వెండి ధర గురించి !
మెడికల్ మాఫియా ఎంత బలమయినది ?
" HPV వాక్సిన్ పై ఆయన చెత్త రాస్తున్నాడు . అందుకే ఆన్ ఫాలో చేశాను " నా పై ఒక మహిళ ఫేస్బుక్ పై చేసిన కామెంట్ .
"మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నామా ? "
.. అని నేను నిరంతరం చెక్ చేసుకొంటుంటాను .
ఉదాహరణకు మా బడిలో ప్రతి ప్రతి రోజు సరాసరిగా వంద మంది పేరెంట్స్ కు కాల్ / మెసేజ్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకొని నాకు అందించే వ్యవస్థ ఉంది .
తప్పు మానవ సహజం .
తప్పుల్ని సరిదిద్దుకుంటే మన ప్రగతి సాఫీగా ఉంటుంది అని నేను బలంగా నమ్ముతాను .
నా ఫేస్బుక్ పై వెయ్యి పొగడ్తలు వచ్చినా ఉబ్బితబ్బిబ్బు కాని నేను ... ఎక్కడో ఒకటి రెండు విమర్శలొస్తే దానికి ప్రాధాన్యత ఇస్తుంటాను .
ఎవరో తెలియని వ్యక్తులు మన గురించి ఎక్కడో ఎందుకు నెగటివ్ గా కామెంట్స్ చేస్తుంటారు ?
ఇది నేను ఆలోచించే విషయం .
ఇలా నెగటివ్ గా కామెంట్ చేసే వ్యక్తులు రెండు రకాలు .
1 . నెగటివ్ వ్యక్తులు .
2 . అపార్టం చేసుకొనే వారు .
నెగటివ్ వ్యక్తులు ప్రపంచం లో అన్ని కాలాల్లో ఉంటారు .
రాముడికి . జీసెస్ కు... మహమ్మద్ ప్రవక్తకే తప్పలేదు .
కోన్ కిస్కా గొట్టం గాడిని నేనెంత ?
ఈ పోస్ట్ అపార్థం చేసుకొనే వారి పైన .
ఉదారణకు నేను సెర్వికల్ కాన్సర్ వాక్ సీన్ కలిగించే ఆరోగ్య సమస్యలపై పోస్ట్ పెట్టాను .
ఎవరైనా ఏమి చేస్తారు ?
ఇది నిజామా? కాదా ? అని గూగుల్ పైన చెక్ చేస్తారు .
గూగుల్ చేస్తే పుంఖాను పుంఖాలుగా పేజీలు .
"ఇది సురక్షితం . దీనిపై అనుమానాలన్నీ కేవలం అపోహలు "అని.
దీన్ని చదివిన వారికి ఏమనిపిస్తుంది ?
" అరేయ్ .. వీడు... అమర్నాథ్... జనాల్లో అపోహలు సృష్టిస్తున్నాడు . అన్నీ తనకే తెలుసనీ ఏదో వాగుతుంటాడు ."
చెప్పండి .. ఇలా అనిపించడం న్యాయమా? కాదా ?
గూగుల్ పై వందల పేజీలు .. ఈ వాక్ సీన్ ఎంత సురక్షితం అని .
అదీ మాములు వారు చెప్పిందా ?
ప్రపంచ ప్రఖ్యాత క్లినికల్ ఫార్మా సంస్థల వెబ్ పేజీలు
ఇది ఎంతలా ఉంటుందంటే ..
కాసేపటి క్రితం నేను ఇదే పని చేశాను .
నా పై నాకే డౌట్ వచ్చింది .
మనల్ని నమ్మి ఎంతో మంది ఫాలో అవుతున్నారు .
మనం వారిని తప్పుదారి పట్టిస్తున్నామా ? ... అని .
పోనీ మెటా AI చాట్ జిపిటి ని అడిగిన అదే తంతు .
ప్రయోజనాలు నిజం నిజం . సైడ్ ఎఫెక్ట్స్ అబద్దం .. అపోహఅని .
వాసిరెడ్డి అమర్నాథ్ గుండె జారిపోయింది .
మన అవగాహన సరైనదేనా? అని అనుమానం వచ్చింది .
క్రిటికల్ థింకింగ్ ఉంది .
కాస్త బిన్నంగా అలోచించి జపాన్ లో ఈ లాక్ సీన్ సైడ్ ఎఫెక్ట్స్ అని గూగుల్ లో టైపు చేస్తే .. అప్పుడు ఓపెన్ అయ్యింది . అసలు విషయం అప్పుడు వచ్చింది .
అమ్మా .. అలాగరిథమ్ మాయ !!
ఎంత మానేజ్ చేస్తున్నారు .
సరే .. వదిలెయ్యండి . ఈ పోస్ట్ ఆ వాక్ సీన్ పై కాదు .
దాని పై చెప్పాల్సింది చెప్పాను .
వద్దు అన్నాను .
ఇక జనాల ఇష్టం .
ఈ పోస్ట్ గూగుల్ తో జనాల్ని మెడికల్ మాఫియా ఎలా మాయ చేస్తుందో చెప్పడానికి .
ఈ పోస్ట్ అసలు విషయం ఇదిగో ..చదవండి .
ఆటిజం గురించి మీకు తెలిసే ఉంటుంది .
బుద్ధిమాంద్యత .
పాపం .. ఆ పిలల్లు .
ఆ తల్లితండ్రులు .. వారిని కూడా మోం చెయ్యడానికి మెడికల్ మాఫియా తెగబడింది .
ఆటిజం ట్రీట్మెంట్ కోసం స్టెమ్ సెల్ థెరపీ..
అని ఈ మధ్యలో మెడికల్ మాఫియా తెచ్చింది .
ఇది పని చెయ్యదు అని నేను గతంలోనే పోస్ట్ చేశాను.
గూగుల్ లో ఓ సారి సెర్చ్ చెయ్యండి .
వందలాది సైట్ లు. ఆటిజం కోసం స్టెమ్ సెల్ థెరపీ . అద్భుతం . ఎనభై శాతం తొంబై శాతం సక్సెస్ రేట్ ..అని గూగుల్ చెబుతోంది . వెబ్ సైట్స్ చెబుతున్నాయి .
ఇలాంటి పరిస్థితుల్లో .. లింగులిటుకు అని వాసిరెడ్డి అమర్నాథ్ గాడు " ఇది పని చెయ్యదు" అని చెబితే .. ఎంతో ఆశతో ఈ ట్రీట్మెంట్ తమ బిడ్డకు ఇప్పిస్తున్న తల్లితండ్రులకు నా పై మండదా ? ఎక్కడో కాలదా ? తిట్టిపోయరా ??
"మహా మహా కక్లినిక్కులు .. డాక్టర్స్ . ఇది పని చేస్తుంది అని చెబుతుంటే .. వీడు .. ముష్టి ముదనష్టపోడు .. కోడి బుర్ర తో .. తనకు సంభంధం లేని దానిలో వేలు పెట్టి ... ఇది పని చేయదు అంటాడు " అని బూతులు ఎత్తుకోరా ?
గూగుల్ సెర్చ్ చేసిన వెంటనే నా పై కోపం వస్తుందా రాదా ? మీరు చెప్పండి .
నిన్న సుప్రీమ్ కోర్ట్ ఏమి తీర్పు ఇచ్చిందో తెలుసా ?
ఆటిజం కు స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ పని చేయదు .
అసలు దీని పైన క్లినికల్ స్టడీ జరగలేదు.
ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్న ఆసుపత్రుల్ని మూసెయ్యండి .
అయ్యా అదీ విషయం .
మీ బిడ్డలు .. మీ కకుటుంబం చల్లగా ఉండాలని .. కుక్క పని చేసి తన్నులు తిన్న గాడిదలా .. ఎన్నో చెబుతుంటాను . నేను మేధావి అని ఎప్పుడూ చెప్పుకోలేదు .
నేనో నిరంతర విద్యార్ధి .
ఎన్నో విషయాలు తెలుసుకొంటూ వుంటాను .
నాకు తెల్సింది.. అందరికీ ఉపయోగం అనుకొంటే దాన్ని పోస్ట్ చేస్తూ వుంటాను .
నా ఫేస్బుక్ ఒక తరగతి గది .
ఉచితంగా పాఠాలు చెబుతూ ఉంటాను .
నిర్బంధం లేదు . క్లాసులో ఉండాలని అనుకొంటున్నవారు ఉండొచ్చు .
మిగతా వారు వెళ్లి పోవచ్చు .
ఉన్నా ... వెళ్లి పోయినా నాకు పట్టింపు లేదు .
ఉన్నవారు ... వెళ్ళినవారు అందరూ చల్లగా ఉండాలి .
ఇక నెగటివ్ ఎలిమెంట్స్ .. వారి ఖర్మకు వారే భాద్యులు .
మీకు ఎన్నో ఇస్తూ .. ఏనాడూ మీనుంచి ఏమీ ఆశించని
వాసిరెడ్డి అమర్నాథ్ .
కామెంట్స్ కాలమ్ లో నేను పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్స్ తప్పక చూడండి .
బంగారం కొనాలనుకుంటున్నారా ?
ఎకనామిక్ సర్వే లో ఏమి చెప్పారో చూసారా ?
1 SAVE అనే సంస్థ 2017 లో ప్రచురించిన రిపోర్ట్ లో భారత దేశానికి చెందిన ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్ అందునా లైంగిక పరమయిన రాగ్గింగ్ ఎక్కువగా ఉందని చెప్పింది ; మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణా లో ( అంటే హైదరాబాద్ కు చెందిన సంస్థల్లో ) ఇది ఎక్కువగా ఉందని చెప్పింది ; రాగ్గింగ్ పేరుతొ జూనియర్ విద్యార్థులను సీనియర్ లు మలవిసర్జన ద్వార సంభోగానికి పాల్పడుతున్నారని చెప్పింది ; యూజీసీ దీన్ని క్రిమినల్ నేరంగా పేర్కొన్నప్పటికీ ఇది ఆగడం లేదని చెప్పింది . నాకున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం ఇది గత నాలుగేళ్లుగా ఎక్కువయ్యింది .
2 ఇటీవల కాలం లో ముఖ్యంగా ఫోర్ మోర్ షార్ట్స్ లాంటి ఒటిటి ల తరువాత ఇది కొంతమంది యువమహిళల్లో ప్రబలుతోంది
3 నేషనల్ క్రైమ్ బ్యూరో స్టాటిటిక్స్ ప్రకారం 2024 లో హనీ ట్రాపింగ్ సెక్సతోర్షన్ వల్ల పోలీస్ కేసుల్లో కెక్కిన మొత్తం 792 కోట్ల . నూటికి 95 శాతం కేసులు పోలీస్ దాకా రావు అని సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ చెబుతున్నారు .
4 దగా పడిన మహిళల కోసం జీవితాలను త్యాగం చేసిన మహిళానాయకురాళ్లు ఉన్న సమాజం మనది . ఇటీవల కొంత మంది సైబర్ క్రిమినల్స్ మహిళాఅభ్యుదయం ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు . ఆ విధంగా మహిళా ఉద్యమాలకు చెడ్డ పేరు తెస్తున్నారు .
ర్యాగింగ్ , సైబర్ నేరాలు , కుహనా మహిళా ఉద్యమాలు , వలపు వల , మిదలయిన అంశాలపై అవగాహన తీసుకొని రావడానికి నేను రాసిన కథ మార్నింగ్ పోస్టు చేసాను ఇందులో వున్నదని చుట్టూరా జరుగుతున్న ఘటనలే . అనేక ఘటనలు కూర్చి కథా రూపం లో రాసాను .
మంచి అవగహన పోస్ట్ అని అందరూ అంటుంటే ఒక మహిళ ఇది చెత్త అని నేనేమయినా మానసిక వైద్యుడా అని నిందా కామెంట్ చేసింది
అందరి అవగాహన కోసం ఈ క్లారిటీ
సమాజం లో ఉన్నదాన్ని గురించే రాస్తాను . జనాల్లో వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తాను . ఒక వ్యక్తిని లేదా కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ రాయను.
" రమ్యా !... ఏమి అనుకోకు .. పెళ్లి పీటలపై అన్ని గంటలు కూర్చోవడంతో నడుం పట్టేసింది . ఈ మూడు నైట్స్... రెస్ట్ .. జస్ట్ ఛిల్ల్ . శనివారం మనం గోవా కు వెళుతున్నాం కదా . అక్కడే ఎంజాయ్ చేద్దాం " ... అన్నాడు రాకేష్ .
" ఇట్ ఈజ్ absolutely ఫైన్ రాకేష్ " అని అగరొత్తులు పొగ ను ఎంజాయ్ చేస్తూ నిద్రపోయింది రమ్య .
నాలుగో రోజు..
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండోగో విమానం ఎక్కి ... దాబోలిం ఎయిర్పోర్ట్ లో దిగి ... గంటన్నర పయనం తరువాత సౌత్ గోవా లోని రిసార్ట్ చేరుకొన్నారు నవ దంపతులు .
రమ్య ఆనందానికి అవధుల్లేవు .
పెద్దలు కుదుర్చిన పెళ్లి ..
రాకేష్ బాగా హ్యాండ్సమ్ గా ఉంటాడు .
కేరింగ్ కూడా .
లైఫ్ లో ఎంజాయ్ చేసే స్టేజి వచ్చింది .
కాలేజీ లైఫ్ లో కొంతమంది అమ్మాయిలు లేట్ నైట్ పార్టీ లకు తరచూ వెళ్లేవారు .
తనకేంటో... ఇష్టముండదు !
" శోభనం రోజు తనని ..పవిత్రంగా భర్తకు సమర్పించుకోవడం ... ఎప్పుడో సౌందర్య కాలం నాటి సినిమాల్లో కాన్సెప్ట్ . నువ్వు అనుకున్నట్టు... ఏ గొట్టం గాడు పవిత్రంగా దొరకడు . ఇక్కడ ఎవరూ దొరక్కపోతే... పట్ఠాయ కైనా వెళ్ళి శాండ్విచ్ అయ్యి వస్తాడు . లవ్ చేసి పెళ్లి చేసుకో . నీ బాయ్ ఫ్రెండ్ నీకు దొరుకుతాడు . పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొంటే మరెవరి బాయ్ ఫ్రెండ్ నో చేసుకోవలసి వస్తుంది " .. పాలొలెం బీచ్ లో బీచ్ షాక్ లో ఒక్క కోకా కోలా లో రెండు స్ట్రా లు వేసి... తాగుతున్న వేళ... రమ్యకు తన కాలేజీ హాస్టలో రూమ్ మేట్స్ మాటలు గుర్తు వచ్చాయి .
" వీళ్ళు .. వీళ్ల సొల్లు మాటలు .. ప్రపంచాన్ని చదివేసినట్టు... ఎన్నేసి మాటలు అనేవారు ? డేటింగ్ లు.. బ్రేక్ అప్ లు.. .. ఈ సైకిల్ లో ఇంకా వాళ్ళు తంటాలు పడుతుంటే తనేమో చక్కగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొంది . రాకేష్ లాంటి... అందగాడు ... కోటీశ్వరుడు తనకు కాలేజీ లో దొరికేవాడా ? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొన్న తాను ... లక్కీ గర్ల్ .. స్మార్ట్ గర్ల్ .." ... బీచ్ షాక్ నుంచి రాత్రి ఎనిమిది కి రూమ్ కు తిరిగివస్తూ స్వగతంలో రమ్య .
"డబల్ బెడ్ రూమ్ రిసార్ట్ అయితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఎందుకు ? మనం వచ్చింది హనీ మూన్ కు కదా రాకేష్?? " .. తమ రిసార్ట్ విడిది లోకి లగ్గేజ్ తో సహా వచ్చిన ముగ్గుర్ని చూసి షాక్ అయిన రమ్య .
" మనకు మన రూమ్ ఉంది కదా . అయినా అందరూ ఉంటే సందడిగా ఉంటుంది " ... అన్నాడు రాకేష్ .
కామన్ హాల్ .. రాకేష్ తో సహా అతని ముగ్గురు ఫ్రెండ్స్ .
" రమ్యా ! కోకోనట్ ఫెన్నీ .. టేస్ట్ చెయ్యి . ఇది గోవా స్పెషల్ తెలుసా ? అన్నాడు రాకేష్ .
రాత్రి తొమ్మిది అయ్యింది .. ఇప్పటికే మూడు రోజులు పోస్ట్ పోన్ అయ్యింది శోభనం . ఇప్పుడేమో పోకర్ గేమ్ అని మొదలెట్టాడు .
రమ్య మనస్సు కీడు శంకించింది .
" కాలేజీ లో మా ఫ్రెండ్స్ ఎంత బలవంత పెట్టినా నేను బకార్డి బ్రిజర్ కూడా తీసుకోలేదు . ... ఫెన్నీ... బాగా నాటు సరుకు అని మా ఫ్రెండ్స్ చెప్పుకొంటుంటే విన్నాను . .... అయినా మనం వచ్చింది దేనికి?.... ఇక్కడ చేస్తుంది ఏంటి? ".... గట్టిగా అనేసింది రమ్య .
తన మాటల్ని వినే పరిస్థితుల్లో లేరు... ఆ నలుగురు .
పది నిముషాల్లో చెరి నాలుగు రౌండ్స్ ఫెన్నీ కొట్టేసారు .
" రమ్యా ! నీకొక మాట చెప్పాలి . నేను కాలేజీ లో చేరిన తొలిరోజుల్లో సీనియర్స్.. పిడిపి పేరుతొ తమ రూమ్ కి పిలిచారు . అప్పటికి నాకు ఏ మాత్రం ఇష్టం ఉండేది కాదు . అప్పటినుంచి బాండింగ్ అలవాటు అయ్యింది "... చెప్పాడు రాకేష్ .
పిడిపి .. బాండింగ్ .. ఈ మాటలేంటో .. రాకేష్ ... తాగిన మత్తులో ఏమి మాట్లాడుతున్నాడో రమ్యకు అర్థం కాలేదు .
" నేను వెళ్లి రూమ్ లో పడుకొంటాను " లేచింది రమ్య .
అప్పుడు రాకేష్ లోని అపరిచితుడ్ని తొలిసారి చూసింది రమ్య .
