ ? కనబడ్డం లేదు ?”
“ అయ్యో ! వాడు ఎప్పుడో చనిపోయాడు. పాపం ! చాలా రోజులు కిడ్నీ సమస్యతో సతమతమయ్యాడు “.
మా రెడ్డమ్మ ! మహా తల్లి. కష్టాన్ని నమ్ముకొంది. ఎనభై ఏళ్ళు వచ్చినా ఇంకా అలాగే మెస్ లో నిలబడి పనిచేస్తుందట. కొడుకు పోయిన కష్టాన్ని దిగమింగుకొని వృత్తి ధర్మం నిర్వహిస్తోంది. మనుషులందు పుణ్య మనుషులు వేరయా !

రెడ్డమ్మ కొడుకు దశరథుడు.

మేము పీజీ లో వున్నప్పుడు ఇంటర్మీడియట్. మా అందరికీ సన్నిహితుడు. అటు పై అనారోగ్యం తో అందరికీ దూరం అయ్యాడు. రెడ్డమ్మ మాత్రం మారలేదు. మేమంటే ఇప్పటికీ అభిమానం
Reddamma's son was Dasarath.
Reddamma's son was Dasarath.
Reddamma's son was Dasarath.

ఇదండీ నా పోస్ట్!

నాకు బాగా సన్నిహితులైన ముగ్గురు వ్యక్తుల గురించి రాసాను.

వారి పట్ల కన్సర్న్‌తో రాసాను.
బాధతో రాసాను.

వివాదం అవుతుందేమో...
అనవసర రాద్ధాంతానికి కారణం అవుతుందేమో అని ఒక్కో వాక్యం డిలీట్ చేస్తూ పోయాను.

చివరకు ఖాళీ పోస్ట్ మిగిలింది.

“ఇంత లౌక్యం ఏంటి?
వివాదాలంటే భయమా?
లేక నంగనాచితనమా?
ఎవరినీ దూరం చేసుకోవద్దనుకుంటున్నావా?

అయితే తప్పును తప్పు అని, మంచిని మంచి అని చెప్పలేవా?”

అంటూ నా మనసే నన్ను పదేపదే తిడుతుంటే...
ఈ ఖాళీ పోస్ట్ పెడుతున్నా!

ఒక సామాజిక అంశంపై మొహమాటం లేకుండా పోస్ట్ పెట్టలేని నా చేతగానితనాన్ని మన్నించండి.

“ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు...”

ఈ మాట మా గ్రామంలో పెద్దలు పదేపదే అనేవారు.

అప్పుడు దాని అర్థం ఏంటో తెలిసేది కాదు.

ఇప్పుడు మాత్రం...
ఆ మాటలోని అర్థం కొంచెం కొంచెంగా తెలుస్తోంది.

ఇప్పటిదాకా !

అమెరికా కు వెళ్లేవారి సంఖ్య బాగా ఎక్కువ !
అక్కడి నుంచి తిరిగొచ్చే వారి సంఖ్య బాగా తక్కువ !
ఇక పై ..
వెళ్లేవారి సంఖ్య తగ్గుతుంది.
తిరిగిగొచ్చే వారి సంఖ్య బాగా పెరుగుతుంది.
1990 - 2025 - వలస
2025 నుంచి - పునరాగమనం !
మొదటి కారణం - అక్కడ శ్వేత జాతీయులు డెమొక్రాట్ , రిపబ్లిక్ అనే తమ రాజకీయ విభేదాలు పక్కన పెట్టి తమ దేశానికి వలస వస్తున్న వారికి వ్యతిరేకంగా సంఘటితం కాబోతున్నారు !
రెండు : గన్ వయోలెన్స్ ! జీవితానికి భద్రత లేకపోవడం !
మూడు : అమెరికన్ లైఫ్ లో ఉన్న చార్మ్ ( ఆకర్షణ ) తగ్గిపోవడం !
నాలుగు: మనదేశం లో ఉపాధి అవకాశాలు మెరుగుపడడం !
అన్నింటికీ మించి .. వైరాగ్యం ! ( చివరి పాయింట్ గురించి వివరణ ఇంకో పోస్ట్ లో )
యన్.టి.రామారావు ముఖ్య మంత్రిగా ( ledaa T Anjaiah garu ?) ఉన్నప్పుడు దాశరథి గారు ఆస్థాన కవి. ఒకసారి సచివాలయంలో ఇద్దరు కలిసి పోతున్నప్పుడు Chief Secretary నేమ్ ప్లేట్ కింద ప్రధాన కార్యదర్శి అని ఉంది. రామారావు గారికి ఒక సందేహం వచ్చి దాశరథి గారిని అడిగారు.
చీఫ్ సెక్రటరీని ప్రధాన కార్యదర్శి అన్పప్పుడు, చీఫ్ మినిస్టర్ ను ప్రధాన మంత్రి అని ఎందుకనగూడదని.
అందుకు దాశరథి గారు 'అన్ని సార్లు అట్ల కుదరదండి. దొర భార్య దొరసాని అయినంత మాత్రాన మంత్రి భార్య మంత్రసాని కాదు కదా ' అన్నారు.
������

అదొక కొత్త రోగం !

మహమ్మారి !
భయంకరంగా విస్తరిస్తోంది !
మానవాళి ని అనతి కాలంలోనే అంతమొందించే శక్తి దానికుంది.
ఇప్పటికి ఇది నగరాల్లో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో బాగా విస్తరిస్తోంది.
ప్రస్తుతానికి గ్రామాల పై దీని ప్రభావం తక్కువ.
ఇది సోకితే నెమ్మదిగా ఆరోగ్యం దెబ్బతింటుంది.
మానసిక అనారోగ్యం గా మొదలయ్యి శారీరిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది.
నేటి మానవాళికి సరికొత్త ముప్పుగా పరిణమించిన పండెమిక్ పేరు ఒంటరితనం.

స్వేదం ( చెమట ) చిందించేలా వ్యాయామం చేస్తే ..

1 . శరీరం డి టాక్సిఫై అవుతుంది. శరీరానికి హానికలిగించే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి !
2 . శరీరం చల్లబడుతుంది. వేడిని తట్టుకొనే శక్తి శరీరానికి వస్తుంది.
3 . రక్త ప్రసరణ మెరుగవుతుంది.
4 . చర్మం శుద్ది అవుతుంది. సాగేగుణాన్ని పొందుతుంది . చర్మం కాంతివంతమవుతుంది
5 . ఇమ్మ్యూనిటి బలోపేతమవుతుంది.
6 . స్ట్రెస్ ( ఒత్తిడి ) నుంచి ఉపశమనం.
7 . ఎండార్ఫిన్ అనే హ్యాపీ హార్మోన్ ఉత్పత్తవుతుంది !
Exercising until you sweat...
Exercising until you sweat...
Exercising until you sweat...
Exercising until you sweat...
Exercising until you sweat...
Exercising until you sweat...

రెండు వ్యధలు !

1. యువకుడు !
పని రాక్షసుడు !
రోజులో 14 గంటలు పనిలో గడుపుతాడు. రాత్రి 11 గంటల దాకా ఆఫీస్ లో పని. అర్ధరాత్రి దాటాక ఇంటికొస్తాడు.
సెలవు రోజుల్లో కూడా ఇంటి నుంచే ఆఫీస్ పని.
ఎలాగైనా త్వరిరగతిన ప్రమోషన్ మంచి ఇంక్రిమెంట్ సాధించడం అతని లక్ష్యం.
కంపెనీ లో చేరి ఆరేళ్ళయింది.
ఇప్పటికే మూడు ప్రమోషన్స్ వచ్చాయి.
ఇప్పుడు తనది కంపెనీ లో నాలుగో స్థానం.
కంపెనీ సీఈఓ కావాలి జీవితం లో సాధించి చూపించాలి అని అతని దృఢ సంకల్పం.
ఆఫీస్ లో అతనంటే అందరికీ గౌరవం. ఇతర కంపెనీ లు అతనికి రెట్టింపు జీతం ఇవ్వడానికి రెడీ గా వున్నాయి.
2. యువతి!
చదువు లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది . పెద్ద కంపెనీ లో ఉద్యోగం.
“ వివాహం చేసుకొంటే తన కెరీర్ దెబ్బతింటుంది. ఇంత చదువు చదివి ఇంటి పని .. వంట పని చేయడమా ? తనకంటే తక్కువ చదివినోడు భర్తగా వస్తే ? రేపు అతనికి తాను సపర్యలు చేయాలా ? ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉంటుందా ? “ … ఇదీ ఆమె ఆలోచన.
విదేశం లో ఒంటరిగా ఉంటోంది. కంపెనీ కాంటీన్ లోనే మూడు పూటలా తిండి. రుచి కరమయిన వంటలు. ఎన్నో వెరైటీ లు. రూమ్ కు అర్ధ రాత్రి దాటాక వచ్చి నిద్ర పోతుంది. పొద్దున్న 10 కల్లా తిరిగి ఆఫీస్ కు వెళ్ళిపోతుంది .
ఆఫీస్ లో తన పని తాను చేసుకొంటుంది . ప్రొఫెషనల్ విషయాలు తప్పించి ఎవరితో మాట్లాడదు. ఆమె ఆలోచనలు మొత్తం తన వృత్తి పైనే !
వరుసగా మూడో సారి అత్యుత్తమ ఎంప్లాయ్ అవార్డు అందుకొంటోంది
ఈ యువకుడు ఎవరు ?
యువతి ఎవరు అని ఆలోచిస్తున్నారా ?
వారివురి మధ్య ఏమి సంభంధం లేదు.
నేటితరం లక్షలాది మంది యువతీ యువకుల ప్రతి రూపం వీరు.
కసి పట్టుదల .. ఎక్కువ జీతం రావాలి. ప్రమోషన్స్ రావాలి. సాదించాలి .. అని కష్టపడతారు.
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు ఇటీవల మాట్లాడుతూ “ భారత యువత వారానికి డెబ్భై గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉండాలి ! అప్పుడే మన దేశం త్వరితగతిన ప్రగతి సాధిస్తుంది “ అని చెప్పారు .
ఆయన చెప్పక ముందే లక్షలాది యువతీ యువకులు పనే శ్వాసగా పనే జీవితంగా బతుకుతున్నారు.
పైన చెప్పిన యువకుడి గురించి మరి కొన్ని విషయాలు.
అతని ఆరేళ్ళ కొడుకు ఇప్పుడు వర్చ్యువల్ ఆటిజం తో సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే నాలుగు లక్షల బిల్లు అయ్యింది. ఎప్పటికి నయం అవుతుందో చెప్పలేమని డాక్టర్ అంటున్నాడు.
గృహ హింస కేసులో ఆ యువకుడిని పోలీస్ లు అరెస్ట్ చేశారు బెయిల్ కోసం అయిదు లక్షలు ఖర్చయ్యింది.
పెళ్ళాన్ని కొట్టలేదని .. తనకు ఆఫీస్ లో మరో వ్యక్తితో సంభంధం ఏర్పడిందని అతని ప్లాన్ ప్రకారం తనపై కేసు పెట్టిందని .. కోటి రూపాయిలు ఇస్తే డివోర్స్ కు ఒప్పుకొంటానని చెబుతోందని … అతను చెప్పే మాటల్ని పోలీస్ లు పట్టించుకోవడం లేదు.
తామడిగిన డబ్బు ఇవ్వకపోతే నాన్ బెయిలబుల్ కేసు పెడుతామని చెబుతున్నారు.
ఇక పైన చెప్పిన ఉన్నత చదువులుయువతి కి ….
బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ ( BPD ) వచ్చిందని డాక్టర్ లు తేల్చారు .
ఆఫీస్ లో విపరీత ప్రవర్తన కారణంగా ఆమెను జాబ్ నుంచి తొలగించారు
రెండు స్టోరీ లను ఇక్కడి దాకా చదివారా ?
అయితే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
1 . వృత్తిని దైవంగా భావించి కస్టపడి పని చేసే యువతీ యువకులకు ఎందుకిన్ని కష్టాలు ?
దేవుడు ఎందుకు వారిపై పగపట్టాడు ?
2 . “ కాల మహిమ “ ! “ కలికాలం ! “ మారిన కాలం తో మనమూ మారాలి .. వీటిలో ఏది ఈ రెండు కథలకు మీ కామెంట్ ! ఇదేదీ కాకపోతే ఇంకేమి చెబుతారు ?
3 . సామాజిక తెలివితేటలు అనగా నేమి ? దాన్ని అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చా? ఎన్ని కిలోలు ఆర్డర్ ఇవ్వాలి ? రేటెంత ? డిస్కౌంట్ ఏమైనా వుంటుందా?
4. పై పోస్ట్ చదివి పెళ్లంటే అమ్మాయి అబ్బాయికి సేవ చెయ్యాల్సిందే అని నేను చెప్పినట్టు భావించేవారు ఒక సారి చేతులెత్తండి !

2023 వ సంవత్సరం (ఆగష్టు ఒకటి దాకా ) అమెరికా లో తుపాకి కాల్పుల్లో మరణించిన వారు 25000 !

రోజుకు సగటున 118 మంది తుపాకి కి బలి!
420 మాస్ షూటింగ్స్.
అంటే తుపాకి తీసుకొని విచ్చల విడిగా చంపేయడం.
విచ్చినమయిపోతున్న కుటుంబాలు - ఏకాంతం , మానసిక కుంగుబాటు , అగ్రేషన్ .. సెల్ ఫోన్ లు .. హింసాత్మక వీడియో లు .. మార్కెట్ లో విచ్చలవిడిగా దొరికే తుపాకులు ( జనాభా కంటే మూడు కోట్ల తుపాకులు ఎక్కువ ) గంజాయి
“ నాగరికత “ ముదిరితే జరిగేది ఇదేనా ?

అత్యవసర రక్తం అవసరం

తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు దయచేసి స్పందించండి.

ఓపెన్ హార్ట్ సర్జరీ: అక్టోబర్ 27న

రక్త గ్రూప్: O Negative (O−)

పేషెంట్ పేరు: Pasupuleti Madhu Gopi

ఫోన్ నంబర్: 8885888529

దయచేసి ఈ సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.

(ఒక Facebook ఫ్రెండ్ అభ్యర్థన మేరకు షేర్ చేస్తున్నాను.)

ఇందాక నేను షేర్ చేసిన టైగర్ నాగేశ్వర రావు పై పోస్ట్ గురించి వివరణ !
నేను రాసిన పోస్ట్ లో ప్రతి పదం , వాక్యం నాది. అందుకు భాద్యత నాది.
ఇక షేర్ చేసిన పోస్ట్ ల గురించి. ..
నేను అరుదుగానే ఇతరుల పోస్ట్ లు షేర్ చేస్తాను.
షేర్ చేశాను అంటే .. అందులో ప్రతి పాయింట్ తో నేను ఏకీభవిస్తున్నట్టు కాదు.
టైగర్ నాగేశ్వర రావు పై పోస్ట్ ఎందుకు షేర్ చేసాను అంటే ..
నేరం నేరమే. దానికి సమర్ధన మంచిది కాదు.
అదే సమయం లో .. అణిచివేత దోపిడీ ఆకలి చాలా సార్లు సమాజానికి లేదా సమాజం లో అణచివేత కు గురయిన ప్రజలకు నాయకున్ని అందచేస్తుంది. ఒక వీరప్పన్ .. పూలన్ దేవి .. ఆ మాటకు వస్తే నక్సల్ బరి ఉద్యమమం. .. ఒక్కో దానికీ ఒక్కో సామజిక నేపధ్యం. కేవలం శాంతి భద్రతలు అనే కోణం నుంచి చూస్తే పూర్తి అవగాహన రాదు ; 360 డిగ్రీ ల కోణం లో చూడాలి. అర్థం చేసుకోవాలి. అలా చూడడం అంటే క్రైమ్ ను గ్లామరైజ్ చేసినట్టు కాదు. అది సామజిక తెలివితేటలు. సోషల్ ఇంటలిజెన్స్ . సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ మొదలు అనేక శిక్షణ సంస్థల్లో ఇలాంటి పాఠాలు ఉంటాయి.
నేను షేర్ చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలు తెలియచేయవచ్చు.
ఆరోగ్య కరమయిన చర్చ అందరికీ ఉపయుక్తం!

(టైగర్ నాగేశ్వరరావు గురించి తెలుసుకోవాలని 2010లో స్టువార్టుపురం చీరాల చుట్టుప్రక్కల వూళ్ళు ఆరు రోజులు తిరిగి సమాచారం సేకరించాను. ఈ మార్చి 22వ తేదికి టైగర్ నాగేశ్వరరావును చంపి 44 సంవత్సరాలు. త్వరలో రాబోతున్న నా వ్యాస సంపుటి " ఎలుతురు" లో యీ వ్యాసం వుంది. కష్టపడి రాసిన వ్యాసం....కాపీ చేస్తే నా పేరు NJ Vidyasagar తప్పనిసరిగా రాయండి)

టైగర్‌ నాగేశ్వరరావు అమరగాథ-NJ విద్యాసాగర్

****************************

టైగర్‌ నాగేశ్వరరావు గుంటూరు జిల్లా స్టువార్టు పురానికి చెందినవాడు. కులం ఎరుకల, 11 సెప్టెంబర్ 1954లో పుట్టాడు. నాగేశ్వరరావుకు ఇద్దరు అన్నలు ప్రసాద్‌, ప్రభాకర్‌. 3 సంవత్సరాల వయస్సులో వాళ్ళమ్మ సుగుణమ్మ చనిపోయింది. వాళ్ళ నాన్న వెంకటయ్య మాల కులానికి చెందిన భాగ్యమ్మను పెళ్ళి చేసుకొన్నాడు. మొదటి భర్తకు దూరమైన భాగ్యమ్మ అప్పటికే ముగ్గురు బిడ్డల తల్లి. పెద్దన్న ప్రసాద్‌ అమ్మమ్మ (రూతమ్మ) దగ్గరకు వెళ్ళిపోయాడు. ప్రభాకర్‌ను నాగేశ్వరరావును సవతి తల్లి భాగ్యమ్మ కన్నతల్లి కన్నా యెక్కువగా సాకింది. నాగేశ్వరరావుకు 10 సం॥లు వచ్చేటప్పటికి తండ్రి (వెంకటయ్య) చనిపోయాడు. వెంకటయ్య చనిపోయే నాటికి సొంత యిల్లు కూడా లేదు. పెద్దన్న ప్రసాద్‌ తాగి తండ్రితో గొడవ పెట్టుకొని యిల్లు తగలబెట్టాడు. పెద్దనాన్న ప్రకాశం కొడుకు ఉద్యోగానికి వెళ్ళడంతో ఖాళీగా వున్న యింట్లో నాగేశ్వరరావు, ప్రసాద్‌ వున్నారు. ఎవరూ ఆదరించేవారు లేకపోవడంతో సవతి తల్లి భాగ్యమ్మ ఆమె మొదటి సంబంధం పిల్లల దగ్గరకు వెళ్ళిపోయింది. నాగేశ్వరరావు బంధువులు కూడా యెటువంటి సహాయం చెయ్యలేదు. ఎదురింట్లోనే వుంటున్న ప్రకాశం కూడా యేరకంగానూ ఆదుకోలేదు. ప్రభాకర్‌, నాగేశ్వరరావు ఆకలికి అల్లాడిపోయారు. ఇళ్ళదగ్గరున్న వరిచేలో వడ్డు దూసుకొచ్చి దంచి ఆ ముడి బియ్యంతో వండిన గంజి, అన్నం తిని కొన్నాళ్ళు బతికారు. ఆకలికి తట్టుకోలేక యిద్దరూ కూర్చొని యేడ్చుకొనేవాళ్ళు. రెండో ఆట సినిమా వదిలినాక రోడ్లు పక్కనున్న కిళ్ళీ కొట్టు పగలగొట్టి పప్పుండలు, జీడీలు తీసుకొచ్చేవాడు ప్రభాకర్‌. వాటితో అన్నదమ్ములు ఇద్దరూ ఆకలి తీర్చుకొనేవాళ్ళు. అప్పుడప్పుడు మేనత్త కొద్దిగా ఆదుకొనేది. నన్ను కూడా దొంగతనాలకు మీతో తీసుకెళ్ళమని పెద్దవాళ్ళని బతిమాలాడేవాడు ప్రభాకర్‌. పిల్లోడివి నువ్వేం జేస్తావు అని తీసుకెళ్ళే వాళ్ళు కాదు. కొంతకాలం తర్వాత చుట్టుపక్కల వూళ్ళలో కోళ్ళు, బియ్యం, స్టీలు బిందెలు కాజేసే దావీదు తనతోపాటు ప్రభాకర్‌ను దొంగతనాలకు తీసుకెళ్ళేవాడు. దావీదు సావాసంలో దొంగతనాల్లో ప్రభాకర్‌కు మంచి ప్రావిణ్యం వచ్చింది. నైపుణ్యంగా చెయ్యగలుగుతున్నాడు. ఇక బతకగలం అని ధైర్యం వచ్చినాక వెళ్ళిపోయిన సవతి తల్లి భాగ్యమ్మను అన్నదమ్ములిద్దరూ తీసుకొచ్చుకొన్నారు. తాను దొంగగా మారినా తమ్ముడు యీ వృత్తి చెయ్యకూడదని నాగేశ్వరరావును ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక మెకానిక్‌ షెడ్‌లో చేర్పించాడు. ఆ పని యిష్టంలేక నాగేశ్వరరావు స్టువర్టుపురానికి వచ్చేశాడు. 1969లో గుంటూరు జిల్లా గురజాలలో కోమటి వాళ్ళ యింట్లో ప్రభాకర్‌ దొంగతనం చేశాడు. పోలీసులు ప్రభాకర్‌ కోసం తిరుగుతున్నారు. ప్రభాకర్‌ దొరక్కపోవడంతో నాగేశ్వరరావును పట్టుకెళ్ళి తీవ్రంగా కొట్టారు. అప్పటికి యెటువంటి దొంగతనమూ చెయ్యని నాగేశ్వరరావు పోలీసుల చేతుల్లో చిత్రహింసలు అనుభవించాడు. (అప్పటి నుండి బతికినంతకాలం మోకాళ్ళకు Knee Cups పెట్టుకొని తిరిగేవాడు) గురజాల కోమటి వాళ్ళ యింట్లో దొంగతనం కేసులో దొరికి పోయిన ప్రభాకర్‌ను జైల్లో పెట్టారు. ఇది 1969లో జరిగింది. అప్పటికి నాగేశ్వరరావు వయస్సు పదిహేనేళ్ళు. ప్రభాకర్‌ జైలుకెళ్ళడంతో నాగేశ్వరరావుకు బతకడం కష్టమైపోయింది. ఈ పరిస్థితుల్లో డాక్టర్‌బాబుతో కలిసి దొంగతనాలకు అలవాటుపడ్డాడు. డాక్టరుబాబు అంటే నిజంగా డాక్టరు కాదు. చిన్నప్పుడు ఆటల్లో డాక్టరుగా వుండేవాడు. అప్పటి నుండి డాక్టరు బాబు అని పిలిచేవారు. అసలు పేరు ఏసుదాసు. డాక్టరు బాబుతో కలిసి దొంగతనాలు చేసి డబ్బు కూడబెట్టి ప్రభాకర్‌ను బెయిలు మీద విడిపించాడు. బయటకు వచ్చిన ప్రభాకర్‌కు తమ్ముడు దొంగతనాలకు అలవాటు పడ్డాడని తెలిసిపోయింది. ఇకవాళ్ళతో వీళ్ళతో యెందుకని యిద్దరూ కలిసి దొంగతనాలు చెయ్యడం మొదలుబెట్టారు. 1970లో చౌటా ప్రసాద్‌ నాగేశ్వరరావు, దొంగతనాల కోసం తమిళనాడుకు కుటుంబాలతో సహా వెళ్ళారు. వెల్లివాకం, కోడంబాకం ప్రాంతాల్లో యిళ్ళు అద్దెకు తీసుకున్నారు. బట్టల వ్యాపారం చేస్తున్నామని చుట్టుపక్కల వాళ్ళను నమ్మించారు. వీలైన చోటల్లా దొంగతనాలు చేశారు. వాటాల దగ్గర తేడాలు వచ్చి నాగేశ్వరరావు తన ముఠాను తీసుకొని చౌటా ప్రసాద్‌తో విడిపోయి స్టువార్ట్‌పురం వచ్చేశాడు. అక్కడ చౌటా ప్రసాద్‌ పోలీసులకు పట్టుబడి నాగేశ్వరరావు పేరు చెప్పాడు. ఇక్కడి పోలీసులు నాగేశ్వరరావు అన్న ప్రభాకర్‌ను రోజు పోలీసు స్టేషన్‌కు హాజరు కావట్లేదని అరెస్ట్‌ చేసి తమిళనాడు పోలీసులకు అప్పజెప్పారు. వాళ్ళు ప్రభాకర్‌ను తిరువళ్ళూరు జైల్లో పెట్టారు. చౌటా ప్రసాద్‌ మద్రాసు జైల్లో వున్నాడు. వీళ్ళకు తిరువళ్ళూరులోనే కోర్టు. కోర్టులో కలిసినప్పుడు చౌటా ప్రసాద్‌ ముఠా పోలీసుల్ని డబ్బులిచ్చి మంచి చేసుకొనేవారు. అందువల్ల చేతులకు సంకెళ్ళు వేసేవాళ్ళు కాదు. కోర్టుకు తీసుకొచ్చే టప్పుడు ఎస్కార్టు లేకుండా టీలు తాగినా, టిఫిన్లు చేసినా యేమీ అనేవాళ్ళు కాదు. ఈ విధంగా పోలీసుల్ని బాగా నమ్మించారు. ఒకరోజు మినిస్టర్‌ ప్రోగ్రాం వుండటంతో యిద్దరు పోలీసులను మాత్రమే ఎస్కార్టుగా పంపించారు. తిరువళ్ళూరు కోర్టు నుండి మద్రాస్‌కు (ఈ రెండిరటి మధ్య దూరం సుమారు 80 కి.మీ.) తీసుకొని వస్తుండగా ఇల్లివాకం దగ్గర దిగి పోలీసుల కళ్ళల్లో కారంగొట్టి చౌటా ప్రసాద్‌ ముఠా పారిపోయారు. చౌటా ప్రసాద్‌ ముఠా పారిపోయినందుకు పోలీసులు ప్రభాకర్‌ను తీవ్రంగా కొట్టి మద్రాసు జైలుకు పంపించారు. చీరాల పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్‌ చేసి తిరువళ్ళూర్‌ సబ్‌ జైలుకు తీసుకొచ్చారు. అప్పటికి చౌటా ప్రసాద్‌ పారిపోయి నెలరోజులు అవుతుంది.

