“ చెప్పండి అమర్నాథ్ గారూ ! కొత్త సంవత్సరం వేడుకలను మీరు ఏ విధంగా చూస్తారు ?”

“ కళ్ళతో ..”
“ అలా కాదు ! ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్ని చేసుకొంటోంది కదా ! దీన్ని మీరు ఎలా గమనిస్తారు “
“ టీవీ ల ద్వారా .”
“ న్యూ ఇయర్ వేడుకల గురుంచి మీరు ఏమనుకొంటున్నారు ?”
ఇంకా ఏమీ అనుకోలేదు “
“ న్యూ ఇయర్ గురుంచి అమర్నాథ్ గారు ఇంకా ఏమీ అనుకోని పరిస్థితిని మనం గమనిస్తున్నాము. “
“ ఆంగ్ల సంవత్సర వేడుకల్ని మనం జరుపుకోవడం సరైనదేనా ? అని అమర్నాథ్ గారిని అడగండి.
“చెప్పండి అమర్నాథ్ గారు ! “
“ ఈ రోజు తేదీ చెబుతారా “
“
31 డిసెంబర్ ! “
“ అది కాదండీ ! శక సంవత్సరం లేదా శాలివాహన సంవత్సరం లేదా విక్రమ నామ సంవత్సరం తేదీ చెప్పండి “
“ ఓవర్ to స్టూడియో “

ఇంకొన్ని డౌట్ అనుమానాలు !

మనుషులు చనిపోతేనే దెయ్యాలుగా మారుతారా?
జంతువులు దెయ్యాలుగా మారవా ?
కోడి పందేల్లో అర్ధాంతరంగా మరణించిన కోడి పుంజు దెయ్యంగా మారి , పందెం రాయుడిని పీక్కు తినదా?
మనం కొట్టి చంపిన పాము దెయ్యంగా మారి మనపై కక్ష తీర్చుకోదా?
మనుషుల్లో శాఖాహారులు మాంసాహారులు వున్నట్టే దెయ్యల్లో ఉంటాయా ?
దెయ్యాలు పచ్చి మాంసం తింటే వాటికి జీర్ణాశయ సమస్యలు రావా ?
దెయ్యాలు టాయిలెట్ ఎక్కడ పోతాయి ?
దెయ్యాలకు జిం లు ఉంటాయా ?
నాన్ వెజ్ దెయ్యాలు ఆదివారం రోజే తింటాయా ? లేదా రోజూనా ??

నాకో డౌట్ అనుమానం !

దెయ్యాన్ని చూస్తే మనిషి భయపడుతాడు! కానీ మనిషిని చూసి దెయ్యం భయపడదు!
అలాంటప్పుడు దెయ్యాలు ఎక్కడో స్మశానాల్లో అడవుల్లో బూతు బంగళాలో ఎందుకుంటాయి ?
చక్కగా మనుషుల్ని భయపెట్టి తరిమేసి స్కై విల్లా లు , విల్లాలు స్టార్ హోటల్స్ ఎందుకు ఆక్రమించు కోవు?
ఇంకో డౌట్ అనుమానం !
పాతకాలం దెయ్యాలంటే ఏదో అనుకోవచ్చు.
ఇప్పుడు బ్యూటీ పార్లోర్ లు వున్నా అవి నీట్ గా మేక్ అప్ చేసుకోకుండా చింపిరి జుట్టు పాలిన మొఖం తో ఎందుకుంటాయి ?
దెయ్యాల కోసమే ఒక ఫుడ్ జాయింట్ , ఒక బ్యూటీ పార్లర్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ నడిపితే బిజినెస్ ఎలా వుంటుందంటారు ?

సూరీడు రాకతో పొగమంచు మాయం.

విమానం సరైన సమయానికే !
ఇప్పుడే విజయవాడ ఎయిర్పోర్ట్ చేరిక
( ఇందాక పోస్ట్ లో పేను పద ప్రయోగం గురుంచి. పేను కు పెత్తనం ఇస్తే తలంతా గొరిగింది అని సామెత. తాంబూలం తో వెళ్లిన వారి పేరు పుట్టిన సమయం పుట్టిన స్థలం బట్టి నక్షత్ర ఫలాలను చెప్పడం జ్యోతిష్యం. యూట్యూబ్ ఛానల్ లో కూర్చొని అడగని వారి గురుంచి చెప్పడం ఆధునిక పేను లక్షణం. వారు పుట్టిన తేదీ అంతకు మించి పుట్టిన సమయం స్థలం వివరాలు పేనుకు ఎలా వచ్చాయి. అడగని వారి జ్యోతిష్యం చెప్పడం ధర్మ విరుద్ధం. అయినా అది జీకే. జ్యోతిష్యం కాదు )
Fog disappears with the arrival of the sun. The flight is at the right time!

విజయవాడ కు వెళ్ళాలి.

10 .25 ఫ్లైట్
ఉదయం ఎనిమిదికి కూడా విజయవాడ ఎయిర్పోర్ట్ లో పొగమంచు.
6 .25 కు బయలుదేరాల్సిన ఫ్లైట్ కూడా ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే.
ఇప్పుడు నేను కార్ లో విజయవాడ కు వెళుతానా లేదా ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఫ్లైట్ లోనా ? ????
నాకే తెలియదు.
పేను స్వామి చెబుతాడేమో తెలియదు. ����
Fog disappears with the arrival of the sun. The flight is at the right time!

“ స్లిమ్ గా కనిపించాలని డైటింగ్ చేస్తున్న హీరోయిన్ ! “

ఒక వెబ్ పేజీ లో న్యూస్ ఐటెం .
గట్టిగా వంద వ్యూస్ కూడా రాలేదు.
ఇలా అయితే ప్రకటనల ఆదాయం తగ్గి వెబ్ సైట్ మూసెయ్యాల్సి వస్తుందని భయపడిన యాజమాన్యం బ్రహ్మానందం అనే ట్రెండ్ తెలిసిన వ్యక్తిని ఇంచార్జి గా నియమించింది.
“ ఆమె ఆ పని చేయడానికి అదేనా కారణం ? “
ఇదీ బ్రహ్మానందం మార్చిన హెడ్డింగ్!
హీరోయిన్ వివరాలు .. అటుపై ఆమె డైటింగ్ చేస్తోందని .. సన్నాబడాలని ఆలోచన అని వార్తా కథనం.
ఒక్క రోజులో మిలియన్ వ్యూస్ !
“ తన కోరిక తీర్చమని బహిరంగంగా అడిగేసిన హీరోయిన్. .. ఎవరినో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే “
.. ఇది మరో న్యూస్ ఐటెం.
డైటింగ్ చేస్తున్న హీరోయిన్ , తనకు పనీర్ -65 తినాలని ఉందని , మంచి హోటల్ నుంచి తెచ్చిపెట్టాలని ప్రొడక్షన్ మేనేజర్ ను అడిగిందని కథనం.
చదివేవాడు వెబ్ పాఠకుడైతే కోటి సార్లు వాడి కుతూహలం తో కబ్బాడి ఆడుకోవచ్చు !
— వెబ్ యుగపు కొత్త సామెత. ��������
శుభోదయం !

టీచర్ పిల్లాడ్ని కొట్టినా , పిల్లాడు టీచర్ ను కొట్టినా టీచర్ దే తప్పు.

స్కూల్ కు సరిగా రాక , వచ్చినా పాఠం సరిగా వినక పిల్లలకు మార్కులు తక్కువొస్తే తప్పు టీచర్ దే !
సెల్ ఫోన్ లో రాత్రంతా నీలి చిత్రాలు చూసి .. స్కూల్ లో లేడీ టీచర్ ను కొంటెగా చూసి .. నోట్ బుక్ లో టాయిలెట్ ఆమె నగ్న చిత్రం గీస్తే … బతకడం కోసం ఇలాంటివి పట్టించుకోకూడదు.
వోడ్కా/ విస్కీ తాగి .. గంజాయి కొట్టి స్కూల్ కు వస్తే “ పాపం పిల్లలు “ అని సర్దుకోవాలి.
ప్రభుత్వ ప్రైవేట్ గ్రామీణ ఇంటర్నేషనల్ - అన్ని చోట్లా అదే సీన్.
బతక లేక బడిపంతులు.
If teacher beats the child, if the child beats the teacher, it is teacher's fault.

హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇండిగో విమానం ఎక్కి వేరే ప్రాంతానికి వెళుతున్నారా ?

అందునా మీ ఫ్లైట్ పొద్దున్న అయిదు - ఏడు ప్రాంతం లో ఉందా ?
అయితే అర్ధ రాత్రి ఎయిర్పోర్ట్ కు చేరుకోవలసిందే!!
ఒకప్పుడయితే స్పైస్ జెట్ , గో ఎయిర్ లాంటి అనేక సర్వీస్ లుండేవి. ఇప్పుడేమో ఇండిగో మాత్రమే.
( ఇదో మాయాజాలం. ఆ కథ వేరు ! )
వాడిది చెత్త సర్వీస్. పరమ పీనాసి తనం. పెరిగిన ప్యాసెంజర్స్ కు అనుగుణంగా చెక్ ఇన్ కౌంటర్ లు ఏర్పాటు చేయలేదు.
తక్కువంటే 45 నిముషాలు క్యూ లో నిలబడి luggage ఇచ్చి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి.
అటుపైన సెక్యూరిటీ. అది అయ్యాక కాశీ యాత్ర లాంటి నడక !
GMR ఎయిర్పోర్ట్ వారు తమ వ్యాపారం పెంచుకోవడం కోసం షాప్స్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.
అందుకోసం సెక్యూరిటీ నుంచి డొమెస్టిక్ బోర్డింగ్ దగ్గరికి రెండు కిలోమీటర్స్ ( కు కాస్త తక్కువ ) నడవాలి.
( బహుశా త్వరలో ఎయిర్పోర్ట్ పాస్ వే ను శంషాబాద్ చుట్టూ తిప్పుతాడు. వాడికి రెంట్ రావడానికి మనం రెండు రోజులు ముందే ఎయిర్పోర్ట్ చేరుకొని నడక మొదలెట్టాలి. )
ఇప్పుడు …
అంటే విజవాడ కు రోడ్ జర్నీ 5 గంటలు అయితే ఇండిగో క్యూ లో అటుపైన ఎయిర్పోర్ట్ లో నడుస్తూ అటుపైన వెయిటింగ్ .. ఇలా ఎయిర్పోర్ట్ లోనే నాలుగు గంటలు గడపాలి.
రేపు అంటే శనివారం సాయంకాలం 5 .17 గంటలకు విజయవాడ మురళి రిసార్ట్స్ లో స్లేట్ విజయవాడ, స్లేట్ గన్నవరం వార్షికోత్సవ కార్యక్రమం.
నేరుగా చూడాలి అనే ఆసక్తి వున్నవారికి ఆహ్వానం.
యూట్యూబ్ లింక్ షేర్ చేస్తాను. ������
“ నాకు రూపాయి లాభం కలిగితే చాలు ! సమాజానికి కోటి నష్టం కలిగినా పట్టించుకోను. అలాంటి పని చేస్తాను / చేసేవారిని సమర్థిస్తాను “ అనుకొనే వారి సంఖ్య ఇబ్బుడిముబ్బిడిగా పెరిగి పోతోంది.
అనేక ఉపద్రవాలకు ఇదే కారణం !
“ సొంత లాభం మొత్తం చూసుకొని పొరుగువాడిని నాశనం చేయవోయ్ “ అని పాడుకోవలసిన స్థితి.

టెస్లా కంపెనీ లో ఇంజనీర్ పై దాడి చేసి రక్తగాయాలు చేసిన రోబో.

ప్రోగ్రాం లోపం వల్ల ఇంజనీర్ ను పిన్ చేసిన రోబో !
సంఘటన జరిగింది రెండేళ్ల క్రితం.
దానికి సంభందించిన నివేదిక నిన్న విడుదలయ్యింది.
Aayana udhyogam untaadhaa???
అద్భుతం ! అమోఘం. వింటే షాక్ వచ్చి గిలిగిలా కొట్టుకొంటారు! ఏడు వింతలు అనేది సోది. ఇదే ప్రపంచపు అసలు సిసలు వింత.
#AnnualDay #Promo #CountdownBegins #SchoolEvent #YoutubeLive #SlateTheSchool #AndhraPradesh

తమిళ సినీ నటుడు విజయకాంత్ చాలా కాలంగా తీవ్ర అనారోగ్యం తో ఉన్నాడు !

( ముందుగా బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలన్న అతృతతో ఒక జర్నలిస్ట్ వాట్సాప్ గ్రూప్ లో రెండు వారాల క్రితం ఆయన మరణించాడని ప్రకటించేసారు )
ఇప్పుడు ఆయన కరోనా తో మరణించాడని ప్రకటన.
Sraddhanjali ��
ప్రతి ఆసుపత్రిలో ప్రతి రోజు కొంత మరణిస్తుంటారు. అలాంటి వారికి మరణానికి గంట ముందు లేదా శవానికి కరోనా అంటిస్తే కరోనా మరణాల సంఖ్య ను ఘనంగా చెప్పుకోవచ్చు.
( శవానికి కరోనా ఎలా అంటిస్తారన్నా మీ డౌట్ అనుమానం ? శవాల మెదడులో కరోనా ఉందని తేల్చిన బ్యాచ్ కిస్తే సరి. క్షుద్ర విద్యలు మరి )
The fifth person is a disciple of Mr. Amarnath;
he is encouraging the other four.
16 ఏళ్ళు లోపు పిల్లలకు సోషల్ మీడియా ను బాన్ చేసే ఆలోచనలో బ్రిటిష్ ప్రభుత్వం.
రిషి సునక్ ! ఈ పని చేస్తే చరిత్రలో మిగిలిపోతావు !
COv*id Karanam kaadhu ani superindent cheppaadu ani mention chesi heading lo matram CO*vid tho mruthi ani pettaaru. Very sad journ*alism

నిన్న నేను ఒక సీనియర్ లీడర్‌ను కలిశాను, ఆయన నాతో మాట్లాడుతూ, మైగ్రేషన్ ప్రాజెక్ట్‌లు (కోడ్‌ను ఒక భాష/టెక్నాలజీ నుండి మరొకదానికి మార్చడం) ఇప్పుడు AI సహాయంతో జరుగుతున్నాయని చెప్పారు. ఫైనల్ కోడ్ యొక్క కచ్చితత్వ స్థాయి 70% కంటే ఎక్కువగా ఉంటుంది, ఆ తర్వాత మిగిలిన పనిని డెవలపర్ స్వయంగా చేసుకోవచ్చు!

గతంలో ఈ ప్రాజెక్ట్ చేయడానికి 10 మంది డెవలపర్లు అవసరమైతే, ఇప్పుడు కేవలం ఇద్దరే సరిపోతారు.