బలవంతంగా లాగి కూర్చోపెట్టాడు రాకేష్ .
ఇంకో రెండు షాట్స్ తీసుకొని... అతను చెప్పిన మాటల్ని ... జీవితం లో ఎప్పటికీ మరచి పోలేదు రమ్య .
తనకు అబ్బయిలంటేనే ఇష్టం . అమ్మాయిని ఆ దృష్టితో చూడలేడు . ఆ ఆలోచనే తనకు వెగటు పుట్టిస్తుంది . అక్కడికి వచ్చిన ముగ్గురు అబ్బాయిలు ఎన్నో రోజులుగా తనతో రిలేషన్షిప్ లో ఉన్నారు . వారిలో ఇద్దరికి .. అటు అబ్బాయిలు... ఇటు అమ్మాయిలు ఇష్టం . మరొకడు మాత్రం నేరుగా ఉంటాడు . తనకోసం రమ్య సాక్రిఫైస్ చెయ్యాల్సిన అవసరం లేదు . తన ఫ్రెండ్ తో ఎంజాయ్ చెయ్యొచ్చు . ఒకరు ఒకరు అనేది పరమ పాతపడిన కాసెప్ట్ . గ్రూపిజమే ఇప్పుడు ట్రెండింగ్ మిడ్నైట్ దాక స్టిఫ్ పోకర్ గేమ్ ఆడి .. అటు పై అందరం కలిసి ఎంజాయ్ చేద్దాము" ఇది రాకేష్ మాటల సారం .. .
నలుగురిని నుంచి తప్పించుకొని బయటకు రావడానికి రమ్య పెద్ద యుద్ధమే చేసింది .
అర్ధ రాత్రి వేళ.... గోవా లో సెటిల్ అయిన తన కాలేజీ మెట్ ఇంటికి క్యాబ్ తీసుకొని వెళ్లి పోయింది .
డివోర్స్ తీసుకోవడానికి ఏడాది పట్టింది .
ఇంకో పెళ్లి చేసుకో బుద్ధి పుట్టడం లేదు .
సమాజంలో పితృస్వామ్యం బలంగా ఉంది .
ప్రతి మగాడు స్త్రీ ద్వేషి .
ఇది రమ్య ఆలోచనలు .
ఫేస్బుక్ లో దగా పడిన మహిళ అనే సోషల్ గ్రూప్ లో చేరమని ఆహ్వానం వచ్చింది .
ఇందులో చేరాలి అంటే మహిళ అయ్యి ఉండాలి .
చేరింది .
అక్కడి పోస్ట్ లు కామెంట్స్ నేటి సమాజ స్థితి ను ప్రతిబింబించేవి .
"ఎంత చదువుకొన్న మగాడయినా మహిళకు గౌరవం ఇవ్వడు "
"పెళ్లంటే బానిసత్వమే "
"వెట్టి చాకిరి నుంచయినా విముక్తి ఉంటుంది కానీ పెళ్లి చాకిరీ నుంచి బయట పడలేరు "
"ఆ రోజుల్లో సమాజానికి భయపడి మహిళ నోరు విప్పేది కాదు . అందుకే వారి జీవితాలు.. కష్టాలు కడగండ్లు . మహిళను బానిస చెయ్యడానికి మగాడు కనిపెట్టిన మోసమే పెళ్లి "...
ఇలా సాగిపోయేది అక్కడి చర్చలు .
ఒక సారి గ్రూప్ మెంబెర్స్ గెట్ టుగెదర్ జరిగింది . సుమారుగా వంద మంది హాజరయ్యారు . కొంతమంది ప్రసంగాలు ఎంతో ఆకట్టుకొన్నాయి .
తన మనసులోని మాటలే వారు చెప్పడంతో తనకు ఎంతో మానసిక ఊరట కలిగింది .
గ్రూప్ నిర్వహకురాలు వందన కు తానెంతో క్లోజ్ అయ్యింది రమ్య .
" ఆఫీస్ నుండి ఫ్లాట్ కు వచ్చాక సింగల్ గా ఉంటే బోర్ కొట్టదా ? అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పోతుండు . లైక్ మైండెడ్ పీపుల్ తో కలుస్తుంటే రిలీఫ్ " చెప్పింది వందన .
"అలాగే ఆంటీ "అంది రమ్య
సీజర్ సిస్టర్స్ పేరుతొ వీక్ ఎండ్ పార్టీ ఉంది .. నువ్వు తప్పక రావాలి రమ్య " వాట్సాప్ లో వందన ఆంటీ మెసేజ్ .
మొయినాబాద్ వద్ద ఫార్మ్ హౌస్ .
పార్టీ మొదలయ్యింది .
తాను ... వందన ఆంటీ .. ఇంకో ఆంటీ . తనకంటే యంగ్ గా ఉన్న ఇద్దరు అమ్మాయిలు .
రమ్యా .. నీ వయస్సు ముప్పై దాటలేదు .. కళ్లకింద డార్క్ సర్కిల్స్ చూడు . ఇంత స్ట్రెస్ తీసుకొంటే ఎలా?. మరీ చాదస్తం చూపకు ! ఈ బ్రో కోడ్ ఎంజాయ్ చెయ్యి " అంది వందన .
వద్దు అంటే బాగుండదు .. అక్కడున్న మిగతా నలుగురూ ఎంజాయ్ చేస్తున్నారు .
జస్ట్ టేస్ట్ చేసి పెట్టేద్దాము అనుకొంది రమ్య .
అక్కడి మాటలు మ్యూజిక్ .. తనపై బాగా ప్రభావం చూపాయి .
మూడు బాటిల్స్ ఖాళీ చేసే దాక మాట్లాడుతూ ఉంది .
ఆ తరువాత ఏమి జరిగిందో తనకు గుర్తు లేదు .
ఒళ్ళంతా ఒకటే నొప్పులు .. తలపగిలి పొయ్యేటంత నొప్పి .
బెడ్ పై మెలుకువ వచ్చింది .
టైం చూస్తే 9.30 .
రాత్రి 9.30 అయ్యిందా ? లేక .."?
లేదు రాత్రి 11 దాక .. మూడో బాటిల్ చేతిలో పెట్టుకొని ఉన్నంత దాక తనకు బాగా గుర్తు . వామ్మో అంటే ఇప్పుడు శనివారం రాత్రి కాదు . ఆదివారం పొద్దున్న . అసలు ఏమి జరిగింది ?
తన బెడ్ పైనే ఎలాంటి ఆచ్చాదన లేకుండా ఆ ఇద్దరు అమ్మాయిలు .
ఒళ్ళంతా నీరసంగా ఉన్నా ... షాక్ తిన్న రమ్య ... బెడ్ పై నుంచి లేచి డ్రెస్ వేసుకొంది .
బ్యాటరీ డ్రైన్ అయ్యి మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది .
ముందు హాల్ వెళితే వందన ఆంటీ . ఇంకో ఆంటీ .
వారితో మాట్లాడాల్సి వచ్చింది .
మరో మూడు గంటలు .
తాను ఎదురు చెప్పకముందే వారు మాట్లాడుతున్నారు .
తాను ఏమి చేస్తే దాని పర్యవసానాలు ఎలా వుంటాయో హెచ్చరిస్తున్నారు . రాత్రి మూడో బాటిల్ అయ్యాక .. మరో మూడు బాటిల్స్ ఎలా ఖాళీ చేసింది? .. అటుపైన ఏమి జరిగింది? .. మొత్తం రికార్డు అయ్యింది .
వీడియో చూసాక కడుపులో దేవినట్టు అయ్యియింది .
గోవా రిసార్ట్ లో రాకేష్... గ్రూప్ ఎంజాయ్ అంటే అసహించుకొన్న తాను .. ఇక్కడ వందన ఆంటీ ఇంకో ఆంటీ .. ఇంకా ఇద్దరు అమ్మాయిలతో చేసిందేంటి ?
తానేంటి ?
ఇలా చేస్తానా ?
ఇలాంటి టేస్ట్ తనకు ఉందని తనకు కలలో కూడా ఊహించలేదు .
దగాపడిన మహిళల కోసం జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమాలు చేస్తున్న మహిళా నాయకురాళ్లు ఉన్న సమాజం మనది .
మెరిసేదంతా బంగారం కాదు .
చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకొనే వారెందరో !
తాను చిక్కుకుంది ఒక చీకటి ప్రపంచం లో .
పురుషుడు డబ్బు ఖర్చు పెట్టి ఆడదాని సుఖాన్ని కొనుక్కునే ప్రాంతాలను రెడ్ లైట్ ఏరియా లుగా పిలుస్తారు .
ఇది అలాంటిదే ..
కాదు ... కాదు .. ఇది వేరు . దీన్ని పింక్ లైట్ పేరుతొ పిలవాలా ?
బలవంతం లేదు అని వందన ఆంటీ చెప్పింది .
" నీ ఇష్టం .. ఇది ఒక లైక్ మైండెడ్ మోడరన్ పీపుల్ గ్రూప్ . మన అవసరాలకు మగాడి పై ఆధారపడడం మంచిది కాదు అనుకొన్న వారి గ్రూప్ . స్వశక్తి గ్రూప్ . ఈ వారం వీళ్ళు ముగ్గురువచ్చారు . వచ్చేవారం మరో నలుగురైదుగురు . మనది సెల్ఫ్ హెల్ప్ కాన్సెప్ట్ . వద్దనుకుంటే నీ ఇష్టం . కావాలంటే మాత్రం మాతో టచ్ లో ఉండు "
"మళ్ళీ చచ్చినా ఇక్కడికి రాను'.. అనుకొంటూ రమ్య వెళ్ళిపోయింది .
"రమ్యా .. లాస్ట్ వీక్ నువ్వు కంట్రోల్ తప్పావు . బలవంతం లేదు . ఈ వీక్ ఇద్దరు గెస్ట్స్ ను పరిచయం చేస్తాను . వారు పెద్దపెద్ద ఇండస్ట్రీ ఓనర్స్ . చేస్తున్న ఉద్యోగం పొతే వీరి పరిచయాలు ఉపయోగపడుతాయి . జస్ట్ ఒక షాట్ తీసుకొని వెళ్లిపోదువులే "..కాల్ లో వందన ఆంటీ .
పోకపోతే వందన ఆంటీ ఏమి చేస్తుందో .. అయినా జస్ట్ ఒక రౌండ్ తో బయటకు వస్తాను" అనుకొని వెళ్ళింది రమ్య .
లాస్ట్ వీక్ సీన్ రిపీట్ .
నిద్రలేచేటప్పటికీ ఆదివారం బారెడు ప్రొద్దెక్కింది .
నెమ్మదిగా ఈ కొత్త లైఫ్ కు రమ్య అలవాటు పడిపోయింది .
తొలిసారి పరిచయం అయిన ఇద్దరు అమ్మాయిలు ఒక సారి బెంజ్ కారులో వచ్చారు . వారితో ఇద్దరు మగాళ్లు . చూస్తే బాగా రిచ్ పీపుల్ లాగా ఉన్నారు .
" లైఫ్ లో కొన్ని సాదించాలి అంటే కొంత కంప్రమైజ్ తప్పదు . వందకోట్ల రియల్ ఎస్టేట్ లిటిగేషన్ . ఢిల్లీ నుంచి గంటకు పది లక్షల ఫీజు తో అడ్వకేట్ వచ్చి ఆరునెలలు వాజ్యం నడిపినా జరగని పని .. ఇదిగో.. నీ ఇద్దరి ఫ్రెండ్స్ సాధించారు . వంద కోట్ల ఆస్తి తీర్పు వచ్చేసింది . నీతి నియమాలు చేతకాని వాళ్ళు చెప్పే కబుర్లు . వలపు వలకు చిక్కని మగాడుండడు . అవసరమయితే .. హనీ ట్రాప్ తరువాత వలపు దోపిడీ .. ఐదేళ్లలో వంద కోట్లు .. " వందన ఆంటీ మాట్లాడుతూ ఉంది .
ఆమె లో పురుష ద్వేషం లేదు ..
మహిళాభ్యుదయం ఆమె వేసుకొన్న రక్షక కవచం ..
ఆమె వెనుక కొంతమంది పురుషులు ఉన్నారు అని గ్రహించడానికి రమ్యకు చాలా కాలం పట్టింది .
ఒక రోజు ... క్లమీడియా చికిత్స కోసం ఆసుపత్రిలో రమ్య . ఆసుపత్రి బెంచ్ పై ఆమె ఆలోచనలు ..
రాకేష్ చెప్పిన మాటలు ... ." నాకు ఇష్టం లేదు . బలవంతంగా అలవాటు చేసారు . ఇప్పడు దీని నుంచి బయటకు రాలేను "
అప్పుడు రాకేష్ ను అసహ్యించుకొంది .
కానీ ఇప్పుడు తానూ కూడా ఒక విధంగా అదే దారిలో ..
తప్పెక్కడ జరిగింది ?
గుడ్డిగా అందర్నీ నమ్మడమే తాను చేసిన తప్పా ?
మీరు చెప్పండి .
తప్పెవరిది ?
ఇది కథ కాదు .
చుట్టూరా జరుగుతున్న వాస్తవాల వ్యధ .
కాలేజీ హాస్టల్స్ లో ... కొన్ని సామాజిక మాధ్యమాలలో డిజిటల్ యుగపు సమాజం లో జరుగుతున్న.. నవీన దందా.
దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యుంటే క్షమించండి
మెరిసేదంతా బంగారం కాదు
కావాలి సైబర్ స్మార్ట్‌నెస్ .. క్రిటికల్ థింకింగ్ !
హార్వార్డ్ వాళ్ళు చెబితే కానీ మనవాళ్లకు అర్థం కాదు !
"నేను నా కోసం బతుకుతా ... మీరు కూడా నా కోసమే బతకాలి "... ట్రంప్ మాటలు , పద్ధతులు ఇలా ఉంటాయి .
"ఇండియా ! రష్యా నుండి చమురు కొనడం ఏంటి ? ఆ డబ్బుతో రష్యా యుక్రెయిన్ యుద్ధం చేస్తోంది తెలుసా?" అంటాడు .
పోనీ శాంతి కాముకుడా? ... అంటే ఒక పక్క గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమించుకొంటా అంటాడు . మరో పక్క ఇరాన్ పై యుద్ధానికి అంగుళం దూరం లో ఉన్నాడు .
సొమ్మొకడిది .. సోకొకడిది !
"మా ఇంటికొస్తే మీరేమి తెస్తారు ? మీ ఇంటికొస్తే నాకేమి ఇస్తారు ?" అన్నట్టు .. ప్రపంచం ఎక్కడ ఏ దేశం వాణిజ్యం చేసినా అది తన కరెన్సీ అదే డాలర్ తోనే... అమ్మాలి / కొనాలి .
తానేమో లెక్కకుమిక్కుటంగా డాలర్స్ ముద్రించి ప్రపంచం పైకి వదలాలి .. ఆ విధంగా తన ఆర్థిక ఆధిపత్యాన్ని కాపాడుకోవాలి ..
... ఇదీ అమెరికా విధానం ... .చాలా ఏళ్లుగా.
ప్రపంచంలో అన్ని దేశాలు అమెరికన్ డాలర్ ను వదిలి పెట్టి ద్వైపాక్షిక వాణిజ్యాలు చేసుకొంటే ... వారం రోజుల్లో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది .
అప్పులు తీర్చ లేక అమెరికా ఆఫ్రికా దేశాల మాదిరి బీద దేశం గా మారిపోతుంది .
ఆలా జరగకుండా... ఇన్నాళ్ళు .... ఈ రొటేషన్ చక్రవర్తి తన మిలిటరీ బలం తో, తేలితేటలతో, కుట్రలతో మానేజ్ చేసుకొంటూ వచ్చాడు .
నీ దూకుడు ... సాటెవ్వడూ ?
మిగతా వారు వేరు .. ట్రంప్ వేరు ..
ఎముకలు తిని .. దాన్ని మెడలో వేసుకొనే రకం ట్రంప్ . సున్నితత్వముండదు .
దూకుడు .
"నేను అందరిలా ఏదో పరిపాలించడానికి రాలేదు . ప్రపంచాన్ని సుసు పోయించడానికి వచ్చాను" .. అని చెప్పే రకం ట్రంప్
ఇండియా ని బెదిరించాడు .
తన గ్రీన్ ల్యాండ్ ఆక్రమణ ప్రకటనతో యూరోప్ దేశాలను దూరం చేసుకొన్నాడు .
ఇది సినిమా కాదు కదా ! రియల్ వరల్డ్ !
ఇండియా- యురోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య చర్చలు ఇప్పటివి కావు .
"నువ్వీ దరిని .. నేనా దరిని .. ట్రంప్ మామ కలిపాడు ఇద్దరినీ ... " అని ఇప్పుడు ఇద్దరు కలిశారు .
అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!
ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది .
1 . ఇండియా ను బెదిరించి లొంగదీసుకొనే అవకాశం అమెరికా కు ఇప్పుడు తగ్గిపోయింది . ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవాలంటే ఇండియా తో గౌరవప్రదమయిన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే .
ఇండియా జనాభా మొదటి బలం .
రెండోది మానవ వనరులు .
ఇండియన్స్ లేకుండా అమెరికా యూరోప్ లో అనేక కీలక రంగాలు నడవవు
2 . ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో .. ఇండియా కూడా ఇలాంటి దానిలో చిక్కుకుంటుందేమో అనే భయం నిన్నటి దాక ఉండేది .
ముఖ్యంగా అమెరికా తన టారిఫ్ పెంచడం పెద్ద సమస్య అయ్యివుండేది .
చైనా ను నమ్మలేము .
రష్యా ఓకే .
కానీ..
కేవలం రష్యా పై ఆధారపడగలమా ?
ఇప్పుడు యూరోపున్ యూనియన్ మద్దత్తు .
ఇండియా ఆర్థిక వ్యవస్థకు ఇక డోకా లేనట్టే .
3. ట్రంప్ తెగే దాకా లాగుతాడా ?
లేక బెదిరించి ఎంతో కొంత ప్రయోజనంసాదించి తగ్గుతాడా? అనేది మరో నాలుగు రోజుల్లో తేలిపోతుంది .
ఇరాన్ తో పూర్తి స్థాయి యుద్ధం అంటూ జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత చిక్కుల్లో .