నాగేశ్వరరావును పట్టుకొచ్చామని పోలీసులు ఐ.జి. అరుళ్‌కు చెప్పారు. ఐ.జి. నేరుగా తిరువాళ్ళూరు జైలుకు వచ్చాడు. చేతులకు, కాళ్ళకు సంకెళ్ళతో నాగేశ్వరరావును ఐ.జి. ముందు కూర్చోబెట్టారు. అతను ఐ.జి. స్థాయి ఆఫీసర్‌ అని నాగేశ్వరరావుకు తెలీదు. చౌటా ప్రసాద్‌ను పట్టివ్వమని లేదా యెక్కడున్నాడో చెప్పమని బాగా కొట్టారు. పారిపోయిన తర్వాత చౌటా ప్రసాద్‌ యెక్కడున్నాడో నాకు తెలియదని యీ విధంగా చిత్రహింసలు పెడితే నేను కూడా రెండు రోజుల్లోనే పారిపోతానని నాగేశ్వరరావు ఐ.జి. అరుళ్‌కు చెప్పాడు. నిజంగానే పారిపోతాడని ప్రభాకర్‌ యింటికి కబురు చేసి ప్రసాద్‌ భార్యను పిలిపించి నాగేశ్వరరావుకు బెయిల్‌ యిప్పించమన్నాడు. కమలనాధన్‌ అనే లాయర్‌తో బెయిల్‌ పిటీషన్‌ వేయించారు. కోర్టులో కలుసుకున్నప్పుడు ప్రభాకర్‌ తమ్ముడికి బతిమిలాడి చెప్పాడు ` ‘అయ్యా నువ్వు పారిపోవద్దురా అన్నావదినలు బెయిలు తీసుకొస్తున్నారు’ అన్నాడు. ‘బెయిల్‌ వచ్చేదాకా యెవడుంటాడు`నేను పారిపోతా ` నాకు వుండబుద్ది కావటంలేదు. నీ దగ్గర డబ్బులుంటే యివ్వు’’ అని ప్రభాకర్‌ దగ్గర నలభై రూపాయలు తీసుకొని సబ్‌జైలుకు వెళ్లాడు.

జైలు నుండి జంప్‌.

సబ్‌ జైలులో నాగేశ్వరరావుతోపాటు ఒక ముసలాయన, మరో యువకుడు వున్నారు. సమయం రాత్రి 8 గంటలు దాటుతుంది. పోలీసులు వరండాలో పేకాట ఆడుతున్నారు. సెంట్రీ జైలు గది బయట అటు ఇటు తిరుగుతున్నాడు. జైలు గదిలో వున్న యువకుడి చేతికి వున్న స్టీలు కడియం తీసుకొని విరగొట్టి నిలువుగా సాగదీశాడు. సెంట్రీ జైలుగది ముందుగా ఒకసారి దాటి వెళ్ళినప్పుడు తాళం తీశాడు. రెండోసారి దాటేటప్పుడు బయటకొచ్చి సెంట్రీ దగ్గర తుపాకీ గుంజుకొని సెంట్రీని కొట్టాడు. సెంట్రీ పడిపోయాడు. పేకాట ఆడే పోలీసులు అడ్డుపడితే వాళ్ళను కూడా కొట్టాడు. వాళ్ళూ పడిపోయారు. అక్కడి నుండి వేగంగా పారిపోవాలంటే పోలీసుల సైకిల్‌ మీద పోవాలి. కాని నాగేశ్వరరావుకి సైకిల్‌ తొక్కడం రాదు. ఇతనితోపాటు జైల్లో వున్న కుర్రాడికి వచ్చు. వాడ్ని సైకిల్‌ తొక్కమని ఆంధ్రా బోర్డరు దాకా వచ్చి సైకిల్‌ ` తుపాకీ అక్కడ పడేసి లారీ యెక్కి స్టువర్ట్‌పురం వచ్చేశాడు.

టైగర్‌ నాగేశ్వరరావు అనే పేరు యెలా వచ్చింది?

-------------------------------------------------------------

నాగేశ్వరరావును వెదుక్కొంటూ తమిళనాడు పోలీసులు స్టువర్ట్‌పురం వచ్చారు. అనుచరులు జయరావు, ఆరోనులతో కలిసి వాళ్ళను చితగొట్టి పంపించాడు. ఆ తర్వాత ఒక ఎస్‌.ఐ. కొంతమంది పోలీసుల్ని తీసుకొని నాగేశ్వరరావును పట్టుకోవడానికి వచ్చారు. వాళ్ళను కూడా కొట్టి ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆ రోజు జైల్లో కలిసి చౌటా ప్రసాద్‌ యెక్కడ వున్నాడో చెప్పమని నన్ను కొట్టిచ్చిందెవర్రా అని అడిగాడు. ఆయన ఐ.జి. అరుళ్‌ అని చెప్పారు వాళ్ళు. వచ్చే నెలలో మద్రాస్‌ సిటీలోనే నేరం చేస్తాను. చేతనైతే నన్ను పట్టుకోమని మీ ఐ.జి.తో చెప్పండ్రా అని వాళ్ళను పంపేశాడు. చెప్పినట్టుగానే మూడు నెలల పాటు వొక్కరోజు కూడా తప్పకుండా వరుసగా దొంగతనాలు చేశాడు. పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. ఎన్నిసార్లు వలపన్నినా పోలీసులు పట్టుకోలేకపోయారు. ఐ.జి. అరుళ్‌ విసుగెత్తి పోయాడు. ఇంతమంది పోలీసులు వాడ్ని పట్టుకోలేక పోతున్నారు. నిజంగా వాడు ‘‘ఆంధ్రా టైగర్‌’’ అన్నాడు. ఆ ఐ.జి. అరుళ్‌ ఎప్పుడైతే ‘‘ఆంధ్రా టైగర్‌’’ అన్నాడో అప్పటి నుండి పోలీసులు, జనం అందరూ నాగేశ్వరరావును ‘‘టైగర్‌ నాగేశ్వరరావు’’ అని పిలిచారు. ఇంటిపేరు ‘‘గరిక’’ మరుగున పడిపోయింది. టైగర్‌ యింటిపేరు అయింది.

పోలీసులకు దొరక్కుండా వుండేందుకు స్టువర్టుపురంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో షెల్టర్‌ తీసుకొనే వాడు. మాల, మాదిగ పల్లెల్లోనే ఎక్కువగా తలదాచుకొనేవాడు.

దోచుకొన్న సొమ్మంతా యేంచేస్తాడు?

-------------------------------------------

షెల్టర్‌ తీసుకొన్న పల్లెల్లో చుట్టు పక్కల వాళ్ళ వివరాలు సేకరించేవాడు. వాళ్ళ ఆదాయం, ఆస్తి, పిల్లలు యిలాంటి వివరాలు ఒక కుటుంబం గురించి యిద్దరు ముగ్గుర్ని అడిగి తెలుసుకొనేవాడు. నిజంగా పేదవాళ్ళు అని నమ్మకం కుదిరాక వాళ్ళను పిలిపించుకొని వాళ్ళు అడక్కపోయినా డబ్బులిచ్చేవాడు. పెళ్ళిళ్ళకు, చదువులకు, ఆరోగ్యం మొదలైన అవసరాలకు డబ్బు యిచ్చేవాడు. తిండికి లేని కుటుంబాలను చూస్తే నాగేశ్వరరావుకు కడుపు తరుక్కుపోయేది. ఇతని నుండి సహాయం పొందిన వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అయిన వాళ్ళు వున్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళు యెన్ని చేశాడో లెక్కలేదు. ఇటు మద్రాస్‌ దాకా, అటు కడప, కర్నూలు, అనంతపూర్‌, బెంగళూరు దాకా టైగర్‌ నాగేశ్వరరావును పేద జనమంతా దైవం కంటే యెక్కువగా ఆరాధించారు. ఇప్పుడు చెప్పిన ఏరియాలో యే గ్రామంలోనైనా నాగేశ్వరరావుకు షెల్టర్‌ దొరికేది. ప్రజల్లోనే కాదు పోలీసుల్లోకూడా అదే అభిమానం. పోలీసులు నాగేశ్వరరావు అభిమానులు. కేవలం డబ్బు అవసరాలకే కాదు నాగేశ్వరరావు స్నేహ గుణంకు ప్రజలు ఆకర్షితులయ్యేవారు. తన అనుచరుల్ని కూడా ప్రాణానికి ప్రాణంగా చూసుకొనేవాడు. ఎప్పుడూ యిరవైవేల రూపాయలు తక్కువ కాకుండా డబ్బు వుంచుకొనేవాడు. నాగేశ్వరరావు ముఠా అంటే అందరూ యెరుకలవాళ్ళే వుండే వాళ్ళు కాదు, అందరూ స్టువర్ట్‌పురం వాళ్ళే వుండేవాళ్ళు కాదు, బ్రాహ్మణులతో సహా అన్ని కులాల వాళ్ళు యితనితో కలిసి దొంగతనాలు చేశారు. చీరాల మొదలుకొని కృష్ణా జిల్లా గుడివాడ వరకు యితని ముఠాలో సభ్యులుగా పనిచేసిన వాళ్ళు వున్నారు.

దోచిన సొమ్ము పేదలకు పంచడంలో ‘‘టైగర్‌ నాగేశ్వరరావు’’పై యెవరి ప్రభావం వుంది?

***********************************

ఎవరి ప్రభావం లేదు. అసలు రాబిన్‌హుడ్‌ అంటే యెవరోకూడా తెలీదు. టైగర్‌ నాగేశ్వరరావు అన్న ప్రభాకర్‌ ఒకరోజు గట్టిగానే అడిగాడు. ఇట్లా అందరికీ యిచ్చేస్తే మన పరిస్థితి యేమిటి అని బాధపడ్డాడు. అన్నను దగ్గర కూర్చోబెట్టుకొని తన వుద్దేశ్యాన్ని చెప్పాడు. మనం పస్తులతో వుండి ఆకలితో యేడ్చిన రోజులు గుర్తున్నాయా అన్నా? అయిన వాళ్ళు కూడా ఆదుకోక పోతే గంజితాగి బతికాం. అప్పుడు మనం యే పరిస్థితుల్లో వున్నామో అలాంటి వాళ్ళకు సహాయం చేస్తున్నాను. అలాంటి వాళ్ళు లోకంలో చాలామంది వుండవచ్చు. అందరికీ నేను సహాయం చెయ్యలేక పోవచ్చు. కానీ నాకు చేతనయినంత వరకు చేస్తాను. ఎంతకాలం చేస్తానో తెలీదు. కనుక చచ్చి పోయేవరకు చేస్తూనే వుంటాను. ఇదేమన్నా కష్టపడిన సొమ్మా? అక్రమంగా సంపాదించిన వాళ్ళ దగ్గర కొట్టుకొస్తున్నా. ఆకలితో వున్నవాళ్ళకు పంచుతున్నా అని స్పష్టంగా చెప్పాడు. ప్రభాకర్‌ యేమీ మాట్లాడలేకపోయాడు.

వల్లాగి బాబుతో వైరం

******************

స్టువర్ట్‌పురంలోనే వల్లాగి బాబు అనే చిల్లరదొంగ వుండేవాడు. పేదల యిళ్ళల్లోనే ఎక్కువగా దొంగతనాలు చేసేవాడు. గొర్రెలు, కోళ్ళు యింకా చిన్న చిన్న వస్తువులు కూడా వదిలేవాడుకాదు. ఇతని బారిన పడిన వాళ్ళంతా టైగర్‌ నాగేశ్వరరావు దగ్గరకు వచ్చి చెప్పుకొనేవాళ్ళు. ఒంగోలుకు చెందిన ఒక టీచర్‌ చీరాల లోని రామనగర్‌లో ఒక యిల్లు అద్దెకు తీసుకొని వుంటుంది. భర్త, యిద్దరు కూతుళ్ళు, ఒక కొడుకుతో కలిసి వుండేది. చాలా పేద కుటుంబం. అతి తక్కువ జీతం కావటంతో పిల్లల చదువు కోసం ఆర్థికంగా యిబ్బంది పడుతూ వుండేవాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు టైగర్‌ నాగేశ్వరరావు సహాయం తీసుకోమని సలహా యిచ్చారు. టీచర్‌ ఒక రోజు టైగర్‌ నాగేశ్వరరావును కలిసి తన బాధల్ని చెప్పుకొంది. వెంటనే చీరాల వి.ఎస్‌.ఆర్‌.& వై.ఆర్‌.ఎన్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడి ఫీజులు కట్టి పిల్లలకు బట్టలు కొనిపెట్టాడు. ఆ తరువాత నాగేశ్వరరావు బెంగుళూరు వెళ్ళి నెల రోజుల దాకా రాలేదు.

ఒక రోజు రాత్రి టీచర్‌ ఇంటికి వల్లాగి బాబు తన ముఠాతో వెళ్ళి మేము టైగర్‌ నాగేశ్వరరావు మనుషులమని, యీ రాత్రి మీ యింట్లో వుండి పొద్దున్నే వెళ్ళిపోతామని చెప్పి వుండిపోయారు. కొద్దిసేపు గడిచినాక అందరూ కలిసి టీచర్‌ భర్తను కత్తితో బెదిరించి టీచర్‌ను, పెద్దకూతురిని రేప్‌ చేశారు. మేలు చేసినట్టే చేసి యింత దారుణం చేశాడు నాగేశ్వరరావు అని టీచర్‌ కుమిలి పోయింది. నాగేశ్వరరావు బెంగుళూరు నుండి వచ్చి విషయం తెలుసుకొని తనముఠా వాళ్ళను టీచర్‌కు చూపించాడు. వీళ్ళు కాదని చెప్పింది. ఈ పని చేసింది వల్లాగి బాబు అని నాగేశ్వరరావుకు తెలిసిపోయింది. ఆ తరువాత కూడా కొంత మంది ఒంటరిగా వున్న ఆడవాళ్ళపై వల్లాగి బాబు అత్యాచారం చేశాడు. వాళ్ళంతావచ్చి వల్లాగి బాబు గురించి టైగర్‌ నాగేశ్వరరావుకు చెప్పుకొన్నారు. ఇవన్నీ విని చలించి పోయిన నాగేశ్వరరావు వొక రోజు వల్లాగి బాబు కాలు నరికేశాడు. దీనికి ప్రతీకారంగా వల్లాగి బాబు యెప్పటికప్పుడు పోలీసులకు నాగేశ్వరరావు వివరాలు చెప్పసాగాడు. దీనితో ఆత్మరక్షణ కోసం నాగేశ్వరరావు రివాల్వర్‌ తెచ్చుకున్నాడు. (కర్ణాటకలో ఒక రిటైర్డ్‌ మిలటరీ ఆఫీసర్‌ వుచితంగా యిచ్చాడు). ఆ తరువాత వొకసారి పోలీసులు వెంటబడ్డప్పుడు ఒక కానిస్టేబుల్‌ కాలుమీద కాల్చి పారిపోయాడు.

ఎస్‌.ఐ. చక్రపాణి నాగేశ్వరరావు కోసం తీవ్రంగా గాలించేవాడు. పరుచూరులో వున్నాడని తెలుసుకొని వెళ్ళి నిద్రపోతున్న నాగేశ్వరరావును పట్టుకొని చీరాల కోర్టులో సరెండర్‌ చేశాడు. కోర్టు దగ్గర భార్య మణెమ్మ కలిసింది. సాయంత్రానికి యింటికి వచ్చేస్తానని చెప్పి పంపించేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో యే జైల్లో పెట్టినా తప్పించుకొంటానని పోలీసులతో చెప్పాడు. నెల్లూరు జైలుకు రిమాండ్‌పై తీసుకెళ్ళారు. జైలు లోపలికి వెళ్ళక ముందే పాస్‌కు వెళ్తానని పోలీసులకు చెప్పి పక్కకువచ్చి అకస్మాత్తుగా పోలీసులపై దాడిచేసి చేతి సంకెళ్ళతో వాళ్ళను కొట్టి పరారయ్యాడు. సాయంత్రానికి భార్యకు చెప్పినట్లే చీరాలకు వచ్చేశాడు.

పోలీసు కుక్కతో...

---------------------

పోలీసుల రాకను వేగంగా వూహించి తన ముఠాను అలర్ట్‌ చేసేవాడు. పోలీసులు యేయే స్థలాలకు వస్తారో ముందుగానే చెప్పి అక్కడకు దూరంగా పడుకొనేవాడు. ఒకసారి తన అనుచరులతో రహస్యంగా స్టువర్టుపురం సమీపంలోని కుందేరు దగ్గర వున్నాడు. ఇక్కడికి పోలీసులు వస్తారనిపిస్తుంది అని చెప్పాడు. కొద్దిసేపటికి కుక్కను తీసుకొని వస్తూ పోలీసులు దూరంగా కనబడ్డారు. నాగేశ్వరరావు లుంగీ నడుముకు చుట్టుకొని వేగంగా పరుగెత్తాడు. అతని అనుచరులు తలావొక దిక్కుకు పారిపోయారు. కుక్క నాగేశ్వరరావును వెంబడిరచింది. పది అడుగులకు పైగా వెడల్పువున్న నీళ్ళులేని సిమెంటు కాలువ దాటి అవతలకు వెళ్ళి పరుగెత్తాడు. అంత లోతు, వెడల్పువున్న కాలువను దాటటం కుక్కకు సాధ్యం కాదు అనుకున్నాడు. కానీ కుక్క జంప్‌ చేసి నాగేశ్వరరావును వెంబడిరచింది.

నాగేశ్వరరావు పరుగు ఆపి తీరిగ్గా నిలబడ్డాడు. కుక్క దగ్గరకు వచ్చేసింది. కుక్క తన మీదకు దూకబోతుండగా బాంబు తీసుకొని సరిగ్గా గురిచూసి కుక్క నోట్లోవేశాడు. బాంబు పేలింది. కుక్క పైదవడ పాక్షికంగా దెబ్బతిన్నది. బాంబు శబ్దానికి కుక్క బెదిరిపోయింది. వెనక్కు తిరిగి పరుగులంకించుకొంది. పోలీసులు కూడా భయపడిపోయి వెనక్కు తిరిగారు.