కస్టమర్ సర్వీస్ అత్యంత స్పష్టమైన లక్ష్యంగా మారింది. చాలా సమస్యలు మరియు వాటి పరిష్కారాలు ఇప్పటికే మీ టికెట్ ట్రాకింగ్ సిస్టమ్‌లోనే ఉన్నాయి.

గతంలో, సాధ్యమయ్యే పరిష్కారం కోసం ఆ టికెట్లను శోధించడానికి మీరు మీ సపోర్ట్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేవారు మరియు వారి తెలివి/జ్ఞాపకశక్తిపై ఆధారపడేవారు.

కానీ ఇప్పుడు ఆ పనిని AI చేస్తోంది.

ప్రస్తుత అనిశ్చిత మార్కెట్ వాతావరణం కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలు తమ లాభాలను నిలబెట్టుకోవడానికి ఖర్చులను తగ్గించుకుని, తమ బాటమ్ లైన్‌ను మెరుగుపరచుకోవలసి వస్తోంది మరియు దానిని సాధించడానికి AI ఒక సాధనం.

ఈ పోస్ట్‌ను ఒక సానుకూల విషయంతో ముగించాలని నేను కోరుకుంటున్నాను, కానీ దురదృష్టవశాత్తు 2024 సంవత్సరంలో కూడా AI వినియోగం మరింత పెరుగుతుంది మరియు ఇది ఉద్యోగ నష్టాలకు కారణమవుతుంది.

(ఇది ఫార్వార్డ్ చేయబడిన సందేశం. దీని రచయిత నేను కాదు)

Ee social media teristhe em.news chudalsi vasthundho ane fear start ayindhi sir.

ఉపద్రవం తప్పదు !

విపరీతమయిన హింసాత్మక దృశ్యాలున్న సినిమాలు భారీ హిట్లు అవుతున్నాయి. ఎందుకు ?

యువత మానసిక ధోరణిని ఎలా అర్థం చేసుకోవాలి ?
������������
మొబైల్ పై హింసాత్మక వీడియో గేమ్స్ ఆడుతున్నారు. కిక్ ఎక్కాలంటే డోసు పెరగాలి. అందుకే మతిమాలిన హింసాత్మక సినిమాలు వారికి తెగ నచ్చుతున్నాయి.
అయితే ఏంటట ?
ఎవరి ఇష్టాయిష్టాలు వారివి కదా ? మనకేంటి ?
��������
ఇందాకే ఒక తల్లి మెసెంజర్ లో మెసేజ్ చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న తమ కొడుకు చదువు ను పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నాడు. “ చదవరా“ అంటే మమ్మల్ని ( తల్లి తండ్రిని ) కొడుతున్నాడు అని.
సమాజం పడవ లాంటిది ; ఎవరు సీట్ కింద చిల్లు పెట్టినా ప్రభావం అందరిపైనా.
నేరాలు ఘోరాలు పోలీస్ లు అదుపు చేయలేని స్థితి లోకి వెళ్లిపోతాయి. చూస్తూ వుండండి.

పనికంటే జీవితం ఎంతో గొప్పది - గేట్ల తాత !

ఏంటో ! ఈ మధ్య కాలం లో అందరిలో మార్పు కన్పిస్తోంది !
శుభోదయం !!
పెద్దాసుపత్రుల పెద్ద పెద్ద సార్లు .. రెండు రోజులుగా క్యూ కట్టి “ అబ్బే! ఆ వేరియంట్ గురించి అంతగా భయపడాల్సింది లేదు “ అంటున్నారుగా !
నోట్ థిస్ పాయింట్ యువర్ honour !
మనలో మాట ! ఏమి జరిగి ఉంటుందో ? I
గంజాయి... డ్రగ్స్... సన్ బర్న్ పార్టీ లు .... నకిలీ విత్తనాలు .. వీటి పై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ముఖ్య మంత్రి, అధికారులకు ఆదేశం !
ఇవి నిజంగా అమలయితే సమాజం లో గుణాత్మక మార్పు వస్తుంది !
SKILL Development Center
#SlateTheSchool #Memories #Throback
కరో నా సోకితే సంసార జీవనానికి పనికి రాకుండా పోతారని అమెరికా దేశం లో ఒక డాక్టర్ పరిశోధన ద్వారా తేల్చేసాడు. అంతే కాదు రాబొయ్యే పది తరాల పాటు సంసారం జీవనానికి పనికి రాకుండా పోతారని శాస్త్రీయం గా నిరూపితం అయ్యింది “
ఒరేయ్ ! నీ పిండం కరోనా కు పెట్టా. కారో నా బిల్డ్ అప్ వార్తలు రాయడానికి నిన్ను పెట్టుకొన్నాను చూడు .. నన్ను .. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. బుర్రలేని వెధవ. సంసారం జీవనానికి పనికిరాకపోతే పదితరాలు ఎలా వస్తాయిరా ? నీ కంటే ఆ జీకే జ్యోతిషం గాడు నయం “ … కోప్పడ్డాడు పత్రిక డెస్క్ ఇంచార్జి.
������������
పుంజుకోండి మిత్రులారా!

చలి చంపేస్తోంది.

గాలి కాలుష్యం.
దగ్గో జలుబో రావడం సహజం.
లగెత్తుకొని పొతే “ వామ్మో నీకు కారో నా వచ్చిందయ్యో ! “ అని భయపెట్టి అడ్మిట్ చేసుకొని నాలుగు విటమిన్ మాత్రలు ఇచ్చి లక్షో రెండు లక్షల్లో బిల్లు వేసి శీతా కాలం ముగిసే లోగా పదో ఇరవయ్యో కోట్లు కుమ్మేద్దామని మీడియా లో హోరెత్తిస్తున్నారు.
అయినా అడ్మిషన్స్ లేవు.
“ ఏంట్రా బగుమంతుడా! తిరిగి మొదటి రెండో వేవ్ కాలం నాటి స్వర్ణ యుగం రాదా ? “ అని తలపట్టుకొంటున్న ఫార్మసురుడు.

బెట్టింగ్ బాలరాజులు !

బెట్టింగ్... ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ ... చాప కింద ఆసిడ్ లా విస్తరించి అనేక కొంపల్ని ముంచేస్తోంది .
బెట్టింగ్ ఒక మానసిక వ్యసనం !
తల్లితండ్రులు " కంచు" టైపు అయితే పిల్లల్లో బెట్టింగ్ వ్యసనం వచ్చే అవకాశం ఎక్కువ !
" కంచు మొగునట్లు కనకంబు మోగునా ?" అని నానుడి .
కొంత మంది ఎంత సేపూ "షో ఆఫ్ " టైపు .
తమ గొప్పలు చెప్పుకోవడం .. చూపుకోవడం వీరి దిన చర్య .
కిట్టి పార్టీలు మందు పార్టీలలో ఈ" కంచు లు" గణగణ మోగుతుంటాయి .
" ఈ కాలం కూడా ఇంకా మారుతీ సుజుకి లో ఎట్టా ట్రావెల్ చేస్తారో .. ఏంటో .. నేనైతే మినిమం వోల్వో వదినా .. మా అన్నగారయితే లాండ్రోవర్ దిగరు" అని బిల్డ్ అప్ లు ఇస్తూ బతికేస్తారు .
అదొక ఐడెంటిటీ క్రైసిస్ .
ఆత్మ న్యూనతా భావం .
ఆవు చేలో దూడ గట్టున మేస్తుందా ?
నేను గొప్ప అని అవతలివారికి చాటి చెప్పుకోవాలి అనే ఆలోచన బెట్టింగ్ కు దారి తీస్తుంది .
కష్టపడే తత్త్వం లేకపోవడం , ఈజీ గా డబ్బు సంపాదించాలి అనుకోవడం కూడా ఒక కారణం
గ్యాంబ్లింగ్ డిసార్డర్ - అనేది తీవ్ర మానసిక రోగం . నేడు ఎంతో మంది దీని బారినపడి సతమమవుతున్నారు .
ఆలోచనలు ఎప్పుడూ గ్యాంబ్లింగ్ చుట్టూ తిరుగుతుంటాయి . ఎన్నికలు .. క్రికెట్ . .. సినిమా జయాపజయాలు .. కాదోయి ఏది బెట్టింగ్ కు అనర్హం .
ఒక్క సారి గెలిస్తే .." ఇప్పుడు మనకు సుడి తిరిగింది .. స్టార్స్ కలిసి వస్తున్నాయి .. బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తే అది ఇప్పుడే.. ఇప్పుడే" అంటూ అందులో లీనం అయిపోతారు .
ఓడితే .. "ఇజ్జాత్ కా సవాల్ .. ప్రెస్టేజ్ కొచ్చిన్ .. ఓడి పోయి .. పోవడమా? గెలిచే దాక ఆడాల్సిందే!" అంటూ ఆటలో మునిగిపోతారు .
అంటే బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ అనేది సుడిగుండం . పద్మ వ్యూహం .. ఒక సారి దిగితే సేఫ్ గా బయటకు రావడం అనేది ఉండదు . ఆలా ఒక ఒకటి రెండు సార్లు వచ్చినా ఆది అంతం కాదు .. జస్ట్ బిగినింగ్..
జూదం లో గెలవడం వల్ల డోపమైన్ హార్మోన్ వస్తుంది . ఇది మాహా కిక్కు ఇస్తుంది .
ముందుగా ఒక పెగ్గు మందు తో స్టార్ట్ చేసినవాడికి మూడేళ్లయ్యే సరికి కనీసం క్వార్టర్ దిగనిదే కిక్కు ఎక్కదు.
బెట్టింగ్ కూడా అంతే.
అమౌంట్ పెంచుకొంటూ పెద్ద పెద్ద బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తేనే మునుపటి కిక్కు వస్తుంది .
కాబట్టి చిన్నగా మొదలయిన వ్యసనం.. ఆస్తులు... పెళ్ళాం పిల్లల తాకట్టు దాక దారితీస్తుంది .
"నేనట్టా కాదు లే ... నేను మహా స్మార్ట్ . జస్ట్ ఫన్ కోసం ఆడుతున్నా". అని ప్రతి బెట్టింగ్ బంగారు రాజు అనుకొంటాడు . బెట్టింగ్ డోపమైన్ హై అనేది ఒక సైంటిఫిక్ రూల్ అని ఎవడినీ వదలదు అని వాడు అర్థం చేసుకొనేటప్పటికీ అన్ని అయిపోయివుంటుంది .
మహాభారతం కాలం నుంచి అన్ని రకాల జూదాలు/ బెట్టింగ్ లు మాయా వ్యవహారాలే .
కేసినో కు పొయ్యి సర్వ నాశనం కానోడు .. కేసినో నిర్వహించి కోట్లకు పడగలెత్తని వాడు భూప్రపంచం లో కనపడడు.
బెట్టింగ్ బంగారు రాజులను బకరాలను చేయడానికి బెట్టింగ్ మాఫియా .." ఫలానా వాడు మిలియన్స్ సాధించాడు" అని బిల్డ్ అప్ స్టోరీ లు వదులుతుంటుంది . బకరాలు నమ్మేస్తారు .
బెట్టింగ్ వల్ల నిమ్మళంగా ఒక చోట కూర్చోలేని చంచలత్వం వస్తుంది . ఇలాంటి వారు ఏ పనిపై దృష్టి సారించలేరు . బెడ్ రూమ్ లో కూడా ఇదే ద్యాస తో వుంటారు .ఉస్సేన్ బోల్ట్ లయి పోతారు సంసారం జీవనం లో చిక్కులు .
బెట్టింగ్ గాళ్ళు సులభంగా చిరాకు కు గురవుతారు . అసహనం పెరిగిపోతుంది .
బెట్టింగ్ అప్పులకు దారి తీస్తుంది . అప్పులు తీర్చ్చడానికి అదనంగా బెట్టింగ్ చేస్తారు . ఆంటే చిన్న ఊబిలో నుంచి మరీనా ట్రెంచ్ లోతుల్లోకి వీరి పయనం సాగుతుంది .
తమ కుటుంబానికి తమ వ్యసనం గురించి తెలిసిపోతుంది అని వీరు అబద్దాలు చెప్పడం మొదలెడతారు .
బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ జరిగే చోట మందు- విందు- పొందు తప్పని సరి ఆడ్ ఆన్స్.
డయాబెటిస్ బిపి కిడ్నీ సమస్యలు ఊబకాయం , ఎయిడ్స్ .. వీరు అదనంగా పొందే కొన్ని బహుమతులు .
బెట్టింగ్ వల్ల అప్పుల ఊబి ఖాయం . ఆత్మహత్యలు ... కొన్ని సార్లు హత్యలు .. అటుపై చిప్పకూళ్ళు ..
బెట్టింగ్ కుటుంబాలను నాశనం చేస్తుంది .
బెట్టింగ్ బాలరాజులు !
25 ఏళ్ళు లోపువారిలో మెదడు ముందుభాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ సరిగ్గా అభివృద్ధి చెందివుండదు . దీనితో వీరు భావోద్వేగాలను తట్టుకొనే సామర్త్యాన్ని కలిగివుండరు . వీరి చేతిలో సెల్ ఫోన్ . నేడు నీలి చిత్రాలు , హింసాత్మక వీడియో గేమ్స్ కన్నా కుటంబాలను నాశనం చేస్తోంది ఆన్లైన్ బెట్టింగ్ .
చేతిలో సెల్ ఫోన్ ఏదో చేసుకొంటున్నాడు అని తల్లితండ్రులు అనుకొనే లోపే బెట్టింగ్ మాఫియా లు వచ్చి " మీ వాడు ఇరవై లక్షలు అప్పుపడ్డాడు . ఇస్తారా చస్తారా? అంటూ బెదిరించి ఆస్తులు మానప్రాణాలు తీసిన ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి .
మీ ఇంటిలో కూడా పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి.
బెట్టింగ్ మాఫియా కాళ్లావేళ్లా పడ్డా కనికరించదు.
దయనీయమయిన స్థితిలో జీవితాన్ని చాలించాల్సి వస్తుంది .
సిగరెట్ తాగితే ఇరవై ఏళ్లకు ప్రాణం మీదకు వస్తుంది .
మందు తాగితే పదహైదేళ్లకు.
గంజాయి కొడితే ఐదేళ్లకు .
ఆన్లైన్ బెట్టింగ్ చేస్తే కేవలం ఆరునెలలకు ..
మిగతా వాటిలో తాగిన వాడొక్కడి ప్రాణం .
కానీ ఆన్లైన్ బెట్టింగ్ లో ఇంటిల్లి పాదీ.. కట్టకట్టుకుని..
తస్మాత్ జాగ్రత్త .
పిల్లల్ని సెల్ ఫోన్ కు దూరం గా ఉంచండి .
'ఈజీ మనీ పాములాంటిది అని చెప్పండి .
కష్టపడే తత్వాన్ని నేర్పండి .

వామ్మో !