బంగారం వెండి ధరలు మరింత పెరుగుతాయి .
గ్రీన్ ల్యాండ్ పై ఏ చర్యకు పూనుకొన్న... నాటో అంతమయినట్టే .
అదే సమయంలో ...
4. 1979 లో ఇరాన్ లో " విప్లవం " వచ్చాక ప్రపంచ వ్యాపితంగా మతపరమయిన టెర్రరిజం ఊపందుకుంది . ట్రంప్ ఒక వేళా ఇరాన్ లో ప్రభుత్వాన్ని మార్చగలిగితే అక్కడ కూడా యూఏఈ లాంటి ప్రగతిశీల ప్రభుత్వం ఏర్పడి .. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, శాంతి కు గట్టిపునాది పడుతుంది
4. "నాకు ఇగో ముఖ్యం" అని ట్రంప్ ఇండియా పై కసితో బాంగ్లాదేశ్ పాకిస్థాన్ ద్వారా సమస్యలు సృష్టిస్తాడా? లేక తెలివయిన వ్యాపారి లాగా ఇండియా తో వాణిజ్య సర్దుబాటు చేసుకొంటాడా ?
చూడాలి .
రష్యా ఆయిల్ కొనుగోలు విషయం లో మన దేశం ఒక మెట్టు దిగి .. నేను డీల్ కు రెడీ అని చెప్పకనే చెప్పింది .
ట్రంప్ .. లో బిజినెస్ మాన్ గెలుస్తాడా ?
లేదా సైనికుడు ?
మరో వారం లో తేలిపోతుంది .
గతం లో... అతడు .. అదే బిజినెస్ మాన్ గెలిస్తే .. బ్రహ్మోత్సవం !
అపుడు మనం అందాం .. సరిలేరు నీకెవ్వరూ !
లేదా ..
పోకిరి... గెలిస్తే..
ప్రపంచానికి ... గుంటూరు కారం
అమెరికా లో ట్రంప్ ప్రభుత్వం M RNA ఆధారిత వాక్సిన్ లకు చెందిన 22 కాంట్రాక్టులను కాన్సల్ చేసింది . దీని మొత్తం విలువ 500 మిలియన్ డాలర్స్ . శాస్త్రీయంగా తాము చేసిన మదింపులో ఇలాంటి వాక్సిన్ ల వల్ల ఉపయోగం లేదని తేలిందని హెల్త్ సెక్రటరీ జాన్ కెన్నెడీ చెప్పారు .
ప్రపంచ అనారోగ్య సంస్థ .. సారీ టైపింగ్ మిస్కెట్ .. ఆరోగ్య సంస్థ "ఎం RNA ఆధారిత వాక్సిన్ లు ఎంతో ఉపయోగకరం .. కోవిద్ -19 .. అదే కరోనా ను అరికట్టడం లో ఈ వాక్సిన్ లు అరివీర భయంకరంగా పని చేసాయి .. అని చెప్పింది "
ట్రంప్ కు ఎక్కడో కాలింది . ప్రపంచ అనారోగ్య .. మళ్ళీ టైపింగ్ మిక్సెట్ .. ఆరోగ్య సంస్థ నుంచి బయటకు వచ్చేసాడు . అమెరికా ఈ సంస్థ నుంచి బయటకు వచ్చింది అని ఇక్కడి మీడియా ప్రచురించింది కానీ ఎందుకు అని చెప్పలేదు . . కారణం ఏంటంటారు .
నాకు ఫేస్బుక్ లో అప్పుడప్పుడు ఎవరో ఒకరు తగులుతుంటారు . నిన్న ఒకాయన " మీరు అవసరం అయిన చోట సైన్స్ ను వాడుకుంటారు . అదే సైన్స్ ఆధారంగా వచ్చిన సెర్వికల్ కాన్సర్ .. HPV వాక్సిన్ ను... ఎందుకు వద్దంటారు ? ఇది స్టుపిడిటీ . డబల్ స్టాండర్డ్" అని పొద్దు పొద్దున్న వెంట బడాడ్డు .
నా బతుకు తెరువు పనుల్లో ఎప్పుడూ తలమునకలు అయ్యి ఉంటాను . నిన్న పొద్దున్న ఇంటి దగ్గర 7.45 కు బయలుదేరా .
స్లేట్ ఖర్మన్‌ఘాట్ లో 9 నుంచి డ్యూటీ .
నేను నిన్న పెట్టిన పోస్ట్ వేరు .
దాని పై అడగొచ్చు .
ఈ వాక్సిన్ పై నేను గతం లో పెట్టిన పోస్ట్ లు చూడొచ్చు . నేను అడిగిఅప్పుడు చెప్పాలి లేక పొతే నువ్వు మూర్ఖుడు అనే వారి ని ఏమనాలి ? పైగా అయన "నా వల్ల చిన్న పిల్లలకు సెర్వికల్ కాన్సర్ వస్తోందని" చెబుతున్నాడు .
ఇంతకీ మన ఘనత వహించిన చాట్ జిపిటి మెటా AI ఏమంటుందో చూసా .
1. పుట్టుకతో కొంత మందికి సెర్వికల్ కాన్సర్ కలిగించే వైరస్ సోకచ్చు . కానీ ఇది అరుదు . లైంగిక చర్య సందర్భంగా నే ఇది సోకుతుంది అంటోంది . అంటే లైంగిక చర్య సందర్భంగా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదా రక్షణ లేకుండా లైంగిక క్రియలు .
మరి 13 ఏళ్ళ పిలల్లకు ఇది ఎందుకు మెటా AI ? వాళ్ళు లైంగిక చర్య లో పాల్గొన్నారు కదా??? " అని అడిగితే ...
... "ముందు వేసి పెడితే ఇమ్మ్యూనిటి బాగా బలం పుంజు కొంటుంది " అని సమాధానం ఇచ్చింది .
" కరోనా సమయం లో వైరస్ మ్యుటేట్ అవుతుంది అన్నారు . ఇక్కడేమో సెర్వికల్ కాన్సర్ కలిగించే వైరస్ లు మొత్తం నూరు అని అంటున్నావు . ఇన్ని వైరస్ లు ఎన్ని మ్యుటేట్ లు అవుతాయో . ఎప్పుడో 20 దాటినా తరువాత సోకే వైరస్ లకు ఇప్పటినుంచే వాక్సిన్ వేసేస్తే .. అది కొత్తగా వచ్చే మ్యుటేషన్ల లకు ఉపయోగపడుతుందా ? ఇది చెప్పు .. ఈ వాక్సిన్ ల వల్ల పీరియడ్స్ గతి తప్పడం .. గర్భం నిలిచే అవకాశం లేకపోవడం లాంటివి కలుగుతాయి అంటున్నారు " అని అడిగితే ..
... "అబ్బే .. అవన్నీ దుష్ప్రచారాలు . ఈ వాక్సిన్ కూడా కరోనా వాక్సిన్ లాగే మహా సేఫ్ " అంది .
" ఏంటి? మా దేశం లోవేసిన కోవిషిల్డ్ లాగ మహా మహా సేఫ్ అంటున్నావా?" .. అంటే... " అవును" అంది .
అదండీ సంగతి .
కరోనా వాక్సిన్ లాగా ఇది కూడా ను .
అది సేఫ్ అని నమ్మిన వారు ఇది కూడా సేఫ్ అని వేసుకోవచ్చు . సైన్స్ కదా?
ట్రంప్ ప్రభుత్వం M RNA వాక్సిన్ ల కాంటాక్ట్ ఎత్తయడం కూడా సైన్స్ .
మధ్యలో కంచి గరుడ సేవ చేసే నేనే స్టుపిడ్ .. ఇడియట్ . అర్థం అయ్యిందా ? ఫుల్ గా కాకపోతే పోయే .. కనీసం హాఫ్ అయినా అయ్యిందా ?
ఈలోగా లక్ష్మి గారు అనే మహిళా నుంచి మెసెంజర్ లో వాయిస్ మెసేజ్ . ఆమె వాయిస్ బట్టి 50 ప్లస్ అనిపించింది . ఆరు నెలల క్రితం భర్త చనిపోయారు . నేను hpv vaccine వేసుకోనా సార్? అని అడిగింది .
" అమ్మా ! దయచేసి అపార్థం చేసుకోకండి . ఇది వరకే మీ ఒంట్లోకి ఈ వైరస్ ప్రవేశించి ఉంటే ఈ వాక్సిన్ ఉపయోగపడదు అని వాక్సిన్ వారే సెలవిస్తున్నారు . మీ భర్త గారు మరణించారు . ఇంకెందుకు ? ఒక వేళా మీకు మళ్ళీ పెళ్లి లాంటి ఆలోచనలు ఉన్నా ఆ విధంగా మీ బాడీ లోకి కొత్తగా వైరస్ వచ్చి చేరినా అది కాన్సర్ గా మారడానికి పది నుంచి ఇరవై ఏళ్ళు పడుతుంది . ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి " అని వాయిస్ మెసేజ్ ద్వారా రిప్లై ఇచ్చాను .
వాక్సిన్ వేసుకోండి వేసుకోండి అని తెల్ల కోటు వారు పదేపదే చెబుతున్నారు .
డాక్టర్ లు చెప్పారు కదా అని చాల మంది .
విజయవాడ డాక్టర్ రఘురాం గారు .." ఇలా ప్రకటనలో నటించిన వారు .. మోడల్స్ మాత్రమే .. నిజమయిన డాక్టర్ లు కారు" అని వీడియో పెట్టారు .
ఆలోచనల్లో ఉండగానే స్లేట్ ఖర్మన్‌ఘాట్ క్యాంపస్ వచ్చింది .
డ్యూటీ లో పడ్డాను .
ఇదిగో ఇప్పుడు సమయం ఉదయం 6.30 .
గంట లో రెడీ అయ్యి మళ్ళీ ఈ రోజు స్లేట్ ఖర్మన్‌ఘాట్ డ్యూటీ .
ప్రసాద్ గారు .. నా అజ్ఞానాన్ని మన్నించండి బాబయ్య .
13 ఏళ్ళ పిలల్లకు ఈ వాక్సిన్ ఎందుకో ఇప్పటికీ నాకు మట్టి బుర్రకు బోధపడలేదండయ్య . మీకు తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకొండయ్య . మీరు కెలికిన కెలుకుడికి నిన్న ఇంటి నుంచి స్కూల్ వరకు ఈ విషయం పైనే సెర్చ్ చేస్తూ స్టడీ చేస్తే .. సవాలక్ష కొత్త డౌట్స్ అండయ్య . ట్రంప్ ఆలా ఎందుకు చేసాడో.. WHO ఇలా ఎందుకు చెప్పిందో నా చిట్టి బుర్రకు అర్థం కాలేదండయ్య . మీకు తెలిస్తే నేను నెల్లూరు కు వచ్చి మీ దగ్గర ట్యూషన్ లో చేరి నేర్చుకొంటాను . వుంటాను బాబయ్య !
సెర్వికల్ కాన్సర్ గురించి !
నిన్నటి నా పోస్ట్ పై కొండొకచో విమర్శలు .
1 . పురుషులకు ఎక్కువ భౌతిక శక్తి అన్నాడు . ఇది సరైనది కాదు . ప్రసవ సమయంలో మహిళ ఎక్కువ భౌతిక శక్తిని చూపుతుంది .
2 . స్ట్రెస్ ను జయించడానికి మహిళ సామజిక అండను కోరుకుంటుంది అన్నాడు . ఇది కేవలం తన అభిప్రాయం . వాస్తవం కాదు .
నా సమాధానాలు ఇవిగో .
భౌతిక శ్రమ :
1 . ప్రపంచవ్యాపితంగా పురుషుల సరాసరి బోన్ డెన్సిటీ - 1.2 నుంచి 1.4
మహిళలు - 1.0 నుంచి 1.2 .
2 . శరీరంలో మజిల్ మాస్ - పురుషులు - 40-50%
మహిళలు -30-40%
3. సరాసరి ఎత్తు - పురుషులు -5.8 మహిళలు - 5.3
సరాసరి బరువు - పురుషులు -70-75; మహిళలు - 55-60
4. ఒలింపిక్ క్రీడల్లో రికార్డ్స్ - 100 మీటర్ల స్ప్రింట్ - పురుషులు - 9.63 ; స్రీలు - 10.61
200 మీటర్ల స్ప్రింట్ - పురుషులు -19.30 స్త్రీలు - 21.34
400 మీటర్ల స్ప్రింట్ - పురుషులు - 43.03 ; స్త్రీలు - 48.25 .
గర్భధారణ అనేది ప్రత్యేక సామర్థ్యం .
భౌతిక శక్తి పురుషులకు ఎక్కువ అనేది ప్రపంచ వ్యాపితంగా ఫీజికల్ ఆంథ్రోప్లోజిస్టులు , డాక్టర్ లు పరిశీలన ద్వారా తేల్చిన అంశం .
ఇది నా అభిప్రాయం కాదు .
స్ట్రెస్‌ను జయించడానికి మహిళ సామాజికఅండను ఎంచుకొంటుంది :
.. ఇది కూడా నా అభిప్రాయం కాదు .
నా పోస్ట్ లో చాలా స్పష్టంగా రాసాను .
అప్పటి దాక ఫైట్ లేదా ఫ్లైట్ థియరీ ఉండేది.
ఇది కేవలం పురుషులను దృష్టిలో ఉంచుకొని చెప్పింది అని .. టేలర్ అనే శాస్త్రవేత్త 2000 సంవత్సరం మహిళ ల పై పరిశోధన చేసి.. టెండ్ ఆర్ బాండ్ థియరీ ని తీసుకొచ్చింది .
మానసిక శాస్త్రవేత్తలు మొదలు అందరూ దీని స్టాండర్డ్ గా పరిగణిస్తారు .
ఇది సైన్స్ .
మహిళల్లో ఆక్సిటోసిన్ హార్మోన్ ఎక్కువ . అందుకే మహిళ ప్రేమ మార్గాన్ని ఎంచుకొంటుంది .
ఆక్సిటోసిన్ హార్మోన్ లెవెల్స్ . పురుషుల్లో 1-3
మహిళల్లో - 2-5
గర్భిణీ స్త్రీలలో - 5-10
పాలిచ్చే తల్లుల్లో - 10-20 .
మాతృత్వంలోనే ఉంది ఆడజన్మకు సార్థకం అనే పాట బాల్యంలో
విన్నప్పుడు నాకు అందులో ఇంత సైన్స్ ఉందని తెలియదు .
1. ఆక్సిటోసిన్ స్ట్రెస్ ను జయించడానికి ఉపయోగ పడుతుంది ,.
2. ఆక్సిటోసిన్ తగ్గితే స్ట్రెస్ పెరుగుతుంది .
3. ఆక్సిటోసిన్ ఎక్కువ ఉంటే సామాజిక బంధాలు బలపడతాయి . 4. తగ్గితే చీటికీ మాటికి గొడవలు .. మూడ్ స్వింగ్స్ .
5. ఆక్సిటోసిన్ తగ్గితే ఇతరులపై నమ్మకం పోతుంది .
6. స్ట్రెస్ ఎక్కువయినపుడు మానసిక కుంగుబాటు , వ్యాకులత, నిద్రపట్టకపోవడం , గుండెజబ్బులు .
ముఖ్య గమనిక - మీరు నా నిన్నటి పోస్ట్ చదివాకే .. ఈ పోస్ట్ ను చదవండి . కేవలం ఈ పోస్ట్ చదివితే విషయం మీకు సంపూర్ణంగా అర్థం కాదు .
ఆడ - మగ సమానం కాదా ?
ఆమె చురుకయిన అమ్మాయి . కష్టపడే తత్త్వం . సివిల్స్ కోచింగ్ తీసుకొంది . ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది . నిజాయితీ, పరిపాలనా దక్షతతో ... కొద్ది కాలంలోనే గొప్ప పేరు సంపాదించింది .
రోజులు ఎప్పుడూ ఒక్కేలా ఉండవు .. కారణాలు ఏమైతేనేమి ఆమె జీవితం లో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి .
స్ట్రెస్ .
ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది .
" కోచింగ్ కు వచ్చినప్పుడు తాను యువతి . ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దమ్మా అంటే వినేది . ఇప్పుడు యాభై కి దగ్గర పడుతోంది . ఏమని చెబుతాము ? బాధ కలుగుతుంది . అందరూ అని కాదు కానీ కొంతమంది మహిళలు స్ట్రెస్ తట్టుకోలేక పర్సనల్ లైఫ్ ను నాశనం చేసుకొంటున్నారు . ఈమె సంగతి కాదు కానీ .. మరో ముగ్గురి సంగతి చెబుతాను . వివిధ సందర్భాల్లో వారి భర్తలు వారిని కోచింగ్ లో చేర్పించారు .కస్టపడ్డారు . ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారిణిలు . ముగ్గురికీ విడాకులు . ఉన్నత ఉద్యోగం సాధించి హ్యాపీగా ఉన్నారా? అంటే "లేదు" అని వారే చెబుతున్నారు . స్ట్రెస్ .. డిప్రెషన్. లక్షల్లో ఒక్కరు సాధించే ఐఏఎస్ ఐపీఎస్ కు ఎంపికయిన వారు కూడా లైఫ్ ను సరిగా ప్లాన్ చేసుకోలేక , మానేజ్ చేసుకోలేక పోతుంటే ఇక... సాధారణ స్త్రీల సంగతి ఏంటి ? కాస్త తెలివి మంచి రూపం ఉంటె సొషల్ మీడియా విపరీతమయిన ఫాలోయింగ్ వచ్చేస్తుంది . ఇదే లైఫ్ అనుకొని ప్రొఫషనల్ .. పర్సనల్ లైఫ్ ను నాశనం చేసుకొంటున్న ఆధునిక మహిళలు ఎంత మందో !! " అంటాడొక మిత్రుడు .
భర్త ఉన్నత స్థానంలో బిజీ గా ఉంటే భార్య ఇంటిని మేనేజ్ చేస్తుంది .
మరి భర్య బిజీ గా ఉంటే భర్త ఆ పని చేస్తాడా ?