బ్రిటానియా బిస్కట్‌ కంపెనీ అధినేత కుటుంబాన్ని అడ్డగించి...

బ్రిటానియా కంపెనీ అధినేత అప్పటి కేంద్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య వియ్యంకుడు సత్యనారాయణ తన కుటుంబంతో సహా తిరుపతి దర్శనానికి వస్తున్నాడని టైగర్‌ నాగేశ్వరరావుకు సమాచారం అందింది.

తిరుపతి నగరం బయట రెండు కార్లలో ముఠాతో వెళ్ళి కాపుకాశాడు. సాయంత్రం గం॥ 7.30 ని॥లకు ఒక లారీవస్తే ముందుగా రాళ్ళు అడ్డంపెట్టి దానిని ఆపాడు. లారీని రోడ్డుకు అడ్డంగా పెట్టమని బెదిరించాడు. లారీ డ్రైవర్‌ నేను కూడా దొంగతనాలు చేస్తాను. మీకు పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. లారీ డ్రైవర్‌ను నమ్మి డబ్బులిచ్చి తినడానికి యేదైనా తీసుకొని రమ్మని పంపించాడు. ఇంతలో బ్రిటానియా బిస్కట్‌ కంపెనీ అధినేత సత్యనారాయణ కుటుంబం ఆడవాళ్ళతో ఒక వ్యాను, మగవాళ్ళతో ఒక కారులో అక్కడికి చేరుకొని లారీ అడ్డంగావుండటంతో ఆగిపోయారు. నాగేశ్వరరావు తన ముఠాతో వాళ్ళను చుట్టుముట్టాడు.

వ్యాను దగ్గర కొంత మందిని కాపలాగా వుంచి కారులోవున్న మగవాళ్ళ దగ్గర వాచీలు వుంగరాలు, చైన్‌లు, డబ్బు తీసుకొని ఆడవాళ్ళున్న వ్యాను దగ్గరకు వచ్చాడు. ఆడవాళ్ళు తెలివిగా నగలంతా తీసి పని మనిషి లంగాకు లోపలివైపున పిన్నులకు గుచ్చి పెట్టారు. అందరి దగ్గరా ఒక్కొక్క గొలుసు మాత్రమేవుంది. నాగేశ్వరరావు ముఠాలో ఒకడు ఆడవాళ్ళలో ఒకామె మెడపై చెయ్యివేసి గొలుసు లాక్కొన్నాడు. ఇది చూసి నాగేశ్వరరావు వాడి ముఖం మీద బలంగా కొట్టాడు. వాడికి నోటివెంట రక్తం పడిరది. వ్యాన్‌లో వున్న బెడ్‌ రక్తంతో తడిసిపోయింది. నాగేశ్వరరావు ఆడవాళ్ళతో అమ్మా! మీ దగ్గర చాలా బంగారం వుంది. మీ మంగళసూత్రాలు తీసుకొని మిగిలిన బంగారం యిచ్చేయండి’’ అన్నాడు. వాళ్ళు మా దగ్గర యింతేవుంది అన్నారు. ఇంతలో పనిపిల్ల లంగా నుండి ఒక హారం కింద పడిరది. ‘‘పాపా! మర్యాదగా నీదగ్గర వున్నదంతా యిచ్చెయ్యి’’ అన్నాడు. మరోదారిలేక మొత్తం బంగారం యిచ్చేశారు. మొత్తం ఒక లుంగీలో మూటగట్టారు. తినడానికి తీసుకురావడానికి వెళ్ళిన లారీ డ్రైవర్‌ పోలీసులను వెంటబెట్టుకొని వచ్చాడు. నాగేశ్వరరావు ప్రమాదాన్ని పసిగట్టి రెండు కార్లల్లో ముఠాను తీసుకొని పారిపోయాడు. పోలీసులు వెంబడిరచారు. రెండు కార్లు వేగంగా పోనిచ్చి తప్పించుకున్నారు.

1979లో మార్టూరు కమ్మ భూస్వామి టైగర్‌ నాగేశ్వరరావును మార్టూరు మాల పల్లెలో రహస్యంగా వుంచాడు. కొన్నాళ్ళ తర్వాత అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ ఆ భూస్వామి దగ్గరకు వచ్చి నాగేశ్వరరావును అప్పజెప్పమని అడిగాడు. భూస్వామి నిరాకరించాడు. ఆయన అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో, పార్టీలో చాలా పలుకుబడి కలిగినవాడు. నాగేశ్వరరావు పల్లెలో వున్నపుడు పల్లెలో ఒక అమ్మాయిని పొగాకు కంపెనీ ఓనరు (కమ్మ) రోజు వేధిస్తున్నాడు. ఆ అమ్మాయి నాగేశ్వరరావుకు వచ్చి చెప్పుకొంది. ఆడవాళ్ళంతా కలిసి ఆ కంపెనీ ఓనరును కొట్టమని, యేదైనా అయితే నేను చూసుకొంటానని నాగేశ్వరరావు చెప్పాడు. నిజంగానే ఆడవాళ్ళంతా కలిసి ఆ పొగాకు కంపెనీ ఓనరును బాగా చితకబాదారు. కంపెనీ ఓనరు ఆడవాళ్ళ మీద కేసు పెట్టాడు. కేసు విచారణ కోసం అప్పటి ఎస్‌.ఐ. మురళీ పల్లెలోకి వచ్చాడు. మళ్ళీ నాగేశ్వరరావు సలహా అడిగారు. ఎస్‌.ఐ.ని కూడా యేశెయ్యమన్నాడు. ఆడవాళ్ళంతా కలిసి ఎస్‌.ఐ.ని కొట్టారు. ఆ తర్వాత పోలీసులు ఎస్‌.ఐ.ని కొట్టిన ఆడవాళ్ళను అరెస్ట్‌ చేశారు. నాగేశ్వరరావు వాళ్ళందరినీ బెయిలు మీద విడిపించాడు.

ఈ సంఘటనతో ఎస్‌.ఐ. మురళీ, నాగేశ్వరరావు మీద కక్షగట్టాడు. నాగేశ్వరరావును పట్టుకోవడానికి అవకాశం కోసం యెదురు చూశాడు. వల్లాగి బాబును సిద్ధం చేశాడు. నాగేశ్వరరావు ఆచూకీ కోసం చెయ్యని ప్రయత్నం లేదు.

టైగర్‌ నాగేశ్వరరావు బూటకపు ఎన్‌కౌంటర్‌

ఆ రోజు మార్చి 22, 1980 టైగర్‌ నాగేశ్వరరావు భార్య మణెమ్మ యింటి దగ్గర వాకిలి వూడ్చుకొంటుంది. వల్లాగి బాబు దుర్భాషలాడుతూ వచ్చి మణెమ్మ మెడలో తాళిబొట్టు లాగేశాడు. ఇద్దరి మధ్య చాలాసేపు గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు అన్న ప్రభాకర్‌తో కలిసి ఇంటికొచ్చాడు. జరిగింది అంతా విని వల్లాగి బాబును చంపేస్తానని అక్కడినుండి వచ్చేశాడు. దారిలో సుబ్బడు అనేవాడు యెదురయ్యి నాగేశ్వరరావును పలకరించి యింటికి తీసుకెళ్ళాడు. అంతకుముందు యెప్పటి నుండో సంబంధం వున్న ఒక అమ్మాయిని తీసుకురమ్మని సుబ్బడిని పంపించాడు. సుబ్బడు పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ అని నాగేశ్వరరావుకు తెలీదు. సుబ్బడు నేరుగా ఎస్‌.ఐ. మురళీని కలిశాడు. ఏంచెయ్యాలో సుబ్బడికి చెప్పాడు. పోలీసుల్ని నాగేశ్వరరావు వున్న యింటికి దగ్గర్లో కాపలా వుంచారు. సుబ్బడు నాగేశ్వరరావు చెప్పిన అమ్మాయిని కాకుండా వేశ్యావృత్తి చేసుకునే అమ్మాయిని తీసుకెళ్ళాడు. ఈ అమ్మాయిని తీసుకొచ్చావు యేమిటి అని నాగేశ్వరరావు అడిగాడు. ఆ అమ్మాయి కనబడలేదని అబద్దం చెప్పాడు. సుబ్బడు తీసుకొచ్చిన అమ్మాయితో నాగేశ్వరరావు ఆ రాత్రి గడిపాడు. అంతకుముందు టీ, కాఫీ మద్యం అలవాటు లేని నాగేశ్వరరావుకు పాలల్లో మత్తుమందు కలిపి యిచ్చాడు సుబ్బడు. నాగేశ్వరరావుతో వున్న అమ్మాయికి అతను టైగర్‌ నాగేశ్వరరావు అని తెలీదు. తెల్లారగట్ట మూడు గంటలకు నాగేశ్వరరావు స్పృహ లేకుండా అయిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో ఎస్‌.ఐ. మురళీ పోలీసుల్ని వెంటబెట్టుకొని వచ్చి మత్తుగా పడివున్న నాగేశ్వరరావును తుపాకితో కాల్చాడు. ఆ తర్వాత చీరాల పొలిమేరల్లోకి నాగేశ్వరరావు శవాన్ని తీసుకెళ్ళి పోలీసులు మీద కాల్పులు జరిపితే ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో చచ్చిపోయాడని ప్రకటించారు.

ఆ విధంగా మనకాలపు రాబిన్‌హుడ్‌, యెందరో పేద విద్యార్ధులకి సహాయం చేసిన దీనబంధు యెందరో పేదింటి ఆడపడుచులకు పెళ్ళిళ్ళు చేసిన దయామయుడు మరెందరో ఆకలి తీర్చిన సుహృదయుడు టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ముగిసింది.

మూడు రోజులు సాగిన శవయాత్ర

టైగర్‌ నాగేశ్వరరావును చంపేశారని తెలుసుకొన్న చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వేలాదిమంది చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. నాగేశ్వరరావును చూపించాలని పోలీసుల్ని డిమాండ్‌ చేశారు. పోలీసులు నిరాకరించడంతో ఆసుపత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసుల లాఠీచార్జీలో చాలామందికి దెబ్బలు తగిలాయి. అయినా జనం వెనక్కు తగ్గలేదు. పోస్ట్‌ మార్టమ్‌ అయిన తర్వాత శవాన్ని అప్పగించారు. ఒక లారీ మీద పూలతో అలంకరించి శవాన్ని వూరేగించారు.

చీరాల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మొదలైన శవయాత్రను చీరాల అన్ని కాలనీల్లోకి తీసుకెళ్ళారు. మా కాలనీలో ముందు వూరేగించాలంటే మా కాలనీలో వూరేగించాలని పోటీల మీద తీసుకెళ్ళారు. చీరాల నుండి స్టువర్టుపురం కాలనీకి శవం చేరడానికి మూడు రోజులు పట్టింది. బెంగుళూరు, తమిళనాడు, బళ్ళారి, అనంతపూర్‌, కడప, కర్నూలు, చిత్తూరు ఇంకా దూర ప్రాంతాల నుండి టైగర్‌ నాగేశ్వరరావును కడసారి చూసేందుకు అనేక కష్టాల కోర్చి వచ్చారు. చివరకు మూడవ రోజు సాయంత్రానికి అతి కష్టం మీద శవాన్ని ఖననం చేశారు.

‘‘బాస’’ అక్టోబర్‌ ` 2010.

Q. విలుప్త జీవులు అంటే ?
A. అంతరించి పోయిన జీవులు !
Q. ఉదాహరణలు ?
A. కివి పక్షి , డోడో �� పక్షి , డైనోసార్ �� లు.
Q. ఇంకా ?
A. కడవెత్తు కొచ్చే కన్నె పిల్ల !
కాడెత్తుకొచ్చే గడుసు పిల్లడు!
( ఉదయ రాగంగా పాత పాటలు వింటూ )

ఇప్పుడు సమయం పొద్దున్న 5 .30 !

ఈ రోజు ఇప్పటి వరకు వాట్సాప్ గ్రూప్ ల లో వచ్చిన సుభాషితాలు / శుభోదయాలు!
ఇంకా తొమ్మిదింటి దాకా బోలెడు వస్తాయి.
దీనికి సంభందించి నాకున్న డౌట్ అనుమానాలు !
‼️‼️‼️‼️
1 . ఈ సుభాషితలకు అర్థం , ఈ పంపే వారికి తెలుసా ? చదివి అర్థం చేసుకొని ఫార్వర్డ్ చేస్తారా ?
లేదా ఫ్లో లో ఫార్వర్డ్ చేసేస్తారా ?
2 . ఎదుటోడికి చెప్పేటందుకే నీతులు అని సామెత !
ఇవన్నీ మనకేనా ?
ఆ పంపే మహానుభావులు కూడా ఆచరిస్తారా?
౩. నిద్ర లేచిందే పాచిపళ్ళతో గ్రూప్ లో సభ్యులకు సుభాషితాలు చెప్పే వీరు ఇంట్లో బ్యార్య / భర్త కు కనీసం పలరింపు చిరునవ్వు చిలకరిస్తారా ?
లేదా ఆ భాగ్యం అది కేవలం వాట్సాప్ గ్రూప్ ల కేనా ?
4 . దేశం లోని వంద కోట్ల మంది చేతిలో ఫోన్.
యాభై కోట్ల మంది పొద్దున్న లేచిన వెంటనే ఇలా దేవుడి ఫోటో లతో .. వారం వర్జాలతో .. సుభాషితాలు ఫార్వర్డ్ చేస్తే అది డేటా కంపెనీ లకు కోట్ల బిజినెస్ అవుతుంది. అందుకోసమే ప్రతి రోజు ఒక దేవుడి ఫోటో తో డిజైన్ సెట్ చేసి వదిలే కంపెనీ లు ఉన్నాయని .. ఈ వెబ్ బిజినెస్ మాయాజాలం లో తామొక పావు అని వీరికి ఎవరైనా చెబుతారా ?
వాట్సాప్ గ్రూప్ లో పలకరింపు ఉండకూడదా అని మీ డౌట్ అనుమానమా ? గుడ్ మార్నింగ్ ! శుభోదయం అని టైపు చేసి పోస్ట్ చెయ్యొచ్చు కదండీ ?
మీకందిరికీ శుభోదయం ! గుడ్ మార్నింగ్.
పండయ్యిందిగా ! పనిలో పడండి!
These are the quotations, moral messages and “Good Morning” messages that have appeared in WhatsApp groups so far today!
These are the quotations, moral messages and “Good Morning” messages that have appeared in WhatsApp groups so far today!
These are the quotations, moral messages and “Good Morning” messages that have appeared in WhatsApp groups so far today!
These are the quotations, moral messages and “Good Morning” messages that have appeared in WhatsApp groups so far today!
These are the quotations, moral messages and “Good Morning” messages that have appeared in WhatsApp groups so far today!
These are the quotations, moral messages and “Good Morning” messages that have appeared in WhatsApp groups so far today!
80 ఏళ్లకు వృద్ధాప్యం ! 120 ఏళ్ళ జీవనం !
ఇదీ అసలు లెక్క ! సైన్స్ లెక్క !!
( ఇందాక పోస్ట్ కు అనుబంధం )

ముప్పై ఏళ్ళ వృద్ధుడు - యాభై ఏళ్ళ యువకుడు !

1 కడుపు కట్టుకున్నా , బరువు తగ్గదు .2 కొవ్వు పెరుగుతూనే ఉంటుంది .3. కండలు కరిగిపోతాయి .4 . శరీరం పటుత్వాన్ని కోల్పోతుంది .5. చర్మం ముడతలు పడి... కళ్ళ కింద... మెడ కింద క్యారీ బాగ్ లు .6 జ్ఞాపక శక్తి సన్నగిల్లి, మతిమరుపు.. చాదస్తం పెరుగుతుంది .. ఇవీ వృద్ధాప్య లక్షణాలు .
కొంతమందిలో ఇవి చాలా త్వరగా మొదలయితే , మరి కొంతమందిలో చాలా ఆలస్యంగా కనిపిస్తుంది . ఎందుకు ?
శరీరం లో గ్రోత్ హార్మోన్ అనేది ఉంటుంది .
గ్రోత్ హార్మోన్ లెవెల్స్ తగ్గే కొద్దీ తిన్న ఆహారం ఎక్కువ కొవ్వుగా మారడం , కండరాలు బలహీన పడడం, ఊబకాయం , చర్మం సాగేగుణాన్ని కోల్పోవడం ఆలోచనల్లో చురుకు తనం లోపించడం జరుగుతుంది . గ్రోత్ హార్మోన్ సరిగా లేకపోతె ప్రోటీన్ తిన్నా అది కొవ్వుగా నే మారిపోతుంది . వ్యాయామం చేసినా ఆశించిన స్థాయిలో శరీరం దృఢం కాదు .
లైఫ్ స్టైల్ { జీవన శైలి } లోపాల వల్ల కొంతమందిలో ముప్పై ఏళ్లకే గ్రోత్ హార్మోన్ స్థాయి తగ్గిపోవడం మొదలవుతుంది . అదే మంచి జీవన శైలి కలిగిన వారిలో యాభై అయినా గ్రోత్ హార్మోన్ స్థాయి తగ్గదు .
గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి బాగా ఉండాలంటే 1. ఆరోగ్య కరమయిన ఆలోచనలు ఉండాలి . ఆందోళన ఒత్తిడి, కుళ్ళు, కుతంత్రం, ఈర్ష, అసూయ ద్వేషం ఇవీ నెగటివ్ ఆలోచనలు - ఇలాంటి ఆలోచనలు ప్రతి మనిషికి వస్తాయి . కానీ దాన్ని ఎంత త్వరగా పక్కన పెట్టి పాజిటివ్ ఆలోచనల్ని తీసుకొని వస్తాము అనేది కీలకం . కొంతమంది ఎంత సేపు నెగటివ్ గా ఆలోచిస్తూ వుంటారు . నెగటివ్ ఆలోచనలు ఆసిడ్ లాంటివి . శరీరం లో వాటిని ఎప్పుడూ నిల్వయుంచుకొంటే ? తన కోపమే తన శతృవు కదా ?
Face is the index of the mind !
ఎప్పుడూ నెగటివ్ ఆలోచనల్లో మునిగి వుండే వారి మొఖం లో మార్పులు వచ్చేస్తాయి . వీరినే దొంగకోళ్ళు పట్టే టైపు అంటారు . మీకు తెలిసిన పడి మంది పేర్లు పేపర్ పై రాయండి . వారి వయస్సు సుమారుగా ఎంత ఉందొ రాయండి . వారి మనస్తత్వం ఆలోచనలు పాజిటివ్ లేదా నెగటివ్ అనేది రాయండి . ఇప్పుడు వారి ముఖ కవళికలతో పోల్చుకోండి . పాజిటివ్ ఆలోచనలు కలిగిన వారి ముఖం నిర్మలంగా ఉంటుంది . ఆరోగ్యం చక్కగా ఉంటుంది . అదే ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలతో నిండివుండే వారి ముఖం ఆరోగ్యం ఎంత దారుణంగా ఉంటుందో చూడండి .
త్యాగయ్య శ్రీరాముడి గురించి ఇలా అంటాడు" నగుమోము గలవాడు ..దివ్య సుందరుడు .. నిర్మలాకారుడు .
కథాకళి నృత్యం లో అయితే హీరో టైపు పాత్రలకు ముఖానికి ఒక రంగు వాడుతారు . వీరు పాజిటివ్ ఆలోచనల టైపు . అదే నెగెటివ్ ఆలోచనలు కలిగిన విలన్ టైపు పాత్రలకు ముదురు రంగులు వాడుతారు .
నీ ఆలోచనలే . నీ భవిత .. నీ ఆరోగ్యం .
నెగటివ్ ఆలోచనలు కలిగిన వారు తమని తామే పాడు చేసుకొంటారు . ఇంత సైన్స్ చెప్పలేక పెద్దవారు .. వాడి పాపాలకు వాడిపోతాడు అని చెప్పారు . ఎప్పుడూ అవతలి వారిపై పడి ఏడ్చే మగాడు.. ఆ మాటకొస్తే ఆడది .. బాగుపడ్డట్టు చరిత్రలో లేదు . దుర్యోధనుడు . దుశ్శాసనుడు , రావణుడు , శకుని , కీచకుడు, హిట్లర్ ముస్సోలిని . అక్కడి దాక ఎందుకు ? ఆ వోడ్కా గాడి ముఖం ఒక సరి చూడండి . విషయం బోధపడుతుంది .
నిజమే లక్షకు ఒకరిద్దరు వుంటారు . నెగటివ్ ఆలోచనలు ఉన్నా సమాజానికి చీడపురుగులుగా ఉన్నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు . వీరు మినహాయింపులు . 99 శాతానికి పైగా తమ నెగటివ్ ఆలోచనలకు తామే బలైపోతారు .
గ్రోత్ హార్మోన్ స్థాయి బాగావుండాలంటే 2 బాగా నిద్ర పోవాలి .3. లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి . నిద్ర పట్టాలంటే నెగటివ్ ఆలోచనలు వుండకూడదు . ఆత్మ సంతృప్తితో పడుకొంటే పది నిముషాలకే గాఢ నిద్ర పట్టేస్తుంది .
4. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడం , 5. సమతులాహారం , 6. వ్యాయామం,7. మంచి సంగీతం వినడం ,8. చిరునవ్వు .9 . సహానుభూతి 10 దయాగుణం 11 సహకార గుణం ఇవన్నీ గ్రోత్ హార్మోన్ స్థాయిని కాపాడుతాయి .
ఆరోగ్య కరమయిన ఆలోచనలు ఉంటే మీరు అమృతం తాగినట్టే !
ఈ లోకం ప్రతోడికి బతకడానికి అన్ని అవకాశాలు ఇస్తుంది . బతికేది మహా అంటే 120 ఏళ్ళు . పాజిటివ్ మార్గం లో పయనిస్తే ఇహ లోకమే స్వర్గం . నెగటివ్ ఆలోచనల సల్ఫ్యూరిక్ఆసిడ్ నిల్వయుంచే తొట్టి గా నీ శరీరాన్ని మార్చి వేస్తె బతికినన్నాళ్లు నరకం . అటు పై నరకం .
కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు .
కొంతమంది పావన నవజీవన బృందావన నిర్మాతలు .
మీది ఏ టైపు ?