ఈ లెక్కన మీరు (ఫేస్‌బుక్ స్నేహితులు మరియు అనుచరులు) నన్ను ప్రశ్నిస్తే అప్పుల అప్పా రావు గా మిగిలిపోతా!������
Oh my god !If you ( Fb friends n followers) question me at this rate, I will remain as Appula Appa Rao!

ఇందాక పెట్టిన పోస్ట్ పై ఒక మిత్రుడు మాకు కూడా సలహా చెప్పండి అని అడిగారు . దానికి సమాధానం ఈ పోస్ట్ .. .

వృద్ధ్యాప్యం కాళ్ళదగ్గరనుంచి మొదలవుతుంది .
దాని ఆలస్యం చెయ్యాలి .
చక్కటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తే వృద్ధాప్యం ఎనభై దాటాకే మొదలవుతుంది
రోజూ కనీసం నలబై నిముషాలు వేగంగా నడవాలి .
నడవడం అంటే వృద్ధాప్యాన్ని ఇరవై ఏళ్ళు వెనక్కు నెట్టినట్టే.
కొంతమందిలో కీళ్ల నొప్పుల సమస్య .
దీని వల్ల నడవ లేరు .
రోజంతా కూర్చుని గడిపేస్తారు .
రోజంతా కూర్చోవడం ఆరోగ్యాన్ని చేజేతులారా చెడగొట్టుకోవడమే .
కీళ్ల నొప్పులకు ప్రధాన కారణం కీళల్లో వుండే జిగురు తగ్గిపోవడం .
దీన్ని సైనోవియల్ ద్రవం అంటారు .
ఇది వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది .
ఇది సమృద్ధిగా ఉండాలంటే ....
తగినంత నీరు తాగాలి . 90 నిముషాలు ప్రసంగిస్తే కనీసం ఒక లీటర్ నీరు శరీరం నుంచి ఆవిరి అయిపోతుంది . ఒక చుక్క నీరు తాగకుండా అంత సేపు ప్రసంగిస్తే ... అదీ అలాంటి ప్రసంగాలు దినచర్య అయితే ? దేవుడా !
ఏసీ హాల్ లో వున్నప్పుడు దాహం అనిపించక పోవచ్చు . కానీ నీరు తాగడం తప్పని సరి . పురుషులు రోజుకు నాలుగు లీటర్ లు స్త్రీ లు మూడు లీటర్ లు . ప్రసంగాలు చేయని వారు .. కూడా దీని పాటించాలి
ఒమేగా 3 ఫాటీ ఆసిడ్ ఆహారం తప్పక తీసుకోవాలి . నానబెట్టిన వాల్ నట్స్ రోజుకు అయిదు తీసుకోవాలి .
గల్ఫ్ ఎడారిలో సహజంగా మొలిచే ఒక రకం తుమ్మ జాతి మొక్క నుంచి కారే బంకను ఎండబెట్టి గొంద్ అని అమ్ముతారు . దాన్ని కొని చిన్న ముక్కలు అయిదు ... రాత్రి నీటిలో వేస్తె అది పొద్దు కల్లా కరిగి పోతుంది . ఆ ద్రవాన్ని పొద్దున్న తాగాలి . చియా గింజెలు ఒక స్పూన్ గ్లాస్ నీళ్లల్లో వేస్తె పొద్దుకల్లా నాని ఉబుకుతాయి . దాన్ని పొద్దున్న తాగాలి . ఒక రోజు గొంద్ ద్రవం . ఒక రోజు చియా గింజెలు .
ఆహారం లో ఉప్పు తగ్గించాలి . ఉప్పు లేకుండా తినొద్దు అనడం లేదు . ఉప్పు అవసరం లేని ఖీర లాంటివి బాగా తినాలి .ఆ విధంగా శరీరం లోకి వెళ్లే ఉప్పు తగ్గిపోతుంది .
వయసు పెరిగే కొద్దీ కండరాల పటిష్టత తగ్గిపోతుంది. అందుకే ప్రోటీన్ అవసరం పెరుగుతుంది. ఒక్కో కిలో శరీర బరువుకు కనీసం ఒక గ్రాము ప్రోటీన్ తీసుకోవాలి. పన్నీర్ , నల్ల శనిగెలు మినపప్పు కంది పప్పు పుట్ట గొడుగులు శాఖాహారులకు ప్రోటీన్ ఆహారం. ఇవి ఎక్కువగా ( అన్నం కంటే రెట్టింపు ) తీసుకోవాలి.

ఆయన తెలుగు జాతికి పెద్ద వరం .

రూపాయి తీసుకోకుండా అమూల్యమయిన సందేశాలను ఇస్తుంటారు .
ఆయనను ప్రత్యక్షంగా చూడడం తొలిసారి .
చూసినప్పుడు" అయన వయసు ఇంత " అనుకొన్నా.
తీరా తెలుసుకొంటే నేను అనుకున్నదానికంటే ఇరవై ఏళ్ళు తక్కువ .
ఆ వయసులో అంతలా వృద్ధ్యాప్యం రాకూడదు .
అంతలా ఆరోగ్యం దెబ్బతినకూడదు .
కొన్ని ఆహార నియమాలు .. దినచర్యలు చేపట్టాలి .
ఇక ఎంత మాత్రం ఆలస్యం కాకూడదు .
కానీ ...
ఆయనకు చెప్పేవారు ఎవరు ?
అంతటి సాహసం ఎవరు చేయగలరు ?
శంకరాభరణం శంకర శాస్త్రికి అల్లూరి రామలింగయ్య వున్నట్టే ఒక పద్మవిభూషణుడు ఈయన మిత్రుడు .
చాలా అలోచించి కొన్ని ముఖ్యమయిన సూచనలు విభూషణుడికి పంపాను .
అది పెద్దాయన దగ్గరికి చేరాలి .
అయన పాటించాలి .
తెలుగు జాతి... అయన మంచి మాటలను కనీసం మరో పదేళ్లు వినాలి .
అందరికీ మంచి జరగాలి .
Your speech yesterday flowed seamlessly, as always; your presence on stage was captivating; and it was a delight to hear a message that truly sparked thought. If even a few people change, Sir, then my effort has been successful. Had there been more time, the students would have gained even more insight, but it wasn't possible. Thank you once again, Amarnath Vasireddy Guruji.

ఈ రోజు పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి చాగంటి వారు ఇచ్చిన సందేశం క్లుప్తంగా

1 . శరీరం మనసు రెండిటిపై అదుపు సాధించాలి. నిల్వయుంచిన ఆహరం హానికరం. తాజా కూరగాయలు పళ్ళు తినాలి.
2 . మనసు అదుపులో ఉంచుకోవాలి. ఏకాగ్రత సాధించాలి. ఇష్టపడి చదవాలి. చదివినదాన్ని ఆకళింప చేసుకోవాలి. తల్లి తండ్రికి సాయం చేయాలి.
������
స్లేట్ లో మంచీ మండే( Nuts ) .. కాల్షియమ్ ట్యూస్డే ( nuvvula laddu ) .. veggie Wednesday, tasty Thursday fruity ఫ్రైడే .. ఆక్వా బెల్స్ .. ప్రోటీన్ లంచ్ .. జంక్ ఫుడ్ పై యుద్ధం .. సెల్ ఫోన్ పై సమరం .. yoga , workouts , sunshine assembly రియల్ homework ( పిల్లలు ఇంటి పని చేయడం ) RRP రీడ్ revise ప్రాక్టీస్ .. కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ … ద్వారా చాగంటి వారు చెప్పింది ఆచరణలో అమలు చేస్తున్నాము. ������
������

*మన తెలుగు భాష ప్రత్యేకత!* *ఓసారి పరిశీలిద్దామా*?

*నెలవంక* ఉంటుంది గానీ...
*"వారం వంక"* ఉండదు అదేంటో!!!
*"పాలపుంత"* ఉంటుంది గానీ...
*"పెరుగుపుంత"* ఉండదు.
*"పలకరింపు"* ఉంటుంది గానీ...
*"పుస్తకంరింపు"* ఉండ దెందుకు?
*"పిల్లకాలవ"* ఉంటుంది గానీ...
*"పిల్లోడి కాలవ"* ఉండదు...ఎందువల్లనో?
*"పామాయిల్"* ఉంటుంది గానీ...
*"తేలు ఆయిలు"* ఉండదండి.
*"కారు మబ్బులు"* ఉంటాయి గానీ...
*"బస్సు మబ్బులు"* ఉండ వేమిటో!
*"ట్యూబ్ లైటు"* ఉంది గానీ...
*"టైర్ లైటు"* ఉండదు.
*"ట్రాఫిక్ జామ్"* ఉంటుంది గానీ...
*"ట్రాఫిక్ బ్రెడ్"* ఉండదు.
*"వడదెబ్బ"* ఉంటుంది గానీ...
*"ఇడ్లీ దెబ్బ"* ఉండదండి.
*"నిద్రగన్నేరు చెట్టు"* ఉంటుంది గానీ....
*"మెలకువ గన్నేరు చెట్టు"* ఉండదండి.
*"ఆకురాయి"* ఉంటుంది గానీ...
*"కొమ్మరాయి"* ఉండదండి.
*"పాలపిట్ట"* ఉన్నది గానీ...
*"పెరుగు పిట్ట",* గానీ, *"మజ్జిగ పిట్ట"* గానీ ఉంటే ఒట్టు.
*"వడ్రంగి పిట్ట"* ఉంది గానీ...
*"ఇంకో వృత్తి పిట్ట"* లేదు ఎందుకనో
*చుట్టరికాలు* మాత్రమే ఉంటాయి గానీ...
*"సిగరెట్టరికాలు"..* *".బీడీరికాలూ"* ఉండ వేమిటో.
*"రంగులరాట్నం"* ఉంటుంది గానీ...
*"బ్లాక్ అండ్ వైట్ రాట్నం"* ఉండ దెందుకని?
*"ఫైర్ స్టేషన్"* లో *ఫైర్* ఉండదండి.
"పులిహారలో" *పులి* ఉండదండి.
*"నేతి బీరకాయ"* లో *నెయ్యి* ఉండదు.
*"మైసూర్ పాక్"* లో *మైసూర్* ఉండనే ఉండదు.
*"గాలిపటంలో"* *గాలి* ఉండదండి.
*"గల్లాపెట్టిలో"* *గల్లా* *ఉండదండి*
*చివరాఖరుగా*..
*"ఫేసు బుక్కులో"* *పుస్తకం* , *"యూ ట్యూబులో"* *గొట్టం* *ఉండవు* !
*హాస్యం మనస్సును ప్రశాంతత చేస్తుంది..!*
�� �� �� �� �� ��
( Copy paste from WhatsApp group ).

హాయ్ అమర్‌నాథ్ సర్...

లేట్‌గా మెసేజ్ చేస్తున్నందుకు సారీ సర్. కానీ మా అమీర్‌పేట్ బ్రాంచ్ Annual Day Function గురించి నా మనసులో ఉన్న కొన్ని మాటలు మీతో తప్పకుండా పంచుకోవాలనిపించింది. కాస్త ఓపికగా చదవండి సర్...

నిజంగా సర్... మీకు ఇంత ధైర్యం, ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తాయి? తల్లిదండ్రులందరినీ పిలిచి దాదాపు నాలుగు గంటలు... అక్షరాలా నాలుగు గంటలు... మమ్మల్ని ప్రశాంతంగా కూర్చోబెట్టి, అంతసేపు ఎంతో ఓపికగా ఒక క్లాస్ తీసుకున్నట్టుగా కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా అద్భుతం సర్.

నేను ఈ సంవత్సరమే మా పాపను మీ స్కూల్లో చేర్పించాను. మా పాపలో వచ్చిన మార్పు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆమె ప్రవర్తన, ఏకాగ్రత, స్కూల్ మీద, టీచర్స్ మీద ఏర్పడిన గౌరవం, క్రమశిక్షణ చూసి చాలా సంతోషంగా అనిపించింది.

ఈ రోజుల్లో విద్య అనేది చాలా వరకు కమర్షియల్‌గా మారిపోయింది. డబ్బులు తీసుకున్నామా, సిలబస్ పూర్తి చేశామా అనేదే తప్ప... పిల్లలకు ఎంతవరకు అర్థమైంది? వారి వ్యక్తిత్వం ఎలా తయారవుతోంది? అనే విషయాలపై పెద్దగా పట్టింపు లేని పరిస్థితి కనిపిస్తోంది.

అలాంటి సమయంలో ఇంతమంది విద్యార్థుల్లో ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఎలా వారికి చేరువ అవుతున్నారు? అని నేను చాలా సార్లు ఆశ్చర్యపోయేవాడిని.

చదువుతో పాటు క్రమశిక్షణను నేర్పించడం నాకు చాలా కొత్తగా, ప్రత్యేకంగా అనిపించింది.

కానీ మొన్నటి School Day Functionలో మీరు అందించిన కంటెంట్ చూసిన తర్వాత నాకు అసలు విషయం అర్థమైంది సర్.

మీరు ఒక యజ్ఞమే మొదలుపెట్టారు.

నేను ఏమాత్రం అతిశయోక్తిగా చెప్పడం లేదు సర్. అక్షరాలా మనసులో నుంచి చెబుతున్నాను.

తరతరాలను సరైన మార్గంలో నడిపించే గొప్ప విలువలతో కూడిన బాధ్యతను మీరు తీసుకున్నారు.

"ఆచార్య దేవోభవః" అనే మాట మీ విషయంలో నిజంగా గుర్తుకు వస్తుంది. పిల్లల పట్ల మీ దగ్గర కనిపించే స్వచ్ఛమైన ప్రేమ, బాధ్యత, శ్రద్ధ ఎంతో గొప్పవి సర్.

పిల్లలు సరైన మార్గంలో నడవాలంటే తల్లిదండ్రులు కూడా తమ జీవితంలో క్రమశిక్షణను పాటించాలి. అప్పుడే పిల్లలను పూర్తిగా సరైన దారిలో నడిపించడం సాధ్యమవుతుంది. ఆ విషయం కోసం మీరు పడుతున్న తపన స్పష్టంగా కనిపించింది.

మీకు హ్యాట్ఫ్ సర్!

సాధారణంగా Annual Day Function అంటే నాలుగు పాపులర్ పాటలకు పిల్లలతో డ్యాన్సులు చేయించడం, కొన్ని వినోద కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే అనుకుంటారు.

నేను సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా చెబుతున్నాను సర్—ఈ రోజుల్లో కొన్ని కార్యక్రమాల్లో పాటల్లో ఎంత అసభ్యమైన లేదా అనుచితమైన పదాలు ఉన్నాయో కూడా పట్టించుకోకుండా ఫంక్షన్స్ నిర్వహిస్తున్నారు.