తనకంటే... తన భార్య ఉన్నత స్థానంలో ఉంటే భర్త అహం దెబ్బతిని... భార్యకు గడ్డుపరిస్థితులు ఎదురు కాదా ? .. నా అనుమానం .
అతనో ఐఐటీ గ్రాడ్యువేట్ .
భార్య ఐఏఎస్ అయ్యింది .
ఇద్దరు పిలల్లు .
ఆమె కలెక్టర్ గా పని చేస్తున్నప్పడు ఇద్దరూ విడాకులు తీసుకొన్నారు .
" పితృస్వామ్య సమాజంలో మహిళకు విజయం అంత ఈజీ గా దక్కదు . ఏటికి ఎదురీదాలి . అన్ని కష్టాలు పడి ఉన్నత స్థానాన్ని అందుకొన్న ఆమె ఫీలింగ్స్ వేరుగా ఉంటాయి . తాను సాధించిన దాన్ని కాపాడుకోవాలి అనుకొంటుంది . ఎక్కువ ఒత్తడికి గురవుతుంది . ఆ స్ట్రెస్ లో తప్పు మీద తప్పు చేసే అవకాశం . దాని ప్రభావం కుటుంబ జీవనం పై పడుతుంది . ఈ విషయాల పై నేను... రెండు పుస్తకాలు రాసాను . " అన్నాడు మరో మిత్రుడు.
ఈ మాజీ దంపతులు ఇద్దరు నాకు అత్యంత సన్నిహితులు . విడిపోయినా నేను ఇక్కడ వారి జీవితం గురించి ఎక్కువ రాసి వారిని ఇబ్బంది కి గురి చెయ్యడం ఇష్టం లేదు .వారి పేర్లతో కామెంట్స్ పోస్ట్ చెయ్యొద్దు .
అంటే ఏంటి ?
మహిళ... ప్రొఫెషనల్ ప్రెషర్ ను తట్టుకోలేదా ?
ఉద్యోగం చేసే మహిళ తన కాపురాన్ని తానే పాడుచేసుకొంటుందా ?
నా వ్యక్తిగత జీవితం లో ముగ్గురు మహిళలు .
1. అమ్మ : టీచర్ వృత్తికి గృహిణి / తల్లి పోస్ట్ కు 100 శాతం న్యాయం చేసింది .
2. భార్య :బయట వారికి పెద్దగా కనబడదు . స్లేట్ , కాగ్నిబోట్ మొత్తం ఆర్థిక వ్యవహారాలు తన బుజాల పైనే . నాది కేవలం అకడెమిక్స్ . భార్య గా, తల్లిగా 100 మార్కులు .. ఇప్పుడు అమ్మమ్మ గా 120/ 100 .
3 . కూతురు : భర్త హై కోర్ట్ న్యాయవాది . మహా బిజీ . ఇంటి పని వంట పని , ఇద్దరు పిలల్లు . ఇది కాకుండా స్కూల్ పని .
4. నా ప్రొఫషనల్ జీవితం లో వందలాది మహిళలు . స్లేట్ మహిళాశక్తి . అందరూ { బహుశా అతి తక్కువ మంది మినహా } పర్సనల్ లైఫ్ ను ప్రొఫషనల్ లైఫ్ ఇన్ బాగా బాలన్స్ చేస్తున్నవారే .
సరే నా అనుభవం పక్కన పెడుదాము .
ఒక మహిళ ప్రొఫషనల్ లైఫ్ లో బాగా... బిజీ .. అయిపోతే పర్సనల్ లైఫ్ ను మేనేజ్ చేయగలదా ?
ఇదే విషయం ఇంకో మితృడిని అడిగా .
తాను ప్రిన్సిపాల్ కమిషనర్ అఫ్ ఇన్కమ్ టాక్స్ .
"నేను ఎంతో మందిని చూసాను . పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తారు . జస్ట్ నో డౌట్ " అన్నాడు .
1. ఒకాయనేమో “ స్ట్రెస్ తట్టుకోలేరు “ అంటాడు .
2. ఇంకో అయన కనీసం పది ఉదహారణలు ఇచ్చి స్ట్రెస్ వల్ల డిప్రెషన్ తెచ్చుకొని లైఫ్ ను ఎలా పాడు చేసుకున్నారో వివరించాడు .
3. ఇంకో ఆయన “ మహిళలు చక్కగా రెండూ మానేజ్ చేస్తారు “ అంటాడు .
ఎవరి అనుభవాలు వారివి .
ఇంతకీ సైన్స్ ఏమి చెబుతోంది ?
సైకాలజీ , ఆంత్రోపాలజీ కోణంనుంచి అర్థం చేసుకొందాము .
పురుషుడు , స్త్రీ .. ఇరువురి శరీర నిర్మాణం... అది పని చేసే తీరు... వేర్వేరు .
1. స్ట్రెస్ - మానసిక ఒత్తిడి .. కలిగినప్పుడు మనుషులు ఏమి చేస్తారు ?
దాన్ని ఎదిరించి పోరాటం చేస్తారు .
చేయలేము అంటే వదిలేస్తారు .
అంటే ఫైట్ . లేదా ఫ్లైట్ . ( Fight or flight )
ఇది కేవలం పురుషుల్ని దృష్టిలో ఉంచుకొని చెప్పింది అంటారు .. ప్రఖ్యాత మానసిక నిపుణురాలు ప్రొఫసర్ షెల్లీ టేలర్ .
ఆమె మహిళల సైకాలజీ పై లోతుగా అధ్యయనం చేసారు .
స్ట్రెస్ ఎదురయినప్పుడు మహిళ సామజిక తోడ్పాటు ను ఆశిస్తుంది అంటారు షెల్లీ .
పురుషుడు స్ట్రెస్ ను టెస్టరోస్టోన్ , అడ్రినాలిన్ ద్వారా ఎదుర్కొంటే మహిళ ఆక్సిటోసిన్, ఈస్ట్రోజెన్ ద్వారా .
ఆక్సిటోసిన్ ప్రేమ హార్మోన్ .
అంటే మహిళ ప్రేమ ద్వారా తన స్ట్రెస్ ను ఎదుర్కొంటుంది .
తల్లి -తండ్రి , భర్త , కొడుకు- కూతురు , కనీసం ఫ్రెండ్ .
వీరిలో కనీసం ఒకరి మానసిక అండను ఆశిస్తుంది స్త్రీ .
పురుషుడు కూడా మరో వ్యక్తి అండలేకుండా బతకలేడు . నిజమే .
కానీ ఈ విషయం లో స్త్రీ పురుషుడి కంటే ఎక్కువ అండను, ప్రేమ ను , మానసిక నిబ్బరతను కోరుకొంటుంది . "నీకు నేనున్నాను" అని మనో నిబ్బరం ఇచ్చే కనీసం ఇంకో స్నేహితురాలు లేక పొతే మహిళ తట్టుకోలేదు .
ఒంటరి జీవితం... మహిళకు ఎక్కువ ఇక్కట్లు తెస్తుంది.
2. స్ట్రెస్ కలిగినప్పుడు శరీరంలో కార్టిజాల్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది . కానీ ఇక్కడ కూడా స్త్రీ - పురుషుల మధ్య తేడా ఉంటుంది .
పురుషుల్లో తక్కువ కార్టిజాల్ .
దానికి తోడు... త్వరగా దానినుంచి శరీరం బయటపడుతుంది . ఇది మానవ సూక్ష్మ పరిణామక్రమం లో జరిగింది .
అదే స్త్రీ శరీరంలో ఎక్కువ స్ట్రెస్ హార్మోన్ . దాని నుంచి బయట పడడానికి ఎక్కువ సమయం .
దీని అర్థం .. మహిళ తన స్ట్రెస్ విషయం లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి అని .
3. పురుషుల్లో టెస్టరోస్టోన్ హార్మోన్ . ఇది దూకుడు స్వభావాన్ని కలిగిస్తుంది . మహిళల్లో కూడా ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది . కానీ దాని లెవల్స్ మారుతూ ఉంటాయి .
దీనికి తోడు మహిళల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరోన్ హార్మోన్స్ . ఇవి మూడ్ స్వింగ్స్ కలుగచేస్తాయి .
పురుషుల్లో మూడ్ స్వింగ్స్ ఉండవని కాదు కానీ మహిళల్లో ఎక్కువ ఉండే అవకాశం .
4. మహిళ తన భావోద్వేగాన్ని సులభంగా వ్యక్త పరుస్తుంది .
నవ్వు .. ఏడుపు .. కోపం .. పురుషుడు ఎమోషన్స్ ను అంత బాగా ఎక్ష్ప్రెస్స్ చేయలేడు . చేయడు . ఇది కూడా పురుషాదిక్య సమాజ ప్రభావం . బాధ గుండెలో గూడు కట్టుకొంటే .. గుండెపోట్లు మెదడుపోట్లు పక్షవాతాలు . ఇప్పుడు అర్తంమయిందా హార్ట్ అటాక్స్ పక్షవాతాలు పురుషుల్లో ఎందుకు ఎక్కువో ?
"నాకు కష్టం లేదా ? బాధను తట్టుకొంటున్నాను .. నువ్వు చీటికిమాటికి ఏడుస్తావు ... ముక్కు చీదుతావు ఏంటి ?" అని మీ ఇంటి మహిళ పై కోపపడొద్దు .
5. నిద్రలేమి . ఎవరికైనా అనారోగ్యాన్ని కలుగచేస్తుంది . ఇది మహిళల్లో మరింత ఎక్కువ . భర్త చనిపోయిన బాధలో నాలుగు రోజులు నిద్రపోక ప్రాణం మీదకు తెచ్చుకొన్న మహిళలు ఎందరో !
5. పురుషుడికి భౌతిక బలం ఎక్కువ . స్త్రీకి బాధను తట్టుకొనే శక్తి ఎక్కువ .
పైవన్నీ శారీరిక ధర్మాలు .
ఇవి కాకుండా సమాజం తీసుకొని వచ్చే ఒత్తిడి .
ఉన్నత స్థానం లో ఉన్న భర్త అర్ధ రాత్రి అపరాత్రి ఇంటికి వచ్చినా నడుస్తుంది .
అమ్మ ఇంటికి లేటుగా వస్తే పిల్లలు తట్టుకోలేరు . పిల్లలు తట్టుకొన్నా "అయ్యో! నా పిలల్లు తిన్నారో నిద్రపొయ్యారో !అని ఆమె తట్టుకోలేదు .
పురుషుడి కన్నా ఎక్కువగా స్త్రీ ప్రేమ ను కోరుకుంటుంది .
అదే అమ్మతనానికి మూలం . మానవ జాతిని నిలబెట్టింది ఆ ప్రేమ స్వరూపమే !
పురుషుడికన్నాస్త్రీ అండను కోరుకుంటుంది . ఓదార్పు ను కోరుకొంటుంది .
అది ఆమె బలం .
అదే సమాజానికి పునాది .
మానవత్వానికి ఒడి .
అందుకే ఆమె అబల కాదు సబల !
పురుషుడు .. స్త్రీ . పరస్పర వైరుధ్యం లేదు .
అర్ధనారీశ్వర తత్త్వం .
సగం -సగం దేహం .
ఒకరు గెలిస్తే ఇంకొకరు గెలిచినట్టే .
ఒకరు ఓడితే మొత్తం సమాజం ఓడినట్టే .
సమాజం లో మార్పు రావాలి .
పురుషుడ్ని స్త్రీ అర్థం చేసుకోవాలి .
ఇంతకు మించి పురుషుడు స్త్రీని అర్థం చేసుకోవాలి . గౌరవించాలి .
డిజిటల్ యుగం లో ప్రబలుతున్న స్త్రీ ద్వేషం .. పురుష ద్వేషం నశించాలి
మన శంకరవరప్రసాద్ గారితో
మీ వాసిరెడ్డి అమర్నాథ్ !
( నేను సుమారుగా ఆరునెలల క్రితం తీసుకొన్న ఫోటో ఆధారంగా మా స్కూల్ డాన్స్ టీచర్ అనిల్ కుమార్ రూపొందించిన ఫోటో )
మస్క్ మామ మరో మార్క్స్ ??
చరిత్రలో... పది లక్షల సంవత్సరాలు ... వెనక్కు వెళుదాము .
పాత రాతి యుగం !
మనిషి... వేట , ఆహార సేకరణ చేసేవాడు .
పట్టణాలు, గ్రామాలు ఉండేవి కావు .
సంచార జీవనం సాగించే... చిన్న చిన్న జట్లు .
ఒక జట్టులో ... పిల్ల జల్లా ముసలి ముతక కలిపి... నలబై మంది .
నిన్న జరిగిన వేటలో అయిదుగురు యువకులు గాయపడ్డారు . వారు మరో నెల రోజులు వేటకు వెళ్ళలేరు .
ఏడుగురు గర్భిణీ/ పాలిచ్చే స్త్రీలు . వారు కూడా ఆహార సేకరణ చేయలేరు .
నలభై మందిలో తొమ్మిది మంది పురుషులు మాత్రం వేటకు పోగలరు . ఎనిమిది మంది స్రీలు ... కాయలు దుంపలు లాంటి ఆహారాన్ని సేకరించగలరు .
సాయంకాలానికి .. తొమ్మిది ప్లస్ ఎనిమిది అంటే 17 మంది ... ఆహారాన్ని తెచ్చారు .
ఇది ఎవరికి చెందుతుంది ?
సంపాదించింది 17 మంది కాబట్టి ... వారిదే అని మీరు అనుకోవచ్చు .
కానీ ఆరోజుల్లో ఆలా కాదు .
వారి సంపద మొత్తం సమాజానికి చెందుతుంది .
సంపద అంటే ఏంటి ?
మాంసం , కాయగూరలు , దుంపలు పళ్ళు .. ఇవే కదా !
"నేను సంపాదించాను .. దాచుకొంటాను" అంటే ఏమవుతుంది ?
కుళ్ళి కంపుగొడుతుంది .
ఆహారం.. కుళ్ళి పోదా ?
ఆ రోజుల్లో ఏమైనా ఫ్రిజ్ లు ఉన్నాయా ?
వారిది... ఏ రోజు సంపాదించింది.. ఆ రోజు తిని బతికే... జీవనం .
అందుకే వారు "పరస్పరత" ను అలవాటు చేసుకొన్నారు .
అంటే ఏమీ లేదు .
పైన చెప్పిన ఉదాహరణలో 17 మంది సంపాదించి తెచ్చింది ఆ జట్టులోని అందరిదీ .
CHAPTER-2
19 వ శతాబ్దపు మేధావులు కార్ల్ మార్క్స్ , ఫ్రెడరిక్ ఏంగెల్స్ .
వీరు 1848 లో "కమ్యూనిస్ట్ మేనిఫెస్టో "అనే గ్రంధం రాసారు .
ఇందులో పాత రాతి యుగం నాటి స్థితిని "ఆదిమ కమ్యూనిజం" అని పేర్కొన్నారు .
పాత రాతి యుగంలో ఉత్పత్తి సాధనాలు.. ఉమ్మడి ఆస్తి
{ ఆరోజుల్లో ఉత్పత్తి సాధనాలు అంటే కేవలం వేటాడే రాతి గొడ్డలి , విల్లంబులు మొదలయినవి } .
"శక్తి కొద్దీ పని చేయి .. అవసరం మేరకు తీసుకో " అనే సూత్రం .
.
మనం పైన చెప్పుకొన్న ఉదాహరణలో 17 మంది పని చేసారు . వేటకు పోలేని కొంతమందికి బాగా ఆకలిగా ఉంది .. లేదా వారి పొట్ట పెద్దది .. వారు అందరికంటే ఎక్కువ తినివుంటారు .
వ్యక్తిగత ఆస్తులు ఉండేవి కావు .
దీనితో ధనిక బీద అనే సామజిక అసమానతలు ఉండేవి కావు .
కార్ల్ మార్క్స్ ప్రకారం... ఎప్పుడైతే లోహ యుగం మొదలైందో అప్పుడు వ్యవసాయం వచ్చింది .
భూమి ఉత్పత్తి సాధనం అయ్యింది .
ఎవరి చేతిలో ఎక్కువ భూమి ఉంటే వారు ధనికులు అయ్యారు .
అప్పుడే శ్రమ దోపిడీ మొదలయ్యింది ... అంటాడు మార్క్స్ .
వ్యవసాయిక యుగం తరువాత పారిశ్రామిక యుగం .
ఈ యుగంలో ఉత్పత్తి సాధనం యంత్రం .
పరిశ్రమల యజమానులు శ్రామికుల శ్రమను దోచుకొంటారు .
అంటే సమాజం లో దోపిడీ పై బతికే వారు .. దోపిడీకి గురయ్యే వారు . ఇలా సమాజం లో అంతర్వైరుద్యం ఏర్పడుతుంది .. ఇది తిరుగుబాటుకు దారి తీస్తుంది అని సూత్రీకరించాడు మార్క్స్ .
కాయకష్టం మీద బతికే కార్మికులు వ్యవసాయ కూలీలు విప్లవానికి నాయకత్వం వహిస్తారు .
సోషలిస్ట్ సమాజాన్ని స్థాపిస్తారు .
ప్రారంబ దశలో ఇంకా పెట్టుబడిదారుల ప్రభావం ఉంటుంది . కాబట్టి ఆ దశలో శ్రామిక వర్గ నియంతృత్వం ఉండాలి .
కానీ క్రమేపీ సొషలిజం స్థానంలో కమ్యూనిజం వస్తుంది .. అప్పుడు ఆదిమ సమాజాల్లో వున్నట్టే శ్రమ దోపిడీ ఉండదు .
ప్రతి మనిషి తన శక్తి మేర పని చేస్తాడు .
అంటే డాక్టర్ తన పని చేస్తాడు . అలాగే సైంటిస్ట్ .. సోల్జర్ .. వారి వారి అవసరాలకు మేరకు సంపదను వినియోగించుకొంటారు .
.... ఇదీ కమ్యూనిస్ట్ మానిఫెస్టో సారం !
ఇక్కడి దాక చదివారా ?
మీది రైట్ పార్టీ కావొచ్చు .
లెఫ్ట్ పార్టీ కావొచ్చు .
లేదా సెంటర్ పార్టీ కావొచ్చు .
ఈ ఫిలాసఫీ ని మీరు నమ్మొచ్చు .
వ్యతిరేకించవచ్చు .