స్త్రీ పురుషుడు అనే రెండు కేటగిరీ లు పాత లెక్క ! ఇప్పుడు అమెరికా కొత్త లెక్క చూడండి.

The two categories of 'man' and 'woman' are an old way of reckoning! Now, look at the new calculation in America.

విదేశాల్లో పిల్లల పుస్తకాలు ! ( US Uk )

మలద్వారం ద్వారా సెక్స్ ఎలా చేసుకోవాలి. ఇద్దరు నాన్నలు. స్త్రీ- పురుషుడు అనేది గతం - ఇప్పుడు వంద లింగాలు ఇంకా ఇంకా - పసి మెదడులోకి విషం !
These are the quotations, moral messages and “Good Morning” messages that have appeared in WhatsApp groups so far today!
గుజరాత్ లో గత ఇరవై నాలుగు గంటల్లో గర్భ ( గుజరాతీ సాంప్రదాయ నృత్యం ) ఆడుతూ పది మంది మృతి.
వీరు కనీసం … రెండు … చాలా మంది మూడు .. డోసులు వాక్ సీన్ వేసుకొని వుంటారు.
తినేది జంక్ ఫుడ్.
వ్యాయామం సంగతి దేవుడెరుగు ! కనీసం వాకింగ్ ఉండదు.
వాక్ సీన్ వల్ల గుండె కండరాలు బలహీనం అయివుంటాయి . రక్త నాళాల్లో క్లోట్స్ ఉంటాయి. ఒక్కసారిగా స్పీడ్ గా డాన్స్ చేయడం తో గుండెపోట్లు !
డీజే సౌండ్ లు ఆల్కహాల్ గుండెపోటు కు కారణం అనేది ఫార్మసురుల కవర్ అప్.
డీజే సౌండ్ మంచిది కాదు.
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం.
కానీ ఇవన్నీ గతం లో వున్నాయి. అప్పుడెప్పుడు గర్భ డాన్స్ ల వద్ద అంబులెన్సు లు పెట్టలేదు. ఇది కేవలం గత సంవత్సరం ఇప్పుడు జరుగుతోంది. గత సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ మరణాలు.
వారం క్రితం కూడా పోస్ట్ పెట్టాను.
ఆకుకూరలు వెల్లుల్లి తింటే రక్తం లో క్లోట్స్ కరిగిపోతాయి . వాల్నుట్స్ తింటే గుండె కండరాలు దృఢం అవుతాయి . మూడు నెలలు నెమ్మదిగా అటుపై వేగం గా నడిస్తే గుండె కండరాలు గుండె నాళాలు బలపడతాయి.
The story is good. The ending is not good.
https://www.andhrajyothy.com/.../he-said-that-his-mother...

తన ప్రేమకు తల్లి అడ్డొస్తోందని.. ప్రియుడితో కలిసి దారుణ హత్య

ABN News
తొమ్మిది రోజులు కొండలు కొనలు నదులు సముద్రాలూ చూసి .. తీపి గురుతులతో పండగ వస్తోందనగా ఇంటికి తిరిగి పయనం ! తిరువనంతపురం విమానాశ్రయం.
After nine days of exploring hills, valleys, rivers, and seas—and carrying back sweet memories—the journey home begins just as the festival approaches! Thiruvananthapuram Airport.
After nine days of exploring hills, valleys, rivers, and seas—and carrying back sweet memories—the journey home begins just as the festival approaches! Thiruvananthapuram Airport.
After nine days of exploring hills, valleys, rivers, and seas—and carrying back sweet memories—the journey home begins just as the festival approaches! Thiruvananthapuram Airport.
After nine days of exploring hills, valleys, rivers, and seas—and carrying back sweet memories—the journey home begins just as the festival approaches! Thiruvananthapuram Airport.
After nine days of exploring hills, valleys, rivers, and seas—and carrying back sweet memories—the journey home begins just as the festival approaches! Thiruvananthapuram Airport.
పిల్లలు షాపింగ్ షాపింగ్ అంటే తిరువనంతపురం లుల్లూ మాల్ తీసుకొని వచ్చాము. మూడు గంటల టైం ఇచ్చాము. నాకేమో షాపింగ్ చేసే ఓపిక లేదు. నిద్ర వస్తోంది. ఆటో తీసుకొని హోటల్ కు వెళ్ళిపోతాము అనుకొన్నా.
ఐడియా వెలిగింది. థర్డ్ ఫ్లోర్ కు వచ్చి తమిళ్ సినిమా టికెట్ రెక్లినింగ్ సీట్ తీసుకొని ఇదిగో సీట్ లో. సినిమా మొదలు కాబోతోంది.
సినిమా పేరు లియో. తమిళ్ సినిమా చూసి ఏళ్లయ్యింది
నిద్ర పోతానో సినిమా చూస్తానో తెలియదు. ����
వెజిటేరియన్ తాలి .. అరిటాకు లో 14 రకాల భోజనం ! అయిదు రకాల స్వీట్స్.
రుచి తో చంపేశాడండీ ! కూర్చోవడానికి సీట్ లేనంత జనం. ( తిరువనంతపురం )
A vegetarian thali—a meal with 14 varieties served on a banana leaf, including five types of sweets! The taste was absolutely incredible. It was so crowded that there wasn't even a seat available. (Thiruvananthapuram)
A vegetarian thali—a meal with 14 varieties served on a banana leaf, including five types of sweets! The taste was absolutely incredible. It was so crowded that there wasn't even a seat available. (Thiruvananthapuram)
A vegetarian thali—a meal with 14 varieties served on a banana leaf, including five types of sweets! The taste was absolutely incredible. It was so crowded that there wasn't even a seat available. (Thiruvananthapuram)

తిరువనంత పురం కు సమీపం లో జటాయు విగ్రహం ! చూడదగ్గ ప్రాంతం.

The Jatayu statue near Thiruvananthapuram! A place worth visiting.

The Jatayu statue near Thiruvananthapuram! A place worth visiting.

The Jatayu statue near Thiruvananthapuram! A place worth visiting.

The Jatayu statue near Thiruvananthapuram! A place worth visiting.

The Jatayu statue near Thiruvananthapuram! A place worth visiting.

The Jatayu statue near Thiruvananthapuram! A place worth visiting.

The Jatayu statue near Thiruvananthapuram! A place worth visiting.

రాజును దైవాంశ సంభూతుడుగా భావించేవారు.

సామాన్య ప్రజలకు కనీస గౌరవం ఉండేది కాదు.
రాజులు పోయారు.
రాజరికాలు పోయాయి.
రాజ్యాంగం వచ్చింది.
అందరూ సమానులే.
తిరువనంత పురం అనంత పద్మ నాభ ఆలయం ఇంకా రాజరికం పోకడలను వదిలించుకోలేదు.
భక్తులు క్యూ లైన్ లో నలుగుతుంటే , పసి పాపలు ఊపిరాడక ఏడుస్తుంటే .. ట్రావంకోర్ రాజు గారి కోసం మూడు గంటలు దర్శనం నిలిపేస్తారు. ( ఏదో ఒక రోజు కాదు. ప్రతి రోజు ఆయన పరివారం 8 .30 వస్తారట. వారికోసం అందరిని గెంటేసి మూడు గంటల పాటు వారికే అక్కడ రాచ మర్యాదలు. )
అటు పై కుక్కను తోలినట్టు ఒక క్షణం కూడా దర్శనం చేసుకోనీకుండా కసురు తూ అరుస్తూ తోసేస్తారు. భక్తులకు ఘోర అవమానం ఇక్కడ కామన్.
“ ఏంటీ ఈ రూల్స్ ?” అంటే “ పై ఆదేశాలు పాటించక పొతే మా ఉద్యోగాలు పోతాయి “ అని అక్కడి సిబ్భంది అంటున్నారు.
వికారాబాద్ దగ్గర అనంత గిరి లో అనంత పద్మ నాభ స్వామి ఆలయం వుంది.
దర్శనం కావాలంటే అక్కడికి పోతాను.
దేవుడు ఎక్కడైనా ఉంటాడు.
ఇక్కడ తిరువనంత పురం టెంపుల్ నిర్వహణ చెత్త.
ఇక్కడికి ఇంకో సారి పోను .
( నాకేదో ప్రత్యేకంగా ఇబ్బంది కలగ లేదు . అక్కడి దర్శన వేళలు రాజరిక పోకడలు .. వీటి గురుంచి ఈ పోస్ట్ )
Album Kerala Trip with Slaters!
Album Kerala Trip with Slaters!
Album Kerala Trip with Slaters!
Album Kerala Trip with Slaters!
వెనుతిరిగి చూసుకొంటే.. అన్ని సామాజిక సంబంధాల్లో .. ఇవ్వడం తప్పించి తీసుకోవడం లేని ( లేదా ఎక్కువ ఇవ్వడం తక్కువ తీసుకోవడం ) జీవితం నాది.
నా జీవితం తెరిచిన పుస్తకం.
మా సంస్థలో పని చేసిన / చేస్తున్న .. టీచర్ .. డ్రైవర్ .. ఆయా .. ఆఫీస్ బాయ్ , కోచింగ్ సంస్థ లెక్చరర్ .. కోచింగ్ తీసుకొన్న విద్యార్థులు , మా బంధువులు .. ఇలా .. ఇలా ఎవరైనా .. మా అమ్మ మొదలు .. అమ్మాయి దాక .. పేస్ బుక్ మిత్రుడు / ఫాల్లోవెర్ మొదలు ప్రొఫషనల్ అసోసియేట్ దాకా ఎవరినైనా అడగొచ్చు. చెక్ చేసుకోవచ్చు.
ఒకరినో .. వెయ్యి మందినో .. లక్ష మందినో .. చెక్ చేసుకోవచ్చు .
నాతో “ లబ్ది పొందాము “ అనే వారే కానీ .. “ నష్టపోయాము “ అనే వారు ఉండరు.
కుళ్ళు , కుతంత్రం మాయ మోసం తెలియని లైఫ్ నాది.
ఇవ్వడమే తప్పించి తీసుకోవడం తెలియని జీవితం నాది. ఒక్కడంటే ఒక్కడు .. ఈ ప్రపంచం లో నేను వాసిరెడ్డి అమర్నాథ్ వల్ల నష్టపోయాను అన్న వాడు ఉంటే ఎంత శిక్ష కైనా సిద్ధం.
నేను ఉద్యోగం నుంచి తీసేసిన ఉద్యోగులయినా “ అయ్యో ఇంత మంచి సంస్థ / వ్యక్తిని కోల్పోయామే .. తప్పు చేశామే “ అని బాధపడే వారే కానీ నన్ను నిందించే వారు లేరు. నేను ఫార్మసురుల గురించి రాస్తుంటే గొప్ప పని చేస్తున్నారని నాకు సమాచారం లోతయిన సమాచారం ఇచ్చిన ఎంతో మంది ఫార్మా మేనేజర్ లు .. సీనియర్ డాక్టర్ లు .,
కష్టాన్ని నమ్ముకొని బతికేవాడిని . అడ్డదారులు తెలియని వాడిని. ఎవరి దయా దాక్షిణ్యాలు ప్రాపకాలు నాకొద్దు . వెతుక్కొంటూ వచ్చిన మ్మెల్సీ ఆఫర్ ను 15 ఏళ్ళ క్రితమే వద్దనుకున్న చరిత్ర నాది.
అజాత శత్రువును నేను.
వాసిరెడ్డి అమర్నాథ్ ను “ శత్రువు “ అనుకొన్న వాడు లేడు !
…. ఇదీ నా జీవితం !
నిన్న ఒక ఫేస్బుక్ మిత్రుడు మెసెంజర్ లో స్క్రీన్ షాట్ పంపాడు. దాన్ని చూసి షాక్ అయ్యాను.
నేనట ! బిల్డ్ అప్ లు ఇచ్చుకొంటానట.
“ ఎంతో సింపుల్ గా నెల పై జీవించే వ్యక్తి “ అని నిజజీవితం లో అందరూ అంటారు.
అసలు ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తి ఎవరు ? నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అని ఆలోచనలో పడ్డాను.
చేప్పాను కదా .. ఇవ్వడం తప్పించి తీసుకోవడం తెలియని వాడిని. నా నుంచి ఫోన్ కాల్ వెళ్ళితే చేస్తున్న పనిని పక్కన పడేసి నా పని చేస్తారు వ్యక్తులు ! అదీ నా సోషల్ క్రెడిబిలిటీ.
ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా లో ఒక చిన్న గ్రామం ! గతం లో ఒక మీడియా లో పనిచేసేవాడు. విపరీతంగా తాగేవాడు అవినీతి చేసేవాడు. ఉద్యోగం నుంచి తీసేసారు. తాను ఒక రాజకీయ పార్టీ కి అనుకూలం అని బిల్డ్ అప్ లు ఇచ్చుకొంటూ చిన్న చితక దందాలు చేస్తుంటాడు. అందుకోసం ఫేస్బుక్ ను వేదిక గా వాడుకొంటాడు. నిజానికి ఆ పార్టీ కి ఇతనికి ఏమీ సంభంధం లేడు. అతని పోస్ట్ ల డెబ్భై శాతానికి కనీసం ఒక like రాదు. ఎక్కువంటే మూడు likes . జనాల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ఫేస్బుక్ ను సాధనంగా
వాడుకొంటాడు.
నిన్న వాడు తట్టకూడని తలుపు తట్టాడు.
అలెప్పీ నుంచి తిరువనంత పురం ప్రయాణం లో వున్నాము. వీడి గురించి జస్ట్ ఒక అరగంట టైం స్పెండ్ చేశాను. జస్ట్ నాలుగు కాల్స్. మొత్తం జీవిత చరిత్ర మరో అరగంటలో వచ్చేసింది.
వాడు ఎవరి పేరు చెప్పి బిల్డ్ అప్ ఇచ్చుకొంటూ జనాల్ని బెదిరించి దందాలు చేస్తున్నాడో ఆ సంస్థ అత్యున్నత స్థాయి అధికారి నుంచి సీరియస్ వార్నింగ్ వెళ్ళింది. ఉలిక్కి పడ్డాడు. మరో అర గంటలో మరో మూడు warnings !
ఎవరి appointment కోసం వాడు నెల రోజులు ప్రయత్నించినా దొరకదో అంత వున్నత స్థాయి వ్యక్తులు నేరుగా వాడికి ఫోన్ చేసి చెప్పారు. “ నిప్పు తో చెలగాటం మంచిది కాదు “ అని.
“ నా గురించి తెలిసింది గోరంత “ .. అనవసరంగా నన్ను కెలికాను అనివాడికి అర్థం అయ్యింది.
పిచ్చుక ! ఊర పిచ్చుక. బ్రహ్మాస్త్రం వెయ్యాల్సి వచ్చింది . సోషల్ మీడియా అనే పాలసముద్రం చిలికితే వచ్చిన హాలాహలం అది. చిన్న పాము నైనా పెద్ద కర్ర తో కొట్టాలి.
పార్టీ ల కు .. రాజకీయాలకు .. పదవులకు ..కులాలకు మతాలకు అతీతం నా జీవితం !
ఆది అర్థం కావాలంటే సామజిక పరిణతి ఉండాలి.
When I look back at my life, I see that in all my social relationships, I have mostly been a person who gives rather than takes — or gives much more than I receive.

నమస్కారం అండి,

దయచేసి ఈ క్రింది సమాచారంతో ఒక పోస్ట్ చేయగలరా?

అత్యవసరం: విజయవాడలోని రమేష్ హాస్పిటల్‌లో గుండె శస్త్రచికిత్స కోసం 'A Negative' (A-) రక్తం 3 యూనిట్లు అవసరం.

సంప్రదించవలసిన నంబర్: 8712346924

(ఫేస్‌బుక్ మిత్రుని అభ్యర్థన మేరకు)

అల్పాహారం సిద్ధం

Breakfast ready

తొలి సంధ్య వేళలో .. తొలి పొద్దు పొడుపులొ .. కేరళీయం ..

మన ఆలోచనే మన జీవితం !

సోషల్ మీడియా ను ప్రజలను చైతన్య పరిచే సాధనంగా నేను ఉపయోగిస్తాను .
సినీ నటుల పట్ల ఆరాధనా భావం చాలా మందిలో ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో అది పరిధి దాటుతుంది. ఒక షో రూమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఒక నటీమణి కోసం బహుశా గంటలు వెచ్చించి ఎండ లో దుమ్ములో నిలబడిన వేలాది మంది ఫోటో ఒకటి నిన్న పోస్ట్ చేసాను. ప్రజలను ముఖ్యంగా విద్యార్థులను ( నా ఫేస్బుక్ లో వేలాది మంది తల్లితండ్రులు వందలాది మంది టీచర్ లు ఉన్నారు. వారి ద్వారా ) ఎడ్యుకేట్ చేయడానికి నేను రెండు పోస్ట్ లు పెట్టాను. మొదటి పోస్ట్ వైరల్ అయ్యింది. దానిపై ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నేను పబ్లిసిటీ కోసం పోస్ట్ పెట్టాను అన్నట్టు కామెంట్ చేశారు అదే పోస్ట్ లను హౌస్ బోట్ లో ఉన్న మా విద్యార్థుల మధ్య చర్చ కు పెట్టాను. దాని పై వారి స్పందన కు సంభందించి 3 - 4 వీడియో లు పెట్టాను.
నా టైం లైన్ పైకి వెళ్లి మొత్తం చూడగలరు. చదువంటే సామజిక తెలివి తేటలు. చదువంటే భావోద్వేగ తెలివి తేటలు. చదువంటే ఇంగిత జ్ఞానాన్ని ఇచ్చేది. చదువంటే బతుకు నిచ్చేది

మీరు శాడిస్ట్ లండీ ! ( కొంతమంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ! ).

కొన్ని తిక్క కామెంట్స్ చూసి మా పిల్లల తో చర్చ పెట్టాను.

పాపం హౌస్ బోట్ లో హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్న పిల్లలు ఇదిగో ఇలా .,


స్లేటర్స్‌తో కేరళ యాత్ర ఆల్బమ్!

ఇరవై ఏళ్ళ నాటి ఘటన !

మా పాఠశాల విద్యార్థుల్ని ఫీల్డ్ ట్రిప్ కోసం సంజీవయ్య పార్క్ కు తీసుకెళ్ళాం !
అక్కడే వెంకటేష్ సినిమా షూటింగ్ జరుగుతోంది. కొంతమంది పిల్లలు “ సార్ ! వెళ్లి హీరో వెంకటేష్ ని చూస్తాము “ అన్నారు.
“ వెంకటేష్ మంచి నటుడు. నచ్చితే ఆయన సినిమా చూడండి. చాలాబాగుందంటే రెండో సారి చూడండి. అసలు హీరో హీరోయిన్స్ మీ నాన్న అమ్మ. మీ కోసం ఎంతో కష్టపడుతున్నారు. వారిని ఆరాధించండి. ఇష్టపడి చదివి మీ కుటుంబానికి సమాజానికి గొప్ప మేలు చెయ్యండి. అలా చేసే వారే నిజమయిన హీరో లు. మీలో ప్రతి ఒక్కరు రేపటి రియల్ హీరో కావాలి. ఇప్పుడు మనం వెళ్ళితే వారి షూటింగ్ డిస్టర్బ్ అవుతుంది “ అన్నాను.
ఇరవై ఏళ్లుగా ఇదే ఫిలాసఫీ.
మీ అభిమాన హీరో ఎవరు అని Slate విద్యార్థి ని అడగండి. నాన్న అమ్మ అంటారు.
మన ఆలోచనలు చక్కగా ఉంటే జీవితం సమాజం అన్నీ చక్కగా ఉంటాయి.
( ఇందాక పెట్టిన పోస్ట్ కు ఈ పోస్ట్ అనుబంధం )

ఆమె సినీ నటి.

బహుశా షో రూమ్ ప్రారంభం.
ఆలా చేస్తే ఆమెకు పారితోషికం వస్తుంది.
ఆమె వృత్తిలో అదొక భాగం.
చిత్రం లోని మిగతా వారెవ్వరు ? వారి పనేంటి ? వారికేమొస్తుంది ?
వారిలో కొందరు సెల్ ఫోన్ తో ఏమి చేస్తున్నారు ? అలా తీసిన ఫోటోలను ఏమి చేసుకొంటారు ?
“ ఏమిరా బాల రాజు ! ! ఏమి రా ఉపయోగం దేశానికి నీ వల్ల! “ ఈ డైలాగ్ ఏ సినిమా లోనిది ?
She is a film actress.

టిఫనీలు చేస్తారా ? జూసులు తాగుతారా ?

Do you have tiffin? Do you drink juices?
1. సాంబార్. 2. బీట్ రూట్ థొరన్. 3.మేషక్కు పుర్రతి. 4. పచ్చడి. 5. అవియల్. 6. చికెన్ ఫ్రై. 7. పాపడ్. 8. మరింత గుర్రే. 9. పిక్కలు. 10. తైరు. 11. ఉడికించిన కుత్తారి చోర్ 12. రేసం. వన్ను. ఆస్వాదిక్కు
����

 

Do you have tiffin? Do you drink juices?
Do you have tiffin? Do you drink juices?
Do you have tiffin? Do you drink juices?
Do you have tiffin? Do you drink juices?
Do you have tiffin? Do you drink juices?
Do you have tiffin? Do you drink juices?
ఎనిమిది ఏడు ఆరు మూడు బెడ్ రూమ్స్ హౌస్ బోట్స్.
పిల్లలు. ఒక్కో హౌస్ బోట్ లో ఇంచార్జి టీచర్.
12 గంటలకు బయలుదేరాయి . గంటన్నర తరువాత లంచ్ కోసం విరామం.
గతం లో నేను కూడా పిల్లల తో బాటే. టూర్ ఆపరేటర్ శ్రీకుమార్ తన సొంత బోట్ లో ఒక సారి ఉండాలని మూడునాలుగేళ్లుగా కోరుతున్నాడు. ఇప్పుడు ఓకే అన్నా.
సింగల్ బెడ్ రూమ్. ఒక కెప్టెన్ ఒక కుక్ . ఒకే గెస్ట్. కేరళ సాంప్రదాయక వంటకాలు .. టేస్ట్ అదిరింది.
పక్కనే ఉన్న ఇంకో బోట్ ఇన్స్పెక్షన్ చేశా వారు కూడా ఫుడ్ సూపర్ అంటున్నారు. మిగతా బోట్స్ కాస్త దూరం లో. హైటెక్ మానిటరింగ్ జరుగుతోంది.
Do you have tiffin? Do you drink juices?
Do you have tiffin? Do you drink juices?
Do you have tiffin? Do you drink juices?
Do you have tiffin? Do you drink juices?