అలాంటి సమయంలో మీరు Parenting గురించి ఇంత చక్కగా ఒక కథను రూపొందించి, తల్లిదండ్రులందరినీ పిలిచి కూర్చోబెట్టి, మీ ఆలోచనలను ధైర్యంగా వారికి చెప్పడం అసలు సాధారణ విషయం కాదు సర్.

అది నిజంగా గొప్ప విషయం.

మమ్మల్ని కూడా మా వైఫల్యాలకు కుంగిపోవద్దని, పిల్లలను పెంచే ప్రయాణంలో మనం కూడా నేర్చుకుంటూ ముందుకు సాగాలని చెప్పడం ఎంతో అందమైన విషయం సర్.

మీరు మంచి రైటర్ కూడా.

ఈ కలుషితమైన ప్రపంచంలో కూడా విలువలకు ప్రాధాన్యత ఇస్తూ, పిల్లలకు ఆ విలువలను నేర్పిస్తూ, అదే సమయంలో విజయాన్ని సాధించడం చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను.

అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది సర్...

"YOU CAME INTO THIS WORLD FOR A REASON."

నిజంగా మీరు మాకు కూడా ఒక గొప్ప స్ఫూర్తి.

మీ ఈ అద్భుతమైన, అర్థవంతమైన, గొప్ప ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించండి సర్.

మేము మీతో ఉన్నాం.

ఒక మనిషిగా మరో మనిషికి చెప్పగలిగేది ఒక్కటే—

మీరు నిజంగా అద్భుతమైన వ్యక్తి సర్.

LOVE YOU AMARNATH SIR! ❤️

అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. అందరితో షేర్ చేసుకోండి. లేకపోతె ఫార్మాసూరులు మీ రక్తం తాగేస్తారు !

Those who witnessed the two great masters—Chaganti Koteswara Rao garu and Amarnath Vasireddy garu—sharing the same stage are truly fortunate.

ఈ మెసేజ్ ని పదిమందికి పంపక పొతే .. మీకు ఇదిగో ఈ నష్టం .. ఈ కష్టం .. అనే తరహా మెసేజ్ లు చూస్తుంటాము. ����

ఒక విధంగా అలాంటిదే. కాకపోతే ఇదేదో శాపం కాదు.
కాసేపట్లో 12 నిముషాల వాయిస్ మెసేజ్ పోస్ట్ చేస్తాను. దాన్ని పూర్తిగా విని మీ బంధువులు మిత్రులతో షేర్ చేసుకోండి. లేకపోతె ఈ రెండు నెలల్లో ఫార్మాసూరులు రక్తం పీల్చేస్తారు. ఈ టెస్ట్ ఆ ట్రీట్మెంట్ అని లక్షలు దోచేస్తారు.
మీకు అలా జరగక పోవచ్చు. కానీ నా పోస్ట్స్ ఫాలో కాని వారు నష్టపోయే ప్రమాదం.
సామజిక భాద్యతగా అవగాహన పెంచండి. ఆ వాయిస్ మెసేజ్ ని అందరితో షేర్ చేసుకోండి.
( మా ఇంట్లో వైఫై పనిచేయడం లేదు. రికార్డు చేసి సెక్రటరీ కి పంపా. ఆమె పోస్ట్ చేస్తారు. )
శుభోదయం

" గబ్బు బాస్ " షో మొదలయిన రోజులు .

ఎవడో ఒక గొట్టం గాడు.
ఆ తొక్కలో షో లో విజేత .
వాడి పేరుతొ ఆర్మీ .. నేవీ .. ఎయిర్ ఫోర్స్ .
అభిమానులు .. రచ్చ రచ్చ .
దీనిపై చర్చ కోసం ఒక టీవీ వారు పిలిచారు .
అక్కడ ఆ గొట్టంగాడి ఆర్మీ సభ్యులు చాల మంది ఉన్నారు. వీరావేశం తో మాట్లాడుతున్నారు .
నాకు ఒక విషయం క్లియర్ గా అర్థం అయ్యింది .
అభిమానం లేదు .. అట్లతద్ది లేదు .
వారిని ఎక్కడెక్కడి నుంచో తోలుకొని వచ్చారు .
పైసా వసూల్ గ్యాంగ్స్
పబ్లిసిటీ కోసం నాటకాలు .
పైడ్ గ్యాంగులు.
డబ్బులొస్తాయని ఏదో వాగుతారు వారి చేత వాగిస్తారు .
వివాదమే వాడి అమ్మకం .
అవును .. తన పేరుతో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ నెలకొల్పిన ఆ సూపర్ హీరో .. ఇప్పుడు ఎక్కడ గడ్డి పీకుతున్నాడో !!
ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు జిత్తులు .
ఇప్పుడు సామాన్యుడు ఎవడో విజేత అయ్యాడట .
అః .. ఓహో .. మనలాంటి సామాన్యులకు కూడా రేపు ఛాన్స్ వస్తుందని లక్షలాది మంది బకరాలు ఆశపడుతారు . అదే వాడి స్క్రిప్ట్ . అదే వాడి ప్లాన్ .
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు .
ఇలాంటి వారికి ఒక బూస్టర్ డోసు వేసేస్తే పీడా పోతుంది .

 

అండర్ వరల్డ్ డాన్ పై విష ప్రయోగం జరిగిందా ?

ఇంకా నిర్ధారణ కానీ వార్తలు అదే చెబుతున్నాయి .
బహుశా రా ఎఫెక్ట్ అయివుండొచ్చు .
రా అంటే రమ్మని కాదు .
రా అంటే నీళ్లు కలుపుకోకుండా తాగడం కాదు .
రా.. రమ్మని చెప్పి పైకి పంపుతుందో .. ఇంకొకరో .. ఒకటి మాత్రం నిజం ..
హింస ను నమ్ముకొంటే అదే ఆ వ్యక్తి పాడె కడుతుంది .
చరిత్ర కొన్ని లక్షల సార్లు చెప్పిన సత్యం .
అనిమల్ సినిమా లాంటివి చూసి ఆనందపడే పడేవారికి ఈ పోస్ట్ అంకితం .

మూడిందా ?

ఎవరో ఒకాయన తన ఫేస్బుక్ టైం లైన్ పై " త్వరలో కరోనా - 3 " అని పోస్ట్ పెట్టారు .
"సార్ .. నిజామా ?" అని ఫేస్బుక్ మిత్రుడు అక్కడ కామెంట్ పెట్టారు . { ఆ విధంగా నేను ఆ పోస్ట్ చూసాను } .
వాస్తవం ఏంటంటే ..
మన దేశం లో ...
ఓమిక్రాన్ .. కరోనా - ౩.
అటు పై .. గత సంవత్సరం సరిగ్గా ఇదే శీతాకాలానికి కరోనా - 4 .
మరిచి పోయారా ? నూతన సంవత్సర వేడుకలపై కొంత మేర నిబంధనలు విధించారు . చాలా మందికి రెండు మూడు వారాల పాటు దగ్గు ..
కాబట్టి కరోనా మూడు కాదు ..ఇప్పుడు .. కరోనా అయిదు .
మాధురి దీక్షిత్ లాగా కరోనా .. ఏక్.. దో.. తీన్.. చార్ .. పాంచ్.. చే .. సాథ్ .. ఆత్.. నవ్ .దస్.. గ్యారా .. అని మన జీవితాంతం .. అటు పై రాబొయ్యే లక్ష సంవత్సరాలకు పైగా వస్తుంటుంది .. పోతుంటుంది .
ముకున్న ప్రతోడికి సోకుతుంది .
నువ్వు మాస్క్ పెట్టుకో .. దొడ్లో దాక్కో .. అది సోకక మానదు .
సోకడం దాని ధర్మం .
భయపడడం నీ ఖర్మం .
అనివార్యమగు ఈ కార్యంబునకు చింతింప తగదు .
దాన్ని గురించి పట్టించుకోవద్దు .
జస్ట్ జలుబు దగ్గు .. ఒకటి రెండు రోజులు జ్వరం .
అంతగా భయమేస్తే .. జ్వరముంటే ఆ నాలుగు రోజులు బి , సి , డి విటమిన్ మాత్రలు ., జింక్ మాత్రలు తిను . అంతకన్నా వైరస్ కు మందులు లేవు . రావు .
ఈ జీవితం పై విరక్తి పుడితే మాత్రం .. బూస్ట్ లు వేసుకో .. వేసుకొనే ముందే వీలు నామా గట్రా ఏర్పాట్లు చూసుకో.{ ఆ పోస్ట్ లో ఒకాయన కామెంట్ .. విదేశాల్లో ఉన్న కూతుళ్లు బూస్టులు వేసుకొన్నారట . ద్యేవుడా .. చెబితే వినరు .. ఒకరా ఇద్దరా.. కరోనా కాలం నుంచి వేలమంది . బాధపడడం మినహా మనం ఏమీ చేయలేము }
కేరళలో నలుగురు సోకి పోయారట .. కరోనా భయాలకు జాకీ పెట్టి లేపే వార్త .
సోకి పోయారా ?
పొయ్యే వారికి సోకిందా ?
నిజం బయటకు రాదు .
నీ భయమే ఫార్మసురుడి వ్యాపారం .
కరోనా చంపదు.
భయం బతకనివ్వదు
Tuneega tuneega.,... is such an excellent song

స్లేట్ అమీర్‌పేట్ వార్షికోత్సవం సందర్భంగా (17/12/23).

*గౌరవనీయులైన అమర్నాథ్ సార్ గారికి*

నా నమస్కారాలు... సర్... మన 17వ వార్షికోత్సవం అమీర్పేట.. ఇది మీరు టీచర్లని తప్పకుండా చూడాలని చెప్పారు.. మీరు చెప్పారని నేను ఆ కార్యక్రమాన్ని చూశాను... సార్.... కానీ ఆ ప్రోగ్రాం అయిపోయేంతవరకు అక్కడ నుంచి లేవాలన్న ఆలోచన నాకు రాలేదు.....
నిజంగా ఒక అద్భుతమైన సమాచారాన్ని తల్లితండ్రులకు ఇచ్చారు సార్...
నిజంగా మన ఈ ప్రయత్నం మనసుపెట్టి వినే ప్రతి ఒక్క తల్లితండ్రులలో మార్పు రావాలని కోరుకుంటున్నాను సార్.. మామూలుగా ఒక సినిమా చూసేటప్పుడు సస్పెన్స్ అంటే ఎలా ఉంటుందో ఆ అనుభూతిని, మనం ఎలా పొందుతామో.. అచ్చం అలాగే మీరు రాసిన ఈ స్క్రిప్ట్ మమ్మల్ని ఆశ్చర్య చెక్కితులని చేసింది సార్.... పిల్లలందరూ వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేసి, పాత్రకి జీవం పోశారు.. వాళ్లు మమ్మల్ని నవ్వించి చివరికి ఏడిపించేలా కూడా వాళ్ళు నటించగలిగారు.. మనం రోజు చెప్పే పిల్లలు పాఠాలు వింటున్నారో వినట్లేదు అని భయపడుతూ ఉండేవాళ్ళం ,కానీ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని చూసిన తర్వాత మన పిల్లల్లో సాధించలేనిది ఏదీ లేదన్న ఒక నమ్మకం మాకు వచ్చింది సార్.. పిల్లలు నిజంగా చాలా బాగా నటించారు.. చాలా బాగా చెప్పారు... హాట్స్ ఆఫ్ యు సర్....
*మీకు మీరే సాటి.. విద్యా విధానాలలో మీకు ఎవరూ లేరు పోటీ*....... ఇలాంటి చక్కటి సమాచారాన్ని భావితరాలకు అందించిన మీకు ధన్యవాదాలు సర్...��������������������
*To the respected Amarnath sir*

కేరళలో కొత్త కరోనా !

దీనికో ప్రత్యేకత ఉంది !
జనాలు మరిచిపోయిన కరోనా కు జాకీ వేసి నిలబెట్టి మెడికల్ మాఫియా కు సాయం చేసే వారికి.. కరోనా సోది వార్తలను నమ్మే వారికి మాత్రమే ఇది సోకుతుంది.
మిగతావారికి సోకినా తుస్సుమంటుంది.
నిన్న ఒక ఉన్నతాధికారికి ఫోన్ చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చా ! సారీ చెప్పి దిద్దుబాటు చర్యలకు ఒప్పుకోవడం తో వదిలేసా ! లేకపోతే సీన్ సితారే !
ఇంతకంటే వివరాలు చెప్పలేను. చెబితే ఆ అధికారి బతుకు బస్టాండ్ అయిపోతుంది.

కేరళ లో కరోనా కొత్త వేరియంట్ !

How deeply the teachers were humiliated...Instead of booking a case under juvenile delinquency and locking up someone with such a criminal mindset, the official in question pontificated about keeping the students future in mind...
How deeply the teachers were humiliated...Instead of booking a case under juvenile delinquency and locking up someone with such a criminal mindset, the official in question pontificated about keeping the students future in mind...
Social media Animal super title
1 పంచపాండవులు ఎంతమంది ?
2 వారి భార్య ఎవరు ?
3 సీతా స్వయంవరం సందర్భంగా రాముడు విరిచిన ధనుస్సు ఏది ?
4 మారీచుడు ఎవరు ?
5 లక్ష్మణుడు ముక్కుచెవులు కోసిన రాక్షసి పేరేమి ?
6 రాముడికి సాయపడిన పక్షి పేరేమి ?
7 లంకకు వారధి నిర్మించడంలో రాముడికి సాయపడింది ఎవరు ?
8 లంకా దహనం చేసింది ఎవరు ?
9 లక్క ఇంటిలో పాండవులను సజీవ దహనం చెయ్యాలని ప్రయత్నించింది ఎవరు ?
10. పాండవుల కౌరవుల గురువు ఎవరు ?
రామాయణ మహాభారతాల గురించిన ప్రాధమిక సమాచారం .. ఓనమాలు .. కానీ ...
ఇరవై ఐదేళ్లలోపు వారిని ఈ ప్రశ్నలడగండి .
లక్షల్లో ఒక్కరు కూడా పదికి పది మార్కులు స్కోర్ చేయలేరు .
నూటికి ఎనభై మంది కనీసం రెండు మార్కు లు స్కోర్ చేయలేరు .
ఒకప్పుడైతే రామాయణ మహాభారత కథలు సినిమాలుగా వచ్చేవి . ఇప్పుడేమో కేజీఫ్ .. అనిమల్ లాంటి ఆణిముత్యాలు .
ఒకప్పుడు గ్రామాల్లో హరికథలు నడిచేవి . ఇప్పుడు ఎవరైనా నిర్వహించినా అక్కడ ముసలి ముతక తప్పించి ఇరవై అయిదు ఏళ్లలోపు వారు ఎవరూ కనబడరు .
పాఠ్య పుస్తకాల్లో ఒకటో తరగతి నుంచి పది దాక .. ఆమాటకొస్తే కాలేజీ చదువుల్లో కూడా పాఠ్య పుస్తకాల్లో దుర్భిణీ వేసి వెదికినా రామాయణ మహాభారత కథలు కనిపించవు .
తరతరాల భారతీయ సంస్కృతికి దర్పణాలు ఆ మహా కావ్యాలు .
మతం .. దేవుడు అనే కోణంలో కాకున్నా సామాజిక పరిజ్ఞానం అనే కోణంలో తప్పక తెలుసుకోవలసిన విషయాలు
పని కట్టుకొని ఒక్క తరం కాలంగడిచే లోపు వాటిని నవతరానికి దూరం చేసారు .