అది మీ ఇష్టం .
CHAPTER-3
కారల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ను ప్రచురించాక ప్రపంచం గతంలో లా లేదు .
కమ్మూనిస్టు పార్టీ లు వచ్చాయి .
ముందుగా నవంబర్ 1917 లో బోల్షెవిక్ రష్యా లో లెనిన్ నాయకత్వం లో అక్టోబర్ విప్లవం వచ్చింది .
సోసిలిస్ట్ రాజ్యం వచ్చింది .
ప్రారంభంలో శ్రామిక వర్గ నియంతృత్వం అని కదా కార్ల్ మార్క్స్ చెప్పింది .
లెనిన్ 1924 లో మరణించాడు .
లెనిన్ తరువాత నాయకత్వం లో ఇద్దరు .
ఒకడు ట్రాట్స్కి .
ఈయనకు మంచు బాతుల్ని వేటాడడం అంటే మహా సరదా .
ఆ పనికోసం కాకస్ ప్రాంతంలో వెకేషన్ లో ఉంటాడు .
స్టాలిన్ కు మంచి అవకాశం .
పట్టు బిగిస్తాడు .
USSR కు నియంత అవుతాడు .
కరుణానిధి తన కొడుక్కి స్టాలిన్ పేరు ఎందుకు పెట్టాడో ఆలోచించండి ..
రెండో ప్రపంచ యుద్ధం లో పాల్గొన్న నియంతల్లో స్టాలిన్ ఒకడు .
రష్యా తరువాత చైనా .. ఈలోగా ఈస్ట్ జర్మనీ బల్గేరియా లాంటి అనేక తూర్పు యూరోపియన్ దేశాలు .. సోసిలిస్ట్ వ్యవస్థలు వచ్చాయి .
సోషలిజం కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమే .. ఇదే కదా కార్ల్ మార్క్స్ చెప్పింది .
అటుపై కమ్యూనిజం .. మనిషిని మనిషి దోచుకొని ఉన్నత వ్యవస్థ .
ప్రపంచంలో ఎక్కడా కమ్యూనిస్ట్ సమాజం ఏర్పడలేదు .
రష్యా లో తూర్పు యురోపియన్ దేశాల్లో గతం లో ఉన్నది సోషలిజం . చైనాలో ఇప్పుడున్నదానికి ఈ పేరు పెడుతారో నాకైతే తెలియదు . ఉత్తర కొరియా లో ఉన్నది కరుడు కట్టిన నియంతృత్వం .
అవకాశం రావాలే కానీ... ట్రంప్ తాత ... కిమ్ మామ కు తగ్గడు .
అది వేరే టాపిక్ .
CHAPTER-4
ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నట్టు అని మీకు అనుమానం రావొచ్చు .
21 వ శతాబ్దపు కార్ల్ మార్క్స్... మాస్క్ మామ గురించి మీరు తెలుసుకోవాలి .
ఇప్పుడు రోబో యుగం వచ్చింది కదా .
ఎలోన్ మాస్క్ ఇప్పుడు కొత్త సిద్ధాంతం తో ముందుకు వచ్చాడు .
మరో అయిదు పదేళ్లకు డబ్బుకు విలువ ఉండదు .
మనిషి ఏ పని చెయ్యాల్సిన అవసరం ఉండదు .
టైం పాస్ కాకపోతే... ఈవాళ రేపు .. పట్టణం లో రిటైర్ అయ్యి ... రెండు మూడు లక్షలు పెన్షన్ పొందుతున్న కొంతమంది వూరికి వెళ్లి పొలం కొని వ్యవసాయం చేసి .. తృప్తి పొందుతున్నట్టే ... ఎవరైనా కాలక్షేపం కోసం పని చేసుకోవచ్చు కానీ .. మన పనులన్నీ రోబో లు చేస్తాయి .
మన పని... జస్ట్ కూర్చుని కాలుపై కాలేసుకుని తినడమే .
తినడానికి తిండి .. కూర్చోవడానికి సోఫా .. గంటల పాటు కూర్చుంటే ముందుగా కాళ్ళు తిమ్మిరి అటుపై బిపి షుగర్ వస్తే ... ట్రీట్మెంట్ కూడా రోబో లే ... చేస్తాయి . రోబో లే పన్ని పనులు చేస్తాయి
అంత ఫ్రీ .. ఫ్రీ .
డబ్బు అవసరం ఉండదు .
దానికి విలువ ఉండదు .
ప్రతి ఒక్కరికి స్వర్గ సుఖాలు వస్తాయి ..
..... ఇదీ మాస్క్ మామ కొత్త ఫిలాసఫీ .
ఓలమ్మో .. ఓరినాయినో .. వినడానికి భలేభలే గా ఉండేది కదా ?
CHAPTER-5
కార్ల్ మార్క్స్ ను మాస్క్ మామ ను నేను పోల్చడం లేదు .
నక్కకు నాక లోకానికి ఉన్న తేడా !
పోలిక ఒక్కటే .. మార్క్స్ ప్రతిపాదించిన కమ్యూనిస్ట్ సమాజం వాస్తవ రూపం దాల్చలేదు .
"ఇది యుటోపియన్ . అంటే ఆచరణ సాధ్యం కానిది" అని విమర్శకుల వాదన .
"లేదు .. ప్రపంచం లో పెట్టుబడి దారీ దేశాలు కుట్రలు . ఇది ఎప్పటికైనా జరుగుతుంది" అని సమర్థకులు .
వారి చర్చ ముగియకముందే ముందే... మాస్క్ మామ ఇదిగో యూనివర్సల్ హై ఇన్కమ్ .. పని లేని సమాజం... అనే కాన్సెప్ట్ తో వచ్చేసాడు .
ఎవరూ పని చెయ్యకపోతే ఇక దోపిడీ ఎక్కడ ?
అందరికీ విలాసాలు ..
డబ్బుకు విలువే ఉండదు ..
అబ్బా .. ఇది కమ్యూనిజం కు మించి ఉంది కదా ?
అసలు ఈ చర్చ ఎక్కడా లేదు అంటారా ?
ఆగండి .. కొద్దీ రోజులు ఆగండి .. ఎప్పటిలాగే ముందుగా చెప్పడం నాకు అలవాటు .
మార్క్స్ వేరు .
సమాజం.. మానవాళి పై ప్రేమతో అయన ఆలోచనలు సాగాయి .
అది వాస్తవ రూపం దాల్చలేదు .
అది వేరే టాపిక్ .
CHAPTER-5
మస్క్ మామ ఆలా కాదు .
మస్క్ మామ యూనివర్సల్ హై ఇన్కమ్ చెవిలో పువ్వు ఫిలాసఫీ .
గుర్రం ముందు గడ్డి కడితే అది పరిగెత్తుతూ ఉంటుంది .
సరిగ్గా ఇది అదే .
పోస్ట్ లెంగ్త్ ఎక్కువ అయ్యింది .
క్లుప్తంగా చెబుతాను .
రోబో లు నిజం .
కృతిమ మేధ అనేక ఉద్యోగాలను తినేయడం నిజం .
కానీ అన్ని పనులు రోబో లే చెయ్యాలి అంటే ఎంత పెట్టుబడి ?
ప్రతి ఇంట్లో పని చెయ్యడానికి ఒకటో- నాలుగో రోబో లు కావాలి అంటే
ఎంత... అల్యూమియం, స్టీల్, టైటానియం, కాపర్ కావాలి ?
ఎంత పెట్టుబడి పెట్టాలి ?
ఇప్పటికే ప్రపంచం... కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ లోహాల లోటుతో సతమతమవుతోంది .
పుతిన్ తాత యుక్రెయిన్ యుద్ధం .. ట్రంప్ తాత గ్రీన్ ల్యాండ్ ఆక్రమణ ప్లాన్... లోహాల కోసమే .
తమ లాభాల కోసం యుద్ధాలు చేసే వారు .. సంపద సృష్టించి అందరికీ పంచేస్తారు అంటే మేము నమ్మేయాలి .
ఇలాంటి సొల్లు ఏదో చెప్పివుంటావు .. అందుకే ట్రంప్ .. నీ మాజీ మిత్రుడు ... నిన్ను తన్ని తగలేసాడు !
మస్క్ మామా ! .. నీ కంటికి మేము మరీ... ఒక రకంగా కూడా కనబడడం లేదా ?
CHAPTER- 6
విషయం ఏమిటంటే ఇప్పటికే కృతిమ మేధ వల్ల అమెరికా లో 12 లక్షల మందికి ఉద్యోగాలు పోయాయి .
రానున్న రోజుల్లో మరీ దారుణాలు ...
సంపద అసమానతలు పెరుగుతాయి .
సమాజము లో పది శాతం మంది చేతిలో సంపద .. వారికే స్వర్గ సుఖాలు .
మరో తొంబై శాతం మంది నిరుద్యోగంలో .. ప్రభుత్వాలు ఇచ్చే భృతి పై ఆధార పడుతూ ..
జనాల్లో అసంతృప్తి రాకుండా గుర్రం ముందు కట్టిన గడ్డే మస్క్ మామ UHI సిద్ధాంతం .
రాబొయ్యే రోజుల్లో ఈ అంశంపై మరింత పోస్ట్ చేస్తాను .
నా ఫేస్బుక్ ను ఫాలో కండి .
ఆరోగ్యకరమయిన చర్చకు ఆహ్వానం .
కెనడా లో కొన్ని చోట్ల ఉష్ణోగ్రత మైనస్ 50 సి !
దీనివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం !
చూడాలని ఉందా ?
1 . " ప్రియుడితో కలిసి.. భర్తను చంపి ... శవం పక్కనే పోర్న్ ఫిలిమ్స్ చూస్తూ... మూడు గంటలు గడిపిన మహిళ" - వైరల్ అవుతున్న వార్త.
భర్తను చంపిన భార్య ... భార్యను చంపిన భర్త --
ఇలాంటి వార్తలు.... గత మూడు నెలలుగా.. రోజుకు కనీసం రెండు.
మిగతా విషయాలు కాసేపు పక్కన పెడుదాము .
ఇలాంటి వారికి ... తాము పట్టుబడుతాము , అటు పై జీవితం చిప్పకూడు పాలు అనే ఇంగిత జ్ఞానం ఉండదా ?
ఇన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నా ఇలాంటి అఘాయిత్యాలకు ఎందుకు పాల్పడుతున్నారు ?
జవాబు :
అమిగ్డలా అతిగాళ్లు !
మెదడులో అమిగ్డల అనే భాగం ఉంటుంది .
వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు... లేదా తీవ్ర సమస్య ఎదురు కాబోతుంది ... అని తెలిసినప్పుడు అమిగ్డల చర్యకు దిగుతుంది .
. ఇది మానవ జాతి ఆవిర్భావం నుంచి జరుగుతోంది .
కానీ ...
గత కొన్నేళ్లుగా ముబైల్ పరికరాల్ని... తెగ వాడడం వల్ల చాలా మందిలో అమిగ్డల... హైపర్ ఆక్టివ్ అయిపొయింది.
అంటే పని చెయ్యాల్సిన దానికంటే ఎక్కువగా చెయ్యడం .
అమిగ్డల లలో వచ్చిన ఈ మార్పు వల్ల... ప్రతి దానికి ... అతిగా ప్రవర్తించడం జరుగుతోంది .
గోటితో పొయ్యే దానికి గొడ్డలి దాక తెచ్చుకోవడం పరిపాటి గా మారింది .
ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ పిచ్చోళ్ళు !
మెదడులో మరో భాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ .
ప్రతి మనిషికి కోపం ఉద్రేకం సహజం .
ఆవేశం అదుపు తప్పకుండా చూసుకొనేది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ . "క్షణికావేశం తో హత్య చేస్తే ఆ పై బతుకు బస్సు స్టాండ్ అయిపోతుంది .. కాస్త తగ్గు" అని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ చెబుతుంది .
ఇంపల్స్ కంట్రోల్ అంటారు . అంటే ఆ క్షణంలో ఏదనిపిస్తే అది చెయ్యకుండా".. తగ్గు తగ్గు" అని చెప్పేది మెదడులోని ఈ భాగం .
మొబైల్ పరికరాల అతివినియోగం వల్ల ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ బలహీన పడుతోంది .
క్షణికావేశాలు ... ఏది అనిపిస్తే అది చేసెయ్యడం ... ఇంగిత జ్ఞానం చచ్చిపోవడం .. ఇప్పుడు సర్వ సాధారణం అయిపొయింది .
2. పురుషుల్లో స్త్రీ ద్వేషం , మహిళల్లో పురుష ద్వేషం పెరిగిపోతోంది . పెళ్ళొద్దు అంటున్నారు . పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి . కుటుంబాల్లో కలహాలు . సోషల్ మీడియా లో అయితే ప్రతి దానికి రచ్చ రచ్చ . జనాల్లో ఇంత అసహనం ఎందుకు పెరిగిపాయింది ?
జవాబు :
సింగులేట్ పిడివాదులు !
మెదడులో ఆంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనే ఇంకో భాగముంది .
ప్రతి మనిషి తప్పులు చేస్తాడు .
" నువ్వు చేసింది తప్పు .. అవతలి వారితో అనవసరంగా వివాదానికి దిగావు .. వారిని హర్ట్ చేసావు . కాస్త తగ్గు " అని ఇది చెబుతుంది .
భార్యాభర్తల మధ్య కలహాలు లేనిదెప్పుడు ?
సన్నిహితుల మధ్య బేధాభిప్రాయాలు రానిదెప్పుడు ? కానీ కాసేపట్లో ...కనీసం వారం రోజుల్లో ఇలాంటి వివాదాలు సర్దుకొనేవి .
ముబైల్ పరికరాల అతి వినియోగం వల్ల ఆంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అతిగా ప్రవర్తిస్తోంది .
పిడివాదం ... "నేను చెప్పిందే కరెక్ట్ .. చచ్చినా రాజీ పడను" అనే మొండి ధోరణి సర్వ సాధారణం అయిపోతోంది .
మొబైల్ పరికరాల అతి వినియోగం వల్ల మెదడులోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్, ఇన్సుల, టెంపోరల్ లోబ్స్... లాంటి భాగాల్లో గ్రే మేటర్ తగ్గిపోయి... ఆవేశం ఆక్రోశం హింసధోరణి సర్వ సాధారణం అయిపోతోంది .
3. మనుషుల్లో సంతృప్తి అనేదే లేకుండా పోతోంది . ప్రతి దానికి అవతలి వారితో పోల్చుకోవడం .. నిరాశ నిస్పృహ కనిపిస్తోంది . ఏది చేసినా అతి . ఉదాహరణకు పండగలు . గతం లో కొందరు పండక్కు ఒకటో రెండు పెగ్గులు తాగే వారు. ఇప్పుడు బాటిళ్లు ఖాళీ చేస్తున్నారు .
ఒకప్పుడు వారానికి ఒక చిత్ర లహరి వస్తే తెగ ఆనందపడేవారు . వారానికి ఒక సినిమా .
ఇప్పుడు తెలుగులోనే పది దాక సినిమా ఛానళ్ళు . అయినా తృప్తి లేదు . ఒటిటి లు.. అయినా తనివి తీరలేదు . ఎందుకు ?
జవాబు:
డోపమైన్ అతిగాళ్లు !
మనసుకు నచ్చింది చేస్తే డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది .
హ్యాపీ ఫీలింగ్ దీని ద్వారానే వస్తుంది .
ఒకప్పుడు సాయంకాలం కాసేపు టీవీ .
అటు పై రోజంతా వచ్చే టీవీ కార్యక్రమాలు .
ఇప్పుడు జనాల చేతుల్లో మొబైల్ . రీల్స్ .. షార్ట్ ఫిలిమ్స్ .. సోషల్ మీడియా పోస్ట్‌లు .. వీటిని చూస్తే డోపమైన్ కిక్కు .
కానీ ఇక్కడుంది ఒక చిక్కు .
మెదడులో డి- 2 రిసెప్టార్స్ అనేవి ఉంటాయి . అదేపనిగా డోపమైన్ కిక్కుకు అలవాటు పడితే అవి డోపామైన్ ఉత్పత్తి చేయలేక చతికిల పడుతాయి .
దీనితో కిక్కు తగ్గుతుంది .
అప్పుడు మనిషి మొబైల్ కు మరింత అతుక్కొని పోతాడు .
కొంత మంది తాగుబోతులు పరగడుపునే తాగుతారు .
మొబైల్ వ్యసన పరులు కూడా ఇదే విధంగా రాత్రి పగలు బానిసలు అయిపోతారు .
పెరుగుట విరుగుట కొరకే అని సామెత .
మొబైల్ వినియోగం పెరగడమే కానీ విరుగుట ఉండదు . ఆ కట్టె కాలిపోయాకే అది విరుగుతుంది .
మెంటల్ డిజార్డర్స్ .. హత్యలు... ఆత్మ హత్యలు ఇవి సాధారణం అయిపోతాయి .
4. మొబైల్ అతి వినియోగం వల్ల సైకో లు పెరుగుతున్నారా ?
జవాబు :
సైకో లోకం !
అసలు సైకోలు అంటే ఎవరు ?
ఒకప్పుడు మానసిక చికిత్సలయాల్లో కనిపించేవారు .
ఇప్పుడు మన చుట్టూరా .
పది మందిలో ఎనిమిది మంది ఇదే స్థితిలో . ఒకరిలో ఎక్కువ .. ఇంకొకరిల తక్కువ . తేడా అంతే !
" మగాళ్లు కేటుగాళ్లు . అమ్మాయిలు పెళ్లి చేసుకోకూడదు " అని వాదిస్తుంది 60 ఏళ్ళ మహిళ .
ఒక మహిళ పెట్టిన పోస్ట్ పై తనకు భేదాభిప్రాయం ఉండొచ్చు . దాన్ని వ్యక్తం చెయ్యొచ్చు . కానీ రిటైర్ అయినా ఒక మగాడు ఆ పోస్ట్ పై బండబూతులు కురిపిస్తాడు .
వయస్సు మీదబడిన వారిలోనే ఈ స్థితి ఉంటే ఇక మిగతా వారి సంగతి ??
మందు పార్టీలలో మగాళ్లు ..
కిట్టి పార్టీలలో మహిళలు ..