ఇటు ఎంత కెట్టు వెళ్లం!న్యాన్ ఉదయమల్ల.శ్రీకుమార్ అను ఊ. ఓరు కిడప్పుమూరి ఆడంబరముల్లా . న్జాన్ ఒత్తయ్కాను!

ఇదొక టైపు లింగ సమానత్వం !

This is a certain kind of gender equality!
This is a certain kind of gender equality!
మున్నార్ నుంచి అయిదు గంటలు ప్రయాణం చేసి ఆర్కాడియా హోటల్ - అలపూజ చేరుకున్నాము.
రూమ్ కార్డు పెట్టగానే టీవీ ఆన్ అయిపొయింది. రిమోట్ తో ఆఫ్ చేస్తే మంత్రం వేసినట్టు మళ్ళీ ఆన్ అయిపొయింది. హోటల్ వారిని పిలిచే ఓపిక లేదు. సాయంకాలం బీచ్ కి పోవడానికి గంట సమయం.
కాసేపు నిద్ర పోదామునుకొన్నా. నిద్ర పట్టేసింది.
జాందార్ తైలం అంట. కీళ్లు అరిగి పోయినా కొండలెక్క వచ్చట. ఎగరొచ్చట .. దూకొచ్చట!
మలయాళం లో వాయించేస్తున్నాడు.
జాందార్ తైలం జాందార్ తైలం. నిద్ర మొత్తం అదే. ����������������������
ప్రాంతమేదైనా … భాష ఏదైనా … మోసం కంపు కామన్ !!

మున్నార్‌లోని లాక్‌హార్ట్ గ్యాప్ వద్ద సమూహ చిత్రం

Group photo at Lockhart gap - Munnar
Group photo at Lockhart gap - Munnar

సహానుభూతి!

ఇందాక మా మేనిఫెస్టో లో ప్రకటించిన కీర్తి శేషుల భృతి కు సంభందించి మరిన్ని వివరాలు.
తండ్రి తాత ముత్తాత ఇలా ఎన్ని తరాలయినా ఫరవా లేదు. మీరు వారి వారసులైతే మీకు వారి కీర్తి శేషుల భృతి ఇస్తాము. ఒక్కో పూర్వీకుడికీ అయిదు లక్షల చొప్పున. అంటే ఇరవై తరాల పూర్వీకుల పేర్లు మీరు రిజిస్టర్ చేసుకొంటే నెలకు కోటి ఆదాయం.
పూర్వీకుని పూర్తి పేరు తో దరఖాస్తు అందాలి. వారి ఆధార్ కార్డు తప్పని సరిగా జత చేయాలి. ఇంతే కాకుండా మిమ్మల్ని తన వారసుడుగా ధ్రువీకరిస్తూ అయన మండల్ రెవిన్యూ అధికారి ఆఫీస్ లో డిజిటల్ సంతకం పెట్టాలి. వేలి ముద్రలు ఇవ్వాలి. మరణించిన పదో రోజునుంచి సంవత్సరం లోగా ఈ ధ్రువీకరణ ఆ కీర్తి శేషులు ఇవ్వాలి. బతికున్నప్పుడే ద్రువీకరణలు ఇవ్వరాదు.

2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేను ఒక పార్టీ స్థాపించబోతున్నా!

మేనిఫెస్టో :
1 చదువు భృతి :
నెలకు యాభై వేలు ( Lkg నుంచి పీజీ వరకు )
2. నిరుద్యోగ భృతి :
నెలకు లక్ష ( చదువు పూర్తి అయినప్పటినుంచి 35 ఏళ్ళ వరకు )
3. వృద్ధాప్య భృతి :
నెలకు అయిదు లక్షలు. ( 35 ఏళ్ళ నుంచి మరణించే దాకా ! )
4 కీర్తి శేషుల భృతి :
నెలకు పది లక్షలు - వారసులకు.
ప్రభుత్వానికి నిధులు ఎలా వస్తాయంటారా ?
1. ఆక్సిజన్ పన్ను.
నువ్వు బతుకుతున్నావంటే ఆక్సిజన్ పీలుస్తున్నట్టే . ఆక్సిజన్ ప్రభుత్వ ఆస్థి. రోజుకు తల ఒక్కింటికి పది వేలు పన్నుగా కట్టాలి. లేక పొతే ముక్కులో సీసం పోసి మూసేస్తాము.
2 నీరు పన్ను.
తాగడానికి వంటకు బట్టలు ఉతకడానికి నీరు అవసరం కదా. నీరు ప్రభుత్వ ఆస్థి. తల ఒక్కింటికి నీటికి రోజుకు ఇరవై వేలు పన్ను.
3. రోడ్ పన్ను.
రోడ్డులు ప్రభుత్వ ఆస్తులు. ఇంట్లోనే ఉంటే ఓకే. బయటకు వస్తే రోజుకు వెయ్యి రోడ్డు పన్ను. హై వే ఎక్కితే లక్ష పన్ను.
జస్ట్ అంతే.
నా పార్టీ లో సోషల్ మీడియా సైనికులుగా పనిచేయడానికి మనుషులు కావలెను. బూతులు అబద్దాలు అలవోకగా మాట్లాడాలి. కులం మతం ప్రాంతం సెంటి మెంటును పండించి మధ్య తరగతి ని బాగా ఆకట్టు కోవాలి .
జీతం . మామూలు పోస్ట్ కు పది వేలు. బూతు పోస్ట్ కు లక్ష.

వృక్షశాస్త్ర ఉద్యానవనం, మున్నార్.

Botanical garden, Munnar.
Botanical garden, Munnar.
Botanical garden, Munnar.
Botanical garden, Munnar.
Botanical garden, Munnar.
Botanical garden, Munnar.
Botanical garden, Munnar.
Botanical garden, Munnar.
Botanical garden, Munnar.
Botanical garden, Munnar.
Botanical garden, Munnar.
Botanical garden, Munnar.

Antiques in tea museum.

Antiques in tea museum.
Antiques in tea museum.
Antiques in tea museum.
Antiques in tea museum.
Antiques in tea museum.
Antiques in tea museum.
Antiques in tea museum.
Antiques in tea museum.
Antiques in tea museum.
Antiques in tea museum.
Antiques in tea museum.
Antiques in tea museum.
Antiques in tea museum.
Antiques in tea museum.
Antiques in tea museum.

యెరివాకులం నేషనల్ పార్క్ - అనై ముడి

Yerivakulam National park - Anai Mudi
Yerivakulam National park - Anai Mudi
Yerivakulam National park - Anai Mudi
Yerivakulam National park - Anai Mudi
Yerivakulam National park - Anai Mudi
Yerivakulam National park - Anai Mudi
Yerivakulam National park - Anai Mudi

నీలగిరి థార్ ( నీలగిరి కొండజాతి మేక ) తో

With the Nilgiri Thar (Nilgiri hill goat)
With the Nilgiri Thar (Nilgiri hill goat)
With the Nilgiri Thar (Nilgiri hill goat)
With the Nilgiri Thar (Nilgiri hill goat)

మున్నార్‌లోని 'సిల్వర్ టిప్స్'లో అల్పాహారం.

(ఈ రోజు ఆదివారం కావడంతో డైట్ విషయంలో కాస్త విరామం తీసుకున్నాను; అందుకే వెజిటబుల్ స్టూతో అప్పంను ఆస్వాదించాను.)

Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )
Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )
Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )
Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )
Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )
Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )
Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )
Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )
Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )
Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )
Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )
Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )
Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )
Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )
Breakfast at Silver tips , Munnar. ( Today being Sunday diet break for me. So enjoyed Appam with vegetable stew )

మున్నార్ !

ఊటీ ఎప్పుడో మురికి వాడ అయిపొయింది.
షిమ్లా చాలామటుకు గత అందాన్ని కోల్పోయింది.
కులు మనాలి .. పయనం రిస్క్ తో కూడుకొంది !
కేరళ -మున్నార్ - ఇంకా హిల్ స్టేషన్ అందాన్ని కలిగి వుంది.
దక్షిణాదిలో ఎత్తయిన శిఖరం అనై ముడి ( ఏనుగు తల ఆకారం ) ఇక్కడే ఉంది.
ఎరివకులం జాతీయ వనం నీలగిరి తర్ ( మేక జాతి జంతువు ) కు ప్రసిద్ధి.
ఎన్నో తేయాకు తోటలు. టీ ఫ్యాక్టరీ లు.
మెట్టుపట్టి డాం ., ఎకో పాయింట్ .. జలపాతాలు కొండలు కోనలు వాగులు వంకలు ! ప్రకృతి అందాలు !
2001 లో స్కూల్ ప్రారంభించినప్పటినుంచి జంక్ ఫుడ్ ( పిజ్జా బర్గర్ కోక్ పెప్సీ ప్యాకెట్ ల లో వుండే పొటాటో చిప్స్ ) తినొద్దని పిల్లలకు చెబుతున్నాము.
మా పిల్లలు అప్పటినుంచి కూడా జంక్ పెద్దగా తినేవారు కాదు.
కానీ అడపాదడపా తినేవారు.
కరోనా తరువాత జంక్ ఫుడ్ మొబైల్ ఫోన్ - ఈ రెండింటినీ తీవ్రంగా నిషేదించాము. పిల్లల మనసుకు హత్తుకునేలా గట్టిగా చెప్పాము.
ఇప్పుడు మా పిల్లలు రెండింటి జోలికి అసలు వెళ్ళరు.
మున్నార్ కు గతం లో అయిదు సార్లు వచ్చాము. ఘాట్ రోడ్ ప్రారంభం అయిన వెంటనే బస్సులో కనీసం పది మంది పిల్లలు వాంతులు చేసేవారు . రెండు మూడు చోట్ల బస్సు ఆపాల్సి వచ్చేది.
నిన్న కొతమంగళం లో రెండింటికి లంచ్ చేసి జర్నీ ప్రారంభించాము. మొత్తం మూడు బస్సులు .
ఘాట్ రోడ్ ప్రారంభం కాగానే ప్లాస్టిక్ కవర్లు ఇచ్చాము. మూడు గంటలు ఘాట్ రోడ్ పయనం. ఎక్కడా ఆప లేదు. మూడు బస్సుల్లో ఒక్కరంటే ఒక్కరు వాతి చేసుకోలేదు .
గతం లో మున్నార్ చేరుకోగానే “ సర్ తల నొప్పి , నీరసం అంటూ సొమ్మ సిల్లే వారు.
నిన్న చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు.
ఆరోగ్య కరమయిన ఆహారపు అలవాట్లు శరీరం పై ఎంత ప్రభావం చూపుతాయో!
ఫోటో లు పోస్ట్ చేస్తున్నానుగా ! మా పిల్లల్లో .. ఈ కాలం సిటీ పిల్లలు లాగా ఊబకాయం వున్నవారు ఎంత మందో గమనించండి ;
దాదాపు గా లేరు.
అందరూ ఫిట్. స్మార్ట్.
చేతిలో సొల్లు ఫోన్ ఇల్లే !
హోటల్స్ వారు షాక్ అవుతున్నారు. “ స్కూల్ పిల్లల చేతుల్లో మొబైల్స్ ఫోన్స్ ., వారు చేసే అతి .. రెండూ ఇక్కడ కానరావు ; ఇంత బుద్ధిగా పిల్లలు వుంటారా?” అని.
పెంపకం చదువుల్స్ మేటర్స్ !
మానసిలాయో ?
శుభోదయం !
సుప్రబాదం ( మలయాళం లో చదవాలి. స్పెల్లింగ్ మిస్టేక్ అనుకునేరు )
కేరళ మున్నార్ లో
ఎడతెరపి లేకుండా హోరు వాన.
అయినను పోయివచ్చితి జిమ్మునకు !
( పొద్దున్న ఏడింటికి కొచ్చిన్ హోటల్ నుంచి బయలుదేరి దారిలో అతిరపల్లి జలపాతం. సాయంకాలం అయిదింటికి మున్నార్ ). వెంటనే జిం కు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ పెద్ద స్క్రీన్ పై
The story is good. The ending is not good.
రెండు నెలల క్రితం మా ఊళ్ళో జనకత్త ( జానకి అత్త- మా మేనత్త ) “ అదేందిరా ! తిండికి లేనోడి లాగా ఇంత సన్నగా అయిపోయిండావు!”
( ఆమెకు చెప్పినా అర్థం కాదని నవ్వి వూరుకొన్నా! )
నిన్న వెయిట్ చూసుకొంటే 76 కిలోలు !
ఒకప్పుడు 71 కిలోలు.
సన్నబడితే బరువు ఎలా పెరిగాను ?
ఈ రెండేళ్లలో ఇరవై కిలోల అదనపు కొవ్వు ను వదిలించుకొన్నాను.
వ్యాయామం వల్ల సరైన ఆహారం వల్ల ఎముకల సాంద్రత ( బోన్ డెన్సిటీ ) పెరిగింది. కండలు వచ్చాయి.
ఎముకలు స్టీల్ అయితే కండలు కాంక్రీట్. రెండూ పెరిగితే బిల్డింగ్ పటిష్టం. కదా !
కొవ్వు సాంద్రత తక్కువ. ఒక కిలో కొవ్వు తో పోలిస్తే కిలో కండ తక్కువ స్పేస్ !
అందుకే వెయిట్ పెరిగింది. Slimness వచ్చింది.
అంటే ఆరోగ్యం.
కడుపు కట్టుకొని సన్నబడితే వచ్చేది అనారోగ్యం ( పెళుసైన ఎముకలు దానిపై తోలు.
BMI ( బాడీ మాస్ ఇండెక్స్ ) అనేది ఒక పెద్ద బూతు !
పారిస్ దేఖా !
లండన్ దేఖా !
హిందీలో దేఖా అంటే చూసాను అని.
తెలుగు లో దేకడం అంటే పాకడం.
మీరు ఎలా తీసుకొన్న నల్లులు ఏమీ అనుకోవు.
పారిస్ ను చుట్టేసిన నల్లులు , మందులు కొట్టినా చావని నల్లులు .. ఇప్పుడు లండన్ పై దండెత్తాయి.
పారిస్ లండన్ పురవాసులు ఆ రోజుల్లో ప్రపంచ మానవాళి రక్తాన్ని పీల్చినట్టే ఈ నల్లులు ఇప్పుడు వారి వారసుల బ్లడ్ భోజనం ఆరగిస్తున్నాయి.
చూస్తుంటే ఇది ఇండియా కి కూడా వస్తాయేమో అనిపిస్తుంది. అసలే గ్లోబల్ యుగం.

కేరళ పర్యటన: కొచ్చిలో సూర్యాస్తమయ క్రూయిజ్ ప్రయాణం కొచ్చిలో ప్రశాంతమైన సూర్యాస్తమయ క్రూయిజ్ ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆ క్రూయిజ్ నిర్వాహకుడు వార్తల్లో నిలిచిన ఒక భారతీయ యుద్ధనౌక గురించి సాధారణ విజ్ఞానానికి సంబంధించిన ప్రశ్న అడిగాడు.

మా పిల్లలు దానికి సమాధానం చెప్పలేకపోయారు.

అప్పుడు ఆయన, "మీ చేతిలో ఎప్పుడూ సెల్ ఫోన్ ఉంటుంది కదా, మరి ఇది మీకు తెలియదా?"

అని అడిగాడు.

దానికి మా పిల్లలు గర్వంగా, "మేము సెల్ ఫోన్లను ముట్టుకోము," అని బదులిచ్చారు.

"అబ్బో, నిజంగానా?

ఇలాంటిది చూడటం ఇదే మొదటిసారి. చాలా గొప్ప విషయం! మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది," అని ఆయన భావోద్వేగంతో, మనస్ఫూర్తిగా ఆ మాటలు పలికారు.

దేవుడి గారి సొంత దేశానికి పది రోజుల విహార యాత్ర రేపటినుంచి. మరిన్ని వివరాలు రేపు ����
వరసగా రెండా ?
ఒక వ్యక్తికి వైరస్ సంక్రమించింది . అది నయం అవుతున్న దశలో బాక్టీరియా సంక్రమిస్తుందా ?
అవును . ఇది సహజం .
వైరస్ సోకినప్పుడు ఇమ్మ్యూనిటి బలంగా ఉంటే అది వైరస్ ను చంపేస్తుంది .
అప్పుడు ఏమీ కాదు .
వృద్ధాప్యం , వాక్ సీన్ లు .. మద్యం లాంటి కారణాల వల్ల ఇమ్మ్యూనిటి బలహీనంగా ఉంటే అప్పుడు వైరస్ చెలరేగిపోతుంది . ఊపిరి తిత్తుల పై ఎక్కువ ప్రభావం చూపుతుంది .
ఈ పరిస్థితుల్లో ఇమ్మ్యూనిటీ మరింత బలహీనం అవుతుంది .
ఇలాంటి స్థితిలో అవకాశవాద బాక్టీరియా విజృంభిస్తుంది . మామూలు స్థితిలో అయితే గొంతు లాంటి చోట్ల ఈ బాక్టీరియా ఉంటుంది . కానీ ప్రభావం చూపలేదు . కానీ ఎప్పుడైతే ఇమ్మ్యూనిటి బలహీన పడుతుందో అప్పుడు అవకాశం కోసం చూస్తున్న బాక్టీరియా విజృంభిస్తుంది . దీన్నే గౌణ లేదా ద్వితీయ సంక్రమణ అంటారు .
సాధారణంగా ఈ సెకండరీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ప్రభావం చూపుతుంది . ఇది వరకే దెబ్బ తిన్న ఆరోగ్యాన్ని మరింత క్రుంగ తీస్తుంది . అత్తుత్తమ చికిత్స పొందితే బయటపడవచ్చు .
దయ చేసి కామెంట్స్ సెక్షన్స్ లో పేర్లు రాసి గాసిప్స్ పోస్ట్ చెయ్యొద్దు . నేను సైన్స్ వివరించాను . అర్థం చేసుకోగలరు .

ఏదైనా గ్రామానికి వెళ్ళండి .