గత వారం జరిగిన స్లేట్ బౌరంపేట్ వార్షికోత్సవ కార్యక్రమం గురించి ఒక పేరెంట్ పోస్ట్ చేసిన అభిప్రాయాలు

Views posted by a parent about Slate Bourampet anniversary event held last week
Views posted by a parent about Slate Bourampet anniversary event held last week

తల్లిని చంపిన ఐఐటీ స్టూడెంట్

తనకు డబ్బు ఇవ్వడానికి తల్లి నిరాకరించిందని ఆవేశంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు ఓ కొడుకు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. హిమాన్షు అనే వ్యక్తి ఐఐటీ చదువుతున్నాడు. తన తల్లి ప్రతిమా దేవితో కలిసి హర్యానాలోని హిసార్లో ఉంటున్నాడు. అయితే హిమాన్షు తన తల్లిని 5000 రూపాయలు అడగడంతో గొడవ మొదలైంది. డబ్బులు ఇవ్వడానికి ప్రతిమా దేవి నిరాకరించడంతో హిమాన్షు ఆవేశంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.
ఒకటి రెండు రోజుల్లో తిరిగి యధావిధిగా ఫేస్బుక్ పై పోస్టులు పెడుతా ! ������
Who studied in slate They won't eat junk food on their plate
మొన్న .. నా ఒడిలో.. అన్ని రకాల బాధలతో ..
నేడు పుడమి తల్లి ఒడిలో ..
అన్ని కష్టాలు .. బాధలకు దూరంగా .. శాశ్వత సుఖం తో ..
Bye బ్లాకమ్మ !
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.
Oh So Sad to Hear Amarnath Vasireddy Garu, I know How much Anyone will be attached to their Pet.

వ్యక్తిగత బాధని , దుఃఖాన్ని దిగమింగుకొని డ్యూటీ చేయాలి!

ఎందుకంటే పనే దేవుడు.
పిల్లలకు హావభావాలను , డైలాగ్ డెలివరీ మోడ్యులేషన్ intonation డిక్షన్ నేర్పాలి !
ఆదివారం రెండు వార్షికోత్సవ కార్యక్రమాలు. వెనువెంటనే నిన్న స్లేట్ అమీర్పేట్ కార్యక్రమ rehearsal !
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir
Correctly said sir

బ్లాకీ!

Blcakie !
Blcakie !
Blcakie !
Blcakie !

నేను ఎప్పటినుంచో చెబుతున్న “ తూనీగా తూనీగా “ కార్యక్రమం ఈ రోజే!

ఉదయం 9.31 నుండి మధ్యాహ్నం 12.50 వరకు యు ట్యూబ్ లో లైవ్.
ఒక్క నిమషం కూడా మిస్ కాకుండా చూడండి.
@ ఏముంది .. తొక్కలో వాళ్ళ స్కూల్ కార్యక్రమానికి బిల్డ్ అప్ ఇచ్చుకొంటున్నాడు “ అనుకొనే వారికీ నమస్కారం.
యూట్యూబ్ లింక్ కింది కామెంట్ కాలమ్ లో.
ఈ రోజంతా బిజీ. రేపు కలుద్దాము.
ఉదయం కార్యక్రమం తెలుగు - ఇంగ్లీష్ వెర్షన్. ( Slate Bowrampet annual day )
సాయంకాలం 5.26 నుంచి హిందీ ఇంగ్లీష్ వెర్షన్. ( Slate Himayath nagar annual day )
మీరు హిందీ వెర్షన్ చూడాలి అనుకొంటే సాయంకాలం!
శుభోదయం. గుడ్ మార్నింగ్
1. హెల్త్ పరిజ్ఞానం - 7/100
2. ఆర్థిక పరిజ్ఞానం -2/100
3 సామాజిక విషయాలు -34/100
4 పిల్లల పట్ల అవగాహన - 33/100
5. ప్రపంచ పరిజ్ఞానం -15/100
6. రాజకీయాలు -99/100
మొత్తం ఆరు పేపర్లు
ఒక దానిలో హై మార్కులు. మిగతా వి ఫట్.
సమస్యే అదే !!
నేటి సగటు జీవి స్కోర్ కార్డు.
జీవన వైచిత్రి.

షారాదా “ భార్య కేకవేసింది.

“ షారాదా ఏంటే.. నా శ్రాద్ధం ! శారదా అని పలకలేవా ? “
“ అన్నింటికి అరుపులే. కాస్త షున్నితంగా చెప్పలేరా ! “
“ షున్నితం కాదు. నాలుక కోసేస్తా. సున్నితం ! చెప్పు “
“ షనివారం పూట ఆమాటలేందండీ “
“ షనివారం కాదే శని కి చెల్లెలా ! శనివారం. . నీ తెలుగు వినలేక చెవిలో సీసం కాసి పోసుకోవాలనిపిస్తుంది. “
“ షీషా అంటే ఏంటండీ ? “
“ నిన్ను సీమచింత చెట్టుకు ఉరేసినా తప్పులేదు. ఏదైనా అంటే “ షీ టీం కు ఫోన్ చేస్తావు. “
తెలుగు మాష్టారు కు , ఆయన English మీడియం చదువు చదివిన భార్య కు మధ్య.
��������������
మీ కోసం తెలుగు పాఠం.
తెల్గు కాదు. తెలుగు .. బాగా పలకాలి.

ప్రధాని మోడీ తెలుగు నేర్చుకొన్నాడు.

తెలంగాణ రాజకీయాల గురుంచి మాట్లాడానికి బండి సంజయ్ ని ఢిల్లీ కి పిలవాలనుకొన్నాడు.
తానే ఫోన్ చేసి ఱ( “ బండి రా “ ) అన్నాడు. ( just imagination )
తెలుగు లో ఱ అనే అక్షరం ఉందని మీకు తెలుసా ?
దాన్ని “ బండిరా “ అంటరాని తెలుసా ?
ఇదేనండి నిన్న నేను పెట్టిన క్విజ్.
వామ్మో ! ఎన్ని తప్పులో.
మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళుదామనుకొంటా ! మీరు రారు. తెలుగు భాష చచ్చిపోతుంది అంటే బాధ్యత ఎవరిదీ ?
మిమ్మల్ని ఇట్టా కాదు లే. ఇంకో సారి ఇలా తప్పులు చేస్తే తెలుగు లో అచ్చులు హల్లులు వందేసి సార్లు రాయిస్తా !
������������������

మీకో క్విజ్!

ఢిల్లీ లో పెద్దనాయకుడు.
తెలంగాణ కు చెందిన తమ పార్టీ నాయకుడిని ఢిల్లీ కి రమ్మని ఫోన్ చేసి పిలుస్తున్నాడు. ( ఆయన పేరు పెట్టి పిలిచి రమ్మన్నాడు. మొత్తానికీ ఒకే అక్షరం వాడాడు )
ఢిల్లీ నాయకుడు తెలుగు హల్లుల్లో ఒకే అక్షరం చెప్పి ఫోన్ పెట్టేసాడు.
ఇవతలి నాయకుడికి అర్థం అయ్యింది. “ సరే సార్” అన్నాడు.
ఢిల్లీ నాయకుడు ఉపయోగించిన ఆ తెలుగు అక్షరం ఏది ?
ఇది రాజకీయ పోస్ట్ కాదండీ. తెలుగు పరీక్ష !
అమ్మాయిలు డేట్స్ ( రుతుక్రమం - బహిష్టు ) సమయం లో నొప్పితో బాధపడుతున్నారా ?
ఇవి చేయాలి !
1. రోజుకు మూడు లీటర్ల నీరు తాగాలి.
2. జంక్ ఫుడ్ మానాలి.
3. పళ్ళు ఆకుకూరలు కాయగూరలు బాగా తినాలి.
4. పొత్తికడుపు వ్యాయామం చేయాలి. ( నేలపై పడుకొని రెండు కాళ్ళు కాస్త పైకెత్తడం )
5. హీటింగ్ పాడ్ .. డేట్స్ సమయం లో వాడడం.
1 . ఆ సినిమాకు తమ పేరు పెట్టినందుకు పాపం .. మూగ జీవులు .. జంతువులు బాధపడుతున్నాయట .. అలాంటి సినిమాని మానవ మృగాలు చూసి ... ఆనందించి... సూపర్ హిట్ చేసి, మరిన్ని భయంకరమయిన సినిమాలు .. వాటి ప్రేరణ తో హింస , అకృత్యాలు మరింతగా పెచ్చరిల్లే ప్రమాదమున్న సమాజంలో ..
2 . పిల్లలని బడికి పంపాల్సిన అవసరం లేదు . అమ్మ నాన్న ఇంట్లో వర్క్ ఫ్రొం హోమ్ చేస్తారు కనుక పిల్లలకు హోమ్ స్కూలింగ్ ఉంటే సరిపోతుంది అని ... నిండా మునిగిపోతున్న ఎడ్ టెక్ కంపెనీలు ఎలాగైనా కొంత బిజినెస్ చేసుకోవాలి అనే ఆలోచనతో స్పాన్సర్ చేసి వదులుతున్న వీడియోలను నిజమని నమ్మే అమాయక తల్లితండ్రులు ఉన్న లోకం లో ..
౩. పిజ్జా లు బర్గర్ లు పొటాటో చిప్స్ లాంటి జంక్ ఫుడ్ , ఇంకా జన్యు మార్పడి పంటలయిన అమెరికన్ స్వీట్ కార్న్ , సొయా లాంటి వాటిని తెగ తిని అమ్మాయిలు పదేళ్లకే రజస్వల లైతే పదమూడేళ్లకే థైరాయిడ్ పీసీఓడీ లాంటి వ్యాధులబారిన పడితే .. తమ నేరం ఎక్కడ బయటపడుతుందో అని జంక్ ఫుడ్ మల్టీ నేషనల్ కంపెనీ లు తప్పు పాలపై నెడుతూ వీడియో లు పెడితే నిజం అని నమ్మే అమాయకులు ఉన్న లోకం లో { పాలు స్వచ్ఛం అనడం లేదు . నేడు లభ్యం అవుతున్న పాలతో కొన్ని సమస్యలు ఉన్నమాట నిజమే .. కానీ పాలవల్లే అమ్మాయిలు పాలపళ్ళు ఊదడానికి ముందే రజస్వలలు అవుతున్నారు అనేది దొంగ .. వేరొకరిని చూపించి దొంగ దొంగ అని అరవడం } .
4 . అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకే రకం యూనిఫామ్ పెట్టి మన దేశం లోని కొన్ని ఇంటర్నేషనల్ పాఠశాలలు అమెరికా లో జరుగుతున్న లింగ తికమక { పురుషులు పురుషులు కాదు.. స్రీలు స్రీలు కాదు .. అంతా పెద్దల చాదస్తం .. కాలం చెల్లిన భావన .. అమ్మాయిలు అబ్బాయిలుగా మారొచ్చు .. అబ్బాయిలు మరోలా మారొచ్చు .. హాపీ గా లింగాన్ని మార్చుకోండి .. హార్మోన్ థెరపీ చేసుకోండి అనే మెడికల్ మాఫియా ప్రచారానికి పాఠశాలలను వేదికగా చేసుకోవడం }... ఇక్కడ కూడా ప్రారంభిస్తే ఇది సమస్యే కాదు అనుకొనే అమాయకులు ఉన్న లోకం లో ..
5 . తరతరాల నాగరికతను .. సభ్యసమాజ పునాదులను వెబ్సెరీస్ , ఓటీపీ యూట్యూబ్ అన్నిటికీ మించి చేతిలో సెల్ ఫోన్ రెండేళ్లలో ధ్వంసం చేసినా ఇదో సమస్యే కాదు అనుకొనే జనాలున్న లోకంలో ..
6 . గంజాయికి మంచే చేసే గుణం ఉందని తులసి మొక్క స్థానంలో ప్రతి పెరట్లో గంజాయి పెంచుకొనే రోజులో ఎంతో దూరం లో లేని సమాజం లో ..
7 . కొడుకులు అల్లుళ్లను... కూతుళ్లు కోడళ్లను తెచ్చే రోజులు .. పెళ్ళెందుకు ? కలిసి కాపురం చేస్తే పోతుంది .. కావలసినప్పుడు విడి పోవచ్చు .. ఇదే నాగరికత .. పెళ్లి .. కుటుంబం అంతా ట్రాష్ అని చర్చలు పెట్టి జనాల ను బ్రెయిన్వాష్ చేస్తున్న లోకంలో ..
బతుకుతున్న మనం !
కనీసం బాధ్యతగా జనాల్లో అవగాహన తీసుకొనివద్దామా ?
సమాజాన్ని , మానవాళిని బతికించుకొందామా ?
కరోనా తరువాత కాలం లో చెలరేగిపోతున్న రకరకాల మాఫియా ల ఆగడాలకు అడ్డుకట్ట వేద్దామా ?
ఈ ఆదివారం ( డిసెంబర్ 10 ) శిల్పారామం, శిల్పకళా వేదిక లో సరిగ్గా 9. 31 నిముషాలకు ప్రారంభం.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు.
తూనీగా తూనీగ.
గొప్ప పేరెంటింగ్ క్లాస్.
ప్రతి తల్లి తండ్రి తప్పక చూడాల్సిన కార్యక్రమం.
ఫేస్బుక్ మిత్రులు ఫాలోయర్స్ కు ఆహ్వానం.
ప్రవేశం ఉచితం.
Starting at exactly 9:31 AM this Sunday (December 10) at Shilpakala Vedika, Shilparamam.
Starting at exactly 9:31 AM this Sunday (December 10) at Shilpakala Vedika, Shilparamam.
చుండ్రుఆయన : 33 % డిస్కౌంట్ ! వచ్చి చూసి నచ్చితేనే కొనండి. బలవంతం లేదు.
గుండాయన : డబ్బులు వూరికే రావు
జనాలు : అబ్బా ! ఇద్దరిలో ఎవరి మాట వినాలి రా దేవుడా !
��������������
Free Bus
illu ( house ) Kaali okadu edustunte chuttaku nippu ledani inkogadu edustunnadanta.

దాదాపు పది నెలల నుంచి ప్రతి రోజూ పోస్ట్ చేస్తున్నాను.