రేవ్ పార్టీలలో యూత్ ..
నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవడం ..
రేపు లేదన్నట్టు ఎంజాయ్ చెయ్యడం ..
ఇప్పుడిది సర్వసాధారణం .
ఎవడు సైకో కాదో చెప్పడం ఈజీ .. ప్రపంచం సైకో ల మయం .
ట్రాఫిక్ లో చిన్న గొడవ .
దానికే మర్డర్ జరిగిపోవచ్చు .
ఇరుగుపొరుగు వారి మధ్య చిన్న వివాదం .
అది హింసకు మర్డర్లు కు దారి తీయొచ్చు .
5. మరి ఇలాంటి వారు కౌన్సిలింగ్ కు లొంగుతారా ?
జవాబు :
రగులుతోంది ...
కరీంనగర్ జంట .
వారిని పోలీస్ లు అరెస్ట్ చేసారు .
కారణం అడల్టరీ కాదు .
దానికి పెద్ద కోర్ట్ ఎప్పుడో పచ్చ జెండా ఊపింది .
యూరోప్ తరహాలో తమ భార్యల్ని అమ్మకానికి పెట్టే " వేడి .../// భార్య " అప్ ల బిజినెస్ త్వరలో .
ముక్కు - మొహం తెలియని కరీంనగర్ జంట లాంటి వారి ని నమ్మొద్దు . మా అప్ లో రిజిస్టర్ చేసుకోండి . పక్కింటి పుల్ల గూరను ఎంజాయ్ చెయ్యండి "అంటూ అతి త్వరలో ప్రకటనలు చూస్తారు.
ఆచారాలు వ్యవహారాలు చచ్చిపోనీ ..
చిన్న లాజిక్ మాట్లాడుకొందాము .
. మోడలింగ్... గ్లామర్ .. ఫాన్స్ ఓన్లీ .. పేరేమి ఉన్నా ... వయసు అందం ఆధారంగా నడిచేవే .
మనిషి సగటు జీవనం ఇప్పుడు ఎనభై ఏళ్ళు .
వయస్సు - అందం ఆధారంగా నడిచే వృత్తి ఎన్నాళ్లు ?
పదేళ్లు ?
15 ఏళ్ళు ?
అటు పై ?
అందాన్ని చూపి అధిక ఆదాయం ఆర్జించే వ్యక్తి .. పురుషుడు కావొచ్చు మహిళ కావొచ్చు .. ఎన్నాళ్ళు ? ఎన్నేళ్లు ?
35- 40 దాటితే బతుకు తెరువు ఎలా ? ఆదాయం తగ్గిపోయి ఏదో క్రైమ్ { డ్రగ్స్ , ఇతరులను పడుపు వృత్తిలోకి దించడం బ్లాక్ మెయిలింగ్} . కరీంనగర్ జంట పట్టుపడింది ఇలాంటి కేసులోనే .
వీరిని కూడా సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ లు.
ఏ గూటి చిలుక ఆ గూడు చేరుతుంది .
నీ అభిప్రాయం ఎక్కడ ప్రతిధ్వనిస్తోందో సోషల్ మీడియా అలాగరిథమ్ నిన్ను అక్కడికి తీసుకొని వెళుతుంది .
అక్కడ అన్నీ ఒక గూటి పక్షులు .
నీ మనసులోని మాటలు అక్కడ కన్పిస్తాయి .
దీంతో నీ.. లో ఆలోచన... అంతర్మధనం ఆగిపోతాయి .
అనసూయ శివాజీ వివాదం .. నెల రోజులయినా ఇంకా సద్దుమణగలేదు .
ఏదైనా తేలిందా ?
అవతలి వారి అభిప్రాయం గురించి ఇవతలి వారిలో కూసింత అయినా సహానుభూతి కలిగిందా ?
కలగదు .
ఎవరికి వారు బిర్ర బిగుసుకుని కూర్చోవడమే .
ఈ వివాదం పాతబడితే... కొత్తగా ఇంకొకటి వస్తుంది .
వివాదాలు .. హెట్ పోస్ట్‌లు .. ద్వేషం .. రావణ కాష్టం !
మరి దీనికి పరిష్కారం ఏంటి ?
2018 లో... అంటే కరోనా కు ముందు రెండేళ్ల నాడే " సెల్ ఫోన్ ను మనం వాడాలి . కానీ అది మనల్ని వాడేస్తోంది . ఇది ప్రళయానికి దారి తీస్తుంది అని చెప్పాను .
" ఓ చిన్న విద్యార్థి .. ఎందుకు రా?... ఈ బుద్ధి " అని పాట తయారు చేశాను .
ఇప్పుడిప్పుడే ప్రపంచం నిద్ర మేలుకొంటోంది .
"పిల్లలకు సోషల్ మీడియా బాన్ చెయ్యాలి "అని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి .
మొబైల్ చేతిలో ఉంటే వారు సోషల్ మీడియా ను వాడకుండా ఎలా వుంటారు? అని వీరికి ఆలోచన రావడం లేదు .
సరే... ఒక చిన్న అడుగు .. ముందుకు .. మంచిదే .
ఉందిలే మంచి కాలం ముందుముందునా !
రెండు దారులు .
1 . డిజిటల్ స్మార్ట్‌నెస్ :
మొబైల్ ను వాడాలి .
అది మనల్ని వాడకుండా చూడాలి .
అంటే ప్రొఫషనల్ పనులకు మొబైల్ వాడాలి .
సోషల్ మీడియా లో మంచి చూడడం కోసం వాడాలి .
ఇలాంటి వారు హ్యాపీగా జీవనం సాగిస్తారు .
చుట్టుపక్కల ఉన్న సైకో లతో జాగ్రత్తగా వ్యవహరించాలి .
కొనేళ్లు తప్పదు .
అటు పై వారుండరు .
సమస్య ఉండదు .
2 . డిజిటల్ మ్యాడ్నెస్ :
మెంటల్ డిసార్డర్స్ , ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ .. హత్యలు .. ఆత్మ హత్యలు .. రొచ్చులు రోగాలు .. ఆసుపత్రి ఖర్చులు .. చివరికి సమాధి . ఇది నిజం . కాస్త అటూయిటూ ..
కొనేళ్లకు .. భావి తరాలు హిస్టరీ పుస్తకాల్లో .. "ఒకప్పుడు ముబైల్ కారణంగా కొన్ని లక్షల మంది సైకోలు గా మరి అర్ధాంతరంగా బక్కెట్టు తన్నేసారు" అని చదువుతారు .
పై వాక్యం చదివి ... భవిషత్తులో పుస్తకాలు వుండవు అని మీకనిపిస్తే మీరు రెండో కేటగిరీ లో ఉన్నట్టే .
మెదడులో పైన పేర్కొన్న మార్పులు ఒక స్థాయి వరకు రివెర్స్ చెయ్యొచ్చు .
ఒక స్థాయి దాటితే మెదడులోని రసాయన మార్పులు శాశ్వతం అయిపోతాయి .
ఇప్పటికైనా మత్తువీడండి !
మొబైల్ ను వినోదం కోసం కాదు ..
విజ్ఞానం కోసం వాడండి .
పిల్లల చేతికి మొబైల్ అసలు వద్దు .
శుభోదయం !
బాలమిత్ర అమృతలూరు, ఏలూరు, తిరువూరు!
మనుషుల్లో పెళ్లి కాని ప్రసాద్ ల గురించి వార్తాకథనం నిన్న షేర్ చేశా !
చూస్తుంటే జంతువులకు కూడా ఈ సమస్య అధికమయినట్టుంది .
ఇదిగో తోడు కోసం బహదూరపు బాటసారిగా మారిన ఒక పులిరాజా కథ !
మనుషులకైతే డేటింగ్ అప్ లు .. ఫాన్స్ ఓన్లీ ఏర్పాట్లు .
మరి జంతువుల సంగతి ?
కృతిమ ఏర్పాటలతో తో సర్దుకోవడానికి అవేమైనా మనుషులా ?
ఓజాంపిక్ పిల్లలొస్తున్నారు జాగ్రత్త !
వినాశ కాలే విపరీత బుద్ధి అని సామెత !
బరువు తగ్గాలంటే తక్కువ కెలొరీ ఆహారం తీసుకోవాలి . ఇది వరకే శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడానికి వ్యాయామం చేయాలి . ఇంతకన్నా మరో దారిలేదు .
హై కెలొరీ జంక్ ఫుడ్ కు అలవాటుపడి శరీరంలో కిలోల కొద్దీ కొవ్వు పెంచుకొన్నవారికి ఇంత ఓపిక ఉండదు .
షార్ట్ కట్స్ కావాలి .
ఏదో ఒక మందు తింటే టక్కున కొవ్వు కరిగిపోయి స్లిమ్ అయిపోవాలి అని వీరు ఆశిస్తుంటారు .
ఇన్నాళ్లు హెర్బల్ పేరుతొ మందులు అమ్ముడుపోయాయి . దాన్ని తిని కిడ్నీ లు నాశనం చేసుకున్నవారు ఎందరో .
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు .
ఇప్పుడు కొత్తగా ఓజాంపిక్ ఇంజెక్షన్స్ .
సేమగలూటిడ్ అనే ఈ మందును తీసుకొంటే పాంక్రియాస్ , కిడ్నీ, గాల్ బబ్లాడర్ కు సంభందించి తీవ్ర సమస్యలు వచ్చే ప్రమాదం అని నేను అనేక పోస్ట్‌లు పెట్టాను .
ఇప్పుడు అదిరి పోయే వార్త .
ఇది వరకే అధిక బరువు , పీసీఓఎస్ లాంటి సమస్యలతో బాధపడుతున్న మహిళల్లో ఓజాంపిక్ తీసుకొన్న కొన్ని నెలల్లో గర్భ ధారణ జరుగుతోందట .
ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం ఎదురు చూస్తూ విసిగిపోయిన దంపతులకు ఇది శుభ వార్త కదా అని ఎవరైనా అనుకోవచ్చు .
కానీ విషయం ఏమిటంటే ఇలా పుట్టే పిల్లల్ని ఓజాంపిక్ బేబీస్ అంటారు .
వీరికి తీవ్ర ఆరోగ్య సమస్యలుండే ప్రమాదం .
ఇప్పటికే ఆటిజం ఏడీహెచ్ది పిల్లల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది .
ఇప్పుడు ఓజాంపిక్ పిలల్లు .
థెరపీ ల పేరుతొ ఇప్పటికే ఆస్తులు దోచేస్తున్నారు .
ఇక పై రోజుల్లో !!
వివాహ కుటుంబ వ్యవస్థలు దెబ్బ తింటే సమాజం నాశనం
అందుకే కొంత మంది పైడ్ ఆర్టిస్ట్ లు పెళ్ళొద్దు కుటుంబం వద్దు అంటున్నారు
మీడియా వీరికి విపరీత ప్రచారం
వివాహ వ్యవస్థ నాశనం అయితేనే వారి డేటింగ్ అప్ లు ఇంకా ఇతరత్రా బిజినెస్ లు నడుస్తాయి
ఇప్పుడు మహిళా అభ్యుదయం పేరుతొ కొంతమంది పురుష ద్వేషాన్ని ప్రబలేలా చేస్తున్నారు . మరో పక్క మహిళల పై బూతులు మాట్లాడే పురుషాధిక్య సంస్కృతి ఎలాగూ ఉంది . సోషల్ మీడియా కారణంగా అది అదుపు తప్పుతోంది
ఓటిటి సీరియల్స్ ద్వారా గృహిణుల్లో వివాహేతర సంబంధాలను రెచ్చగొట్టారు . "భర్తను హత్య చేసిన భార్య" అని ఇప్పుడు ప్రతి రోజు న్యూస్ . మరో పక్క మహిళల పై అత్యాచారాలు
చైనా అగ్ర రాజ్యంగా రూపొందింది .
జనాభా సంక్షోభం వల్ల దాని ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపొయ్యే అవకాశం .
అనేక యూరోప్ దేశాలు కొన్ని ఆసియా దేశాలు ఇప్పటికే సంక్షోభంలో .
ఇంతమందికి పెళ్లి కాకుండా పొతే అది సామజిక సంక్షోభం కాదా ?
ఎవ్వరూ మాట్లాడరేమి ?
నిజామాబాదు, అనంతపూర్ కర్నూల్ లో బాలమిత్ర కావాలా ?
నిర్మల్ లో ఒక స్కూల్ వారు బాలమిత్ర కోసం రిక్వెస్ట్ చేశారు .
నిర్మల్ కు హైదరాబాద్ నుంచి అయిదు గంటల పయనం !
అంత దూరం వెళ్ళినప్పుడు నిజామాబాద్ కామారెడ్డి లాంటి చోట్ల కూడా క్లాస్ తీసుకోవచ్చు !
అదే విధంగా ధర్మవరం కు ఏడు గంటలు .
కర్నూలు లో కానీ అనంతపూర్ లో కానీ బస చెయ్యాలి !
అనంతపూర్, కర్నూల్ Nizamabad కామారెడ్డి లలో మీకు స్కూల్ ఉంటే … బాలమిత్ర నిర్వహించాలి అనుకొంటే వెంటనే సంప్రదించండి ;
మీకు ఎలాంటి ఖర్చు ఉండదు !
మైక్ మాత్రం ఆరెంజ్ చేసుకోవాలి !
+91 7680-887951
సంక్రాంతి సంబరాలు ముగిసాయి !
1. మెజారిటీ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో బంధువులతో గడిపారు . వారి వారి బడ్జెట్ .. అభిరుచి బట్టి .. గ్రామం లో లేదా ఏదైనా టూరిస్ట్ ప్లేస్ లో .
2. కొంతమంది మాత్రం కోడి పందాల్లో .. సోషల్ మీడియా లో కులం ప్రాంతం లింగం పేరుతొ దూషణల్లో !
ఒకటో కేటగిరీ వారిలో ఇప్పుడు ఎంత హ్యాపీ హార్మోన్స్ వచ్చాయి ..
రెండో కేటగిరీ వారిలో ఎంత కార్తిజాల్ హార్మోన్ వచ్చింది ..
టెస్ట్ చేస్తే సమాజానికి కనువిప్పు కలుగుతుంది .
1 . నలుగురితో పోలిక . ఆత్మ న్యూనతా భావం . విలాసాలకు అలవాటు పడిపోవడం . స్తోమతకు మించి ఖర్చులు . ఈజీ మనీ కోసం పాకులాట .
2 . ఈజీ మనీ కోసం వలపు వల విసరడం . ఒక్కసారైనా మొఖాన్ని అద్దంలో చూసుకోకుండా ఎవరో తెలియని ఒక మహిళ సోషల్ మీడియా లో "హాయ్" అనగానే తాను మన్మధుడు అని భావించి వలపు వలకు చిక్కి ఇల్లు ఒళ్ళు గుల్లచేసుకోవడం .
3 . ఓటీపీ సినిమాలు నెట్ పై నీలి చిత్రాలు చూడడం
4 . సోషల్ మిడియా లో కావాలనే వివాదం సృష్టించేలా పోస్ట్ లు పెట్టడం .. ఆ వివాదం లో చిక్కి పరస్పర దూషణలు .. బూతులు ... ప్రతి దానిలో నెగటివ్ వెదకడం
5 . అతిగా తాగడం .. అది కిక్ ఇవ్వకపోవడంతో గంజాయి మొదలు రకరకాల డ్రగ్స్ వైపుకు మళ్లడం .
6. మొగమాటానికి పోయి అప్పులు ఇవ్వడం ..షూరిటీ ఇవ్వడం అపాత్ర దానం ..డబ్బులు రెట్టింపు కావాలని బోగస్ స్కీమ్స్ ను నమ్మడం .. శక్తికి మించి అప్పులు చెయ్యడం .. పొదుపు లేకపోవడం
7 . చీటికిమాటికి దియాగ్నస్టిక్ టెస్ట్ లు చేసుకోవడం .. అయినదానికీ కానిదానికి మందులు ..సర్జరీ లు. ఫార్మాసురుల వలలో చిక్కడం .. మెడికల్ ఇన్సురెన్స్ వుందికదా అని ఒంటిని మందుల డంపింగ్ యార్డ్ గా మార్చడం
8. ఎవరేమి చెప్పినా గుడ్డిగా నమ్మేయడం .. మంచిమాటలు కూడా నమ్మకపోవడం .
9 . సంచలన వార్తలకు అలవాటు పడడం , జస్ట్ హెడ్ లైన్స్ చదవడం .. అవగాహన కలిగించేవి ఏవో తప్పుదారి పట్టించేవి ఏవో తెలుసుకోలేక పోవడం .. చదివే ఓపిక లేకపోవడం .. ఆలోచించే తత్వాన్ని కోల్పోవడం .
10 . అన్ని రకాల సమస్యలకు మూల కారణం అయిన మొబైల్ పరికరాలకు బానిస కావడం ..
ఈ పదింటిలో కనీసం మూడు విషయాలు ఎవరికైతే వర్తిస్తాయో వారి బతుకుల్లో సమ్ కాంతి కూడా ఉండదు .
మరో రెండు మూడు సంక్రాంతి పండుగల కెల్లా వీరి బతుకులు చీకటి మయం అయిపోతాయి.
దేవుడు కూడా వారిని రక్షించలేడు .
చేసుకొన్న వారికి చేసుకున్నంత .
నాన్నా ! డిజిటల్ యుగం లో ట్రెండ్ ఫాలో అయ్యే గొర్రెగా మారకు . సైబర్ స్మార్ట్‌నెస్ అలవరుచుకో .
ఆగండి .
ఆలోచించండి ..
స్మార్ట్ లైఫ్ స్టైల్ అలవరుచుకోండి
డిజిటల్ ప్రపంచం !
ఇతరులతో పోలిక !
గొప్పగా బతకాలి !
విలాసాలకు బానిసలు !
ఈజీ మనీ కావాలి !
కరీంనగర్ జంట విషయం లో భార్యాభర్త ఉమ్మడి ప్రణాళిక .
ఇప్పుడు ఇద్దరూ జైల్లో !
ఇక్కడ భార్య ఆ దారిలో .
ఆమె హతం !
భర్త జైల్లో !!
సంతోషంగా బతకాలి అనుకొంటే .. అందుకోసం కష్టపడితే … అది హై వే ! లైఫ్ హ్యాపీ !