ఆ ఊళ్ళో కరోనా ముందు కాలం లో సగటున నెలకు ఎన్ని మరణాలు ఉండేవి .. కరోనా ముగిసాక ఎన్ని మరణాలు జరుగుతున్నాయి అని తెలుసుకోండి .
మరో పది గ్రామాలతో ఈ డేటా చెక్ చేసుకోండి .
మీరు గమినించారా?
కరోనా వాక్ సీన్ లు వేసుకొన్నాక{ ఒక డోసు అయ్యాక నుంచి మొదలుపెట్టి ఆరు నెలల వరకు } కార్డియాక్ అరెస్ట్ లు ఎక్కువ జరిగాయి . గుండె స్థంబన - కొన్ని లక్షల మంది చావుకు కారణమయ్యింది .
వాక్ సీన్ ల ప్రభావం వల్ల కొంతమంది గుండె కండరాలు బలహీన పడ్డాయి . డాన్స్ చెయ్యడం , వేగంగా నడవడం , వ్యాయామం చెయ్యడం లాంటి పనుల వల్ల గుండెపై భారం పడుతుంది . అసలే బలహీన పడిన గుండె . ఒత్తిడిని తట్టుకోలేక ఆగిపోయింది . పెళ్లి పందిరిలోనో గణేష్ మండపాల్లోనో డాన్స్ చేస్తూ ... మాట్లాడుతూ ఉన్నట్టుండి కుప్పకూలి కేవలం ఒకటి రెండు క్షణాల్లో మరణించిన వారిని చూసారు కదా .
ఇప్పుడు అలాంటి మరణాలు తగ్గాయి .
కానీ ఇంకా... మరణాలు గత కాలం తో పోలిస్తే భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసిన సీజనల్ జ్వరాలు . కొత్తవా అంటే కాదు . కానీ గతం తో పోలిస్తే మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి . కారణం వ్యక్తుల ఇమ్మ్యూనిటి బలహీన పడడం.
మలేరియా , డెంగీ లాంటి వాటి వల్ల గతం లో మరణాలుండేవి . కానీ ఇప్పుడు వాటి సంఖ్య బాగా పెరిగింది . కారణం ఇమ్మ్యూనిటి బలహీనం కావడం .
గుండె స్థంబనలు ఇప్పుడు తగ్గాయి . కానీ గుండె పోట్లు.. మెదడు పోట్లు ఇంకా జరుగుతున్నాయి . గుండె కండరాలు బలహీన పడితే జరిగేది గుండె స్థంభన . ఇది క్షణాల్లో జరిగిపోతుంది .
రక్తం లో చిన్న గడ్డలు రావడం వల్ల జరిగేది గుండెపోటు . మెదడు పోటుకు కూడా ఇదే కారణం .
రక్తం లో క్లోట్స్ రాకుండా ఉండడానికి ..
వాక్ సీన్ వల్ల వచ్చిన క్లోట్స్ కరిగిపోవడానికి ,...
వాక్ సీన్ వల్ల అదే విధం గా కరోనా కాలం లో స్టెరాయిడ్ చికిత్స వల్ల బాగా బలహీన పడిన ఇమ్మ్యూనిటి బలపడానికి....
అదే విధంగా ఆటో ఇమ్యూన్ సమస్యనుంచి బయటపడానికి...
ఇవి చేయండి .
1 . గుండె కండరాలు దానికి సంభందించిన రక్తనాళాలు బలపడాలంటే వ్యాయామం తప్పని సరి . రోజూ కనీసం అర గంట నడవండి . ఎండలో నడిస్తే డి విటమిన్ బోనస్ గా దొరుకుతుంది . జిం లో చేరి ఒకే సారి పెద్ద ఎత్తున బరువులు ఎత్తకండి. నెమ్మదిగా ప్రారంభించండి . ముందుగా నెమ్మదిగా నడక . అటు పై మూడు నెలలకు నడక వేగాన్ని పెంచండి . అటు పై జిం లో చేరాలనుకొంటే చేరొచ్చు . జిం లో చేరితే బరువులెత్తే వ్యాయామం క్రమ పద్దతిలో చేయండి . ముందుగా తక్కువ బరువులు .. తక్కువ స్థాయిలో వ్యాయామం . నెమ్మదిగా తీవ్రత పెంచుకోవచ్చు . యోగా కూడా మంచిదే . జిం అవకాశం లేనివారు యోగ చేయొచ్చు . జిం కు వెళ్లినా యోగ చేసినా ముందుగా నడక తప్పని సరి . కార్డియో వాస్కులర్ ట్రైనింగ్ అది .
2 . రోజుకు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర తప్పని సరి . బలహీన పడిన ఇమ్మ్యూనిటి తిరిగీ కోలుకోవాలంటే ఇది తప్పని సరి .
3 . స్ట్రెస్ { మానసిక ఒత్తిడి } దగ్గరకు రాకుండా చూసుకోండి . హింసాత్మక దృశ్యాలు , అనవసర రాజకీయ రభసలు లాంటివాటికి దూరంగా ఉండండి. మనసుకు నెమ్మది నిచ్చే సంగీతం వినడం .. హాస్య సన్నివేశాలు చూడడం లాంటివి చెయ్యండి . ఒంటరిగా ఉండొద్దు . మీ భావాల్ని , కష్టాల్ని సుఖాల్ని మీ వారితో పంచుకోండి .
4 . డి విటమిన్ కోసం ఎండ . సి విటమిన్ కోసం పుల్లటి పళ్ళు , జింక్ కోసం ఎండిన నల్లటి ద్రాక్ష .. తరచూ తీసుకోండి .
5 . మైదా మానెయ్యండి . తెల్లనం తగ్గించండి . కాయగూరలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి . షుగర్ సమస్య లేనివారు పళ్ళు బాగా తినండి . షుగర్ వున్నా తెల్లనం తగ్గిస్తే పళ్ళు ముఖ్యంగా తీపి తక్కువగా పులుపు ఎక్కువగా వున్న పళ్ళు { కివి , బ్లూ బెర్రీ లాంటివి } తీసుకోవచ్చు . ప్రోటీన్ కోసం మాంసాహారులు చేపలు చికెన్ ఎగ్ .. శాఖాహారులు పన్నీర్ పుట్టగొడుగులు . సొయా వద్దు . అది విషం . జామ కాయలు, నల్ల శనిగెలు, వేరు శనిగె , పప్పు .. వీటిలో కూడా ప్రోటీన్ దొరుకుతుంది . కాకపోతే మోతాదు తక్కువ .
కేవలం ఈ ఐదో పాయింట్ లో చెప్పినవి చేస్తే1 షుగర్ సమస్య 2 బ్లడ్ క్లోట్స్ సమస్య 3 అధిక బరువు 4 ఆటో ఇమ్యూన్ వ్యాధులు 5 బిపి .. ఇలా అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది . ఇది లేకుండా ఇంకెన్ని చేసినా వృధా .
6 . ఒమేగా త్రీ ఫాటీ ఆసిడ్ ఆహారం తీసుకోండి . సముద్రపు చేపలు , వాల్నుట్స్ లో ఇది బాగా దొరుకుతుంది .
7 . అల్లం , వెల్లుల్లి , పసుపు తరచూ ఆహారం లో తీసుకోండి . తాంబూలం అప్పడప్పుడూ సేవించండి .
8 . మద్యానికి దూరంగా ఉండండి . అలవాటు అయిపొయింది అంటే .. కనీసం చీప్ లిక్కర్ కు దూరంగా ఉండండి . చీప్ లిక్కర్ వల్ల, కల్తీ కళ్ళు వల్ల లక్షలాది మంది కిడ్నీ లు నాశనం అయిపోతున్నాయి . తాగడం మానలేము అంటే .. కనీసం ఖాళీ కడుపుతో తాగకండి . ముందుగా స్నాక్స్ అవి తిన్నాక కనీసం పావు గంట తరువాత డ్రింక్ . డ్రింక్ చేసిన అయిదారు గంటలకు అంటే నిద్ర పోయి లేచాక నీరు ఎక్కువగా తాగండి . బీరు కన్నా విస్కీ నయం . దానికన్నా బ్రాందీ నయం . సోడా కలపకండి . చల్లటి నీరు { బ్రాందీ అయితే వేడి నీరు } బెటర్ . ఇప్పుడు ఎనిమిదో పాయింట్ లో మొదటి వాక్యం మరో సారి చదవండి.
9 . రోజుకు పురుషులు నాలుగు స్రీలు మూడు లీటర్ ల నీరు తాగాలి . తరచూ నీరు తాగండి.

బెంగళూరు అమ్మాయి. వయసు 18- 19 ఉండొచ్చు.

డ్రగ్స్ .. మద్యం కిక్కు లో ఉంది.
పోలీస్ స్టేషన్ కు తెచ్చారు. దాదాపు పది మంది మహిళా పోలీస్ లు ఇంకొంతమంది మగ పోలీస్ లు కంట్రోల్ చేస్తున్నారు. మహిళా పోలీస్ లను తన్నింది.
ఈ వీడియో ను పోస్ట్ చేస్తే వెంటనే ఉదార వాదులకు మనోభావాలు దెబ్బ తింటాయి. ఆమె లైఫ్. డ్రగ్స్ తీసుకొంటే తప్పేంటి. పోలీస్ లు అకృత్యాలు చెయ్యరా అంటూ పిచ్చి లాజిక్ లు అందుకొంటారు.
డ్రగ్ peddlers కంటే వీరు సమాజానికి ప్రమాదకరం.

కాలేజీ విద్యార్థులు ఫైటింగ్ !

ఎక్కడంటారా ?
బహుశా అంగారక గ్రహం అయిండొచ్చు.
ఎందుకంటారా ?
ఫైటింగ్ చేసుకోవడానికి కారణాలు కావాలా ?
యూట్యూబ్ వీడియో లు వెబ్ సిరీస్ సినిమాలు చూడ్డం లేదా ఏంటి ?
పోస్ట్ ఉద్దేశం : విద్యార్థుల్లో యువతలో హింసా ప్రవృత్తి ఎందుకు విపరీతంగా పెరిగి పోతోంది ? దీని పర్యవసానాలు ఏంటి ? పరిష్కారం ఏంటి ? .. ఇవీ అందరు ఆలోచించాల్సిన అంశాలు !

సంఘటనలు అవే!

వాటికి ప్రతిస్పందనలు బిన్నం.
ఎవరి స్పందన బట్టే వారి జీవితం !

స్లేట్ అబిడ్స్ హై స్కూల్ టీచర్ల దసరా సంబరాలు !


స్లేట్ అబిడ్స్ హై స్కూల్ టీచర్ల దసరా సంబరాలు !


Slate Abids High School Teachers' Dasara Celebrations!
Slate Abids High School Teachers' Dasara Celebrations!
Slate Abids High School Teachers' Dasara Celebrations!
Slate Abids High School Teachers' Dasara Celebrations!
Slate Abids High School Teachers' Dasara Celebrations!
Slate Abids High School Teachers' Dasara Celebrations!
Slate Abids High School Teachers' Dasara Celebrations!
Slate Abids High School Teachers' Dasara Celebrations!

SLATE - అబిడ్స్, హై స్కూల్ విభాగం ఉపాధ్యాయుల సమావేశం.


Slate Abids High School Teachers' Dasara Celebrations!
Slate Abids High School Teachers' Dasara Celebrations!

సిల్లీ ప్రశ్న.

����������
ఇందాక పోస్ట్ చేసిన ముక్కు - హక్కు వీడియో లో ఆ సౌండ్ ఏంటి ? అది ఎక్కడ రికార్డు చేశాను.
మీ సమాధానాలు పోస్ట్ చేయండి. తెల్లవారు జామున చూస్తాను.
శుభ రాత్రి.

ముక్కు - హక్కు


సామాన్య జ్ఞానం అంతరించిపోయిందా?


అందరూ పెళ్లి చేసుకోవాలని వాసిరెడ్డి అమర్నాథ్ పదే పదే ఎందుకు పోస్ట్ లు పెడుతున్నాడు ?
జనాలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనక పొతే ఆయన బిజినెస్ ఆగిపోతుందని ..
ఇలా ఎవరైనా అంటారేమో అని చూస్తున్నా. ఇంకా ఆ మహానుభావుని దర్శన యోగం కలుగలేదు.
������
( లాక్ డౌన్ వద్దు. పిల్లలు నాశనం అయిపోతారు. కరోనా తో పరోటా తో పిల్లలకు ఏమీ కాదంటే “ పై అభియోగం వెసిన ఒక దండు ఉంది లెండి. ��������అందుకే గుర్తు చేసుకొన్నా
ఇందాక ఒకాయన .. “ ఆయన పెళ్ళొదంటున్నాడు. మీరు చేసుకోవాలి అంటున్నారు. ఎవరి మాట వినాలి? “
“ ఆయన మాట వింటే .. బతుకు .. ఆయన లా …
.. నా మాట వింటే .. నా .. లా “
… అని చెబుదాముకున్నా!
మరీ బిల్డ్ అప్ ఇచ్చుకుంటున్నాడు “ అనుకొంటారేమో అని వేరే ఆన్సర్ ఇచ్చా. ��
పెళ్లి చేసుకొని .. ఇల్లు చూసుకొని .. చల్లగా కాలం గడపాలోయ్ .. ఎల్లరు హాయిగా వుండాలోయ్ ! ����

" పెళ్లి చేసుకోవద్దని నా అభిప్రాయంగా, నా చిన్న కూతురుకి నేను చెప్పాను" ఒక తెలుగు సినీ నటుడు .

అయ్యా ! ఎదిగిన పిల్లల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చెయ్యడం తప్పు .
కానీ, పిలల్లకు బుద్ధి చెప్పాల్సిన స్థితిలో ఉంటూ, పెళ్లొద్దని తండ్రిగా, మీరే చెప్పడమేంటి ? పైగా ఇదేదో విప్లవమాత్మక విషయమయినట్టు, పబ్లిక్ ఇంటర్వ్యూ లో చెప్పి , ఇప్పటికే కుదేలవుతున్న వివాహ , కుటుంబ వ్యవస్థలపై రాళ్ళేయడమేంటి ?
మీరు సినిమా హీరో అయ్యారంటే దానికి మీ నాన్న , అమ్మ కారణం కాదా ? వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటే మీరు పుట్టే వారే కారు . వారు తమ కొడుగ్గా , మిమ్మల్ని ప్రేమించక పొతే , మీరు హీరో అయ్యేవారా?
ఒక దశలో మీరు క్యాసినోల మోజులో పడి, ఆస్థిని తగలేసుకొన్నారు . కుటుంబ సభ్యుల మానసిక అండ లేకుంటే అప్పుడు మీకేమయ్యేది ? పూర్తి స్థాయి డిప్రెషన్ కు గురయ్యి ఆసుపత్రి పాలయ్యేవారేమో కదా ?
మీరు సమాజానికి పునాది అయిన , వివాహ- కుటుంబ వ్యవస్థలపై రాళ్ళేసారు .
నిజమే .. నేడు వివాహం పేరుతొ ఎన్నో ఘాతుకాలు . కుటుంబలో ఎన్నో సమస్యలు . ఎలుకలు దూరాయని ఇల్లు తగలపెట్టుకొంటామా ?
వివాహ వ్యవస్థను , కుటుంబ వ్యవస్థను ఆధునీకరించుకోవాలి . ఇది అవసరం . కానీ పెళ్లి వద్దు అంటే ఎలాగండి ?
మీ అమ్మాయి మీ మాట ను నమ్మి పెళ్లి చేసుకోకుండా ఉండి పొతే ?
మీరు ఆరోగ్యం గా వున్నారు . ఇంకా అనేక సంవత్సరాలు ఆనందంగా.. ఆరోగ్యంగా ఉండాలని కోరుకొంటున్నాను .
కానీ ఎంత వద్దనుకున్నా మీది పై తరం .
రేపు మీరు పోయాక మీ అమ్మాయి కి తోడెవ్వరు ?
అమ్మాయి అయినా, అబ్బాయి అయినా మనిషికి తోడుండాలి .
ఆఫీస్ లో వుండే వారిని సహోద్యోగులు అంటారు .
ప్రతి మనిషికి స్నేహితులు వుంటారు .
మనిషికి ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది . అదే కుటుంబం .
మానసిక అండదండ , పనిలో సహకారం , శ్రమ విభజన. ఆర్థిక పరస్పరత.. ఇలా ఎన్నో విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య గాఢమయిన సంభంధం ఉంటుంది . ఉండాలి . లేకపోతె.. వచ్చేలా జాగ్రత్త తీసుకోవాలి . లోపాలుంటే సరిదిద్దు కోవాలి .
మన వివాహం , కుటుంబం బాగాలేదని నేడు కొంత మంది తల్లి తండ్రులు పిల్లలకు పెళ్లి- కుటుంబం వద్దు అంటున్నారు .
ఎక్కడో విమానం కూలిపోయిందని విమానమే ఎక్కను .... ఒక వ్యకి కి నిద్రలో గుండెపోటు వచ్చిందని నిద్రే పోను అంటే ?
పెళ్లి లేక .. కుటుంబం లేక .. మనిషి ఒంటరి అయితే .. తోడు లేకుంటే మనిషి మనలేడు. ముందుగా మానసిక ఆసుపత్రి . అటుపై స్మశానం .
సెక్స్... మనిషికి అవసరం .
అది తీరాలంటే భర్త / భార్య ఉండాలి .
లివ్ ఇన్ లు .. కాజువల్ సెక్స్ లు అంటారా ?
ఎయిడ్స్ మాటేమిటి ?
కాజువల్ సెక్స్ లో పూర్తి స్థాయి సంతృప్తి వస్తుందనుకొనే వారికి ఏమని చెప్పాలి ?
సరే .. వయసులో వున్నప్పుడు .. శరీర సౌష్టవం వున్నప్పుడు సెక్స్ కోరిక తీరుతుంది . కానీ వయసు ఉడిగాక తోడెవరు?
నలబై లో.. యాభై లో.. అరవై లో... డెబ్భై లో.. జీవితం ఎలా ఉంటుంది ?
ఇలా చెబుతున్నందుకు సారీ... కానీ ఒక్క సారి ... మరో ముప్పు ఏళ్లకు మీ అమ్మాయి జీవితం ఊహించుకోండి { ఆమె మీ మాట విని పెళ్లి చేసుకోకపోతే } . ఉద్యోగం .. డబ్బు సరే .. ఇంట్లో .. పనిమనుషులు తోడుంటారా ? అసలు అప్పటికి పని మనుషులు దొరుకుతారా?
జబ్బు పడి... మంచం నుంచి లేవలేకుంటే రాత్రంతా కాపెట్టుకొని , టెంపరేచర్ చెక్ చేసి మాత్రాలిచ్చేది ఎవరు ?
ఇంకా వయసు మీరి వృద్ధాప్యం లోకి వెళితే తోడెవ్వరు ?
ఈ కాలం పిల్లలు అండగా ఉంటున్నారా అని అడగకండి .
అది ఎలుకలు దూరడం . దానికోసం ఇల్లు తగలెడితే ఎలా ?
అనాధ పిల్లల్ని దత్తత చేసుకొంటుంది అంటారా ? అసలు ఎవరూ పెళ్లి చేసుకోకుండా ఉంటే , సెక్స్ ను కేవలం ఒక కోరిక తీర్చే విధానంగా ... అంటే కాజువల్ సెక్స్ చేసుకొంటే ఇక పిల్లలు ఎలా పుడతారు ?
అనాధ పిల్లల్ని దత్తత చేసుకోవడం గొప్ప విషయం . అభినందించాలి .
కానీ ఇక్కడ చాలా మందికి అర్థం కాని ఒక విషయం వుంది .
ఆ అనాధ బిడ్డ తల్లి రేప్ లాంటి దానికి గురి అయ్యి బాగా ఎమోషనల్ స్ట్రెస్ తో బిడ్డను కనుంటే ఆ బిడ్డకు ఆటిజం వచ్చే అవకాశముంది . ఆ తండ్రి క్రిమినల్ అయ్యుంటే జన్యుపరంగా ఆ బిడ్డకు ఆయా లక్షణాలు వచ్చే అవకాశం కొంత మేర అయినా వుంది . ఇది కాకుండా చిన్నప్పుడే తల్లిపాలు.. తల్లి ప్రేమ కు దూరమయిన ఆ బిడ్డలో ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు .
అసలు ఏ బిడ్డా... అనాధ కాకూడదు . .. నేను పెళ్లి చేసుకోను .. ఒక బిడ్డ ను తెచ్చుకొని పెంచుకొంటాను అంటే .. అది అంత ఈజీ కాదు . సమస్యలు వచ్చే అవకాశముంది . { అనాధ పిల్లలు అందరూ సమస్యాత్మకంగా వుంటారు అని చెప్పడం లేదు . అర్థం చేసుకోగలరు. వారి పట్ల సమాజం సహానుభూతితో వ్యవహరించాలి }
లేదా నలబై దాటాక మీ అమ్మాయికి అప్పుడు పెళ్లి చేసుకోవాలని కోరిక పుడితే .. అప్పుడు పెళ్లి చేసుకొంటే .. సెక్స్ ను ఎంజాయ్ చేసే పీక్ టైం దాటినట్ట్టే . అంతకు మించి అప్పుడు పిల్లలని కంటే వారికి ఆటిజం సమస్యలు వచ్చే అవకాశం ఉంది"
సినిమాల్లో ఇంకా మంచి పాత్రలు వస్తున్నాయి . హ్యాపీ గా లైఫ్ ఎంజాయ్ చెయ్యండి . మీ అమ్మాయికి బలవంత పెట్టి పెళ్లి చెయ్యొద్దు . కానీ " అమ్మా.. మనిషికి తిండి, నీరు, గాలి ఎంత అవసరమో పెళ్లి కూడా అంత అవసరం . నిన్ను నిన్నుగా గౌరవించే మనిషి ... అర్థం చేసుకొనే మనిషిని... చూసి... పెళ్లి చేసుకో అని అయినా చెప్పండి సార్. ఇది తండ్రిగా మీ ధర్మం . మానవ మనుగడ రహస్యం . విదేశాలకు వెళ్లి కేసినో లో డబ్బులు పోగొట్టుకున్నారు . సామజిక జ్ఞానం కూడా పోయిందా ఏంటి బాబు గారు ?"
ఏముంది ? పెళ్లి.. పిల్లల్ని కనడం .. ఇదే రొటీన్ అని మీరు ఆ ఇంటర్వ్యూ లో అన్నారు ! దానికి నా సమాధానం ..
అదేంటో సార్ .. రోజు పొద్దున్న లేస్తే టాయిలెట్ కు పోవాలి . బ్రష్ చేసుకోవాలి . తినాలి . నీరు తాగాలి . ఇదే గానుగెద్దు జీవితం అయిపొయింది . నేను తినను . నీళ్లు తాగను. తినకుంటే నీళ్లు తాగకుంటే టాయిలెట్ కు పొయ్యే పని తప్పుతుంది " అని ఎవడైనా తింగరోడు అంటే మీరేమి చెబుతారు ?
అంతకు మించిన తింగరోడు " అసలు నోటి ద్వారానే ఎందుకు తినాలి ? ఇది రొటీన్ అయిపొయింది . నేను మలద్వారం ద్వారా తింటాను . ముక్కు ద్వారా మూత్ర నోటి ద్వారా మలం విసర్జిస్తాను " అంటే ..
అయ్యా .. నిన్నటి హీరో .. నేటి విలన్ పాత్రల నటుడు గారూ .. మీ పర్సనల్ విషయాలు సరే .. మీ ఇష్టం . కానీ మీరు నోటి ద్వారా మూత్ర విసర్జన చేసి { పెళ్ళొద్దు అని పబ్లిక్ ఇంట్వ్యూ ఇవ్వడం } సమాజానికి కీడు కలిగిస్తే నాలోంటోడు ఒక్కడు మీకు సింహ స్వప్నం అవుతాడు . జాగ్రత్త !
జయప్రకాశ్ రెడ్డి స్టైల్ లో ..
సొంత వయసు లెక్క పెట్టుకోవడానికి కేలండర్ ఏందిరా? ఇంత బద్ధకం అయితే ఎట్ట రా? Dementia రమ్మంటే రాదురా ? ఏమిరా !
గబ్బు నా …
������������
>In Jayaprakash Reddy's style...
అమెరికా కు అధ్యక్షుడు అయ్యే అవకాశమున్న వివేక్ రామస్వామి తన పిల్లల సంరక్షణ లో సాయపడే ఆయమ్మ కు సంవత్సరానికి 80 లక్షల జీతం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు.
ఈ లెక్కన .. అమ్మమ్మ నానమ్మ సేవలకు విలువ కట్టండి.
అమెరికా లో స్థిరపడ్డ వారు కానీ .. ఇండియా లో వున్నవారు కానీ .. కనీసం మీ పిల్లలకోసమయినా మీ అమ్మ నాన్న అత్త మామను ఇంట్లోకి ఆహ్వానించండి .
పిల్లలకు మేధోవికాసం కావాలంటే వారితో మాట్లాడడానికి / ఆటలు ఆడదానికి ఎప్పుడూ కనీసం ఇద్దరు కావాలి.
తల్లి ఒక్కటే ఈ పని చేయలేదు.
పిల్లల్ని బిజీ గా ఉంచేందుకు వారికి సెల్ ఫోన్ ఇస్తే .. ఇక అంతే సంగతులు. చిత్తగించవలెను.
పిల్లలకు కనీసం ఐదేళ్లు వచ్చేవరకు .. వీలయితే వారి స్కూల్ చదువు ముగిసే వరకు ఇంట్లో మనుషులు ఉండాలి.
కేవలం తల్లి తండ్రి అంటే కుదరదు.
అసలే కేంద్రక కుటుంబాలు.
మళ్ళీ పిల్లలతో వ్యవహరించడానికి టైం లేదనే వారు కోకొల్లలు.
బరాక్ ఒబామా తెలుసా?
ఆయన అమెరికా అధక్షుడుగా వున్నప్పుడు కూడా తన కూతుళ్లతో ఎంతో సమయం గడిపేవాడు.
సమయం మన చేతిలో బానిస. మనం ఇష్టపడిన పనికి తప్పక సమయం దొరుకుతుంది.
పిల్లల్ని పెంచడం ఒక సైన్స్ .. ఒక కళ.
నేను నియంత అయితే ప్రతి జంటకు పేరెంటింగ్ క్లాస్ తప్పని సరి చేసి , అది పాస్ అయిన వారికి మాత్రమే పిల్లలని కనే అవకాశం కల్పిస్తాను.
పాత రోజుల్లో ఇది లేదంటారా ?
అయ్యో ఎందుకు లేదండీ.
ఒక అమ్మమ్మ .. నాన్నమ్మ .. ఒక మేనత్త .. ఒక పెద్దమ్మ .. ఆ రోజుల్లో హోమ్ సైన్స్ ప్రొఫెసర్లు.
అది మనకు ఇంకా అర్థం కాకపోవడం మన దౌర్భాగ్యం.