ఈ రోజు చేయలేదు.
మరి కొన్ని రోజులు పోస్టులు పెట్టను !
కారణం నా చివరి పోస్ట్ ( వీడియో లో ) చెప్పాను!
ఏ పోస్ట్ పెట్టినా దాన్ని తమ రాజకీయ అభిప్రాయాన్ని పోస్ట్ ( comment ) చేయడానికి ఉపయోగించుకొనే ఒక రాష్ట్రానికి చెందిన రెండు పార్టీ ల అభిమానులకు ������

రాజకీయ పెంట. ఛీ ఛీ

తెలివైనోళ్లందరూ అమ్రికా లోనే వుంటారు . అబ్బబబ .. అమెరికా వోల్ల తెలివి తేటలు .. నో భూతం .. నో భవిషత్ ..

వాళ్లకు వచ్చే అవిడియాస్ మామూలుగా వుండవు . వాళ్ళ కొత్త అవిడియాస్ వింటుంటే మనకు సిగ్గు వెయ్యాల్సిందే . మందీ ఒకే మానవ జన్మేనా అని సిగ్గుపడాలసిందే ....
ఆడ , మగ.. నపుంసకులు .. ఇది కదా లింగాల గురించి మనం ఇన్నాళ్లు అనుకొన్నది.
ఇదంతా ట్రాష్. మొత్తం 87 లింగాలు ఉన్నాయని అమ్రికా మారాజులు కనిపెట్టేశారని గత పోస్ట్ లలో చెప్పాను కదా .
అమ్రికా మేధావులు కనిపెట్టిన ఇంకో సరి కొత్త విషయం.
మీకు నాకు ఇప్పటిదాకా ఒకే రకమయిన స్కూల్స్ గురించి మాత్రమే తెలుసు .
అదేనండి మన అజ్ఞానం .
మనం ఇంకా ఆటవిక యుగంలో వున్నామాయె.
కృత్రిమ మేధ యుగంలో అమ్రికన్లు లు కొత్త రకం స్కూల్స్ కనిపెట్టేసారు . మైక్రో స్కూల్స్ ... హోమ్ స్కూల్స్... ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి.
ప్రపంచం లో ఏమి జరిగినా దాని పై మనకు అవగాహన ఉండాలి కదా?
. నాకు ఒక NRI మిత్రుడు పంపిన మెసేజ్ ని మా స్లేట్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేసి " ఇలాంటి కొత్త తరం స్కూల్స్ గురించి మీ మీ అభిప్రాయం చెప్పండి" అని రాత్రి 8 . 39 కి అడిగాను . మా ఎగ్జిక్యూటివ్స్ నాలా లాగా త్వరగా పడుకోరు. వారు లేట్ నైట్ దాక దానికి రిప్లై ఇస్తూనే ఉన్నారు.
నేనేమో త్వరగా పడుకొంటాను. . హోమ్ స్కూల్స్ గురించే ఆలోచిస్తూ రాత్రి కూడా త్వరగా నిద్ర పోయాను . { తెల్లవారు జామున లేచినప్పుడు మా ఎగ్జిక్యూటివ్స్ ఇచ్చిన replies చూసాను . దాని స్క్రీన్ షాట్స్ కామెంట్ కాలమ్ లో వుంది }
రాత్రి నిద్రపోయాక మా ఇంటికి కొంతమంది పెద్దలొచ్చారు . "అయ్యా .. హోమ్ స్కూల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి" అని వారినడిగాను .
జయ ప్రకాష్ రెడ్డి :
ఎందిరా ! ఎందిరా అమెరికా అయ్యా ! ఏందిది ? హోమ్ స్కూలా ? ఏమి తెలివిరా నా తెల్ల తోలు రాజా ? పట్టపగలు .. మిట్ట మద్యాహ్నం పిల్లాడు ఇంట్లో ఉండే స్కూలా? దున్నపోతా ? పిల్లాడు ఇంట్లోనే ఉంటే వాడికి సామజిక తెలివితేటలు ఎడ్నించి వస్తయిరా ? వాడు రేప్పొద్దున పెళ్ళాంతో అయినా కాపురం చెయ్యగలుగుతాడా ? ఇదేమి తేలితేటలురా నా జులపాల రాజా !
సూర్యకాంతమ్మ :
ఏడ్చావులే .. తింగరచచ్చినోడా ! చదవేస్తే ఉన్న మతి పోయిందంట ! ఇంట్లో పెరిగిన కుక్క ను వీధిలో వదిలేస్తే బతుకుతుందా ? పిల్లాడిని ఇంట్లోనే ఉంచి చదివిస్తే రేపు వాడు సమాజం లో ఎలా బతుకుతాడురా ? అమెరికా లో దిబ్బరొట్లు తినీ తినీ ఇట్లా అయిపోయారురా ! కూసిన్ని నువ్వుల లడ్లు పంపుతా . తిని చావండి . చావు తెలివి తేటలు చూపకండి .
సుత్తి వీరభద్ర రావు :
తమరి శ్రాద్ధం .. పిండా కూడు . బలిసిన దున్నపోతు కు ప్యాంటు తొడిగినట్టు . ఆహా ఏమి ఫేసులురా... మీ పిండం పిల్లలకు పెట్టా. హోమ్ స్కూల్ ఏంట్రా ? హోమ్ హోమే! స్కూల్ స్కూలే.! కక్కూసు డైనింగ్ టేబుల్ .. డైనింగ్ టేబుల్ టాయిలెట్ .. ఇలా ఉంటుందేంట్రా ? టాయిలెట్ లో కమోడ్ పైన కూర్చొని పిజ్జా లు తినే పేస్ లు చూడు . డైనింగ్ టేబుల్ పైన పెట్టిన టిష్యూ పేపర్ తో ముడ్డి తుడుచుకొని దానితోనే నోరు తుడుచుకొనే సన్నాసుల్లారా ! మళపత్రాష్టులార ! పోతారు రే .. పోతారు .. జూ లో పుట్టి పెరిగిన సింహం పిల్లను అడవిలో వదిలేస్తే వేటాడి బతకగలదా? రెండు రోజుల్లో కడుపు మాడి చచ్చి ఊరుకుంటుంది. స్కూల్ నేర్చేది కేవలం పుస్తకాల్లోని పాఠాలే కాదురా . నలుగురు పిలల్లతో కలిసి మెలగడం .. దీన్నుంచి.. ఏది మంచి? ఏది చెడు? అని గ్రహించడం .. దీన్నే సోషల్ ఇంటలిజెన్స్ అంటారు . ఇంట్లో కూర్చో పెట్టి చదివిస్తే... తమరి పిండా కూడు.... పిల్లాడు టార్జాన్ అయిపోడా! అశుద్ధ బక్షకా !
వేణు మాధవ్ :
అబ్బబ .. ఏమి బిల్డ్ అప్ అన్నా.. బయ్యా జ్యూస్ లాంటోడిని తిరిగీ నిలబెట్టేందుకు ఇస్తున్న బిల్డ్ అప్ . మనోళ్లది అసలే బట్టి చదువులు . బుర్రలో మొత్తం బంక మట్టి . స్కూల్ అంటే అర్థం కూడా తెలియదా ?
శంకర శాస్త్రి { సోమయాజులు } .
ఎడ్యుకేషన్ ఐస్ డివైన్ .. whether ఇట్స్ వెస్టర్న్ ఆర్ ఇండియన్ . పిల్లలు నేర్చుకొనే విధానం ఒక్కటే .. వారికి సామజిక తేలితేటలు .. భావోద్వేగ తెలివి తేటలు కావాలి . అప్పుడే... మనిషి మనిషి లా బతుక గలుగుతాడు . ఆన్లైన్ .. హోమ్ స్కూల్ పేరుతొ ఇంట్లో కూర్చోపెడితే .. లేదా వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే పిల్లలని స్కూల్ కు పంపితే వారికి... క్రమ శిక్షణ, సమయపాలన, గ్రూప్ బిహేవియర్ అలవడదు. ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోయి మానసిక ఉన్మాదులుగా తయారవుతారు . మనుషులు చచ్చినా పరవా లేదు లేదు ..మన బిజినెస్ బాగుంటే చాలు అనే దౌర్భాగ్యుల నుంచే ఇలాంటి ఐడియాస్ వస్తాయి . ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని స్థితి లో తల్లితండ్రులు ఉంటే ఇక రాబొయ్యే తరాల గురించి తలచుకొంటే భయం వేస్తుంది .
అదండీ .. మా ఇంటికి రాత్రి వచ్చిన పెద్దలు చెప్పిన మాటలు .
ఇంతకీ మీరేమంటారు ?

ఏపీ కోసం!

Sir i want to know the thirupathi residential school fees for tenthclass(CBSE ), is any way to know
గూడూరు - నెల్లూరు మధ్య జలప్రళయానికి అవకాశం.
జాగ్రత్త.
తిరుపతి ప్రాంతాలకు ముప్పు తగ్గినట్టే !

���� జ్యోతిష్యం :

వేదాంగాల్లో ఒకటి.
గ్రహాల స్థితిగతులు , వ్యక్తుల నామ నక్షత్రాలు … మొదలయిన వాటి ఆధారంగా వ్యక్తి భూత భవిషత్తు వర్తమాన కాలాల గురించి చెప్పడం.
������జీకే జ్యోతిష్యం.
1 . మీడియా లో వచ్చే వార్తల ఆధారంగా ఏమి జరిగే అవకాశం ఉందొ గెస్ చేయడం. దానికి జ్యోతిష్యం కలర్ ఇవ్వడం.
2 . రాజకీయ పార్టీ లకు తాబేదారు అయ్యి అవతలి పార్టీ వారిని మానసికంగా బలహీనులు చేయడం ; తమ పార్టీ కి జాకీ వెయ్యడం. అంటే పొలిటికల్ బ్రొకెరిజం
3. యూట్యూబ్ చానెల్స్ కు వ్యూస్ పెంచి వారినుంచి డబ్బు పొందడం.
����������������
తప్పు జీకే జ్యోతిష్యులది కాదు.
వారిని గుడ్డిగా నమ్మే బకరాలది .

ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ లో ఉన్నా!

ఇప్పటిదాకా ఒక్క సారి కూడా అసెంబ్లీ లోకి వెళ్ళలేదు. ( ఒక సారి జూబిలీ హాల్ లో ప్రభుత్వం నిర్వహించిన చర్చ కోసం అధికారిక ఆహ్వానం మేరకు వెళ్ళా )
ఏ పార్టీ కార్యాలయం లోకి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ( టి న్యూస్ లైవ్ చర్చ ల కోసం వారి ఆహ్వానం మేరకు అయిదారు సార్లు వెళ్ళా )
ఏ నాయకుడిని వ్యక్తిగతం గా కలవలేదు. ( రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రులను అధికారిక కార్యక్రమాల్లో కలిశా )
ఒకే ఒక సారి సచివాలయానికి వెళ్ళా. ( నేదురుమల్లి రాజ్యలక్ష్మి విద్యా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు).
����������
అధికారం .. దర్పం .. టెక్కు .. చంచాగిరి .. ఇవన్నీ నాకు ��
బిస్కెట్ వెయ్యలేక పీహెచ్డీ వదిలేసినోడిని.
నా విద్యార్థులు ఉన్నత పదవుల్లో. ఏదో పనిగా వారు నాకు ఫోన్ చేస్తారు కానీ .. నేను కాదు. ( మొన్ననే ఆసిఫాబాద్ ఉన్నతాధికారి .. నా శిష్యుడు తన అమ్మాయి చదువు గురుంచి చేసాడు )
ఎంత వినమ్రంగా ఉంటానో .. అంత ఆత్మభిమానం.
నిన్న ఇద్దరి పేర్లు పోస్ట్ చేశాను.
ఇక అమర్నాథ్ అసీంబ్లీ చుట్టూ తిరుగుతాడేమో అని ఎవరైనా అనుకోవచ్చు .. అందుకే క్లారిటీ.
( పోస్ట్ చేసింది రెండు పేర్లు .. ఇంకో డజన్ దాకా వున్నారు. అయితే ఏంటట? వారి పని వారిది. మన పని మనది. )
అమర్నాథ్ ఎలాంటోడో చెప్పడానికి ఒక ఉదాహరణ. మీరు నమ్మరు. కొంతమంది బిల్డ్ అప్ అనుకొంటారు. నో ప్రాబ్లెమ్.
ఆయన ఇప్పుడు పెద్ద నాయకుడు. ఆయన అప్పోయింట్మెంట్ కోసం జనాలు పడిగాపులు. నేనేమో నెంబర్ బ్లాక్ చేసి పెట్టా. కారణం “ వీరికి సీట్ .. వారికీ సీట్ “ అని చీటిమాటికి ఫోన్. ఆ పిల్లలేమో అన్నిరకాల వ్యసనాలు. సీట్ ఇస్తే అప్పుడు మనకు తలనొప్పి.
ఇంకో ఆయన. అప్పుడు మినిస్టర్. ఇప్పుడు కీర్తి శేషులు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా నేను దొరక్క పోయేటప్పటికీ ప్రోటోకాల్ పక్కన పెట్టి private వెహికల్ లో స్కూల్ కు వచ్చాడు.
పిస్తా .. vip నో కాదండీ.
ఒక టీచర్ ఆత్మవిశ్వాసం. నిజాయతీ ఇచ్చే దమ్ము !
��������
డిసెంబర్ లో తుఫాను వల్ల వచ్చే వర్షాలు విధ్వంసం సృష్టిస్తాయి.
ఇప్పటికే చెన్నై లో భారీ వర్షాలు .
తిరుపతి రాజంపేట నెల్లూరు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
// Fax TSPMS Message / Urgent //
తెలంగాణ డిప్యూటీ సీఎం గా పదవి చేపట్టనున్న సెంట్రల్ యూనివర్సిటీ batchmate మిత్రుడు భట్టి మామ ( మల్లు భట్టి విక్రమార్క ) కు హార్థికాభినందనలు!

మాజీ ఐఏఎస్ , IPS లు రాజకీయాల్లో ఎందుకు రాణించలేకపోతున్నారు ?

సొంతంగా ఒక పార్టీ పెట్టి ప్రధాన పార్టీ లతో పోటీ పడి దాన్ని నడపలేని స్థితి. లేదా ఇక్కడ అంతగా బలం లేని పార్టీ లను నడపలేని స్థితి.
అధికారిగా ఒక స్థానానికి ఎదిగాక ఒక నిర్దిష్ట వ్యక్తిత్వం , నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఆ దశలో వారు ఏదో పార్టీ లో చేరి ఆ నాయకుని కనుసన్నల్లో ఉండలేరు. Individuality అనండి లేదా ఇగో.
తెలుగునాట ముగ్గురు నాయకులు ఇదే బాటలో ( అధికారం సాధించడమే విజయం , కాబట్టి వారు ఫెయిల్ అని నేను అనడం లేదు )
ఏది ఏమైనా ఐఏఎస్ ఐపీఎస్ లు రాజకీయాల్లోకి రావడం ఇక తగ్గుతుంది.
( ముగ్గురూ నాకు సన్నిహితులు. దయ చేసి పరుష వ్యాఖ్యలు వద్దు )
రాజకీయ పోస్ట్ లు ఈ రోజు. తరువాత వుండవు అని చెప్పాను. డెడ్ లైన్ లోపు .. ఒక అంశం.
హైదరాబాద్ సిటీ లో గెలుస్తున్న వారిలో సగానికి పైగా జంప్ జిలానీలు అయ్యే అవకాశం.