గొప్పగా బతకాలి .. అందుకోసం అడ్డదారి ఓకే అనుకొంటే లైఫ్ ట్రాజెడీ !
స్లెట్ , కాగ్నిబోట్ బడుల్లో మేము రెండు రకాల హోంవర్క్ ఇస్తాము
ఒకటి RRP : రీడ్ - అంటే జరగబోయే పాఠాన్ని ముందుగానే చదవడం ; Revise; జరిగిన పాఠం పునశ్చరణ ; practice అంటే గణితం మొదలైనవాటిని ప్రాక్టీస్ చేయడం
రెండు - రియల్ హోంవర్క్ . ఇంటి పనుల్లో పేరెంట్స్ కు సాయం చేయడం !
దీని వల్ల ..
1 క్రమశిక్షణ అలవడుతుంది
2 పేరెంట్స్ పై సహానుభూతి కలుగుతుంది
3 టైం management స్కిల్స్ , లైఫ్ స్కిల్స్ అలవడతాయి
4 శ్రమ చేసేవారి పై గొరవం ఏర్పడుతుంది
5 బోర్ కొట్టదు ; పాజిటివ్ గా టైం పాస్
6 ఆత్మవిశ్వాసం కలుగుతుంది
7 టీమ్ స్పిరిట్ నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి
వివిధ రకాల ఇంటిపనులు చేయడం లో పిల్లలకు బడిలో శిక్షణ ఇస్తాము ! చేసిన వారిని అభినందిస్తాము
ఇదిగో స్లేట్ తిరుపతి పిల్లల సంక్రాంతి రియల్ హోమ్ వర్క్
ఇన్ని పాట్లు అవసరమా ? మెడికల్ కాలేజీ లు రెండు కోట్ల తీసుకొని ఎంబీబీస్ డీగ్రీ సర్టిఫికెట్ అయిదు కోట్లు తీసుకొని ఎండీ సర్టిఫికెట్ ఇచ్చేయొచ్చు అని చట్టం చేసేయండి !
College ల కు డబ్బు … మీకు కమీషన్ వచ్చేస్తుంది !
చచ్చే జనాలు ఎలాగూ చస్తారు !
శంకర్ దాదా ఎండీ జిందాబాద్ !
నిరామయ రిసార్ట్. కుమరకోమ్. కేరళ.
అబ్బే ! కరోనా వాక్ సీన్ కారణం కాదు
అబ్బే ! కరోనా వాక్ సీన్ కారణం కాదు అసలు కారణమే లేకుండా చనిపోతున్నారు అని ఘనత వహించిన ఢిల్లీ మెడికల్ కాలేజి వారు తేల్చేసారు !
మెడికల్ మా , ఫియా వారికే అంతు చిక్కని మరణం అంటే అది ఖచ్చితంగా చిల్లంగి బాణామతి చేతబడి అయివుండాలి !
రెండో ప్రపంచ యుద్ధం ముగిసాక { 1945 } ప్రపంచం నెమ్మదిగా కుదుట పడింది .
రెండో ప్రపంచ యుద్ధం ముగిసాక { 1945 } ప్రపంచం నెమ్మదిగా కుదుట పడింది . 1950 నుంచి అనేక దేశాల్లో సుస్థిరాభివృధి సాధ్యమైంది . అనేక దేశాలు వలస పాలన నుంచి విముక్తి పొందాయి సంక్షేమ రాజ్యాలు ఏర్పాటయ్యాయి . హరిత విప్లవం, పాల వెల్లువ లాంటి వి సామాన్య ప్రజలకు ఆర్థిక పరిపుష్టి కలిగించాయి .
కొత్తగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు వెలిసాయి . యువతకు పెద్ద పెట్టున ఉపాధి లభించింది . ఈ పరిస్థితి 1991 దాక సాగింది .
సోవియెట్ యూనియన్ పతనం తో విశ్వజనీకరణ యుగం మొదలయ్యింది . సాఫ్ట్వేర్ తో సహా అనేక బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాల వెల్లువ .. గతానికంటే ఎంతో మెరుగైన జీతాలు .. ఉపాధి కోసం యువత ఆవలి తీరాలకు పోవడం అక్కడ మెరుగైన జీవన ప్రమాణాలను సాధించడం , సంపదను పోగెయ్యడం జరిగింది . అదే సమయంలో తీవ్రమయిన ఆర్థిక అసమానతలు వెలిసాయి .
1. 1950-1991 - ఇదొక యుగం - ప్రభుత్వ రంగం , ఆర్థిక అసమానతల తగ్గింపు పై దృష్టి .. సంక్షేమ పాలన .
2. 1991-2020 - ఇదొక యుగం - గ్లోబల్ ప్రపంచం , సంపద వెల్లువ , అదే సమయం లో ఆర్థిక సమానతలు .. సంక్షేమ పాలన సాగింది... కానీ ఇది కేవలం ఓట్ బ్యాంకు ఆధారితంగా .. ఐసీయూ లో వున్నవారికి స్టెరాయిడ్ ఇచ్చినట్టు తయారయ్యింది .
3 . కరోనా తరువాతి యుగం - నేరపూరిత సమాజం వైపు పయనం .
ఈ పోస్ట్ ... కరోనా తరువాత నేటి ప్రపంచం నెమ్మదిగా .. కొండొకచో వడివడిగా నేరపూరిత సమాజంగా ఎలా మారుతోంది , దీని పరిణామాలు ఎలా ఉంటాయి ? మనం ఏమి చేయాలి? అనే దాని పై .
సమగ్ర అవగాహన కావాలంటే పోస్ట్ లెంగ్ పెద్దది కాకతప్పదు .
ఓపిక ఉన్నవారి కోసమే ... మిగతా వారు బై ..
1. దక్షిణ అమెరికా లోని కొలంబియా లో మొత్తం 2,30,000 హెక్టార్లలో కోకా { కొకెయిన్ } పంట సాగవుతోంది . ఇది ఏటా 25 % పెరుగుతోంది .
2. మెక్సికో లో ఇప్పుడు డ్రగ్ మాఫియా రాజ్యం . సినాలోఆ కార్టెల్ చేతిలో సగం మెక్సికో . అక్కడ ఆ డ్రగ్ మాఫియా రాజ్యాంగం నడుస్తుంది . ప్రభుత్వాలు వాటి ముందు మోకరిల్లసిందే .
3. వెనుజువెలా అధక్షుడే పెద్ద డ్రగ్ లార్డ్ . అతన్ని అతని భర్యను అమెరికా సానిక చర్య ద్వారా పట్టుకొంది . అమెరికా ప్రభుత్వం దాని గూఢచారి సంస్థ CIA పెద్ద డాన్ లు అనేది అందరికీ తెలిసిందే .
3 . సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ను ఉద్యోగం పేరుతొ తీసుకొని వెళ్లి బంధించి బెదిరించి ఆన్లైన్ సైబర్ నేరాలు చేయిస్తున్నారు . కంబోడియా- మయన్మార్ - థాయిలాండ్ సరిహద్దులో ఈ ముఠాలు అడ్డుఅదుపు లేకుండా పని చేస్తున్నాయి . కేవలం ఇండియా నుంచే కాకుండా చైనా హొంగ్ కాంగ్ లాంటి దేశాలనుంచి కూడా కిడ్నాప్ లు జరుగుతున్నాయి .
4 . మయన్మార్ లో సైన్యం లో బాల సైనికులు . పదేళ్ల లోపు పిల్లలను కూడా బలవంతంగా తీసుకొని వెళ్లి సైన్యం లో వెట్టి చేయిస్తున్నారు .
5 . మహిళలను పిల్లలను కిడ్నప్ చేసి లైంగిక బానిసలుగా మార్చడం అనేక చోట్ల జరుగుతోంది .
6. పంజాబ్ లో నేరాలు ఇప్పుడు నిత్యా కృత్యాలు . కిడ్నప్ , వరుస హత్యలు , గ్యాంగ్ ల మధ్య పోరాటాలు అక్కడ నిత్య కృత్యం .
2020- కొరోనానంతర ప్రపంచం లో నేరాలే యువతకు ఉపాధి అవకాశాలుగా మారుతున్నాయి .
కొన్ని చీకటి వృత్తులు ఇవిగో!
1 . డ్రగ్ సరఫరా : గంజాయి , కొకెయిన్ ఎలఎస్డీ లాంటి వాటి సరఫరా పంపిణీ ; కొత్త వారిని ఊబిలోకి లాగడం , ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మత్తు పదార్థాల రవాణా . ఈజీ మనీ కోసం యువత ఈ చీకటి వృత్తిని ఎంచుకొంటున్నారు . అనేక చోట్ల గంజాయి కోకా లాంటి పంటల సాగు . కొన్ని దేశాలు / ప్రాంతాలు వీటి సాగుపై నడుస్తున్నాయి .
2 . సైబర్ నేరాలు ; 2024 లో మన దదేశ ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తం 22,845 కోట్లు . ఇన్వెస్ట్మెంట్ మోసాలు , డిజిటల్ అరెస్ట్ లు , క్రెడిట్ కార్డు మోసాలు సెక్సటార్షన్ .. ఇప్పుడివి ఏటా రెట్టింపు అవుతున్నాయి . ఇప్పుడు వీరు కృతిమ మేధ ను సాయంగా తీసుకొంటున్నారు . జస్ట్ ఫోటో దొరికితే చాలు . ఒక బూతు ఫిలిం ను తయారు చేసి బ్లాక్ మెయిల్ చేసి సంపదను దోచేసే రోజులు ఎంతో దూరం లో లేవు .
3 . చర్మ వ్యాపారం . రీల్స్ యూట్యూబ్ ఫిలిమ్స్ మోడల్స్ గా మొదలయ్యి ఓటిటి , పోర్న్ ఇండస్ట్రీ .. అటు పై హనీ ట్రాపింగ్ , సెక్సటార్షన్ చైల్డ్ ట్రాఫికింగ్ దాక . ఇదో ఉపాధి అని వేలమంది యువతులు నమ్ముతున్న పరిస్థితి . సొంతంగా ఓన్లీ ఫాన్స్ లాంటి వాటి ద్వారా విర్చువల్ బిజినెస్ సాగిస్తున్నవారు కొందరు .. వ్యవస్థీకృత గ్యాంగ్ ల కు చిక్కి జీవితాన్ని నాశనం చేసుకొంటున్నవారు ఎందరో . కేవలం అమ్మాయిలే కాదు .. అబ్బాయిలు కూడా ఈ రంగం లో .
4 . ప్రకృతి సంపద స్మగ్గ్లింగ్ . ఇసుక , ఖనిజ సంపద , ఎఱ్ఱ చందనం , చందనం , ఏనుగు దంతాలు , కస్తూరి జింక ద్రవం , ఖడ్గ మృగం కొమ్ము , పులి గోళ్లు .. ఇలా ఆయా ప్రాంతాల బట్టి . ఈజీ మనీ కోసం స్మగ్లింగ్ ముఠాల్లో గ్యాంగ్ లో చేరుతున్న యువత .
5. కిడ్నాప్ , బ్లాక్ మెయిల్ డబ్బులు వసూలు , ఆన్లైన్ అప్పుల వసూళ్లకోసం దౌర్జన్యాలు , పిల్లల్ని కిడ్నప్ చేసి అవయవ ముఠాలకు బెగ్గింగ్ మాఫియా లకు అమ్మడం , ఫెర్టిలిటీ సెంటర్స్ వద్ద ఆ విక్రేతలుగా ఉపాధి ..{లోకం ఎంత చెడ్డది . సికింద్రాబాద్ లో పట్టుకొన్నారు . మిగతా చోట్ల ? ఇప్పటికీ వందలాది కేంద్రాల్లో ఇదే పరిస్థితి హ్యాపీ గా మరిచి పోయారు . }
6 . మనీ లాండరింగ్ , పెద్దలకు బినామీలుగా మారడం , సుపారీ హత్యలు.
కారణాలు - పరిష్కారాలు .
1 . నిరుద్యోగిత . సొఫ్త్వేర్ స్వర్ణ యుగం ముగిసింది . ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికెషన్స్ రావు . కృతిమ మేధ ఉద్యోగాలను తినేస్తోంది .
కృతిమ మేధ యుగం లో ఉపాధి పొందేందుకు యువతలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలి . విద్య వవస్థలో సమూల మార్పులు రావాలి . బట్టీ చదువులు, దొంగమార్కులు , చూసి రాతల పరీక్షలు... ఆగిపోవాలి .
2. చదవక పోయినా ప్రతి ఒక్కరి చేతికి డిగ్రీ వచ్చేస్తుంది . చేతిలో సెల్ ఫోన్ . అందులో లగ్జరీ లైఫ్ స్టైల్ వీడియో లు. పోలిక . అనుకరణ . కష్టపడకుండా స్వర్గ సుఖాలు అనుభవించాలి . దీని కోసం డబ్బు కావాలి . ఈజీ మనీ కోసం నేరాలు .
3 . పాఠశాల దశలోనే చెడు సావాసాలు .. వ్యసనాలు .. మద్యం- మగువ- మత్తు పానీయాలు .. డబ్బు కావాలి . ముందు పాకెట్ మనీ. .. అటు పై లాప్ టాప్ అమ్మడం .. అటు పై చైన్ స్నాచింగ్ . అటు పై పైనే చెప్పిన ఏదో ఒక బ్లాక్ వృత్తి లో చేరిక . నేటి బాలలే రేపటి నేరగాళ్లు అనే పరిస్థితి .
4 ." రేపు అనేది భ్రమ .. నేడే వాస్తవం .. కాబట్టి ఏమి చేసైనా స్వర్గ సుఖాలు అనుభవించాల్సిందే " అనే ధోరణి . బీద / దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి యువతి అమీర్‌పేట్ హాస్టల్ కొస్తుంది . శిక్షణ తీసుకొని ఉద్యోగం సంపాదిస్తే నెలకు వచ్చే జీతం ఒక్క రోజు బైక్ ఎక్కి ఓయో హోటల్స్ కు వెళితే వస్తుంది అని తెలుసుకుంటుంది . "నా జీవితం .. నా ఇష్టం .. చెప్పడానికి మీరు ఎవ్వరు ?" అనే బ్రెయిన్ వాష్ ఎలాగూ ఉంది . ఆరునెలల్లో సొంత కారు .. బ్యాంకు బాలన్స్ .. ఆమెను చూసి మరో పది మంది . ఈ సంపాదన ఎంత కాలం సాగుతుంది ? గ్లామర్ అడుగంటాక జీవితం ఎలా అనే ఆలోచన రాదు .. రానివ్వరు .
5 . రీల్స్ లో ఓటిటి లలో కామెడీ షో లలో ఇలాంటి వాటిని గొప్పగా చూపిస్తున్నారు . స్మగ్లేర్స్ హీరో లుగా వాంప్ పాత్రలు హీరోయిన్స్ గా . ఇది చదివి మీరు తెలుగు సినిమా గురించి ఆలోచిస్తున్నారా ? పంజాబ్ లో పరిస్థితి మరీ దారుణం . పంజాబ్ ఫోక్ సాంగ్స్ లో డ్రగ్స్ , గన్స్ నేరాలు గూండాలు .. ఎప్పుడు ఇవే . చూసి చూసి స్లో పాయిజన్ లాగ యూత్ కు ఎక్కేసింది . ఇంగిత జ్ఞానం చచ్చింది . మంచి చేప్పేవారు వారు ఎవరు ? చిబితే వారిని చీరి చింతకు కట్టేయరా ??
యువత కు బ్రెయిన్ వాష్ . ఎవరైనా చెబితే.. మోరల్ పోలిసింగ్ చెయ్యడానికి మీరెవ్వరు? అని ఎదురు దాడులు .
6 . యూట్యూబ్ నిండా స్కిన్ షో లు.. బూతులు .. క్రైమ్ వీడియో లు .. చంచల్గూడా చర్ల పల్లి జైలు లో ఈ గోడ నడిగినా చెబుతాయి .. హాత్య ఎలా చెయ్యాలి అనేది యూట్యూబ్ చూసి నేర్చుకొన్న యువ నేరగాళ్లు లక్షల్లో .
7. రాజకీయం
ఒక ఓటుకు అయిదు నుంచి పది లక్షలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు గెలిచిన వాడు తన పెట్టుబడి కి పది రెట్లు సంపాదించాలని ప్రయత్నిస్తాడు . రియల్ ఎస్టేట్ డెవెలప్ చేసి అక్కడ లబ్ది పొందడం .. పాతబడిన పధ్ధతి . అంత ఓపిక వుండదు . టైం దొరకదు . గంజాయి మొదలు ఏది వీలయితే దాని ద్వారా నేరుగా దోచెయ్యడమే . ఒక్కో ఏసీబీ రైడ్ లో చిన్న స్థాయి అధికారి వద్ద కూడ వందల కోట్లు బయట పడుతున్నాయి అంటే అవినీతి ఏ స్తాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు .
పంజాబ్ లో మొత్తం 17 మంది డిజిపి లున్నారు . అకార పుష్టి ... నైవేద్య నష్టి . అక్కడ క్రైమ్ మూడు పూలు ఆరు కాయలు .
తెలంగాణ లో ప్రతి అయిదుగురు కానిస్టేబుళ్లలో ఒకరు బెట్టింగ్ ఊబిలో .. కొంతమంది సైబర్ నేరాల్లో ..
కంచె చేను మేయదా ?
పోలీస్ లు కూడా సమాజం లో భాగం కదా ?
నేరమయ సమాజం లో కొన్ని వ్యవస్థలు పవిత్రంగా ఉండాలంటే కుదురుతుందా ?
ఫాన్స్ ఓన్లీ అప్ చేస్తున్న కొంత మంది టీచర్లు .
హాస్టల్స్ లో కేచకులుగా మారిన కొంతమంది .
కొంతమంది డాక్టర్లు క్రిమినల్స్ గా . ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ముఠాలు .. నేరగాళ్లకు సహకరించే ముఠాలు .. చికిత్స పేరుతొ కోల్డ్ బ్లడ్ మర్డర్ లు .. విద్య , వైద్యం , పోలీస్ వ్యవస్థలకు కూడా పడుతున్న చెదలు .