నల్లులు బాబోయ్ నల్లులు !

హై స్పీడ్ ట్రైన్స్ , ఫైవ్ స్టార్ట్ హోటల్స్ , సినిమా థియేటర్స్ , మాల్స్ ...
అన్ని చోట్లా నల్లులు !
ప్రేమ నగరం , కాంతి నగరం .. ఫాషన్ రాజధాని .. ఇన్ని పేర్లను సొంతం చేసుకొన్న పారిస్ , ఇప్పుడు నల్లుల నగరంగా మారిపోయింది .
వచ్చే సంవత్సరం అక్కడ ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి . అప్పటిలోగా నల్లులను అరికట్ట లేకపోతే అవి ప్రపంచమంతా పాకే ప్రమాదం ఉంది.
పగలంతా కనబడదు . రాత్రయితే బయటకు వచ్చి కుట్టడం మొదలుపెడుతుంది . నిద్ర పట్టదు . రాత్రంతా గీరుకొంటూ కూర్చోవాలి .
మంచం సందుల్లో బీరువా సందుల్లో వేలాది గుడ్లు పెట్టేస్తుంది . ఉన్న నల్లుల్ని చంపినా రకాసుల్లా కొత్తవి పుట్టుకొని వస్తాయి . మందు కొట్టినా కొన్ని గుడ్లు చావవు .
దుప్పట్లూ మొదలయిన వాటిని మరిగే వేడి నీటిలో ఉడికించాలి . బాగా వేడిగా ఉన్న నీటి ఆవిరి మంచం సందులు లాంటి వాటిలోపలికి వెళ్లేలా చెయ్యాలి . వేడికి నల్లి గుడ్లు చస్తాయి .

నిన్న పెట్టిన పోస్ట్ కు ఒక సవరణ. అల్మొన్డ్స్ నానబెట్టిన నీటిని తాగాలని చెప్పను. లోతుగా అద్యయనం చేస్తే ఆ నీటిని పారబోయడం మంచిదని తెలిసింది.

తప్పు హైదరాబాద్ వాసులదా ?

లులూ మాల్ !
ఏడేళ్ల క్రితమే దుబాయ్ లో సందర్శించాను . ఈ సంస్థ లో నాలుగో స్థానం లో ఉన్న మిత్రుడి ఆహ్వానం మేరకు వెళ్ళాను . మూడో- నాలుగో బిల్డింగ్ లలో ఉంది. దానికి దగ్గరే వీరిదే ఇంకో మాల్ . అక్కడే ఆ సంస్థ యజమాని ఉంటారు. పరిచయం చేస్తాను అంటే సమయం లేక వద్దనేశాను .
ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఆ సంస్థ అంటే నాకు ద్వేషం లేదు అని పోస్ట్ లో ముందుగానే స్పష్టం చేయడానికి .
మాల్ అంటే అద్భుత నిధి దాగున్న గుహ కాదు !
హైదరాబాద్ లో.. ఒక ఫ్లై ఓవర్ పక్కన మంజీరా మాల్ అని ఒకటుండేది . కరోనా లాక్ డౌన్ ముగిసాక వెళ్ళాను ."ఇదేంటబ్బా .. ఇలాంటి ప్లేస్ లో ఉంది . నేరుగా మాల్ లోకి వెళ్లలేము . ఫ్లై ఓవర్ దిగి ముందుకు వెళ్లి టర్న్ తీసుకొని రావాలి "అనుకొన్నా.
. లోపలికి వెళ్ళాక మాల్ మూసేసారేమో అని అనుమానం కలిగింది ." లేదు .. గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్స్ లాక్ డౌన్ ముగిసాక ఇంకా ఓపెన్ చెయ్యలేదు . ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్ళండి "అన్నారు . ఫస్ట్ ఫ్లోర్ లో రెండంటే రేండు షాప్స్ ఓపెన్ . మాల్ అంతా ప్రేత కళ. చీకటి . us పోలో షాప్ లో ఒక షర్ట్ కొనుక్కొని వచ్చేసాను . ఈ మాల్ త్వరలో మూసేస్తారు అని అప్పుడే అనుకొన్నాను .
అదే బిల్డింగ్ ను ఇప్పుడు లుల్లూ వారు తీసుకొన్నారు . లోపల ఇంటీరియర్ ఎంత మార్చారో తెలియదు కానీ ఆ బిల్డింగ్ లో ఒక మాదిరి మాల్స్ మాత్రమే సాధ్యం . శరత్ సిటీ మాల్ తో కాదు కదా కనీసం ఇనార్బిట్ మాల్ లో కనీసం సగముండదు . దారి సరిగా ఉండదు . పార్కింగ్ చిన్నది .
లుల్లూ సంస్థకు గత కొంత కాలంగా విపరీత ప్రచారమొచ్చింది . రాజకీయాలు ముడిపడివుండడం వల్ల పబ్లిసిటీ పతాక స్థాయికి చేరింది .
జనాల్లో ఇంగిత జ్ఞానం చచ్చి ఎంతో కాలమయ్యింది .
అది మాల్ మాత్రమే . ఇంద్ర సభో... కుబేరుడి ఇనుప బీరువానో .. ఎల్దారాడానో కాదు . ఇంటి దగ్గర షాప్ లో దొరికేది అంటే... సబ్బులు ఐస్ క్రీం లు లాంటివే... అక్కడా దొరుకుతాయి . కాకపోతే ఎక్కువ కలెక్షన్ .
మాల్ ఎక్కడికీ పారిపోదు . తోలి రోజు మార్నింగ్ షో సినిమా చూడడానికి అదేమీ ఎన్టీఆర్/ చిరంజీవి సినిమా కాదు . .
తోలి రోజే .. ఓ .. ఎగేసుకొంటూ వెళ్లారు . వేలమంది . అసలే ఇరుకు రోడ్ . పార్కింగ్ సరిగ్గా ఉండదు . దానితో గంటల కొద్దీ ట్రాఫిక్ జాం .
లోపల అంగుళంఅంగుళం మనుషులే . ఇక సరుకులు కొనేది ఎక్కడ ? ఎవరైనా వస్తువును తీసుకొన్నా బిల్ చెల్లించే వీలుంటుందా ?
వెళ్లనవారిలో " ఎందుకొచ్చామురా దేవుడా?" అని ఫీలింగ్ . అసలే రెండు గంటల ట్రాఫిక్ జాం .. అటుపై మల్ల యుద్ధం చేసి లోపలికి వెళ్లారు . ఏదైనా తిందామంటే బిల్ ఎక్కడ కట్టాలి? . అసలు వస్తువు తీసుకొని ముందుకు కదలలేని స్థితి . ఈ లోగా ఎవడో స్వీట్ నో బిస్కెట్ ప్యాకెట్ నో .. తీసుకొని ఆరగించడం మొదలెట్టాడు .
వెళ్లిన వారిది గుంపు మనస్తత్వం . అంటే గొర్రె దాటు .. ఒకడు చేస్తే ఇంకొకడు ఆలా చేస్తాడు . అలాంటివారు కాబట్టే కొంపలు అంటుకొని పోయినట్టు... షాపింగ్ చేయకపోతే ప్రాణాలే పోయేట్టు .. తొలి రోజుల్లోనే లగెట్టుకొని వెళ్లారు . { నిజానికి ఇంటినుంచి బయలుదేరేటప్పుడు ఇంత రష్ ఉంటుందని ఎవడూ అనుకొని వుండరు } ..
ఇంత కస్టపడి లోపలికి వచ్చాము .. అలిసివున్నాము అనుకొంటూ అక్కడ దొరికినదాన్ని ఆరగించారు .
తప్పెవరిది ?
" హైదరాబాద్ కు పరువు పోయింది" అని మేధావులు విశ్లేషణలు మొదలెట్టేసారు.
తొక్కేమీ కాదా ?
మీరు అపర నాగరికుల్లా చిత్రీకరించే అమెరికా లో... మాల్స్ లోకి దర్జాగా వచ్చి కావాలిన సరుకులు ఫ్రీ గా పట్టుకొని వెళ్లన ఘటనలు .. మాల్స్ ను లూటీ చేసిన ఘటనలు .. కోకోల్లలు . పైగా అది మానవ హక్కుల పరిరక్షణ .. దీనజనోద్ధరణ అని అక్కడి వ్యవస్థల బిల్డ్ అప్ .
నిద్ర పోయారా ?
లేక తెలిసీ నాటకాలా?
కంపు ఎక్కడైనా కామన్ కదా మేధావి గారూ ?
తప్పెవరిది ?
లుల్లూ తో ఈ ట్రెండ్ మొదలు కాలేదు. పెద్ద పెద్ద షాప్స్ ఓపెనింగ్ కు.. హీరోయిన్స్ కు డబ్బిచ్చి పిలిపించడం. తొలి రోజు ఇంత డిస్కౌంట్ అని పెట్టడం . తొలి రోజే మోత మోగితే తమ వ్యాపారం / మాల్ సూపర్ హిట్ అని నిర్వాహకుల ఆలోచన.
ఐకియా !
హూ కియా రే ?
మెయిఁ తో కుచ్ నహి కియా భాయ్ !
వామ్మో.. మూడేళ్లో.. నాలుగేళ్లో.. అప్పుడు వారు సృష్టించిన హైప్.. అంతా ఇంతా కాదు. "మనం ఇన్నాళ్లు ఇంట్లో వాడిన ఫర్నిచర్ అంతా వేస్ట్. పాలపుంత లో చిట్టచివర ఉన్న కృష్ణ బిలం లో తయారు చేసిన ఫర్నిచర్.. సోఫా సెట్ జస్ట్ ఒక రూపాయి.. కుర్చీ... జస్ట్ పదంటే పది పైసలు. బెడ్... జస్ట్ పావలా. ఈ ఫర్నిచర్ ను కొనకపోతే.. మీ జన్మ వేస్ట్" అని హైప్ క్రియేట్ చేసారు... పది పదహైదు రోజులు తిరునాళ్లలా జరిగింది.
ఇప్పుడేమైంది ?
జనాలకు విషయం బోధపడింది.
చిరిగి చాటయ్యింది.
ప్రకటనలకు ఆశపడి హైప్ క్రియేట్ చేసిన మీడియా ది తప్పు కాదు.
పెద్ద ఎత్తున హైప్ క్రేయేట్ చేసి కనీస ఏర్పాట్లు చేయకుండా ట్రాఫిక్ జాం కు కారణమయ్యారు అని ప్రభుత్వ వ్యవస్థలు... గతం లో కానీ ఇప్పుడు కానీ... షాప్ / మాల్ నిర్వహకులపై చర్యలు తీసుకొన్నా దాఖలాలు ఉన్నాయా.. పోనీ అండీ.. కనీసం భవిష్యత్తులో నైనా ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకొనే ఆలోచన ఏదైనా ఉందా ?
ప్రబుత్వాలది తప్పు కాదు.
మాల్ నిర్వాహకులది తప్పు కాదు. మీడియా ది తప్పు కాదు. ప్రభుత్వ వ్యవస్థలది తప్పు కాదు.
వీరెవరికీ సిగ్గు పోలేదు. ఎందుకంటే బీరు సిగ్గు బిళ్లలను ధరించి వున్నారు
రెండు గంటలు ట్రాఫిక్ జాంలో ఇరుక్కొని లోపలికి వెళ్ళాక, ఒక తినుబండారం కూడా కొనుక్కోలేని స్థితి లో. అక్కడి ఫుడ్ ను తినేసిన.. పిచ్చి పబ్లిక్ది ముమ్మాటికీ తప్పే. సిగ్గు వారికే పొయ్యింది.
అంతేనా మేధావులు చెప్పేది ?
అయితే.. రాబొయ్యే రోజుల్లో మాల్స్/ షాప్స్ ఓపెనింగ్ రోజుల్లో... లూటీలు జరగొచ్చు. సిద్ధంగా వుండండి.
Legacy of Luminaries
కూకట్పల్లి ఏరియాస్ ( ప్రగతి నగర్ , మియాపూర్ రోడ్ , బాచుపల్లి రోడ్ ) ను బెంగళూరు గా పరిగణించవచ్చు. ఎందుకంటే పొద్దున్న ఎనిమిదింటి నుంచి రాత్రి పది దాకా ఇక్కడ ఎప్పుడూ ట్రాఫిక్ జామ్స్. ( లుల్లూ మాల్ ఇప్పుడు. ట్రాఫిక్ జామ్స్ ఎప్పటినుంచో. )
హైదరాబాద్ సిటీ అంతా రోడ్లు మెరుగ్గా ఉంటే ఇక్కడ మాత్రం పరమ చెత్త రోడ్లు. ఎక్కడ చూసినా గుంతలు.

వొంట్లో లో షుగర్ - ఇంట్లో బాధలు !

చిన్న పిల్లల మెదడులో షుగర్ ఎక్కువైతే - ADHD { హైపర్ ఆక్టివిటీ డిసార్డర్ }
పెద్దల మెదడులో షుగర్ ఎక్కువైతే - డెమెన్షియా { మతి మెరుపు వ్యాధి }.
కంట్లో షుగర్ - గ్లూకోమా
దంతాల్లో షుగర్ - పన్ను పుచ్చిపోవడం
చర్మం లో షుగర్ - చర్మం మడతలు .
నిద్రలో షుగర్ - నిద్రలేమి { ఇన్సొమ్నియా }
రక్తం లో షుగర్ - డయాబెటిస్
శరీరంలో అధిక షుగర్ - కాన్సర్ .
ఆహారంలో అధిక షుగర్ - బిలియన్ డాలర్ ఫుడ్ ఇండస్ట్రీ .
సమాజంలో అధిక షుగర్ ను చొప్పించడం - ఫార్మసురుల తంత్రం .
పిజ్జా , బర్గర్ , కోక్ , పెప్సీ మాజా లాంటి డ్రింకులు - పూర్తిగా మానేయండి .
ఐస్ క్రీం లు , చాకోలెట్లులు , బిస్కెట్లు ఇంకా రకరకాల స్వీట్లు , ముఖ్యంగా పార్టీ లలో ఇచ్చే ఆర్టిఫిషల్ స్వీట్నర్లు - అరుదుగా మాత్రమే తీసుకోండి . పూర్తిగా మానేస్తే మేలు .
చక్కర తో చేసిన పదార్థాలు, మైదా - అరుదుగా మాత్రమే తీసుకోండి .
పోలిష్డ్ రైస్ { తెల్లనం } గోధుమ పిండితో చేసిన వంటలు - మీరు ఇప్పుడు తింటున్న దానిలో ఐదో వంతుకు తగ్గించండి .
ఖీర {కుకుంబర్ } ను రోజూ తినండి .. వీలయితే ప్రతి పూట ఒక ఖీర తినండి .
సొర కాయ, దోస కాయ , బెండకాయ , వంకాయ , మునక్కాయ , పొట్లకాయ లాంటి కాయగూరలు - బాగా ఎక్కువగా తినండి { సాంబారు , ఫ్రై లు గా చేసి. తగ్గించిన అన్నం స్థానం లో ఇది; పొట్ట నింపేలా }
రాత్రి నానబెట్టి ప్రతి రోజు పొద్దున్న మూడేసి వాల్నుట్స్ , అల్మొన్డ్స్ , పిస్తా తినండి . ఆ నీరు తాగండి .
ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర , తోటకూర ఎక్కువగా తినండి .
ప్రోటీన్ కోసం మాంసాహారులు చికెన్ , ఫిష్ , ఎగ్, మటన్ శాఖాహారులు పుట్టగొడుగులు , పన్నీర్ బ్రోకలీ తినండి . మీ బడ్జెట్ బట్టి వీటిని వీలైనంత ఎక్కువ తినండి . ప్రోటీన్ తింటే కిడ్నీ సమస్యలు వస్తాయి అనే ప్రచారం బూటకం . ఇది వరకే కిడ్నీ సమస్యలు ఉన్నవారి సంగతి వేరు . చికెన్ , ఎగ్స్ తింటే అనారోగ్యం అనే ప్రచారం లో కూడా నిజం లేదు .
ఆయా కాలాల్లో దొరికే పళ్ళు తినండి . పళ్ళు తింటే షుగర్ రాదు . ఇది వరకే అధిక షుగర్ ఉన్న వారు బియ్యం , గోధుమ లాంటి వాటితో చేసిన వంటకాలు తగ్గిస్తే షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది . అలాంటప్పుడు సాయంకాలం తక్కువ తీపి ఉన్న జామ , బొప్పాయి ఇంకా పుల్లగా ఉన్న బ్లూ బెర్రీ, కివి లాంటి పళ్ళు తింటే ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువవుతుంది . షుగర్ సమస్య పోతుంది .
వేరుశనిగ గింజెలు , నువ్వులు , ఆలివ్ నూనె{ వంటకాల్లో } .. వీటిని తరచూ తీసుకోండి .
రోజుకు పురుషులు -నాలుగు.. స్రీలు- మూడు.. లీటర్ల నీరు తాగితే కిడ్నీ సమస్య దరిచేరదు.
రోజుకు ఆరు గ్రాముల లోపు ఉప్పు తీసుకొంటే కీళ్ల నొప్పులు , అధిక బిపి సమస్య రాదు . అధిక ఉప్పు అనేక రోగాలకు కారణం .
గుర్తుంచుకోండి - చక్కర , ఉప్పు, మైదా , తెల్లనం - వైట్ పాయిజన్స్ .
ఆహారమే ఆరోగ్యం .
ముఖ్యంగా పిల్లలకు ఆరోగ్యకరమయిన ఆహారపు అలవాట్లు నేర్పండి.

కూకట్పల్లి లుల్లూ మాల్ ఇంతవరకు వెళ్ళలేదు.

రెండేళ్లయినా ikea కు ఇప్పటిదాకా వెళ్ళలేదు.
ఏమైనా అపచారం చేస్తున్నామేమో అని డౌట్ అనుమానంగా ఉందండీ.

గ్లోబలైజేషన్ అనగానేమి ?

“ భీమవరం రాజు గారి బిర్యానీ “ లాస్ వేగాస్ లో “
కాలిఫోర్నియా బుర్రిటో “ హైదరాబాద్ లో దొరకడాన్నే గ్లోబలైజేషన్ అందురు !
భారతీయులు ఇండియా లో వున్నప్పుడు .. కాంటినెంటల్ , చైనీస్ , మెక్సికన్ , మండి ( Arabic) జాపనీస్ , థాయ్ ఫుడ్స్ ను ఆర్డర్ చేసుదురు. అదే ఫారిన్ పోయినప్పుడు ఇండియన్ restaurant కోసం వెదుకులాడి మరీ ఇండియన్ ఫుడ్ నే తిందురు ! కారణం ?
మొదటి చర్యకు కారణం భార్య వంట.
రెండోదానికి కారణం అమ్మ వంట గుర్తుకు రావడం !
����

మొగిలిచెర్ల నాగమణి భగవతారిణి !

The story is good. The ending is not good.

ఒక వ్యక్తి ఒక పాత్రలో దూరి అభినయిస్తే ?

.. ఏకపాత్రాభినయం .
ఒకే వ్యక్తి అనేక పాత్రలు అభినయిస్తే ?
కేవలం అభినయించడం కాదు .. దానికి పాటలన్ని పద్యాల్ని జోడించి... వాటికి తగ్గట్టు నృత్యం చేస్తే ?
అదే హరికథ .
ఆదిభట్ల నారాయణ దాసు .. హరికథా పితామహుడు . తెలుగు జాతికి హరికథను పరిచయం చేసిన స్రష్ట . ఆయన శిష్యుడు నీతి నారాయణ భాగవతులు అటు పై ఆ కళను మరింత ముందుకు తీసుకొని వెళ్లారు . ఒక నాడు వాడవాడలా, వివాహాలు , పండగలు ఇతరత్రా శుభసందర్బాల్లో హరికథలు నిర్వహించేవారు .
శంకర నారాయణ గారు . మనసున్న కోటీశ్వరుడు . మనిషి అనే పదానికి అసలైన నిర్వచనం . కోట్ల రూపాయిలు వెచ్చించి ఇండోనేషియా , కంబోడియా లాంటి దేశాల్లో హిందూ దేవాలయాలని పునరుద్దరించే కార్యక్రమం చేపట్టారు . మొత్తం మూడు వందల కు పైగా హరికథా భాగవతులు / భగవతారిణులను గుర్తించి వారిలో ఒక్కొక్కరికి కరోనా కాలం లో చెరి పది వేలు చొప్పున మూడు నాలుగు సార్లు బహూకరించారు .
కే కే రాజా .. మరో మహా వ్యక్తి . సామాజిక సేవ రంగాల్లో ఉన్న ఎంతోమందిని గుర్తించి వారికి ఇతోధికంగా ప్రోత్సాహం అందిస్తున్నారు .
ఇప్పుడు హరికథకుల సగటు వయసు 55 ఏళ్ళు. ఇప్పుడు కొత్త తరం దీని వైపు చూడడం లేదు . "కొత్త తరం హరికథకులను తయారు చెయ్యాలి .. దానికి ఎంత ఖర్చైనా ఫరవా లేదు" అని శంకర నారాయణ గారి ఆలోచన . కేకే రాజా గారు ఆయనకు నా గురించి చెప్పారు .
స్టేజి ఫియర్ పోయి ఆత్మ విశ్వాసం చేకూరడం , తెలుగు భాషపై ఆ మాటకొస్తే ఏ భాష అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడడం .. సామాజిక ఇంకా భావోద్వేగ తెలివితేజాలు అలవడడం లాంటి అనేక ప్రయోజనాలు హరికథ చెప్పడం వల్ల... వినడం వల్ల అలవడుతుంది , ఒకప్పుడైతే హరికథ చెప్పేవారు దీన్ని పూర్తి స్థాయి వృత్తిగా స్వీకరించేవారు . నేటి తరం తమకిష్టమైన సాఫ్ట్ వెర్ ఇంజనీరింగ్, మెడిసిన్, స్పేస్ సైన్స్, రోబోటిక్స్, ఐఏఎస్ లాంటి వృత్తి / సర్వీస్ లలోకి వెళ్లినా.. ఒక ప్రవృత్తిగా హరికథ ను చెప్పడం నేర్చుకొని కొనసాగించవచ్చు అనే ప్రణాలికను { నిన్న దాన్ని పోస్ట్ చేశాను .. అది ఆంగ్లం లో వుంది } తయారు చేశాను . హై స్కూల్ దశలో కొంతమంది ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి వారికి నెలకు ఇంత అని స్కాలర్షిప్ ఇచ్చి హరికథను నేర్పడం .. ఇదే క్లుప్తంగా ప్రణాళిక .
నిన్న ఆదివారం రాత్రి హైదరాబాద్ శంకర్ మఠం లో ఆదిభట్ల నారాయణ దాసు 159 జయంతి , వారి శిష్యులు నీతి నారాయణ భాగవతుల వారి 125 జయంతి ఉత్సవాలు జరిగాయి . ఈ సందర్భంగా మొగిలిచర్ల నాగమణి భగవతారిణి గారిచే రుక్మిణి కళ్యాణం , అటు పై బుర్ర పద్మనాభ గారిచే హనుమత్ సందేశం హరికథా పారాయణం జరిగింది . చెరి రెండు గంటలు ఇద్దరు కథకులూ, ప్రేక్షకులకు మాటల్లో వర్ణించ లేని అనుభూతినందించారు .
వినోదం పేరుతొ లైఫ్ స్కిల్స్ .. నాయకత్వ లక్షణాలు . ఇదీ హరికథ .
వినోదం పేరుతొ హింస సెక్స్ ఉద్రేకం .. ఇదీ నేటి వెబ్ ప్రపంచం .
ఎక్కడినుంచి ఎక్కడి దాకా పయనం ??!!!
హరికథను కొత్త తరానికి తగ్గట్టు తిరిగి నిలబెట్టే బృహత్ప్రయత్నం
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?
If one person enters into a character and performs it?