“ ఎండలో కూర్చుంటే కరోనా తీవ్రత తగ్గి పోతుంది. “

“ రెండో వేవ్ పూణే గాడి పని. “
“ ఓమిక్రాన్ వేవ్ తుస్సు. “
“ వాక్ సీన్ వద్దు. “
“ తెలంగాణా లో తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత ! కాంగ్రెస్ సునామి. “
��������������
జరిగింది చెబుతాము .. జరగబోయేది చెబుతాము.
రండి బాబూ రండి .. చిలక జ్యోస్యానికి మించిన పలక జ్యోస్యం.
పలక మాస్టారి ఉచిత జ్యోస్యం.
��������������������
మాయ లేదు. మంత్రం లేదు.
అంతా సైన్స్.
పోలింగ్ కు అయిదు రోజులకు ముందు , ఎవరికీ అర్థం కాకుండా ఈ పోస్ట్ పెట్టాను.
ఇప్పుడు అర్థం అయ్యిందా ? ( నంబర్స్ చూడండి. )
ఆగండాగండి. పోలింగ్ ముగిసిన వెంటనే పెట్టిన పోస్ట్ లో చివరి వారం లో ఉత్తర తెలంగాణ లో బీజేపీ బాగా పుంజుకొందని , మూడు వస్తాయి అనుకొంటే 8 వస్తుందని ఆ మటుకు కాంగ్రెస్ తగ్గుతుందని పెట్టాను. కాంగ్రెస్ కనిష్టంగా 65 గరిష్టంగా 80 అని రాసాను.
అన్ని పోస్ట్లు అలాగే వున్నాయి. చెక్ చేసుకోండి.
Not sure andee. Can’t trust any media reports.
Not sure andee. Can’t trust any media reports.
Not sure andee. Can’t trust any media reports.
Not sure andee. Can’t trust any media reports.
Not sure andee. Can’t trust any media reports.
తెలంగాణ ఉద్యమానికి ఛోదక శక్తి విద్యార్థులు - యువజనులు.
ఇప్పుడు జరుగుతున్న రాజకీయ మార్పుకు కూడా వారే చోదక శక్తి.
విద్యార్ధి - యువజన వర్గంనుంచి కొత్త అసెంబ్లీ కి ఎన్నిక కోబోతున్న శిష్యుడు మేడిపల్లి సత్యం కు హార్థికాభినందనాలు. ( ఉస్మానియా పూర్వ విద్యార్థి. చొప్పదండి కి కాబోతున్న MLA )

అర్థమయ్యిందా ?

Not sure andee. Can’t trust any media reports.
2003 !
అప్పటికి మా స్కూల్ ప్రారంభించి రెండేళ్లయ్యింది.
వార్షికోత్సవ కార్యక్రమం పబ్లిక్ గార్డెన్స్ లో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో జరుగుతోంది.
ఉన్నట్టుండి principal స్టేజి పైనుండి, నన్ను వేదిక పిలిచారు.
షాక్ లో నేను.
సభా మర్యాద కదా. వెళ్లక పొతే బాగుండదు ; వెళ్ళాను.
నాకు సన్మానం మొదలెట్టారు.
నా స్కూల్ లో నాకు సన్మానం ఏంటో.
ఒళ్ళు మండుతోంది. ������
సన్మానం ముగిసింది. ఇంటికి వచ్చేసాను.
మరుసటి రోజు ప్రిన్సిపాల్ ను ఆ కార్యక్రమం లో పాల్గొన్న మరో ముగ్గురిని వారం రోజులు suspend చేసాను.
అప్పటినుంచి ఇప్పటిదాకా మా స్కూల్ లో నన్ను పొగడాలంటే అందరికీ దడ !
పైకెత్తే వారు ఎప్పటికైనా ముంచేస్తారు.
వాస్తవాన్ని నీకు కనబడనీయరు.

రాజకీయాలు కాంప్లెక్స్ గేమ్ !

డబ్బు , అధికారం , కులం , సెంటిమెంట్ , మీడియా , ప్రచారం .. ఇలా ఎన్నో ఎన్నెన్నో అంశాలు ..
... వీటన్నింటికీ మించి ప్రజలు ఎలా అర్థం చేసుకొన్నారు { perception } అనేది ..
విద్య ఆరోగ్యం ఆర్థిక చారిత్రక అంశాలపై విశ్లేషణ చేస్తున్న నేను , రాష్టం లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను సరిగా అర్థం చేసుకోగలుగుతానా ? ప్రజల ఆలోచన తీరు ఏ విధంగా ఉంది? ఇంతటి బృహత్ అంశాన్ని సరిగా గ్రహించగలుగుతానా ? .... అని నాకు నేనే టెస్ట్ పెట్టుకొన్నాను .
చాలా ఫెయిర్ గేమ్ ఆడాను { ఫెయిర్ గేమ్.. అవునో కాదో మీరే చెప్పాలి } ... ఎన్నికలు ముగిసే దాక ఏమీ మాట్లాడలేదు . నా పోస్ట్ ల వల్ల ఒక రెండు ఓట్లు కూడా అటుఇటుగా పడకూడదు . అణుమాత్రం అయినా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయకూడదు అని .. పోలింగ్ ముగిసాక, నా అంచనా పోస్ట్ చేశాను .
గ్రామాల్లో , టౌన్స్ లో రోజూ ప్రజలతో మమేకం అయ్యేవారు .. ఏ రాజకీయ పార్టీ కి తాబేదారు కానివారు .. ఉన్నతాధికారులు .. ఇలా కనీసం ఇరవై మంది నుంచి సమాచారం సేకరించాను . దాన్ని బేరీజు వేసాను . విశ్లేషణ తో పోస్ట్ చేశాను . నిన్నటి పోస్ట్ లో మరింత లోతైన విశ్లేషణ అందించాను .
ఈ రోజు ఎన్నికల ఫలితాల పట్ల నాకు ఎలాంటి టెన్షన్ లేదు . ఫలానా పార్టీ గెలవాలి .. ఇంకోటి ఓడిపోవాలి... అనే ఉబలాటం లేదు .
నా అంచనా సరైతే పొంగిపోను . ఆ ఘనత నాకు గ్రౌండ్ లెవెల్ సమాచారం ఇచ్చిన మిత్రులకు దక్కుతుంది .
నా అంచనా తప్పైతే .. ఎక్కడ పొరపాటు జరిగింది అని ఆత్మ విమర్శ చేసుకొంటాను .
రాజకీయ పోస్ట్ లు ఇక యధావిధంగా నానుంచి ఉండవు..{ అంతగా అవసరం అనిపిస్తే ఈ రోజు ఒక్కటి .. మళ్ళీ ఎప్పటికో} .. యధా ప్రకారం సామజిక ఆర్థిక అంశాలపై పోస్ట్ లు ఉంటాయి .
రాజకీయ పోస్ట్ లు పెట్టాలంటే .. నిజానికి భయపడ్డాను . "అజాతశత్రువుగా ఉన్నాము.. ఆనవసరంగా అపార్థాలకు గురవుతామేమో " అని ఒకటికి రెండు సార్లు ఆలోచించాను .
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పదివేల కోట్లు బెట్టింగ్ నడిచిందట . ఇంతటి దారుణ పరిస్థితుల్లో .. నాకు నయాపైసా ప్రయోజనం లేకపోయినా ఒక ఇంటలెక్చువల్ పర్సుయిట్ గా అధ్యయనం , విశ్లేషణ చేశాను .
నా విశ్లేషణకు .. ముఖ్యంగా నిన్న పెట్టిన ఇగో పోస్ట్ కు ఎంతో మంది పెద్దవారి నుంచి కూడా అభినందనలు వచ్చాయి .
అందరికీ ధన్యవాదాలు !

వికారాబాద్ అడవికి క్షేత్ర పర్యటన.

Field trip to Vikarabad forest.
Field trip to Vikarabad forest.
Field trip to Vikarabad forest.
Field trip to Vikarabad forest.
Field trip to Vikarabad forest.
Field trip to Vikarabad forest.
Field trip to Vikarabad forest.
Field trip to Vikarabad forest.
Field trip to Vikarabad forest.
Field trip to Vikarabad forest.
Field trip to Vikarabad forest.
Field trip to Vikarabad forest.
Field trip to Vikarabad forest.
Field trip to Vikarabad forest.

పాప ఏ స్కూల్ లో చదువుతుందో ఇట్టే కనిపెట్టేయొచ్చు.

ఎగ్జిట్ పోల్స్ అంటూ నిజంగా జరిగితే .. అన్నింటి ఫలితాలు ఒకటేలా .. కనీసం దగ్గదగ్గరగా ఉండాలి కదా ?
ఇప్పుడు కాదు , గత అనేక ఏళ్లుగా ఎగ్జిట్ పోల్స్ గోడ మీది పిల్లలా ఎటూ తేల్చకుండా చెబుతాయి. ఎందుకని ?
1. క్లియర్ గా తేల్చేస్తే బెట్టింగ్ ఎలా నడుస్తుంది ? ఎన్ని ఎగ్జిట్ పోల్స్ బెట్టింగ్ మాఫియా చేత స్పాన్సర్ అవుతాయో ?
2. ఫలితాలు ముందు క్లియర్ గా తెలిసిపోతే కౌంటింగ్ రోజుదాకా సస్పెన్స్ ఏముంటుంది ? 24 న్యూస్ channels కు కంటెంట్ ఏముంటుంది ?
3. ఒక వేళా బొటాబొటీ మెజారిటీ లాంటి పరిస్థితుల్లో హార్స్ ట్రేడింగ్ కు అవకాశం ఎట్లుంటుంది ?

ఇగో పై కొడితే ?