పరిష్కారాలు అంటారా ?
1 . నెట్ పై దొరికే చెత్తకు దూరంగా వుండడడం . పిల్లల చేతికి మొబైల్ ఇవ్వకపోవడం . పెద్దలు మొబైల్ ను కేవలం ప్రొఫషనల్ అవసరాలకోసం వాడడం .
2 . విద్య వ్యవస్థలో సమూల మార్పులు .
ఏమిటి అంటారా ? అందుకోసమే కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతూ మీ ఊరికొచ్చాను . ఏదో వీడి పబ్లిసిటీ కోసం అని మీరనుకొన్నారు .
వచ్చారు .. బాలమిత్ర క్లాస్ కు వచ్చిన వారు లాభ పడ్డారు .
మీ వూరికి వస్తా . మీ పిల్లలు చదివే స్కూల్ కు వస్తా . పట్టువదలని విక్రమార్కుడిలా ఇంకో సారి వస్తా .
నా భాద్యత నిర్వహిస్తా .
పిల్లలకు బ్రెయిన్ వాష్ చేస్తా .
సొల్లు ఫోన్ మహమ్మారి నుంచి బాల్యాన్ని కాపాడుతా !
నేటి బాలల్ని రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతా !
3. సమాజం లో నైతిక విలువలు పెరగాలి . అడ్డగోలు మార్గాల్లో డబ్బు సంపాదించేవారిని హీరో లుగా చూసే ధోరణి పోవాలి .
మంచి పనులు చేసేవారికి గౌరవం పెరగాలి .
4 . పెద్ద సముద్రం అయినా వాన చినుకు తో నే నిండుతుంది . చీకటి ని తిడుతూ కూర్చోకండి .
మీ వంతు గా చిన్న పని చెయ్యండి .
ఒక విదార్థిని మొబైల్ వ్యసనం నుండి కాపాడండి . మా బడి విద్యార్థులు మొబైల్ వాడరు . పుస్తకాలు చదవడానికి ఇష్టపడుతారు . ఐదో తరగతి విద్యార్ధి విఖ్యాత్ ను తండ్రి కె వి యెన్ రెడ్డి గారు హెయిర్ కటింగ్ సెలూన్ కు తీసుకొని వెళ్లారు .
అక్కడ మరో ముగ్గురు పిలల్లు .
వాళ్ళందరూ మొబైల్స్ లో.
విఖ్యాత్ మాత్రం అక్కడున్న మ్యాగజైన్స్ చదువుతూ .
హ్యాపీ గా ఫీల్ అయిన తండ్రి ఫోటో తీసి పంపారు .
దాన్ని నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను . దీని చూసి మంచి మరింత పెరుగుతుంది అని నా ఉద్దేశం .
ఎక్కడో ముదిగుబ్బ లాంటి చోట్ల ఉన్న బడులకు కూడా నా సొంత ఖర్చులతో వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చినా నాకు ఎలాంటి ఉద్దేశం ఉంటుంది ?
అందరు పిల్లలు బాగుపడాలని . ..
నా పోస్ట్ పై ఒకాయ కామెంట్ .. మీ స్కూల్ పబ్లిసిటీ కోసం అని.
ఇంకో అయన అంటాడు .. "ఆ పిల్లాడికి సెల్ ఫోన్ లేదు .. అందుకే బుక్ చదువుతున్నాడు" అని .
మీరు మంచి .చేయకపోతే పోయే .. . కాలక్షేపం కోసం సోషల్ మీడియా ఎక్కి సమాజం పై ... మంచి చేసేవారి పై రాళ్ళు వేయకండి .
చివరిగా ఒక మాట . సొంత డబ్బా అనుకునేవారు అనుకోని .. నష్టం లేదు .
మొన్న విజవాడ ఎయిర్పోర్ట్ .
ఒక వ్యక్తి పరుగెత్తుకొని వచ్చి.." సార్ ఎలా ఉన్నారు . ఇంత ఫిట్ గా స్లిమ్ గా ఎలా ఉన్నారు . అప్పటికీ ఇప్పటికీ ఏమీ మార్పులేదు" అని పలకరించాడు .వద్దన్నా వినకుండా అక్కడ కాంటీన్ లో కొబ్బరి బిస్కెట్ లు తినిపించాడు .
తాను నా 2003 బ్యాచ్ స్టూడెంట్ . హైదరాబాద్ సిటీ లో డిసిపి . అంటే జిల్లా ఎస్పీ స్థాయి
. సమాజం నేరమయం అయితే అందరూ ప్రభావితులు అవుతారు . ముఖ్యంగా సాధారణ ప్రజలు .
ఎంతో మంది ని ఉన్నత అధికారులుగా తీర్చి దిద్దిన నా పై కంటే మీ పై .. నేరమయ సమాజం ప్రభావం చూపుతుంది .
నా వంతు భాద్యతగా సమాజాన్ని జాగృతం చేస్తున్నా .
మరి మీరు ?
విజయవాడ లో ఏదో స్కూల్ కు సంభందించిన మహిళ కావొచ్చు
విజయవాడ లో ఏదో స్కూల్ కు సంభందించిన మహిళ కావొచ్చు ; వెన్నెల్లో పడుకొని చందమామపై ఉమ్మి వెయ్యడానికి ప్రయత్నించింది . త్రయోదశి క్లబ్ సాంగ్ అట !
యాదృచ్చికంగా ఈ రోజే ఒకటో తరగతి మదర్ ఈ వాయిస్ మెసేజ్ పంపింది
విజయవాడ విద్యా సంస్థలు ఎంత నీచానికి దిగజారుతాయో చెప్పడానికి ఒక ఉదాహరణ !
ఈ రోజు .. ఒక దేశం.
ఈ రోజు .. ఒక దేశం .
వారం తిరిగే లోపు.. ఇంకో దేశం .
లగ్జరీ హోటల్స్ లో బస .
కోరిన తిండి .. ఇంకా ఇతరత్రా !
చేతిలో డబ్బుంది .. అక్కడ అందుబాటులో ఉన్న అమ్మాయిలతో జల్సా !
ఫుల్ సంపాదన .
దీనికి తోడు లక్షలాది మంది ఫాలోవర్లు . పేరు ప్రఖ్యాతులు .
బ్యాంకు లో అయిదు కోట్లు .
ఇలాంటి జీవితాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది ?
"లైఫ్ అంటే ఇలా ఉండాలి.. మనదీ ఒక బతుకేనా ?
ఉద్యోగం / వ్యాపారం .. ఇల్లు ... ఎప్పుడూ గానుగెద్దు బతుకు " అనుకుంటున్నారా ?
కంటికి కనిపించేదంతా నిజం కాదు .
ఇంకో కోణం చూద్దాము రండి !
1 . క్రానిక్ స్ట్రెస్ .
ఉద్యోగం / వ్యాపారం వేరు . వాటిలో కూడా సమస్యలు ఉన్న మాట వాస్తవం .
కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ / యూ ట్యూబర్ ల జీవితాలు వేరు . వీక్షకుల టేస్ట్ నిరంతరం మారుతూ ఉంటాయి . ఎప్పటికప్పుడు న్యూ కంటెంట్ జెనెరేట్ చెయ్యాలి . జనాలకు బోర్ కొట్టకూడదు . ఐడియాస్ అయిపోతాయి . చూసి చూసి జనాలకు మొఖం మొత్తేస్తుంది .
"ఎప్పుడూ ఇదే సోదిరా" అనుకొంటే వ్యూస్ తగ్గిపోతాయి . ఫేడ్ అవుట్ అయిపోవడం ఖాయం . కొత్త వీడియో లు ఎలా తయారు చెయ్యాలా అనేది నిరంతరం స్ట్రెస్ ను కలుగచేస్తుంది.
జీవితానికి గ్యారెంటీ ఉండదు .
ఎవరీ డే స్ట్రెస్ .
ఒక్క మాటలో చెప్పాలంటే పులి పై స్వారీ .
2 .సిరికార్డియం రిధం డిసార్డర్ .
మన దేహానికి ఒక బయలాజికల్ క్లోక్ ఉంటుంది .
వాతావరణం .. టైమింగ్స్ కు బాడీ అలవాటు పడిపోతుంది . ఎప్పుడో ఆరునెలలకు ఒక ట్రావెల్ .. కొత్త ప్రదేశం .. డిఫరెంట్ టైమింగ్స్ .. బాడీ అడ్జస్ట్ అవుతుంది . పైగా రొటీన్ కి బిన్నంగా థ్రిల్లింగ్ గా కూడా ఉంటుంది .
ఆలా కాకుండా సంవత్సరాల తరబడి ట్రావెల్ చేస్తూ ఉంటే ?
ప్రతి వారం జెట్ లాగ్ సమస్య ఎదురైతే ?
కొత్త టైం జోన్ , కొత్త వాతావరణం .. కొత్త సంస్కృతి ..
బాడీ అడ్జస్ట్ కాదు . నిద్ర సరిగా పట్టదు . మూడ్ డిస్టర్బ్ అవుతుంది .
3 .డోపమైన్ హై .
ఎండలో చాల సేపు తిరిగాక నీళ్లు తాగితే దానికి ఎంత రుచో . బాగా ఆకలిగా వున్నప్పుడు అన్నం ఎంత కమ్మగా ఉంటుందో . జీవితం లో వెలుతురు చీకటి .. రాత్రి పగలు .. ఇది ప్రకృతి నియమం .
చేతిలో డబ్బుంది కదా అని ప్రతి రోజూ స్టార్ హోటల్స్ .. లగ్జరీ .. ఫుడ్ .. బెడ్ ..
ఏమవుతుంది ?
దీన్నే సైన్స్ డోపామైన్ హై అంటుంది .
లగ్జరీ సుఖాన్ని ఇవ్వదు .
అందరికీ అర్థం అయ్యేలా చెబుతాను .
బాగున్నాయి కదా అని రోజుకు మూడు చొప్పున ప్రతి రోజూ లడ్లు తింటే ? నెల తిరిగాక లడ్డు వాసన చూస్తేనే వాంతి కమింగ్ !
4 . సామాజిక ఏకాంతవాసం !
ప్రతి మనిషికీ కుటుంబం కావాలి . తల్లితండ్రి .. భార్య / భర్త .. పిలల్లు .. ఏళ్ళ తరబడి కుటుంబానికి దూరంగా ఉంటే ? హోటల్స్ లో ఉన్నా .. అక్కడ డబ్బు ద్వారా దొరికే సావాసాలు ఉన్నా .. ఒంటరి తనం .. స్ట్రెస్ .
క్రానిక్ స్ట్రెస్ .. సిరికార్డియన్ రిధం డిసార్డర్ .. డోపమైన్ హై .. సబ్స్టేన్స్ అబ్యూస్ .. సోషల్ ఐసోలేషన్ .. ఇవన్నీ కలిస్తే ?
బైపోలార్ డిజార్డర్ !
ఇదొక మానసిక వ్యాధి .
దీని లక్షణాలు .
1 . మూడ్ స్వింగ్స్ .
కాసేపు ఉత్సాహం .. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం .. కాసేపట్లో లో ఎనర్జీ .. సాడ్‌నెస్ ..
2 . నోటికి ఏమి వస్తే అది మాట్లాడడం .. ఇంగిత జ్ఞానం మరిచి ప్రవర్తించడం ..
3 . విచక్షణ చచ్చి .. పిచ్చి పిచ్చి ఆలోచనలు .. అవతలి వారిని తిట్టడం .. బూతులు .. శాపనార్థాలు .
4 . వారించే కొద్దీ మరింత రెచ్చిపోయి ప్రవర్తించడం .
ఈ పోస్ట్ లో నేను ఎవరి గురించి చెబుతున్నానో ఇప్పటికే మీకు అర్థం అయిపోయివుంటుంది .
పిచ్చుక పై బ్రహ్మస్రం వేసేవాడిని కాను .
ఒక పక్క మానసిక రోగం ముదిరి .. మరో పక్క కేసుల్లో చిక్కి చిప్పకూడు తింటూ యూట్యూబ్ ఆదాయం నిల్ అయిపోయి జీవితం శిధిలం కాబోతున్న వ్యక్తి పై పోస్ట్ పెట్టి టైం వేస్ట్ చేసుకొనే స్థాయి కాదు నాది .
చేసుకొన్నవాడికి చేసుకున్నంత .
ఒక టీచర్ గా నిజజీవిత ఉదాహరణలు తీసుకొని పాఠాలు చెప్పడం నాకు అలవాటు .
ఈ పోస్ట్ మీ కోసం .
ముఖ్యం గా రీల్స్ .. యూట్యూబర్ .. social మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ .. లాంటి వాటి వైపు ఆకర్షితులు అవుతున్న యువత కోసం .
1 . ఇవి తాటాకు మంటలు . జీవితాంతం నిలిచే కెరీర్ లు కావు . జీవితం లో స్థిరపడ్డాక మీలో క్రియేటివిటీ ఉంటే జస్ట్ ఒక హాబీ గా ఇలాంటివి చెయ్యొచ్చు . అంతే కానీ చదువుకొనే వయసులో ఇలాంటి వాటికోసం అర్రులుచాచితే బతుకు బస్టాండ్ .
2 . పేరుప్రఖ్యాతులు వెన్నెల కాంతులు . ఎస్ ... కాసేపు . ఎంజాయ్ చెయ్యొచ్చు .
కానీ వెన్నెల కాంతిని తినలేము .. తాగలేము .
3. పేరు ప్రఖ్యాతులు రెండు వైపులా పదునున్న కత్తులు . ఒక దశలో మంచి పేరు వచ్చి అటు పై జీవితం నిస్తేజంగా మరి పొతే ? మానసిక కుంగుబాటు వస్తుంది . సిల్క్ స్మిత . ఫటాఫట్ జయలక్ష్మి ... సుశాంత సింగ్ రాథోడ్ .. ప్రత్యూష బెనర్జీ , జియా ఖాన్ .. ఇంకా పదుల కొద్దీ సెలబ్రిటీస్ .. ఎందుకు ఆత్మ హత్య చేసుకొన్నారు ? ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం .. వెలుగు వెలిగి ఇప్పుడు దయనీయ జీవితాన్ని అనుభవిస్తున్న తెలుగు హిందీ తమిళ్ హీరో లు హీరోయిన్ లు ఎంత మంది ?
బతకడం ఒక కళ .
1 పనిని ప్రేమించండి . పనే ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది . హార్డ్ వర్క్ .. అంతకు మించి స్మార్ట్ వర్క్ అవసరం .
2 . కుటుంబాన్ని ప్రేమించండి . కుటుంబ సభ్యులతో బంధువులతో స్నేహితుల తో కాలం గడపండి .
3 . ఇంట్లో వంట . వంట గది మూతబడితే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది . మగ పిల్లలకు కూడా వంట నేర్పించండి .
4 . మొబైల్ సాధనాలను కేవలం ప్రొఫషనల్ అవసరాల కోసం వాడండి .
5 . తమ సొంత లాభం కోసం వివాదాలను సృష్టించే సోషల్ మీడియా జలగల పట్ల జాగ్రత్త . ఆ సుడిగుండం లోకి దూకొద్దు .
గుర్తు పెట్టుకోండి . సోషల్ మీడియా కేటు మనుషులు మైరావణులు . ఒక తలనరికితే పది తలలు పుట్టుకొచ్చి నట్టు .. మీరు తిడుతూ కామెంట్ పెట్టినా అది వారికి మరింత పబ్లిసిటీ తెస్తుంది . సరిగ్గా వారికి కావాల్సింది కూడా ఇదే . అలాంటి కంటెంట్ ను బ్లాక్ చెయ్యండి . హ్యాపీ గా కాలం గడపండి . పాజిటివ్ కంటెంట్ చూడండి . మంచి వినోదాన్ని ఆస్వాదించండి .
6 . రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం . ప్రతి రోజూ బాడీ కి వ్యాయామం అవసరం .
7 . సమస్యల్ని అధిగమించాలి అంటే న్యూరో లింగిస్టిక్ ప్రోగ్రాం చేపట్టండి . చాలా సింపుల్ . మీ లోపాలను ఒక పేపర్ పై రాయండి . దానికి సరిగా వ్యతిరేకంగా మరో పేపర్ పై రాయండి . ఇదే మీ అఫ్ఫార్మేషన్ . దీన్ని రోజూ చదవండి . ఆరునెలల్లో మీరు వూహించనంత మార్పు మీలో ఖాయం .
అఫ్ఫార్మేషన్ లో నెగటివ్ వుండకూడదు . ఉదాహరణకు మీరు స్మోక్ చేస్తారు . స్మోకింగ్ ఆపెయ్యాలి అనుకొంటున్నారు .
నేను స్మోక్ చెయ్యను అని రాయకూడదు .
చెయ్యను అనే పదం కన్నా స్మోకింగ్ అనే పదం మైండ్లోకి త్వరగా వెళ్లి పోతుంది .
కాబట్టి .. ఆరోగ్య కరమయిన అలవాట్లు కలిగి వుంటాను . నా ఊపిరి తిత్తులు బలంగా స్వచంగా ఉంటాయి అని రాసుకోవాలి .
ఇలాగే మొత్తం న్యూరో లింగిస్టిక్ ప్రోగ్రాం .
మహా అంటే పది పాయింట్స్ . రోజుకు రెండు నిముషాలు .
ఈ రోజే మొదలెట్టండి .
మే మొదటి వారానికల్లా మీలో సరోకొత్త వ్యక్తి పరిచయం అవుతారు . లేదంటే పేస్ బుక్ వేదికగా నన్ను దులిపేయ్యండి.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు .
2026 లో.. మీరు ... మీలోని సరి కొత్త వ్యక్తిని.. శక్తిని చూడబోతున్నారు .
సమస్యలొస్తాయి . మనిషికి కాకపోతే కష్టాలు రాళ్లకు రప్పలు వస్తాయా ?
ప్రతి సమస్య ఒక అవకాశం .
ప్రతి ఓటమి చక్కటి పాఠాలు నేర్పే గురువు .
చివరకు అంతా మంచే జరుగుతుంది .
2026 మీకు సుఖసంతోషాలను ఇస్తుంది .
సర్వే జనా సుఖినోభవంతు !
వాసిరెడ్డి అమర్నాథ్ .