*ఎయిర్ పోర్ట్ లో, ఎవరైనా వాటర్ బాటిల్ లేదా కూల్ డ్రింక్ కొద్దిసేపు పట్టుకోవడానికి అంగీకరించ వద్దు . ఈ హెచ్చరిక ఎయిర్‌పోర్ట్‌లో పని చేసే ఒక అధికారి నుండి వచ్చింది. జాగ్రత్త* !!!! విమానాశ్రయంలో ఎవరైనా వారి వాటర్ బాటిల్ లేదా ఇతర వస్తువులను పట్టుకుని, (వృద్ధులు లేదా గర్భిణీ స్త్రీ అయినా) అంగీకరించ వద్దు. ఏ సహాయం చేయవద్దు. మీరు కొకైన్ లేదా చట్టవిరుద్ధమైన డ్రగ్స్ కలిగి ఉన్నందుకు అరెస్టు చేయబడవచ్చు. సింగపూర్ లేదా దుబాయ్‌లో అయితే మరణశిక్ష!


వైరల్ జ్వరాలు ఎందుకు వస్తున్నాయి ?

ఇప్పుడు అనేక ఇళ్లల్లో వైరల్ జ్వరాలు ! పది రోజులయినా తగ్గడం లేదు. మీ విశ్లేషణ కావలి సార్! “.
మెసెంజర్ లో ఒక మిత్రుడి రిక్వెస్ట్.
వైరస్ ఒక సారి సోకితే , ఆ యాంటీబోడీ లు 6 నుంచి 9 నెలలు ఉంటాయి. అటుపై ఇంకో సారి సోకవచ్చు.
కింది న్యూస్ క్లిప్స్ చూడండి. 2022 జనవరి లో అటుపై అదే సంవత్సరం ఆగష్టు లో .. ఈ సంవత్సరం మార్చ్ లో .. మళ్ళీ ఇప్పుడు.
ఒకప్పుడైతే కేవలం ఫ్లూ వైరస్ .. ఇప్పుడు కరోనా కూడా ( కేవలం ఫ్లూ వైరస్ అంటే అది ఒక్కటే వైరస్ అని కాదు. ఇలా సీజనల్ గా ముక్కు ద్వారా వ్యాపించేది అనే అర్థంలో చెప్పా ).
కాబట్టి అప్పుడప్పుడు వైరస్ లు సోకుతాయి.
యాంటీబోడీ లు ఎల్లకాలం వుండవు.
కానీ టి సెల్స్ రక్షణ ఉంటుంది.
ఒక సారి వైరస్ సోకితే టి సెల్స్ దాన్ని గుర్తు పెట్టుకొని తిరిగీ సోకితే దాడి చేస్తాయి.
వైరల్ ఫీవర్ లు కొత్త కాదు . దానికి అంత సీన్ ఉండేది కాదు . కానీ ఇప్పుడు పరిస్థితి బిన్నం వాక్ సీన్ కు ముందు. అది వేసుకున్నాక అదీ తేడా !
రీ -ఇన్ఫెక్షన్స్ సహజం. కానీ ఇప్పుడు ఇమ్మ్యూనిటి వీక్ కావడం వల్ల వైరల్ ఫీవర్ ఎక్కువ ప్రభావం చూపుతోంది.
ఇమ్మ్యూనిటి ని బలోపేతం చేసుకోండి.
1. సరైన నిద్ర , విశ్రాంతి.
2. ఆందోళన స్ట్రెస్ భయానికి దూరంగా వుండండి.
3. ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోండి.
3. ఆకుకూరలు కాయగూరలు సమృద్ధిగా తీసుకోండి.
4 సి విటమిన్ కోసం నిమ్న రసం అప్పుడప్పుడూ కర్రీ లో . డి విటమిన్ కోసం ఎండలో నడవడం. జింక్ కోసం నల్ల ద్రాక్ష ( ఎండిన ద్రాక్ష - కిస్మిస్ )
5 పురుషులు నాలుగు ; స్రీలు మూడు లీటర్ ల నీరు రోజుకు.
6 అల్లం సుగంధ ద్రవ్యాలు ఆహారం లో అప్పుడప్పుడూ.
తెల్లనం తక్కువ. రాగులు జొన్నలు లాంటివి అప్పుడప్పుడూ.
7. అన్నింటికీ మించి కరోనా ఫ్లూ వాక్ సీన్ లకు దూరంగా
Why are viral fevers occurring?
Why are viral fevers occurring?
Why are viral fevers occurring?
Why are viral fevers occurring?
Why are viral fevers occurring?
Why are viral fevers occurring?

హరికథ కళను పునరుద్ధరించడం

హరికథ ఒక సాంప్రదాయ కళారూపం. సంగీతం, నృత్యం, కథా కథనం — ఇవన్నీ ఒకే కళారూపంలో కలగలిసిన అద్భుతమైన కళ!

ఇతర కళారూపాల్లో గాయకులు, నృత్యకారులు, కథా కథనకారులు విడివిడిగా తమ కళను ప్రదర్శిస్తారు. కానీ హరికథలో ఒకే వ్యక్తి ఇవన్నీ చేస్తారు.

✅ హరికథ అనేది సాధారణంగా మతం లేదా సాధువుల జీవితాలకు సంబంధించిన అంశాలతో కథను నాటకీయంగా చెప్పే కళారూపం.

✅ ఆదిభట్ల నారాయణ దాసు ఈ కళారూపాన్ని ప్రారంభించి, తెలుగు మాట్లాడే ప్రజల్లో విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు.

ఈ కళారూపం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది.

✅ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో అనేక గ్రామాల్లో పాండవులకు అంకితమైన దేవాలయాలు ఉన్నాయి.

సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో అంటే వేసవి కాలంలో అక్కడ 18 రోజుల పాటు హరికథా కాలక్షేపం నిర్వహించేవారు!

✅ గతంలో ప్రతి సంవత్సరం హరికథా కాలక్షేపం నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతోంది.

✅ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతంలో హరికథా కాలక్షేపం జరిగే ప్రాంతం అన్ని వయసుల ప్రజలతో కిక్కిరిసిపోయేది.

కానీ ఇప్పుడు చాలా సందర్భాల్లో 50–100 మంది కూడా ఉండడం లేదు.

100 మందికి మించి వస్తే అదే ఒక వార్త!

ఆ 100 మందిలో కూడా...

దాదాపు 80–85 మంది 60 సంవత్సరాలు పైబడినవారే.

అంటే యువతరం ఈ కళారూపం వైపు ఆకర్షితులు కావడం లేదు!

✅ యువతరం హరికథకు దూరం కావడానికి కారణాలు:

  1. టీవీలు, మొబైళ్లు, యూట్యూబ్, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావం... యువత వీటి వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.

  2. హరికథా కాలక్షేపం జరిగే ప్రదేశాల్లో నేలపై కూర్చోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో యువత నేలపై కూర్చోవడానికి అలవాటు పడలేదు. దాంతో కాళ్లు నొప్పి పెడతాయి.

కుర్చీలు ఏర్పాటు చేయడం చాలా అరుదుగా జరుగుతుంది.

  1. హరికథ దాదాపు రెండున్నర నుంచి మూడు గంటల పాటు సాగుతుంది! ఇంత సమయం కేటాయించడం యువతకు కష్టంగా అనిపిస్తోంది.

  2. ఈ రోజుల్లో ప్రజలకు ఓపిక తగ్గిపోయింది. యూట్యూబ్ ఛానళ్లలో కూడా 9–11 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న వీడియోలకు వ్యూస్ తగ్గిపోతాయి.

అంటే యువత తక్కువ నిడివి ఉన్న వీడియో కంటెంట్‌ను కోరుకుంటున్నారు.

  1. చిత్తూరు మినహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లో హరికథా కాలక్షేపాలు క్రమం తప్పకుండా నిర్వహించబడటం లేదు. శివరాత్రి లేదా ఇతర పండుగల సందర్భంగా అప్పుడప్పుడు దేవాలయాల్లో మాత్రమే హరికథలు నిర్వహిస్తున్నారు.

✅ పై కారణాలన్నింటి వల్ల హరికథా భాగవతరణం తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పోతోంది.

✅ కళాకారులు ఈ కళను నేర్చుకోవడానికి 2–3 నెలలు శ్రమిస్తారు. కానీ ఈ కళకు డిమాండ్ లేదు.

వారికి లభించే అవకాశాలు తగ్గిపోతున్నాయి. వారిలో ఎక్కువ మంది నెలకు సగటున ₹5,000 కూడా సంపాదించలేకపోతున్నారు. పైగా ప్రదర్శనల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి, ఆ గ్రామంలో 18–20 రోజులు ఉండాల్సి వస్తుంది!

అత్యధికంగా సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే ప్రదర్శనకు ఆహ్వానం వస్తుంది.

సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు ₹1 లక్ష వచ్చినా, దీనిని ఇక పూర్తి స్థాయి వృత్తిగా పరిగణించడం కష్టం!

✅ దీనివల్ల యువత హరికథపై ఆసక్తి కోల్పోయింది. హరికథను కెరీర్‌గా ఎంచుకునే వారు కూడా లేకుండా పోతున్నారు.

✅ తిరుపతిలోని మ్యూజిక్ కాలేజీలో ఒక లెక్చరర్, అలాగే తెలనికి సమీపంలోని మరో కళాశాలలో ఒక లెక్చరర్ కొంతమంది విద్యార్థులకు ఈ కోర్సును బోధిస్తున్నారు.

✅ ఇలా కొనసాగితే, హరికథా కాలక్షేపం అనే ఈ సాంప్రదాయ కళారూపం చరిత్ర పుటల్లో మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

అయితే దీన్ని ఎలా పునరుద్ధరించాలి?

✅ కేవలం ఈ కళ అంతరించిపోతున్నదని చెప్పి విద్యార్థులను హరికథ నేర్చుకోమంటే వారు ముందుకు రారు. వారి తల్లిదండ్రులు కూడా అనుమతించరు.

✅ విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంజినీరింగ్, మెడిసిన్, సాఫ్ట్‌వేర్ వంటి వృత్తులనే కోరుకుంటున్నారు.

✅ అబ్బాయిల విషయంలో తల్లిదండ్రులు హరికథను కెరీర్‌గా ఎంచుకోవడం తమకు ప్రతిష్ఠ తగ్గినట్లుగా భావిస్తున్నారు. అమ్మాయిల విషయంలో కూడా ఇతర విద్యలు నేర్చుకోవాలని కోరుకుంటున్నారు.

✅ కొంతమంది తీవ్రమైన అభిమానులు తప్ప, హరికథను పూర్తి స్థాయి వృత్తిగా ఎవరూ ఎంచుకోవడం లేదు.

ఏం చేయవచ్చు?

1. హరికథ నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

i. భాషపై మంచి పట్టు వస్తుంది.

ii. ప్రేక్షకుల ముందు ప్రదర్శన ఇవ్వాల్సి ఉండటంతో స్టేజ్ ఫియర్ పోతుంది.

iii. సంగీతం, నృత్యం, కథా కథనం/నాటకీయ ప్రదర్శనపై పట్టు వస్తుంది.

అందువల్ల హరికథ వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడుతుంది. భవిష్యత్తులో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది.

2. హరికథా కాలక్షేపాన్ని పూర్తి స్థాయి వృత్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

ఎవరైనా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్/ఐపీఎస్ అధికారి లేదా రోబోట్ సైంటిస్ట్ కావచ్చు... అదే సమయంలో తమ ఆఫీస్‌లో లేదా తమ కమ్యూనిటీలో హరికథలు ప్రదర్శించవచ్చు.

రాబోయే రోజుల్లో దీనికి మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.

✅ కంటెంట్‌ను ఆధునీకరించాలి.

✅ ఎలాంటి కంటెంట్‌ను తగ్గించకుండా, దాన్ని సరిగ్గా విభజించి 30–40 నిమిషాల చిన్న భాగాలుగా రూపొందించవచ్చు.

✅ ఉదాహరణకు, మహాభారతంలోని శ్రీకృష్ణ పాండవీయం ఘట్టాన్ని తీసుకుందాం. అర్జునుడు, దుర్యోధనుడు ద్వారకకు వెళ్లి, మహాయుద్ధంలో శ్రీకృష్ణుడి సహాయం కోరే కథ!

ద్వారకలో శ్రీకృష్ణుడు నిద్రిస్తూ ఉంటాడు. ముందుగా దుర్యోధనుడు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుంటాడు. ఆ తర్వాత ఆయన తల దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు. కొంతసేపటి తర్వాత అర్జునుడు వచ్చి శ్రీకృష్ణుడి పాదాల దగ్గర కూర్చుంటాడు.

శ్రీకృష్ణుడు నిద్ర లేచినప్పుడు ముందుగా అర్జునుడిని చూస్తాడు. అప్పుడు దుర్యోధనుడు అభ్యంతరం వ్యక్తం చేస్తాడు... ఈ ఒక్క సన్నివేశాన్నే ఒక స్వతంత్ర కథగా ప్రదర్శించవచ్చు.

తర్వాత శ్రీకృష్ణుడు పాండవులను కలుస్తాడు. వారితో మాట్లాడుతాడు. విదురుడిని కలుస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ రాయబారం ప్రారంభమవుతుంది.

✅ ఇలాంటి 4–5 సన్నివేశాలను కలిపి మూడు గంటల ప్రదర్శనగా చేస్తారు. కానీ ఈ రోజుల్లో యువతకు అది ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు.

✅ అదే కంటెంట్‌ను చిన్న చిన్న భాగాలుగా విభజించి, కథనంతో పాటు కొంత భరతనాట్యం/కూచిపూడి నేర్పితే, వాటన్నింటినీ కలిపి ప్రదర్శించవచ్చు.

✅ ఇప్పటివరకు హరికథలు సత్య హరిశ్చంద్ర కథ, మహాభారతం వంటి సాంప్రదాయ అంశాలతో ముడిపడి ఉన్నాయి. అయితే నేటి విద్యార్థులు, వారి జీవితాలు, విద్యార్థుల ఆత్మహత్యలు, విదేశాల్లో జీవితం వంటి ఆధునిక/ప్రస్తుత సమస్యలను కూడా హరికథలో చేర్చవచ్చు. యువతను ఆకర్షించే, వారికి ఆసక్తి కలిగించే అనేక అంశాలను తీసుకోవచ్చు.

అవసరమైనది సృజనాత్మకత మరియు ఆసక్తి మాత్రమే.

✅ సరైన పాటలను, సరైన కూర్పును ఎంచుకుని, కంటెంట్‌ను హరికథ రూపంలో చెప్పవచ్చు.

✅ బుర్రకథలో కూడా ఇలాంటి సమకాలీన/ప్రస్తుత అంశాలను కథలుగా చెప్పేవారు. కానీ ఆ కళ కూడా ఇప్పుడు కనుమరుగైంది.

✅ హరికథ కళను పునరుద్ధరించాలంటే, దాని కంటెంట్‌ను కూడా ఆధునీకరించాలి.

✅ ఇప్పటివరకు హరికథపై ఆసక్తి ఉన్నవారు గ్రాడ్యుయేషన్ తర్వాత దీన్ని పూర్తి స్థాయి కోర్సుగా నేర్చుకునే అవకాశం ఉండేది. తద్వారా దీన్ని పూర్తి స్థాయి వృత్తిగా స్వీకరించవచ్చు.

✅ ఇప్పుడు చాలా మంది దీన్ని పూర్తి స్థాయి ఉద్యోగంగా ఎంచుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్నారు. అలాంటి కోర్సుల్లో ప్రవేశం లభించక సాధారణ డిగ్రీ చేసే వారు, అలాగే హరికథపై ప్రత్యేక ఆసక్తి ఉన్నవారు మాత్రమే హరికథ శిక్షణ వైపు వస్తున్నారు.

✅ అయితే 8వ తరగతి నుంచే ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టవచ్చు.

ఎంపిక ప్రమాణాలు:

���� పిల్లలకు మంచి బేస్ వాయిస్ ఉండాలి.

���� వారికి సంగీతం, నృత్యం (కూచిపూడి/భరతనాట్యం)పై ఆసక్తి, కనీస ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.

���� వారి స్వరంలో స్పష్టత ఉండాలి.

���� ఎంపిక చేసే విద్యార్థుల సంఖ్య కూడా పరిమితంగా ఉండాలి.

✅ దాతలు ముందుకు వచ్చి నెలకు ₹1,000–₹1,500 వరకు కొంత స్టైపెండ్ అందిస్తే మంచిది.

✅ ఈ కోర్సు పాఠశాల సమయం తర్వాత ఉంటుంది కాబట్టి, తల్లిదండ్రులు పిల్లలను తీసుకువచ్చి తిరిగి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ స్టైపెండ్ వారికి ఒక ప్రోత్సాహకంగా ఉంటుంది.

✅ 2–3 మంది హరికథా భాగవతులు/భాగవతారిణులను నెలవారీ స్థిర వేతనం లేదా కోర్సు ప్రాతిపదికన నియమించి, ఒక కోర్సు కరిక్యులమ్‌ను రూపొందించవచ్చు.

శనివారం మూడు గంటల పాటు తరగతులు నిర్వహించవచ్చు. అవసరాన్ని బట్టి, పాఠశాల సమయానికి ఇబ్బంది కలగకుండా కొన్ని ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహించవచ్చు.

✅ 10వ తరగతి నుంచి ప్రారంభించాలని ఆలోచించవచ్చు. కానీ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి ఉంటుంది కాబట్టి వారు ఈ కోర్సుపై దృష్టి పెట్టలేరు.

✅ ఇంటర్మీడియట్ మరింత కష్టమైన దశ. అది విద్యార్థి జీవితంలో ఒక కీలకమైన మలుపు.

✅ అందువల్ల విద్యార్థి 8వ తరగతిలో ఉన్నప్పుడే కోర్సును ప్రారంభించాలి. 9వ తరగతిలో కొనసాగించాలి. 10వ తరగతిలో నవంబర్ వరకు కొనసాగించి, ఆ తర్వాత బోర్డు పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్, మే నెలల్లో మళ్లీ కొనసాగించాలి.

✅ అవసరమైతే సెలవుల్లో కూడా ఒక వారం పాటు తరగతులు నిర్వహించవచ్చు.

✅ ఈ విధంగా ప్రణాళిక చేస్తే మూడు సంవత్సరాల కోర్సుగా రూపొందించవచ్చు. ఇంటర్మీడియట్‌లో హరికథ శిక్షణను కొనసాగించలేని వారు డిగ్రీ ప్రారంభించినప్పుడు మళ్లీ చేరవచ్చు.

✅ కోర్సు పూర్తి చేసిన వారికి సంస్థ తరఫున కోర్సు సర్టిఫికెట్లు అందించవచ్చు.

✅ వారు ప్రేక్షకుల ముందు మాత్రమే ప్రదర్శనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో ఆధునిక హరికథగా ప్రచురించవచ్చు.

✅ సినిమా కంటెంట్, స్టేజ్ ప్రదర్శనలు, తమ కార్యాలయాల్లో ప్రదర్శనలు వంటి వాటిలో కూడా తమ సృజనాత్మకతను ఉపయోగించవచ్చు. కళ యొక్క పవిత్రతను కాపాడుతూనే దాన్ని ఆధునీకరించవచ్చు.

✅ ఇదే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన సారాంశం.

(ఇది ఒక ప్రాథమిక డ్రాఫ్ట్ మాత్రమే. ప్రూఫ్ రీడింగ్ ఇంకా పూర్తికాలేదు. హరికథ కళను పునరుద్ధరించాలనే ఈ ప్రతిపాదనను ఈ కార్యక్రమం పట్ల నిబద్ధత ఉన్న ఒక దాతకు సమర్పించడానికి సిద్ధం చేస్తున్నాము.)

The story is good. The ending is not good.

Amarnath Vasireddy - Facebook Posts

Explore years of consistent wisdom, organized by journey milestones from 2010 to 2026