చరిత్రలో మధ్య యుగం .. ఫ్యూడల్ కాలం .
అధికారం భూస్వాముల చేతుల్లో .
బతుకు తెరువు కోసం వారి కింద పనిచేసే సాధారణ జనం . ...
ప్రపంచ మంతా ఇదే సీన్ .
ఆ రోజుల్లో సమాజంలో రెండే రెండు తరగతులు .
1 . ఉన్నత తరగతి - రాజులు , భూస్వాములు ఇంకా అధికారగణం .
2 . లోయర్ క్లాస్ - నూటికి తొంబై అయిదు శాతం ... బానిసలుగా, బంట్రోతులుగా , కౌలుదారులుగా బతుకీడ్చినవారు .
ఆ రోజుల్లో మధ్య తరగతి { మిడిల్ క్లాస్ } అనేది పెద్దగా లేదు .
లోయర్ క్లాస్ జనాలు" బాంచెన్ .. కాల్మొక్కుతా ".. "జీ హుజుర్ " అని బతికారు .
ఆలా చెయ్యకపోతే బతికే అవకాశం లేదు .
అది ఆ యుగ ధర్మం .
ఆధునిక కాలం లో పారిశ్రామిక విప్లవం తో మధ్య తరగతి ఏర్పడింది .. లేదా ఖచ్చితంగా చెప్పాలంటే బలపడింది .
అయ్యా .. గత నాలుగు వందల సంవత్సరాల మానవ చరిత్ర కు చోదక శక్తి... ఈ మధ్య తరగతే .
మిడిల్ క్లాస్ కు ప్రియమయింది ... ఆత్మాభిమానం !
కడుపుపై కొడితే ఒప్పుకొంటారేమో... కానీ ఇగో పై కొడితే సహించరు .
అదే మిడిల్ క్లాస్ ..
ఫ్రెంచ్ విప్లవానికి ప్రధాన కారణం మిడిల్ క్లాస్ ఇగో హర్ట్ కావడం .
అలాగే అమెరికా లో విప్లవానికి కూడా ఇదే ప్రధాన కారణం ." మేము ఇక్కడ స్థిరపడ్డాము .. మా పై మీ పెత్తనం ఏంటి అని మాతృ దేశ{ ఇంగ్లాండ్ } పాలన పై తిరగబడ్డారు .
మిడిల్ క్లాస్ కు ఆత్మాభిమానం ఆక్సిజన్ కంటే మిన్న అని ఈ రెండు విప్లవాలు తేల్చేశాయి .
చరిత్ర నుంచి పాలకులు పాఠాలు గ్రహించరు. భారీ మూల్యాన్ని చెల్లించుకొంటారు .
భారత స్వాతంత్రోద్యమాన్ని నడిపింది చదువుకొన్న మధ్య తరగతి వర్గం . 1835 ఆధునిక విద్య ప్రవేశ పెట్టడంతో మన దేశం లో మిడిల్ క్లాస్ ఎదిగింది . అప్పటిదాకా భారతీయులు " తెల్ల దొరలు చదువుకున్నవారు .. "వారితో మనం ఎక్కడ సాటి? " అని బతికేసారు .
కుక్కలకు భారతీయులకు ప్రవేశం లేదు అని తెల్ల దొరల గేట్లకు ఆ రోజుల్లో బోర్డు లు వేలాడేవి .
{ { వీర పాండ్య కట్ట బొమ్మనలు నరసింహ రెడ్డిలు వున్నారు .. కానీ ఇవి మినహాయింపులు }
చదువుకొన్న భారతీయుల్లో ఆత్మాభిమానం ఏర్పడింది .
" ఎవరికంటే తక్కువ మేము?" అనే భావన క్రమేపీ వ్యాపించింది .
కానీ తాము చదువుకొన్న వారైనా తమకు కనీస గౌరవం ఇవ్వడానికి తెల్లదొరలు రెడీ గా లేరు అని వారు గ్రహించరు .
అదే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు మూలం . { మొన్నేమో బ్రిటిష్ వారు సేఫ్టీ వాల్వ్ గా ఉండాలి అని కాంగ్రెస్ స్థాపనకు ప్రోత్సాహం ఇచ్చారు అని పోస్ట్ పెట్టారు . ఇప్పుడేంటి ఇలా? అనుకొంటున్నారా ? అదీ కరెక్ట్ .. ఇదీ కరెక్ట్ .. వారొకందుకు .. మనవారొకందుకు .. అదీ పాయింట్ } .
కార్మికులు కర్షకులు లాంటి వారు క్రమక్రమంగా 1920 - 30 నాటికి స్వాతంత్రోద్యమం లో చేరారు .
అది నుంచి... చివరి దాక ఉద్యమాన్ని నడిపింది మిడిల్ క్లాస్ .
నవాబుల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం కూడా స్థూలంగా ఆత్మభిమానోద్యమం .
ఎన్టీఆర్ కాంగ్రెస్ పాలన పై తిరగబడి తెలుగుదేశం పార్టీ ని స్థాపించడం .. విజయం సాధించడం .. సమీప చరిత్ర . " తెలుగువాడి ఆత్మాభిమానం “ అనేది ఎన్టీఆర్ నినాదం .
తెలంగాణ ఉద్యమం . తొలి దశ , మలి దశ .. ఈ రెండింటిలో కీలకం .. తెలంగాణా ప్రజల ఆత్మాభిమానం .
నీళ్లు నియామకాలు నిధులు .. ఇవన్నీ ఆత్మాభిమానం తరువాతే .లేదా ఆత్మాభిమానం తో ముడిపడిందే !
అయ్యా .. పాలకులూ.. అదండీ చరిత్ర ..
ఇప్పుడు నడుస్తున్నది మిడిల్ క్లాస్ యుగం .
మీరు దోపిడీ చేసినా... కడుపుపై కొట్టినా ... సహిస్తారు....
కానీ ఇగో హర్ట్ చేస్తే క్షమించరు .
ఎంత అభివృద్ధి చేసినా... ఇగో హర్ట్ అయ్యింది .. తమకు ఇవ్వాల్సిన గొరవం ఇవ్వలేదు అనుకొంటే ... ఇక అంతే సంగతులు .
ఇది యుగ ధర్మం స్వామి .
కేవలం రాజకీయాలకు కాదు . సాధారణ జీవనం లో కూడా ఇది వర్తిస్తుంది . మీ పనిమనిషి ని ఒక మాట అనిచూడండి . మీరు వెయ్యి రూపాయిలు ఎక్కువ జీతం ఇచ్చినా తిరిగి పనికి రాదు .
మా సంస్థ లో డ్రైవర్ లు ఆఫీస్ బాయ్ లు ఆయమ్మలు సుమారుగా వెయ్యి మంది వున్నారు . వారికి నెల జీతం సరైన సమయానికి ఇచ్చినప్పటికన్నా... స్కూల్ లో ఆయమ్మలు కూర్చోవడానికి పదేళ్ల క్రితం నేను కుర్చీ లు ఏర్పాటు చేస్తే ఎక్కువ ఆనంద పడ్డారు .
వారికోసం విందు ఇచ్చినప్పుడు వారిని నాతో సెల్ఫీ తీసుకోనిస్తే.. వారి భుజంపై చెయ్యి వేసి నిలబడితే { ఆఫీస్ బాయ్ లు డ్రైవర్ లు } ఫుల్ కుష్ . వారికి విందులో నేను వడ్డిస్తే "మా సారు.. " అంటూ ఆనంద బాష్పాలు .
ఒక సారి మా అడ్మిన్ ఆఫీసర్ ఆయమ్మల మీటింగ్ పెట్టింది . వారినందరిని కింద కూర్చోమని తాను కుర్చీ పై కాలుపై కాలువేసుకొని కూర్చొని మాట్లాడింది .
అటు పై ఆ ఫోటో చూసిన నేను ... ఆమెకు ఒక క్లాస్ పీకి ... నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశాను .
మనోళ్లు అమెరికా కెనడా లాంటి దేశాల్లో హోటల్ వెయిటర్ లుగా గ్యాస్ స్టేషన్ లో అసిస్టెంట్ లు గా పని చేస్తారు .
ఇక్కడ మాత్రం ఛాన్స్ లేదు .
కారణం .. పనోళ్ళను తక్కువ చేసి చూసే పనికిమాలినోళ్లు మన సమాజం లో కోకొల్లలు .
సాటి మనిషికి గౌరవం ఇవ్వండి స్వామి .
మీరేమీ స్వర్గ లోకం నుంచి డైరెక్ట్ గా ఊడిపడలేదు .
ఆత్మాభిమానం నినాదంతో పైకొచ్చిన నాయకుడు... అయన అనుచరణ గణం.... ఫ్యూడల్ లక్షణాలు కనబరిచి సాధారణ జనాలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే .. ఎన్ని ఇచ్చినా .. ఎన్ని పధకాలు పెట్టినా... ఎంత అభివృద్ధి చేసినా... ఒక సంఖ్యను సున్నతో గుణించినట్టే . కసితో వ్యతిరేకంగా గుద్దేస్తారు .
ఇదే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ .
అర్థం కాకపోతే రేపు చూడండి .
పాలకులూ .. పరిపాలనలో... ప్రజల్ని గెలవనివ్వండి . కావాలని కుట్రలు పన్ని ... కృత్రిమ ఉద్యమాలు లేవదీసే వారిని అణిచేయండి . తప్పు కాదు .
కానీ ప్రజల సమస్యలపై వారిని మాట్లాడనివ్వండి . ఒక స్థాయి ఉద్యమాలు జరగనివ్వండి . ప్రజల్లో గూడు కట్టుకొన్న అసంతృప్తికి అది ఒక కవాటం లాంటివి .
ఒక ధర్నా చౌక్ లేకపోతె అది వందల గ్రామాల్లో ప్రతిచర్యకు కారణభూతం అవుతుంది .
ప్రజల్లో బలమైన ఆకాంక్ష వున్నప్పుడు ఒక అడుగు తగ్గాలి నాయకులూ ...
. ఎక్కడ తగ్గాలో... ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడే నాయకుడు .
ఒక బషీర్బాగ్ లేకుంటే? .. విద్యుత్ చార్జీ లు ఎంతో కొంత తగ్గించి ప్రజల్లోని అసంతృప్తిని పట్టించుకోని ఉంటే ?
ఉద్యోగార్థులు రోడ్ ఎక్కి నోటిఫికేషన్ ఇవ్వాలని ధర్నా చేస్తే .. ట్రాఫిక్ జాం అయ్యిందని ప్రజా వ్యతిరేక రాతలు రాకుండా ఉంటే ?
.. కేవలం DSC కాకుండా గ్రూప్స్ నోటిఫికేషన్ లు కూడా ఇచ్చివుంటే ?
చరిత్ర గమనం మరోలా ఉండేది...
అవునా ? కాదా ?
ప్రజా ఉద్యమాలకు లొంగితే మళ్లీమళ్లీ ఉద్యమాలు వస్తాయి .. కాబట్టి తగ్గొద్దు.. అని ఎవడో చరిత్ర పై అవగాహన లేని ఒక మేధావి ఇచ్చిన సూచన పాటిస్తే .. ఏమైంది ?
ప్రజలను ఓడించాలని చూస్తే ఎట్టా సాములు?
ప్రజల్ని గెలవనివ్వండి .
ప్రజల గెలుపే మీ గెలుపు .
ఇంకో మాట .. మహా రాజులే మారు వేషాల్లో వెళ్లి పాలన గురించి ప్రజలు ఏమనుకొంటున్నారో తెలుసుకొనేవారు . ఎలక్షన్ లు లేని కాలం లో కోటగోడలకు ధర్మ గంట వేలాడదీశారు.
. మొన్న మొన్నటి చరిత్రలో కూడా ఒక నాయకుడు ప్రజలు తనని కలవడానికి తన క్యాంపు ఆఫీస్ ను వేదిక గా చేసుకొన్నాడు .
. అందుకే కదా ప్రజలకు అంత ఇష్టుడు అయిపోయాడు .
ప్రతి ఒక్కరిలో నెగటివ్ ఉంటుంది .. పాజిటివ్ ఉంటుంది .
మనిషి .. వ్యవస్థలు .. పాలకులు.. నాయకులు.. ఆత్మ విమర్శ చేసుకోవాలి .
చేసిన తప్పులను గ్రహించి మారాలి .
మంచి ఎక్కడున్నా గ్రహించాలి .
అన్నిటికీ మించి కాలం చెప్పే... చరిత్ర చెప్పే... పాఠాల్ని గ్రహించాలి .
కారే రాజులు .. రాజ్యముల్ కలుగవే .. గరఁవ్వోన్నితింబొందరే ..
వారేరీ .. సిరి మూటకట్టుకొని పోవంజాలిరే భూమిపై ..
పేరైన కలదే శిబిప్రముకులం బ్రీతిన్ యసః కాములై
యీరే కోర్కెలు వారలం మరచిరే ఇక్కాలమున్ భార్గవా !

మీ కెవ్వరికీ తెలియని నా జీవితం !

ఇదిగో నా బెడ్ రూమ్ !
అయిదు రోజుల క్రితం రాత్రి రెండు గంటలకు ఉలిక్కి పడి లేచాను.
మా బ్లాకమ్మ ( బ్లాకీ ) గుర్తుకు వచ్చింది.
తనకు ఇరవై రోజులుగా ఆరోగ్యం సరిగా లేదు.
ప్రతి రోజు నా పక్క్కన పడుకునేది.
ఇరవై రోజులుగా పక్క బెడ్ రూమ్ లో .. వాళ్ళ అమ్మతో ( మా శ్రీమతి. మనవడి సంరక్షణ లో ఆమె రాత్రంతా తలమునకలు - మూడు నెలల బాబు -అందువల్ల వేరుగా )
బ్లాకమ్మ కు లివర్ .. గాల్ bladder సమస్య.
పాపం నొప్పితో మూలుగుతోంది .. తిండి సరిగా తినడం లేదు. బాగా బలహీన పడింది. డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతున్నాము.
రెండు గంటలకు మెలకువ వచ్చిన వెంటనే మా బ్లాకమ్మ ఇక ఎక్కువ రోజులు ఉండదు అనిపించింది.
ఇదిగో నా బెడ్ రూమ్ లో .. అటు వైపు .. ఇటు వైపు దర్జాగా వెంకీ.
రోజు నిద్ర లేచిందే నేను వెంకీ ని చూసి అడిగేది ఒక్కటే “ ఈ రోజు సంతోషంగా వుండేటట్టు చేయి స్వామి “
కానీ మొన్న రెండు గంటలకు లేచినప్పుడు “ మరీ అన్యాయం స్వామీ .. నేను ఎప్పుడు ఏమి అడిగినా కఠినాత్ముడిలా వ్యవహరించావు. రితిక ను కాపాడమని 2005 లో అడిగా. పందెం వేసుకొని నాకు గర్భ శోకం మిగిల్చావు. పోయిన ఏడాది జస్సి ని కాపాడమని వేడుకున్నా. ఇంకో సారి శాడిస్ట్ గా వ్యవహరించావు. కనీసం ఇప్పుడు బ్లాకీ నైనా ఇంకో మూడేళ్లు బతికించు. “
ఈ రోజు బ్లాకమ్మ .. దాదాపు ఇరవై రోజుల తరువాత బాగా తిండి తినింది. నా దగ్గర ఖీర తినడం తనకు ఇష్టం. .. ఉత్సాహం గా వుంది.
మా బ్లాకమ్మ బతికితే అదే మాకు పండుగ.
నా లాగే ఉష పిచ్చిది. ఈ రోజు బ్లాకమ్మ బాగుంది అనే వార్త ఫుల్ కుష్ గా ఇందాకే చెప్పింది.
My life that none of you know !
My life that none of you know !
My life that none of you know !
My life that none of you know !
My life that none of you know !
My life that none of you know !
My life that none of you know !
My life that none of you know !
కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయమాట. నా వ్యక్తిగత అభిప్రాయాన్ని జనాల అభిప్రాయంగా పోస్ట్ చేశానని ఈ మహా వ్యక్తి నా పోస్ట్ పైనే కామెంట్ చేశారు. గతం లో కూడా ఇలాగే కొంతమంది నాకు వాక్ సీన్ అంటే ద్వేషం .. అందుకే వాక్ సీన్ పై విషం కక్కుతున్నాని వాగారు.
రాజకీయాలు ఉచ్చ గుంత అని చెప్పినా ఇలాంటి వారికి అర్థం కాదా ?
My personal opinion is that congress party has to win. This great person commented on my post that I have posted my personal opinion as people's opinion.
జ్ఞాన బీజాలు నాటబడ్డాయి, ఆచరణాత్మక ఎదుగుదలకు భరోసా!✨

రాజకీయాల్లో “ సోషల్ మీడియా స్టార్స్ “ యుగం మొదలయ్యిందా ?

ముందుగా ఒక మాట.
ఇది కేవలం నా అంచనా మాత్రమే. అభిమతం కాదు.
కొల్హాపూర్ లో బర్రెలక్క 15 - 20 వేల ఓట్లు సాధిస్తుంది. కానీ ఓడిపోతుంది!
అక్కడ జేకే రావు గెలుస్తాడు. ( రాజకీయాల్లో రాకముందు ఆయన జేకే రావు. అటుపై జూపల్లి కృష్ణ రావు. జేకే రావు గా ఆరోజుల్లో సన్నిహితుడు )
ఒక సాధారణ వ్యక్తి గా పోటీ చేసి బర్రెలక్క ఇప్పటికే విజయం సాధించింది. సమస్య ను ఎత్తి చూపింది. ఇది రాబొయ్యే రోజుల్లో మరింత మందికి ప్రోత్సాహం ఇస్తుంది.
రాజకీయాల్లో పోటీ చేయడం వల్ల , సోషల్ మీడియా స్టార్స్ కు కూడా అదనపు పబ్లిసిటీ.
వారి రీల్స్ వీడియోస్ కు వ్యూస్ పెరుగుతాయి.
రాబొయ్యే రోజుల్లో ప్రధాన పార్టీ లు కూడా ఒకరిద్దరు సోషల్ మీడియా స్టార్స్ కు టికెట్ లిచ్చి వారిని రాష్ట్రమంతా ప్రచారానికి వాడుకుంటాయి.
ఇందులో మంచి చెడు రెండూ ఉంటాయి.
బర్రెలక్క లాగ ఒక సామజిక అంశాన్ని లేవనెత్తే వారు ..
అదే సమయం లో దుబాయ్ పాప .. తార్నాక పాలు లాంటి వారు కూడా ఎంటర్ అయ్యే అవకాశం. ఇప్పటికే ప్రత్యర్యుల్ని తిట్టిపోయడానికి ఇలాంటి వారిని వాడుకొంటున్నారు.
ఇప్పటికే పాలు పాలిటిక్స్ లో వినోదం పండిస్తూ టీవీ చానెల్స్ కు వ్యూస్ పెంచుతున్నాడు.
ఇక రాబొయ్యే రోజుల్లో సోషల్ మీడియా స్టార్ లు ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
మనిషన్నాకా కూసింత కళా పోషణ ఉండాలా అని ఎప్పుడో రావు గోపాల రావు చెప్పాడు. సోషల్ మీడియా యుగం - సెల్ ఫోన్ అడిక్ట్స్ యూత్. ఇక చూస్కోండి.

Amarnath Vasireddy - Facebook Posts

Explore years of consistent wisdom, organized by journey milestones from 2010 to 2026